September 5, 2013

ఏపీలో పర్యటిస్తే అక్కడి ప్రజల బాధలు తెలుస్తాయని టీడీపీ ఎంపీ రమేష్‌ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రలో ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఓ వైపు కమిటీని వేస్తామని చెప్పి,మరో పక్క విభజన ప్రక్రియ వేగం చేస్తామని ప్రకటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ఏపీలో పర్యటిస్తే ప్రజల బాధలు తెలుస్తాయి

30 ఏళ్లుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, భవిష్యత్‌లో కాంగ్రెస్‌ను భూస్తాపితం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా మోతడకలో చలపతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో బాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత నిర్ణయంలా తీసుకుందని మండిపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. టీఆర్ఎస్ విలీనం కోసం రాష్ట్రంలో మరో సమస్యను సృష్టించిందని బాబు మండిపడ్డారు. ఈ విషయంపై ఒకసారి యువత ఆలోచించాలని కోరారు.

టీఆర్ఎస్, వైసీపీ పార్టీలను విలీనం చేసుకుని మెజార్టీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం హైదరాబాద్ గురించి మాట్లాడేవారు హైదరాబాద్‌కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక ్తం చేశారు. ఇటలీ, ఇడుపుల పాయకు మైత్రి కుదరడంతోనే తెలుగుజాతికి కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల సీమాంధ్ర, తెలంగాణలో అనేక మంది చనిపోయారన్నారు. దీనికి కాంగ్రెస్సే కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు.

తెలుగు జాతి తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని బాబు అన్నారు. సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మలా మారార ని, లక్షల కోట్లు అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, ప్రస్తుత పరిస్థితులపై విద్యార్థులకు ఆవేశం రావాలని, అవినీతిపై మాట్లాడకుండా కూర్చోవడం సరికాదన్నారు. అభివృద్ధిలో తనను నితీష్, మోడి ఫాలో అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

భవిష్యత్‌లో కాంగ్రెస్ భూస్తాపితం : చంద్రబాబు


ఈనెల 7న నగరంలో అల్లర్లు సృష్టించేందుకు టీఆర్ఎస్, వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి తెలిపారు. టీజేఏసీ పేరుతో గతంలో కేసీఆర్ కత్తిసాము, కర్రసాములు శిక్షణ ఇచ్చారని, అప్పుడు శిక్షణ పొందిన వారు గొడవలకు కుట్ర పనుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, వైసీపీలపై నిఘా పెట్టాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

7న నగరంలో అల్లర్లకు యత్నం : నర్సిరెడ్డి

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.మోతడకలో ఇంజినీరింగ్‌ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. చరిత్ర తెలుసుకుంటే భవితకు ప్రణాళిక వేసుకోగలమన్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలకు మార్గదర్శనం చేశామని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను గౌరవించే పరిస్థితి నుంచి ఇప్పుడు నీచంగా చూసే పరిస్థితికి కాంగ్రెస్‌ చలవతో చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలి : చంద్రబాబునాయుడు

కాంగ్రెస్, వైసిపీలకు బాబు సెగపెడుతున్నాడు. ఆత్మగౌరవ యాత్రలో ఆయన పేలుస్తున్న మాటల తూటాలు ఆ రెండుపార్టీలకు సూటిగా తగులుతున్నాయి. ప్రజల హృదయాల్లోకి నేరుగా చొచ్చుకుపోతున్నాయి. తాను చేసిన అభివృద్ది, వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన అవినీతి, ధరలు వంటి వాటిని ప్రస్తావిస్తూ చంద్రబాబు దూసుకుపోతున్న తీరు టిడిపిలో కూడా ఆత్మస్తైర్యాన్ని పెంచుతోంది. మచ్చుకు కొన్ని ఆయన మాటలు పరిశీలిస్తే....

రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోను.. అలా చేస్తే కాంగ్రెస్ కు మిగిలేది శంకరగిరి మాన్యాలే .. తెలుగుజాతిని ఇంత నీచంగా చూస్తారా, చూస్తే మీరు ఊరుకుంటారా.. మీకు నేను అండగా ఉంటా ... ఇలా మాట్లాడుతూ ప్రజలతోను సై అనిపించుకుంటూ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఫైళ్లనే రక్షించలేని ప్రధాని 120 కోట్ల ప్రజలను ఏం కాపాడుతాడనడం, ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియా నా మనల్ని విడగొట్టేది అంటూ నిప్పులు చెరగడం ప్రజలపై గట్టి ముద్రే వేస్తోంది.

