April 16, 2013

హైదరాబాద్:ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను పులివెందుల, పీలేరు నియోజకవర్గాల్లో రహదారులు, భూగర్భ డ్రైనేజీ పనులకు మళ్లించారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుని పదేపదే వాకింగ్ ఫ్రెండ్‌గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇందిరమ్మ బాట, అమ్మ హస్తం పేరిట ముఖ్యమంత్రి గాలి (విమానం)లో తిరుగుతున్నారని, ఆయన ఓ ఫ్లయింగ్ సీఎం అని అభివర్ణించారు.

ఇందిరమ్మబాటకి ప్రజలను బలవంతంగా అధికారులు బస్సుల్లో తరలిస్తన్నారని గాలి ఆరోపించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో కాంట్రాక్ట్ కార్మికులను నియమించవద్దని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్రంలో మూడు లక్షల మంది పొరుగుసేవలు, ఒప్పంద కార్మికులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. చట్ట విరుద్ధంగా చేస్తున్న ఈ నియామకాలకు అనుమతి ఇస్తున్న ముఖ్యమంత్రిని జైలులో పెట్టాల్సి ఉంటుందని ముద్దుకృష్ణమ హెచ్చరించారు.
: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఏదో మేలు చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్ ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ శాసనసభపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రాజ్యాంగంలోనే ఉందని, కొత్తగా సీఎం చేసిందేమిటో చెప్పాలని అన్నారు.

సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపుపై విచారణ: ముద్దు


కాకినాడ:చంద్రబాబు జిల్లాలో ఇరవై నా లుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. బాబు వెంట హిందూపు రం నుంచీ ఫాలో అవుతున్న కొంతమంది పార్టీ సీనియర్లు నియోజకవర్గాల వారీగా పార్టీ, నేతల స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదికలు రూ పొందించారు. ఈ నివేదికలు, అంతకుముందు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన రిపోర్టులను బేరీజు వేసుకుని చంద్రబాబు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా విశాఖ జిల్లాకు రప్పించుకుని సమీక్ష జరుపుతున్నారు.

మార్చి 20 నుంచి ఏప్రిల్ 13 వరకు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ 24 రోజుల్లో జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమీక్ష సమావేశాలను పూర్తి చేశారు. మధ్యలో నేతల మధ్య సమన్వయలోపాలపైనా మాట్లాడారు. అ యినా కొన్ని నియోజకవర్గాల్లో సమ స్య పరిష్కారంకాలేదు.

కార్యకర్తల పనితీరు భేష్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తల పనితీరు మెరుగ్గా ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతోనే ఎక్కువ సమస్యలున్నాయని, వారిలో మార్పు రావాలని పదేపదే ప్రస్తావించారు. చా లాకాలంగా ఉదాసీనంగా ఉన్న నేత ల్లో ఒక్కసారిగా మా ర్పు రావాలని కోరుకోవడం చంద్రబాబుకు సైతం అ త్యాశే అవుతుంది.ప్రత్యామ్నాయం లేక కొన్నిచోట్ల ఆ ఉదాసీనంగా ఉండే నాయకులకే ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టాల్సిన దుస్థితి నెలకొంది.

కఠిన నిర్ణయాలకు వెనుకంజ జిల్లాలోని ఏడెనిమిది నియోజకవర్గాల్లో అసమర్ధులైన ఇన్‌చార్జిలు వున్నారని పార్టీ పరిశీలకులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తేనే పార్టీ మనుగడ సాధిస్తుందని బాబుకు చేరిన నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలని కూ డా పరిశీలకులు చంద్రబాబుకు గట్టిగా చెప్తున్నారు.

మార్పులు, చేర్పులకు సిద్ధపడతారా?


చంద్రబాబునాయుడుకి జిల్లాలో ని సీనియర్లతో కొంత మొహమాటం వుంది. ఆ సీ
నియర్ల మాట కాదని ఇన్‌చార్జిలను మార్చి... కొత్తవారికి , యువకులకు ఆ బాధ్యతను అప్పగించే సాహసం చంద్రబాబు చేయగలరా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ తనతో అనుబంధం ఉన్న నేతల మాటను కాదనలేక... ఇటు అసమర్ధులైన ఇన్‌చార్జిలను కొనసాగించలేక చంద్రబాబు కూడా కొంత సతమతమవుతున్నారు.

'తూర్పు'పై బాబు ప్రత్యేక దృష్టి 'ఆబ్లిగేషన్లతో టికెట్లిస్తే జిల్లాలో అవకాశం వున్న సీట్లు సైతం కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో పార్టీ అధినేత సీరియస్‌గా దృష్టిసారించాలి. సీనియర్ల మాటను సున్నితంగా తిరస్కరించి, కొత్తవారికి, సమర్ధులకు అవకాశం కల్పిస్తే తప్ప గెలిచే చోట సైతం ఆరేడు స్థానాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది..'' అంటూ... జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.

