June 11, 2013

బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నిర్మించి స్థానిక గిరిజనులకే అందులో ఉద్యోగావకా శాలు కల్పించాలని విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు గన్‌పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పోరాట ఫలితంగానే బయ్యారం గనులకు రక్షణ స్టీల్స్‌ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. బయ్యారం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తోందని విమర్శించారు. బయ్యా రం నుంచి ఇనుప ఖనిజం తరలించే యత్నా లను తమ పార్టీ సహించదని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ టీ. ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ధనసరి అనసూయ, సత్యవతి రాథోడ్‌తో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు ధర్నాలో పాల్గొనడం విశేషం. య్యారంలోనే ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామన్న హామీతో శాసనసభలో ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయాలని తెలుగుదేశం శాసనసభా పక్షం మంగళవారం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం నోటి మాటగా చెప్పే వాటికి, ప్రభుత్వ ఉత్తర్వుకు పొంతన కుదరడం లేదని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ధనసరి అనసూయ, సత్యవతి రాథోడ్‌, సీతక్క తదితరులు టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి ఒప్పందం కుదరక ముందే వైఎస్‌ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు చెందిన సంస్థ 500 కోట్ల రూపాయల విలువైన ముడి ఇనుమును కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు తరలించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. తాము ఆ వాహనాలను పట్టుకొని సీజ్‌ చేయిస్తే వైఎస్‌ విడిపించారని చెప్పారు. గడచిన 2009 ఆగస్టు నాలుగో తేదీన బయ్యారం అంశంపై శాసనసభలో ప్రస్తావించా మన్నారు. తాము అప్పటి నుంచి నిరంతరం చేసిన పోరాట ఫలితంగా 2010 డిసెంబర్‌లో ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుందని చెప్పారు. తెలంగాణ ఆస్తుల పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసన నిల్చుని పోరాడిందన్నారు. సంవత్సరం పైగా తాము పోరు సల్పిన కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మెదలకుండా ఉందన్నారు. అదే విధంగా ఓబుళాపురం మైన్స్‌ విషయంలో ఒక్కసారైనా టీఆర్‌ఎస్‌ నోరు విప్పిందా? అని ప్రశ్నించారు. పైగా ఓబుళాపురంలో అంతా బాగానే ఉందని కితాబిచ్చింది టీఆర్‌ఎస్‌ అని విరుచుకుపడ్డారు.

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ:చంద్రబాబు

బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు, బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు ఉదయం గన్‌పార్క్‌లో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయకత్వంలో టిడిపి ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి గిరిజనులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో బయ్యారంపై టిఆర్‌ఎస్ ఆందోళన జరుపుతోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు టిఆర్‌ఎస్ గతంలో ప్రకటించింది. దీంతో బయ్యారం అంశంపై టిడిపి సైతం రంగంలోకి దిగింది. నిజానికి గతంలో టిడిపి అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి బయ్యారంలో ఉక్కు లేదు తుక్కు లేదు, కిరణ్ కుమార్‌రెడ్డి, కెసిఆర్ కలిసి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అయితే అనంతరం టిడిపి తెలంగాణ నాయకులు బయ్యారం సందర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో బయ్యారంపై చర్చకు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఉదయం గన్‌పార్క్‌లో చంద్రబాబు నాయకత్వంలో ధర్నా చేశారు. సభ వాయిదా పడిన తరువాత టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు మాట్లాడుతూ బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అని అన్నారు. బయ్యారం ఉక్కును వైఎస్ తన అల్లుడికి కేటాయిస్తే 2008 నుంచి తామే ఉద్యమిస్తున్నామని తెలిపారు. అయితే బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదం నుంచి గిరిజనుల హక్కు నినాదంగా మారడం గురించి విలేఖరులు ప్రశ్నించగా, మొత్తం తెలంగాణ వారు అక్కడికి వస్తే ఎలా అక్కడి గిరిజనులకు ఉద్యోగాలు లభించాలి కదా అందుకే బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అనే నినాదంతో ఉద్యమిస్తున్నట్టు టిడిపి తెలిపింది.
సొంతంగా ఆలోచించండి
తెలంగాణలో టిఆర్‌ఎస్ ఒక కార్యక్రమాన్ని చేపడితే మీరు దాన్ని అనుసరిస్తున్నారు, అలా కాకుండా మీరూ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టండి అని చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నాయకులకు సూచించారు. మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుతో మరికొందరు హాజరయ్యారు. ఈ నెల 14న చలో అసెంబ్లీకి తెలంగాణ జెఎసి పిలుపు ఇవ్వగా, దీనికి టిడిపిని ఆహ్వానించలేదు, ఏం చేయాలి అని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో చర్చించారు. కార్యక్రమానికి దూరంగా ఉండడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. జెఎసి ఆహ్వానించక పోయినా, మా మద్దతు కోరక పోయినా మేం మద్దతు ఇస్తున్నాం అని బుధవారం ప్రకటించాలని నిర్ణయించారు.
ప్రతి రోజూ ధర్నా
అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ఏదో ఒక అంశంపై రోజూ ధర్నా జరపాలని టిడిపి నిర్ణయించింది. ఇందులోభాగంగానే మంగళవారం బయ్యారం గనులపై ధర్నా జరిపిన టిడిపి, బుధవారం రైతుల సమస్యలపై ధర్నా జరపనుంది. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం కోసం టిఆర్‌ఎస్ పట్టుపడుతూ ఉండడం వల్ల టిడిపికి ఎలాంటి మైలేజీ లభించడం లేదని, ఇలాంటి పరిస్థితిలో ఇతర సమస్యలపై గన్‌పార్క్ వద్ద ప్రతి రోజు ఆందోళన చేయాలని టిడిపి నిర్ణయించింది.
ఎపిపిఎస్‌సిని ప్రక్షాళన చేయాలి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి)ను ప్రక్షాళన చేయాలని టిడిపి ఎమ్మెల్యేలు పల్లె రఘునాధ రెడ్డి, జైపాల్ యాదవ్, లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఉన్నత విద్యావంతులను సభ్యులుగా నియమించాల్సి ఉండగా, రాజకీయ బ్రోకర్లను నియమించారని విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించాలని కోరుతూ రాష్టప్రతికి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు వినతిపత్రం అందజేస్తామని, రాష్టప్రతి నుంచి సరైన స్పందన లేకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు.

బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు

హైదరాబాద్ : రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ టీడీపీ బుధవారం గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాలు అందటం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 23వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు.

రైతు సమస్యలపై రాజీలేని పోరు: బాబు


హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీకి చెందిన నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర రావు, అశోక గజపతి రాజుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. తుమ్మల, అశోకలు ఎదురైనప్పుడు నాగం వారితో.. తనను టిడిపి నుండి సస్పెండ్ చేసి బయటకు గెంటివేశారని ఆయన అన్నారు. దానికి వారు స్పందించారు. నాగం జనార్ధన్ వంటి నేతలను తాము బయటకు పంపివేయగలమా? అని ప్రశ్నించారు. నాగం బిజెపిలో చేరి అద్వానీనే బయటకు పంపించారు.. అలాంటి వ్యక్తిని ఎవరైనా టిడిపి నుండి బయటకు పంపగలరా? అని చమత్కరించారు. దీంతో వారి మధ్య కాసేపు నవ్వులు విరబూశాయి.

'నాగం వెళ్లి, అద్వానీని పంపించారు'

హైదరాబాద్‌ : టీజేఏసీ చలో అసెంబ్లీకి టీటీడీపీ ఫోరం మద్దతు ఇస్తుందని ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బ్రదర్‌ అనిల్‌కు బయ్యారం గనులు కేటాయించినప్పుడు టీఆర్‌ఎస్‌ నోరు మెదపలేదని ఆయన ఆరోపించారు. తమ ఉద్యమ ఫలితాంగానే రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపును రద్దు చేశారని ఆయన చెప్పారు.

చలో అసెంబ్లీకి టీటీడీపీ మద్దతు

టిడిపి బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2010లోనే చెప్పారని టిడిపి నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెరాస రాజకీయ లబ్ధి కోసం బయ్యారంను ఉపయోగించుకుంటోందన్నారు. బయ్యారం ఉక్కును విశాఖ తరలించవద్దని విశాఖ గడ్డపైనే బాబు చెప్పారని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టిఆర్ఎస్ వైయస్ హయాంలో కళ్లు మూసుకొని ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. బయ్యారం ఉక్కును తరలించవద్దని, అక్కడే పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్

బయ్యారంపై బాబు ఎప్పుడో చెప్పారు: రేవూరి

 అవిశ్వాస తీర్మానం ప్రజా ప్రయోజనాల రీత్యా అవసరమనుకుంటేనే పెడతాం తప్ప
కొందరి ప్యాకేజీల కోసం, ప్రయోజనాల కోసం మాత్రం కాదని చంద్రబాబు అన్నారు!

అవిశ్వాస తీర్మానం ప్రజా ప్రయోజనాల రీత్యా అవసరమనుకుంటేనే పెడతాం