తమ్ముళ్లూ.. నాకు రెండుసార్లు అధికారం ఇచ్చారు, తరువాత, వైఎస్ కు అధికారం ఇస్తే ఏమయింది అన్నింటి ధరలు పెరిగాయి, ప్రజాదనం ఆయన కొడుకే అడ్డంగా దోచుకున్నాడు, దేశంలో ఏమయింది కాంగ్రెస్ హయాంలో దోపిడీలు, అరాచకాలు పెరిగాయి. ఉల్లినుంచి అన్నింటి ధరలు నా హయాంలో ఎంత ఉండేవి, ఇప్పుడెంత ఉన్నాయంటూ దరల పట్టీ ఏకరువు పెట్టారు చంద్రబాబు. హైదరాబాద్, సికింద్రాబాద్ అని రెండే ఉండేవని తాను సైబరాబాద్ ను ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ది చేసానని చెప్పారు. ఇలా కాంగ్రెస్ ను, వైసీపిని ఎండగడుతూ, ఎన్టీఆర్ సెంటిమెంటును ఉపయోగిస్తూ ఆయన ముందుకు సాగుతున్న వైనం ప్రత్యర్థుల్లో దడపుట్టిస్తోంది. ఈ తరహా ప్రసంగాలు బాబు ఆత్మగౌరవ యాత్ర ముందు ఎవరూ ఊహించేలేదు. బాబు కేవలం సీమాంద్రను విడగొట్టడం వల్ల వచ్చే సమస్యలను మాత్రమే ఏకరవుపెడతారని అనుకున్నారంతా. కానీ ఆయన తన బాణాలన్నీ పార్టీలపై ఎక్కుపెట్టడంతో, తాము కూడా అదే దోవలో వెళ్లాలా? లేక సీమాంధ్ర సమస్యలపైనే మాట్లాడాలా అన్నది అర్థం కాక కాంగ్రెస్, వైకాపాలు డీలా పడుతున్నాయి. అయితే ఇక్కడ ఓ టిస్టు వుంది. రాష్ట్రం విడిపోయి, భవిష్యత్ అంధకారం అయిపోతున్న తరుణంలో, ఏం చేయాలన్నది ప్రజలకు దిశా నిర్దేశం చేయక, ఎన్నికల సభల్లో మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారు అనేవారు లేకపోలేదు. ఏమయినా బాబు పుట్టించిన కాక ఇంతా అంతా కాదు. అది వాస్తవం.

కాంగ్రెస్, వైసిపీలకు సెగపెడుతున్న బాబు

గత 35 రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు  ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ కూర్చుని చాలా మంది నేతలు మాట్లాడుతున్నారని, అది బాధాకరమైన విషయమని, ఒక్కసారి సీమాంధ్రలో పర్యటిస్తే పరిస్థితి అర్థమవుతుందని రమేష్ పేర్కొన్నారు.
దేశంలో ఇంత వరకు ఎప్పుడు జరగని రీతిలో ఉద్యమం జరుగుతుందని సీఎం రమేష్ అన్నారు. ఒకవైపు విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ కమిటీ వేస్తామని చెబుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదు : సీఎం రమేష్

