May 30, 2013

బడుగు, బలహీనవర్గాలకు వేదిక తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా100 సీట్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. బీసీలకు 100 సీట్లు ఇస్తామని ముందే ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనన్నారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ బీసీ మహాసభ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చేయడానికి నిర్ధిష్ట ప్రతిపాదనతో తాము బీసీ డిక్లరేషన్‌ ప్రకటించామని గుర్తు చేశారు.

బీసీ డిక్లరేషన్‌ను తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఈసారి కూడా అదే పద్దతిలో అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు లభించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని, అందుకే చట్టసభల్లో మూడవ వంతు టికెట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలయితే బీసీల రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. అంతకంటే ముందే ఆచరణలో చేసి చూపించాలని టీడీపీ భావిస్తోందన్నారు. బీసీ కులాలను ఆర్ధికంగా రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. అందుకే వారికి 100 టికెట్లు, 10 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బీసీలకు టీడీపీ మొదటి నుండి ప్రాధాన్యతనిస్తోందని, అలాగే బీసీలు సైతం టీడీపీకి దన్నుగా నిలిచారన్నారు. ఈ సారి టీడీపీ గెలుపు కోసం బీసీలు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన మండలిక వ్యవస్థ ద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని మహాసభ ప్రతినిధులతో ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేయాలని, మరిన్ని టికెట్లు బడుగులకు ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు.

బడుగుల ‘దేశం’

'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది. బీసీలకు ఈసారి ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ టిడిపి' అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ బీసీ మహాసభ ప్రతినిధి బృందం ఆయనను కలిసి తమ సమస్యలపై మాట్లాడింది. మహాసభ అధ్యక్షుడు అవ్వారు మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో ఈ బృందం వచ్చింది.

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు చొరవ తీసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వాలని ఈ బృందం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. బీసీలను సామాజికంగా, రాజకీయంగా ఆర్ధికంగా పైకి తేవడానికి నిర్దిష్ట ప్రతిపాదనలతో తాము ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశామని, బీసీలకు వంద సీట్లు...పది వేల కోట్ల నిధులతో ఈ డిక్లరేషన్ రూపొందిందని చంద్రబాబు వారికి చెప్పారు. ఈ డిక్లరేషన్‌ను తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేరుస్తామని ఆయన వారికి చెప్పారు. 'తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల వారికి టిక్కెట్లు ఇవ్వడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం.

బీసీలకు వారి జనాభా దామాషాలో టిక్కెట్లు లభించాలన్నది టిడిపి కోరిక. చట్టసభల్లో రిజర్వేషన్లు లభిస్తే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. అవి వచ్చేలోపే మా పార్టీ తరపున మొత్తం సీట్లలో మూడో వంతు టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలని మేం నిర్ణయించుకొన్నాం. గెలిచే అభ్యర్ధులు ఎవరైనా ఉంటే మీరు కూడా మాకు సూచించండి. మేం తప్పక పరిశీలిస్తాం' అని ఆయన వారితో అన్నారు. ఆర్దికంగా బీసీ కులాల వారిని పైకి తేవాల్సిన అవసరం ఉందని, అందు కోసమే రూ. పది వేల కోట్లతో ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నది తమ పార్టీ ఆలోచన అని ఆయన వారితో చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు బాగా ప్రాధాన్యం ఇస్తోందని, మండల వ్యవస్ధను టిడిపి తేవడంతో కింది స్ధాయి నుంచి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని బీసీ మహాసభ ప్రతినిధులు ఆయనతో అన్నారు.

