April 11, 2013


అనకాపల్లి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' నినాదంతో చేపట్టిన పాదయాత్ర ఈ నెల 12వ తేదీన జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం అవుతుందని, రూరల్ జిల్లా పరిధిలో 23వతేదీ సబ్బవరం మండలం కొత్తూరు జంక్షన్ వద్ద ముగుస్తుందన్నారు. చంద్రబాబు ఏ రోజు, ఏ ఏ గ్రామాల్లో పాదయాత్ర చేస్తారో ఆయన తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఈ నెల 12న నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద ప్రారంభమై ఆరున్నర గంటలకు శరభవరం, ఏడున్నర గంటలకు శృంగవరం, ఎనిమిదిన్నర గంటలకు గాంధీనగరం, తొమ్మిదిన్నర గంటలకు తాండవ జంక్షన్, పది గంటలకు డి. ఎర్రవరం జంక్షన్‌కు చేరుకుంటారు.

ఇక్కడ మదర్ థెరెసా బీఈడీ కాలేజీలో రాత్రి బస చేస్తారు. 13వ తేదీన డి.ఎర్రవరం జంక్షన్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమై ఐదుగంటలకు ములగపూడి, ఆరు గంటలకు ఎం.బెన్నవరం, ఏడు గంటలకు నర్సీపట్నం మండలం కృష్ణాపురం, తొమ్మిది గంటలకు బయపురెడ్డిపాలెం, పది గంటలకు బలిఘట్టం పెట్రోల్‌బంకు వద్దకు చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 14వ తేదీ ఆదివారం పాదయాత్ర వుండదు. 15వ తేదీన బలిఘట్టంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమై ఐదు గంటలకు నర్సీపట్నం అబీద్ సెంటర్, ఏడు గంటలకు బొడ్డేపల్లి జంక్షన్, ఎనిమిది గంటలకు సుబ్బారాయుడుపాలెం, ఎనిమిదిన్నర మాకవరంపాలెం మండలం చంద్రయ్యపాలెం, తొమ్మిది గంటలకు గంగవరం, తొమ్మిదిన్నరకు దాలింపేట, పదిగంటలకు కొండల అగ్రహారం, పదిన్నర గంటలకు నల్లమారమ్మగుడి వద్దకు చేరుకుని రాత్రికి ఇక్కడ బస చేస్తారు. 16వ తేదీన నల్లమారమ్మగుడి వద్ద పాదయాత్రను ప్రారంభించి ఐదు గంటలకు మాకవరపాలెం, ఆరు గంటలకు తామరం, ఆరున్నరకు రాచపల్లి జంక్షన్, ఏడు గంటలకు రామన్నపాలెం జంక్షన్, ఎనిమిది గంటలకు బీబీపాలెం, ఎనిమిదిన్నర గంటలకు దుంగలవానిపాలెం జంక్షన్, తొమ్మిది గంటలకు శెట్టిపాలెం, తొమ్మిదిన్నరకు రాజుపేట, పది గంటలకు కశింకోట మండలం పాతకన్నూరుపాలెం అక్కునాయుడు కర్రల డిపో వద్దకు చేరుకుని రాత్రి బస చేస్తారు. 17న అక్కునాయుడు కర్రల డిపో వద్ద నాలుగు గంటలకు బయలుదేరి నాలుగున్నర గంటలకు కన్నూరుపాలెం, ఐదున్నరకు ఆనందపురం జంక్షన్, ఆరు గంటలకు కొత్తూరు, ఏడు గంటలకు అడ్డాం జంక్షన్, 7.15 గంటలకు జి.భీమవరం, ఎనిమిదిన్నరకు అచ్చెర్ల జంక్షన్, తొమ్మిదికి బంగారయ్యపేట, పది గంటలకు తాళ్లపాలెం చేరుకుని రాత్రి బస చేస్తారు. 18న తాళ్లపాలెం నుంచి బయలుదేరి ఐదు గంటలకు అమీన్‌సాహెబ్‌పేట జంక్షన్, 5.15కు గొబ్బూరు జంక్షన్, 5.45కు నర్సింగబిల్లి, 6.15కు సోమవరం, 6.45కు సోమవరం బ్రిడ్జి, 7.15కు మునగపాక మండలం గణపర్తి, 7.30 గంటలకు చూచుకొండ, 8.45 గంటలకు ఎం.జగన్నాథపురం, పది గంటలకు జగన్నాథపురం చేరుకుని రాత్రి బస చేస్తారు. 19వ తేదీన జగన్నాథపురంలో బయలుదేరి 4.45 గంటలకు మల్లవరం జంక్షన్, ఐదు గంటలకు ఉప్పవరం, 5.45కు ఎర్రవరం, 6.15కు కొండకర్ల జంక్షన్, ఏడు గంటలకు హరిపాలెం, 7.15కు తిమ్మరాజుపేట, 8.15కు మునగపాక, 9.45 గంటలకు గంగాదేవిపేట జంక్షన్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 20వ తేదీన గంగాదేవిపేటలో బయలుదేరి 4.15 గంటలకు ఒంపోలు, 4.45కు నాగులాపల్లి, 5.15కు అనకాపల్లి బైపాస్ జంక్షన్, 5.45కు ఆర్టీసీ కాంప్లెక్స్, ఆరు గంటలకు నెహ్రూచౌక్ జంక్షన్, 6.15కు ఎన్టీఆర్ జంక్షన్, ఆరున్నరకు చిననాలుగురోడ్ల జంక్షన్, 6.45కు రింగ్‌రోడ్డు జంక్షన్, ఏడుకు పార్కు జంక్షన్, 7.15కు సుంకరమెట్ట జంక్షన్, 8.30 గంటలకు శంకరం, 8.45కు రేబాక చేరుకొని రాత్రి బస చేస్తారు. 21వ తేదీ ఆదివారం విరామం. 22వ తేదీన రేబాకలో బయలుదేరి 4.15 గంటలకు కాపుశెట్టివానిపాలెం, 4.30కు కోడూరు జంక్షన్, ఐదుకు మర్రిపాలెం, ఆరుకు సబ్బవరం మండలం బాటజంగాలపాలెం, ఆరున్నరకు సున్నంబట్టీల జం
క్షన్, ఏడు గంటలకు అసకపల్లి జంక్షన్, 8,45కు ఎరువాడ జంక్షన్, తొమ్మిదిన్నరకు సబ్బవరం జంక్షన్, పది గంటలకు జోడుగుళ్లు జంక్షన్‌కు చేరుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో రాత్రి బస చేస్తారు. 23న జోడుగుళ్లు జంక్షన్‌లో బయలుదేరి 4.15 గంటలకు సూరెడ్డిపాలెం, 4.45కు అమృతపురం, ఆరు గంటలకు అమరపిన్నివానిపాలెం, ఏడుకు పెదగొల్లలపాలెం, 7.45కు నంగినారపాడు, 8.45కు వెదుళ్లవలస, పది గంటలకు కొత్తూరు జంక్షన్ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24, 25, 26 తేదీల్లో గాజువాక నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. 27న వడ్లపూడిలో పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. దీంతో 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగుస్తుంది.

