May 27, 2013


ప్రణబ్‌ కమిటీ లేఖకు కట్టుబడి ఉంటామని స్పష్టీకరణ
ఇటీవలి అఖిలపక్ష బేటీలో ఇచ్చిన లేఖను ప్రస్తావించనున్న టీడీపీ
టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహం
కడియం వ్యాఖ్యలను చూపించే యత్నం
పార్టీ వైఖరిని ప్రశంసించిన టీ కాంగ్రెస్‌ నేతల ప్రస్తావన
గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యలనూ ప్రస్తావించనున్న దయాకర్‌
మళ్లీ తెరపైకి రఘునందన్‌ ఆరోపణలు

తెలంగాణ అంశంలో తనపై టీఆర్‌ఎస్‌ నుంచి ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ మహానాడును వేదిక చేసుకోనుంది. తెలంగాణకు తానే అడ్డంకి అని, టీడీపీ లేఖ ఇస్తే తెలంగాణ వచ్చేస్తుందన్న ట్లుగా ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు చెక్‌ చెప్పడం తోపాటు, తెలంగాణపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహానాడు రెండవ రోజున తెలంగాణపై గతంలో చాటిన తన చిత్తశుద్ధి, ఇచ్చిన లేఖలు ప్రస్తావించి, వాటికి కట్టుబడి ఉందని తీర్మానం చేయనుంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు దీనిపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ అంశంతో దెబ్బతీయాలని ప్రయత్నిస్తోన్న టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి మహానాడు వేదిక కానుంది. ఆ సందర్భంగా గతంలో కేంద్రమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ, అంతకంటే ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖలను ప్రముఖంగా ప్రస్తావించనుంది.

సమావేశం తర్వాత షిండే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిందని చేసిన వ్యాఖ్యలతో పాటు, సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రతినిధిగా హాజరయిన కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను కూడా మహానాడు వేదిక మీద నుంచే ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి వివిధ చానళ్లు, చర్చావేదికలో పాల్గొని చేసిన వ్యాఖ్యలను కూడా తెలంగాణ ప్రజలకు ఎర్రబెల్లి గుర్తు చేయనున్నారు. ఆ సందర్భంగా టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలుగుదేశం పార్టీ విధానాన్ని ప్రశంసించిన వైనాన్ని ప్రస్తావించనున్నారు. దీనితో అటు కడియంను, తమ పార్టీ నేతలపై వల విసరడంతోపాటు, తెలంగాణలో తన పార్టీని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఒకేసారి చెక్‌ చెప్పాలని భావిస్తున్నారు.

ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖతోపాటు, షిండే సమక్షంలో జరిగిన సమావేశంలో దానికి మద్దతుగా ఇచ్చిన లేఖకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేయనుంది. అదే సమయంలో గతంలో కేసీఆర్‌ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను కూడా మరోసారి గుర్తు చేయనున్నారు. ప్రధానంగా 610 జీఓను ప్రస్తావించనున్నారు. 610 జీఓను అమలు చేయాలని ఇప్పుడు గళమెత్తుతున్న కేసీఆర్‌ గతంలో టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, మళ్లీ మధ్యలో తెలంగాణనే వస్తున్నప్పుడు ఇక 610 జీఓ ఎందుకని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా దయాకర్‌ ప్రముఖంగా ప్రస్తావించి ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కేసీఆర్‌ కుటుంబ వసూళ్లపై టీఆర్‌ఎస్‌ మాజీ నేత రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను గుర్తు చేయనున్నారు. మొత్తానికి తెలంఐగాణపై తమ పార్టీ చిత్తశుద్ధితోపాటు, ఆ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న దాడికి చెక్‌ చెప్పేందుకు మహానాడు సిద్ధమవుతోంది.

టీడీపీ మళ్లీ జై తెలంగాణ నేడు తీర్మానం ప్రవేశపెట్టనున్న దయాకర్‌



రాయభారం నడిపిన బాలకృష్ణ
తెలుగుదేశంలో చేరికకు సుముఖం
బందర్‌ నుంచి పోటీకి అవకాశం
తగ్గునున్న జూ ఎన్టీఆర్‌ ప్రాధాన్యం
చిరుకు, పవన్‌కు మధ్య పెరిగిన దూరం
పీఆర్సీ విలీనాన్ని వ్యతిరేకించిన పవన్‌
రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు


సినీ స్టార్‌, కేంద్రమంత్రి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీలో చేరను న్నారా? ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నారా? ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో జరుగుతున్న హాట్‌ టాపిక్‌ ఇది. దీనిపై ఈ రెండు వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో సినిమాలకు దూరంగా ఉండి, ఎక్కువ సమయం రాజకీయాలకే కేటా యించిన పవన్‌, అప్పట్లో దూకుడుగా వ్యవహ రించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలను పంచెలు ఊడదీసి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌పై చండ్రనిప్పులు కక్కారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. దానిని పవన్‌ తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ముక్కుసూటిగా మాట్లాడటం, కల్మషం లేకుండా మనసులో ఉన్నదే వ్యక్తీకరించడం, వామపక్ష భావజాలంతో పాటు, ఇతర హీరోలకు భిన్నంగా మనుషులకు విలువ-గౌరవం ఇచ్చే మానవీయ విలువలున్న వ్యక్తిగా పవన్‌కల్యాణ్‌ కు సినీ పరిశ్రమలో మంచి పేరుంది. పేదవర్గా లకు ఏదో చేయాలన్న తపన, అవినీతిపై కసి దండిగా ఉన్న పవన్‌ ఖాళీగా ఉన్న సమయాల్లో వామపక్ష భావజాల పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. ఇటీవలి కాలంలో చిరంజీవి తో పాటు, ఆ కుటుంబసభ్యుల సినిమా ఫంక్షన్ల కు దూరంగా ఉంటున్న పవన్‌ దృష్టి తాజాగా రాజకీయాలపై మళ్లిందని చెబుతున్నారు.

అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ- రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వ హించినట్లు తెలుస్తోంది. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడుతున్నాయి. పవన్‌కు మచిలీ పట్నం సీటు ఇస్తే బాగుంటుందని బాలయ్య సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ టీడీపీలో చేరితే ఆయనకు మచిలీపట్నం సీటు ఖాయంగా ఇవ్వవచ్చంటు న్నారు. కాపు సామాజికవర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకమేనంటున్నారు. పవన్‌ టీడీపీలో చేరితే పార్టీకి మరో స్టార్‌ అదనపు ప్రయోజనంగా మారతారని, పవన్‌ సినీ గ్లామర్‌తో పాటు, కాపు సామాజికవర్గం కూడా మళ్లీ టీడీపీకి చేరువ య్యే అవకాశం లేకపోలేదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌ పార్టీలో చేరితే అప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద ఆశలు పెట్టు కోవల సిన అవసరం లేదన్న అంచనా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అంతా జూని యర్‌ ఎన్టీఆర్‌ రాక మీదనే చర్చిస్తున్నారని, పవన్‌ కల్యాణ్‌ పార్టీలో చేరితే జూని యర్‌ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుందని పలువురు నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. ఒకవేళ జూనియర్‌ ఎన్నికల సమయానికి పార్టీలో చేరితే అప్పుడు ముగ్గురూ మూడు ప్రాంతాల్లో ప్రచారం చేస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుంద ని విశ్లేషిస్తున్నారు.

చిరంజీవి కుటుంబానికి చెందిన పవన్‌ టీడీపీలో చేరడంపై విస్మయం చెందా ల్సిన అవసరమేమీలేదని, ఇది కొత్తేమీ కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యా నిస్తు న్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ కూతురు కాంగ్ర ెస్‌లో చేరి కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజ కుమారి కూతురు సుధ వినుకొండ వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా రంగంలో ఉన్నా రు. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ కోడలు మేనకాగాంధీ, ఆమె తన యుడు వరుణ్‌గాంధీ బీజేపీలో ఉండగా, ఆమె తోడికోడలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగాఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌లోఉన్న చాలా మంది సీనియర్ల తనయులు జగన్‌ పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘దేశం’ లోకి పవన్‌?నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు


రానున్న ఎన్నికలపై చంద్రబాబురాష్ట్రంలో కాంగ్రెస్‌ది దుష్టపాలన
-కిరణ్‌కుమార్ సీల్డ్ కవర్ సీఎం
-సోనియా చెపితేనేమంత్రులతో రాజీనామా
-అందుకు మా పోరాటమే కారణం
-కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు
-కేంద్రంలో పనికిమాలిన సర్కారు
-ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేదు
-జగన్ అవినీతితోరూ.43వేల కోట్లు నష్టం
-ఈ మాట సీబీఐ చెప్పినదే
-మహానాడులోటీడీపీ అధినేత వ్యాఖ్యలు

:రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. టీడీపీ గెలుపు చారివూతక అవసరమని అభివర్ణించారు. కేంద్రంలో మూడవ ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ కీలకపాత్ర నిర్వహించనుందని చెప్పారు. సోమవారం గండిపేటలోని తెలుగు విజయంలో రెండు రోజులు జరిగే పార్టీ మహానాడును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసిన చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్షికమాలను వివరించారు. జైల్లో ఉన్నవారు బెయిలు కోసం పని చేస్తుంటే.. తాను లోక కల్యాణం కోసం పని చేస్తున్నానన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబు ప్రసంగం క్లుప్తంగా.. ఆయన మాటల్లోనే..

