April 21, 2013

కేసీఆర్‌కూ ఇదే గతి తప్పదు: మోత్కుపల్లి

హైదరాబాద్ : "తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే ప్రగల్బాలు పలికాడు. ఆయనను దేవుడు శిక్షించాడు. కేసీఆర్‌కు అదే గతి పడుతుంది'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్శింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో పబ్బం గడుపుకొంటూ.. కుటుంబం కోసం వేల కోట్ల రూపాయలు దండుకున్న కేసీఆర్.. తమ పార్టీని కానీ, తమ అధినేత చంద్రబాబుని కానీ విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 294 శాసనసభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని, రేపు అధికారంలోకి వచ్చేది కూడా టీడీపీయేనని ఆయన చెప్పారు. "రాష్ట్ర రాజకీయాలను ఏవిధంగా కూడా ప్రభావితం చేయలేని పార్టీ కేసీఆర్‌ది. ఇది ఫామ్ హౌస్ పార్టీ అయితే.. ఇంకోటి జైలు పార్టీ'' అని పరోక్షంగా జగన్‌పై కూడా మోత్కుపల్లి మండిపడ్డారు.

వైఎస్, కేసీఆర్ కుటుంబాలు పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ కుటుంబం లక్ష కోట్లు ఆర్జిస్తే.. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. వందలాదిమంది యువకుల ఆత్మ బలిదానాలతో నడుస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకున్నాడని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీలో బేరసారాలు సాగించారని ధ్వజమెత్తారు.

వైఎస్ ఇలాగే అన్నాడు.. భూస్థాపితం అయ్యాడు

చిత్తూరు టౌన్: అమ్మహస్తం పథకం ఓ భస్మాసుర హస్తమని, ఈ పథకం అమలుకు ప్రభుత్వంవందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం చిత్తూరులో విలేకరులతో వారుమాట్లాడుతూ అమ్మహస్తం పథ కంఅమలులో భాగంగా 9సరుకుల కోసం రూ.660కోట్లు, సంచులకోసం రూ.350 కోట్లు, ప్రకటనల కోసం రూ. 700 కోట్లు వెచ్చించడం దారుణమన్నారు.పేరుకు 9సరుకులు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ చింతపండులో గిం జలు,రాళ్లే అధికంగా వున్నాయన్నారు. రూ.7వేల కోట్ల కండలేరు ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండ
రును సంబం«ధంలేని మౌళిక వసతుల కల్పన శాఖకు అప్పగించి సీఎం సోదరుడు కిషోర్‌కుమార్‌కు భారీగా కమీషన్ అందిస్తున్నారని విమర్శించారు.

రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే వెచ్చించాల్సివుందని, దీనినే కొత్తగా 'ఇందిరమ్మ కలలు-నేటికి నిజం' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కిరణ్ సర్కారు వృధా చేస్తోందని విమర్శించారు.మూడు రోజులుగా జిల్లాలో కరెంటు ఎప్పుడు పోతుందో....ఎప్పుడు వస్తుందో...తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సర్‌చార్జీల వడ్డ్డన నుంచి ప్రజలు బయట పడకమునుపే మళ్ళీ విద్యుత్ చార్జీలను సర్కారు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు.

అమ్మహస్తం పథకం ఓ భస్మాసుర హస్తం


( రంగారెడ్డి అర్బన్) టీడీపీ అధినేత చంద్రబాబు మీ కోసం పాదయాత్ర ముగించుకుని వస్తున్న సందర్భంగా ఈ నెల 28న శంషాబాద్‌లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు టి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎర్రమంజిల్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ కోసం యాత్రను ఈ నెల 27న విశాఖపట్నంలో ముగించుకుని, ఈ నెల 28న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

ఏర్పాట్లపై సమీక్షా సమావేశం అంతకుముందుకు టీడీపీ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ శాసనసభపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ నెల 28న టీడీపీ అధినేత రాక సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ జిల్లా కమిటీ ఎంపిక ఉపాధ్యక్షులుగా జి. రాంచందర్‌గౌడ్, రొక్కం భీంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎం. శ్రీనివాస్‌గౌడ్, కె. చంద్రయ్య, డి. నారాయణరెడ్డి, రాజుగౌడ్, ఇ. వెంకటేశం, బి. శివలింగం, మీర్ మహ్మద్ అలీ, కె. లక్ష్మయ్య, జి మధుసూదన్‌రెడ్డి, జి. విఠల్‌రెడ్డి, సి. బల్వంత్‌రెడ్డి, ఎ. నర్సింగ్‌రావు, రాధాకృష్ణాయాదవ్, సి. అంజిరెడ్డి, ఎస్. కొండయ్య, ఎం. రాంరెడ్డి, జగదీష్‌యాదవ్, ఆర్. వెంకటేష్‌యాదవ్, జంగయ్యయాదవ్, రంగారావు, ఎస్సీ కృష్ణారెడ్డి, కె. మహేందర్‌రెడ్డి, రాజశేఖర్ ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