'తూర్పు'పై బాబు ప్రత్యేక దృష్టి

ములగపూడి చిన్న గ్రామం. వంద గడప కూడా లేని ఊరు. కుగ్రామాలకు ఉండే సమస్యలే ఇక్కడా ఉన్నాయి. రహదారి లేదు.. నీళ్లు రావు.. ఊరు పడకేస్తే మందేసే దిక్కు కరువు.. ఉన్న ఒక్కగానొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుబిళ్ల దొరకదు. ఇవేవీ నన్ను కదిలించలేదు గానీ, ఈ కుగ్రామంలో రెండు బెల్టుషాపులు ఉండటమే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. ఊళ్లో ఉన్న బెల్టుషాపుకు వెళ్లి మొగుడు పూటుగా తాగి వస్తుంటే..ఆ ఇంటి ఆడపడుచు మాత్రం ఖాళీ బిందె పట్టుకొని ఊరు దాటిపోవాల్సి వస్తున్నది.

ఈ విషయాలు చెప్పుకొని ఆ ఇల్లాళ్లు ఘోల్ల్లుమన్నారు. చిన్న వాటర్ ట్యాంక్ కట్టించాలని ఎంత మొత్తుకున్నా పట్టించుకోని పాలకులు.. ప్రజలను మత్తులో ముంచేందుకు మాత్రం ఒకటికి రెండు బెల్టుషాపులు తెచ్చి పెట్టారట. మందుబిళ్లకు దిక్కులేని చోట మందు ఏరులై పారుతున్నదట. ప్రజలను ఇంతలా సంక్షోభంలోకి నెట్టేసి..సర్కారు సంక్షేమం ఏ డ్రైనేజీలో మునకలు వేస్తున్నట్టు! తల దగ్గరే తాండవ నది పారుతోంది.

గడ్డపై నిలబడితే కనిపించే దూరంలో పరవళ్లు తొక్కుతోంది. గడపలో కడవ పెడితే అది నిండి పొంగి పొర్లాల్సిందే! కానీ, బెన్నవరం ఇప్పటికీ నీటి బెంగతో అల్లాడుతోంది. గుక్కెడు నీళ్ల కోసం గుక్కపెట్టడం స్వయంగా చూశాను. పర్యవేక్షణ కరువై ఉన్న ఒక్క మంచినీటి పథకమూ మూలన పడిపోయింది. నిజంగా..ఈ గిరిజన గ్రామాలది ఎంత దురదృష్ణం. విలువైన ఖనిజాన్ని తరలిం చుకుపోతున్నా చూస్తుండాల్సిందే. గొంతు తడపాల్సిన నదీ జలాలు ఊరు దాటిపోతుంటే నోరు తెరిచి.."ఇది అన్యాయం'' అని నినదించడానికి లేదు. నోరు లేని వీళ్లకు గొంతును కావడానికే నేనొచ్చా!

సంక్షేమం ఏ డ్రైనేజీలోకి!

టీఆర్ఎస్‌కు గెలిచే సత్తా లేదు
ఆ పార్టీకి అసలు కార్యకర్తలే లేరు
ప్రలోభపెట్టి తీసుకెళుతున్నారు
ఫిరాయింపుల కోసం డెడ్‌లైన్లు పెట్టేందుకు సిగ్గుండాలి: నర్సిరెడ్డి

హైదరాబాద్, విశాఖపట్నం/ నాతవరం:2004 కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ 50 సీట్లలో పోటీచేసి 20 సీట్లలో గెలుపొందిందని... 2009లో తమతో పొత్తుపెట్టుకుని 40 సీట్లలో పోటీ చేసి పది సీట్లలో మాత్రమే గెలుపొందిందని అన్నారు. సంచలనాల కోసం ఏదో ఒకటి చేయడం తప్ప విజయం దక్కించుకునే సత్తా టీఆర్ఎస్‌కు లేదని ధ్వజమెత్తారు. "కరీంనగర్ ఎమ్మెల్యే వెళ్లాడు తప్ప ఆయన వెంట కార్యకర్తలెవరూ వెళ్లలేదు. నాయకులు వెళ్లిపోవడం టీడీపీకి కొత్త కాదు. నాయకుల్లో స్వార్థం పెరిగింది. కార్యకర్తలు మాత్రం నీతి తప్పలేదు. వారే టీడీపీ ఆస్తి'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా.. "కేసీఆర్ గతంలో తెలంగాణ కోసం డెడ్‌లైన్లు పెట్టేవారు. అవి అయిపోయాయి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కోసం డెడ్‌లైన్లు పెడుతున్నారు. ఇలాంటి డెడ్‌లైన్లు పెట్టడానికి సిగ్గుండాలి. ఈ దివాళాకోరు పార్టీకి ప్రజలు 2014లో డెత్‌లైన్ పెట్టడం ఖాయం'' అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల వారంతా చవటలు, దద్దమ్మలని తిట్టిన కేసీఆర్... ఇప్పుడు అదే పార్టీల వారి కోసం వెంపర్లాడుతూ, వారి ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తనతో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సంప్రదింపుల్లో ఉన్నారని కేసీఆర్ గొప్పగా చెబుతున్నారని, అదే నిజమైతే వారి పేర్లు బయటకు చెప్పే దమ్ముందా? అని నర్సిరెడ్డి మండిపడ్డారు.

"తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన నళినిని అవమానించి పంపావు. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన నాగం జనార్ధనరెడ్డి పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరించావో అందరికీ తెలుసు. అమర వీరుల కుటుంబాలను ఉపన్యాసాల కోసం వాడుకోవడం తప్ప అభ్యర్థులుగా పోటీకి అంగీకరించవు. నీకు, నీ కుటుంబ సభ్యులకు పదవులు, వ్యాపారాలే ముఖ్యం. దానికి తెలంగాణ ఉద్యమం ఒక ముసుగు'' అని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతున్న జగన్‌ను కలవాలంటే జైలుకు, మరో పార్టీని నడుపుతున్న కేసీఆర్‌ను కలవాలంటే ఫాంహౌస్‌కు వెళ్లాల్సి వస్తోందని... ఒక్క చంద్రబాబును కలవడానికే జనం మధ్యకు వెళ్ళాలని నర్సిరెడ్డి పేర్కొన్నారు.
: వలస రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అసలు టీఆర్ఎస్‌కు గెలిచే సత్తా లేదని, అసలు ఆ పార్టీకి కార్యకర్తలే లేరని విమర్శించారు. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు మంగళవారం పాడేరు నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. "టీఆర్ఎస్ అధినేత ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తారు. తరువాత ప్రజలను మోసం చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తుంటారు. కరీంనగర్‌లో మా పార్టీ ఎమ్మెల్యేను అలా ప్రలోభపెట్టే తీసుకువెళ్లారు'' అని చంద్రబాబు ఆరోపించారు.

నాయకులు వెళ్లిపోవడం టీడీపీకి కొత్త కాదు...కార్యకర్తలు నీతి తప్పడం లేదు.. వారే మా ఆస్తి: బాబు

ఈ సారీ తప్పు చేస్తే మనుగడ లేనట్టే!
అది చెప్పేందుకే పాదయాత్ర చేస్తున్నా: బాబు

నాతవరం/విశాఖపట్నం:అధికారంలోకి వస్తే ఓసీ పేద విద్యార్థులకూ ఉపకార వేతనాలు అందిస్తామని బెన్నవరం సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలు, దోపిడీ వ్యవహారాలు చూస్తుంటే ఒక్కొక్కసారి పట్టలేనంత కోపం వస్తున్నా, మర్యాద కోసం తనను తాను అణచుకోవాల్సి వస్తున్నదని ములగపూడిలో జరిగిన సభలో పేర్కొన్నారు. వైఎస్‌ని మహానాయకునిగా కీర్తించిన కాంగ్రెస్ పెద్దలు.. నేడు ఆయనను, ఆయన కుమారుడు జగన్‌ను అవినీతిపరులుగా పేర్కొంటున్నారని, తీహార్ జైలుకు పంపించాలంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులందరూ తమ తప్పిదాల్లో భాగస్వాములేనని జగన్ అంటున్నారని, దీన్నిబట్టి తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దొందూదొందేనని అర్థమవుతున్నదని చెప్పారు.

వైఎస్ తప్పుల్లో 'ఆత్మ' కేవీపీకి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. "నన్ను ఒకప్పుడు ప్రపంచబ్యాంకు ఏజెంట్‌నని నిందించారు. అయితే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లక్షా 60 వేల కోట్ల రూపాయలను ప్రపంచబ్యాంకు నుంచి అప్పుగా తెచ్చార''ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ప్రకటించినా సన్న, చిన్నకారు రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. అందరికీ రుణమాఫీ వర్తించేవిధంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం మూడు వేల కోట్ల రూపాయల వరద, కరువు సాయమే కేంద్రం నుంచి అందిందన్నారు.

దీనికి సీఎం కిరణ్‌తోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, అధికార ఎంపీలు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతకుముందు విశాఖ జిల్లా నాతవరం మండలం యర్రవరం గ్రామంలో జరిగిన పాడేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. "మనమంతా ఒకే కుటుంబం...ఒకేమాట.. ఒకేబాటగా కలిసిమెలిసి కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉండాలి. కుటుంబంలో ఒకరికి బాధ కలిగితే మిగిలిన వారంతా ఆందోళన చెందినట్టు పార్టీలో ఒక కార్యకర్తకు కష్టమొస్తే అంతా కలిసి ఆదుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ. అటువంటి బంధం, అనుబంధం తెలుగుదేశం పార్టీకే సొంతం'' అని కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు.

