July 31, 2013

ఓట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని టీడీపీ నేత
పయ్యావుల కేశవ్ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమైక్యరాష్ట్రం కోసం రాజీనామాలకు వెనుకాడే ప్రసక్తే లేదని పయ్యావుల స్పష్టం చేశారు.

ఓట్ల కోసమే రాష్ట్రాన్ని విడగొట్టారు : పయ్యావుల

చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణ ఆపుతామని మంత్రులు శైలజానాథ్, టీజీ మాట్లాడటం సిగ్గుచేటు అని టీడీపీ నేత
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరు పార్టీలు తెలంగాణకు అంగీకారం తెలిపాయని, కేవలం టీడీపీ వల్లే రాష్ట్ర విభజన జరుగలేదన్నారు.
సీమాంధ్రలో వైసీపీతో కాంగ్రెస్ డ్రామాలు ఆడిస్తోందని, వైసీపీతో విభజన ఉద్యమాన్ని రాజేసి, ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ బిల్లు పెట్టేలోపే రాజధానికయ్యే వ్యయం, సాగునీటి పంపిణీపై స్పష్టత రావాలన్నారు. ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం తమ ఉద్దేశం కాదని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సహా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని గుర్తుచేశారు. కేసీఆర్ పునఃనిర్మాణ వ్యాఖ్యల్లో అర్థం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేయాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ వల్లే రాష్ట్ర విభజన జరుగలేదు : సోమిరెడ్డి

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ హయాంలోనే హైదరాబాద్‌ను చాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నిర్థిష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రేగకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నామన్నారు. కొత్త రాజధాని అభివృద్ధి చేయడానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, కొత్త రాజధానిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర నిధులతో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సూచించారు. సాగునీటి సమస్య ఎలా పరిష్కారిస్తారో చెప్పాలన్నారు. ఉద్యోగాలు, విద్యుత్, వనరుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
కొత్త రాజధాని ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినా ప్రజల మధ్య సమైక్యత ఉండాలని బాబు కోరారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలు బిల్లులో పొందుపర్చాలి. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదని హితవు చేశారు.
అందరికీ న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటామని...కేంద్రం, అన్ని పార్టీలతో మాట్లాడతామని చంద్రబాబు హామీ ఇచారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేనని బాబు చెప్పారు. తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో నిన్న దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. కాంగ్రెస్ మాధిరిగా రాజకీయ లబ్దికోసం ప్రయత్నించడం లేదని చంద్రబాబు తెలియజేశారు.

కొత్త రాజధానిపై కేంద్రం ప్రకటన చేయలేదు : చంద్రబాబు

July 30, 2013

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటిస్తే.. అనుసరించాల్సిన వ్యూహాలపై బాబు నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం నుంచి హస్తినలో జరుగుతున్న పరిణామాలను చాలా క్షుణ్ణంగా గమనిస్తున్న బాబు పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అందుబాటులో ఉన్న నేతలతో బాబు భేటీ !

 ఇప్పటి వరకు నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇటు రాష్ట్రంలోనూ, అటు జిల్లాలోనూ టీడీపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. చిత్తూరులోని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికార కాంగ్రెస్, వైసీపీలు ఓటర్లను మభ్య పెట్టడానికి వేల రూపాయల నగదు, మద్యం పంపిణీ చేసినా ప్రజలు మాత్రం టీడీపీ బలపరచిన అభ్యర్థులనే గెలిపించారన్నారు. అవినీతి మయమైన కాంగ్రెస్, వైసీపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తొలి, మలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 3,759 సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు.
జిల్లాలో 407 సర్పంచ్ స్థానాలు గెలుచుకుని టీడీపీ మొదటి స్థానంలో ఉండగా, 247 స్థానాలతో వైసీపీ రెండవ స్థానంలో, 187 స్థానాలతో కాంగ్రెస్ మూడవ స్థానంలో, స్వతంత్రులు 75మంది విజయం సాధించారన్నారు. 31వ తేదీన నిర్వహించనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ తన హవా కొనసాగిస్తుందన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, పాదయాత్ర ఫలితంగానే నేడు పంచాయతీ ఎన్ని
కల్లో టీడీపీ ఘన విజయం సాధించిందన్నారు. చంద్రబాబు పాదయాత్ర ముగిసిన నెల రోజుల తరువాత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల జగనన్న బాణం పేరుతో మరో ప్రజా ప్రస్థానం అంటూ పాదయాత్ర చేస్తోందని, అసలు షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తోందో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. 2014లో నిర్వహించనున్న ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలుపొంది చంద్రబాబు సీఎం కావడం తథ్యమని వారు జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు దొరబాబు, మహదేవ నాయుడు, నాని, కఠారి మోహన్, వై.వి.రాజేశ్వరి, మోహన్ రాజ్, విల్వనాధం తదితరులు పాల్గొన్నారు.
 

మూడో విడతలోనూ టీడీపీదే హవా

July 29, 2013

 ఒంగోలు గ్రామ సంగ్రామంలో రెండు దశల ఎన్నికలు ముగిశాయి. జిల్లాలోని ఒం గోలు, కందుకూరు రెవెన్యూ డివిజ న్‌ల పరిధిలో 44 మండలాల్లోని 818 పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నిక య్యారు. రెండు దశల్లోనూ సైకిల్ స వారీ చేసింది. వైసీపీకన్నా 62 పంచా యతీలను అధికంగా తన ఖాతాలో వేసుకుని ఆధిపత్యం సాధించింది. రెం డో స్థానంలో వైసీపీ నిలవగా, కాం గ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమి తమైంది. మొత్తం పది అసెంబ్లీ సెగ్మెం ట్‌లలో తొలి, మలిదశ పంచాయతీ పోరు జరగ్గా ఐదు నియోజకవర్గాల్లో తెదేపా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ఆధిక్యతను చాటుకుంది. రెండు చోట్ల కాంగ్రెస్, మరో రెండు సెగ్మెంట్లలో వైసీపీ ముందంజ వేశా యి. ఒక నియోజకవర్గంలో తెదేపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు కన్పించింది. మొత్తం ఫలితాలపై తెదే పా వర్గీయుల్లో ఆనందోత్సాహాలు వ్య క్తమవుతుండగా, వైసీపీ వర్గీయుల్లో కొంత నిరాశ కనిపిస్తున్నది. అయితే అనేక పంచాయితీల్లో ఆయా పార్టీల మద్దతుదారులు ఒక అవగాహనతో పోటీ చేసి గెలుపొందడం, ఏకగ్రీవం గా ఎన్నికవడం వలన స్వతంత్ర అభ్య ర్థులు కన్పిస్తున్న సర్పంచ్‌ల సంఖ్య భారీగానే ఉంది. ఆయా పార్టీల ఆధిక్యంలో వీరు కీలకంగా మారే అవకాశం ఉంది.
జిల్లాలో తొలిదశలో 313, మలి దశలో 475 వెరసి 818 పంచాయ తీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో తొలిదశలో 141, మలిదశలో 163 పంచాయతీల్లో తెదేపా మద్దతుదారు లు గెలుపొందారు. ఆ ప్రకారం ఇప్ప టి వరకూ ఆ పార్టీ మద్దతుదారులు 304 సర్పంచ్ పీఠాలను దక్కించుకు న్నారు. వైసీపీ మద్దతుదారులు తొలి దశలో 100, మలిదశలో 142 వెరసి 242 పంచాయతీలను కైవసం చేసు కున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు తొలిదశలో 66, మలిదశలో 119 కలిపి 185 పంచాయతీల్లో విజయం సాధించారు. మలిదశలో సీపీఎం మద్దతు అభ్యర్థి ఒకరు గెలుపొందారు. తొలిదశలో 36మంది, మలిదశలో 50మంది స్వతంత్రులు గెలుపొందా రు. వీరి విషయంలో ఆయా పార్టీల ఫలితాల్లో వ్యత్యాసం కన్పిస్తున్నది. తొలిదశ ఎన్నికల్లో పర్చూరు, సంత నూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా మద్దతుదా రులు ఆధిక్యతను సాధించుకున్నారు. మలిదశలో దర్శి, కొండపి నియోజక వర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ముందువరసలో నిలిచారు. తద్వారా మొత్తం ఐదు సెగ్మెంట్లలో తెదేపా అధిక్యతను సాధించింది.
కాంగ్రెస్ పార్టీ తొలిదశలో చీరాల లోనూ, మలిదశలో కనిగిరిలో మాత్ర మే ఆధిక్యతను సాధించింది. అద్దంకి, మార్కాపురం నియోజకవర్గాల్లో వైసీ పీ ముందుకు దూసుకెళ్లింది. అద్దం కిలో తమ పార్టీ మద్దతుదారులు అధి క స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెదేపా సీనియర్ నాయకుడు కరణం బలరాం ప్రకటించారు. కాగా కందు కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. శనివారం పోలింగ్ జరగ్గా ఆదివారం కొంత మంది స్వతంత్రులు వారి అభిప్రాయా లను వెల్లడించారు.
తదనంతరం పరి స్థితిని పరిశీలిస్తే మొత్తం 91పంచాయ తీల్లో 34చోట్ల కాంగ్రెస్, 33చోట్ల తెదే పా, 16చోట్ల వైసీపీ మద్దతుదారులు, 8 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. దీంతో స్వతంత్ర అభ్యర్ధుల వైఖరిలో మార్పు ఉంటుందా? లేక ప్రస్తుతం ఉన్నట్లే స్వతంత్రంగా ఉంటారా? అనే విష యం తేలాల్సి ఉంది. తెదేపా అధిక పంచాయతీలు దక్కిన నియోజ కవర్గాల విషయాన్ని పరిశీలిస్తే పర్చూ రులో ప్రత్యర్ధి పక్షాలకు పెట్టని కోటలు గా ఉన్న పంచాయతీలను సైతం గెలు చుకోవడం విశేషం. ఇందుకు యద్దన పూడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే డెయిరీ మాజీ చైర్మన్ చెంగల య్య ఆధిపత్యానికి ఇప్పటి వరకూ తిరుగులేని కోనంకిలో తెదేపా మద్దతు దారులు విజయం సాధించారు. అదే తరహాలో స్వర్ణ పంచాయతీని తెదేపా దక్కించుకోవడం ప్రాధాన్యతను సం తరించుకుంది. మండల కేంద్రాల్లో మార్టూరు, ఇంకొల్లు, కారంచేడు పం చాయతీలు కూడా తెదేపా దక్కడం విశేషం. సంతనూతలపాడు నియోజక వర్గంలో కూడా తెదేపా గణనీయమైన సంఖ్యలో పంచాయతీలను రాబట్టుకో గలిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో పలు పంచాయతీలలో పో టీ చేయడం విశేషం. కొండపి ని యో జకవర్గంలో తెదేపా భారీ ఆధి క్యతను సాధించుకున్నారు. దర్శి సెగ్మెంట్‌లో లభించిన ఆధిక్యత అక్కడ తెదేపా పట్టు పెరిగిన విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కాంగ్రెస్ ఆధిక్యత సాధిం చి చీరాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ వ్యక్తి గత ప్రభావం ఉన్నట్లు చెప్పుకోవచ్చు.
కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ పంచాయ తీల్లో తమ మద్దతుదారులు గెలిపిం చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను ముం దువరసలో నిలిపారు. ఇక్కడ తెదేపా అనూహ్యంగా మూడో స్థానానికి పడి పోవడం విశేషం. వైసీపీ అద్దంకి, మా ర్కాపురం నియోజకవర్గాల్లో ఆధిక్యత లో నిలిచింది. అద్దంకిలో తెదేపా నా యకులు ప్రకటించిన లెక్కలను పరిగ ణలోకి తీసుకున్నా తొలివిడత ఎన్నిక లలో అక్కడ గణనీయమైన సంఖ్యలో పంచాయతీలను వైసీపీ మద్దతుదా రులు దక్కించుకున్నారు. మలివిడత లో మార్కాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధిక్యత సాధించింది. ఆ సెగ్మెంట్‌లో ఇంకో మండలంలో ఎన్ని కలు జరగాల్సి ఉన్నప్పటికి ఇప్పటికే వైసీపీ మంచి ఆధిక్యత లభించింది. ద్వితీయ స్థానంలో తెలుగుదేశం, తృతీయస్థానంలో కాంగ్రెస్‌పార్టీ ఉండ టం విశేషం. ఒంగోలు నియోజకవ ర్గంలో తెదేపా పార్టీ ప్రధమ స్థానంలో నిలిచింది. అయితే తెలుగుదేశం, కాం గ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడం, వైసీపీని చెందిన ఎమ్మెల్యే
బాలినేనిని దెబ్బతీయటమే లక్ష్యమన్నట్లుగా ముందుకు సాగటం గమనార్హం.
కీలకంకానున్న స్వతంత్రులు
ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా తొలి దశలో 36 మంది, మలి దశలో 56 మంది మొత్తం 86 మంది స్వతం త్రులుగా ఎన్నికయ్యారు. వీరిలో అనే క మంది రెండు పార్టీల మధ్య కుదిరి అవగాహనతోనూ, ఒక పార్టీ మద్దతు తోనే విజయం సాధించిన వారే. అయి తే వీరు చివరికి ఏ పార్టీ పక్షాన నిలు స్తారన్న విషయం అర్ధంకాని విధంగా ఉంది. కొందరైతే పూటకో పార్టీపేరు చెప్తూ అయోమయానికి గురి చేస్తున్నా రు. దీంతో ప్రధాన పార్టీలు ఎవరికి వారే వీరిలో కొందరు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే తుది దశ ఎన్నికలు కూడా ముగిసి, స్వతంత్రు లు ఏపార్టీ పక్షాన నిలుస్తారన్న విష యం కచ్ఛితంగా తేలితే ఆయా పార్టీ ల్లో ఏది ముందు వరసలో నిలుస్తుం దో తేటతెల్లమవుతుంది. ఇప్పటి వరకు ఐతే తెదేపానే ముందంజలో ఉంది.