చంద్రబాబు పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు

నర్సీపట్నం టౌన్ : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, వైఎస్ తన స్వార్థరాజకీయాల కోసం విద్యుత్ వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు.

ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నదని, విద్యుత్ చార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకిస్తున్నారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌లో సోలార్ విద్యుత్‌కు కేవలం రూ.8 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. విద్యుత్ కొరతతో చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆయ్యన్న పాత్రుడు విమర్శించారు.

విద్యుత్ సంక్షోభానికి వైఎస్సే కారణం


బంట్వారం : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, విద్యుత్ సక్రమంగా సరఫరా చేయకున్నా ప్రభుత్వం విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్‌యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడప్పుడు మాత్రమే కరెంటు ఉండేది కాదని, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అప్పుడప్పుడు మాత్రమే కరెంటు ఉంటోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.విజయ్‌కుమార్, మండల టీడీపీ నాయకులు లింగయ్య, అంజిల్‌రెడ్డి, రామ్‌ప్రసాద్, శ్రీకాంత్, పాపిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, నర్సింహులు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

కరెంటు సమస్యపై టీడీపీ సంతకాల సేకరణ

ములుగు,ఏప్రిల్ 9: రైతులకు విద్యుత్ అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని టీడీపీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అ న్నారు. మంగళవారం ములుగు మం డలం వంటిమామిడిలో టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తల ధర్నాలో దయాకర్‌రావు పాల్గొని మా ట్లాడుతూ ప్రభుత్వానికి విద్యుత్‌పై ముందుచూపు లేకపోవడంతో రైతులకందరికీ కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయని ఆయన అన్నారు. రైతు ప్రభుత్వ మని చెప్పుకునే కాంగ్రెస్ అన్నదాతల కు విద్యుత్ అందించడంలో పూర్తిగా విఫల

రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశ ప్రభుత్వ హాయంలో తొమ్మిది ఏళ్లు కరువు ఏర్పడినప్పటికీని 9 గంటల క రెంటు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘన త టీడీపీకే దక్కిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశ ప్ర భుత్వ హాయంలో జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ప్రభుత్వం అవినీతిలో కూరకపోయి మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలు కూడు తింటున్నారని ఆ రోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న అవినీతి అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రాఆన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఇదేఅదునుగా టీఆర్ఎస్ పార్టీ కూడా సొంతలాభం చూసుకుని ప్రజ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే తె లంగాణ ప్రజలు కష్టాలు తీరుతాయన్నారు. రాష్ట్ర సాధన కోసం తెలుగుదే శం పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం వెం టనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియేడల వచ్చే ఎ న్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతంలో కళ్లు తెరిపించే విధం గా ప్రజలు తీర్పిస్తారని హెచ్చరించా రు. వెంటనే రైతులకు న్యాయమైన క రెంటు అందించి ఆదుకోవాల్సిన బా ధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ఆ యన డిమాండ్ చేశారు. సమావేశం లో మండల పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి గణేష్, పెంటయ్య, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశం,శేఖర్, నర్సింలు, లక్ష్మణ్‌గౌడ్, మహేష్‌యాద వ్, బాబుగౌడ్, చాకలి దశరథ, యువ త అధ్యక్షుడు కనకయ్య, అనంతరెడ్డి, నర్సింహ్మారెడ్డి, మాధవరెడ్డి, కురమ రా జయ్యతోపాటు కుమార్‌గౌడ్, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మయ్యిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి

పటాన్‌చెరు: ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి ఆరోపించారు. పెంచిన విద్యుత్‌చార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుమహిళ ఆధ్వర్యంలో బుధవారం పటాన్‌చెరులో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్‌చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి గత ఎన్నికల్లో ప్రజల వద్ద ఓట్లు పొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన వా
గ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు.

విద్యుత్ అవసరాలపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడటానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్టుబడిదారులకు ప్రతిపక్షాలు కొమ్ముకాస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దారుణమని మండిపడ్డారు. రెండువందల యూనిట్లకు పైబడి చిరు వ్యాపారులు విద్యుత్ ఉపయోగించుకుంటున్నారని... వారిని కూడా పెట్టుబడిదారులుగా గుర్తించడం ముఖ్యమంత్రికే చెల్లిందని శోభాహైమావతి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చిన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మందికార్మికులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదానికి ప్రజలను బలిచేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. మానవత్వాన్ని మరిచి ప్రభుత్వం విద్యుత్‌చార్జీలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహ జ్వాలలో ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయమన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పటాన్‌చెరు కార్పొరేటర్ సపానాదేవ్ మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌కు ఇక నూకలు చెల్లినట్టేనని హెచ్చరించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు జి.శశికళాయాదవరెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వారు కరెంటు బిల్లులను తలచుకుని ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ వస్తువు ధర పెంచలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని శశికళాయాదవ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, బక్కి వెంకటయ్య, దశరథరెడ్డి, మానిక్‌ప్రభు, సంజీవరెడ్డి, గంగుల సుధాకర్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, జీఆర్ఎల్ శ్రీనివాస్, ఎడ్ల రమేష్, ఎండీ యూనుస్, విశ్వనాథం, చంద్రకుమార్, జహంగీర్, మేరాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాకంటకంగా మారిన ప్రభుత్వం : శోభాహైమావతి


మైలవరం: రాష్ట్రంలో అసమర్థ్ధులు రాజ్యమేలుతున్నారని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరంలో మంగళవారం నాటి బంద్‌ను పర్యవేక్షించి టీడీపీ, సీపీఎం నాయకులు నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నారని ఉమా ఆరోపించారు. మరోపక్క విద్యుత్‌కోతల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నవంబర్ 15 నాటికి సాగరుజలాలు రావాల్సి ఉండగా నేటికీ అతీగతీలేదన్నారు. విద్యుత్‌చార్జీల భారాన్ని తగ్గించాలని ఆందోళనలు, బంద్‌లు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు.

