February 23, 2013

అర్ధాయుష్షు అంటే వీరిదే! యాభై ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోతాయి. కుర్ర ఈడుకే ఎముకలు అరిగిపోతాయి. నడిమి వయసు రాకముందే నడుం వంగిపోతుంది. తమ అర్ధాకలిలానే, అర్ధనగ్నంగా(లుంగీతో) ఉండే ఈ మనుషులు మన మధ్యనే తిరుగుతున్నారంటే నమ్మగలమా? శ్రమశక్తులను వెచ్చించి ఊపిరి నిలుపుకొంటూ ఉండే వీరి ఉనికిని విస్మరించగలమా? భట్టిప్రోలు ప్రాంతంలో తిరుగుతుండగా, ఎదురైన మనుషులూ, వాళ్లు వినిపించిన చేనేత వెతలూ విన్నప్పుడు కలిగిన భావమిది.

ఈ ప్రాంతంలోని నేతన్నలంతా ఒక సమావేశం పెట్టుకొని పిలిస్తే వెళ్లాను. చేనేత డిక్లరేషన్ ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే పాలకుల హామీలు అందని ద్రాక్షగా మారిన వైనాన్ని చెప్పుకొని వాపోయారు. చేనేతకు ఉన్న ఒకటీఅరా సంక్షేమ పథకాలూ మాస్టర్ వీవర్స్ పెరటి చెట్లుగా మారాయట. 'మా కన్నా ఉపాధి హామీ కూలీ బతుకే బెటర్‌గా ఉన్నది సార్..' అని అంటున్నప్పుడు వారి చీకటి కళ్లలో నైరాశ్యం కదలాడింది.

ఉపాధి కోసం కొందరు..ఉన్నదాన్ని నిలుపుకొనేందుకు మరికొందరు.. మొత్తంమీద యువకులంతా రోడ్డు మీదే ఉన్నారనిపించింది. సూరేపల్లిలో పంక్చర్ షాపులో పలకరించిన యువకుడు గానీ, ఆ పక్కనే ఉన్న వెల్డింగ్ షాపులో ముచ్చటించిన కుర్రాడు గానీ ఒకే గోడు వినిపించారు. "చేతులకు పని చూపకపోతే పోయారు.. కనీసం కరెంట్ అన్నా కరెక్టుగా ఇస్తే అదే మాకు పది వేలు.. లేదంటే మేమంతా రోడ్డున పడాల్సిందే సార్'' అని పంక్చర్ వేస్తూనే వెంకటేశ్వరరావు కళ్లు వత్తుకున్నాడు. పంక్చర్ వేయడం కాదు.. 'సర్కారు' చక్రాన్నే మార్చేయాలేమో!

పంక్చర్ కాదు.. చక్రమే మార్చాలి

చేనేతకు వైఎస్ చెల్లుచీటీ!
నేతలన్నల ఆత్మీయ భేటీలో చంద్రబాబు

చేనేతలకు రూ. 312 కోట్ల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తప్పారని.. ఆయన హయాంలో చేనేతకు చెల్లుచీటి ఇచ్చారంటూ చంద్రబాబు విమర్శించారు. 50 ఏళ్లు దాటిన వారికి రూ.1000 పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం, పల్లెకోన, కారుమూరు, వరికుటేరు పాలెం క్రాస్ వరకు 16.5 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చేనేత వృత్తి దెబ్బతినడానికి ప్రపంచీకరణ ఒక కారణమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే నేత కార్మికులను చూడటం మరో కారణమన్నారు.

చేనేత వర్గాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను తాము అందిస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క ఎంపీని మాత్రమే చేసిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే, విద్యుత్‌లో రాయితీ ఇస్తామని, చనిపోయినవారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్‌కు తోడు గార్మెంట్ మిల్లులను ఏర్పాటు చేసి చేనేతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మి కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు. తన అజెండాలో చేనేతలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

సీఎం, పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగేవి కావని విమర్శించారు. ప్రభుత్వం పటిష్ఠం గా లేకపోయినా, పరిపాలనా అనుభవం లేని సీఎం ఉన్నా ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయని చెప్పారు. కాగా, బ్రాహ్మణులను రాజకీయం గా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకొంటానని.. ఆ సామాజికవర్గం నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