 పులిచింతల ప్రాజెక్టులో వైఎస్ కోట్ల రూపాయలు దోచేశాడు, అందువల్లే ప్రాజెక్టు పూర్తికా చింతలు మిగులుస్తోంది అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను సంస్కరణలు అమలు చేసి సంపదను సృష్టిస్తే వైఎస్ రూ. లక్ష కోట్లు దోచేశాడన్నారు. మళ్లీ ఏమాత్రం ఏమారినా ఈసారి సంచి నిండా డబ్బులు తీసుకెళితే జేబు నిండా కూడా సరుకులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. బుధవారం జిల్లాలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా బాబు కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. వాళ్లు దుర్మార్గులు, నీచులు, కీచకులు, అరాచకాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదో దొంగల పార్టీ అని, నీతిగా రాజకీయాలు చేసేది కా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ బుద్ధుడు నడియాడిన అమరావతిలో కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తోందని, ఇదే పద్ధతిని కొనసాగిస్తే ఖబడ్దార్ జాగ్రత్త... మీకు శంకరగిరి మాన్యాలే గతి అవుతుందని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. పెదకూరపా డు, అబ్బరాజుపాలెం, 75 తాళ్ళూరు, పరస, లింగాపురం, ధరణికోట మీద గా అమరావతికి చేరుకొన్నది. పంచాయతీ ఎన్నికల సమయంలో అమరావతి సర్పంచ్‌గా తొలుత టీడీపీకి చెందిన ప్రసన్నలక్ష్మి గెలుపొందినప్పటికీ రీకౌంటింగ్ చేసి అధికార పార్టీ నేతలు ఫలితాన్ని తారుమారు చేశారని స్థానిక 'దేశం' నేతలు చంద్రబాబు దృ ష్టికి తీసుకొచ్చారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహోదగ్ధుడయ్యారు. అమరావతిలో వాస్తవంగా మనమే గెలిచాం. కాంగ్రెస్ దొంగలు దొంగతనంగా గెలిచారు. దానిపై న్యా యపోరాటం చేస్తాం. తప్పక మంచిపార్టీ అయితే తెలుగుదేశానికే విజయం వరిస్తుందన్నారు.
నాల్గో రోజు యాత్రలో చంద్రబాబు సీమాంధ్ర ఆందోళనలను సమర్థిస్తూనే స్థానిక సమస్యల పైనా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పల్లెల్లో రోడ్లు, వీధిలైట్లు, కాలువల ఏర్పాటు వంటివి జరిగాయని, కాంగ్రెస్ దొంగలు ఏమి చేయలేదన్నారు. నిత్యవసర సరుకుల ధరల గురించి చంద్రబాబు మాట్లాడుతూ తాను ఉం డగా కేజీ రూ. నాలుగు ఉంటే నేడు రూ. 80కి చేరిందన్నారు. బియ్యం ఆ రోజున కేజీ రూ. 7.50కే ఎంత కావాలంటే అంత ఇచ్చామన్నారు. నేడు కేజీ రూ. 50కి చేర్చారు. లింగాపురం వద్ద రైతులతో చంద్రబాబు సంభాషించా రు. ఎరువులు, విత్తనాలు, మద్దతు ధరల గురించి వాకబు చేశారు. ఎరువుల ధరలు అందకుండా పోయాయి. రూపాయి పతనం డాలర్‌తో రూ. 120కి చేరితే ఇప్పుడున్నదాని కంటే రెట్టింపు అవుతాయన్నారు.
ధరణికోటలో విద్యార్థినులతో చం ద్రబాబు సంభాషించారు. మీరు ఈ రోజున చదువుకొంటే ఉద్యోగాలు వ స్తాయో, రావోనని భయపడుతున్నా రు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భీతిల్లుతున్నారు. దీనంతటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. నిర్భయ కేసు నిందితులకు కేవలం మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడిందంటే ప్రధాని ఎంత బలహీనుడో స్పష్టం అవుతోంది. నేనైతే ఉరిశిక్ష వేసి ఉండేవాడనని చెప్పారు. అబ్బరాజుపాలెం, అమరావతి, లింగాపురంలో పలుచోట్ల చిన్నపిల్లలను తన వాహనం పైకి చంద్రబాబు ఎక్కించుకొని వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. 'ఏమమ్మా మీ పిల్లాడిని మీరు బాగా చదివించాలని అనుకొంటున్నారు. ఆ పిల్లలు కోసమే మీరు జీవిస్తున్నారు. వాళ్లు జైలుకు వెళ్లాలని మీరు కోరుకోరు.
జైలుకు వెళితే ఎంత అవమానం. ఇంకోపక్క జగన్ జైలుకెళ్లి రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనేమైనా ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్ళాడా అంటే కాదు. మీకు చెందాల్సిన రూ. కోట్ల సంపదను దోచేసి జైలుకెళ్ళాడని, దీనిని గ్రహించి ఆయన పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
ధరణికోటలో ఇసుక క్వారీని మూసేయడం కాంగ్రెస్ మాఫియా పనేనన్నారు. న్యాయంగా క్వారీయింగ్ జరుగుతోన్న వాటిని మూసేసి తద్వారా వేరొక చోట్ల తవ్వకాలు జరిపి కోట్లు దండుకోవడం వారి పని అని ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ గెలిచివుంటే ఈ కుట్ర ఉండేది కాదు
పాదయాత్రలో నేను ప్రకటించిన రుణమాఫీ, రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్‌లు నమ్మి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. జగన్ పార్టీని రెండు జిల్లాలకే పరిమితం చేశారు. ఇంకోపక్క టీఆర్ఎస్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. దాంతోనే కాంగ్రెస్ ఒక దారుణమైన, భయానకరమైన నిర్ణయం తీసుకొంది. అదే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచివుంటే ఈ కుట్ర ఉండేదే కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
మొద్దబ్బాయి... దొంగబ్బాయి సూక్తికి విశేష స్పందన
రాహుల్‌గాంధీని మొద్దబ్బాయి. జగన్‌ను దొంగబ్బాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు కేరింతలు కొట్టారు. వారిద్దరూ ప్రధాని, సీఎం అయితే ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోతాయన్నారు. దొంగబ్బాయికి మీరు ఓట్లేస్తారా? మొద్దబ్బాయికి సహకరిస్తారా అంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. ఇటలీ సోనియా, ఇడుపులపాయ విజయలక్ష్మికి లంకె కుదిరిందంటూ వర్ణించిన తీరుకూ ప్రజలు విశేషంగా స్పం దించారు. విజయలక్ష్మి నంగి నంగి మాట్లాడుతున్నారు. మాలో ఎన్‌టీఆర్ పౌరుషం, స్ఫూర్తి ఉంది. ఇది గుర్తు పె ట్టుకోండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చంద్రబాబు హెచ్చరించారు.
కొమ్మాలపాటి జోరు
పెదకూరపాడు రెండు రోజుల పాటు జరిగిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు భారీగా జనస్పందన తీసుకురావడంలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సఫలీకృతులయ్యారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఒక తాటి పైకి తీసుకొచ్చి ప్రతీ గ్రామంలో చంద్రబాబు యాత్ర సక్సెస్ అయ్యేలా చేశారు. ఇంచుమించు 20కి పైగా గ్రామాల్లో యాత్ర కొనసాగింది.
అమరావతి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలిరావడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. జనస్పందన విశేషంగా ఉండటం వలన బుధవారం షెడ్యూల్‌లో మార్పు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రికే తాడికొండ నియోజకవర్గంలోని రావెల గ్రామానికి చంద్రబాబు చేరుకోవాల్సి ఉండగా మోతడక వద్దనే ఆగిపోయారు.
జోరు వర్షంలోనూ...
అమరావతి సభ ముగియగానే అక్కడ భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ చంద్రబాబు యాత్రను కొనసాగించారు. వర్షంలోనూ నరకుళ్లపాడు, యండ్రాయి, లేమల్లె మీదగా మోతడకలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకొని అక్కడ బస చేశారు. చంద్రబాబు వెంట బస్సుయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జే ఆర్ పుష్పరాజ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జీ వీ ఆంజనేయులు, పార్టీ నేతలు వై వీ ఆంజనేయులు, వెన్నా సాంబశివారెడ్డి, మన్నవ సుబ్బారావు, మానుకొండ శివప్రసాద్, ఎన్‌వీవీఎస్ వరప్రసాద్, ములకా సత్యవాణి, నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