రాస్తారోకోలో సీపీఎం నాయకులు పీవీ ఆంజనేయులు, జానీ, కృష్ణారెడ్డి, సాల్మన్‌రాజు, టీడీపీ నాయకులు గొల్లపూడి, వెంకటనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం రిలే దీక్షా శిబిరానికి చేరుకున్న ఉమా రిలే దీక్షాపరుల్ని పరామర్శించారు. విద్యుత్‌చార్జీలు తగ్గించాలంటూ గత 13 రోజులుగా టీడీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. మంగళవారంతో దీక్షలు ముగించినట్లు ఉమా తెలిపారు. మంగళవారం బూదేటి, వెంకయ్య, బాబూరావు, వినయ్‌కుమార్‌లు దీక్షలో పాల్గొన్నారు.

అసమర్థ ప్రభుత్వమిది: ఉమా

రాజంపేట రూరల్: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని గవర్నర్ నరసింహన్‌కు మండల పరిధిలోని శేషమాంబాపురం గ్రామస్థులు వినతిపత్రం పంపారు. బుధవారం తెలుగదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్తు చార్జీల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థికంగా భారం పెరుగుతుందని వాపోయారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని గవర్నర్‌కు పంపిన వినతిపత్రంలో కోరామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పి.జనార్థనయ్య, కార్యదర్శులువిశ్వనాథరాజు, పి.రుషికేశవయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ గవర్నర్‌కు వినతి

31 ఏళ్ల టీడీపీ చరిత్రలో పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలోనే ఉగాది ఉత్సవాలలో పాల్గొనే వారు. చంద్రబాబు ఉగాది పండుగ తుని మండలం ఎన్.సూరవరంలో జరుపుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో వున్నందున ఉగాది వేడుకలు ఇక్కడే జరుపుకుంటున్నారు. ప్రముఖ పండితులు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం ఏర్పాటుచేస్తారు. కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, చినరాజప్ప, యనమల కృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, వర్మ, పోతుల విశ్వం, మాకి నీడి శేషుకుమారి, కలగా శివరాణి తదితరులు పాల్గొంటున్నారు.

ఈ ఉగాది మీతోనే .. చంద్రబాబు

తుని: కాంగ్రెస్‌పాలనలో రాష్ట్రం చీకటాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని 'దే శం' అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఆయన కొలిమేరు, గాంధీనగరం, ఎన్.సూరవ రం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ యా గ్రామాల్లో ప్రజలనుద్దేవించి ప్ర సంగించారు. ఏటిపట్టు గ్రామాలైనందున పుష్కలంగా భూగర్భ జలాలు న్నా వాటిని తోడుకుని పంటలు సాగుచేసుకునేందుకు కరెంటులేకుండా పో తోందని విమర్శించారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు పడుతుండడం దా రుణమన్నారు.

ఎక్కడికక్కడ ఇసుక మాఫియా చెలరేగి తాండవనదిని తవ్విపారేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల నదికి ముప్పు ఏర్పడుతుందన్నారు. చెరకుపంటను విస్తారంగా సాగుచేస్తున్నారని టన్నుకు ఉత్పాదక వ్యయం రూ.2,500 ఖర్చవుతుంటే ప్రభుత్వం రూ.1750ఇస్తుండడం దారుణమన్నారు. గిట్టుబాటుగాని వ్యవసాయంతో రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు. రైతు సంపాదనతో తిండి కరవవుతున్నందున పిల్లలను చదివించడం కూడా కష్టమవుతున్నదన్నారు. ఆడవారి మంగళసూత్రా లు కూడా తాకట్టులో ఉండి ఇబ్బందులు పడ్తున్నారన్నారు.

అందరి రుణాలూ మాఫీ చేసి ఆడపడుచుల బంగారం విడిపిస్తానన్నారు. రూ.600వృద్ధులు, వితం తు పెన్షన్లను పెంచుతామన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి ఉచిత ఇళ్ళతో కాలనీలు నిర్మించి ఇస్తామన్నారు. నకిలీ బ దిలీ పథకంతో కాంగ్రెస్‌వాళ్ళ పొట్టలే నింపుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలకు కడుపునిండేలా ఉంటేనే నిజమైన నగదు బదిలీ పథకం అవుతుందన్నా రు. తుని అసెంబ్లీ అభ్యర్థి యనమల కృష్ణు డు, కాకినాడ పార్లమెంటు స్థానం ఇన్‌చార్జి పోతుల విశ్వం ఆయనకు స్థానిక సమస్యలను వివరించారు.