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర
దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ.. 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేసింది. దేశంలో నాలుగు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తే అందులో మూడు టీడీపీ చొరవతో ఏర్పడినవే. చరిత్ర పునరావృతం అవుతుంది. వచ్చే ఏడాది కేంద్రంలో కింగ్‌మేకర్ టీడీపీయే. మూడో కూటమి ఏర్పాటులో టీడీపీ ప్రధాన పాత్ర పోషించబోతున్నది. దేశానికి ప్రధాని, దేశాధ్యక్షులను, స్పీకర్‌లను నియమించిన ఘనత టీడీపీది. కాంగ్రెస్‌కు కేంద్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పన్నులు పెంచారు. సహజవనరులు దోచుకున్నారు. అవినీతి డబ్బు టెర్రరిస్టుల వరకు వెళుతోంది. కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఆడబిడ్డను బస్సులో రేప్ చేసి చంపేశారు. కేంద్రం బలహీనంగా ఉండటంతో పక్కదేశాలలో కూడా పరపతి పెంచుకోలేక పోయారు. కేంద్రన్యాయ మంత్రి దోషులను కాపాడే ప్రయత్నంలో సీబీఐ నివేదిక తెప్పించుకొని, మార్చిన సంఘటనలో పదవి పోగొట్టుకున్నారు. అల్లుడి వ్యవహారంతో రైల్వే మంత్రి రాజీనామా చేయించాల్సి వచ్చింది. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. కర్ణాటక, తమిళనాడులో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మాఫియా, రౌడీయిజం ఇష్టానుసారంగా రాజ్యమేలుతున్నాయి.

టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది

రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 2014లో టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. మూడవ ప్రత్యామ్నాయంలో చొరవ చేసేది టీడీపీనే. టీడీపీ గెలుపు చారివూతక అవసరం. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తాం. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారు ఉండాలనుకుంటున్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించి ఇస్తాం. మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటాం. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. బ్రహ్మణుల కోసం రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. కాపులకు రూ.5000 కోట్లు కేటాయిస్తాం. బీసీలకు వంద సీట్లు ఇస్తాం. దళిత క్రిస్టియన్‌లను ఎస్సీలుగా గుర్తిస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. 500 మంది ప్రజలున్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తాం. మైనార్టీలకు రూ.2500కోట్ల కేటాయింపుతో పాటు 15 సీట్లు ఇస్తాం.

కిరణ్ పనికిమాలిన సీఎం

కిరణ్‌కుమార్‌డ్డి సీల్డ్ కవర్ సీఎం. 70సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఇంటింటికి తిరుగుతారు. ఏం సాధించారు? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. సోనియా చెప్పిందే చేస్తారు. పనికిమాలిన సీఎం. మంత్రుల రాజీనామా కూడా సోనియా చెపితేనే చేయించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలు, 10 మంది మంత్రులు ఉన్నారు. వీరు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటి? రాష్ట్రంలో ప్రాణహిత- చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురాలేక పోయారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనం. కరువు, వరద ప్రాంతాలకు రూ.56 వేల కోట్ల సహాయం అడిగితే కేవలం రూ.ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. కరువు పనుల కోసం 54 లక్షల టన్నుల బియ్యాన్ని పనికి అహార పథకం కింద తీసుకువచ్చి కరువు పనులు చేయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే.

కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు

వైఎస్ అధికార దుర్వినియోగం చేసి లక్ష కోట్లుదోచుకున్నారని ఆయన బతికున్నప్పుడే అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టాం. దీనిని సీబీఐ నిర్ధారించింది. రూ.43 వేల కోట్లు అవినీతి వల్ల నష్టపోయామన్న సీబీఐ దీనికి వైఎస్ కొడుకు జగన్‌ను దోషిగా నిలబెట్టింది. మంత్రులతో కలిసి దోపిడీ చేశారు. 26 జీవోలపై మంత్రులు తెలియకుండానే సంతకాలు పెట్టారా? కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు. ఆ రైల్లో డ్రైవర్ ఒక్కరే మారారు. అంతా (మంవూతులు) వాళ్లే. ఒకరు ఏ-4, మరొకరు ఏ-5, ఇంకొకరు ఏ-6. ఇంకో మంత్రికి ఫెమా ఉల్లంఘన కేసులో శిక్ష పడింది. అయినా వీరంతా మంత్రి వర్గంలో ఎలా ఉంటారు? ఈ కళంకిత మంత్రులను పూర్తిగా బర్తరఫ్ చేసే వరకు టీడీపీ పోరాడుతుంది. మా పోరాటం ఫలితంగానే ఇద్దరు మంత్రులు పోయారు.

ధనయజ్ఞంగా జలయజ్ఞం
జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి, రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.35 వేల కోట్లు దోచుకున్నారని విచారణ సంస్థలు తెలిపాయి. వైఎస్ నుంచి కిరణ్ వరకు అంతా దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను వారికి కావాలసినవాళ్లకు సెజ్‌ల పేరుతో ఇచ్చేస్తున్నారు. వాన్‌పిక్‌లో 22 వేల ఎకరాల భూమిని ప్రజల నుంచి లాక్కుని కారుచౌకగా ఇచ్చారు.