వైఎస్ దోపిడీ వల్లే పులి'చింతలు'

జిల్లాలో ఆత్మగౌరవ యాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం నాడు చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థులతో బాబు ముఖాముఖి నిర్వహించారు.

గురుపూజోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు

స్వాతంత్య్రం రావాలంటే కాంగ్రెస్‌ను సాగనంపాలి
ఇటలీకి ఇడుపుల పాయకు లంకె
ఎంపీలుగా గెలవలేని వాళ్లా మన భవిష్యత్తు తేల్చేది
తెలుగుజాతిపై పెత్తనం చేస్తే ఊరుకోం
కాంగ్రెస్‌కు శంకరగిరి మాన్యాలే
ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు నిప్పులు


 
'దేశానికి ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదు. నేటికీ విదేశీయుల పాలనలోనే కొనసాగుతోంది. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ రావాలంటే విదేశీయుల నాయకత్వంలో నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీని సాగనంపాల'ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి బుధవారం చంద్రబాబు నాలుగో రోజు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభమై అమరావతి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్లకుపైగా సాగింది. పలు ప్రాంతాల్లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బొగ్గు కుంభకోణం ఫైళ్లను మసి చేసినట్లే కాంగ్రెస్‌ను మసి చేయాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

'ఇటలీకి చెందిన సోనియా దేశాన్ని సర్వ నాశనం చేస్తోంది. ఇక్కడి డబ్బంతా విదేశాలకు తరలిస్తోంది. రూపాయి పతనానికి కారకురాలైంది. తెలుగుజాతి మధ్యన చిచ్చు పెట్టింది. సమస్యలు పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారు. బుద్ధి ఉన్న వారెవ్వరూ ఆ పని చేయరు. దొంగబ్బాయి జగన్‌కు నాలుగు రోజుల ముందే సమాచారమిచ్చి వారి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఏమిటీ ఈ నీచమైన రాజకీయాలు. మీరంతా కలిసి ఆమె గూబ గుయ్‌మనిపించాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