టీడీపీ బీసీల పార్టీ : చంద్రబాబు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాలేదని ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని తపబట్టారు. దేశాన్ని దోచుకున్న దొంగలందరూ కలిసి సంఘంగా ఏర్పడి ధర్నాలు చేస్తే దేశ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిపలు చెరిగారు. సీఎం కిరణ్‌కు పాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. బుధవారం కాకినాడకు చెందిన పోతుల విశ్వం టీడీపీ అధినేత నివాసంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన కార్యకర్తల నుద్దేశించి బాబు ప్రసంగించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ఆఖరికి జైళ్లనూ వదల్లేదని ఆరోపించారు. అక్రమార్కులు జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా రని, తాగుడు, నీలి చిత్రాలు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, ప్రజల సొత్తును దోచుకొని జైలుపాలైన జగన్‌కు బెయిల్ రాలేదని వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేయడం దారుణమన్నారు. అక్రమార్కులు, అవినీతిపరులు, దొంగలు రోడ్లపై ధర్నాలు చేస్తూ దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దొంగలందరూ కలిసి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. వీరిని చూసి హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా? నిజాయితీగా పని చేస్తున్న సీబీఐకి వ్యతిరేకంగానా? వైఎస్సార్‌సీపీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్లలాగా తాము దోచుకొని పత్రికలు, చానెళ్లు సంపాదించలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీకి పత్రికలు, చానెళ్లు లేవని.. కార్యకర్తలే పత్రికలు, చానెళ్లలాగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తాను వారిలాగా అవినీతికి పాల్పడలేదని.. నిపలా బతికానని, అందుకే తనపై ఎన్ని కేసులు వేసినా నిలబడలేదన్నారు. అవినీతిపై వైఎస్ ఉన్నపడు పోరాడానని, ఇపడు పోరాడుతున్నానని చెప్పారు. సీఎం కిరణ్‌పైనా బాబు నిపలు చెరిగారు. పరిపాలన చేతగాని సీఎం వసూళ్లకు తెరలేపరాని ఆరోపిం చారు. ఆయన సోదరులను రాజ్యాంగేతర శక్తిగా మార్చారన్నారు. అభివృద్ధి పనుల నిధుల నుంచి కవిూషన్లు తీసుకుంటున్నారని, కాం ట్రాక్టర్ల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఫైళ్లు తీసుకొని వస్తే.. ముఖ్యమంత్రి సంతకాలు చేస్తున్నారన్నారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని.. అలా అంటే ఇపడు ఉన్నది చెడ్డకాలమనేగా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు విరుచుకుపడ్డారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడవేయా లని ఇప్పటిదాకా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నిన మూడు ప్రధాన పార్టీలను మహానాడులో తెలంగాణ ప్రస్తావనకు అనుమతించటం ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమర్థంగా తిప్పికొట్టగలిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణపై మాట్లాడే హక్కు తమకే ఉందని ఢంకా బజాయించి చెప్పే టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ తామే అని, స్పష్టమైన అవగాహన ఉన్నదని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటా మంటూనే ఇప్పటిదాకా ఏదీ తేల్చని కాంగ్రెస్‌, తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెస్‌ కాబట్టి తమకెలాంటి సంబంధం లేదన్న ధోరణి అనుసరిస్తున్న వైకాపాను తెలుగుదేశం పార్టీ మహానాడు సమర్థంగా ఎదుర్కున్నదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత మహానాడులకు భిన్నంగా ఈసారి తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం, గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పటం, కాంగ్రెస్‌ పార్టీ దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేయటం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పార్టీ పుంజుకునేందుకు పునాదులు గట్టిపడ్డాయన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది.

టీఆర్‌ఎస్‌కు చెక్‌
మహానాడులో తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం ద్వారా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటిదాకా చేసిన అన్ని సవాళ్ళనూ టీడీపీ ఎదుర్కున్నట్టయింది. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతి అని ఒకసారి, తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు అనుకూలం అని ఎందుకు చెప్పటం లేదంటూ మరోసారి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తుతూ వచ్చారు. చాలాకాలంగా ఏ సభ జరిగినా కేసీఆర్‌, ఇతర పార్టీ నేతలు ఏ సభ జరిగినా, కార్యక్రమం జరిగినా దీన్నో పెద్ద ఆయుధంగా ఉపయోగించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రెండు ప్రాంతాల నేతలతోనూ చంద్రబాబు చెప్పించారో, అప్పటినుంచి టీఆర్‌ఎస్‌ విమర్శలు మరో కోణం నుంచి ప్రారంభమయ్యాయి.