అదేవిధంగా పార్టీ అనుబంధ జిల్లా కమిటీల అధ్యక్షులుగా తెలుగు యువత అధ్యక్షుడు గణేష్‌గుప్తా, తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చిలుక మధుసూదన్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా కె.శంకర్‌గౌడ్, ఎస్సీ సెల్ బోడ బిక్షపతి, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రాజునాయక్, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా చింపుల సత్యనారాయణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఇ.వి. సాగర్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎస్. శ్రీనివాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడి
గా కొమ్ము ఉపేందర్ ఎన్నికైనట్లు వెల్లడించారు. జిల్లా కార్యవర్గంపై ఇంకా కసరత్తు జరుగుతోంది. నేడు పూర్తి వివరాలు వెలువరించినున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు రాక కోసం ఘనంగా ఏర్పాట్లు

ఆత్మకూర్(ఎస్): పెంచిన విద్యుత్ చా ర్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.  మండల పరిధిలోని ఏపూర్‌లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంతకాల సేకరణ ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్‌చార్జీలు పెంచి సా మాన్యుడిపై పెనుభారం మోపారని అన్నా రు. కార్యక్రమంలో నాయకులు లింగయ్య, నజీర్, వెంకన్న, ముత్తయ్య, బిక్షం, సోమ య్య, మధుసూదన్, బాబు, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలపై టీడీపీ సంతకాల సేకరణ

సూర్యాపేటటౌన్: రాష్ట్రంలో టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తుందని సూర్యాపేట నియోజకవర్గ టీడీ పీ ఇన్‌చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం స్థా నిక టీడీపీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు, రా ష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి రాజా జన్మదినం సందర్భం గా ఆయన కేక్‌కట్ మాట్లాడారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు 200రోజులు 2750 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. పట్టణంలోని 14వవార్డు విజయకాలనీలో మహ్మద్‌హర్షద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి 100 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి పాలేరు జలాలు అందించడంలో కాంగ్రెస్ ప్ర భుత్వం విఫలమైందని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో మంచినీరు దొరకడం లేదని, మందు మాత్రం పుల్ దొరుకుతుందని విమర్శించారు. పట్టణ అధ్యక్షు డు ఎండీ షఫీఉల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, జుట్టుకొండ సత్యనారాయణ, బూరబాల సైదులుగౌడ్, పె ద్దిరెడ్డి కళ్యాణ్, చంద్రశేఖర్, కృష్ణ, నేరేళ్ల మధుగౌడ్, స గరపు ప్రసాద్, నెమ్మాది బిక్షం, ఈదుల యాదగిరి, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఒంటెద్దు వెంకన్న, కనుకుం ట్ల శారదాదేవి, దేవేందర్, గౌష్, జానీబాయి, రత్నావత్ శ్రీను, బత్తుల వెంకటయ్య, మేడి విశ్వం, బెల్లంకొండ సైదులు పాల్గొన్నారు.

చంద్రబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన:రమేష్ రెడ్డి

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర  నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోనే కొనసాగింది. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంలో బుధవారం రాత్రి బస చేసిన ఆయన గురువారమంతా బిజీబిజీగా గడిపారు. ఉదయం పాడేరు, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరిపి తాత్కాలికంగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే నియోజకవర్గ కన్వీనర్‌లను నియమిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు సుమారు 300మంది బాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. వారికి రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభించి చంద్రయ్యపాలెం, గంగవరం, దాలింపేట, కొండలఅగ్రహారం, మాకవరపాలెం మీదుగా తామరం గ్రామం వరకు అశేష ప్రజాదరణ మధ్య సాగింది. దారిపొడుగునా ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

జనంతో మమేకమై..


డిచ్‌పల్లి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్సీ వీజీ.గౌడ్ అన్నారు. శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు 64 జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వీజీగౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి శనివారానికి 200 రోజులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 27 వరకు 2800 కిలో మీటర్లు మైలు రాయిని దాటనున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు.

రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. చంద్రబాబు మరో ఏడాదిలో సీఎం కావడం తథ్యమన్నారు. తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు అందినంత దోచుకో మిగిలింది దాచుకో అన్న విధంగా సాగుతోందన్నారు.

రాష్ట్ర కార్యదర్శి దినేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఆశయ సాధన కోసం తెలుగుదేశం శ్రేణులంతా కలిసి పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం డిచ్‌పల్లి పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పద్మారావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు తారాచంద్, సాయిలు, లక్ష్మాగౌడ్, అం జయ్య, బలరాం, బ్రహ్మానందం, నాగార్జున, శ్రీనివాస్‌గౌడ్, సలీం, గంగాధ ర్, అబ్బులు, ఎర్రన్న పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకే పాదయాత్ర

ఒంగోలు: విశాఖలో ఈనెల 27న జరగనున్న తెదేపా సభకు ఒంగోలు నుంచి కార్యకర్తలు తరలివెళ్ళేందుకు ఒక రైలును ఏర్పా టు చేయనున్నారు. ఆ మేరకు  ఇక్కడి జిల్లా పార్టీ కార్యాల యంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా నుంచి తెదేపా అధినేత చంద్రబాబు ప్రారంభించిన వస్తున్నా... మీ కోసం పాదయాత్ర ఈనెల 27న విశాఖలో ముగియనున్న విషయం విధితమే. ఆ సందర్భంగా భారీ సభకు తెదేపా శ్రే ణులు సమాయత్తం అవుతున్నాయి.

విశాఖకు పొరుగున ఉన్న జిల్లాల నుంచి భారీ సమీకరణ చేస్తుండగా కోస్తా ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలిరావాలని అధిష్ఠానం ఆదేశించింది. అందుకోసం జిల్లాలో ముఖ్యనేతలతో చర్చించేం దుకు రాష్ట్ర పార్టీ తరుపున బాధ్యులను నియమించారు. జిల్లా బాధ్యుడైన మాజీ ఎంపీ లాల్‌జాన్ బాషా గురు వారం ఒంగోలు వచ్చారు.

ఇక్కడి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు, మాజీ ఎంపీ చిమటా సాంబు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఏలూరి సాంబశివరావు, డీబీవీ స్వామి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావే శానికి హాజరు కాలేకపోయిన ఇతర ముఖ్యనేతలతో కూడా వారు సంప్ర దించినట్టు సమాచారం. చివరకు ఒ ంగోలు నుంచి ఒక రైలును ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలించాలని, ఇ తర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా ముఖ్య కార్యకర్తలంతా వెళ్ళేలా చూడాలని సమావేశంలో నిర్ణయిం చారు.

ఇదిలా ఉండగా జన సమీకరణకు సంబంధించి గుంటూరు జిల్లాకు పర్య వేక్షకునిగా మన జిల్లాకు చెందిన పొలి ట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరా వును అధిష్ఠానం నియమించింది. శని వారం ఆయన గుంటూరు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించను న్నట్టు సమాచారం.

విశాఖ సభకు ప్రత్యేక రైలు

పుల్లలచెరువు: రాబోయే సార్వత్రి క ఎన్నికల్లో నారా చంద్రబాబునా యుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధి కారాన్ని చేజిక్కించుకుం టుందని జిల్లాపరిషత్ మాజీ వైస్ ఛైర్మ న్ డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. శు క్రవారం రాత్రి శ్రీరామనవమి సంద ర్భంగా అక్కపాలెంలో ఏర్పాటు చేసిన ఎలిక్ట్రికల్ ప్రభపై ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇంతకు ముందు జ రిగిన సొసైటీ ఎన్నికలను పరిశీలిస్తే తె లుగుదేశం పార్టీకి పూర్వవైభవం తిరిగి వస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కని పిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం కార్యకర్తలకు దోచిపెట్టడంలోనే దృష్టి కేంద్రీకరించిందని, సామాన్యుల కు అన్ని విధాల నష్టాలను కలుగజేస్తు న్నదని ఆయన అన్నారు.