నా రాజకీయ చరివూతలో మరపురాని ఘట్టం ‘వస్తున్నా... మీ కోసం’
కాంగ్రెస్ దుష్టపాలన వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో నేను హైదరాబాద్‌లో ఉండలేక ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర చేశాను. నా రాజకీయ చరివూతలో ఇది మరపురాని ఘట్టం. ప్రజలు, కార్యకర్తలు ఏడు నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రజల స్ఫూర్తే నన్ను నడిపించింది. అడపిల్లలకు రక్షణ లేదని, ఇంటి దగ్గర కూడా స్వేచ్ఛగా ఉండ లేకపోతున్నారని అనేక మంది పాదయావూతలో నాకు చెప్పారు. బానిస బతుకులు బతుకుతున్నామని తూర్పుగోదావరి జిల్లాలో ఒక గీత కార్మికుడు వాపోయాడు. ఎంతపని చేసినా కడుపునిండటం లేదని, దొంగలు నిలువు దోపిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటలు చూస్తే వారి పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. నిజమాబాద్ జిల్లాలో అర్ధరాత్రి మూలుగులు వినిపిస్తుంటే.. మీడియా వాళ్లు చెపితే వెళ్లి చూశాను. తిండి లేక ఓ వృద్ధురాలు దీనావస్థలో కనిపించింది. ఈ పరిస్థితులను చూసి నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ సమస్యలు పరిష్కరించే బాధ్యత టీడీపీకి ఉంది.

కాంగ్రెస్ పాలన వల్లే అంధకారం

కాంగ్రెస్ దుష్ట, అసమర్థ, అవినీతి పాలనవల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది. 2004లో మిగులు బడ్జెట్, మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే నేడు అంధకారంలోకి తోశారు. తొమ్మిదేళ్లలో రూ.25 వేల కోట్ల చార్జీలు పెంచారు. ఇది కాకుండా ఎఫ్‌ఎస్‌ఏ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల పరిక్షిశమలు మూతపడ్డాయి. 20-30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఎరువుల ధరలు పెంచడం వల్ల వ్యవసాయ ఖర్చులు 300% పెరిగితే, పంటకు కేవలం 30% మాత్రమే మద్దతు ధరలు పెరిగాయి. ఈ తొమ్మిదేళ్లలో 22,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదర్శ రైతులంటూ కాంగ్రెస్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసింది. టీడీపీ హయాంలో సాగునీటి సంఘాలు పెట్టి నీటి యాజమాన్య పద్ధతులను పాటించాం. ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తే, కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయింది.

జయం టీడీపీదే కేంద్రంలో మాదే కీలకపాత్ర

మూడో చక్రం తిప్పుతాం
డ్వాక్రా మహిళలను ఆదుకుంటాం
రైతు రుణాలను మాఫీ చేస్తాం
అవినీతిపై పోరు ఉధృతం చేస్తాం
కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం
మహానాడులో చంద్రబాబు

మూడో చక్రం తిప్పుతాం


కేంద్ర, రాష్ట్రాల్లో పగ్గాలు చేపడతాం కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఛీ కొడుతున్నారు
మహానాడు వేదికపై చంద్రబాబు ధీమా

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను గెలిచేది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోయేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 'గాలి మారుతోంది. సైకిల్ దూసుకొస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘనవిజయం సాధించబోతోంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రంలో కూడా బీజేపీ, కాంగ్రెస్ రెండూ రావు. వచ్చేది తృతీయ ఫ్రంట్ ప్రభుత్వమే. అక్కడా టీడీపీదే కీలక పాత్ర. టీడీపీ విజయం ఓ చారిత్రక అవసరం' అని ఆయన పేర్కొన్నారు.

సోమవారం గండిపేటలోని 'తెలుగు విజయం' ఆవరణలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు టీడీపీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారని, వారి సంక్షేమం కోసం తాము చెప్పిన ప్రతి మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించి చూపిస్తామని, ఆడినమాట తప్పబోమని ప్రకటించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి దుర్దినమని, ప్రజల పాలిట శాపమని ఆయన వ్యాఖ్యానించారు. 'మేం ఎంతో చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఇంకేదో చేస్తుందన్న ఆశతో ప్రజలు దానికి పట్టంగడితే ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తోంది.

కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ నేతలను ఛీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నార'ని అన్నారు. 'హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం ఇతర మౌలిక వసతుల కల్పనంతా టీడీపీ హయాంలోనే జరిగింది. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ సర్కారు ఇష్టారాజ్యంగా భూములు కట్టబెట్టి అక్రమాలతో దోపిడీకి పాల్పడింది. టీడీపీ వేసిన అభివృద్ధి విత్తనం చెట్టుగా ఎదిగిన తర్వాత ఫలాలను మాత్రం కాంగ్రెస్ నాయకులు దోచుకుతింటున్నార'ని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు మింగిన సొమ్మును కక్కిస్తామని ఆవేశంగా అన్నారు.