వ్యతిరేకం కాదని చెప్పటం తప్ప అనుకూలం అనరెందుకని ప్రశ్నించటం మొదలెట్టారు. తెలంగాణకు ప్రథమ శత్రువులలో కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీని చేర్చాల్సిందే అని స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ రెండు పార్టీలను బొంద పెడితే తప్ప తెలంగాణ రాదని పదేపదే చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే మహానాడు ప్రారంభం కానున్నట్టు ప్రచారం మొదలైందో టీఆర్‌ఎస్‌ స్వరం మారిపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, ఇటీవల బాన్స్‌వాడలో జరిగిన శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ దమ్ముంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం పెట్టాలని సవాల్‌ విసిరారు. టీడీపీ దాన్ని స్వీకరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించటంతో పాటు తమ వైఖరి ఏమాత్రం మారలేదని, కేంద్రానికి ఇచ్చిన లేఖకు, అఖిలపక్షంలో చెప్పిన మాటలకూ కట్టుబడి ఉన్నామ నటం తో టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడిపోయి నట్టయిం దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగానే మహానా డు ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్‌ స్వరం మారిపో యింది. తెలంగాణపై టీడీపీ అభిప్రాయం అస్పష్టంగా ఉందని, పార్లమెంటులో టీ బిల్లు పెట్టాలని ఎందుకు డిమాండ్‌ చేయలేదనీ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.

పుంజుకునేందుకు అవకాశం
టీఆర్‌ఎస్‌ వాదనఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ బలం తగ్గకుండా వీలైతే మరింత పెంచుకునేందుకు మహానాడు వ్యూహం తోడ్పడుతుందన్న ధీమాతో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమి ఏర్పాటు చేసి తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు కలసి పోటీ చేసినప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ కన్న టీడీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. మహానాడులో తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం ద్వారా తమ బలం ఈసారి అంతకన్న పెరుగుతుందని, టీఆర్‌ఎస్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు తోడ్పడుతుందని టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌, వైకాపాకు
ఇక తెలంగాణపై నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న కాంగ్రెస్‌, తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న వైకాపాను దెబ్బ కొట్టేందుకు మహానాడు వ్యూహం కచ్చితంగా ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేదీ తామే అని ఇంతకాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ జనాన్ని మభ్యపెడుతూ వచ్చిందని, ఈ మాటలను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలే అంటున్నారని, అలాంటప్పుడు తమ మహానాడు వ్యూహం విజయవంతమైనట్టే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఏదో ఒకటి తేల్చుకోక తప్పని అనివార్య పరిస్థితిని సృష్టించామని, ఆ రకంగా కాంగ్రెస్‌ను చక్రబంధంలో పడవేసినట్టే అని నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు వైకాపాను సైతం ఇరకాటంలోకి నెట్టేశామంటున్నారు. ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ విషయంలో పొడిపొడి మాటలు మాట్లాడటం, కాంగ్రెస్‌ నాయకత్వంపై నెపం నెట్టివేయటం మినహా పార్టీ వైఖరి ఏమిటో వెల్లడించని నేపథ్యంలో వైకాపా ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి సృష్టించామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు.