రెండు దశల్లోనూ సైకిల్ సవారీ

July 28, 2013

'తెలంగాణ ఏర్పడితే... అక్కడ నేనే ప్రధాన నాయకుడిని. రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే' అని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలో ఆయన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ సొత్తు కాదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజలను దోచుకుతింటున్నాయని విమర్శించారు.

తెలంగాణలో నేనే ప్రధాన నేతను...విభజన కాకుంటే బాబే సీఎం: ఎర్రబెల్లి

టీడీపీ పార్టీతోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని టీడీపీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రెండు విడతల్లో వెలువడిన ఫలితాల దృష్ట్యా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబు నాయకత్వం కోరుకుంటున్నారన్నారు.

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం : ఎర్రబెల్లి

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడడాన్ని ప్రశ్నించిన
దేవినేని ఉమాను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండవ దశ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మూలపాడు గ్రామంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఒక్కటై ఒకే డోర్ నెంబర్, ఇంటి పేరుతో 280 మంది ఓట్లు వేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఇది అన్యాయమంటూ రిగ్గింగ్‌ను అడ్డుకున్న ఏజెంట్లపై తల్లిపిల్లా కాంగ్రెస్ నేతలు పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించారని రావి ఆవేదన వ్యక్తం చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోకుండా ఏజెంట్లపై దాడి చేయడం అన్యాయమని ప్రశ్నించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని రావి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. అధికారం కోసం దొడ్డిదారిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు రిగ్గింగ్‌కు పాల్పడడాన్ని ఓటర్లు తిప్పికొట్టాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి నూతక్కి బాలాజీ, అంగడాల సతీష్, లింగం ప్రసాద్, కామినేని శ్రీరామకృష్ణప్రసాద్, పెద్దు వీరభద్రరావు, జి. పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

ఉమా అరెస్టు దారుణం

ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం టీడీపీకి మాత్రమే ఉందని తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దేముల్ మండలంలో టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. బుద్దారం, పెద్దేముల్‌తండా, మంబాపూర్, కొండాపూర్, ఒగులాపూర్, నాగులపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనదని అన్నారు. వారంతా జైలు పాలవుతారని తెలిపారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే పట్టం కట్టారని తెలిపారు. జరగబోయే గ్రామాల్లో కూడా టీడీపీ అధిక సంఖ్యలో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాలను అభివృద్ధి చేయలేక పోయిందని, జరిగిన అభివృద్ధి అంతా ఎమ్మెల్యేగా తాను చేసిందేనన్నారు. అందుకోసమే ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజీపూర్ నారాయణరెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు కొమ్ముగోపాల్‌రెడ్డి, శామ్‌రావు పంతులు, మోహన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, చిన్న రాసన్న, ఎం.రాములు, రాంచందర్, పాండు, అశోక్, నర్సిములు పాల్గొన్నారు.

ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉంది

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బాబు

తమ బలం అంతా చంద్రబాబుపైనే ఆధారపడి ఉంటుందని, ఆయన ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆధారపడి తమ విజయావకాశాలు ఉంటాయని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాల నుంచీ పోటీ చేయడానికి చంద్రబాబుకు అవకాశం ఉండదని, ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవలసి ఉంటుందని, దీనివల్ల ఆయన పోటీ చేయని రెండో ప్రాంతంలో పార్టీ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు.

ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నప్పటికీ చంద్రబాబు అభిప్రాయం మరో రకంగా ఉంది. రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. విభజనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉద్యమించడం వల్ల రాష్ట్ర ప్రజలకు మరింత హాని చేసిన వాళ్లం అవుతాం. తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంటే, సీమాంధ్రకు న్యాయం చేయడానికి ఏమి కావాలో అప్పుడే అడగవచ్చునని ఆయన అభిప్రాయపడుతున్నారు. వై.సి.పి. విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా దెబ్బతిన్నందున సీమాంధ్రకు మాత్రమే పరిమితం కావాలన్న నిర్ణయానికి వచ్చారని, ఆ కారణంగానే రాజీనామాల అంకానికి తెర తీశారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో అంతో ఇంతో బలంగా ఉన్నది తెలుగుదేశం పార్టీనే కనుక తొందరపాటుతో వ్యవహరించి నష్టపోకూడదన్నది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుత పరిణామాలపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు.

విభజన పై చంద్రబాబు అభిప్రాయం!

July 26, 2013

కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరగనున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి అంబటి హరిప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయేందుకు సహకరించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు విపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సాధారణంగా సిట్టింగ్‌ శాసనసభ్యులు ఆకస్మికంగా మృతి చెందిన సందర్భాల్లో మృతుని కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించే ఆనవాయితీ రాష్ట్రంలో ఉందన్న విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమ దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడైన హరిప్రసాద్‌ను తమ పార్టీ తరపున అభ్యర్థిగా నిలుపుతున్న క్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆయన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మీ, సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శి కె. నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌ రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షులు కటారి శ్రీనివాస రావుకు వేర్వేరుగా లేఖలు రాశారు.

అవనిగడ్డ ఏకగ్రీవానికి సహకరించండి...రాష్ట్రపార్టీలకు చంద్రబాబు లేఖ

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై నోరుమెదపవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణుల్ని ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకంలో టిడిపి పాత్రధారి కాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణాపై నిర్ణయం అంటూ ఢిల్లీలో కాంగ్రెస్‌ చేస్తున్న హడావిడిని పట్టించుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని సాధారణ ఎన్నికలకు సమాయత్తం చేయడంపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి తద్వారా టిడిపిని ఇరకాటంలో పెట్టాలనే కాంగ్రెస్‌ కుటిల వ్యూహాన్ని చంద్రబాబు ఇప్పటికే అన్ని వేదికలపైనా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలపై నుంచి టిడిపి దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్‌ ఈ తరహా హడావిడి చేస్తుందనే విషయాన్ని గమనించిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని, జరుగుతున్న పరిణామాల్ని గమనించాలే తప్ప మీడియాకు ఎక్కవద్దని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణా అంశంపై మహానాడులో తీర్మానం చేసినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో సీమాంధ్రలో కూడా మెరుగైన ఫలితాలు రావడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని ప్రాంతాల ప్రజలు టిడిపి మనోభీష్టాన్ని అర్ధం చేసుకున్నారని తొలివిడత ఎన్నికలు ముగియగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ హవా తగ్గడం, టిడిపి పుంజుకున్నప్పటికీ కాంగ్రెస్‌ కూడా భారీగానే లబ్దిపొందడాన్ని టిడిపి నేతలు రాజకీయకోణంలోనే విశ్లేషిస్తున్నారు. మరోవైపు సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి టిడిపిపై వత్తిడి పెంచే కుట్రనూ పరికిస్తున్నారు. గతంలో తెలంగాణాలో కూడా ఇదే తరహా రాజకీయం నడిచిన విషయాన్ని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ హడావిడికి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆపార్టీ నిర్ణయం ప్రకటించాక ఏం చేయాలనేదానిపై ఆలోచన చేద్దామనే సంకేతాలు రెండు ప్రాంతాల నేతలకు వెళ్లినట్లు సమాచారం.

తెలంగాణా అంశంపై సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం గుంభనంగానే ఉంటోంది. రెండు ప్రాంతాల నేతలు ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇదే అంశాన్ని పార్టీలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌ నేతను ప్రశ్నిస్తే 'కందకు లేని దురద కత్తిపీటకెందుకు' ముందు కాంగ్రెస్‌ నిర్ణయం తెలియనివ్వండి అని వ్యాఖ్యానించారు. తెలంగాణాపై పేటెంట్‌ హక్కులు ఉన్నట్లు హడావిడి చేసే టిఆర్‌ఎస్‌ కూడా ఈ అంశపై మౌనంగా ఉండటాన్ని టిడిపి నేతలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 'డిఫెన్స్‌'లో పడే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడేందుకు టిడిపి అధినాయకత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తోంది.