చింతపల్లిలో పార్టీ కార్యకర్తపై మంత్రి బాలరాజు సోదరుడు కేసు బనాయించినా నాయకులు పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనేస్పందించాలని ఆదేశించారు. అంతేకాదు.. ప్రత్యర్థుల బెదిరింపులకు బెదరొద్దని, ఢీఅంటే ఢీ అంటూ తలబడాలని పిలుపునిచ్చారు. కాగా, విశాఖ శివార్లలోని అగనంపూడి టోల్‌గేటు సమీపంలో తలపెట్టిన పైలాన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
: "రానున్న ఎన్నికల్లో అన్నివిధాల ఆలోచించి ఓటు వేయాలి. ఈసారీ తప్పుచేస్తే చరిత్రలో ప్రజల ఉనికికే ప్రమాదం'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా నాతవరం మం డలం ములగపూడి గ్రామంలో ఆయన పాదయాత్ర ప్రారంభించా రు. బెన్నవరం, కృష్ణాపురం, పైపురెడ్డిపాలెం, బలిఘట్టం మీదుగా నడక సాగించారు. ప్రజల బాధలు ఎవరికీ పట్టడం లేదన్న ఆ య న.. ఇప్పటికే రెండుసార్లు చేసిన తప్పిదం వల్ల వ్యవస్థ ఉనికికే ప్ర మాదం ఏర్పడిందని, మరోసారి అటువంటి తప్పిదం చేయకుండా వుండేలా ప్రజలను అప్రమత్తం చేయడానికే పాదయాత్ర చేపట్టానని వివరించారు.

ఆలోచించి ఓటు వేయాలి లేదంటే ప్రజల ఉనికే గల్లంతు

ఎన్డీయే, యూపీఏ ఓటమి తథ్యం
ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నాం
'టైమ్స్ నౌ' చర్చలో చంద్రబాబు

హైదరాబాద్ : ఈసారి ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. "అది మూడో ఫ్రంట్ కావొచ్చు. నాలుగో ఫ్రంట్ కావొచ్చు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఎన్డీయే, యూపీఏ యేతర కూటమే'' అని స్పష్టం చేశారు. 'సీ వోటర్' సర్వేపై మంగళవారం రాత్రి 'టైమ్స్ నౌ' నిర్వహించిన చర్చలో చంద్రబాబు ఫోన్ ద్వారా పాల్గొన్నారు.

'గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా అదే చేయనున్నారా? ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారా?' అని ప్రశ్నించగా... 'ఔను! ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని చంద్రబాబు తెలిపారు. "గతంలో మేం నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటములను సమర్థంగా నిర్వహించాం. అన్ని పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర అవుతుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోనూ మాదే అధికారం'' అని చంద్రబాబు చెప్పారు.

జాతీయ స్థాయిలో 1996, 1998 నాటి పరిస్థితులు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. జగన్ పార్టీకి 26 నుంచి 30 సీట్లు వస్తాయని గత సర్వేలు చెప్పాయని... తన పాదయాత్రతో పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు 12 సీట్లే వస్తున్నాయని సర్వేలో తేలిందని బాబు పేర్కొన్నారు. "2700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. లక్షల మంది ప్రజలను కలిశాను. వారి సమస్యలను వింటున్నా'' అని చంద్రబాబు తెలిపారు. జాతీయ నాయకులకంటే ప్రాంతీయ పార్టీల నేతలే నయమని తెలిపారు.

కూటమి కడతాం.. పీఠం కొడతాం....రాష్ట్రంలోనూ మాదే అధికారం

ఖానాపూర్: తెలుగుదేశం పార్టీ అ«ధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చి వెళ్లినా జిల్లా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్, ట్రైబల్ వెల్ఫేర్ వైద్య శాలలో ఖాళీలు ఉన్నప్పటికీ నేటికీ భర్తి చేయడం లేదని, జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఉన్నా ఎలాంటి పనులు చేయడం లేదని ఆరోపించారు.

శ్మశాన వాటికకు నిధులు ఖానాపూర్ పట్టణంలోని గోదావరి నది తీరంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని హిందూ ఉత్సవ కమిటీ నా యకులు అల్లాడి వెంకటేశ్వర్లు, భవాని నర్సయ్య, నాయిని లక్ష్మణ్ ఎంపీ రాథోడ్ రమేష్‌తో వినతి పత్రం సమర్పించి విన్నవించారు. ఎంపీ మాట్లాడుతూ శ్మశాన వాటిక కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీ పరామర్శ ఖానాపూర్ మండల కేంద్రంలో చనిపోయిన బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించి వారికి రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎలాం టి సమస్య ఉన్న తమతో చెప్పుకోవాలని సూచించారు.