హైదరాబాద్ నుంచి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ నేత వేమూరి ఆనంద్‌సూర్య నేతృత్వం లో సంస్థ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం సాయం త్రం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లికి వచ్చారు. చంద్రబాబు వారితో ముఖాముఖీగా సమస్యలపై చర్చించారు. టికెట్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే అంతకంటే ముందు మీరు మంచి నెట్‌వర్కును ఏర్పాటు చేసుకొని నాయకులుగా ఎదగాలని సూచించారు. స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు ఇచ్చి, వాటిల్లో పురోగతి ఆధారంగా ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

రుణమాఫీపై దొంగ మాటలు.. హామీలన్నీ హుళక్కే

స్థానిక ఎన్నికల పై గురి

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన తనయుడు లోకేష్ 'స్థానికఎన్నికల' బాధ్యతలు స్వీకరించనున్నారా? గాడి తప్పిన టీడీపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారా? శుక్రవారం కుప్పంలో ఆ యన జరిపిన 'ప్రైవేటు' పర్యటన ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే ఇస్తున్నది. చి త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఓ కార్యకర్త ఇంట్లో జరిగిన వివాహానికి లోకేష్ శుక్రవారం హాజరయ్యారు.

తాను మళ్లీ వారంరోజుల్లో కుప్పంలో పర్యటిస్తానని, అప్పుడు కార్యకర్తలతో తీరిగ్గా మాట్లాడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్థానిక నాయకత్వంతో మాత్రం అంటీముట్టనట్లే వ్యవహరించారు. మందలింపు ధోరణిలో హెచ్చరికలూ చేశారు. డీసీఎంఎస్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఆదేశాలను ఇక్కడి నాయకులు ధిక్కరించడమే దీనికి కారణం. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ సహకారంతో వచ్చే డీసీఎంఎస్ పదవులు మనకొద్దని, ఆ ఎన్నికను బహిష్కరించాలని బాబు ఆదేశించారు. అయినా, చంద్రబాబు ఆదేశాల్ని ధిక్కరించి కుప్పం నియోజకవర్గానికే చెందిన డైరెక్టర్లు శ్యామరాజు, వరలక్ష్మమ్మ కాంగ్రెస్ సహకారంతో డీసీఎంస్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పొందారు. దీంతో పర్యటన ఆద్యంతం లోకేష్ స్థానిక నేతలతో ఆగ్రహంతో ఉన్నారు. 'ఇక్కడ పార్టీ ఎటువెళ్తోంది. మీరింతమంది ఉండి ఏం చేస్తున్నా రు? మూడునెలల కోసారి నాన్న పర్యటిస్తున్నా, ఈ ఐక్యతా లోపమేమిటి?' అంటూ ప్రశ్నించారు.

నాయకులతో అసహనంగా ఉన్న ఆయన.. తనను పలకరించిన సామాన్యులతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో 'నాన్నెలా ఉన్నారప్పా?' అని అడిగిన వృద్ధురాలికి.. కాళ్లనొప్పులతో ఉన్నారని, పాదయాత్ర పూర్తయిన తర్వాత మీ దగ్గరికి వస్తారని చెప్పారు. ప్రచారరథం ఎక్కి ముందుకు సాగాలని కోరిన స్థానిక నా యకులపై మాత్రం అసహనాన్ని ప్రదర్శించారు. తానొచ్చింది పెళ్లికే కానీ, పార్టీ కార్యక్రమాల కోసం కాదని మందలించారు. దీంతో స్థానిక నాయకులెవరూ ఆయన దరి చేరలేకపోయారు. మళ్లీ మార్చి నెల 7, 8, 9 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటించనున్నారు.

సింగిల్ విండో ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లతో వైసీపీ తన ఉనికి చాటింది. పార్టీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు బాబు ఆదేశాలను ధిక్కరించిన క్రమంలో.. నియోజకవర్గాన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితులు కట్టుతప్పుతాయని చంద్రబాబు భావించినట్టున్నారు. అందుకనే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని గాడినపెట్టి.. సంపూర్ణ విజయం చేజిక్కించుకునేందుకు తనయుడు లోకేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి.

కుప్పం సైకిల్‌పై లోకేష్ సవారీ?