ఒకే దెబ్బకు మూడు పిట్టలు

వచ్చే ఎన్నికల్లో జయం మనదేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రేపు జరగబోయే స్థానిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువతకు ప్రకటించిన 33 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అవసరమైన చోట సీనియ ర్లకు నచ్చ చెప్పి యువతకు సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత మేధ సంపత్తికి దేశంలో కొదవ లేదని, అవకాశం ఇస్తే ఆదరగొట్టేస్తా రన్నారు. పార్టీలో అందర్ని పరుగెత్తిస్తారని నవ్వుతూ ఆయన వ్యాఖ్యానించారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకా యల విజయ్‌ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందిం చారు.విజయ్‌కు అవకాశం ఇవ్వగానే ఆహుతులను కట్టిపడేసే విధంగా మాట్లాడగలిగారని, అలాగే యువతకు ఎవరికీ అవకాశామిచ్చిన ఆకట్టుకోగ లరని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీరామారావు యువతకు అవకాశాలిచ్చి ప్రోత్సాహించా రన్నారు. ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు చిన్న వయస్సులోనే రాజకీయావకాశమిచ్చి ప్రోత్సాహించింది ఎన్టీ రామారావేనని గుర్తు చేశారు. అప్పటికింకా ఆయనకు పెళ్లికూడా కాలేదన్నారు.ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఎన్టీఆర్‌ క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఏ పనినైనా చిత్తశుద్ధితో చేసేవారన్నారు. సినీరంగంలో, రాజకీయరంగంలోనూ అదే క్రమశిక్షణతో పనిచేసి ఉన్నతశిఖరాలు అధిరోహించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఒక యుగపురుషుడు, ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్టీరామారావు హయాంలో వైద్యులు, న్యాయవాదులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

ఈ రోజు నేరస్థులు రాజకీయాల్లోకి అడుగిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్లెక్సీల రగడ ఎందుకు వచ్చింది...ఎన్టీఆర్‌ బొమ్మను ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారని...అది కూడా దోపీడీ దొంగల సరసన మహానుభావుడు ఎన్టీరామారావు బొమ్మ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే బాధేస్తోందన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారి పక్కన ఎన్టీఆర్‌ బొమ్మ పెడితే ఎలా సహించామంటారంటూ శ్రేణులను ప్రశ్నించారు. దీనిపైనే మా బాధ, ఆవేదన వ్యక్తం చేశామన్నారు.

యువతకు 33 శాతం సీట్లు

 తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 32వ 'మహానాడు' ముగిసింది. ఊహించని రీతిలో 13వేల మంది ప్రతినిధులుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారి సంఖ్య ఇథమిద్దంగా తెలియడం లేదు. వారు కూడా గణనీయ సంఖ్యలో ఉంటారని టీడీపీ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో నిర్వహించే మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తొలి నుంచి అధినేత చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు. అదే రీతిలో సమావేశంలో ఏకంగా 14తీర్మానాలు చేశారు. ఎన్నికల సంవత్సరానికి శ్రేణులను సిద్ధం చేసే దిశలో 75శాతం పనిని పూర్తి చేశారు. అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అంతులేని ఆత్మ విశ్వాసం నూరి పోశారు. గెలుపు లక్ష్యంగా ముందుకు సాగండి. ఎన్ని అవాంతారాలు ఎదురైనా సరే! అన్నింటికి నేనున్నాను. అన్ని విధాలా ఆదుకుంటాను అని వారికి భరోసా ఇచ్చారు. దేవుడిచ్చిన శక్తి ఉడిగిపోయేదాకా పని చేస్తాను అంటూ యువతను ఆకర్షించారు. తొలిసారిగా ఆయన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పారు.

గెలుపుపై ధీమా

అధికారానికి దూరమైన ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిర్వేదంలోనే ఉన్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు సుదీర్ఘ పాద యాత్ర ప్రారంభించారు. ఆయన యాత్ర కొనసాగిన ప్రాంతాల్లో మార్పు స్పష్టంగానే కన్పించింది. ఇక మహానాడుకు వచ్చిన అనూహ్య జన స్పందన అధినేతకు ఆనందాన్ని ఇచ్చింది.

'యువ మంత్రం'

ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్‌ చేరిక రోజే రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు మహానాడు వేదికగా యువత హృదయాలను కొల్లగొట్టేందు చేసిన ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అయిందనేది మరి కొన్ని రోజులు వేచి చూస్తేగానీ తెలియదు. చింతకాయల విజయ్‌, టి. వీరేంద్రగౌడ్‌, కింజరపు రామ్మోహన్‌ రావు లాంటి యువకుల సరసన కుమారుడు లోకేష్‌ను సభికుల్లో కూర్చోపెట్టడం ద్వారా విమర్శలకు బదులు చంద్రబాబు కోరుకునే ప్రచారాన్ని పుష్కలంగా పొందారు.

దేశంలో 'మహా' జోష్‌!