ఎంపీ వెంట మాజీ జడ్పీటీసీ రామునాయక్, మాజీ మం డల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, అధికార ప్రతినిధి డా. చాంద్‌పాషా, సహకార సంఘం చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, నాయకులు రాజ్‌గంగన్న, ప్రదీప్, రాజన్న, రాజేంధర్, నయీం, షబ్బీర్ పాషా, సలీమ్‌ఖాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

'టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యం'

నిర్మల్: ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో నూకలు చెల్లే కాలం వస్తుందని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్‌ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికితోడు విద్యు త్ చార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్డుకీడ్చిందన్నారు. జిల్లాలోని వివిధ ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం ఇంత వరకు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గండ్రత్ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లోలం శ్యామ్‌సుందర్, రాష్ట్ర రైతు కార్యదర్శి కొరిపెల్లి భూషణ్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆకోజి కిషన్, నాయకులు పూదరి రాజేశ్వర్, పూదరి నరహరి, నాయకులు ముజ్గి భాస్కర్, చెనిగారపు చిన్నయ్య, తునికి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

'ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కాంగ్రెస్'

ఉట్నూర్: గ్రామీణ ప్రాంతాల ప్రజలు మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ ఆరోపించారు. సోమవా రం స్థానిక ఎంపీ నివాసంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పవార్ భీంరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సందర్భంగా ఆయనను శాలువ కప్పి ఆహ్వానించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మంచిర్యాల పర్యటన నిర్వహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ నెల 26న నిర్మల్ పర్యటనకు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి ప్రజల మనిషిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.

మంచిర్యాలలో వేదికపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై దురుసుగా మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రవర్తన ఆక్షేపనీయమన్నారు. అవినీతి ఊబిలో కూరుకపోయి నేరారోపణలు ఎదుర్కొంటున్న క్యాబినెట్‌లోని మంత్రులను కాపాడుకోనే చర్యలకు సీఎం పూనుకోవడం సరైంది కాదన్నారు. జిల్లాకు కేటాయించిన నిధులలో 90 శాతం నిధులు ఖర్చు కాక మురిగిపోతున్నాయని ఆరోపించారు. అటవీ శాఖ అధికారులు అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించాలని పేర్కొంటూ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని ఇందులో భాగంగా మూడు వేల సంతకాలు సేకరించామని, సంతకాల సేకరణ ముగిసిన వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రజల తరపున నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం కోసం విడుదలైన నిధులు జిల్లా అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని అవసరం లేకుండానే నాసిరకం పనిముట్లు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశామన్నారు. అదే మాదిరి జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య సిబ్బంది లేకున్న చెత్తా సైకిల్‌లను కొనుగోలు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈ విషయంలో కూడ విచారణకు డిమాం డ్ చేస్తున్నామని తెలిపారు.

సీఎం పర్యటనలతో ఒరిగిందేమీ లేదు


గుంటూరు: తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీని పూర్తిస్థాయిలో విస్తరించారు. మొత్తం 145 మంది కార్యకర్తలకు జిల్లా కమిటీలో చోటు కల్పించి జం బో కార్యవర్గాన్ని రూపొందించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం రాత్రి కమిటీని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రచార కార్యదర్శిగా చిట్టాబత్తిన చిట్టిబాబును నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.

పుల్లారావు అధ్యక్షత వహించే జిల్లా కమిటీకి ఉపాధ్యక్షులుగా
కొల్లా వీరయ్యచౌదరీ, పొట్లూరి సైదారావు, వట్టికూటి హర్షవర్థన్, పూనాటి రమేష్, మండవ తాతాజీ, మస్తాన్‌షరీఫ్, చల్లా పుల్లారావు, నాగోతు శౌర య్య, దున్నా జయప్రద, మానుకొండ శివప్రసాద్, తానికొండ దయబాబు, కొట్టా కిరణ్‌కుమార్‌రావు, యా గంటి మల్లికార్జునరావు, షేక్ కరీముల్లా, దారపనేని నరేంద్రబాబు, వేముల తిరుమలకుమార్, ఎస్ఎస్‌పీ జాదా, పాకనాటి జాదా, పాకనాటి సుబ్బారెడ్డి, చంద్రగిరి ఏడుకొండలు, తమ్మా శివారెడ్డి, చిలకా పెదబాబు, కొర్రపాటి నాగేశ్వరరావు, వీరంగి రంగారావు నియమితులయ్యారు.

