January 6, 2013

జనంతో మమేకం సమ్యలపై అభయం



 
తెలుగుదేశం పార్టీ అధినే త నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర 8వ రోజు శనివారం సాఫీగా సాగింది. వర్ధన్నపే ట నియోజకవర్గం తురుకల సోమారం గ్రామం నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికా రు. బాబు బస చేసిన సోమారం క్రాస్ ప్రాంతానికి సమీప గ్రామాల ప్రజలు చేరడంతో ఆ ప్రాం తమంతా భారీ జన సమూహంతో నిండిపోయింది.ఉదయం11.25 గంటలకు వాహనం నుంచి బయటికి వచ్చిన బాబు 12.05 నిమిషా ల వరకు భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నేతలతో సమావేశం పూర్తి చేసి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా నిలుచున్న మహిళలు, కూలీలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మార్గంమధ్యలో ఒక గిరిజనుడి ఇంట్లో జొన్నరొట్టె తిన్నారు. అక్కడి నుంచి బయలుదేరి పర్వతగిరి ఊరు సమీపాన మహిళా గ్రూపుల మహిళలతో సమావేశమయ్యారు. అనంతరం పర్వతగిరి చౌరస్తాలో బహిరంగసభలో ప్రసంగించారు.

నిరుపేదల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటానని అధికారంలోకి రాగానే అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సోమారం క్రాస్ వద్ద ప్రారంభమైన పాదయాత్ర దేవిలాల్ తండా, పర్వతగిరి, కల్లెడ, బూర్గుమడ్ల, మేచరాజుపల్లి మీదుగా సాగి ఎర్రబెల్లిగూ డెం చేరుకుంది. రాత్రి అక్కడే బస చేశారు.

గిరిజన మహిళలతో...

బాబు బస చేసిన ప్రాంతానికి ఆ ప్రాంత న లుమూలల గ్రామాల నుంచి గిరిజన మహిళ లు డప్పుచప్పుళ్లు, సంప్రదాయ వేషధారణలతో భారీగా తరలివచ్చారు. పాదయాత్ర ఆద్యంతం గిరిజనుల నృత్యాలతో సాగింది. దేవిలాల్‌తండాలో మహిళలు స్వాగతం పలికారు. చిలుక మ్మ, శాంతి, నీల, మాలి తదితర మహిళలను ఆప్యాయంగా పలకరించిన బాబు వారి సమస్యలను తెలుసుకున్నారు. తండాల్లోని గిరిజనులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి అభివృద్ధికి ఐటీడీఏ తరహాలో ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

గిరిజనుడి ఇంట్లో రొట్టె తిన్నబాబు...

చంద్రబాబు దేవిలాల్‌తండాలోని శ్రీను అనే టీడీపీ కార్యకర్త ఇంట్లో జొన్న రొట్టె ఇష్టంగా తి న్నారు. దేవిలాల్‌తండా మీదుగా పాదయాత్ర చేస్తున్న బాబుకు ఎదురేగి స్వాగతం పలికిన గిరిజన కార్యకర్త తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అతడి ఆహ్వానాన్ని మన్నించిన బా బు ఇంట్లోకి వెళ్లి ఆప్యాయతతో అందించిన జొ న్నరొట్టెను తిన్నారు. శ్రీను కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. బాబును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

తరలివచ్చిన నేతలు...

పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును కలిసేందుకు తెలంగాణ జిల్లాల నేతలతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునిత వచ్చా రు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన నేతలు చంద్రబాబు యోగక్షేమాలు తెలుసుకోవడమే కాకుండా ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. దివింగత నేత పరిటాల రవి సతీమణి పరిటాల సునితను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. బాబును కలిసిన వారిలో మ హబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యే లు సీతా దయాకర్‌రెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హ న్మంత్‌షిండే, తుమ్మల నాగేశ్వర్‌రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ లక్ష్మినారాయణ, బోథ్ ఎ మ్మెల్యే నగేష్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, విజయరామారావు, సినీ నటి కవిత వున్నారు.