October 22, 2012

దేశ, విదేశాలు నా పాలనను అనుసరిస్తున్నాయి
కాంగ్రెస్ దోపిడీ అపితే సమస్యలు తీరుతాయి

  తమ పాలనపై కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని, తన పాలనను దేశ, విదేశాలు అనుసరించాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల దోపిడీని ఆపితే ఆ డబ్బుతో సమస్యలన్నీ తీరుతాయని ఆయన పేర్కొన్నారు.

'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర 21వ రోజుకు చేరింది. సోమవారం ఉదయం జిల్లాలోని కోడూరు నియోజకవర్గం కొత్తకోట, పాలవాగవంచ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే నూటికి నూరు శాతం రైతులకు వడ్డీ రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబును ఏపీయూడబ్లూజే ప్రతినిధులు కలుసుకుని యాత్రకు సంఘీభావం ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరణకు కృషి చేయాలంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఈరోజు మొత్తం 12 కి.మీ పాదయాత్రగా చంద్రబాబు వెళ్లనున్నారు మధ్నాహ్నానికి సుంకేశుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుని, రాజోలి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. బాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీ.టీడీపీ ఫోరం నేతలు, అభిమానులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాదయాత్రలో నారా లోకేష్ పాల్గొననున్నట్లు సమాచారం.

దేశ, విదేశాలు నా పాలనను అనుసరిస్తున్నాయి

'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం తెలంగాణలో అడుగుపెట్టారు. కర్నూలు జిల్లాలో యాత్రముగించుకుని మహబూబ్‌నగర్ జిల్లా సుంకేశుల డ్యామ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అయనకు టీడీపీ నేతలు పోతుల సురేష్ (పరిటాల రవి వర్గం నేత), తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు.

జిల్లాలోని రాజోలు నుండి బాబు యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. జిల్లాలో మొత్తం 12 రోజుల పాటు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు అలంపూర్, గద్వాల్, ముక్తాల్, నారాయణపేట, పండగల్, దేవరకద్రలలో యాత్ర నిర్వహిస్తారు. రాత్రికి శాంతినగర్ చేరుకుని అక్కడ బస చేస్తారు.

కాగా చంద్రబాబు నాయుడు యాత్రను అడ్డుకుంటామని తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రకటించిన నేపథ్యంలో బాబు యాత్రకు మద్దతుగా టీడీపీ శ్రేణలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొననున్నారు. అలాగే మాదిగ విద్యార్థి ఫెడరేషన్ కూడా పాదయాత్రలో పాల్గొంటున్నది. పోలీసులు కూడా భారీగా మోహరించారు.

21వ రోజు తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు 22.10.2012

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర 21వ రోజుకు చేరింది. సోమవారం ఉదయం జిల్లాలోని కొత్తకోట , పాలవాగవంచ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు మొత్తం 12 కి.మీ పాదయాత్రగా వెళ్లనున్నారు మధ్నాహ్నానికి సుంకేశుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోకి చంద్రబాబు పాదయాత్రగా చేరుకోనున్నారు. ఆయన ఘన స్వాగతం పలికేందుకు టీ.టీడీపీ ఫోరం సన్నాహాలు చేస్తోంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్ పాల్గొననున్నారు.

21వ రోజు చంద్రబాబు పాదయాత్ర పోటోలు 22.10.2012