'మనకు పులివెందుల ఎలాగో యూరప్‌లో ఇటలీ అలాంటిది. అక్కడి నుంచి వచ్చిన సోనియాకు డబ్బు పిచ్చి. మన దేశంలోని డబ్బంతా కొల్లగొట్టేస్తోంది. నాడు వైఎస్ వారానికి వంద కోట్లు ఆమెకు కప్పం కట్టి వచ్చేవాడు. ఆమె కుమారుడు మొద్దబాయి రాహుల్‌ను దేశానికి ప్రధానిని చేయాలి. ఇంకోపక్క విజయలక్ష్మి తనయుడు జగన్‌ను సీఎం చేయాలి. అందుకోసం ఇటలీ, ఇడుపులపాయతో లంకె కుదుర్చుకున్నారు. మంచి వారైన తెలుగుజాతి పిల్లల పొట్ట కొడుతున్నారు. కాంగ్రెస్ దారుణమైన, భయానకమైన నిర్ణయం తీసుకున్నందు వల్లే ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి హక్కుల కోసం పోరాడుతున్నారు.

మిమ్మల్ని రోడ్డెక్కించిన కాంగ్రెస్ పార్టీకి ఇక శంకరగిరి మాన్యాలే గతి' అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలుగా చలామణి అవుతోన్న చిదంబరం, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులాం నబీ అజాద్‌లపై ఆయన ధ్వజమెత్తారు. ఎంపీలుగా గెలవలేని వీళ్లు తెలుగుజాతిపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో మతం, కులాలను చూసి ఓటేయవద్దని చంద్రబాబు హితవు పలికారు. ఎవరైతే మంచి చేస్తారో, ధర్మం పక్షాన నిలుస్తారో వారినే ఆదరించాలన్నారు.

'మాట తప్పని.. మడమ తిప్పని వంశం తమదన్న వైఎస్ కుటుంబ సభ్యులు నేడు మడమ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుతున్నారు. మాట ఎప్పుడు పడితే అప్పుడు మార్చుతున్నారు. తోక జాడించడం, మాయల ఫకీరుల్లా మాట్లాడటం వాళ్ల నినాదంగా మారింది. వాళ్లని నమ్మి మోసపోవద్ద'ని చంద్రబాబు అన్నారు. ప్రధానికి వ్యక్తిత్వం లేదని, అసమర్థుడని మండిపడ్డారు. తాను నిర్వహించే శాఖలోనే ఫైళ్లు మాయమయ్యాయంటే ఆయనకు దేశాన్ని పాలించే అర్హతే లేదని చంద్రబాబు అన్నారు.


'హైదరాబాద్‌ను నేను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాను. తొమ్మిదేళ్లలోనే సింగపూర్ కంటే మెరుగ్గా అభివృద్ధిపరిచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాను. అమెరికాకు వెళ్లినప్పుడు ఈ ప్రధానే మాకు కూడా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఉందని చెప్పారు. అలాంటి హైదరాబాద్‌ను నా కళ్ల ముందే నాశనం చేస్తున్నారు. నేడు ఎవరైనా ఇక్కడి నుంచి విదేశాలకు వెళితే వాళ్లు జగన్ మనుషులేమోనని భయపడిపోతున్నారు.

హైదరాబాద్‌పై మాట్లాడే సర్వహక్కులు నా ఒక్కడికే ఉన్నాయి' అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తనపై, తెలుగుదేశం పార్టీపై కక్ష ఉంటే తీర్చుకోవాలని, అంతే కానీ తెలుగుజాతి విచ్ఛిన్నం కోసం కుట్ర పన్నితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాత్రలో ఆయన వెంట టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నన్నపనేని రాజకుమారి, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులున్నారు.


రాహుల్‌గాంధీని మొద్దబ్బాయి, జగన్‌ను దొంగబ్బాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అమరావతిలో ప్రజలు బాగా స్పందించారు. వారిద్దరూ ప్రధాని, సీఎం అయితే ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతాయని బాబు అన్నారు. దొంగబ్బాయికి మీరు ఓట్లేస్తారా? మొద్దబ్బాయికి సహకరిస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటలీ సోనియా, ఇడుపులపాయ విజయలక్ష్మికి లంకె కుదిరిందన్న వ్యాఖ్యలకూ ప్రజలు విశేషంగా స్పందించారు. 'విజయలక్ష్మి నంగి నంగి మాట్లాడుతున్నారు. మాలో ఎన్‌టీఆర్ పౌరుషం, స్ఫూర్తి ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు' అని చంద్రబాబు హెచ్చరించారు.