2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన సందర్భంగా కాంగ్రెస్‌తో పోటీ పడి టిడిపి కూడా ఆందోళనలు నిర్వహించింది. ఈ విషయంలో ఆనాడూ ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి భిన్నమైన వైఖరిని పార్టీ తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుంటే మానవ బాంబులమవుతామంటూ గతంలో కృష్ణా, అనంతపురం జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యేలు సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వారు కూడా మౌనంగా ఉంటున్నారు. వస్తున్నా మీ కోసం చంద్రబాబు పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, అలాంటి పరిస్థితుల్లో విభజన, సమైక్య ఆందోళనలు చేయడం వల్ల నష్టంతోపాటు ఐక్యత కూడా చెడుతుందని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. అయితే సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి హడావిడిని కట్టడి చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, క్షేత్రస్థాయిలో ఏదోఒక ఆందోళనలు చేపట్టడమే మంచిదనే అభిప్రాయాన్ని మాజీ మంత్రి గోరంట బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. దీనిపై మెజారిటీ పార్టీ నేతలు మాత్రం ఏకీభవించకపోవడం గమనార్హం.

దేశం గుంభనం టి అంశంపై బాబు ఆదేశం

పంచాయితీ ఎన్నికల తొలిదశ ఎన్నికల ఫలితాలను పరికిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సైలెంట్ వేవ్ నడుస్తోందా అన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రత్యర్ధి పార్టీల వారినే కాకుండా సాక్షాత్తూ ‘దేశం’ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను సైతం ఈ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయనటం అతిశయోక్తి కాదు. పల్లెల్లోని ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేయరు అనే అభిప్రాయానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలోని అత్యధిక పంచాయితీలు తెలుగుదేశం బలపరచిన అభ్యర్ధులనే సర్పంచ్ లుగా ఎన్నుకోవటం చూస్తుంటే గ్రామీణ ఓటర్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. మూడు విడతల ఎకగ్రీవాలను కలుపుకుంటే తొలిదశలో అధికార కాంగ్రెస్ పార్టి తెలుగుదేశం కంటే కేవలం 4 స్థానాలను మాత్రమే అధికంగా గెలుచుకుంది. రాష్ట్రంలోని పది జిల్లాలలో తెలుగుదేశం జయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ కేవలం 6 జిల్లాలకే పరిమితమయింది. కాగా అందరినీ దిగ్భ్రాంతి కి గురిచేస్తూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు జిల్లాలకే తనను తాను పరిమితం చేసుకుంది.

మూడు విడతల ఏకగ్రీవాలను కలిపితే కాంగ్రెస్ పార్టీ 2,311 పంచాయితీలను, తెలుగుదేశం పార్టీ 2,307 పంచాయితీలను, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,599 పంచాయితీలను గెలుచుకున్నాయి. కాగా విచిత్రం ఏమిటంటే స్వీప్ చేస్తుందనుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి కేవలం 532 పంచాయితీలను మాత్రమే గెలుచుకుని తెలంగాణా లో రెండు జిల్లాల్లో తన ప్రభావాన్ని చాటుకుంది, ఈ ఫలితాలను నిశితంగా పరిశిలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అతి తక్కువ కాలంలో పునర్ వైభవాన్ని పొందేందుకు మార్గం సుగమం చేసుకుందన్నది అర్ధమవుతుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ కి గ్రామీణ వోటర్లు లేరు. అయితే అన్ని అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ తొలిదశ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కు పల్లెల్లో అనూహ్యంగా పెరిగిన ఆదరణకు నిలువెత్తు దర్పణంలా నిలిచాయి. ఈ సారి పల్లెలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే నిలుస్తాయి అన్న అంచనాలను సైతం ఈ ఎన్నికలు పటాపంచలు చేసాయి. ఆ పార్టీ మూడవ స్థానంలో మిగిలిపోయింది.

ఇంత ఆకస్మికంగా పల్లెల్లో తెలుగుదేశం పార్టీ కి ఇంతటి గ్రామీణ జనాదరణ పెరగటానికి కారణాలను అన్వేషించేందుకు రాజకీయ పరిశీలకులు కుస్తీలు పడుతున్నారు. ఏడు నెలలపాటు అలుపెరగకుండా చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రభావం పల్లె ప్రజల మీద ఎక్కువగా ఉందన్నది రాజకీయ పండితుల భావన. అలాగే ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవటం లో ప్రభుత్వంకంటే వేగంగా చంద్రబాబు స్పందించి బాధితులకు సహాయం అందించిన తీరు కూడా ప్రజల మనస్సుల్లో బలంగా నాతుకుందని విశ్లేషకుల భావనగా తెలుస్తోంది. రెండవ దశ, మూడవ దశ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతే బలంగా వుంటే రానున్న ఎంపిటిసి లు, జెడ్ పి టి సి లు, మునిసిపాలిటీ లలో సైతం సానుకూలంగా వుంటాయనటం లో సందేహం లేదు. ఏది ఏమైనా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలతో బాటు తెలంగాణా లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా వుండటం ప్రత్యర్ధి పార్టీలను గందరగోళానికి
గురి చేస్తోంది.

భవిష్యత్తు తెలుగుదేశానిదేనా !

July 25, 2013



- పంచాయతీలో ఫలించని సిఎం కిరణ్‌ వ్యూహం!
- 'సైకిల్‌' దూకుడు
రాష్ట్రంలో తొలి విడత పంచాయతి ఎన్నికల్లో అధికార పార్టీ బోల్తా పడినట్లుగా స్పష్టమైంది. మంగళవారం అర్ధరాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి 1890 సర్పంచ్‌ స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 1670, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 1260, తెలంగాణ రాష్ట్ర సమితికి 453 సర్పంచ్‌ పదవులు లభించాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పంచాయతి ఎన్నికలకు వేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ పదవుల్లో అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయని సంబరపడినప్పటికీ, ప్రజా క్షేత్రంలో మాత్రం అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓటింగ్‌ పద్ధతిలో జరిగిన పంచాయతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన స్థానాల కంటే అత్యధికంగా రావడంతో పార్టీ వర్గాలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

బోల్తాపడిన కాంగ్రెస్‌

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింఒది. ఏకగ్రీవాలు మినహా మంగళవారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో 1944 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్‌ మద్దతుదారులు1,686, వైకాపా మద్దతుదారులు 1297, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 456, వామపక్షాల మద్దతుదారులు 64 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. తొలివిడతలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో టీడీపీ సత్తా చాటింది. కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు, నెల్లూరు, నల్గొండ, విజయనగరం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో ఆదిక్యం కనబర్చింది. కడప, విశాఖ జిల్లాల్లో వైకాపా మద్దతుదారులు పైచేయి సాధించారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ముందంజ

సైకిల్ స్పీడ్

రాష్ర్టంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందర వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల పంచాయతీల్లో సైకిల్ హవా కొనసాగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు, టిడిపికి పెద్దగా తేడా లేకుండా రెండు పార్టీలు సమా నంగానే పంచాయతీలను పంచుకోవడంతో టిడిపి గ్రామ స్థాయిలో ఇంకా పట్టు కోల్పేలేదన్న భావన ఆ ఆ పార్టీకి ఎంతో ఉత్సాహానిస్తోంది. పార్టీ నేతలు కొందరు టిడిపి పని అయిపోయినట్టేనని భావించి టిఆర్‌ఎస్, వైకాపాలలోకి మారుతున్నా పార్టీ అధినేత అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తుండడంతోపాటు గ్రామాల్లో జనం వద్దేక వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం పార్టీని గ్రామస్థాయిలో మరోసారి విజయావకాశావైపు మరల్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభావం బలంగా ఉంటుం దని భావించి ఆ పార్టీ నేతలు ఇటీవల వరసగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్న తరుణంలో తెలంగాణలో రెండు జిల్లాల్లో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టిడిపి తన ప్రతాపాన్ని చూపడంతో టిఆర్‌ఎస్ వెవెలబోయిం ది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా హరీశ్వర్‌రెడ్డి, ఆదిలా బాద్ జిల్లా వేణుగోపాలాచారిలు ఇటీవలే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా గంగుల కరుణాకర్, నిజామబాద్ జిల్లా గంప గోవర్ధన్ తదిత రులు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరినా పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పార్టీని వీడిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేతెల్లం చేశాయి. 

అలాగే రాష్ర్టంలో ఇప్పటికే ఏకగ్రీవాలతో కలుపుకొని దాదాపు 2100 పంచాయతీలలో టిడిపి జెండా ఎగురవేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డితోపాటు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురంతోపాటు ఆంధ్రాప్రాంతానికి చెందిన గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో విజయేక తనం ఎగురవేసింది. సి.ఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులో టిడిపి ఎక్కువ స్థానాలు గెలవడంతో బాబుకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా వైకాపా చాల బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప మినహాయిస్తే తూర్పు గోదావరి, విశాఖలలో మాత్రమే జగన్ పార్టీ బలం చూపడంతో ఆ పార్టీతో భవిష్యత్తులో పెద్దగా ప్రభావం ఉండదని టిడిపి అంచనా వేస్తోంది. మొత్తం గా గ్రామాల్లో మంచి పార్టీ క్యాడర్ ఉన్న టిడిపికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ క్యాడర్‌ను కోల్పో లేదన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతో రాబోయే ఎన్నికలలో కూడా తాము తక్కువకాదన్న భావన ఆ పార్టీని ఎంతో ఉత్సాహంలో పడేసింది. దీంతో భవిష్యత్తు ఎన్నికలపైటిడిపికి ఆశలు ఎక్కువవయ్యాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి క్యాడర్ మరింత కష్టపడి పనిచేస్తే రాబోయే అధికారం మనదేనని చంద్రబాబు అనడంతో ఆ పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండు విడతల ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా కొనసాగితే చంద్రబాబు వ్యూహాలు ఫలించినట్టేనని...పాదయాత్రకు స్పందన వచ్చినట్టుగా భావించొచ్చు...


రాష్ర్టంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందర వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల పంచాయతీల్లో సైకిల్ హవా కొనసాగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు, టిడిపికి పెద్దగా తేడా లేకుండా రెండు పార్టీలు సమా నంగానే పంచాయతీలను పంచుకోవడంతో టిడిపి గ్రామ స్థాయిలో ఇంకా పట్టు కోల్పేలేదన్న భావన ఆ ఆ పార్టీకి ఎంతో ఉత్సాహానిస్తోంది. పార్టీ నేతలు కొందరు టిడిపి పని అయిపోయినట్టేనని భావించి టిఆర్‌ఎస్, వైకాపాలలోకి మారుతున్నా పార్టీ అధినేత అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తుండడంతోపాటు గ్రామాల్లో జనం వద్దేక వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం పార్టీని గ్రామస్థాయిలో మరోసారి విజయావకాశావైపు మరల్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభావం బలంగా ఉంటుం దని భావించి ఆ పార్టీ నేతలు ఇటీవల వరసగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్న తరుణంలో తెలంగాణలో రెండు జిల్లాల్లో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టిడిపి తన ప్రతాపాన్ని చూపడంతో టిఆర్‌ఎస్ వెవెలబోయిం ది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా హరీశ్వర్‌రెడ్డి, ఆదిలా బాద్ జిల్లా వేణుగోపాలాచారిలు ఇటీవలే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా గంగుల కరుణాకర్, నిజామబాద్ జిల్లా గంప గోవర్ధన్ తదిత రులు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరినా పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పార్టీని వీడిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేతెల్లం చేశాయి.

