May 20, 2013

జగిత్యాల: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఆయన తనయుడు లోకేష్ నడుంబిగించారు. తెలుగు దేశం పార్టీ ఇచ్చిన 5 ముఖ్యమయిన హామీలకు పంచరత్నాలుగా నామకరణం చేసారు. సోమవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన మినీమహానాడులో పాల్గొన్న లోకేష్ తనదైన శైలిలో ప్రసంగించారు. అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి మానిఫెస్టోను విడుదల చేసారు. దానికి పంచరత్నాలు అని నామకరణం చేసారు. ఇందులో మొదటగా రైతులకు రుణాల మాఫీ, రెండు మద్యం బెల్టు షాపుల ఎత్తివేత, మూడు తాగునీటి సమస్య పరిష్కారం, నాలుగు బీసీలకు వంద సీట్లు, ఐదు నిరుద్యోగులకు నెలనెలా నగదు.. ల్యాప్ టాప్ ల అందజేతగా ఇందులో పేర్కొన్నారు.

ఇప్పటివరకు తండ్రి చేసిన పాదయాత్ర ఔన్నత్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసేకేల్లె ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మొత్తానికి చినబాబు వచ్చే ఎన్నికల కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

తెలుగుదేశం 'పంచరత్నాలు' ఇవే !


అవినీతి మంత్రులపై రాష్టప్రతికి బాబు విజ్ఞప్తి
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రణబ్‌ బద్దకు
అవినీతిని కిరణ్‌ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
వైఎస్‌ అవినీతిపై ఆదినుంచి పోరాడుతున్నామని ప్రకటన

న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహా రంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బృందం సోమవారం నాడు రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించా లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కళంకిత మంత్రు లను తక్షణమే తొలగించాలని రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి రాష్టప్రతి భవన్లో రాష్టప్రతితో సమావేశమైన అనంతరం ఢిల్లీలోని మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఫెమా ఉల్లంఘన కేసులో కోర్టు తప్పు బట్టినా మంత్రి పార్థసారథి పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. అవినీతిపై పోరాడాల్సిన వ్యక్తే అవినీతిని ప్రొత్సహిస్తున్నారని సీఎం కిరణ్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర సరిహద్దులు మార్చేసినా ప్రభుత్వం పట్టించుకునేలా లేదని మండిపడ్డారు.

వైఎస్‌ హయాంలో విచ్చలవిడి అవినీతి జరిగిందని, చంద్రబాబు నాయుడు ఆరోపిం చారు. జలయజ్ఞం పేరుతో వైఎస్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మరమ్తత్తుల్లో అవినీతి పేరుకుపో యిందన్నారు. నీకది- నాకది ( క్విడ్‌ ప్రో క్రో) పద్దతిలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పలు ఛార్జీషీట్ల ద్వారా 43 వేల కోట్లు దుర్వియ్గోగం అయ్యాయని, సీబీఐ నిర్ధారించిందని చంద్రబాబు రాష్టప్రతి దృస్టికి తీసు కువెళ్లారన్నారు. మైనింగ్‌ మాఫియా, రాజా ఆఫ్‌ కరెప్షన్‌ పుస్తకాలను రాష్టప్రతికి అందజేశామని చంద్ర బాబు నాయుడు అన్నారు. మైనింగ్‌ మాఫియా ప్రజా స్వామ్యానికి హానిపై వేసిన ఈ పుస్తకాలను పార్లమెం టులో అందరికీ అందజేశామన్నారు.

వైఎస్‌, ఆయన కుంటుంబ అవినీతిపై ఆధారాలతో సహా ఆ పుస్తకంలో రాశామన్నారు. అయితే అవినీతి డబ్బులతో కొందరు పత్రిక, టీవీ ఛానల్‌ పెట్టుకుని తమ పార్టీపైనా, తన పైనా వ్యక్తిగతంగా ఆ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇలా అన్ని విషయాలపైనా బ్లాక్‌ మేయిల్‌ చేయడానికి కూడా ఆ పత్రిక, ఛానల్‌ వెనుకాడడం లేదని మండిపడ్డారు. వైఎస్‌, జగన్‌ అక్రమాస్తులపై అన్ని రాజ్యాంగా బద్ద సంస్థల ముందు పోరాటం చేశామని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అన్నారు.