* అధికార ప్రతినిధులుగా షేక్ లాల్‌వజీర్, దామచర్ల శ్రీనివాసరావు, కొల్లి ఆంజనేయులు, వల్లూరి సూరిబాబును నియమించారు.

* కార్యనిర్వాహక కార్యదర్శులుగా కంచర్ల శివరామయ్య, కంకిపాటి నరసింహామూర్తి, వీరమాచినేని వెంకటేశ్వర్లు, అత్తలూరి బాలకృష్ణ, కందిమళ్ల రఘురామారావు, నందిగం అశీర్వాదం, పొన్నెకంటి రామారావు, మొందేడు రాయప్పరెడ్డి, పాములపాటి శివన్నారాయణ, మాదల వెంకటేశ్వర్లు, అక్కెనపల్లి బాలయ్య, వేముల వినోద్‌ర్డె, పోపూరి విజయలక్ష్మి, కొక్కిరాల శ్రీనివాసరావు, కడియాల రమేష్, సిరిపురం వెంకటశ్రీధర్, జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, గోగినేని వాసు, కొల్లి లక్ష్మయ్యచౌదరీ, సంకా బాలాజీగుప్తా, వర్ల రత్నం, మొక్కపాటి రామచంద్రరావు, ఎస్‌కే రహంతుల్లా, తాటి శంకర్, ఉప్పాల రాములు, బొల్లా జిన్నుబాబు, అరికట్ల వాసుదేవరెడ్డి, లగడపాటి వెంకటరావు, పిన్నిబోయిన ఆంజనేయులు, జీ వీ నాగేశ్వరరావును నియమించారు.

* కార్యదర్శులుగా నల్లమోతు పాపారావు, బొంతా సాంబశివరావు, పెద్దింటి వెంకటేశ్వర్లు, గోళ్ల శ్రీనివాసరావు, చుండూరు మురళీకృష్ణ, జాగర్లమూడి శ్రీనివాసరావు, కొత్తూరి వెంకట్, బత్తిన శ్రీనివాసరావు, తాడివాక సుబ్బారావు, చల్లా వెంగళరెడ్డి, మాలపాటి రత్నాకర్, బుర్రి ఏడుకొండలు, వంకాయలపాటి వీరనారాయణ, యరగళ్ల శ్రీనివాసరావు, కొమ్మినేని సత్యన్నారాయణ, వేజండ్ల శివప్రసాద్, తాతా లీలావరప్రసాద్, షేక్ షబ్బీర్ అహ్మద్, బీమా లీలాకృష్ణ, కొల్లూరు పెద సాంబయ్య, కంచర్ల అమృతరాజు, కాటూరి సాంబశివరావు, నూతలపాటి వెంకటశివరావు, కరిముల్లా, మద్దూరి వీరారెడ్డి, నాగభైరు ఆంజనేయులు, షేక్ సుభాని, దివ్వె కోటేశ్వరరావు, కొల్లి రాఘవరెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మునగపాటి రామచంద్రరావు, వాకా మంగారావు, మున్నంగి శేషయ్య, గడ్డిపాటి రాంబాబు, మన్నెం మార్కండేయులు, ఓట్ల శ్రీమన్నారాయణ, పూలముట్ల ప్రేమ్‌కుమార్, జీ వీ నాగేశ్వరరావు, వెనిగండ్ల బసవయ్య, దామా మహేష్, వల్లంశెట్టి వీరయ్య, బుర్రి ఏడుకొండలు, సలజాల సదాశివరావు, దర్శి భాస్కరరావు, కూనం బ్రహ్మారెడ్డి, వెలినేని శ్రీనివాసరావు, ముండ్రు హన్మంతరావు, ప్రతి పూర్ణచంద్రరావు, కొండ్రగంట రంగారావు, కొక్కిలిగడ్డ మీరాసాహెబ్, షేక్ పెద కరీముల్లాను నియమించారు.

* కార్యవర్గ సభ్యులుగా షేక్ సిలార్, మైల రాజు, గొట్టిముక్కల సుజాత, మున్నంగి శేఖర్, పప్పుల దేవదాసు, మైనం లక్ష్మీనారాయణ, జే మృత్యుంజయుడు, తొమ్మండ్రు వెంకటరావు, శేషం ఏడుకొండలు, షేక్ బాబర్, కొక్కిలిగడ్డ మీరాసాహెబ్, షేక్ ఫరూక్ అహ్మద్, మాదల శ్రీనివాసరావు, ఇమడాబత్తిన శివరామకృష్ణ, కట్టా శ్రీనివాసరావు, సగ్గెల రూబెన్, వేల్పుల అంకారావు, కావేటి సాంబ్రాజ్యం, వీరవల్లి మురళీ, షేక్ అబ్దుల్ ఖలీల్, జల్లేల ఏడుకొండలు, అనంతరాములు, చిట్టిపల్లి యలమంద, బృంగా లింగయ్య, బాలశౌరీ, షేక్ మన్నన్‌షరీఫ్, మువ్వా చంద్రశేఖర్, ఓర్సు ఏడుకొండలు, పిల్లి హరిబాబు, సెగ్గెం వెంకటేశ్వరరావు, కొబ్బరి సుబ్బారావు, సౌదాగర్ జానీబాషా, చేకూరి సాంబశివరావును నియమించారు.