అలాగే రాష్ర్టంలో ఇప్పటికే ఏకగ్రీవాలతో కలుపుకొని దాదాపు 2100 పంచాయతీలలో టిడిపి జెండా ఎగురవేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డితోపాటు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురంతోపాటు ఆంధ్రాప్రాంతానికి చెందిన గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో విజయేక తనం ఎగురవేసింది. సి.ఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులో టిడిపి ఎక్కువ స్థానాలు గెలవడంతో బాబుకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా వైకాపా చాల బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప మినహాయిస్తే తూర్పు గోదావరి, విశాఖలలో మాత్రమే జగన్ పార్టీ బలం చూపడంతో ఆ పార్టీతో భవిష్యత్తులో పెద్దగా ప్రభావం ఉండదని టిడిపి అంచనా వేస్తోంది. మొత్తం గా గ్రామాల్లో మంచి పార్టీ క్యాడర్ ఉన్న టిడిపికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ క్యాడర్‌ను కోల్పో లేదన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతో రాబోయే ఎన్నికలలో కూడా తాము తక్కువకాదన్న భావన ఆ పార్టీని ఎంతో ఉత్సాహంలో పడేసింది. దీంతో భవిష్యత్తు ఎన్నికలపైటిడిపికి ఆశలు ఎక్కువవయ్యాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి క్యాడర్ మరింత కష్టపడి పనిచేస్తే రాబోయే అధికారం మనదేనని చంద్రబాబు అనడంతో ఆ పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండు విడతల ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా కొనసాగితే చంద్రబాబు వ్యూహాలు ఫలించినట్టేనని...పాదయాత్రకు స్పందన వచ్చినట్టుగా భావించొచ్చు...

సైకిల్ స్పీడ్

హైదరాబాద్‌ : తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు ఎన్నికల్లో చూపించారని టీడీపీ నేత, ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు. స్వార్థ రాజకీయాలు చేద్దామనుకున్న పార్టీలకు ఫలితాలు చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో టీడీపీని గెలించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌ పాలనపై వ్యతిరేకత స్పష్టమైంది : హరికృష్ణ

అనంతపురం జిల్లా బెళగప్ప పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి ఎమ్మెల్యే
పయ్యావుల కేశవ్ ధర్నాకు దిగారు. అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకరర్తలనుపోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ.. పయ్యావుల ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పయ్యావులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో.. కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లె ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి దర్నా

July 23, 2013

'వైసీపీ, టీఆర్ఎస్‌లకు వేసిన ఓటు కాంగ్రెస్‌కి వేసినట్లే లెక్క. రాష్ట్రాన్ని నా శనం చేసిన కాంగ్రెస్‌కు...దాని బినామీ పార్టీలకు ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. రెండు, మూడు విడతల్లోనూ టీడీ పీ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాలి' అని రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఫలితాల సరళిని పరిశీలించిన అనంతరం మంగళవారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామ సీమలపై చూపించిన పరమ నిర్లక్ష్యానికి నిరసనగానే గ్రామీణ ప్రజలు తిరగబడి అధికార కాంగ్రెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా పరాజయంపాలు చేశారని చంద్రబాబు స్పష్టం చేశారు. 'తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలను, వారి కష్టాలను పట్టించుకొనే నాథుడు లేడు. కరెంటు కోతలు, మంచినీటి కొరతలు, పారిశుద్ధ్య సమస్యలతో గ్రామీణ ప్రజలు అల్లాడుతున్నారు.

మూడేళ్లుగా పంచాయితీలకు ఎన్నికలు లేక అక్కడి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి. ఈ నిర్లక్ష్యంపైనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు' అని పేర్కొన్నారు. రూ. లక్ష కోట్ల ప్రజా ధనం దోచుకొని దాచుకొంది చాలక అధికారమే పరమావధిగా నానా విన్యాసాలు చేస్తూ తల్లి కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా అంటకాగుతున్న వైసీపీని ప్రజలు తిరస్కరించి తమ విజ్ఞత చూపించారని ఆయన అన్నారు. వసూళ్లనే ఉద్యమంగా మార్చిన టీఆర్ఎస్‌ను కూడా ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడానికి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి టీడీపీకి అవకాశం ఇవ్వండి. టీడీపీకి వేస్తేనే మీ ఓటుకు సార్థకత లభిస్తుంది.

గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణ వ్యవస్థను బాగు చేసే శక్తి, చిత్తశుద్ధి ఉన్న పార్టీ మాది. మిగిలిన రెండు దశల్లోనూ మాకు మద్దతివ్వండి' అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలక పార్టీ అధికార దుర్వినియోగంతోపాటు ఇతర అన్ని పార్టీల ధన బలం, కండ బలాన్ని ఎదుర్కొని మొదటి విడతలో పెద్ద సంఖ్యలో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రెండు విడతల్లో కూడా ఇదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచే సి ఇంకా ఉత్తేజపూరిత ఫలితాలు సాధించాలని వారిని కోరారు.

వైసీపీ,టీఆర్ఎస్‌లకు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే!మిగిలిన విడతల్లోనూ టీడీపీని గెలిపించండి : బాబు

తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒకింత మోదాన్ని మరొకింత ఖేదాన్ని మిగిల్చాయి. స్థానిక ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించినా అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి అనే చందాన ఫలితాలు వెల్లడిస్తున్నాయి..ఊహించినట్టుగా పార్టీకి తెలంగాణ జిల్లాల్లో వైఎస్‌ సానుభూతి పనిచేయలేదనే చెప్పాలి. సీమాంధ్రలోనూ మూడు జిల్లాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చినా కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పోటీనిచ్చింది. కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచింది. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాంగ్రెస్‌ ఉద్ధండుల కోటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాగా వేసింది. సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో ద్వితీయస్థానం సాధించింది. ఇక తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అనూహ్యంగా 72కు పైగా స్థానాలు కైవసం చేసుకోగా మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉనికీని కోల్పోయింది. కాగా రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వేళ్లపై లెక్కించిదగిన స్థానాల్లోనే విజయం సాధించింది. మొత్తంగా తెలంగాణ జిల్లాల్లో వైఎస్సార్‌ సిపికి సానుభూతి అనుకూలించలేదు. కోస్తాంధ్ర ప్రాంతంలో షర్మిల జరుపుతున్న పాదయాత్ర కానీ, ఆ పార్టీ విజయమ్మ మూడు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులుకానీ ఆ పార్టీకి అనుకున్న విజయాన్ని సాధించిపెట్టలేకపోయాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ చీలిక ఓట్లే ఆ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయి. కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా లేకపోవటం, వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించక పోవటం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అందివచ్చిన అవకాశంగా మారింది. మొత్తంమీద రాత్రి 9.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఆ పార్టీకి శ్రీకాకుళంలో 43, విజయనగరంలో 70, విశాఖపట్నంలో 40, తూర్పుగోదావరి జిల్లాలో 56, పశ్చిమ గోదావరిలో 36, కృష్ణా 27, గుంటూరు 59, ప్రకాశం 51, నెల్లూరు 71, చిత్తూరు 94, కడప 110, కర్నూలు 56, అనంతపురం 90, మెహబూబ్‌నగర్‌ 72, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేదు. కాగా రంగారెడ్డిలో 9, నల్లగొండలో 6, కరీంనగర్‌లో 2, వరంగల్‌లో 8, నిజామాబాద్‌లో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇవి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలని, తమ అంచనాల ప్రకారం పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించిందని వైకాపా నేతలు స్పష్టం చేస్తున్నారు.

వైకాపా... వెలవెల!

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలననే స్వర్ణయుగమని టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి
రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నా రు. సోమవారం ఆయన కోమాలోకి వె ళ్లిన ఇమామ్ హుస్సేన్ కుటుంబ స భ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వీరారెడ్డి హయాం నుండి ఇమామ్ హు స్సేన్‌కు పలువురితో స్నేహముందని, ఇమామ్ హుస్సేన్ అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్ధతుదారులే అత్యధికస్థానాల్లో విజయం సాధిస్తారన్నారు.
ప్రస్తుతం కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, చం ద్రబాబు హయాంలో కరవు కాటకాల్లో కూడా 9 గంటలు విద్యుత్తును అందించారన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడం తధ్యమని జోస్యం పలికారు. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ మద్ధతుదారులు ఎక్కువస్థానాలు కైవసం చేసుకుంటారన్నారు.

తెదేపా పాలనే స్వర్ణయుగం

ఎన్నికల కోడ్‌ అతిక్రమించినందుకు గాను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై టిడిఎల్పీ ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు సోమవారం ఎన్నికల కమీషనర్‌ రమాకాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో బొత్స మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఏకగ్రీవ ఎన్ని కల్లో తమ పార్టీదే పైచేయని చెప్పటం ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఉందన్నారు. ఎన్నికల నియ మావళిని అనుసరించి ప్రభుత్వపరంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం తగదన్నారు. వరద బాధిత రైతాంగానికి ప్రభుత్వపరంగా ఆదు కుంటామని సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని హామీ ఇవ్వటం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన క్రిందకు వస్తుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలపై విశ్లేషణ జరుపుతూ ప్రభుత్వపరంగా వాగ్దానాలు చేసినందుకు బొత్సపై కోడ్‌అతిక్రమణ క్రింద చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈసీకి టీడీపీ ఫిర్యాదు

మెజార్టీ పంచాయితీల్లో పాగ
వేసేందుకు ప్రయత్నాలు
ఏకగ్రీవాల స్ఫూర్తితో దూకుడు
టీడీపీ హయాంలో స్థానిక
సంస్థల బలోపేతం
సుపరిపాలన `దేశం'తోనే సాధ్యం
 
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరగనున్న తొలి విడత పంచా యితీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెల్చుకు నేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపు తోంది. పంచాయితీ ఎన్నికలను మొదటి నుండి ఆ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మూడు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో అందివచ్చే ఎటువంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని టీడీపీ నాయ కత్వం భావిస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో విజ యం ద్వారా పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పంచాయితీల్లో పాగ వేసేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఆయన ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే సుపరిపాలన అందించే బాధ్యత తానే తీసుకుం టానని ఇప్పటికే చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడు తూ స్థానిక సంస్థల బలోపేతానికి టీడీపీ ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు 64 అధికారాలు కట్టబెడితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వారి వద్ద నుండి 58 అధికారాలను లాగేసుకుందని విమర్శించారు. సర్పంచ్‌లకు నిధులు, విధులిచ్చి పల్లెసీమల అభివృద్ధి టీడీపీ అంకితభావంతో పని చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం వల్లే పల్లెలిప్పుడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల పల్లెసీమల అభివృద్ధిని పట్టించు కున్న నాథుడే లేరని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్న బాబు, వీధుల్లో విద్యుత్‌దీపాలు, పారిశుధ్య సమస్యలు సైతం తీవ్రరూపం దాల్చాయని మండిపడ్డారు.