తెలుగుజాతిపై పెత్తనం చేస్తే ఊరుకోం కాంగ్రెస్‌కు శంకరగిరి మాన్యాలే

పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేశారు. గాంధీ టోపీలు ధరించి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో సీమాంధ్ర టీడీపీ ఎంపీల ధర్నా

కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో వైఎస్సార్‌సీపీ పగ్గాలు ఉన్నాయని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు వైసీపీ ఆడుతోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ సీడ బ్ల్యూసీ నిర్ణయానికి ముందే వైసీపీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయించిందని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోసం హోంమంత్రికి వైసీపీ లేఖ రాయాలని కాంగ్రెస్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారముందని, ఒకట్రెండు రోజుల్లో వైసీపీ లేఖ రాయనుందని ఆయన అన్నారు. ఇది వాస్తవమా...కాదా వైసీపీ స్పష్టం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో వైసీపీ పగ్గాలు : రేవంత్‌రెడ్డి

 హైదరాబాద్‌ను యూటీ గీటీ అంటే ప్రజలు చిరంజీవి ఇళ్లును ఖాళీచేయిస్తారని టీడీపీ నేత
తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎం ఇమేజ్ కోసం రోజుకో లీకేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ తరహా అయితే పరిశీలిస్తామని ఆయన అన్నారు. దిగ్విజయ్, ఆజాద్‌లకు వాళ్ల ప్రాంతాల్లో దిక్కులేదు గాని... ఇక్కడ ఫోజులు కొడుతున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం ఇమేజ్ కోసం రోజుకో లేకేజీ ఇస్తున్నారు : తలసాని

యూరప్‌లో ఇటలీ మాఫియా. మనకు పులివెందుల ఎలాగో అక్కడ ఇటలీ అలాంటిది. అక్కడి నుంచి వచ్చిన సోనియాకు డబ్బు పిచ్చ. మన దేశంలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టేస్తోంది. నాడు వైఎస్ వారానికి రూ. వంద కోట్లు ఆమెకు కప్పం కట్టి వచ్చేవాడు. ఆమె కుమారుడు మొద్దబాయి రాహుల్‌ను దేశానికి ప్రధానమంత్రిని చేయాలి. ఇంకోపక్క విజయలక్ష్మి తనయుడు జగన్‌ను సీఎం చేయాలి. అందుకోసం ఇటలీ, ఇడుపులపాయతో లంకె కుదుర్చుకొన్నారు. మంచి వారైన తెలుగుజాతి పిల్లల పొట్ట కొడుతున్నారు. కాంగ్రెస్ ఒక దారుణమైన, భయానకమైన నిర్ణయం తీసుకోవడం వలనే ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి హక్కుల కోసం పోరాడుతున్నారు. మిమ్మల్ని రోడ్డెక్కించిన కాంగ్రెస్ పార్టీకి ఇక శంకరగిరి మాన్యాలే గతి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.

గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి బుధవారం చంద్రబాబు నాల్గో రోజు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించి అమరావతి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరం పైగా యాత్ర చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలుగా చలామణి అవుతోన్న చిదంబరం, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులాంనబి అజాద్‌లపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీలుగా గెలవలేని వీళ్లు తెలుగుజాతిపై పెత్తనం చేస్తామంటూ చూస్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించారు. చిదంబరం గత ఎన్నికల్లో ఫలితాన్ని తారుమారు చేసి ఎంపీ అయ్యారు. దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులాంనబీ అజాద్ ఎన్నికల్లో గెలవలేరన్నారు. వీళ్లా మన భవిష్యత్తు నిర్ణయించేది. ఒక్కసారి ఆలోచన చేసి తిరగబడాలని పిలుపునిచ్చారు. సోనియాపై చంద్రబాబు మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ఇటలీలో పుట్టిన ఆమె ఈ దేశాన్ని సర్వనాశనం చేసేస్తోంది. ఆర్థిక వ్యవస్థను పతనం చేసి కుక్కల చింపిన విస్తరిలా మార్చేసింది. అవినీతిని విచ్చలవిడిగా పెంచి పోషిస్తోంది. ఇంకోపక్క ఢిల్లీలో ఎలా తిరుగుతారో చూస్తానని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ బెదిరిస్తున్నాడు. ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ మీ ఆటలు సాగనివ్వనని చంద్రబాబు హెచ్చరించారు.