ఆంధ్రజ్యోతి - కాకినాడ:'వ్యవసాయం చేసి అప్పుల్లో కూరుకుపోతున్నాం.. బయట మార్కెట్లో కి లో ఇరవై, ముప్పయ్‌కి అమ్మే కూరగాయలు మా దగ్గర సగానికి కూడా కొనడంలేదు. ఏదైనా వుంది. వ్యవసాయం చేయడం చాలా కష్టంగా వుంది. మానేద్దామంటే వేరే పనిచేతకాదు. ఏం చేయమంటారు?'' అని పలువురు రైతులు చంద్రబాబును ప్రశ్నించారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర బుధవారం సాయంత్రం 5 గంటలకు తుని మండలం కుమ్మరిలోవ నుంచి ప్రారంభమైంది. కొలిమేరు వెళ్లేదారిలో మిర ప, వంగ తోటల్లోకి వెళ్లి చంద్రబాబు రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఒక రైతుతో చంద్రబాబు వ్యవసాయ పెట్టుబడుల గురిం చి, ధరల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా రైతులు, కౌలు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రైతులు ఆనందంగా జీవితాలను సాగించేలా టీడీపీ కృషి చేస్తుందన్నారు. వ్యవసాయం చేసే రైతుల్లో ఎవరైనా బాగుపడ్డారా? అని చంద్రబాబు అక్కడి రైతులతో అన్నా రు. గీత కార్మికులతోనూ చంద్రబాబు ముచ్చటించారు. బెల్టుషాపుల వల్ల ఉపాధి కోల్పోతున్నామని గీతకార్మికులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

ఖిీడీపీ వచ్చాకా బెల్టుషాపులు రద్దు చేయిస్తామన్నారు. కరెంటు ఎపు డు వస్తుందోనని రైతులు పొలం లో కాపలా కాయాల్సి వస్తున్నదని చంద్రబాబు అన్నారు. ఈసందర్భంగా కొలిమేరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. తుని ప్రాంతంలో తాం డవ వున్నా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

రాష్ట్రంలో 189 రోజులు 2,677 కిలోమీటర్ల మేర చంద్రబాబు యాత్రసాగింది. జిల్లాలో 22వ రోజు పాదయాత్ర తుని మండలం కుమ్మరిలోవ, కొలిమేరు, ఎన్ సూరవరంలలో సాగిం ది. బుధవారం నాటికి జిల్లాలో చంద్రబాబు 222 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

మార్గమధ్యలో చంద్రబాబును కలిసిన ప్రజలు తాగునీరు, విద్యుత్, గుంతలుపడిన రోడ్లు, దోమలబెడద, ఆసుపత్రుల్లో మందుల కొరత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర సమస్యలపై విన్నవించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ దొంగల పాలనలో పేదల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన సొమ్మును వాళ్లే తినేశారన్నారు. వైఎస్ ప్రపంచంలో ఎక్కడాలేని స్థాయి లో అక్రమాలకు ఒడిగట్టి కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

ఉపాధి సొమ్మూ తినేశారు

కాంగ్రెస్ దొంగలు ఉపాధిహామీ, ఇళ్లలోనూ దొంగబిల్లులతో సొమ్ము కాజేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలే తప్పఇపుడు కాంగ్రెస్ దొంగ
లు ప్రజలకు చేసిందేమీలేదన్నారు.

రెండు కొండల మధ్య సూరవరం చూస్తే మా ఊరు గుర్తొస్తుంది..

సూరవరంలో భూములు, కొండ లు, తోటలు అన్నీ ఎంతో ఆహ్లాదంగా వున్నాయి. గ్రామాన్ని చూస్తే మా ఊ రు గుర్తొస్తున్నదని చంద్రబాబు అన్నా రు. వస్తున్నా మీ కోసం యాత్ర లో ఆ గ్రామస్థులతో మాట్లాడారు. చిన్నపుడు నారావారిపల్లెలో వున్నపుడు రెండు కొండలమధ్య ఎంతో ఆహ్లాదంగా వుండేదన్నారు. ఇపుడు సూరవరం కూడా అన్పిస్తున్నదన్నారు.

22 రోజులు... 222 కిలోమీటర్లు

రాజమండ్రి సిటీ: రాష్ట్ర ప్రభుత్వం లో అవినీతి మంత్రులు జగన్ కేసులో నిందితులుగా ఉన్న వారిని తొలగించ కపోవడం భ్రష్టుపట్టిపోతున్న గవర్నర్ వ్యవస్థకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బు చ్చయ చౌదరి విమర్శించారు. రాజమండ్రిలో బుధవారం తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడు తూ జగన్ దోపిడీ వెనుక కాంగ్రెస్ పెద్ద ల హస్తం ఉందన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపరులను రక్షించే పనిలో ఉన్నారని ఇందులో భాగంగానే ఆ ఆరుగురు అవినీతి మంత్రులపై ఇంతవరకు చర్య లు తీసుకోలేదన్నారు.

జగన్ అక్రమాలలో భాగస్వాములుగా ఉన్న మంత్రు లు రాజీనామ చేస్తున్న వాటిని ఆమోదించడంలో గవర్నర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన విమర్శించారు. విధి నిర్వహణలో గవర్నర్ విఫలమవుతున్నారని ఆరోపించారు. సెక్షన్ 420 లో నిందితులుగా వున్న వారు హోం మంత్రిగా ఉండడానికి అనర్హులని, ఈ కేసులో ఉన్న ఆరుగురు మంత్రులను మంత్రివర్గంలో పెట్టుకుని సీఎం వారికి సహకరించడాన్ని బట్టే కాంగ్రెస్ ప్ర భుత్వం అవినీతికి ఏ స్థాయిలో కొమ్ముకాస్తుందో అర్థమవుతుందన్నారు. వెం టనే అవినీతి మంత్రులను పదవులు నుంచి తొలగించాలని డిమాండ్ చేశా రు. వైఎస్సార్ హాయాంలో ఆయనకు ముఖ్య సలహాదారుడిగా ఉండి నడిపించిన కేవీపీని కాంగ్రెస్ హై కమాండ్ కాపాడుకుంటోందన్నారు.

బొగ్గు కొనుగోలులో ముఖ్యమంత్రి భారీగా అవినీతికి పాల్పడ్డారని, అందువల్లే రాష్ట్ర అంధకారమైందన్నారు. గుంటూరు సరస్వతి పవర్ కంపెనీకి 1532 ఎకరాల భూమిని కేటాయించారని, అయి తే ప్రస్తుతం ఆ ఫైల్ గల్లంతైందని ఇటువంటి మంత్రులు ఉంటే ఇలాగే జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.

