February 28, 2013

కృష్ణాజిల్లాను రెండోసారి సందర్శిస్తున్నాను. అయినా అదే ఆదరణ, అదే ఉత్సాహం.. ఊళ్లకు ఊళ్లు ఊగిపోవడం చూస్తున్నాను. పనులు మానుకొని రోడ్డు పక్కన బారులు తీరిన జనాలను పలకరించాను. వాళ్లను చూడ్డం కోసం నేను.. నన్ను చూడ్డం కోసం వాళ్లు.. ఒకరికొకరం ఎదురయ్యాం. చిరపరిచితుల్లా నన్ను అల్లుకుపోయారు. నా కాళ్ల నొప్పులు, కీళ్ల తీపుల గురించి అడిగి కళ్లు వత్తుకున్నారు. నా కోసం పరితపించే ఇన్ని హృదయాల తోడు లేకుండా ఇంత దూరం నడవగలనా? కొండంత అండను జెండాలా వీళ్లు ఎత్తిపట్టకుండా పాదయాత్రపై రేగిన విమర్శలకు సమాధానం చెప్పగలిగేవాడినా? చుట్టుముట్టిన సందేహాలను విరామం లేని నడకతో ఎదుర్కోగలిగేవాడినా?.. మోపిదేవిలో అడుగులు వేస్తున్నప్పుడు మెదిలిన ఆలోచనలివి.

చల్లపల్లికి పోతున్నప్పుడు సాయంత్రం కొంతమంది ఎదురయ్యారు. వారిలో చాలామంది ఆడపడుచులే. మోపిదేవి నుంచి వస్తున్నామని చెప్పారు. పని చేసుకొని వస్తుంటే నా రాక విషయం తెలిసి ఆగిపోయారట. వాళ్లతో మాట్లాడుతుండగానే మరికొందరు కలిశారు. కోడూరు, మందపాకల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని చల్లపల్లికి వస్తున్నామని చెప్పుకొచ్చారు. ఊళ్లు వేరయినా వాళ్లంతా నీళ్ల సమస్యనే నా దృష్టికి తెచ్చారు. ఊరి బావుల్లో ఉప్పు చేరిందట. పశువులు కూడా ముట్టడం లేదట. చేసేది లేక నీళ్లు కొనుక్కొని తాగుతున్నారట. కొన్ని ఊళ్లలోనయితే కొంతమంది దాతలు ముందుకొచ్చి రోజూ ట్యాంకర్లతో నీళ్లు పోయిస్తున్నారట. లేదంటే.. రోజుంతా పనిచేసి నడుములు విరిగిపోతున్నా, బిందె పట్టుకొని మైళ్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకోక తప్పదట. ఇప్పుడు సరే.. ఎండాకాలం ముదిరితే ఏం చేస్తారో..! తలుచుకుంటేనే గుండె నీరయ్యే విషయమిది.

ఆ ఆశీస్సులతోనే అడుగులేస్తున్నా!

మదర్, అంబేద్కర్‌ల సరసన వారి ఫొటోలా?
గజదొంగలను పోషించిన వైఎస్: చంద్రబాబు

  కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అవినీతిపరులను మదర్ థెరెస్సా, అంబేద్కర్, గాంధీవంటి మహాత్ముల ఫొటోలతో జతచేయడం విచారకరమని చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పెదప్రోలు, కప్టాన్ పాలెం, కాసానగర్, చల్లపల్లి, వక్కలగడ్డ, చిట్టూర్పు మీదుగా 15,1 కిలోమీటర్లు నడిచి వేములపల్లి చేరుకున్నారు. అంతకుముందు..మోపిదేవి ప్రధాన సెంటరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. బీసీలను ఆదుకోవడం కోసం టీడీపీ ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు.

50 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామన్నారు. పది వేల కోట్లతో ఉపప్రణాళిక అమలుచేసి బహుజనులందరినీ అభివృద్ధి చేస్తామన్నారు. ఎస్సీలలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని పూడ ్చడానికే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. టీడీపీ పాలనలోనే మైనారీటీలకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. నాలుగు శాతం రిజర్వేషన్‌తో కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నదని విమర్శించారు. టీడీపీ పాలనలో సంస్కరణలు బలంగా అమలు జరిగాయని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనే విషయం ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారని వివరించారు.

అవినీతిరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమే నేర్చుకున్న ఈ ప్రభుత్వాలు 29 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలుపెంచి ఘనత వహించాయని దుయ్యబట్టారు. దేశంలో గజదొంగలుపడ్డారని, వైఎస్ తన కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి మహిళలను వేధించిన వారందరినీ జైలులోనే ఉంచుతామని హామీ ఇచ్చారు.

మహాత్ముల పక్కన అవినీతి నేతలా?

పేదరికం పెంచే బడ్జెట్
నల్లధనం, అవినీతి మాటే లేదు: బాబు
మాది ప్రజారంజక బడ్జెట్: బొత్స

కేంద్ర మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో పేదరికాన్ని మరింత పెంచే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు.. చిదంబరం బడ్జెట్ ప్రతిపాదనలను తూర్పారబట్టారు. "అవినీతి అంశాన్ని కనీసంగానూ పట్టించుకోలేదు. మూడు ప్రాధాన్యాల్లో మహిళలు ఒకరని చెబుతూనే, వారి సంక్షేమంపై మొండి చెయ్యి చూపించారు. నిరుద్యోగితను తగ్గించే చిన్న పరిశ్రమల రంగాన్ని పట్టించుకోలేదు. పేదరికం నిర్మూలనకు కీలకమైన ఆహార భద్రత బిల్లుపై ప్రకటనే లేదు'' అని విమర్శించారు. వ్యవసాయ రంగానికి.. రూ. 27 వేల కోట్లు ముష్టిలా పడేశారని దుయ్యబట్టారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కేటాయించిన 1400 కోట్లు ఒక్క నల్గొండ జిల్లాకే సరిపోదని పెదవి విరిచారు. కోతల బడ్జెట్‌ను సమర్పించారని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, చేనేత, పారిశ్రామిక రంగాలకు మొండి చెయ్యి చూపించారని ఎంపీలు ఎంపీలు గుండు సుధారాణి, శివప్రసాద్, మోదుగుల విమర్శించారు. అయితే.. గ్రామీణాభివృద్ధికి, మహిళా శిశు సంక్షేమానికి, మైనారిటీల పురోభివృద్ధికి బడ్జెట్ పెద్ద పీట వేసినట్టు పీసీసీ చీఫ్ బొత్స కొనియాడారు. మళ్లీ అధికారం తమదేనని తేలిపోయిందని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ రుద్రరాజు పద్మరాజు ధీమా వ్యక్తం చేశారు.

మధ్యతరగతి, పేదలపై భారం పడకుండా బడ్జెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ తీరు ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీని కనీసం ప్రస్తావించి ఉంటే ఆత్మహత్యలు ఆగేవని అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ప్రమాదకర చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. అన్నివర్గాలనూ సంతృప్తి పరచాలనే ఆత్రుత వల్ల బడ్జెట్ కిచిడిలా తయారైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ వల్ల దేశంలోని 80 శాతం ప్రజలకు ఏ ఉపయోగమూ లేదని వైసీపీ నేత సోమయాజులు విమర్శించారు. బడ్జెట్ బడుగు, బలహీనవర్గాలను విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అంకెల గారడీ తప్ప ప్రజాప్రయోజనమే పట్టలేదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించగల గొప్ప అవకాశాన్ని చిదంబరం చేజార్చుకున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్‌నారాయణ (జేపీ) అన్నారు.

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: కేటీఆర్

పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
అధినేత ముందుకు విజ్ఞాపనల వెల్లువ

ఎమ్మెల్సీ పదవుల కోసమ పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు అధినేత చంద్రబాబును కలిసి తమ అర్హతలను వివరిస్తూ ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ తాజాగా రేసులోకి ప్రవేశించారు. తెలంగాణలో మిగిలిన బీసీ కులాలకు తగినంత ప్రాతినిధ్యం ఉన్నా ముదిరాజ్ కులానికి మాత్రం తగినంత లేదని, ఆ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిని కలిసి తన పేరును ఎమ్మెల్సీకి పరిశీలించాలని కోరారు. తన నియోజకవర్గం రిజర్వు అయిందని, తనకు ఏదైనా పదవి ఉంటే జిల్లాలో పార్టీని సమన్వయపర్చే బాధ్యతను మరింత మెరుగ్గా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ఆయన పార్టీ అధ్యక్షుడికి చెప్పారు. అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత గంగాధర చౌదరి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడికి లేఖ పంపారు.

చంద్రబాబు పాదయాత్రలో మొదటి రోజు నుంచి తన వాహనంతోపాటు పాల్గొంటున్న వికలాంగుల విభాగం నేత జి. కోటేశ్వరరావు కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధినేతను కోరారు. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత.. ఈ పదవుల్లో కూడా ఒక వికలాంగుడికి అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తిని వెంకటయ్య కూడా తన అభ్యర్థిత్వంపై పార్టీ అధ్యక్షుడికి విజ్ఞాపన పంపారు. గతంలో తనకు ఎంపీ టికెట్, జడ్పీ చైౖర్మన్ అవకాశం చేరువలోకి వచ్చి చేజారిపోయాయని, పార్టీకి దీర్ఘకాలంగా అంటిపెట్టుకొని ఉన్న తన అంకిత భావాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

టీడీపీలో 'ఎమ్మెల్సీ' పోటీ

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఘోరమైన అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. తమను ఇబ్బంది పెట్టవద్దని ఢిల్లీ పెద్దలు చెప్పగానే ముఖ్యమంత్రి కిరణ్ మిన్నకుండిపోయారని విమర్శించారు. దక్షిణమధ్య రైల్వేద్వారా భారీగా ఆదాయం వస్తున్నా, అందులో ఎనిమిదో వంతు కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం దారుణమన్నారు. 'పోయినేడాది రూ.3 వేల కోట్లు కేటాయించారు. ఈసారి వెయ్యి కోట్లు తగ్గించేశారు. రూ.1.90 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్‌లో ఇంతపెద్ద రాష్ట్రానికి కేటాయించేది రూ.2 వేల కోట్లేనా? రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కర్నూలుకు వ్యాగన్ రిపేర్ షాపు తెచ్చుకున్నారు.

కొండంత రాగం తీసి తుమ్మదియ్యలో అన్నట్లు అదొక్కటే రాష్ట్రానికి ఒరిగింది. రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు భూమి ఇస్తామని, సగం ఖర్చు భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా పోయినేడాది పైసా కూడా కేటాయించలేదన్నారు. కాజీపేట వద్ద ఓ చిన్న స్థల వివాదాన్ని కూడా పరిష్కరించలేక వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నిధుల సాధనకు మన అధికార పార్టీ ఎంపీలు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, రైల్వే బడ్జెట్ కొంత ప్రోత్సాహం-కొంత నిరుత్సాహం కలిగించిందని యూపీఏ భాగస్వామి డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు.

ప్రయాణ చార్జీలను పెంచకపోవడం సంతోషమే అయినా, వాటిపై రుసుములు, రవాణా చార్జీల పెంపుతో భారం పడుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేరళకు చెందిన కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిని పంచుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఇది అత్యంత నిరుత్సాహకరంగా ఉందని పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు: టీడీపీ

ఆంధ్రా అగస్టాపైనా విచారణ..: రాజ్యసభలో టీడీపీ

అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ పాత్రపైనా విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు దేవేందర్‌గౌడ్, ఎంపీ సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. అగస్టా కుంభకోణంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వారు ప్రసంగించారు. దేశంలో ఏ కుంభకోణం వెలుగుచూసినా దాని మూ లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాయని సీఎం రమేశ్ విమర్శించారు.

ఎమార్-ఎంజీఎఫ్ డైరెక్టర్ హష్కే ప్రారంభించిన ట్రస్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 800 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింద ని, ఆ ట్రస్టుకు వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ట్రస్టీగా ఉన్నారని వెల్లడించారు. దేశంలో అగస్టా హెలికాప్టర్‌ను ముందుగా కొనుగోలు చేసింది వైఎస్ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని.. ఆ హెలికాప్టర్ ఈ మధ్యనే కాలిపోయిందని, ఈ వ్యవహారంపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలోనే ఈ కుంభకోణానికి అంకురార్పణ జరిగిందని దేవేందర్‌గౌడ్ ఆరోపించారు. దీంతో.. అప్పుడు సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు.

బ్రదర్ అనిల్ సంగతేంటి?

కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆదుకునే పరిస్థితి కేంద్రానికి లేదన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను ఆదుకోవడానికి బడ్జెట్‌లో చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు.

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం : నామా

టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర పెనుమూడి వారధిపై గుంటూరు జిల్లా సరిహద్దును దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఘనంగా వీడ్కోలు పలికేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి గుంటూరును వీడుతుండటం కొంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు. తన వెంట అడుగులో అడుగేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసు శాఖ పరంగా అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన పోలీసులనూ అభినందించారు.

'పాదయాత్ర చేపట్టిన తర్వాత ఏ జిల్లాలోనూ 22 రోజులు ఉండలేదు. గుంటూరు జిల్లాలోనే ఇన్ని రోజులు ఉండి 201 కిలోమీటర్లు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ నడిచాను. ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలు, 167 గ్రామాల ప్రజలను పలకరించాను. వారి కష్టాలను అతి దగ్గర నుంచి చూశాను. జిల్లా ప్రజల కష్టాలు నాకు పలుమార్లు కళ్ళ నీళ్లు తెప్పించాయి. నా పాదయాత్ర ద్వారా మీకు గుండె ధైర్యం కల్పించాను. మూడు వారాలు ఎలా గడిచిపోయాయనేది వెనక్కు తిరిగి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. నా తపన అంతా గాడి తప్పిన ర్రాష్టాన్ని బాగు చేయాలి. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తాను. కృష్ణా జిల్లాకు వెళ్ళాలంటే బాధగా ఉంది. అయినా తప్పదంటూ..' చంద్రబాబు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం అక్కడికి వచ్చిన ప్రజలను కూడా ఆవేదనకు గురి చేసింది. కొంతమంది కార్యకర్తలు 'బాబు గారు... మీ ఆరోగ్యం జాగ్రత్త' అని ఆత్మీయతను వ్యక్తం చేయగా చంద్రబాబు స్పందిస్తూ నాకు ఏమి కాదు. మీ అందరి ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎండ ల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని గురువారం నుంచి సాయంత్రం పూటే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నాను. శ్రీకాకుళం వరకు నడిచి తీరుతానని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు వీడ్కోలు చెబుతూ రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వారధి వరకు ఆయన వెంట నడిచారు. అప్పటికే అక్కడికి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు రాక కోసం భారీ సంఖ్యలో ఎదురు చూస్తుండటంతో వారికి బాధ్యతలు అప్పగించి వెనుదిరిగారు. చంద్రబాబు అందరికి అభివాదం చేస్తూ గుంటూరు జిల్లాను వీడి కృష్ణా జిల్లాలోకి పులిగడ్డ వద్ద అడుగు పెట్టారు.

కృష్ణా పశ్చిమ డెల్టాకూ...

సాగునీరు ఇవ్వాలి


తన పోరాటం, హెచ్చరికలతో ప్రభుత్వం దిగి వచ్చి నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తానని చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. 'కృష్ణా పశ్చిమ డెల్టాలోనూ సాగునీటి ఎద్దడి సమస్య ఉంది. డెల్టాకు కూడా నీరివ్వాలి. ఇవ్వకపోతే కబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని స్తంభింప చేసి అయినా మీకు నీళ్లు ఇప్పించే బాధ్యత నాది అని' చంద్రబాబు డెల్టా రైతుల గుండెల్లో ధైర్యం నింపారు.

కార్యకర్తలు విజృంభించాలి... నాయకులు ప్రజల్లో ఉండాలి

ప్రజలు కాంగ్రెస్‌తో విసిగి వేసారిపోయి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. పాదయాత్రలో నేను ఎక్కడికెళ్లినా భారీగా తరలివచ్చి నా వెంట నడిచారు. పార్టీ కార్యకర్తలంతా విజృంభించాలి. నాయకులు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పని చేసి టీడీపీని గెలిపించాలన్నారు. యువత విజృంభించి అవినీతిపై పోరాటం చేసి అంతమొందించాలని చంద్రబాబు స్ఫూర్తిని రగిల్చారు.

జన వారధి

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటంతోపాటు గుంటూరు, తెనాలి, విజయవాడ నగరాలను కలుపుతూ ట్రై సిటీగా ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించటంతోపాటు మెగా సిటీగా రూపొందించేలా గుంటూరు జిల్లా డిక్లరేషన్‌ను రూపొందించామని అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో 22 రోజులపాటు 201 కి.మీల దూరం పాదయాత్ర పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం కృష్ణాజిల్లాకు వెళుతూ, పులిగడ్డ-పెనుమూడి వారధిపై వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడారు.

అధికారంలోకి తీసుకువస్తే, సత్వరమే పులిచింతల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి డెల్టా రైతాంగానికి సాగునీటి కొరతను తీరుస్తామన్నారు. పోతార్లంక సాగునీటి పథకాన్ని పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. ప్రజా సమస్యలపై నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడుతూనే వుంటానని, ప్రజల హర్షద్వానాల మధ్య తెలిపారు. గుంటూరు ఛానల్, పశ్చిమడెల్టా కాల్వల అభివృద్ధికి చర్యలు చేపట్టి పనులు పూర్తి చేస్తామన్నారు. నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా జిల్లా ప్రజానీకానికి తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. నిజాంపట్నం, భట్టిప్రోలు, అమరావతి, కొండవీడు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పులిగడ్డ-పెనుమూడి వారధిని తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే, ఆరునెలల ముందు వచ్చిన కాంగ్రెస్ పేరు పెట్టుకోవటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో 32 మంది ఎంపీలు, 11 మంది మంత్రులున్నా రైల్వే బడ్జెట్‌పై నోరు మెదపలేని దద్దమ్మల్లా వున్నారని విమర్శించారు. వేమూరు నియోజకవర్గంలో మూతపడిన జంపని షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉద్యోగులకు ఉపాధిని కల్పించటంతోపాటు రైతులను ఆదుకుంటామన్నారు.

గుంటూరు-తెనాలి-విజయవాడ ట్రైసిటీగా అభివృద్ది

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు కష్టాలే తప్ప ఒరిగేదేమీలేదని జగన్ సోదరి షర్మిల అన్నారు.జూలకల్లులో బుధవారం సాయంత్రం వైఎస్ ఆర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆమె మాట్లాడారు. పంటలు పండించుకునేందుకు సాగునీరు అందదు. ఇంటికి వస్తే కరెంట్ ఉండదు. రైతులకు ఇబ్బందులు కాక సుఖం ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. మరో ఆరునెలలు,ఏడాదిలోపు జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించటం తథ్యమని, అప్పుడు ప్రజాసమస్యలు తీరుతాయని అన్నారు.వైఎస్ఆర్ చేసిన రుణమాఫీతో జూలకల్లు రైతులకు రూ.3కోట్లు లబ్ధిచేకూరిందని చెప్పారు. పలువురు మహిళల, విద్యార్థుల సమస్యలను తెలుసుకొన్నారు.

పరీక్షల సమయంలో విద్యుత్‌లేక చదువుకు ఆటంకం కలుతుతున్నదని, కాలనీలో మంచినీటి సమస్య ఎదురైనా పట్టించుకోనేవారేలేరని పేర్కొన్నారు. బ్యాంక్ రుణాలు అందటంలేదని పలువురు మహిళలు షర్మిలకు తెలిపారు.జూలకల్లు ఎస్సీకాలనీకి షర్మిల 11గంటలకు చేరుకుంది. ఆ సమయానికి ప్రత్యేక బస్సులో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ చేరుకొంది. షర్మిల కూడా బస్సులో తల్లి విజయమ్మతో 20నిమిషాలు, భోజన విరామ సమయంలో మరో అర్థగంట పాటు చర్చించారు. అనంతరం పందిటివారిపాలెంలో పాదయాత్ర నిర్వహించి బస చేసే ప్రదేశానికి ఆమె చేరుకొంది.

కార్యక్రమంలో మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, యనుముల మురళీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, కట్టా వెంకటేశ్వరరెడ్డి, గండికోట కోటేశ్వరరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, వుగ్గు నాగేశ్వరరావు, సజ్జల చంద్రయ్య, వై హెచ్ కె మోహనరావు, అల్లు పిచ్చిరెడ్డి, చల్లా పిచ్చిరెడ్డి, వి.కె.విశ్వనాథ్‌బాబు, తాడికొండ చిన ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కష్టాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒత్తిళ్లకు ప్రభుత్వం దిగి వచ్చింది. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో ఆయకట్టుకు మూడు తడులు ఇచ్చామని, ఇక నీరు ఇచ్చేది లేదని చెబుతూ వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాగార్జునసాగర్, కలెక్టరేట్ ముట్టడి హెచ్చరికతో ఒక మెట్టు దిగింది. ఆరుతడి పంటలను కాపాడేందుకు మార్చి 1, 2 తేదీల్లో సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. డెల్టాలోనూ పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన తప్పదని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి.

చంద్రబాబు జిల్లాల్లోకి అడుగు పెట్టిన రోజే పల్నాడు ప్రాంత రైతులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ నేతృత్వంలో రైతులు ఆయన్ని కలిశారు. ఆరుతడికి నీళ్లు ఇవ్వకపోవడంతో మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణం నీరు విడుదల చేయించాలని కోరారు. ఆ రోజునే చంద్రబాబు స్పందించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల కష్టాలను వివరిస్తూ సాగునీటిని విడుదల చేయాలని కోరారు. సాగర్‌లో 490 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తాము నీళ్లు ఇచ్చి చివరి భూముల పంటలను కూడా కాపాడామని, ఇప్పుడు 515 అడుగుల నీటిమట్టం ఉంటే ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సీఎంకు నీటి యాజమాన్యం, వ్యవసాయం గురించి తెలియదని వ్యాఖ్యానించారు. డెల్టా ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసిన రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతుండటాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఒక దశలో మహాధర్నాకు దిగాలని నిర్ణయించగా అదే రోజున భారీ వర్షం పడటంతో విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ఎండలు పెరిగిన నేపథ్యంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతుల కడుపుమంటపై చంద్రబాబు కసిగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తనతో రావాలని సాగర్, కలెక్టరేట్‌ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సాగర్‌లో పంటలు కాపాడేందుకు మార్చి 1, 2 తేదీల్లో నీటిని విడుదల చేయించేందుకు ఒప్పించారు. డెల్టాలో పంటలకు నీటి విడుదల విషయంలో వారం తర్వాత నిర్ణయం తీసుకొంటామన్నారు. ప్రభుత్వంలో చంద్రబాబు చలనం తీసుకురావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు వత్తిళ్లకు దిగావచ్చిన ప్రభుత్వం


గుం'టూరు'ను వీడటం బాధగా ఉందని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. పాదయాత్ర చేపట్టిన తర్వాత ఏ జిల్లాలోనూ 22 రోజులు ఉండలేదు. గుంటూరు జిల్లాలోనే ఇన్ని రోజులు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 201 కిలోమీటర్లు నడిచానని అన్నారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. చంద్రబాబు పాదయాత్ర బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లాలో ముగిసింది. ఈ నెల ఆరో తేదీన జిల్లాలోకి ప్రవేశించిన ఆయన 22 రోజుల పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 126 గ్రామాల్లో 201 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర కొనసాగించారు. రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వారధిపై కృష్ణానదిని దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు.

బాధగా ఉంది