ఈసారి పంచాయితీ ఎన్నికల్లో నిజాయితీప రులు, సమర్ధులైన అభ్యర్థులను గెలిపించాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. సమర్థులను ఎన్నుకోవడం ద్వారానే గ్రామాభివృద్ధి సాధ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయితీల్లో సత్ఫలితాలు సాధించేందుకు టీడీపీ నాయకత్వం వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోంది. పోలింగ్ జరగనున్న గ్రామాల్లో ఆయా ప్రాంతాల ముఖ్యనేతలను ఇప్పటికే మొహరించారు. అభ్యర్థుల తరుపున అన్ని తామై అయి వ్యవహరించాలని ఆదేశించారు. పార్టీ ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల వంటి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఎన్నికలకు ముందే జరిగిన ఏకగ్రీవాల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న టీడీపీ, మూడు దశల్లో జరగబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఊవ్విళ్లూరు తోంది. ఏకగ్రీవాలపై ఎవరి వాదన ఎలా ఉన్నా అధికార కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ ధీటైన జవాబిని చ్చిందనీ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారం అండతో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల్లో అత్యధిక స్థానాలు గెల్చుకోగలిగినా, టీడీపీ సైతం ధీటుగా 736 స్థానాలు గెల్చుకు న్నతీరును బట్టే మూడు దశల్లో జరగనున్న ఎన్నికల పరిస్థితిని విశదీకరిస్తోందని వ్యాఖ్యాని స్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నువ్వా, నేనా అన్నట్లు తలపడడం ఖాయమని వారు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు కావడంతో స్థానిక అంశాలు సైతం గెలుపుకు దోహదం చేస్తాయంటూనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెలవగలితే ఆ పార్టీల మనోస్థైర్యం రెట్టింపుకావడం ఖాయమని పేర్కొంటున్నారు. రెండు దఫాలుగా అధికారానికి దూరమైన టీడీపీ నాయకత్వం పంచాయితీ ఎన్నికల పునాదులపైనే రానున్న సాధారణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పరిశ్రమిస్తోంది.

`దేశం` నజర్

July 22, 2013

పంచాయితీ ఎన్నికల్లో తల్లి, పిల్ల కాంగ్రెస్‌ పార్టీలు కలిసిపోయాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుపడ్డారు. పంచాయితీ ఎన్నికల్లో అత్యధికంగా తమ మద్దతుదారులు ఎన్నికయ్యారని వైస్సార్సీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పంచాయితీ ఎన్నికల్లో అసలు ఆ పార్టీ ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు దొరక్క తల్లి కాంగ్రెస్‌తో కలిసిపోయి, పిల్ల కాంగ్రెస్‌ నేతలు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో ఏ గ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థులు జాబితాను విడుదల చేసేందుకు తాము సిద్ధమని, కాంగ్రెస్‌, వైస్సార్సీపీలు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు.

స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా కృషి చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు నిధులు, విధులు కేటాయిస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకొక్కటిగా కోత పెట్టిందన్నారు. సర్పంచ్‌లకు 64 అధికారాలను కట్టబెడుతూ టీడీపీ హయాంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గ్రామ సచివాలయాలను నామారూపాలు లేకుండా చేసి, సర్పంచ్‌లకిచ్చిన 54 అధికారాలను లాగేసుకున్నారని శివాలెత్తారు. ఇసుకవేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్థానిక సంస్థలకు వినియోగించాలని టీడీపీ హయాంలో నిర్ణయించగా, కాంగ్రెస్‌ పార్టీ తిరిగి మైనింగ్‌శాఖకు కట్టబెట్టి మాఫియాలను పెంచిపోషిస్తోందన్నారు.

శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని పంచా యితీలపై పెంచడం ద్వారా గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే లేక పలె ్లసీమలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచా యితీ ఎన్నికల్లో నిజాయితీపరులైన అభ్యర్థులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని చంద్రబాబు ప్రజ లను కోరారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే సుపరిపాలన అందించే బాధ్యత తమదని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో పంచాయితీల బలోపేతానికి తీసుకున్న పలు నిర్ణయాలను చంద్రబాబు విలేక రులకు వివరించారు.

2002లో గ్రామ పంచాయితీలలో రెవిన్యూశాఖ అధికారుల విధులు విలీనం చేయడం
గ్రామ పంచాయితీలకు రెవిన్యూ అధికారా లతో పాటు 64 అధికారాలనిచ్చి సర్పంచ్‌లకు గౌరవం, గుర్తింపుకు కృషి
గ్రామపంచాయితీలకు సర్పంచ్‌లకు అడంగల్‌, పహాణీ, ఎఫ్‌ఎమ్‌బీ వంటి భూమి రికార్డుల అప్పగింత
ఇసుక వేలం కమిటీలలో సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీచైర్మన్లను సభ్యులుగా నియామకం
సర్పంచ్‌ల అధ్యక్షతన ఫించన్లు, ఇళ్లు, పట్టాలు, గ్యాస్‌ పొయ్యిల లబ్ధిదారుల ఎంపిక.

తల్లీ పిల్ల కాంగ్రెస్‌ కలిసిపోయాయి

కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేయవద్దని ఇతర పార్టీలను టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరితే ఆ విషయంపై ఆలోచన చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఈ ఆరు నెలలకాలం కోసం ఎన్నికలలో పోటీచేసి వ్యయప్రయాసలెందుకని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.సిటింగ్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన వ్యక్తి కనుక ఆయన కుమారుడు హరిబాబు రంగంలో ఉంటున్నందున ఆయనపై పోటీపెట్టకుండా ఉంటేనే బెటర్ అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు.

కాంగ్రెస్ కూడా అందుకు సిద్దపడవచ్చు.కాంగ్రెస్ అభ్యర్ధి మండలి బుద్ద ప్రసాద్ ప్రస్తుతం క్యాబినెట్ హోదా కలిగిన తెలుగు భాషా సంఘం అద్యక్షుడుగా ఉన్నారు.ఆయన రంగంలో దిగవలసి వస్తే ఆ పదవిని వదలుకోవలసి వస్తుంది.ఇదంతా పెద్ద ప్రయాస అవుతుంది.అయితే టిడిపి అదినేత చంద్రబాబు కోరితే ఈ విషయంపై ఆలోచించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ భావిస్తోంది.చంద్రబాబు నేరుగా కోరతారా?లేక బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు కోరతారా అన్నది చూడాలి.

చంద్రబాబు కోరితే అవనిగడ్డ లో పోటీచేయం

July 21, 2013


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా, రైతు సంక్షేమాల నుండి తప్పుకుంటోందని టిడిపి నేత కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయ్యాయని వివరించారు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని, హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారాన్ని అందించే పరిస్థితి ఉందన్నారు. వరద ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన తీసుకునే చర్యలు సరిగా లేవని ఈ సందర్భంగా కోడెల విమర్శించారు. ప్రభుత్వం జిల్లాకొక ఇంఛార్జిని పెట్టినప్పటికీ జరగాల్సిన నివారణ చర్యలు సరిగ్గా జరగడం లేదనేది వాస్తవమన్నారు. అదేవిధంగా రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయని, కనుక ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్ళ కాలంలో పరిస్థితిని చూస్తే 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సేద్యం తగ్గిపోయిందని, రైతులు సేద్యాన్ని మానేస్తున్నారని, గత తొమ్మిది సంవత్సరాల్లో 13 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని మానేశారన్నారు. రైతులు, రైతు కూలీలుగా మారిపోతున్నారన్నారు. 31 లక్షల మంది రైతులు కూలీలుగా మారిపోయారని వివరించారు. దాదాపు 12 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. సెజ్ లు, రోడ్డు వెడల్పు పేరుతో సంవత్సరానికి రెండు పంటలు పండే భూముల్ని సైతం ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. దీంతో అనేక మంది వ్యవసాయాన్ని వదిలేశారని, మిగిలిన వారు చేద్దామన్నా అనుకూల పరిస్థితులు లేవన్నారు.విత్తనాలన్నీ ఇంతకుముందు 50 శాతం సబ్సిడీతో ఇచ్చేవారని, దాన్ని 33 శాతం సబ్సిడీగా తగ్గించివేశారన్నారు. సబ్సిడీ విత్తనాల ధరను 5 శాతం నుండి 15 శాతం వరకు రేట్లు పెంచేశారని చెప్పారు. ఇదే ధరకు బయట మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్న పరిస్థితి వుంది. విత్తనాల కంపెనీలకో, సర్టిఫైడ్ సీడ్స్ కంపెనీలకో సహాయం చేస్తున్న పరిస్థితి తప్ప సబ్సిడీ విత్తనాలతో ప్రభుత్వం చేసే సహాయం శూన్యమని విమర్శించారు.

రైతుల్ని కూలీలుగా మారుస్తున్న ప్రభుత్వం - కోడెల

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే ష్ యాదవ్ తనకు మంచి మిత్రుడని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ చాలా బాగుందని అఖిలేష్ చెప్పారని, టీడీపీ హాయంలోనే అభివృద్ధి జరిగిందని తాను చెప్పినట్లు తలసాని తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొనడానికై నగరానికి వచ్చిన అఖిలేష్ మారేడ్ పల్లిలోని తలసాని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనతో 15నిమిషాలపాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి అఖిలేష్ మహాసభకు బయలుదేరి వెళ్లారు.

అఖిలేష్ మంచి మిత్రుడు : తలసాని

 పంచాయతీ ఎన్నికల్లో నిజాయతీ ఉన్న సర్పంచిని ఎన్నుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ చంద్రబాబు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంచి సర్పంచి విజయం సాధిస్తేనే గ్రామాలు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలను బలోపేతం దిశగా తీసుకెళ్లింది టీడీపీనే అని తెలిపారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే సరైన నాయకత్వం ఉంటుందన్నారు. స్థానిక సంస్థలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సుపరిపాలన కోసం తాము గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచికి ఉన్న అధికారాలను కాంగ్రెస్ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిందన్నారు.