దోపిడీదారుల పార్టీకి ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే అర్హత లేదు:లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనా న్ని దోపిడీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆరాధ్యదైవం దివంగత ఎన్టీఆర్ ఫొటోను పెట్టుకొనే అర్హత లేద ని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. వైఎస్ఆర్ ఫొటో పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యాలయాల్లోను, అభిమానుల ఇళ్లల్లోను ఎన్టీఆర్ ఫొటో పె ట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండద ని అయితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు అక్రమార్జన చేసిన వైఎస్సార్ ఫొటో పక్కన ఎన్టీఆర్ ఫొటోను ఎలా పెడతారని ప్రశ్నించారు.

ఈ ఫొటో విషయంలో హరికృష్ణ వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. సమర్థించేవారికి మతిలేదన్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ పురందేశ్వరి విషయానికి వస్తే కూతురుగా ఆమె ఎన్టీఆర్ ఫొటోను పె ట్టుకోవచ్చన్నారు. సమావేశంలో వి. రాంబాబు, రెడ్డి మణి, వర్రే శ్రీనివాసరావు, కాశీ నవీన్ పాల్గొన్నారు.

భ్రష్టుపట్టిపోతున్న గవర్నర్ వ్యవస్థ


కాకినాడ:యువత తలచుకుంటే కొండల్నయినా పిండి చేయగలరని, రాజకీయాలలో ఉన్న కాలుష్యాన్ని పారద్రోలి పరిశుద్దం చేయాలంటే యువత రాజకీయాలలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తుని గొల్ల అప్పారా వు సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన వస్తున్నా మీకోసం పాదయాత్ర సభలో చంద్రబాబు యువతను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు.

తమ్ముళ్లూ మీరు తలచుకుంటే దేన్నయినా సాధించగలరు? స్వాతంత్య్రం కో సం బ్రిటీష్ వాళ్లతో పోరాడిన మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, రా జ్యాంగ నిర్మాత అంబేద్కర్, పేదల కోసం పాటుపడిన ఫూలే, తెలుగు వా రి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్‌లను యువత ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీడీపీ హయాంలో లంచాల బెడదలేదు: యువత

టీడీపీ పాలనలో ఉద్యోగాల్లోనూ, ఇతర పథకాలలోనూ లంచాల బెడదలేదని పలువురు యువకులు చంద్రబా బు దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల మం జూరులోనూ కాంగ్రెస్ వాళ్లు లంచాలు తింటున్నారని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. యనమల రామకృష్ణుడు హయాంలో లంచాలులేకుండా తునిలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని పలువురు యువకులు చంద్రబాబుకు చెప్పారు.

టీడీపీ పాలనలో ఉద్యోగులు సక్రమంగా పనిచేసేవారని, ఇపుడు అసలు ఆఫీసులకే రావడంలేదని, వస్తే డబ్బు ఇస్తేనే పనులు చేస్తున్నారని పలువురు యువకులు పేర్కొన్నారు.

తుని శాటిలైట్ సిటీ అభివృద్ధి

విశాఖపట్నానికి తునిని శాటిలైట్ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తుని పరిసరప్రాంతాలలో పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికం గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తునిలో స్టేడియం,ట్రామాకేర్ సెంటర్


టీడీపీ అధికారంలోకి వచ్చాకా తునిలో మినీ స్టేడియం, ఆసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని చంద్రబబు హామీ ఇచ్చారు. యనమల వంటి నిజాయితీపరులైన నాయకులకు అండగా ఉండాలని చంద్రబాబు చెప్పారు.

తుని: వస్తున్నా.. మీకోసం అంటూ చంద్రబాబు ప్రజల వద్దకెళుతూ ఆకట్టుకుంటుండగా నిత్యం వేలాది అభిమానులు, జనం మధ్యకెళ్తున్న బాబు రక్షణ కోసం ప్రాణాలకు తెగించి మరీ పాటు పడుతున్న చంద్రబాబు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పసుపు బనియన్లు ధరించి వాలంటీర్ల రూపంలో ప్రభుత్వ రక్షణ సిబ్బందితోపాటు ముందుండి నడుస్తున్న దండు బాబు రక్షణకోసం పెద్ద పోరాటమే చేస్తోంది.

ఓ పక్క ముందుకొచ్చిపడే జనసం దోహాన్ని అదుపుచేయడం మాటలు కాదు. 2004లో ప్రారంభమైన చంద్రదండు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో మరింత విస్తరిస్తూ ముం దుకెళుతోంది. ప్రస్తుతం 16 జిల్లాల్లో 2,270మంది సభ్యులతో చంద్రబాబు ఆశయసాధన కోసం చంద్ర దండు పనిచేస్తోంది. అంతా బడుగు, బలహీన, పేద, మధ్య తరగతి యువకులతో నిండివున్న దండు బాబు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతోపాటు ప్రస్తుతం 'వస్తున్నా మీ కోసం' యాత్రలో క్రమ శిక్షణగల సైనికుల మాదిరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా స్వయంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ఈ దిశగా వారు కొన్నిసార్లు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఇద్దరు యువకులు కాళ్లు విరిగి ఆసు పత్రిపాలవగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు మెడ పై పెద్ద గాయంతో బాధపడుతూ చంద్రబాబు వెంటే రక్షణగా ఉంటున్నారు. గన్‌మెన్ల దెబ్బలు, జనం తోపు లాటల్లో నలిగిపోతున్న దండు ఎటువంటి ప్రమాదాలు తలెత్తినా వెరవకుండా ముందుకు సాగుతామంటు న్నారు. యాత్ర ప్రారంభమై 6 నెలలు దాటుతున్నా కనీసం భార్యాపిల్లల వద్ద క్కూడా వెళ్ళకుండా యాత్ర సమన్వయకర్త గరికిపాటి మోహనరావు ఆదేశాలకు అనుగుణంగా సాగుతుండడం విశే షం.

విజయం మనదే!

