November 1, 2012



ఎర్రన్నాయుడు జీవిత విశేషాలు

న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించి రాజకీయాలలో ప్రవేశించి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఎర్రన్నాయుడు చూడడానికి కాస్త భారీగా కనబడతారు కాని, ఆయన వయసు కేవలం ఏభై ఐదేళ్లే. ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్న ఎర్రన్నాయుడు ఆకస్మికంగా మరణించడం తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటుగానే చెప్పవచ్చు. ఆయన జీవిత విశేషాలను ఒక సారి చూస్తే ఎర్రన్నాయుడు కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. కళావతమ్మ, దాలినాయుడు ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు పిల్లలలో ఆయన మొదటివారు. గార గ్రామంలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివ ర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1995-96 మధ్య కాలంలో చీఫ్ విప్‌గా సేవలందించారు.1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేతగానూ పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ క్యాబినెట్ మంత్రిగా ఆయన పనిచేశారు.

   

ఉత్తరాంధ్ర నుంచి తొలి క్యాబినెట్ మంత్రి ఎర్రన్నాయుడు

ఆయన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమిని చూసింది రెండువేల తొమ్మిదిలోనే. ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి క్యాబినెట్ స్థాయిలో కేంద్ర మంత్రి అయిన తొలి వ్యక్తి ఎర్రన్నాయుడు.ఆయన 1994లో తెలుగుదేశం పార్టీ పక్షాన హరిశ్చంద్ర పురం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిని ఆశిస్తే, ఛీఫ్ విఫ్ పదవి మాత్రమే దక్కింది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.పై తిరుగుబాటు జరిగిన సందర్భంలో ఈయన చంద్రబాబు పక్షాన నిలిచారు.ఆ తర్వాత 1996 నాటికి లోక్ సభ ఎన్నికలు రావడంతో శ్రీకాకుళం నుంచి టిడిపి అభ్యర్దిగా బలమైన వ్యక్తి ఉండాలని ఈయనను బరిలో దించారు.ఎన్.టి.ఆర్. అప్పటికే చనిపోగా , ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి ఆద్వర్యంలో ఎన్.టి.ఆర్.టిడిపి ఆవిర్భవించింది. ఆ పార్టీ తరపున ఎన్.టి.ఆర్.పెద్ద కుమారుడు జయకృష్ణ పోటీచేశారు.ఆయనను ఎదుర్కుని ఎర్రన్నాయుడు మొదటి సారి సంచలన విజయం సాధించారు. దాంతో ఆయన దశ తిరిగింది. అదే సమయంలో కేంద్రంలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడగా, కాంగ్రెస్,బిజెపి యేతర పక్షాలు కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పేవారు. ఆ తరుణంలో దేవెగౌడ ప్రధాని అయ్యారు.ఆయన మంత్రి వర్గంలో ఎర్రన్నాయుడు క్యాబినెట్ హోదాలో చేరడం విశేషం.గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన ఆ తర్వాత వచ్చిన గుజ్రాల్ ప్రభుత్వంలో కూడా కొనసాగారు.ఆ తర్వాత ఎన్.డి.ఎ. హయాంలో టిడిపి కేంద్రంలో చేరలేదు. లేకుంటే మళ్లీ మంత్రి అయి ఉండేవారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారి ఒ కేంద్ర మంత్రి అయిన ఘనత ఎర్రన్నాయుడుకు దక్కింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కు చెందిన కిషోర్ చంద్రదేవ్ 1979లో చరణ్ సింగ్ క్యాబినెట్ లో సహాయ మంత్రిగా ఉండేవారు.ఇప్పుడు మాత్రమే ఆయన క్యాబినెట్ మంత్రి అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు అనే సీనియర్ నాయకుడు ఆరు సార్లు లోక్ షభకు ఎన్నికైనా రాని మంత్రి పదవి , తొలిసారి ఎన్నికైన ఎర్రన్నాయుడుకు దక్కడం విశేషం. 

ఎర్రన్నాయుడు జీవిత విశేషాలు ,ఉత్తరాంధ్ర నుంచి తొలి క్యాబినెట్ మంత్రి ఎర్రన్నాయుడు


ఎర్రన్నాయుడు మరణానికి సంతాపం 

 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు(55) రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదకరం.ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి సమీపంలో గురువారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడడానికి విశ్వయత్నం చేసినా ఫలితం దక్కలేదు.ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై శ్రీకాకుళంకు తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.. వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై మలుపుతిరుగుతున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఎర్రన్నాయుడు మరణవార్త తెలుసుకుని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎర్నన్నాయుడు మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాం.