నిజాయతీ ఉన్నసర్పంచిని ఎన్నుకోవాలి:బాబు

July 20, 2013

సీనియర్‌ నాయకులు చంద్రబాబు నాయుడును కలుసుకోవడం తనకు అమితానందాన్ని ఇచ్చిందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. శనివారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అఖిలేష్‌ అనంతరం బయట వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో క్లుప్తంగా మాట్లాడారు. భేటీలో మూడో ఫ్రంట్‌ గురించి చర్చించారా అన్న ప్రశ్నకు 'ఏం చర్చించ కూడదా?' అని ఎదురు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వంద స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించడం.. అధికారంలోకి వస్తే వారి అభ్యున్నతికి 10వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న నిర్ణయాలపై అఖిలేష్‌ హర్షం వ్యక్తం చేశారు. యూపీలో తాము కూడా చాలా ముందుగా అభ్యర్థులను ప్రకటించి సత్ఫలితాలను సాధించామన్నారు.

అఖిలేష్‌- లోకేష్‌... అలయ్‌- బలయ్‌

అంతకు ముందు చంద్రబాబు నివాసంలో యువనేత నారా లోకేష్‌, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పరస్పరం ప్రేమ పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమావేశం ఆద్యంతం యువ నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. ముఖ్యంగా స్వయం సహాయ బృందాలు, ఐటీ రంగ అభివృద్ధి, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన వైనంపై చంద్రబాబు వద్ద అఖిలేష్‌ ఆరా తీశారు. మరీ ముఖ్యంగా ఇటీవల పూర్తి చేసిన 'వస్తున్నా.. మీ కోసం' యాత్రా విశేషాలను ఆసక్తిగా విన్నారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాలను వారు గుర్తు చేసుకున్నారు. తాను బాల్యం నుంచీ చంద్రబాబు నాయుడును చూసే వాడినని భేటీలో గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఏ విషయంపైనా వారు సీరియస్‌గా చర్చించకున్నప్పటికీ- చాలా సేపు సొంత కుటుంబంలా మాట్లాడుకున్నారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. అఖిలేష్‌ యాదవ్‌తో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులు ఐటీ మంత్రి అభిషేక్‌ మిశ్రా, రెవిన్యూ మంత్రి అంబికా చౌదరి ఉన్నారు.

బాబుతో అఖిలేష్‌ భాయి..భాయి

July 19, 2013

 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైస్సార్సీపీ నాయకురాలు షర్మిల గత రెండు, మూడు రోజులుగా ఒకరిపై ఒ రు చేసుకుంటున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయ కుడు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దో చుకున్న, దాచుకున్న సొమ్ము ఎవరి వద్ద ఎంత ఉందో బయటకు తీసేందుకు కృ షి చేయాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో రావుల చంద్రశేఖర్‌రెడ్డి విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ షర్మిల భర్త చేసిన తప్పులేమిటో బొత్స బ యపెట్టాలని డిమాండ్‌ చేశారు. జగన్‌న్ని కాపాడానని గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌ పేర్కొంటే, వైఎస్‌ కుటుంబాన్ని కాపాడానని ప్రస్తుతం మంత్రి బొత్స చెబుతున్నారన్నారు. ఎవర్ని ఎవరు కాపాడి రాష్ట్ర సంపదను ఎంత కొల్లగొట్టారో ప్రజలకు తెలియాలన్నారు. దోచుకున్నది, దాచుకోవడానికే జగన్‌ పార్టీ పెట్టా రంటున్న బొత్స వైఎస్‌ మంత్రివర్గంలో కొనసాగినప్పుడు ఎందుకు మంత్రి వర్గంలో చర్చించలేదో చెప్పాలన్నారు. వైఎస్‌ హయాంలో దోపిడీ జరిగిందని ఆయన మంత్రివర్గంలో కొనసాగినవారే చెబుతున్నరన్నారు.

షర్మిల,బొత్స వ్యాఖ్యలపై విచారణ చేయాలి


పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది.పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బొత్స తాను బ్రదర్ అనిల్ తప్పు చేస్తే రక్షించానని చెబుతున్నారని,ఆ విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రిగా ఆయన బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి తాను గతంలో జగన్ ను రక్షించానని అన్నారని, అలాగే ఇప్పుడు బొత్స తాను అనిల్ ను రక్షించారని అంటారని, వీరందరిని వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాపాడారని ఆయన మద్దతుదారులు చెబుతారని,కాంగ్రెస్ లో ఇదంతా ఒక చిత్రమైన పరిస్థితి అని ఇవన్ని బయటకు రావలసిన అవసరం ఉందని రావుల వ్యాఖ్యానించారు.

బొత్స ..వాస్తవాలు బయటపెట్టాలి-రావుల

పంచాయితీ ఎన్నికల్లో ఏకగీవ్రాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలో వైసీపీకి ఒక్క ఏకగ్రీవం కూడా రాలేదని తెలిపారు. పంచాయితీలను భ్రష్టుపట్టించిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఏకగ్రీవంపై వైసీపీ తప్పుడు ప్రచారం : రాజేంద్రప్రసాద్

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ ఏం తప్పు చేశారో పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బహిర్గతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరెంత తాగారో కాంగ్రెస్, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఖద్దర్‌మాటున కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని వర్లరామయ్య హితవు పలికారు.

అనిల్ ఏం తప్పు చేశారో బొత్స బహిర్గం చేయాలి : వర్ల

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం అన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ప్రజలకు కృతజ్ఞతలు : హరికృష్ణ

'బీసీ విద్యార్థులు చదువుకోవడానికి డబ్బుల్లేక ప్రయోగశాలలకు రక్తం అమ్ముకొని ఆ డబ్బుతో ఫీజులు కట్టుకొంటున్నారని 2005లో 'ఆంధ్రజ్యోతి'లో పతాక శీర్షికలో వార్తా కథనం వచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ దానిపై కనీసం స్పందించలేదు. ఆనాడు ఈ దీక్షలు...ఈ స్పందన ఏమయ్యాయి? అధికారం మత్తులో కనిపించలేదా''అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని, వైఎస్ అధికారంలోకి రాగా నే బీసీ విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు కూడా ఇవ్వకుండా వేధించారని విమర్శించారు.

'రక్తం' దారపోసినప్పుడు ఏం చేశారు? : ఆంజనేయ గౌడ్

వైసీపీకి ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను పరిశీలిస్తే ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిందన్నారు.

వైసీపీకి పీఆర్‌పీ గతే : ఎంపీ సీఎం రమేష్

July 18, 2013


స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి.. గ్రామాభివృద్ధికి సహకరించాలని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలను కోరారు. బుధవా రం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నుంచి భారీగా చేరుతున్నారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెబుతున్నారని విమర్శించారు.

గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని, టీడీపీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. అందుకే ప్రజలు మళ్లీ టీడీపీ పాలన కోరుకుంటున్నారన్నారు. కొందరు తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట్లు అడుగుతున్నా వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చిత్తశుద్ధిలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులతోపాటు, పెన్షన్ల స్వాహాకు పాల్పడ్డారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 101 గ్రామ పంచాయతీలకు 60 పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ను ఓడించాలి: ఎర్రబెల్లి

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే చర్లపల్లి జైలులో ఉండేవారని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు మురళీమోహన్న విమర్శించారు. రాష్ట్రాన్ని అవినీతి పాలు చేసిన చరిత్ర ఆయనదని మురళీమోహన్ అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని మురళీమోహన్ వ్యాఖ్యానించారు.

YSR జీవించి ఉంటే చర్లపల్లి జైలులో..

  మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలు అనధికారికంగా వెల్లడయ్యాయి. మాకు అందిన అసంపూర్తి సమాచారం ప్రకారం కాంగ్రెస్‌కు 720, టిడిపికి 608, వైఎస్‌ఆర్‌సిపికి 440, టిఆర్‌ఎస్‌కు 97 పంచాయతీలు లభించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరిగినప్పటికీ గ్రామాల్లో పార్టీ జెండాలతోనే నామినేషన్లు వేయడం, ప్రచారం చేయడం సర్వసాధారణం. సర్పంచ్‌ అభ్యర్ధులు గెలిచిన తర్వాత వారు తమ పార్టీ అభ్యర్ధులేనని ఆయా పార్టీలు కూడా చెప్పుకుంటాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్‌ బాగా డీలాపడింది. ఇక్కడ టిడిపి మొదటి స్థానంలో నిలవగా జగన్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌కు మూడోస్థానం దక్కింది. చిత్తూరు జిల్లాలో 300 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 103 టిడిపి మద్దతు దారులు గెలవగా 75 పంచాయతీలను వైఎస్‌ఆర్‌ సిపి మద్దతుదారులు గెలుచుకున్నారు.

ఏకగ్రీవ 'పంచాయతీ'లు.....కాంగ్రెస్‌ - 720, టిడిపి- 608, వైఎస్‌ఆర్‌ సిపి- 440, టిఆర్‌ఎస్‌ - 97..

July 17, 2013

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు బార్లా తెరవడంపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కీలక రంగాల్లోకి ఎఫ్‌డీఐలు సరికాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బీమా, రక్షణతో పాటు మరో 12 రంగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను ఆహ్వానించడం దేశ సమగ్రతేక చేటని తెలిపారు. బుధవారం యనమల పార్టీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. కీలక రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిం చడం సరైంది కాదని, యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాలకు ఈ నిర్ణయం పరాకాష్ట అని మండిపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది శాతం విద్యుత్ లోటు, ఆర్థిక మాంద్యం, అధిక వడ్డీ రేట్ల కారణంగా కుదులయిన భారత పారిశ్రామిక రంగంపై కేంద్ర తాజా నిర్ణయం గోరుచుట్టు విూద రోకలిపోటు లాంటిదేననని ధ్వజమెత్తారు. విదేశీ పెట్టుబడులపై ఎందుకంతా ఆసక్తి? అని ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలేవో స్వదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చేలా ప్రధాని మన్మోహన్‌సింగ్ బృందం చొరవచూపాలని డిమాండ్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్న తరుణంలో దిక్కుతోచని స్థితిలో పడిన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్కరణల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. కీలకమైన పన్నెండు రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రక్షణ, టెలికం, పౌరవిమానయాన, బీమా, పెట్రోలియం, విద్యుత్ వంటి ముఖ్యమైన రంగాలలో 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఎత్తేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రక్షణ, విద్యుత్, బీమా వంటి కీలక రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలపడాన్ని తపబట్టాయి. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే చేతులు ముడుచుకొని కూర్చున్న ప్రభుత్వం చివరకు ఎఫ్‌డీఐలకు బార్లా తెరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కేంద్ర నిర్ణయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు

మరో యాత్రకు చంద్రబాబు రెడీ ఈ సారి బస్సులో బాబు యాత్ర
ఆగస్టు నెలాఖరున బస్సుయాత్ర!
బాబుకు తోడుగా బాలయ్య
యువత టార్గెట్‌గా లోకేష్‌ సదస్సులు


ఎన్నికల వరకు ప్రజల్లోనే గడిపేందుకు టీడీపీ అధినేత సిద్ధమవుతున్నారు. గతంలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేసిన బాబు, మరోసారి జనంలోకి వెళ్లేందుకు బస్సుయాత్రకు సిద్దమవుతున్నారు. ఆగస్టు నెలాఖరులో చంద్రబాబు బస్సుయాత్ర శ్రీకాకుళం లేదా విజయనగంరం జిల్లాలో ప్రారంభం కానున్నాట్లు సమాచారం. ఈసారి బాబుతోపాటు బాలయ్య, లోకేష్ కూడా యాత్రలో పాల్గొంటుండడంతో అందరి దృష్టీ ఇప్పుడు టీడీపీ అధినాయకత్వంపైనే ఉంది.

వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరో యాత్రకు రెడీ అవుతున్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో కవర్‌ కాని ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడపల్లో బాబు మొదట బస్సుయాత్ర చేయనున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టూర్ కొనసాగించాలని ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. పార్టీ వర్గాలు చెప్తున్నదాన్ని బట్టి.. హైదరాబాద్‌లో కూడా బస్సుయాత్ర ఉండొచ్చు. ఈ నెలలోనే బస్సుయాత్ర చేపట్టాలని భావించినా, పంచాయతీ ఎన్నికల కారణంగా, ఆగస్టు చివరి వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రజల్లో ఉండే విధంగా చంద్రబాబు యాత్ర రోడ్‌ మ్యాప్ సిద్ధమవుతోంది.

అటు బావకు తోడుగా బావమరిది, హీరో బాలయ్య కూడా ఈసారి బస్సుయాత్రలో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి మరో నాలుగు నెలలు పడుతుందని అంచనా. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే బాలయ్య.. ప్రజాక్షేత్రంలోకి దిగుతారు. బాబుతో కలసి బస్సుయాత్ర చేస్తారు..

మరోవైపు యువత ఆదరణ పొందడమే లక్ష్యంగా నారా లోకేష్‌ కసరత్తు చేస్తున్నారు. తండ్రితో పాటు లోకేష్‌ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే విధంగా ప్లాన్‌ సిద్ధమవుతోంది. ఐతే.. బస్సుయాత్ర కాకుండా.. యూనివర్సిటీలు, కాలేజీలలో సదస్సులు నిర్వహించడం వంటివి కార్యక్రమాలు చినబాబు కోసం డిజైన్ చేస్తున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, లభించిన ఉద్యోగ అవకాశాలు, ఇతర సంక్షేమ పథకాలను యువతకు వివరించే విధంగా లోకష్‌ ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నారు. యూత్ టార్గెట్‌గా పాటలు కూడా తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు.. చినబాబు.. మధ్యలో బాలయ్య..

July 16, 2013


Oke-Okkadu-film-themed-on-C

గ్రేట్   డైరెక్టర్ శంకర్ “ఒకే ఒక్కడు” సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు ఇన్ స్ప్రెషన్ ఎవరూ తెలుసా.. ! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. దర్శకుడు శంకర్ ఈ సినిమాకి చంద్రబాబు నాయుడు ఆడ్మినిస్ట్రేషన్ స్టయిల్ ను కథాంశంగా తీసుకున్నాడట. ఇందుకోసం శంకర్ కొన్ని రోజులపాటు బాబుతో తిరుగుతూ… దగ్గరగా పరిశీలించాడట. ఈ విషయలాన్నింటిని వ్యక్తం చేసిందే ఎవరో కాదండోయ్… స్వయంగా తెదేపా అధినేతనే ఓ ఫంక్షన్ లో.. సన్నిహితుల వద్ద వెల్లడించారని సమాచారం.
ఇంకాస్త వివరంగా.. ’ఒకే ఒక్కడు’ మూవీ ముందు చోటు చేసుకున్న విషయాలను గమనిస్తే.. భారతీయుడు, జెంటిల్ మెన్ లాంటి బిగ్గెస్ట్ హిట్ లతో అప్పుడప్పుడే శంకర్ మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతున్న సమయంలో.. ఓ వేదికపై చంద్రబాబును కలిసాడు. బాబు అడ్మినిస్ట్రేషన్ ను ఇష్టపడే శంకర్.. చంద్రబాబును దగ్గర నుండి పరిశీలించడానికి అవకాశం ఇవ్వమని కోరాడట. ఇందుకోసం కొన్ని రోజులు మీతో పాటు తిరుగుతానని శంకర్ అభ్యర్థించడం.. బాబు అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, వీరి కొన్ని రోజుల ప్రయాణంలో శంకర్ అడిగిన ప్రశ్నలకు బాబు ఇచ్చిన సమాధానాలలోంచి పుట్టిందే “ఒకే ఒక్కడు” సినిమా.
నేను మంచి ‘ఆడ్మినిస్ట్రేటర్’ ను కావడం వలన 50 శాతం సామాన్య ప్రజల సమస్యలను తీర్చగలుగుతున్నాను. మరో 50 శాతం ప్రజలకు అభివృద్ధి చెందడానికి అవకాశాలు కలించడం, వారి వారి వ్యాపార నైపుణ్యాని పెంచుకోవడానికి దోహదపడుతున్నాని బాబు.. ఓ సందర్భంలో శంకర్ తో అన్నాడట. అవును మరీ అందుకే ప్రపంచ పటంలో ఆంధ్రపదేశ్ ను ఉంచగలిగాడని ఆ సమయంలో గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా భావించాడట.
గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఒక్కడే కాదండీ.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరూ.. అనే మాటలివే. ఎందుకంటే.. ఇటీవల చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్రనే తీసుకోండి. ఆరోగ్యం సహకరించడం లేదు.. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వండని ఎందరన్నా.. ’నేను నడవగలను నడుస్తానంటూ..’ ముందుకు సాగాడు. మొదటి పాదయాత్ర అనుకున్నది కూడా 117 రోజులే.. కానీ ఇంకా ఎక్కువ మంది ప్రజల కలవాలనే తాపత్రయంతో.. బాబు పాదయాత్రను 208 రోజుల వరకు అలుపెరగకుండా కొనసాగించిన విషయం తెలిసిందే. అందుకే రాజకీయ నాయకుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో బాబు ఎప్ప్పటికినీ.. “ఒకే ఒక్కడే”.

చంద్రబాబు పాలనే… ‘ఒకే ఒక్కడు’

మరి కొద్దిరోజుల్లో నందమూరి బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్సకత్వంలో ‘జయసింహా ‘ చిత్రంలో నటిస్తున్న బాలయ్య ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే తన బస్సు యాత్ర మొదలుపెడతారని తెలిసింది. ఇప్పటికే తన పాదయాత్ర తో తన బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రం మొత్తం దాదాపు చుట్టి వచ్చారు. అయితే ఆయన యాత్రలో కవర్ చేయని కొన్ని జిల్లాలను బాలయ్య కవర్ చేయాలని సంకల్పించినట్టు సమాచారం. వరుసగా పంచాయితీ, జెడ్ పి టి సి, ఎం పి టి సి, మునిసిపాలిటీలు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుం
దని బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక బాలయ్య బస్సు యాత్ర

పంచాయతీ పోరులో తెలుగుదేశం దూసుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరగనున్న పోలింగ్‌కు ముందే ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రస్తుతానికి మెజార్టీ పంచాయతీల్లో పాగ వేశారు. పోలింగ్‌కు ముందే తాము బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలపై టీడీపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చిం ది. టీడీపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో తమ్ముళ్ల ముఖాల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చూస్తుంటే ప్రజల్లో పార్టీ పట్ల నెలకొన్న సానుకూల వాతావరణం స్పష్టమవుతోందని టీడీపీ నేతలు వ్యాఖ్యాని స్తున్నారు. పంచాయతీ ఎన్నికల పునాదులపై సాధారణ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికలను మొదటి నుండి టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది.

మిగతా పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలను అషామాషీగా తీసుకోగా, టీడీపీ నాయకత్వం మాత్రం ఎక్కడ పోరపాట్లకు తావివ్వకుండా ముఖ్యనేతలను గ్రామాల్లోనే మకాం వేసేలా చొరవ తీసుకుంది. బలమైన కార్యకర్తల బలగం కలిగిన మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవంగా నెగ్గడం ద్వారా మరోసారి తన సత్తా చాటుకుంది. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ పరిణామాలు ఉక్కిరి, బిక్కిరి చేస్తుంటే టీడీపీ నాయకత్వం మాత్రం తమకేమి సంబంధం లేని వ్యవహారమన్నట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇరు ప్రాంతాల నేతలు సంయమనంతో వ్యవహరించేలా చంద్రబాబు కట్టడి చేయగలిగారు. తెలంగాణ అంశంపై తాము చెప్పాల్సింది ఇప్పటికే చెప్పామని ఆయన కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీయేనంటూ బంతిని వారి కోర్టులోకి నెట్టివేశారు.

తాజా సమాచారం ప్రకారం టీడీపీ బలపర్చిన 415 మంది సర్పంచ్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ మద్దతుతో 200 మంది, వైస్సార్సీపీ బలపర్చిన 116, టీఆర్‌ఎస్‌ దన్నుతో 29 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా సర్పంచ్‌ పీఠాలపై కోలువుదీరను న్నారనున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఆ పార్టీ లాభించిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మూడు దశల పంచాయతీ పోరులోనూ ఇదే తరహా ఫలితాలు వెలువడం ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ కంటే టీడీపీ బలపర్చిన అభ్యర్థులు రెండింతల సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి మెజార్టీ సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకోవడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తాము బలపర్చిన అభ్యర్థుల ఏకగ్రీవాలపైనే ముఖ్యనేతలంత అత్యధికంగా దృష్టిసారించి, అనుకున్నది సాధించారు.

మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు మెజార్టీ పంచాయతీ స్థానాల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవం ఎన్నుకునేలా పథక రచన చేయడం ద్వారా నేతలు, పార్టీ శ్రేణుల్లో సమరో త్సాహాన్ని నింపినట్లయింది.పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా...మీకోసం’ పాదయాత్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. పోలింగ్‌కు ముందే టీడీపీ బలపర్చిన అభ్యర్థుల ఏకగ్రీవానికి బాబు చేపట్టిన పాదయాత్ర ఎంతో కలిసొచ్చిందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 218 రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన చంద్రబాబు అభివృద్ధిపై ఇచ్చిన హామీలను ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. అందుకే బాబు నాయకత్వాన్ని బలపర్చేందుకు టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఓటర్లు మొగ్గు చూపారంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరగనున్న పోలింగ్‌కు ముందే మెజార్టీ పంచాయతీలు గెల్చుకోవడం ద్వారా పార్టీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంటున్నారు.

మూడు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలను రాబట్టేందుకు అందరూ సమిష్టిగా పని చేయాలని చంద్రబాబు ముఖ్యనేతలకు టెలికాన్ఫరెన్సుల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే అందరికంటే ముందే స్థానిక సదస్సుల ద్వారా పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన వైస్సార్‌సీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాడం ద్వారా రానున్న సాధారణ ఎన్నికలకు కేడర్‌ను సమాయాత్తం చేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడుపడడం లేదని తెలుస్తోంది. వైస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు కేవలం 116 స్థానాల్లోనే ఏకగ్రీవం ఎన్నిక కావడం ఆ పార్టీ పరిస్థితి ఏమిటో తెలియజేస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందే పార్టీ నేతల మధ్య సిగపట్లు నాయకత్వాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి.