కాకినాడ,:చంద్రబాబు పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ప్రజల్లో ఆలోచన మొదలయింది. గ్రామస్థాయి నుంచి టీడీపీ హయాంలో సంక్షేమం, వైఎస్, కాంగ్రెస్ అవినీతిపై జనం బేరీజు వేసుకుంటున్నారు.. అని టీడీపీ ప్రధాన కార్యదర్శి, వస్తున్నా మీకోసం పాదయాత్ర రథసారధి గరికపాటి మోహనరావు అన్నారు. అక్టోబరు 2 నుంచి పాదయాత్రలో చంద్రబాబు వెంట నడుస్తున్న గరికపాటి ఈ ఆరునెలల వ్యవధిలో తన అనుభవాలు, పాదయాత్ర స్పందనపై ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వివరించారు.
హిందూపురంలో ప్రారంభమైన పాదయాత్ర తూర్పుగోదావరి వచ్చేటప్పటికి ఉప్పెనలా స్పందన వస్తుందన్నారు. జిల్లా జిల్లాకు జనస్పందన అనూహ్యంగా పెరుగుతుందన్నారు. మన నాయకుడు కష్టపడుతున్నాడు మనం కూడా కష్టపడాలి .. అన్న భావన టీడీపీ నేతలు, కార్యకర్తలలో బాగా చొచ్చుకుపోయిందన్నారు.

ఆంధ్రజ్యోతి: పాదయాత్రలో చంద్రబాబు వాగ్దానాలు ఆచరణ సాధ్యమయ్యేవేనా?

గరికపాటి: చంద్రబాబు ఆచరణ సాధ్యంకానివి ఏవీ మాట్లాడరు. ఆర్ధిక నిపుణులు, పార్టీ సీనియర్లతో చర్చించిన వాటిపైనే హామీలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల వరకు వెళ్తుంది. బీసీ డిక్లరేషన్‌కి రూ 10 వేలకోట్లు, కాపుల్లో పేదలకు ఏటా రూ వెయ్యికోట్లు, రైతులకు, చేనేత రుణమాఫీ, ఇలా పేదలకోసం చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలుచేయలేనివి మాత్రం కాదు.

ఆంధ్రజ్యోతి: నాయకుల పనితీరుపై అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి?

గరికపాటి: కిందిస్థాయిలో కార్యకర్తలు బాగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల నాయకుల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నాం. పనితీరు బాగాలేని నాయకులకు ప్రాధాన్యత ఉండదు. ప్రజలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న వారిని మేమెలా ప్రోత్సహిస్తాం.

ఆంధ్రజ్యోతి: పాదయాత్ర ఏప్రిల్ 27తో ముగుస్తుంది? తర్వాత బస్సు యాత్ర అంటున్నారు?

గరికపాటి: 16 జిల్లాలలో పాదయాత్ర 27తో ముగుస్తుంది. తర్వాత జూన్ నుంచి రెండో విడత యాత్ర ఉంటుంది. అది ఇంకా పూర్తిగా ప్లాన్ చేయాలి. ఎన్నికలలోగా చంద్రబాబు 294 నియోజకవర్గాలలో తిరిగి కార్యకర్తలతో మమేకమవుతారు.

ఆంధ్రజ్యోతి: పాదయాత్రలో చంద్రబాబు రికార్డు నెలకొల్పుతున్నట్లున్నారు?

గరికపాటి: ఔను. దేశచరిత్రలో ఇన్ని కిలోమీటర్లు నడిచి ప్రజాసమస్యలు తెలుసుకున్న రాజకీయనాయకుడు ఎవరూలేరు. ఇప్పటికే 2,,650 కిలోమీటర్లు సాగింది. మరో ఇరవై రోజులు పాదయాత్ర ఉంది.

ఆంధ్రజ్యోతి: పాదయాత్రకు వస్తున్న స్పందన ఎలా ఉంది?

గరికపాటి: అక్టోబరు 2న హిందూపురంలో ప్రారంభించినపుడు.. స్పందన బాగానే ఉంది. క్రమక్రమంగా బాగా పుంజుకుంది. ప్రజలు చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారు.

ఈ ప్రభుత్వ చేతకాని తనం, అవినీతికి విసిగివేసారిపోయారు. గతంలో టీడీపీ హయాంలో విద్యుత్, ఐటీ, ఇతర సంస్కరణలు, ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల పనితీరు.. ఇలా అన్నింట్లోనూ అప్పటి పాలనతో పోల్చుకోవడం మొదలైంది. దీంతో చంద్రబాబు పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది.

ఆంధ్రజ్యోతి: పాదయాత్ర వల్ల పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటారా?

గరికపాటి: ఖచ్చితంగా. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలపు ఖాయం. . ఈ 188 రోజులు నేనూ ఈ యాత్రలో ఉన్నాను. .టీడీపీ కార్యకర్తలే కాకుండా గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా చంద్రబాబును చూడటానికి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత బాగా స్పందిస్తున్నారు. చంద్రబాబు సంక్షేమాల గురించి, విద్యుత్ సంస్కరణలపై ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు.

టీడీపీ గెలుపు ఖాయం..

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: చంద్రబాబు

హైదరాబాద్: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ మృతికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బా«ధిత కుటుంబానికి తమపార్టీ అండగా ఉంటుందన్నారు. స్పీకర్ మనోహర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కామాంధుల చేతిలో బలైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి హెచ్చరించారు.

నిర్భయ చట్టం వల్ల ఏం ఒరిగిందని ఆమె ప్రశ్నించారు. స్పీకర్ సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుయువత ధ్వజమెత్తింది. మహిళలపట్ల అఘాయిత్
యాలు ఢిల్లీలో జరిగితే ఒకలా, ఆంధ్రప్రదేశ్‌లో జరిగితే ఒకలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు. కాగా, ఈ సంఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

న్యాయం జరగకపోతే అసెంబ్లీ ముట్టడి: తెలుగు మహిళ

24 గంటల్లో రాజీనామా చేయకపోతే..
సీఎం ఇల్లు ముట్టడిస్తాం
కళంకిత మంత్రులపై టీడీపీ హెచ్చరిక
ఇంత సిగ్గులేని ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు

హైదరాబాద్ : హోం మంత్రి సబితారెడ్డి పేరును నిందితురాలిగా సీబీఐ తన చార్జిషీట్లో చేర్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అల్టిమేటం జారీచేసింది. 24 గంటల్లోగా కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడమో లేదా రాజీనామా చేయించడమో చేయని పక్షంలో సీఎం ఇల్లు ముట్టడిస్తామని ఆ పార్టీ హెచ్చరించింది. గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ నేతలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావులపాటి సీతారామారావు విలేకరులతో మాట్లాడారు.

