October 25, 2012

24వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు (Part 2) 25.10.2012

  అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వేదపండితులు, పురోహితులకు గౌరవ వేతనం ఇస్తామని పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ ప్రయోజనం పొందని వర్గాలు, నిర్లక్ష్యానికి గురయిన వర్గాలు తెలుగుదేశం స్వర్ణ యుగం తేనుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పురోహింతులు, వేద పండితులకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
మరోసారి అగ్రవర్ణాల ప్రజల గురించి బాబు ప్రస్తావిస్తూ అగ్రవర్ణాల్లో అనేకమంది పేదలున్నారని, వారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు నోచుకోక మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆవేదన చెందారు. అందుకే అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రత్యేక చర్యలు తీసుకోనుందన్నారు. వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కేలా చూస్తానని అన్నారు.
చంద్రబాబు ‘ఎ ఉమెన్ ఇన్ బ్రహ్మణిజం’ సినిమాపై వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు ఉండరాదని, అది వారిపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపైన కూడా దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.

పురోహింతులు, వేద పండితులకు గౌరవ వేతనం,అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రత్యేక చర్యలు (24వ రోజు) 25.10.2012


 http://kommineni.info/articles/dailyarticles/content_20121025_11.php



తెలంగాణలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది.చంద్రబాబు కు రక్షణగా మాదిగ దండోరాకు చెందిన కార్యకర్తలు ఆయన పర్యటనలో ఉంటున్నారు.దీంతో ఎవరైనా నిరసన తెలియచేయాలన్నా వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని బావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు ఎలాంటి ఆటంకాలు లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి మాత్రం నాయకులలో ఐక్యత లేకపోవడం వల్లనే చంద్రబాబు పాదయాత్ర చేయగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే జెఎసి నేతలు చంద్రబాబుకు నిరసన చెప్పడానికి ప్రయత్నించి శాంతి నగర్ వద్ద అరెస్టు అయ్యారు.కాని నాగం జనార్దనరెడ్డి మాత్రం ఆ దరిదాపులకు వెళ్లలేదు. కాని ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు టిడిపి కార్యకర్తలతో పాటు తెలంగాణకు చెందిన మాదిగ దండోరా అండగా నిలబడింది. మాదిగల డిమాండుకు అనుకూలంగా వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయడంతో చంద్రబాబుకు వారు గట్టి మద్దతుదారులుగా మారారు.చంద్రబాబుకు నిరసన చెప్పడానికి వెళ్లిన కోదండరామ్ ప్రభృతులకు మాదిగ దండోరా కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడం విశేషం.   

చంద్రబాబుకు అండగా మాదిగ దండోరా కార్యకర్తలు! -కొమ్మినేని శ్రీనివాసరావు (చీఫ్ ఎడిటర్,ఎన్‌టివి)

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరోక్షంగా షర్మిళ పాదయాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్‌లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారే రోడ్డెక్కి మనకంటే పెద్దగా అరుస్తున్నారు తమ్ముళ్లూ అంటూ పరోక్షంగా షర్మిళ పాదయాత్రపై బాణాలు విసిరారు. అవినీతి,అక్రమాలను అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీని దీవించాలంటూ కోరారు.

 మహబూబ్ నగర్ జిల్లా వాసులను చూస్తుంటే చాలా బాధ వేస్తోందనీ, గుక్కెడు నీళ్లు లేక బిందె నీళ్లను రూ. 20 కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో డెంగ్యూ జ్వరం వచ్చి పసిపిల్లలు మంచానపడుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పనులు చేయకపోవడానికి కారణం ఒకటి ఉందనీ, అదే అవినీతి అన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు అంతా అవినీతిమంతులయిపోయారనీ, సొమ్మును కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే ప్రజలకు ఏమీ మిగల్చరని అన్నారు.