మరో వైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ 200 స్థానాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడడం ద్వారా, పంచాయతీ పోరులో పట్టు బిగించేందుకు తీవ్ర కసరత్తునే చేస్తున్నట్లు స్పష్టమ వుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా తయారయింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కేవలం 29 స్థానాలకే పరిమితం కావడం గులాబీ దళపతిని అయోమయానికి గురి చేస్తోంది. అయితే మూడు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల చాంపియన్‌గా ఎవరు నిలుస్తారన్నది ఈ నెలఖారు నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పంచాయతీ సంగ్రామంలో టీడీపీ ముందంజ

July 15, 2013

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత తొమ్మిదేళ్లలో ఛిన్నాభిన్నం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శిం చారు. లక్షల కోట్ల అవినీతి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను మింగేసిందని ఆయన సోమవారంనాడొక ప్రకటనలో ఆరోపించారు. ముగ్గురు మంత్రులు నాయకత్వం వహించినా ఆర్థిక వ్యవస్థ 2007-08 నుండి మరింత సంక్షోభంలో పడిందని ఆయన పేర్కొన్నారు. 1999-2004 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ప్రభావం 2006-07 వరకు కొనసాగిందన్నారు. 2004-05 నుండి 2006-07 వరకు వృద్ధిరేటు బాగానే ఉందన్నారు. రెండో సారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల సగటు కేంద్రం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు.

సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు వాస్తవాలను మరుగు పరిచి, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే రాష్ట్రం పరిస్థితి బాగుందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2009-13 మధ్య నాలుగేళ్ల సగటును పరిశీలిస్తే జీడీపీ 7.3 శాతం ఉండగా, జీఎస్‌డీపీ 6.8 శాతం మాత్రమే ఉందన్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 14 శాతం ఉండగా రాష్ట్రంలో 13. 7 శాతం ఉందన్నారు. వైఎస్‌ హయాంలో, తర్వాత సీఎంల పాలనలో సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి సమిష్టి లబ్దిని గాలికొదిలేసినందుకే రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ అతలా కుతలం అయిందన్నారు. లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు లక్ష కోట్ల బడ్జెట్‌ను మింగేశాయని విమర్శించారు. వైఎస్‌ పాలనలో జరిగిన అవినీతికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోకుండా తరువాత ముఖమంత్రులు కూడా అదే దారిలో నడవడంతో వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సకాలంలో వర్షాలు పడినా, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్‌ కోతల వల్ల ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 19 శాతం నాట్లు తక్కువ పడడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రం ఉత్పత్తి తగ్గిపోయి వ్యవసాయాభివృద్ధి లేనప్పుడు ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్సే : యనమల

అన్ని పార్టీలు సాధారణ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను తయారు చేసుకుని అమలు చేసే పనిలో పడ్డాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆరాటపడుతున్న బాబు ఎన్నికలు వచ్చేంత వరకు జనం మధ్యలో వుండాలని నిర్ణయించు కున్నారు. ఇంతకు ముందు గత ఏడాది అక్టోబర్ 2నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 27 వరకు 20 రోజుల పాటు 2340 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రను మోకాలు నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ విజయవంతంగా పూర్తిచేసిన బాబు, మలి విడతలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్రతో పార్టీకి నూతన జవసత్వాలు అందించినట్టుగా ఇమేజ్ రావడంతో ఆ ఒరవడినికొన సాగించాలని భావిస్తున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలను చుట్టుముట్టారు. మలివిడతగా చేపట్టే బస్సు యాత్రలో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు అసంతపృత్తిగా వున్నారని, వైకాపా పట్ల కూడా ప్రజలు ఇదివరకటి అభిప్రాయాన్ని మార్చుకున్నారని, ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీవైపు తిరిగి మొగ్గు చూపుతున్నారని గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు బస్సు యాత్రను కూడా ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. నిరంతరమూ ప్రజల మధ్య వుండి, వారి సమస్యల కోసం పనిచేస్తుంటే, ఆదరిస్తారనేది బాబు నమ్మకం. ప్రజలు రాష్ర్టంలో సుస్థిర పాలనను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నమ్ముతున్న బాబు అది అందించే సత్తా ఒక తెలుగుదేశం పారీే్టక వుందని ప్రజల్లోకి వెళ్ళి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నా, పార్టీకి గ్రామ, పట్టణ స్థాయిల్లో వున్న పటిష్టమైన శ్రేణీ వ్యవస్థ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని, కార్యకర్తల బలం, ప్రజల అభిమానంతో తిరిగి అధికార పగ్గాలు చేపట్టేది ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ విశ్వాసంతో వున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆగస్టు మొదటి వారంలో ... చంద్రన్న బస్సుయాత్ర

కొమరవోలు పంచాయతీలో పోటీ రసవత్తరం (కృష్ణా కెఎన్‌ఎన్‌ బ్యూరో) సినీహీరో నందమూరి బాలకృష్ణ మేనమామ కుమారుడి భార్య వరుసకు చెల్లెలు పొట్లూరి క్రిష్ణ కుమారి శనివారం కొమరవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికోసం నామినేషన్‌ వేశారు. దీంతో ఆ పంచాయతీలో పోటీ రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరపున అంటే ఆ పార్టీ మద్దతుతో పోటీచేశారు. పార్టీలు నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొనక పోయినా, పరోక్షంగా పార్టీలే ఎన్నికల్లో తలపడతాయన్న విషయం తెలిసిందే. అయితే పామర్రు మండల పరిధిలోని కొమరఓలు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ గ్రామం స్వర్గీయ ఎన్‌టిరామారావు అత్తవారి ఊరు అది. బాలక్రిష్ణ అమ్మమ్మ వారి సొంత గ్రామం నుంచి పొట్లూరి క్రిష్ణకుమారి పోటీచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ పంచాయతీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. బాలయ్య బంధువు రంగంలో ఉండడంతో టిడిపి ఆ పంచాయతీ గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది. బాలయ్య కూడా ఏదో ఒక సమయంలో ఆ గ్రామాన్ని ఈ ఎన్నికల లోపు సందర్శించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

బాలయ్య సోదరి నామినేషన్‌..

రాజమండ్రిలోని బొమ్మూరి సెంటర్‌లో గల ఎన్టీఆర్ విగ్రహంపై కొందరు గుర్తుతెలియన వ్యక్తులు దాడి చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చేతిని దుండగులు విరగొట్టారు. దుండగుల దాడిని నిరసిస్తూ సోమవారం ఉదయం స్థానికులు ఆందోళనకు దిగారు.

ఎన్టీఆర్ విగ్రహంపై దాడి

ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.6 నుండి 524.25 అడుగులకు పెంచుతామని, ఇందుకోసం నిధులు కేటాయించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్నాటక అసెంబ్లీలో స్పష్టంగా ప్ర టిం చారని, అదే జరిగితే కృష్ణాడెల్టా ఎడారవుతుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్యామ్‌ ఎత్తు ఐదు అడుగులు పెంచటం వల్ల ఈ ప్రాం తంలోని 22 ఎకరాలు ఎండిపోయే అవకాశం ఉందన్నారు. కృష్ణాడెల్టాలో నారు మళ్ళు సెప్టెంబరు,అక్టోబరు మాసంలో వేయాల్సిన దుస్ధితి రానుందని ఆయన జోస్యం చెప్పారు.

వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞానికి రూ.80 వేల కోట్లు ఖర్చుచేవారని, కనీసం 8 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి ఈ జలయజ్ఞం అవినీతే పరాకాష్ట అని ఉమా విమర్శించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరపున సరైన వాదనలు వినిపించకపోవడంతో 2012లో తీర్పు ఏకపక్షంగా వచ్చిం దన్నారు. అఖిల పక్షంలో మేమందరం ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా ఎస్‌ఎల్‌పి వేశామని,ఈ 2013లో జడ్జిమెంట్‌ వస్తుందని పాలకపక్షం నేతలు హామీ ఇచ్చా రని గుర్తు చేశారు. అప్పటి వరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ముఖ్య మంత్రి ఎం పీలతో కలసి ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని, చంద్రబాబు హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 524 అడుగులు పెంచడానికి ప్రయత్నం చేస్తే న్యాయపోరా టం ద్వారా ఆపామన్నారు.

రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున 33 మంది ఎంపీలు ఏమీ చేస్తున్నారని ఉమా ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యా యం జరగబోతుంటే ముఖ్యమంత్రి డిల్లీలో కూర్చుని నోరు మెదపటం లేదని విమర్శించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం బీడులుగా మారే ప్రమాదం ఉం దని, దీనిపై పంచాయతీ ఎన్నికల అనంతరం ఆగస్టు నెలలో రైతులతో కలసి టిడిపి పెద్ద ఎత్తున ప్రజాందోళన కార్యక్రమం చేపడుతుందని హెచ్చరించారు. అరెస్టు లకు కూడా భయపడమని,ప్రాణ త్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు. దీని మీద మంత్రి సారధి, ఎంపీ రాజగోపాల్‌, ముఖ్యమంత్రి స్పందించాలని, ఆల్మట్టి ఎత్తును పెంపుదల ఆపాలని డిమాండ్‌ చేశారు. సమా వేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా డెల్టా ఎడారే!

కాంబల్లె సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు ఏకగ్రీవం

వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ఆరంగేట్రం తర్వాత ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని ఏ పంచాయతీలోనూ టీడీపీ విజయం సాధించలేదు. దశాబ్దం కిందట వేంపల్లె మండలంలో ఓ పంచాయతీ కందుల శివానందరెడ్డి వర్గీయులు గెలుచుకున్న తర్వాత టీడీపీకి గెలుపు సొంతం కాలేదు. అయితే తాజా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ కంచుకోటలో టీడీపీ పాగా వేసింది. సింహాద్రిపురం మండలం కాంబల్లె పంచాయతీ సర్పంచిగా టీడీ పీ బలపర్చిన అభ్యర్థి భూమిరెడ్డి ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఉమాదేవి ఎన్నికకు మార్గం సుగమమైంది.

ఈమేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉమాదేవి.. తెలుగు యు వత రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి సతీమణి కావడం, ఆయన స్వగ్రామం కాంబల్లె కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ఈ పంచాయతీలోని ఎనిమిది వా ర్డుల్లో టీడీపీ మద్దతుదారులుగా మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో వారంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంబల్లె గ్రామాభివృద్ధికి రాంగోపాల్‌రెడ్డి విశే ష కృషి చేశారు. గ్రామంలో రాంగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనుల కారణంగా వార్డు సభ్యులుగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదు.

పులివెందులలో టీడీపీ పాగా