కోట్ల రూపాయల కుంభకోణాల్లో సీబీఐ దర్యాప్తులో నిందితులుగా తేలిన మంత్రులు దర్జాగా తిరుగుతున్నారని ముద్దు వ్యాఖ్యానించారు. 'చిరుద్యోగులు వంద రూపాయల లంచం తీసుకొంటే వారిని వెంటనే అరెస్టు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. మంత్రులకు ఆ చట్టం వర్తించదా? హోం మంత్రిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే తమ పదవులను ఎంత దుర్వినియోగం చేశారో అర్థమవుతోంది. జగన్ పత్రిక సీఈవో సోదరుడి కంపెనీకి మూడు నెలల్లో గని లీజు బదిలీ చేయాలని నిబంధన పెట్టి జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అందుకే సీబీఐ కేసు పెట్టింది.

జగన్ లక్ష కోట్లు తింటే వీళ్లు పదుల కోట్లు తిన్నారు. అందుకే ఇలాంటి జీవోలు ఇచ్చారు. ఆ ఫైలును తిప్పి పంపి ఉంటే ఈరోజు నిర్దోషులుగా ఉండేవారు.' అన్నారు. సూరీడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావును తక్షణం అరెస్టు చేయాలని ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. కేవీపీ ద్వారా సోనియాకు కూడా వాటాలు ముట్టడం వల్లే ఆమె కేవీపీ విషయంలో పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

మిస్టర్ క్లీన్ అని చెప్పుకొనే రాహుల్‌గాంధీ.. రాష్ట్రంలో అవినీతిపై ఎందుకు మాట్లాడటంలేదని ముద్దు ప్రశ్నించారు.ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఒక పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గుజరాత్ హోం మంత్రి పాత్ర ఉందన్న ఆరోపణలు రాగానే ఆ మంత్రిని అక్కడ పదవి నుంచి పీకి పారేశారని, ఇక్కడ ఆ మాత్రం జ్ఞానం లేదా అని పోలీస్ శాఖ మాజీ అధికారి రావులపాటి సీతారామారావు ప్రశ్నించారు.

'నిందితుడి వాదననే పరిగణనలోకి తీసుకొంటే దేశంలో ఏ ఒక్కరినీ దర్యాప్తు సంస్థలు అరెస్టుచేయలేవు. చట్టాలు ఉల్లంఘించారని ఒకసారి దర్యాప్తు సంస్థ నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. హోం మంత్రిని వదిలిపెడితే రేపు ఇతరులను పోలీసులు ఎలా అరెస్టు చేయగలరు? ఈ ప్రభుత్వానికి ఏం నైతికత ఉంటుంది?' అని ఆయన అన్నారు.

సీబీఐ చార్జిషీటు దాఖలు చేయగానే సంబంధిత మంత్రి రాజీనామాను ముఖ్యమంత్రి కోరి ఉండాల్సిందని, కానీ ఆయనే అడ్డుపడటం దారుణమని రావులపాటి వ్యాఖ్యానించారు. ఈ కేసు ముఖ్యమంత్రి సొంత ఆస్తులకు సంబంధించింది కాదని, ప్రజల ఆస్తులపై దర్యాప్తు జరిగి నిందితుల నిర్ధారణ జరిగిన తర్వాత వారిని వెనకేసుకు రావడం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు చేయకూడని పనని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.

చిరుద్యోగులకు ఒక నీతి.. మంత్రులకు ఒక నీతా!

ఒక్క క్షణం కరెంటు పోనివ్వడం లేదు
శాటిలైట్ ఫోన్లు ఇస్తున్నారు
రోజుకు 400 మందితో ములాఖత్‌లు
జైలు అధికారులను మార్చాలి: టీడీపీ

హైదరాబాద్, విజయవాడబుధవారం టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. కిరణ్ సర్కార్ జగన్‌ను చంచల్‌గూడ జైల్లో కొత్త అల్లుడి మాదిరిగా చూసుకుంటోందని, వారిద్దరూ క్విడ్ ప్రో కో మాదిరిగా పరస్పరం ఇచ్చి పుచ్చుకొని ఒకరినొకరు కాపాడుకొంటున్నారని దేవినేని ఉమా విమర్శించారు. "ప్రత్యేక వాహనాల్లో అధునాతన పరికరాలు పెట్టి.. వాటిని జగన్ గది సమీపంలో ఉంచుతున్నారు. జగన్ శాటిలైట్ ఫోన్ల ద్వారా ఈ పరికరాల సాయంతో జైల్లోంచే అందరితో మాట్లాడుతున్నారు. జైల్లో జగన్‌కు ఇబ్బంది కలుగకుండా ఒక్క క్షణం కూడా కరెంటు పోనివ్వడం లేదు. పోయిన మరుక్షణమే జనరేటర్ వేస్తున్నారు'' అని పేర్కొన్నారు.

జగన్ ఏకంగా జైలు సూపరింటెండెంట్ గదినే తన చాంబర్‌గా వినియోగించుకుంటున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం కిరణ్, జగన్‌తో లాలూచీ పడ్డారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. జైల్లో జగన్ దందాపై తమకు 15 పేజీల లేఖ అందిందని చెప్పారు. "జైలు సూపరింటెండెంట్ జగన్ సేవలో తరిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు జగన్‌కు తన సీటు అప్పగించి సూపరింటెండెంట్ బయట తిరుగుతుంటారు. ఆ కుర్చీలోనే కూర్చుని జగన్ తన కోసం వచ్చిన వారిని కలుస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 400 మందిని కలుస్తున్నారు. రోజూ జగన్‌కు పంపే వంటకాలనే ఖైదీలందరికీ వడ్డిస్తూ ఉదారత చాటుకుంటున్నారు'' అని వర్ల రామయ్య ఆరోపించారు.