 


ఎర్రన్నాయుడు మరణానికి సంతాపం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి కింజరపు ఎర్రన్నాయుడు (55) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విశాఖలోని శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా శ్రీకాకుశం జిల్లా రణస్థలం వద్ద తాను ప్రయాణిస్తున్నటువంటి ఇన్నోవా కారు ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ ను డీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాగా తీవ్రంగా గాయపడిన ఎర్రన్నాయుడుని శ్రీకాకుళం రిమ్స్ సాయి శేషాధ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతలో ఆసుపత్రిలో మృతిచెందారు. ఈయనతో పాటు శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షుడి బాబ్జీ చౌదరితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


కేంద్ర గ్రామీణ శాఖ మంత్రిగా కేబినేట్ లో హోదాలో పనిచేసినటువంటి ఎర్రన్నాయుడు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపిగా గెలుపొందారు. బిసి వర్గానికి చెందిన ఎర్రన్నాయుడు గతంలో దేశంలో కీలక రాజకీయాను నడిపారు. తెలుగుదేశం పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఎర్రన్నాయుడు కీలకంగా పాల్గొనేవారు. అదే విధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఎర్రన్నాయుడు హరిశ్చంద్రపురం నుండి 1983లో మొట్టమొదటి సారిగా గెలుపొందారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపిగా 2009వరకు ఎన్నికయ్యరు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరి నేతగా కూడా పనిచేశారు. 1957, ఫిబ్రవరి 23న కోట బొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. దాలి నాయుడు, కళావతమ్మల మొదటి సంతానమైనటువంటి ఎర్రన్నాయుడు 1996నుండి 1998వరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్ కు నిధులను మంజూరీ చేయడంలో ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను పూర్తి చేసినటువంటి ఎర్రన్నాయుడు విద్యార్థి దశలోనే రాజకీయాలను అలవర్చుకున్నారు. ఎర్రన్నాయుడు మరణ వార్త విన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.

ఎర్రన్నాయుడు ఇక మనకు లేరు...


వైకాపా క్యాంపు కార్యాలయంగా చంచల్‌గూడ జైలు

"వస్తున్నా మీకోసం" VIDEO SONG 1

chandrababunaidu vastunnameekosam padayatra at devarakadra segment

దెవరకద్ర సెగ్మెంట్ లో 31వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు..01.11.2012


chandrababbunaidu_vastunnameekosam_padayatra_pressnote_1.11.2012

32వ రోజు పాదయాత్ర నారయణపేట సెగ్మెంట్ లో...పత్రికా ప్రకటన 1.11.2012

కాంగ్రెస్ తె దే పా ల కార్యాలయాలకు టు లెట్ బోర్డు
అంటున్న వై ఎస్సార్ సి పి నాయకులు
తమ కార్యాలయం ప్రస్తుతం ఎక్కడ వుందో
తెలుసుకోలేక పోతున్నారు..
పాపం, పార్టీ నాయకుడితో పలు హామీలు పొంది
కప్పదాట్లు చేయడానికి
కార్యాలయం వున్న కారాగారం వరకు వెళ్లి
ఖచ్చితమైన హామీలు పొంది
అమ్మ దగ్గరికి వచ్చి కండువా కప్పుకొంటున్నారు
రేపు అధికారం లో కి వస్తే
జనాలు జైలు దగ్గరికి వెళ్లి
ములాఖత్ పొంది
సమస్యలు చెప్పుకొని
అమ్మ గారికి దండం పెట్టుకోవాలేమో
ప్రజా ప్రతినిధులు కూడా
అక్కడికే వెళ్ళే
అక్కడే అందుబాటులో వున్న
అధికారులకు
అక్కడే వున్న నాయకుడితో
ఆదేశాలు చేయించాలేమో
చిప్ప కూడు తింటున్న
సాటి ఖైదీలు ఆలోచనలతో
పథకాలు ప్రకటించి
ప్రజలకు అమలు చేయిస్తారేమో

సేకరణ:www.chaakirevu.wordpress.com

కారాగారం వరకు వెళ్లి ఖచ్చితమైన హామీలు పొంది అమ్మ దగ్గరికి వచ్చి కండువా కప్పుకొంటున్నారు


Chandrababu Slams KKR Over Power Shortage to Farmers 01 11 2012_telugutouch.com





ఈ రోజు పాదయాత్ర టీ.వి కవరేజ్ 01.11.2012

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పేదలను ఆదుకోడానికే చంద్రబాబు పాదయాత్రు చేపట్టినట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు.

పేదలను ఆదుకోడానికే చంద్రబాబు పాదయాత్ర,ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర 31వ రోజుకు చేరింది. గురువారం ఉదయం సీసీ కుంట మండలం పర్కాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు.