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర 144వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం జిల్లాలోని భట్టిప్రోలు నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు.

144వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

'ప్రజల ప్రాణాలన్నా, ఆస్తులన్నా ఈ ప్రభుత్వానికి లెక్క లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్లలు సురక్షితంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ప్రజల్లో అభద్రతాభావం నెలకొన్నది. ప్రజలకు మాన ప్రాణాలకు రక్షణ కరువైంది. మరోవైపు సాధారణ జీవనం గడిపే పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇంకా ఆ పార్టీకి ఎలా ఓటేస్తారు?' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని సందర్శించేందుకు శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన చంద్రబాబు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు వేమూరు నియోజకవర్గంలోని దోనెపూడికి చేరుకొని పాదయాత్రను పునఃప్రారంభించారు.

దోనెపూడిలో లక్ష్ష్మీతిరుపతమ్మ దేవస్థానంలో పురోహితుల దీవెనలు అందుకొన్న చంద్రబాబు పాదయాత్రను పునఃప్రారంభించి ముందుకు కదిలారు. భట్టిప్రోలు శివారు వరకు దారి పొడవునా ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూశారు. అడుగడుగునా మహిళలు హారుతులిచ్చి స్వాగతం పలికారు. వెల్లటూరులో చంద్రబాబుకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కనకతప్పెట్లు, మేళతాళాలతో సందడి చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ మహిళలతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ చంద్రబాబు ముందుకు సాగారు. కష్టాలు ఏకరువు పెట్టిన మహిళలకు తానున్నానని భరోసా ఇచ్చారు.

ఉద్రేకానికి లోనైన చంద్రబాబు హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్ బాంబుపేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులు పడుతోన్న బాధలు చూసిన చంద్రబాబు ఒకింత ఉద్వేగం, ఉద్రేకానికి లోనయ్యారు. మృతుల బంధువుల ఆర్తనాదాలు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రజిత అనే ఎంబీఏ విద్యార్థి ఇంటికెళుతుంటే బాంబుపేలి కాలును కోల్పోయి జీవితాంతం వికలాంగురాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరో బీటెక్ విద్యార్థి కాలు పూర్తిగా నుజ్జు అయింది. తీవ్రంగా గాయపడిన వారు బతికే పరిస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. పేలుళ్ల సంఘటన దారుణమని, అందరూ ఉండే రాజధాని నగరంలో రద్దీగా ఉండే సెంటర్‌లో అతి దారుణంగా పేల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పట్టులేకపోయినా, పరిపాలన అనుభవం లేని వ్యక్తి సీఎంగా ఉన్నా ఇలాంటివే జరుగుతాయని పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్‌పై మండిపడ్డారు.

కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనను చంద్రబాబు తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. ప్రజాపాలన అంటే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి వారి ఆదాయం పెంచాలి. అలాంటిది ఈ ప్రభుత్వం ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఒకవైపు అన్నిరకాల సరుకుల ధరలు ఆకాశాన్నంటిస్తూ మరోవైపు ప్రజలకు రక్షణ కూడా లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ట్యూబులైట్ మాడిపోయి ఎలాగైతే మిణుకుమిణుకుమంటోందో అలానే ఈ ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. దోనెపూడిలో పలువురు మహిళలు చంద్రబాబుతో సంభాషించారు.

డ్వాక్రా మహిళ: సార్ పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అని చెప్పడమే తప్పా మేము బ్యాంకు నుంచి రుణం తీసుకొంటే ప్రతి నెలా రూ. లక్షకు వెయ్యి చెల్లించాల్సి వస్తోంది. అంత మొత్తం మేమెలా సంపాదించాలి. ఇప్పటివరకు మేము చెల్లించిన వడ్డీని తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు: మీరు నన్ను మరిచిపోయి కష్టాలు కొని తెచ్చుకొన్నారు. డ్వాక్రా సంఘాలను నేనే స్థాపించాను. మళ్లీ అధికారంలోకి వస్తే మీరు చెల్లించిన వడ్డీ మొత్తం తిరిగి మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తాను.గృహిణి: చంద్రబాబుగారు... బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, కూరగాయల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. మేమెలా బతకాలి. మళ్లీ మీరొస్తేనే మా కష్టాలు తీరతాయని మేము ఆశిస్తున్నాం.