ఇక అవినీతి నాయకులను ఆదరించకూడదని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. మీ పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలన్నా, అభివృద్ధి బాటలో పయనించాలన్నా అవినీతిపరులకు ఎంతమాత్రం మద్దతు ఇవ్వకూడదని కోరారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడినవారే రోడ్డెక్కి మనకంటే పెద్దగా అరుస్తున్నారు--షర్మిళ పాదయాత్రపై బాణాలు




 ఎవరైనా జనాలపై ప్రభావం చూపగలిగే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నారనగానే.. వారి లోపాలు వెతకడం, వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పటడుగులు వేసుంటే వాటిని బయటికి తీయడం మామూలే. ఇప్పుడు షర్మిళ వంతు వచ్చింది. అన్న జగన్ జైల్లో ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు పాదయాత్ర చేస్తున్న షర్మిళకు సంబంధించిన కొన్ని లోగుట్టులు బయటపెట్టే పనిలో పడింది తెలుగుదేశం మహిళా నాయకురాలు శోభా హైమవతి.

 ఆమె షర్మిళ వ్యక్తిగత జీవితంలోని కొన్ని గుట్టుమట్టుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. షర్మిల మొదటి భర్త చంద్రప్రతాప్ రెడ్డి (విజయమ్మ చినతమ్ముడు, షర్మిళ మేనమామ) యాక్సిడెంట్ లో మరణించాడా, లేక ఎవరైనా హత్య చేశారా? అంటూ శోభా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పి ఆమె పాదయాత్ర చేపట్టాలని డిమాండ్ చేశఆరు. ఐతే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎందుకంటే చంద్రప్రతాప్ కు షర్మిళ విడాకులిచ్చాకే అనిల్ ను వివాహం చేసుకుంది. శోభ అనుమానాల సంగతి పక్కనబెడితే షర్మిళ వ్యక్తిగత జీవితం.. ముఖ్యంగా వైవాహిక జీవితం వివాదాస్పదం అన్నది వాస్తవం. చంద్రప్రతాప్ తో వివాహం షర్మిళ ఇష్టం లేకుండా జరిగిందని.. దీంతో ఆమె గొడవ చేసి విడాకులు తీసుకుందని పులివెందుల వాసులు చెబుతారు. తర్వాత షర్మిళ.. అనిల్ కుమార్ ను ప్రేమించడంతో అతని కుటుంబాన్ని భయపెట్టి, దారికి తెచ్చుకుని బలవంతంగా పెళ్లి చేశారని అంటారు. కడప జిల్లా వరకు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వైఎస్ కు కూతురంటే మొదటి నుంచి చాలా ఇష్టం. దీంతో తన హవా నడిచిన రోజుల్లో ఆమె ఇష్టాన్ని ఏరోజూ కాదనలేదంటారు. అనిల్ తో పెళ్లి చేయడంతో పాటు తర్వాత క్రైస్తవ మత ప్రభోదకుడిగా అతని ఎదుగుదల కోసం కేఏ పాల్ ను అణగదొక్కడం, అనిల్ కు విస్తృత ప్రచారం కల్పించడం.. బయ్యారం గనులతో పాటు మరికొన్ని కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి చర్యలు చేపట్టారు వైఎస్.

షర్మిల మొదటి భర్త చంద్రప్రతాప్ రెడ్డి (విజయమ్మ చినతమ్ముడు, షర్మిళ మేనమామ) యాక్సిడెంట్ లో మరణించాడా, లేక ఎవరైనా హత్య చేశారా? -శోభా హైమవతి

chandrababunaidu_vastunnameekosakm_padaytra_route map_26.10.2012

25వ రోజు పాదయాత్ర రూట్ మ్యాప్...పత్రికా ప్రకటన (25.10.2012)



chandrababunaidu_vastunnameekosam_padayatra_photos_25.10.2012

24వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు (మహబుబ్ నగర్ జిల్లా ఐజ నుండి)25.10.2012


   టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రపై విమర్శలు చేసే స్థాయి వైఎస్సార్‌కి లేదని విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్ అన్నారు. మంగళ వారం లోకుమూడిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలన ప్రజ లకు తెలియజేసేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్రను విమర్శించే స్థాయి, అర్హత వైఎస్సార్ సీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నామినేటెడ్ పదవుల భర్తీకి చూపుతున్న మక్కువ ప్రజా సమస్యలపై చూపడం లేదని ఆరోపించారు. కృష్ణాడెల్టాను ఎడారిగా మారు స్తున్నారని, శివారు ప్రాంతాలకు కాలువల ద్వారా నీటిని నేటికి సక్రమంగా సరఫరా చేయలేదని, వర్షాధారం పంటలు పండుతున్నాయని, కైకలూరు ప్రాంతంలో చేపల చెరువులకు నీరులేక మత్స్య పరిశ్రమ దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ, పార్టీ కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్య, చల్లసాని ఆంజనేయులు, కైకలూరు పార్టీ మండల అధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు, రేమల్లే విజయ బాబు, కుమారస్వామి, సుధ పాల్గొన్నారు.

పాదయాత్రపై విమర్శలు చేసే స్థాయి వైఎస్సార్‌ సిపికి లేదు : వల్లభనేని వంశీ 25.10.2012

కార్మికులకు అండగా నిలుస్తా
రోడ్డున పడిన 30వేల పరిశ్రమలు
ధరలు పెంచినప్పుడు, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వద్దా?
బంగిదొడ్డి పాదయాత్రలో చంద్రబాబునాయుడు 

 

కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల రెండేళ్లలో 30 వేల పరిశ్రమలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని, వారి సమస్యలపై పోరాటం చేస్తుందని బాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 24వ రోజు పాదయాత్రను జిల్లాలోని ఐజా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి పత్తి మిల్లును పరిశీలించిన బాబు, కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో మొండెద్దు ప్రభుత్వం సాగుతోందని చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా స్పందించడం లేదని, ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

నిత్యావసర ధరలను పెంచివేశారు. మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒక వైపు నీరు లేక పంటలు ఎండిపోయి, మరోవైపు ఎలాగోలా కష్టపడి పండించిన పంటకు సరైన ధరలేక రైతులు విలవిల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. అందుకే మీ కోసమే వచ్చాను... మీ సమస్యలు తెలుసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అయన అన్నారు.

తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, ఢీజిల్ ధరలతో పాటు మద్యం ధరలు కూడా పెంచిందని, దొరికినదంతా దోచుకొని రాష్ట్రాన్ని స్మశానంలా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆధాయం పెరిగినా ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. కాగా ఈరోజు 13.5 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. తెలంగాణలో బాబు పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఎమ్మార్‌పీఎస్ కార్యకర్తలు ఆయన వెంటే ఉంటూన్నారు.

chandrababunaidu_vastunna meekosam_padayatra

రెండేళ్లలో 30 వేల పరిశ్రమలు రోడ్డున పడ్డాయి, కార్మికులకు అండగా నిలుస్తా 24వ రోజు పాదయాత్రలో చంద్రబాబు 25.10.2012

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ గురువారం మౌలాలి దర్గా వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మౌలాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జవహర్‌నగర్, కమాన్ బస్తీ నుంచి దర్గా వరకు ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు.

అనంతరం దర్గా మెట్ల సమీపంలోని ఛిల్లా వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటి నాయకులు, కార్యకర్తలంతా కలిసి సెహరా సమర్పించారు. ప్రజల సమస్యలు, సాధక బాధలు నేరుగా తెలుసుకోవడం కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆ పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి వీకె మహేష్ ముదిరాజ్, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు మేకల మోహన్‌యాదవ్‌లు చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ జిల్లాలో మరింత జయవప్రదం కావాలని ఆకాంక్షించారు

బాబు పాదయాత్ర విజయ వంతం కావాలని మౌలాలి దర్గా వద్ద ముస్లీం సోదరుల ప్రార్ధనలు


chandrababu naidu padayatra photos

23వరోజు చంద్రబాబు నాయుడి "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు (Part-2) 24.10.2012