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, చంచల్‌గూడ జైల్లో ఏం జరుగుతోందో దర్యాప్తు చేయించే దమ్ము, ధైర్యం సీఎంకు, హోంమంత్రికి లేవని విమర్శించారు. చంచల్‌గూడ జైలు అధికారులను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. "రిమాండ్ ఖైదీలు చంచల్‌గూడ జైల్లో జరుగుతున్న ఈ వైభోగాల గురించి విని తమను అక్కడికే పంపాల్సిందిగా జడ్జిలను వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మాజీ కేంద్ర మంత్రి రాజా, కనిమొళి, సురేష్ కల్మాడీ, మధుకోడా వంటి వారు జైళ్లలో చిప్పకూడు తిని గడిపితే... జగన్‌కు మాత్రం రాజభోగాలు కల్పిస్తున్నారు'' అని రామయ్య విమర్శించారు. డీజీపీ అయినా జైలుకు వెళ్లి తనిఖీ చేయాలని కోరారు.
: చంచల్‌గూడ జైలు వైసీపీ ప్రధాన కార్యాయలంగా మారిందని.. అక్కడ జగన్‌ను కొత్త అల్లుడిలా చూసుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. సీఎం కిరణ్, వైఎస్ జగన్ పరస్పరం ఒకరినొకరు కాపాడుకుంటున్నారని పేర్కొంది. జైల్లో నుంచి జగన్ శాటిలైట్ ఫోన్ల ద్వారా అందరితో మాట్లాడుతున్నారని, జైలు సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని తన కోసం వచ్చేవారిని కలుస్తున్నాడని ఆరోపించింది.

జైల్లో జగన్ రాజభోగం కొత్త అల్లుడిలా చూసుకుంటున్నారు

కానీ తల్లి, పిల్ల కాంగ్రెస్ దొంగల్లా ప్రవర్తించను
అక్రమార్కులతో జత కలిస్తే చరిత్ర హీనుడినే
మేము ప్రజల్లోకి.. ఆ పార్టీలు కాంగ్రెస్‌లోకి..
'తెనాలి' ఘటన బాధేసింది
రౌడీ సర్కారులో ఆడపిల్లకు రక్షణ లేదు
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ఆవేదన
ప్రజల్లోనే నేడు ఉగాది వేడుకలు

కాకినాడ, గాజువాక : "రాజకీయాలలో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, తప్పుడు మార్గంలో మాత్రం వెళ్లబోను. ఎప్పటికీ టీడీపీ ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉంటుంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరలోవలో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కొలిమేరు, సుభద్రమ్మ జంక్షన్, గాంధీ నగర్, ఎన్. సూరవరం మీదుగా నడక సాగించారు. దారిలో పిల్లలు, యువకులతో ఉత్సాహంగా మాట్లాడారు.

"ప్రభుత్వంపై జగన్ పార్టీ అవిశ్వాసం పెట్టినప్పుడు మీరూ సపోర్టు చేయవచ్చు కదా?'' అని కొలిమేరులో వెంకటేశ్ అనే యువకుడు ప్రశ్నించగా..అలాంటి అక్రమార్కులతో జతక డితే చరిత్రహీనులవుతామని వివరించారు. "రాజకీయాలలో నిజాయితీగా బతికాను. రాజకీయాల నుంచి వైదొలిగినా ఫర్వాలేదు. కానీ, తల్లి, పిల్ల కాంగ్రెస్ దొంగల్లా తప్పుడు పనులు చేయడానికి అంగీకరించను'' అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక బీహార్, గుజరాత్‌లకు పోవాల్సి వస్తున్నదని ఓ సీఏ విద్యార్థి ఆయన దృష్టికి తెచ్చారు.

టీడీపీ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చేవారని గుర్తుచేశారు. "ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం, ఐటీలపై చాలామంది అసూయపడ్డారు. చాలా రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడకు వచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ దొంగల వల్ల పరిస్థితి తారుమారైంది''అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వంగతోట, మిరపతోటల్లోకి వెళ్లి రైతుల సమస్యలు విన్నారు. కొలిమేరులో టీడీపీ హయాంలో నిర్మించిన ఇంకుడుగుంతలను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం కొలిమేర, ఎన్ సూరవరంల్లో జరిగిన సభల్లో చంద్రబాబు మాట్లాడారు.

రిజర్వేషన్లు పెడతామని కాపులను కాంగ్రెస్ మోసగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రౌడీ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో 'తెనాలి' ఘటన గుర్తు చేసుకొని బాధపడ్డారు. కాంగ్రెస్ ఊరూరా ఓ దొంగను పెట్టుకుందని, పేదలకు చెందాల్సిన ఇళ్లు వాళ్లు దొంగ బిల్లులతో కాజేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పేరుతో లేని రోగం చెప్పి వేలకు వేలు గుంజుతున్నారని విమర్శించారు. రైతులు సంసారం చేయకుండా వ్యవసాయ పంపు సెట్లకు అర్ధరాత్రి కరెంటు ఇస్తున్నారని, అదీ గంట, రెండు గంటలే ఇస్తున్నారని ఎన్ సూరవరంలో ఆరోపించారు.

కాగా, ఎన్ సూరవరంలో చంద్రబాబు ఉగాది పండుగ జరుపుకోనున్నారు. టీడీపీ చరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలోకాక.. ఇలా ప్రజల మధ్య ఉగాది ఉత్సవాలు జరుపుకోనుండటం ఇదే తొలిసారి. ప్రముఖ పండితులు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణాన్ని ఆయన ఆలకిస్తారు. కాగా, పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా వడ్లపూడి ప్రాంతంలో పైలాన్ ఏర్పాటుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్ర గాజువాక ప్రాంతంతో ముగుస్తుండడంతో అక్కడికి సమీపంలోని వడ్లపూడి పెట్రోల్ బంక్ పక్కన పైలాన్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. గురువారం ఉదయం 8:40 గంటలకు పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్టు స్థానిక టీడీపీ నాయకులు చెప్పారు.

తప్పుడు దారిలో పోను! రాజకీయాల్లో లేకపోయినా ఫర్వాలేదు