కళంకితులను సాగనంపండి!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కళంకిత మంత్రులు రాజీనామా చేస్తే ఎందుకు ముఖ్యమంత్రి ఆమోదించడం లేదని ఆయన ప్రశ్నించారు. మొత్తం కళంకిత మంత్రులంతా పదవులనుంచి తప్పుకోవలసిందేనని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రపతిని కలవడానికి చంద్రబాబు డిల్లీ వెళ్లారు.

సి.ఎమ్.పై చంద్రబాబు విమర్శలు!

హైదరాబాద్ : కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద టీడీపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. 24 గంటల్లోపు కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రాజ్‌భవన్‌ను ముట్టడిస్తాం : తలసాని


హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ పలు జిల్లాల్లో టీడీపీ ఆందోళనకు దిగింది. చిత్తూరు, ఆదిలాబాద్‌, అనంతపురం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ధర్నా, రాస్తారోకోలు చేశారు.

కళంకిత మంత్రులు : టీడీపీ ఆందోళన


న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని టీడీపీ బృందం కలిసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలగించేలా చూడాలని రాష్ట్రపతికి బాబు వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం


విజయవాడ: ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ఎన్టీఆర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు.

కళంకిత మంత్రులను తొలగించాలి:టిడిపి ధర్నా

న్యూఢిల్లీ : వైఎస్‌ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని టీడీపీ చీఫ్‌ నారా చంద్రబాబునాయుడు తెలిపారు. వైఎస్‌ చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిలో అక్రమాలు జరిగాయని ఆయన చెప్పారు. గనులు, ఖనిజ సంపదను, ఎస్‌ఈజడ్‌ల పేరుతో భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతూ సోమవారం బాబు ఆధ్వర్యంలో టీడీపీ బృందం రాష్టప్రతిని కలిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్‌ను కోరినట్టు ఆయన చెప్పారు. రాజా ఆఫ్‌ కరప్షన్‌, మైనింగ్‌ మాఫియా పుస్తకాలను ప్రణబ్‌కు అందించామని ఆయన తెలిపారు.

వైఎస్‌ హయాంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగింది:చంద్రబాబు



న్యూఢిల్లీ : అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. క ళంకిత మంత్రులపై చర్యలు తీసుకుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు బాబు తెలిపారు. లక్ష కోట్లు అవినీతి జరిగిందని రాష్ట్రపతికి వివరించామని, అవినీతి మంత్రులపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. క్విడ్‌ప్రోకో ద్వారా అవినితికి పాల్పడ్డారని బాబు ఆరోపించారు. అవినీతిపై పలు రూపాల్లో పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఈడీ విఫలమైందని విమర్శించారు. వైఎస్ ప్రవేశ పెట్టిన నీటి ప్రాజెక్టులన్నింటిలోనూ అవినీతి జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో ఛానెల్, పేపర్ పెట్టి జగన్ పార్టీ అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. మైనింగ్ మాఫియాపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గనులు, ఖనిజసంపద, ఎస్ఈజెడ్ పేరుతో భూములను అన్యక్రాంతం చేశారని బాబు పేర్కొన్నారు. వైఎస్ చేసిన అవినీతికి ప్రధాని మన్మోహన్ సింగ్ వత్తాసుపలికారని ఆరోపించారు. అవినీతిపై చట్టసభల్లో పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.

అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పు : చంద్రబాబు


కరీంనగర్ : అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. జగిత్యాల మినీ మహానాడులో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన దారి తప్పిందని విమర్శించారు. అందుకే సమర్ధవంతమైన నాయకుడినే ముఖ్యమంత్రిగా ఎన్నకోవాలని అన్నారు.

సమర్ధ నేతనే సీఎంగా ఎన్నుకోవాలి: లోకేష్


నెల్లూరు, మే 20 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అత్యాసవల్లనే మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైళ్లకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మినీ మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జివోలపై సంతకాలు చేసిన మంత్రులు తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందేనని చెప్పారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టింది. ఆందోళనలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... 48 గంటల్లో మంత్రులను తొలగించకపోతే రాజభవన్, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

'జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు శిక్ష అనుభవించాల్సిందే'

 ప్రజల గురించి ఆలోచించే నాయకుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని లోకోష్ నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం జగిత్యాలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2004 వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుండేదని, ఇప్పుడు వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నేత కావాలన్నారు. ఆ సమర్థత చంద్రబాబుకే ఉందన్నారు.

కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా నిలువాలని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలన్నారు. కలెక్షన్ కింగ్‌లను ఆదర్శంగా తీసుకుంటే సమాజానికి అనర్థమేనని విమర్శించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత టిడిపి కార్యకర్తల పైనే ఉందని ఆయన చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే పంచరత్నాలు అమలు చేస్తామన్నారు.

టిడిపికి పత్రిక, ఛానల్ లేవని, అవి ఉంటే మనమూ జైల్లోనే ఉంటామని లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ, మద్యం గొలుసు దుకాణాలను రద్దు చేయిస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. సామాజిక సేవ, సామాజిక న్యాయం అన్న వాళ్లు సొంత సేవ, సొంత న్యాయం చూసుకొని వెళ్లిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి లోకేష్ అన్నారు.

ప్రజల గురించి ఆలోచించే నేత చంద్రబాబే : లోకేష్


వైయస్‌పై నిప్పులు!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సొమ్ముతో దినపత్రిక, టివి ఛానల్ పెట్టి ప్రత్యర్థులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాబు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం మధ్యాహ్నం కలిసింది. ఆ తర్వాత బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలోని కళంకిత మంత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్రపతిని కోరామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. వైయస్ చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. గనులు, ఖనిజ సంపద, ఎస్‌ఈజెడ్ పేరుతో భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన మండిపడ్డారు.

సిబిఐ తన ఛార్జీషీటులో రూ.43వేల కోట్ల అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో నష్టం వచ్చిందని చెప్పిందన్నారు. నీకది నాకిది ద్వారా వైయస్ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అక్రమాలతో పేపర్, ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, దేశ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పైన చంద్రబాబు మండిపడ్డారు.

వైయస్ అక్రమాల పైన టిడిపి వ్యాజ్యం వేస్తే కోర్టులు స్పందించాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులను కాపాడుతున్నారని ఆరోపించారు. మంత్రులు రాజీనామా చేసినా ఆయన ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

సాక్షితో జగన్ బ్లాక్‌మెయిల్!: బాబు


కరీంనగర్/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని నారా లోకేష్ సోమవారం అన్నారు. లోకేష్ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2004 వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుండేదని, ఇప్పుడు వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నేత కావాలన్నారు. ఆ సమర్థత చంద్రబాబుకే ఉందన్నారు. కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా నిలువాలని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలన్నారు. కలెక్షన్ కింగ్‌లను ఆదర్శంగా తీసుకుంటే సమాజారనికి అనర్థమేనని విమర్శించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత టిడిపి కార్యకర్తల పైనే ఉందని ఆయన చెప్పారు.

టిడిపి అధికారంలోకి రాగానే పంచరత్నాలు అమలు చేస్తామన్నారు. టిడిపికి పత్రిక, ఛానల్ లేవని, అవి ఉంటే మనమూ జైల్లోనే ఉంటామని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ, మద్యం గొలుసు దుకాణాలను రద్దు చేయిస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.
అన్ని వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు.

సామాజిక సేవ, సామాజిక న్యాయం అన్న వాళ్లు సొంత సేవ, సొంత న్యాయం చూసుకొని వెళ్లిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి అన్నారు.

చిరు, జగన్‌లపై లోకేష్ విసుర్లు

 
న్యూఢిల్లీ : కళంకిత మంత్రులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి మంత్రులను కాపాడటంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరిక లేకుండా ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని మండిపడ్డారు. వైఎస్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆరోపించారు. వైఎస్ చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిలో అక్రమాలు జరిగాయన్నారు. గనులు, ఖనిజ సంపదను, ఎస్‌ఈజెడ్‌ల పేరుతో భూములను అన్యాక్రాంతం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ అవినీతిపై రాజా ఆప్ కరప్షన్ పేరుతో టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ ఉమ్మడిగా ప్రచురించిన పుస్తకాన్ని ప్రణబ్‌కు ఇచ్చామని తెలిపారు. వైఎస్ అక్రమాలపై టీడీపీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టులు స్పందించాయని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో పత్రిక, టీవీ పెట్టి ప్రత్యర్థులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మంత్రులనుతొలగించాలని రాష్ట్రపతినికోరాం’