విద్యుత్ చా ర్జీలను పెంచడం, తదితర అంశాలతో పేదవారి నడ్డివిరుస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఎర్రగొండపాలెం ని యోజకవర్గ అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అ న్నారు. మరో త్రిసభ్య కమిటీ సభ్యుడు చేకూరి ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రా క్టుల పేరుతో ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారన్నారు. గంగవరంలో రేషన్ డీలర్లు రేషన్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్ర యించడం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్భలం ఎంతో ఉందని ఆయన విమర్శించారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పేరుతో కార్యకర్తలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నా రు. రాష్ట్ర రైతుసంఘం కార్యవర్గ స భ్యుడు కాకర్ల కోటయ్య, పుల్లలచెరు వు టీడీపీ కన్వీనర్ శనగ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్ శనగ సుబ్బారెడ్డి, ఎర్ర గొండపాలెం మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్, మండల తెదే పా నాయకులు శతకోడు వెంకటరెడ్డి, ఎర్రయ్య, మేడికొండ లక్ష్మి నారాయణ చౌదరి, ద్వారకచర్ల అంజిరెడ్డి తది తరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో తేదేపాకే అధికారం:మన్నె రవీంద్ర

పర్చూరు రూరల్
: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 64వ జన్మదినోత్సవ వేడుకలు పర్చూరు లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 64 కేజీల భారీ కేక్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజల కోసం 64 ఏళ్ల వయస్సు లోనూ పాదయాత్ర చేస్తున్న చంద్రన్న కు ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా కార్య దర్శులు చిట్టినేని రామకృష్ణ, అప్పాజీ, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్, మానం హరిబాబు, పట్టణశాఖ అధ్య క్షులు కృష్ణ, కె.శేషగిరి, డి.బుజ్జిబాబు, పాలేరు శ్రీను, ఎంవీ కిషోర్, థమన్ శ్రీను, ఆర్.పున్నయ్య, ఇజ్రాయేల్, ఇం టూరి శ్రీధర్, అప్పారావు, కె.శ్రీనివాస రావు, కొండ్ర గంటి శివ, దరియాహు స్సేన్, శిరిగిరి నాగేశ్వరరావు, పొన్నం శివ, మక్కెన శేఖర్, వెంకటేశ్వర్లు, హైటెక్ సుభానీ, తొండెపు ఆదినారా యణ, పోపూరి శ్రీనివాసరావు తదిత రులు పాల్గొన్నారు.

రమేష్‌ను అన్నివిధాల ఆదుకుంటా కారంచేడు : ఆటో ప్రమాదంలో తలకి బలమైన గాయమైంది, దీనివల్ల నరాలు చచ్చుబడి ఎడమ కన్ను పూర్తి గా కనబడుటలేదు. కుడి కన్ను పగటి పూట కొంతమేర మాత్రమే కనబడు తుంది. ఆర్థిక స్థోమత లేని వాడినని స్వర్ణ గ్రామానికి చెందిన పోలకం రమే ష్ శనివారం గ్రామానికి వచ్చిన నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబ శివరావుకు తన బాధను విన్నవించుకు న్నాడు.

వెంటనే స్పందించిన ఏలూరి సాంబశివరావు శంకర్ నేత్రాలయ వైద్యులతో ఫోన్‌లో రమేష్ పరిస్థితి మొత్తం వివరించారు. మంగళవారం రమేష్‌ను నేత్రాలయంకు వెళ్లమని చెప్పారు. రమేష్ వైద్యానికి అయ్యే ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఏలూరి వెంట గ్రామ టీడీపీ నాయకులు మాలెంపాటి సత్యనారా యణ, తిరుమలశెట్టి శ్రీహరి, లక్కాకు ల శ్రీనివాసరావు, సుధా నాగేశ్వరరా వులు ఉన్నారు.

యద్దనపూడి : చంద్రబాబు జన్మ దినం సందర్భంగా యద్దనపూడిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శని వారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు ప్రత్యేక పూజ లు చేశారు. ఈ నెల 27న విశాఖ పట్ట ణంలో పాదయాత్ర ముగింపు సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా అభి మానులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపనేని రంగయ్యచౌదరి, ఆదినారా యణ, శ్రీను, కోటేశ్వరరావు, సీతయ్య, కామేశ్వరరావు, సాధినేని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంకొల్లు రూరల్ : చంద్రబాబు 64వ జన్మది నోత్సవం సందర్భంగా ఇంకొల్లులోని జామియా మసీదులో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మిఠాయిలు పం పిణీ చేశారు. ఇరువురు వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తొం డెపు ఆదినారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి నాయుడమ్మ, అన్సారీ, మాబాషా, మాబుల్లా, రఫీ, వై.ప్రసాద్ రెడ్డి, బోడావుల శేషగిరిరావు, రావి రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర  ఉత్సాహంగా జరిగింది. చంద్రబాబుమాకవరపాలెం మండలం తామరం నుంచి పాదయాత్ర ప్రారంభించి రాచపల్లి, రామన్నపాలెం, భీమబోయినపాలెం, దుంగలవానిపాలెం, శెట్టిపాలెం, రాజుపేట గ్రామాల మీదుగా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో గల కశింకోట మండలం పాతకన్నూరుపాలెం గ్రామానికి చేరుకున్నారు.తామరంలో బసచేసిన చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ పరిస్థితిపై చర్చించారు.