టీడీపీ జిల్లా కమిటీ ప్రకటన

నల్లగొండ టౌన్ : రాష్ట్రంలో సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన తెలుగుదేశంపార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క కుంభకోణం లేకుండా చంద్రబాబు సమర్థవంతమైన పాలన అందించారన్నారు.

పార్టీ లో చేరిన వారిలో వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు సాయిచరణ్, రాజశేఖర్, శివ, చందు, గోపి, కిషన్, నగేష్, నేట్లు, నవదీప్, కిరణ్ న్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, బొర్రా సుధాకర్, వంగాల సహదేవ్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, పిల్లి రామరాజు, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఆకునూరి పురుషోత్తం, మేడి శంకర్, కృష్ణారెడ్డి, మల్లేష్, రాంనర్సింహారెడ్డి, కంచర్ల శంకర్‌గౌడ్, మొబిన్, అలుగుబెల్లి కరుణాకర్‌రెడ్డి, జెర్రిపోతుల సతీష్‌గౌడ్, కొండా జానిగౌడ్, రాజేష్‌గౌడ్, మార్గం ఉపేందర్, సందీప్‌రెడ్డి, భరతసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశంలోనే సుస్థిర పాలన

(విజయవాడ) చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ వేదిక ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్నకు సీనియర్ నాయకులు అప్పగించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మేరకు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు పాదయాత్ర ఇన్‌చార్జి గరికపాటి మోహనరావులు ఆదివారం మధ్యాహ్నం ఫోన్‌చేసి చెప్పారని బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడలో ఫ్లై ఓవర్ ఉద్యమాలకు వినూత్న వేదికలు ఏర్పాటు చేసిన దానిని దృష్టిలో పెట్టుకునే విశాఖలో నిర్వహించే బహిరంగ సభ వేదిక ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారన్నారు.

పది రోజుల ముందుగా విశాఖపట్నం వచ్చి వేదిక ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించాలని, చంద్రబాబే ఈ బాధ్యతలను అప్పగించిమని చెప్పినట్టు వారు తనకు చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. 20న చంద్రబాబు జన్మదినం కావడంతో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, 21న విశాఖ వచ్చి బహిరంగ సభ ముగిసేదాక ఉండి పర్యవేక్షిస్తానని యనమలతో చెప్పినట్టు తెలిపారు. పార్టీ అప్పగించిన వేదిక ఏర్పాట్ల బాధ్యతను దగ్గరుండి పర్యవేక్షిస్తానని బుద్దా వెంకన్న 'ఆంధ్రజ్యోతి'కి చెప్పారు.

విశాఖలో వేదిక ఏర్పాటు పర్యవేక్షణకు 'బుద్దా'కు పిలుపు

విశాఖపట్నం/నర్సీపట్నం/నాతవరం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో కొనసాగిస్తున్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రకు రెండో రోజైన సోమవారం విశేష ప్రజాదరణ లభించింది. కాళ్ల నొప్పి కారణంగా శని, ఆదివారాల్లో విశ్రాంతి తీసుకుని సోమవారం సాయంత్రం నడక ప్రారంభించిన చంద్రబాబు నాతవరం మండలం శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్‌ల మీదుగా డి.ఎర్రవరం చేరుకుని రాత్రి బస చేశారు. మార్గమధ్యంలో మహిళలు హారతులుపట్టి తిలకం దిద్దారు. పలువురు మహిళలు బాబుకు పాదాభివందనం చేశారు.

ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. పెద్దలు, పిల్లలు, రైతన్నలు చంద్రబాబును చూసి ఆయనచెప్పేది వినేందుకు ఆసక్తి చూపారు. ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన బాబు శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్లలో జరిగిన సభల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి వివరించారు.