కళంకితుల్ని వదలం
'మేం మిగులు కరెంటు ఇస్తే.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. కరెంటు లేక పరిశ్రమలు కుదేలై లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతే గుడ్లప్పగించి చూశారు. కేంద్రంలో, రాష్ట్రంలో దద్దమ్మ పాలన సాగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు నలిగిపోతున్నా పట్టించుకొనే దిక్కు లేదు. ప్రజలకు మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నార'ని చంద్రబాబు విమర్శించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ వంగి వంగి దండాలు పెట్టి తన పదవి కాపాడుకొంటుంటే ఇక్కడ ఆయన తమ్ముళ్లు చెరోచోట కూర్చుని సెటిల్మెంట్ల రాజ్యం నడిపిస్తున్నారని ఆరోపించారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దొంగల రైలు బండి. డ్రైవర్ మారాడు తప్ప ప్రయాణికులుగా ఉన్న మంత్రులు మారలేదు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతి అంతా వీరందరికీ తెలిసే జరిగింది. మాకేం పోయిందని ఎవరి చిల్లర వారు దండుకొన్నారు. కేసులు తలకు చుట్టుకొన్న తర్వాత తమకేం తెలియదని గగ్గోలు పెడుతున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.

శిక్ష అనుభవించక తప్పదు. టీడీపీ పోరాటం వల్లే ఇద్దరు మంత్రులు దిగిపోయారు. కానీ ఇది పాక్షిక విజయం. కళంకిత మంత్రులంతా దిగిపోవాల్సిందే. అప్పటిదాకా వదిలిపెట్టేది లేదు' అని ఆయన ప్రకటించారు. ప్రలోభాలకు గురి చేసి నాయకులను తీసుకెళ్లి చంకలు కొట్టుకొంటున్నారని, ఒక నాయకుడు పోతే 50 మంది నాయకులను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

' నీతితో ఉండే కార్యకర్తలు టీడీపీలో ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పార్టీని కాపాడుతున్న కార్యకర్తల పాదాలకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. మీరు లేకపోతే మేం లేం. అవకాశం వస్తే వారికి ఎంతైనా చేస్తాను. వారి రుణం తీర్చుకొంటాను' అని పేర్కొన్నారు. సొంత ఆలోచనలు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీని కాపీ కొడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి సిగ్గూ ఎగ్గూ లేకుండా నిరసనలు చేస్తారా? అని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మిపై చంద్రబాబు మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే ఇప్పటి వరకు జగన్‌కు బెయిలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

24 గంటలు కరెంట్.. ఆడపిల్లకు రూ. 2 లక్షలు


తాము అధికారంలోకి వస్తే గృహసవరాలకు 24గంటల పాటు విద్యుత్ అందిస్తామని, ఆడపిల్ల పెళ్లినాటికి రూ. రెండు లక్షలు అందేలా బాలికా సంరక్షణ పధకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన కీలక వాగ్దానాలను ఈ సందర్భంగా మరోసారి పేర్కొన్నారు. కాగా, మహానాడు తొలి రోజు పలు అంశాలపై చర్చ, ముసాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు.

9 ఏళ్లలో విద్యుత్ రంగం చిన్నాభిన్నం, సంక్షోభంలో వ్యవసాయం, నత్తనడకన నీటిపారుదల రంగం, రాష్టంలో అశాంతి, అభద్ర త, అనిశ్చితి, కేంద్ర, రాష్ట్ర అవినీతి, కుంభకోణాలు, కళంకిత మంత్రులు, రోజుకో పథకం- ప్రచార ఆర్భాటం, స్థానిక సంస్థలపై నిర్లక్ష్యం వంటి అంశాలపై పార్టీ నేతలు చర్చ నిర్వహించడంతో పాటు ముసాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టారు. 'వస్తున్నా... మీ కోసం' నినాదంతో చంద్రబాబు సుదీర్ఘంగా చేసిన పాదయాత్రకు సంబంధించిన సంక్షిప్త నివేదికను మహానాడు వేదికపైనుంచి ఆవిష్కరించారు. తీర్మానాల నేప«థ్యంలో జరిగిన చర్చల్లో చంద్రబాబు భాగం పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ 'చాలా కష్టాలు పడ్డా. ఎన్నో సంక్షోభాలు చూశాను. పాదయాత్రకు మరింత కష్టపడాల్సి వచ్చింది. పాదయాత్ర ముగిసి నాలుగు వారాలవుతున్నా పాదాల సమస్య తగ్గలేదు. ఏమైనప్పటికీ అదో మంచి కార్యక్రమం. పాదయాత్ర ఇచ్చినంత సంతృప్తిని మరే కార్యక్రమమూ ఇవ్వలేదు' అని అన్నారు.

వర్షాన్ని వెంట తెచ్చారు!