31 వ రోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు పాదయాత్ర

టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బీర్కూర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు కమ్మసత్యనారాయణ, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి బధ్యానాయక్‌లు మాట్లాడారు. బాబుపాదయాత్ర త్వరలో జిల్లాలో కొనసాగనుందన్నారు. తెలంగాణ కు టిడిపి అనుకూలంగా ఉందని టిడిపి యాత్రను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. సింగూరు జలాలను ఆంధోల్‌ నియోజకవర్గానికి తరలించే జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్‌ జయప్రకాశ్‌, పోతురెడ్డి, వీరేశం, సత్యనారాయణ ,రశీద్‌ తదితరులు ఉన్నారు

పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం 01.11.2012


chandrababunaidu_vastunnameekosam_padayatra_devarakadra_photos_31.10.2012

30వ రోజు బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలో పాదయాత్ర పోటోలు 31.10.2012

వారి అవినీతిని ఆపితే రుణమాఫీ ఎంతో ఈజీ
సంక్షేమ పథకాలను నిలిపివేయనక్కరలేదు..
సీఎంకు చంద్రబాబు జవాబు

కాంగ్రెస్ పాలనలో రైతులు దివాలా..
సమస్యలను పరిష్కరించలేని ఇందిరమ్మ బాటలెందుకు
పత్రికల్లో ఫొటోలతో ప్రజలను ప్రభావితం చేయలేరు..
రుణమాఫీ అమలు చేసి తీరతాం
నా పాదయాత్రలో పాల్గొనండి.. మీ పాలన గురించి తెలుస్తుంది..
కిరణ్‌కు సవాల్
  మీ(కాంగ్రెస్ నాయకుల) అవినీతిని నియంత్రిస్తే రుణమాఫీ అమలు కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రుణమాఫీ అమలు కోసం ఏ సంక్షేమ పథకాన్నీ నిలిపి వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు ఎలా చేస్తావంటూ చంద్రబాబునుద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర 30వ రోజు.. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో బుధవారం కొనసాగింది.

ఈ సందర్భంగా చిన్నచింతకుంట, వడ్డెమాన్‌లలో నిర్వహించిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. రుణాలు మాఫీ చేయాలని గత ఎన్నికల ముందు తాము డిమాండ్ చేస్తే, అది ఎలా సాధ్యమంటూ అప్పటి సీఎం వైఎస్ కూడా ఇలాగే ప్రశ్నించారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనపై.. రుణమాఫీ ఎలా సాధ్యం అంటూ కిరణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రుణమాఫీ అమలు చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు.

కాంగ్రెస్ పాలనవల్లే రైతులు దివాలా తీశారని ధ్వజమెత్తారు. మీ దోపిడీ సొమ్మును రికవరీ చేస్తే రుణ మాఫీ అమలు ఒక్కటే కాదు.. రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పడం కూడా సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం ఇందిరమ్మ బాటపై మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించలేని బాటలెందుకని విమర్శించారు. పత్రికల్లో ఫొటోలతో ప్రజలను ప్రభావితం చేయలేరని ఎద్దేవా చేశారు. వైఎస్, కిరణ్ ఇద్దరూ రైతు వ్యతిరేకులే అని ఆరోపించారు. అవినీతిని ముఖ్యమంత్రే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సీఎం, కాంగ్రెస్ నేతలు తన పాదయాత్ర వస్తే వారి పాలన ఎలా ఉందో తెలస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు రూ. 600 పింఛన్ ఇచ్చి తీరుతామని పేర్కొన్న చంద్రబాబు... ఒక వేళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ఎక్కువ పింఛన్ ఇస్తామని ప్రకటించారు. జైల్లో కూర్చున్న వ్యక్తులు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు కూడా పశువుల కంటే హీనంగా అమ్ముడు పోతుండడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమౌతుందోనని ఆందోళన కలుగుతోందన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు ప్యాకేజీలకు అమ్ముడు పోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని పదేపదే స్పష్టం చేసినా, అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాసినా, కొంత మంది తన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. సీఎం కిరణ్ తెలంగాణ జిల్లా పర్యటనను ఎవరూ అడ్డుకోలేదని, పిల్ల కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బోనగిరిలో సభ ఏర్పాటు చేసుకున్నా ఎవరూ అడ్డుకోలేదని, పేదల కష్టాలు తెలుసుకొని, వారిని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

టీడీపీ వచ్చాకే తెలంగాణ ప్రాంతంలో విద్యా, తాగునీరు, రోడ్లు వంటి అభివృద్ధి పనులపై చర్చలో తానే పాల్గొంటానని దీనిపై కాంగ్రెస్ నేతలు సిద్ధమేనా అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది కూడా కాంగ్రెస్సేనని అన్నారు.

బీజేపీ నిరసన
చంద్రబాబు చేపట్టిన పాదయాత్రను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంటలో బీజేపీ నాయకులు నల్లజెండాలు కట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ మహేశ్వర్, ఎస్ఐలు దానం, రాజు సీసీకుంటకు చేరుకొని, బీజేపీ నాయకులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బాబు పాదయత్రను నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ ముందున్న రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడినుంచి పంపించారు.

ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న బాబు
పాదయాత్రలో భాగంగా చంద్రబాబు తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడల్లా రైతులు చప్పట్లు కొట్టి మద్దతిచ్చారు. అధికారంలోకి రాగానే బెల్టుసాపుల రద్దు కోసం రెండో సంతకం చేస్తానని చెప్పగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

వారి అవినీతిని ఆపితే రుణమాఫీ ఎంతో ఈజీ ,సంక్షేమ పథకాలను నిలిపివేయనక్కరలేదు.(పాదయాత్ర 30వ రోజు) .