మతం, కులాన్ని చూడొద్దు

ఉల్లిపాయలు బజారులో కేజీ రూ. 80 ధర పలుకుతున్నాయి. ఒక కులానికి ఒక రేటు, మరో కులానికి ఇంకో ధరకు విక్రయించరు కదా. అందరికి సమాన ధరకే అమ్ముతారు. ఇదే విధంగా రాజకీయాల్లో మతం, కులాలను చూసి ఓటేయవద్దని చంద్రబాబు హితవు పలికారు. ఎవరైతే మంచి చేస్తారో, ధర్మం పక్షాన నిలుస్తారో వారినే ఆదరించాలని పిలుపునిచ్చారు.

మడమ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుతాం
మాట తప్పం... మడమ తిప్పని వంశం తమదని అన్న వైఎస్ కుటుంబ సభ్యులు నేడు మడమ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుతున్నారు. మాట ఎప్పుడుపడితే అప్పుడు మారుస్తున్నారు. తోక జాడించడం, మాయలఫకీరుల్లా మాట్లాడటం వాళ్ల నినాదంగా మారింది. వాళ్లని నమ్మి మోసపోవద్దని చంద్రబాబు అన్నారు.

లోక్‌సభలో ప్రధాని సమాధానం గర్హనీయం

బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయమైన ఉదంతంపై ప్రధాని మన్మోహన్ లోక్‌సభలో ఇచ్చిన సమాధానం గర్హనీయం. ఆయనకు ఎంతమాత్రం వ్యక్తిత్వం లేదు. పనికిమాలిన అసమర్థుడు. తన కింద ఉన్న శాఖలో ఫైళ్లు మాయమైతే ఆయనకు దేశాన్ని పరిపాలించే అర్హతే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశాన్ని పరిపాలించడం చేతకాని మీరు తక్షణం దిగి వెళ్లిపోండి. ఎన్నికలు వస్తాయి. ప్రజల ఓట్లతో టీడీపీ గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పి దేశాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టిస్తుందన్నారు.

హైదరాబాద్‌పై మాట్లాడే సర్వహక్కులు నావే
హైదరాబాద్‌ను నేను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాను. తొమ్మిదేళ్లలోనే సింగపూర్ కంటే మెరుగ్గా అభివృద్ధిపరిచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాను. అమెరికాకు వెళ్లినప్పుడు ఈ ప్రధానమంత్రే మాకు కూడా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఉందని చెప్పారు. అలాంటి హైదరాబాద్‌ను నా కళ్ల ముందే నాశనం చేస్తున్నారు. నేడు ఎవరైనా ఇక్కడి నుంచి విదేశాలకు వెళితే వారు జగన్ మనుషులేమోనని భయపడిపోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌పై మాట్లాడే సర్వహక్కులు తన ఒక్కడికే ఉన్నాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మీకు నాపై, తెలుగుదేశం పార్టీపై కక్ష ఉంటే తీర్చుకోండి. అంతే కానీ తెలుగుజాతి విచ్ఛిన్నం కోసం కుట్ర పన్నితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

వరకట్నం లేకుండా సామాజిక మార్పు తీసుకొచ్చాం

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించి ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేలా చేశాను. నేడు వాళ్లు ఇంజనీర్లు, డాక్టర్లు అయి ఏడాదికి రూ. కోటికి పైగా సంపాదిస్తున్నారు. దాంతో వరకట్నం లేకుండానే పెళ్లి చేసుకొనే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ సామాజిక మార్పు తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. బుద్ధుడు నడియాడిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అమరావతిలో చంద్రబాబు యాత్రకు విశేష స్పందన లభించింది. చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నన్నపనేని రాజకుమారి, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులున్నారు.