చంద్రబాబు: నేను ఆ రోజున రైతుబజార్లు పెట్టి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాను. ఈ రోజున బియ్యం రూ. 50, నూనె రూ. 100, పప్పు రూ. 80 అయ్యాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటాను.వలస కూలీ: సార్ మేము దోనెపూడికి వచ్చి 16 ఏళ్లు అవుతుంది. బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డాము. మాకు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు ఉన్నాయి. అయినా మాకు ఇంటి స్థలం ఇవ్వడం లేదు.చంద్రబాబు: మీకు ఇంటి జాగానే కాదు. రూ. లక్షన్నర పెట్టి స్వంత ఇల్లు కూడా కట్టించి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది.

రైతు: వ్యవసాయం చేయలేకపోతున్నాం. ఎరువులు, పురుగుమందుల ధరలు 300 రెట్లు పెరిగిపోయాయి. ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కరువు, విపత్తులు వస్తే ఆదుకోవడం లేదు. కనీసం మీరైనా అధికారంలోకి వచ్చి మా గురించి పట్టించుకోండి.చంద్రబాబు: వ్యవసాయం లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకొంటాను. రైతుకు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తాను. విపత్తులు వస్తే రూ. 10 వేల నష్టపరిహారం లేదంటే బీమా మీ చేతికందేలా చేసి వ్యవసాయంపై భరోసా కల్పిస్తాను.

ఒక తడి సాగునీరు ఇప్పించే వరకు పోరాటండెల్టాలో మొక్కజొన్న, పెసర వంటి ఆరుతడి పంటలు వేశారు. కనీసం రెండు తడులు ఇస్తే రైతులు గట్టెక్కుతారు. ఈ ప్రభుత్వం అది కూడా చేయడం లేదు. రైతుల తరపున మహాధర్నాకు దిగి పోరాటం చేయాలని అనుకొన్నాను. అయితే అకాలవర్షం వచ్చి పంట తడిసేలా చేసింది.

మరో తడి ఇప్పించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం మీకు అండగా నిలబడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాదయాత్రలో చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, మానుకొండ శివప్రసాద్, పానకాల వెంకటమహాలక్ష్మి, కొర్రపాటి నాగేశ్వరరావు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు నడిచారు.

అరాచక పాలన

తెలుగుజాతి ఉన్నంతకాలం వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా వుంటారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా కొల్లూరుమండలం దోనేపూడిలో శుక్రవారం ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ విగ్రహాలు భావితరాల్లో స్ఫూర్తిని నింపటం కోసం ఏ ర్పాటు చేస్తారన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తే తెలుగువారికి ఆత్మగౌరవం అన్న నినాదం గుర్తుకు వస్తుందన్నా రు. లక్షకోట్లు దోచుకుంటు న్న వ్యక్తి విగ్రహాలు చూ స్తే జైళ్ళు గుర్తుకు వస్తాయన్నారు. తాను అధికారంలోకి వస్తే గ్రామీ ణ ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తానన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేశానన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించటంతోపాటు గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దుతానన్నారు.

రైతులకు మేలు జరిగేలా స్వామినాథన్ కమిటీ సిఫారస్సులను పూర్తిస్థాయిలో అ మలు చేస్తానన్నారు. దీనివల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. తాను గతంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను అందిస్తే నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ, వ్యవసా య ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకుండా నేటి కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవసాయం పండుగ అంటూ రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. అనంతరం సభకు హాజరైన అభిమానులు, కార్యకర్తలను వారి కష్టాలు అడిగి తెలుసుకున్నా రు. అనేకమంది వారి సమస్యలను బా బు ముందు ఏకరువు పెట్టారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా బిల్లులు కట్టలేకపోతున్నామని వాపోయారు.

డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ వడ్డీ లేని రు ణాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు లక్షకు వెయ్యి రూపాయలు చొప్పున వడ్డీ వసూలు చేస్తుందని పేర్కొన్నారు. ఇలా అనేకమంది బాబుకు వారి సమస్యలు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీధర్, జియావుద్దీన్, దానబోయిన శ్రీనివాసయాదవ్, మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు, స్థా నిక నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తాడు