మహానాడు సభా వేదిక ఉన్న గండిపేట ప్రాంతంలో మధ్యాహ్నం 3.45 నుంచి గంటపాటు వర్షం కురిసింది. అయితే సభాస్థలిపై రేకుల కప్పు ఉండటంతో ఎలాంటి ఆటంకం కలుగలేదు. వర్షంతో పార్టీ శ్రేణుల్లో ఉల్లాసం నిండింది. ఆహ్లాద వాతావరణంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ 'వర్షం తెచ్చారు. అభినందనలు' అని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇది ఖాయం మాదే పీఠం: చంద్రబాబు

కళంకితుల తొలగింపు ‘దేశం’ విజయమే
కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధపార్టీ
టీఆర్‌ఎస్‌ వసూళ్ల పార్టీ
జగన్‌ది జైలుపార్టీ
ఇందిరమ్మ హస్తం.. మెుండిహస్తం
కార్యకర్తలకు పాదాభివందనాలు
ఎన్నికలకు సన్నద్ధం కండి
కార్యకర్తలకు బాబు దిశానిర్దేశం

అట్టహాసంగా ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ఎంతో ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారం మనదేనని కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. మహానాడులో యువనాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని కూడా ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటాల ఫలితంగానే కళంకిత మంత్రులు ఇంటికి వెళ్లా రని బాబు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతోందని, ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. సోమవారం రాజ ధాని శివారులోని గండిపేట తెలుగు విజయం ప్రాంగణంలో మహానాడు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. మహానాడు వేదిక నుండి పార్టీ శ్రేణులకు బాబు దిశా నిర్ధేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృ ద్ధి సంస్కరణల ఫలితాలు పేదవారికి అందకుండా ఆ పార్టీ నేతలే దోచుకుతింటున్నారని విరుచుకుపడ్డారు. తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ నేతలు అవినీతిలో పోటీపడి రాష్ట్ర సం పదను కొల్లగొట్టారన్నారు. రోజుకో పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు.

అయినా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని విశ్వసించడం లేద న్నారు. అమ్మహస్తం కాదని అది మొండి హస్తం అని అప హాస్యం చేశారు. అమ్మ హస్తంలో ఇస్తున్న సరుకులు పశు వులు కూడా తినలేనంత నాసిరకంగా ఉన్నాయని విమ ర్శించారు. తెలంగాణ ప్రాంత సమస్యలపై టీఆర్‌ఎస్‌ ఏనా డూ పోరాటం చేసింది లేదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ అలుపెరుగని పోరా టం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. బాబ్లీ ప్రాజెక్టుకు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీడీపీ పోరాడిందని, మరి టీఆర్‌ఎస్‌ ఏ కలుగులో దాక్కుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఏడారిగా మారుతుందని తెలిసి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ఫాంహౌస్‌లో పడుకుందని, తాము పోరాటం చేశామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతోనూ, పోలీసులతోనూ పోరాటం చేశామని, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసులతో దెబ్బలు తిన్నది అందరూ చూశారన్నారు. తెలంగాణ ప్రాంతం ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు రావాలని తాము విసిరిన సవాల్‌ను టీఆర్‌ఎస్‌ ఎందుకు స్వీకరించడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పటేల్‌, పట్వారి వ్యవస్థలను రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.

అటు వైఎస్‌ఆర్‌ కాంగ్సెస్‌ పార్టీని చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ కోసం తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూ తమ పైనే నిందలు వేసే యత్నం చేస్తున్నారని బాబు విమర్శించారు. జగన్‌ పార్టీ నేతలంతా జైలులోనే ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. నీతివంతమైన సుస్థిరమైన పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో పరిపాలన భ్రష్టుపట్టి పోయిందన్నారు. వ్యవసాయం కుదేలైందన్నారు. నిత్యావసర ధరల సంగతి చెప్పనవసరంలేదన్నారు. గ్రామాల్లో కనీసం మంచినీరు దొరకడం లేదన్నారు. మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. రక్షిత మంచినీరుదొరకక ఫ్లోరైడ్‌ నీటి కోసం కూడా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటు అవస్థలు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జలయజ్ఞం పేరిట 35 వేల కోట్లు దోచుకున్నారన్నారు. కానీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేక పోయారన్నారు. అవినీతిలో వైఎస్‌కు, కిరణ్‌కు పెద్ద తేడా లేదని, భూములు, గనులూ దోచుకుని తింటున్నారని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ లక్ష కోట్ల ధనాన్ని దోచుకుని ఇప్పుడు జైలు ఊచలు లెక్క బెడుతున్నారని మండిపడ్డారు. ఆయన అవినీతికి సహకరించిన మంత్రులు జైలుకు వెళ్లారని, మరి కొందరు అదే దారిలో ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. మంత్రులకు తెలియ కుండానే 26 జీవోలు జారీ చేశారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలనేనని, ఎవరో ఒకరిద్దరు నేతలు వెళ్లినంత మాత్రన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీకి అన్ని వేళలా అండదండగా ఉంటున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు చేతులెత్తి నమస్కరించడంతో సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారు మోగింది.

బడుగులకు వంద సీట్లిచ్చి ఆచరణలో చూపిస్తాం
బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చినమాట ప్రకారం 100 సీట్లు ఇచ్చి ఆచరణలో చేసి చూపిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి బడుగుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చంద్రబాబుహామీనిచ్చారు. ఎన్నికల్లో అవకాశం లభించని వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత నిస్తామన్నారు. యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, రాజకీయాల్లోనూ 30 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మహిళలకు ప్రత్యేకంగా భద్రత కల్పిస్తామన్నారు.

దివంగత నేతలకు నివాళి
ఇటీవల కాలంలో మరణించిన తెలుగుదేశం పార్టీ నేతలకు మహానాడు ఘనంగా నివాళ్లు అర్పించింది. రెండు నిమిషాలు మౌనం పాటించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దివంగత నేతలు ఎర్రంన్నాయుడు, శ్రీపతి రాజేశ్వరరావు, పొగాకు యాదగిరి, అంబటి బ్రాహ్మణయ్య తదితరులకు పేరుపేరునా నివాళ్లు అర్పించారు. మహానాడు అంటేనే శ్రీపతి రాజేశ్వరరావు గుర్తుకు వస్తారని, ఆయన ఎన్టీఆర్‌ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసేవారని, ఎక్కడా లభించని అరుదైన చిత్రలు ప్రదర్శించి ఎన్టీఆర్‌ పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు.

మహానాడులో బాబు ధీమా అధైర్యం వద్దంటూ శ్రేణులకు ఉద్బోధ


  మహానాడు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాడు వేడుకల సందర్భంగా లోకేష్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకుని క్రీయాశీలక రాజకీయాల్లోకి తన ఆగమనం ఖాయమని తేల్చి చెప్పారు. యువ నేతలతో కలిసి ఆయన మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. పార్టీ సీనియర్‌ నేతల కుమారులతో కలిసి ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ కార్యకర్తల్లో, నేతల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు రాంమోహన్‌నాయుడు, పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌, రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌లతో కలిసి ఆయన మహానాడు ప్రాంగంణలో హల్‌చల్‌ చేశారు.

మహానాడు ప్రాంగణంలో లోకేష్‌ సందడి



“ఎవరో ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన భయపడిపోతామా ? భయపడే సమస్యే లేదు. నాయకులు పార్టీని వీడిపోయినా పార్టీ కార్యకర్తల అండ వుంది. వారి రుణం తీర్చుకుంటాం. యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి. కేంద్రంలో బలహీనమయిన ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం పార్టీని నామరూపాలు చేస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. నిజాయితీగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నందుకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఈ దొంగల రైలుకు డ్రైవర్ మాత్రం మారాడని, దొంగ మంత్రులు మాత్రం అలాగే కొనసాగుతున్నారు” అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు సంధర్భంగా ఆయన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత మూలంగా సమస్యలు ఎదురవుతున్నాయని, విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. గత తొమ్మిదేళ్లలో 22,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. మహిళలకు రక్షణ లేదని, అమ్మహస్తం మొండి హస్తం అయిందని, పరిశ్రమలు మూతపడ్డాయని, 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. అవినీతి మంత్రులందరూ రాజీనామా చేయాలని, తెలుగుదేశం పార్టీ పోరాటం మూలంగానే సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించవద్దని చంద్రబాబు డిమాండ్ చేశారు.

దొంగల రైలు…డ్రైవర్ మారాడు..!


ఇవాళ రేపు జరుగుతున్న మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు విచ్చేశారు. గండిపేట మహానాడు ప్రాంగణంలో యువనేతలు హంగామా కన్పించింది. సీనియర్లకు సభ వేదిక ఇచ్చేసి, యువనేతలతో వేదిక ముందే కూర్చున్నారు. వీరికి చంద్రబాబు కొడుకు నాయకత్వం వహించగా దివంగత నేత ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరాం ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించారు. వీరితో పాటు కరణం బలరాం కుమారుడు, దేవేందర్ గౌడ్ కుమారుడు అలాగే అయన్నపాత్రుడు, దయాకర్ రెడ్డి, బొజ్జల కుమారులు మహానాడులో హల్ చల్ చేశారు. వీరిని చూస్తుంటే 1983 నాటి పరిస్థితులు గుర్తుకువస్తున్నాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు.

మహానాడులోయువనేతల హడావుడి!

హైదరాబాద్‌ : తెలంగాణపై మహానాడులో చర్చిద్దామని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని అఖిలపక్షంలో చెప్పినప్పటికీ, టీఆర్‌ఎస్‌ టీడీపీని టార్గెట్‌ చేసి, రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్రాన్ని విమర్శించకుండా టీడీపీని టారె్గట్‌ చేస్తుంటే ఏమనాలన్నారు.

తెలంగాణపై చర్చిద్దాం : బాబు

తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో సోమవారం ప్రారంభమైన మహానాడులో ఆయన మాట్లాడుతూ తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తమ హయాంలో మిగులు విద్యుత్ ఉండేదని, ఇప్పుడు రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ సమస్యలతో పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వ్యవసాయం దెబ్బతిందని చంద్రబాబు పేర్కొన్నారు. 'అమ్మ హస్తం' మొండి హస్తం అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు.పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు నిండు మనసుతో సహకరించారని ఆయన చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం అన్నారు.

యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు


హైదరాబాద్‌ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు అన్నారు. గండిపేటలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆయన ధ్వమెత్తారు. సీబీఐ అనేక ఛార్జిషీట్లలో వైఎస్‌ కొడుకు జగన్‌ను దోషిగా నిలబెట్టిందన్నారు. కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలన్నారు. టీడీపీ ఉద్యమం వల్లనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని ఆయన చెప్పారు. దొంగల రైలులో డ్రైవర్‌ మాత్రమే మారాడు, దొంగ మంత్రులు మాత్రం కొనసాగుతున్నారని ఆయన విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయ సహాయం అందించవద్దని అన్నారు. అవినీతిపరులను ఉపేక్షించేది లేదన్నారు. అవినీతికి పాల్పడినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన చెప్పారు.
తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్‌
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని ఆయన పొగిడారు.తన రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం వస్తున్నా ... మీకోసం పాదయాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

మద్యం ఏరులై పారుతోంది


హైదరాబాద్‌ : టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడుతామని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు స్పష్టం చేశారు. తమ హయాంలో మిగులు కరెంట్‌ ఉండేదని ఆయన చెప్పారు. టీడీపీ మహానాడు గండిపేటలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆయన చెప్పారు. కరెంట్‌ సమస్యతో 6.30 లక్షల చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, ఎంతో మంది నిరుద్యోగులయ్యారని ఆయన తెలిపారు. రేషన్‌ సరుకుల్లో అన్నింటికీ కోత పెట్టారని ఆయన ఆరోపించారు. అమ్మ హస్తం కాదని, అది మొండి హస్తమని ఆయన ఎద్దేవా చేశారు. అమ్మ హస్తంలో ప్రజలకు నాసిరకం సరుకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

రైతు రుణమాఫీపైనే తొలి సంతకం


హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గతరెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు నేతలు నివాళులు అర్పించారు.

మరణించిన నేతలకు మహానాడు నివాళులు

'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర తన జీవితంలో మరువరాని ఘట్టం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గండిపేటలో జరుగుతున్న 32వ టీడీపీ మహానాడులో బాబు ప్రసంగించారు. పాదయాత్రలో తనను నడిపించింది కార్యకర్తలే అని ఆయన తెలిపారు. సమాజంలో మార్పు, అవినీతి ప్రక్షాళన కోసం యువత ముందుకు రావాలని బాబు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ దుష్టపాలన వల్ల రాష్ట్ర నష్టపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ సమస్యతో పరిశ్రమలు మూతపడ్డాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. విద్యుత్ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మహస్తం మొండిహస్తం అన్న తన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు.

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, బెల్టుషాపులను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పేదల భూముల కారుచౌకగా కొట్టేసి పెత్తందార్లకు కట్టబెట్టారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 11 వేల కోట్లు ఖర్చుపెట్టి 30 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

సీబీఐ అన్ని చార్జిషీట్లలో జగన్‌ను దోషిగా చూపించారని, జగన్ అరెస్ట్ అయినా...దొంగమంత్రులు కొనసాగుతున్నారన్నారు. కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. టీడీపీ పోరాటం వల్లే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. పార్టీలో అవినీతిపరులను ఉపేక్షించబోమని, అవినీతిపరులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.

నా జీవితంలో మరుపురాని ఘట్టం 'వస్తున్నా..మీకోసం' : చంద్రబాబు


ఇవాళ రేపు జరుగుతున్న మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు విచ్చేశారు. గండిపేట మహానాడు ప్రాంగణంలో యువనేతలు హంగామా కన్పించింది. సీనియర్లకు సభ వేదిక ఇచ్చేసి, యువనేతలతో వేదిక ముందే కూర్చున్నారు. వీరికి చంద్రబాబు కొడుకు నాయకత్వం వహించగా దివంగత నేత ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరాం ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించారు. వీరితో పాటు కరణం బలరాం కుమారుడు, దేవేందర్ గౌడ్ కుమారుడు అలాగే అయన్నపాత్రుడు, దయాకర్ రెడ్డి, బొజ్జల కుమారులు మహానాడులో హల్ చల్ చేశారు. వీరిని చూస్తుంటే 1983 నాటి పరిస్థితులు గుర్తుకువస్తున్నాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు.

మహానాడులోయువనేతల హడావుడి!

హైదరాబాద్‌ : గండిపేటలోని తెలుగు విజయంలో టీడీపీ మహానాడు ప్రారంభమైన కొద్దిసేపటికే హీరో బాలకృష్ణ బయటికి వెళ్లిపోయారు. తప్పుదోవ పట్టించే వార్తలు రాయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పని మీదనే తాను మహానాడు నుంచి బయటికి వెళుతున్నట్టు ఆయన చెప్పారు. 2014లో టీడీపీ మాత్రమే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు

మహానాడు నుంచి బయటికి వెళ్లిన బాలయ్య!