కాంగ్రెస్‌కు శంకరగిరి మాన్యాలే సోనియా గాంధీకి డబ్బు పిచ్చి ఆత్మగౌరవ యాత్రలో బాబు

సోనియా చేతిలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తోలుబొమ్మగా మారారని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మన్మోహన్‌ ఒట్టి అసమర్ధుడని విమర్శించారు. బాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర జిల్లాలో నాల్గో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన అబ్బరాజు పాలెంలో మాట్లాడారు. సోనియా దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశంలో రాజకీయ దురుద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు.ఇటీల యూరప్‌లోనే పెద్ద మాఫియా అని, సోనియా అక్కడి నుంచే వచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో రూపాయి విలువ పతనమయిందని, అవినీతి పెరిగిపోయిందని ఆయనపేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పాలనలోగోనె సంచిలో డబ్బులు తీసుకెళ్లి కూరగాయలు కొనే దుస్థితినెలకొందన్నారు. కృష్ణా జిలాల వివాదంలో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోయిందని, దీంతో మిగులు జలాలను కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని కీలుబొమ్మ : చంద్రబాబు

తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నరోజు దానిని మెచ్చుకోవడానికి ముందుకు రాని జెఎసి, టిఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం ప్రశ్నించింది. 'తెలుగుదేశం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడిన పార్టీ. అలాంటి పార్టీ తన తెలంగాణ ప్రజల కోసం తన విధానాన్ని మార్చుకొని ఏ పార్టీ చేయనంత త్యాగం చేసింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొంది.

జెఎసి నేతలు, టిఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కసారైనా నోరు తెరిచి చంద్రబాబును మెచ్చుకొన్నారా? లేఖ ఇమ్మంటే ఇచ్చాం. మహానాడులో తీర్మానం చేయమంటే చేశాం. అఖిలపక్షంలో చెప్పమంటే చెప్పాం. వాటిలో వేటినైనా కనీసం స్వాగతించారా? స్వాగతించకపోగా కెసిఆర్ అఖిలపక్షం అయిన మర్నాడు మాకు వ్యతిరేకంగా బంద్ పిలుపు ఇచ్చారు.

దానికి జెఎసి మద్దతు. మిగిలిన అన్ని పార్టీలు టిడిపి తెలంగాణ కోసం లేఖ ఇచ్చిందని చెప్పినా కెసిఆర్ వినలేదు. మేం మద్దతే ఇవ్వలేదనేవాళ్ళకు ఇప్పుడు మేం మాట మార్చానో... యు టర్న్ తిరిగామనో అనే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఢిల్లీ వెళ్తానంటే తిడతారు. వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని తిడతారు. తిట్లు తిట్టడానికేనా మీ నోళ్ళు! అందులో నుంచి ఒక్క మంచి మాట రాదా' అని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు విస్మయం వ్యక్తం చేశారు.

తిట్లు తిట్టడానికేనా మీ నోళ్ళు!: ఎర్రబెల్లి

'టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు ఆమోదించుకోలేదని చిత్తూరు జిల్లా యాత్రలో వైసీపీ నేత షర్మిల మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మీ అన్న, మీ అమ్మ వాళ్ళ రాజీనామాలను ఎందుకు ఆమోదింపచేసుకోలేకపోయారు? మావి దొంగ రాజీనామాలు అంటున్నావు. మరి వాళ్ళవేం రాజీనామాలు' అని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత, సీమాంధ్ర నాయకుడు ముద్దు కృష్ణమ నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ టిడిఎల్పీలో విలేకరులతో మాట్లాడారు.

ఆగస్టు 1, 2, 3 తేదీల్లో టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారని, తాను ఏ షరతులూ లేకుండా స్పీకర్ ఫార్మాట్‌లోనే చేశానని ఆయన చెప్పారు. తాను స్పీకర్‌కు పంపిన రాజీనామా పత్రాన్ని ఆయన విలేకరులకు చూపించారు. టిడిపిపై ఏదో ఒక నెపం నెట్టి పబ్బం గడుపుకొనే వ్యవహారంలో వైసీపీ పార్టీ ఉందని, తమ వీపు ప్రజలకు కనిపించదనే భ్రమలో వారున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మీ అన్న, అమ్మ రాజీనామాలు ఏమయ్యాయి?: ముద్దు కృష్ణమ

కాంగ్రెస్ పార్టీ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నిస్తున్నారు. రూ. 30 కోట్లు ఖర్చుపెట్టి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదికను పార్లమెంట్ లో పట్టుమని గంట సేపు కూడా చర్చించలేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పరిస్థితి ముందుకు, వెనక్కి వెళ్లలేకుండా ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. విబజన వ్యవహారం అత్యంత క్లిష్టమైనదని ఆయన అబిప్రాయపడ్డారు.

శ్రీకృష్ణ కమిటీ ని ఎందుకు తొక్కిపెట్టారు : పయ్యావుల