సీఎంపై విమర్శల దూకుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం అవినీతిమయం అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్న టీడీపీ అధినేత సోమవారం నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులపై ఆరోపణలు చేయడమే కాకుండా ఎవరు నిజాయితీపరులో ప్రజల్లో తేల్చుకుందాం! రండి అంటూ సవాల్ విసిరారు. కాలునొప్పి, కండరాలనొప్పి తీవ్రంగా వున్నప్పటికీ ఆయన సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఆరోగ్యం సహకరించకపోయినా కాలునొప్పి తీవ్రంగా ఉన్నా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వాహనంపై నిలబడలేక కుర్చీపై కూర్చొని మాట్లాడుతూ పాదయాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలకోరంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలో వాస్తవాలను పక్కనపెట్టి ప్రజలను ముఖ్యమంత్రి తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతిపరులుగా మారారని, ప్రభుత్వ ఉద్యోగాలను సైతం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వైఎస్‌ను తొలిదశలోనే సోనియాగాంధీ, జగన్‌ను చిన్నప్పుడే అతని తల్లి విజయమ్మ మందలించి జాగ్రత్తపడివుంటే నేడు రాష్ట్రం అధోగతిపాలుఅయ్యేది కాదని అన్నారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగచర్చకు సిద్ధంకావాలని ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. తన పాదయాత్రను విమర్శిస్తున్న సీఎం, కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి గ్రామాల్లో సమస్యలు లేవని నిరూపించాలని, సమస్యలు లేవని ప్రజలు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ చంద్రబాబు సవాల్ చేశారు.

కాగా శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్‌ల మీదుగా డి.ఎర్రవ
రం జంక్షన్‌కు చేరుకున్న చంద్రబాబు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు, రైతులు, మహిళలు, చేతివృత్తులు, కులవృత్తుల వారు, డ్వాక్రా సంఘాల మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, మీ సమస్యలన్నింటినీ తీరుస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో డి.ఎర్రవరం చేరుకున్న ఆయన జిల్లాలో రెండోరోజు పాదయాత్రను ముగించారు.

అంతకు ముందు ఆయన తూర్పుగోదావరి జిల్లా తుని, అనపర్తి, విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజవకర్గాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రన్నకు జేజేలు


విశాఖపట్నం: బినామీ పేర్లతో కాంగ్రెస్ పెద్దలు లాటరైట్, బాక్సైట్ వంటి ఖనిజాలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. నాతవరం మండలం తాండవ జంక్షన్‌లో జరిగిన భారీ సభలో సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌తోపాటు నాతవరం మండలంలో లాటరైట్ ఖనిజాన్ని బినామీపేర్లతో లైసెన్స్‌లు పొందేందుకు కాంగ్రెస్ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు.

కేవలం బెల్టుషాపుల్లో పనిచేసేవారినే ఆదర్శ రైతులుగా నియమించారని, ఫలితంగా రైతులకు ఎటువంటి వ్యవసాయ సూచనలు అందడంలేదన్నారు. జీడిపరిశ్రమ ఆధారంగా పనిచేస్తున్న కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఒకప్పుడు లక్షాధికారులుగా మారిన డ్వాక్రా మహిళలను బిక్షాధికారులుగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ ఉచితంగా

నేడు బాబు పాదయాత్ర విశేషాలు చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితిని మరోసారి పరీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు డాక్టర్లు బృందం మంగళవారం రానున్నది. సోమవారం రాత్రి బసచేసిన డి.ఎర్రవరం బీఈడీ కళాశాలలో డాక్టర్లు చంద్రబాబును పరీక్షించి పాదయాత్రపై సూచనలు చేసే అవకాశం ఉంది. కాగా మంగళవారం పాడేరు నియోజకవర్గ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలు నుంచి డి.ఎర్రవరం నుంచి ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారం కొంతమేర కాళ్లు బాధించినప్పటికీ సుమారు ఆరు కిలోమీటర్లు నడక పూర్తి చేసిన చంద్రబాబు, మంగళవారం పదికిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయాల్సి ఉంది.
సైకిళ్లు అందజేస్తామన్నారు. డబ్బు తిని బలిసిన కాంగ్రెస్ పార్టీ, ముందుకు వెళ్తే కుమ్మడం, వెనక్కి వస్తే తన్నడం చేస్తున్నదన్నారు.

ఖనిజాలను దోచుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు

హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో టీడీపీ ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌యాదవ్, రావుల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. తమ నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేతలు మంత్రికి వినతి చేశారు.

మంత్రి జానారెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయకుండా అవినీతి రహిత పాలన అంటే ప్రజలు సహించరు.మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ మీరు ప్రవేశ పెట్టిన పథకాలు, ఇందిర్మ బాటలా కాకుండా ఇందిరమ్మ నరక బాటగా ,ఇందిరమ్మ హస్తంలా కాకుండా ఇందిర్మ భస్మాసుర హస్తంగా మారాయి అని ఆరోపించారు.

చంద్రబాబును వాకింగ్ ఫ్రెండ్ అంటూ సీఎం వాఖ్యానించడం సరికాదు అని ఆయన అన్నారు.హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పై సీబీఐ చార్జ్‌షీట్ వేసిన మంత్రి పదవి నుంచి తొలగించరా అని ముద్దుకృష్ణమనాయుడు విరుచుకుపడ్డారు.

సీఎంపై గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపాటు