January 6, 2013



పేరుకి పావలా వడ్డీ అయినా రెండు రూపాయలు కడుతున్నాం. ఆర్థికంగా చితికిపోయాం. అప్పుల ఊబిలో కూరుకుపోయాం. మీరే ఆదుకోవాలి''.. నేను పాదయాత్రలో తిరిగిన ప్రతి పల్లెలో వినిపించిన డ్వాక్రా మహిళ ఆక్రందన ఇది. వాళ్ల ఆవేదన ఎంత న్యాయమైనదనేదీ, వాళ్ల వేదన వెనక ఎంత గుండె బరువు ఉన్నదీ పర్వతగిరిలో అడుగుపెట్టినప్పుడు గానీ నా ప్రత్యక్ష అనుభవంలోకి రాలేదు. ఆగ్రామంలోని ఓ భవంతి వద్ద పెద్దఎత్తున మహిళలు గుమిగూడటం కనిపించింది. దగ్గరకు వెళ్లి పలకరించాను.

వారు దారి చూపగా భవంతిలోకి వెళ్లాను. చూడబోతే చాలాకాలంగా వినియోగంలో లేనట్టుంది. వాళ్లూ అదే చెప్పారు. " మీరు సీఎంగా ఉండగా ఈ యూనిట్ పెట్టుకున్నాం. 2001లో డ్వాక్రా మహిళలకు మీరిచ్చిన ఆసరా.. మమ్మల్ని ఈ రంగంలోకి తెచ్చింది. కారంపొడి యూనిట్ పెట్టకొని మాతో పాటు పది మందికి ఉపాధి చూపగలిగాం. కానీ, ఇప్పుడు మేమే రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అప్పులు కట్టలేదని బ్యాంకు మా యూనిట్‌ను స్వాధీనం చేసుకుంది.

రూ. 5 లక్షలు కడితేగానీ తిరిగి మాకు అప్పగించబోమని అధికారులు చెబుతున్నారు సార్..'' అని వాపోయారు. వాళ్లు చెబుతుండగానే, యూనిట్ ప్రారంభోత్సవానికి నేను రాలేక, మా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును పంపిన సంగతి గుర్తుకొచ్చింది. వాళ్ల మాటలు కొంత సంతోషాన్ని, మరింత బాధను కలిగించాయి. నా చేతుల్లో రూపుదిద్దుకున్న ఇలాంటి యూనిట్లు మూతపడటం వ్యక్తిగతంగా నన్ను బాధించే అంశం. కాబట్టే.. యూనిట్ పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని చెప్పి ముందుకు కదిలాను.

కల్లెడ గ్రామంలో ఓ భారీ భవనం నన్ను ఆకర్షించింది. అది గతంలో దొరల గడి అని అక్కడి వారు చెప్పారు. ఇప్పుడు దాన్ని పిల్లల బడిగా మార్చినట్టు తెలుసుకొని ముచ్చటేసింది. లోపలకు వెళ్లి అక్కడ చదువుకుంటున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపాను. నడిచిన అలసటంతా వారి సమక్షంలో తీరిపోయినట్టనిపించింది. నాటి దొరల పిల్లలు దాతలుగా మారి ఈ స్కూలును నడుపుతున్నారట. వారి కృషి, గ్రామస్తుల సహకారం కలగలిసి ఇప్పుడు ఈ బడి ఆదర్శ స్కూలుగా మారిందని చెప్పారు. పేద పిల్లలకు ప్రాధాన్యం ఇచ్చి చదువు చెబుతున్నారని తెలిసి యాజమాన్యాన్ని మనసారా అభినం దించాను.

మహిళా పరిశ్రమ ఊరికే పోదు!



చార్జీలపై యుద్ధమే!
పార్టీ నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు
ఏ మొహంతో పెంచుతున్నారు: నన్నపనేని

దాదాపు పదేళ్ళ కింద విద్యుత్ చార్జీల పెంపుతో అధికారం కోల్పోయిన టీడీపీ ఇప్పుడు అదే అస్త్రంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి వ్యూహరచన చేస్తోంది. ఇంధన సర్‌చార్జికి తోడు విద్యుత్ చార్జీలను పెంచాలని విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన నేపథ్యంలో.. రాష్ట్ర స్థాయిలో భారీ ప్రజా ఉద్యమానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఐదేళ్ల వరకూ విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూ 2009 ఎన్నికల సమయంలో బహిరంగ ప్రకటనలు ఇచ్చి ఓట్లు వేయించుకొన్న కాంగ్రెస్... ఇప్పుడు దానికి విరుద్ధంగా చార్జీల మోత మోగించి ప్రజలను మోసం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై చేపట్టాల్సిన ఉద్యమం ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు తమ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. మొదట తమ పార్టీపరంగా ఉద్యమం మొదలుపెట్టాలని.. రెండో దశలో ఇతర పార్టీలను కలుపుకొని వేడి పెంచాలన్నది టీడీపీ వ్యూహం. ఈ నెల రెండో వారంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. అందులో విద్యుత్ ఉద్యమమే ప్రధాన ఎజెండా కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 'ఏ రూపంలో తమ నిరసనలు ఉండాలి.. ఉద్యమాన్ని ఎలా పకడ్బందీగా రూపు దిద్దాల'న్న దానిపై ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుతం నెమ్మదిగా ఉద్యమాన్ని మొదలుపెట్టి సంక్రాంతి తర్వాత దానిని ఉధృతం చేసే అవకాశం ఉంది. కాగా.. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ.. నానా యాగీ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చార్జీలు పెంచుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. మరో ఐదేళ్ళ వరకూ విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొన్నారని, ఇప్పుడు వాటిని తుంగలో తొక్కి అడ్డగోలుగా పెంచుతూ పోతున్నారని ఆమె విమర్శించారు.

చార్జీల బాదుడుకు తోడు కరెంటు కోతలు ప్రజలను నానా అగచాట్లకు గురి చేస్తున్నాయని, పరిశ్రమలు, రైతులు, చిన్న వ్యాపారులు నష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. భూముల పంపిణీపై మంత్రులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనం చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని నన్నపనేని వ్యాఖ్యానించారు. పేదలకు భూములు పంపిణీ చేస్తే డబ్బులు రావనే మంత్రులు దానిని పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.

ఇక టీడీపీ విద్యుత్ ఉద్యమం





 ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుకు నిర్ణయించడంతో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్‌కు విద్యుత్‌పై సరైన అవగాహన లేదనీ అందుకే చార్జీలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాన్ని పెంచుతుంది. చార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని టీడీపీ నిర్ణయించింది.

విద్యుత్ చార్జీల పెంపుపై మండిపడ్డ టీడీపీ



తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా ... మీ కోసం' పాదయాత్రలో ద్విము ఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అటు ప్రజలతో మమేకం అవుతూనే... ఇటు పార్టీకి కాయకల్ప చికిత్స చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను ఆరా తీస్తూనే మరో ప్రక్క జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలకు భరోసా ఇ స్తూనే సరిగా పని చేయాని నేతలపై అక్షింతలు వేస్తున్నారు.

2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇప్పటి పార్టీని సిద్ధం చేసేందుకు మొద లు పెట్టిన కసరత్తులో పార్టీ శ్రేణులు పూర్తిగాభాగస్వామ్యం అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస చేసిన ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో నియోజవర్గ సమన్వ య కమిటీ సభ్యులతో సమావేశం అవుతున్నా రు. శుక్రవారం కూడా ఇదే చేశారు. పాదయాత్ర మొదలైన మొదటి ఏడు రోజులు పూర్తిగా అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడంపైననే దృష్టి పెట్టారు. జిల్లాలో పాదయాత్ర ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మి గిలి ఉండడంతో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంపై కూడా చంద్రబాబు దృష్టి మళ్ళించారు.

శుక్రవారం జనగామ నియోజకవర్గాన్ని సమీక్షించారు. నియోజవర్గానికి చెందిన నాయకులం తా ఇందులో పాల్గొన్నారు. పార్టీ పరిస్థితిపై ఆ రా తీసారు. పాదయాత్ర ప్రభావం గురించి అడి గి తెలుసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్ళేందుకు కృషి చేయాలని హితవు పలికారు. నా యకుల తీరు పట్ల బాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. పాదయాత్రకు గైర్హాజరౌవుతున్న నాయకులపై ఆగ్రహం ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

పార్టీని బలోపేతం చేసేందుకు కాళ్ళ నొప్పులను భరిస్తూ 63 ఏళ్ళ వయసులో కూడా పాదయాత్ర చేస్తుంటే నాయకులు మాత్రం తప్పించు కు తిరగడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసా రు. తాను వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేస్తుంటే నాయకులు ఎవరికి వారు హద్దులు గీసుకొని తమ నియోజకవర్గంలో పాదయాత్ర జరిగినప్పుడే వెంట నడవ డం, ఆ తర్వాత కనిపించకుండా పోవడాన్ని తప్పుబట్టారు. పాదయాత్ర సాగని నియోజకవర్గాల నాయకులు పాదయాత్రకు చుట్టపుచూపు గా వచ్చిపోవడాన్ని ఎత్తిచూపారు. ఈ పరిస్థితి మారాలని పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి ప ని చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన విషయాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని తీసుకువెళ్ళాలని ప్రత్యేకంగా కోరినట్టు సమాచారం. తె లంగాణ పట్ల టీడీపీ సానుకూలతను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎలాగూ నమ్మరు. ప్రజలు ముఖ్యంగా తెలంగాణవాదులు విశ్వసించేలా కృషి చేయాలని బాబు సూచించారు. పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గాల పరిధిలోని సమస్య లు, టీడీపీతో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై మరింత పూర్తి సమాచారం అందచేయాలని కోరారు.

పాదయాత్రలో ద్విముఖ వ్యూహం



 
చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర సంగెం మండలంలో విజయవంతమైంది. బాబు యాత్రను విజయవంతం చేయడానికి తరలివచ్చిన పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, జనానికి పరకాల నియోజక వర్గ ఇన్‌చార్జి చల్లా ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు యాత్ర లో సంగెం పర్యటనకు ఎంతో ప్రాధా న్యం, విశిష్టత ఉందని అన్నారు.

సంగెం మండలం చిరస్థాయిగా నిలిపోయే విధంగా టీడీపీ నేతలు పాద యాత్ర రూట్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. మండలంలోని పల్లార్‌గూడలో బాబు యాత్ర 1500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించడంతో టీడీపీ చరిత్రలో సంగెం గుర్తుండి పోతుందన్నారు. గురు, శుక్రవారాల్లో సంగెం మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబు వెంట నడిచి యాత్రను విజయవంతం చేశారని చెప్పారు.

పాదయాత్రలో మండల, జిల్లా,రాష్ట్ర నాయకులు పాల్గొనడంతో పాటు కార్యకర్తల శ్రమ మరిచి పోలేనిదని ధర్మారెడ్డి తెలిపారు.

గురువారం మండలంలోని మహారాజ్ తండా నుంచి ప్రారంభమై శుక్రవారం తీగరాజుపల్లిలో ముగిసిందని చెప్పారు.

సంగెంలో బాబు యాత్ర విజయవంతం