అనంతరం భీమిలి నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ మాఫియాతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు ఖనిజ సంపదను, ప్రజల ఆస్తులను దోచుకుంటున్న వైనాన్ని తూర్పారబట్టారు. పాదయాత్ర ప్రారంభించి శుక్రవారం నాటికి 200 రోజులు పూర్తికావడంతో తామరం, భీమబోయినపాలెం గ్రామాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌లను కట్ చేసి అభినందనలు అందుకున్నారు. (నర్సీపట్నం)

బాబుకు బాసటగా..

కైకలూరురూరల్: ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు 200 రోజులుగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఆశయాలు మహోన్నతమైనవని ఎమ్మెల్యే జయమంగళ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం కైకలూరులోని మాగంటి స్వగృహంలో అట్లూరి భవానీప్రసాద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య నిర్వహించారు. ఢిల్లీలో ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరగడం, రాష్ట్ర ప్రజలు కరెంట్, నీరు, తదితర సమస్యల్లో బాధపడుతున్నందున పుట్టినరోజు వేడుకలను చేయవద్దని చంద్రబాబు సూచించారని తెలిపారు.

కాని 20 రోజులుగా పుట్టినరోజు వేడుక పనులను నిర్వహించడం వలన జరపక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణలు చంద్రబాబుకు 63 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 63 కేజీల కేక్‌ను కట్ చేశారు. హిందు, ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక పూజలను, ప్రార్థనలను నిర్వహించారు. మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లేరుకు పూర్వపు వైభవం తీసుకువస్తామని అన్నారు. బాంబులతో చెరువులను ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జీవనాధారం చూపించలేకపోయిందని తెలిపారు.

ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షుడు డాక్టర్ సీఎల్.వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎంపీపీ నర్శిపల్లి అప్పారావు, ఏబీసీ ట్రస్ట్ అధ్యక్షుడు అట్లూరి భవానీ ప్రసాద్, ఈడ్పుగంటి వెంకటరామయ్య, చల్లసాని జగన్మోహనరావు, పోసిన పాపారావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు ఆశయాలు మహోన్నతం

విశాఖపట్నం/కశింకోట:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అనకాపల్లి నియోజకవర్గంలో అపూర్వ ఆదరణ లభించింది. కశింకోట మండలం పాతకన్నూరుపాలెంలో పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. యువత వెన్నంటే ఉంటూ జేజేలు పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన వెంట కొనసాగారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి కశింకోట మండలం పాతకన్నూరుపాలెంలో బసచేసిన చంద్రబాబు శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.

అయినప్పటికీ పార్టీనాయకులు, కార్యకర్తలు ఈదురుగాలులు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివచ్చారు. దీంతో చంద్రబాబు బస్సు నుంచి దిగి వచ్చి నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలను స్వీకరించారు. ఆయన బస చేసిన ప్రాంగణం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభిమానుల కోలాహలంతో సందడి నెలకొంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభించిన బాబుకు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. కన్నూరుపాలెం జంక్షన్ వరకూ జనం కిక్కిరిసి పాదయాత్రలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ కష్టాలను ఏకరవుపెట్టారు. తాగేందుకు నీరులేదని, ఉండేందుకు ఇళ్లు లేవని, తినడానికి తిండిలేదని, నిద్రపోతామంటే విద్యుత్ సమస్య అని గోడు వెళ్లబోసుకున్నారు. సాగునీరు లేక వ్యవసాయం దెబ్బతింటున్నదని, పాఠశాలలకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటలకు చలించిన చంద్రబాబు అధికారం కట్టబెడితే ఇంటికి పెద్దకొడుకులా బాగోగులు చూస్తానని భరోసా ఇచ్చారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడాను బేరేజు వేసుకోవాలన్నప్పుడు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.

'ఔను...ప్రస్తుత పాలన మాకొద్దంటూ' కేకలు వేశారు. మళ్లీ చంద్రబాబే రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కొత్తూరు జంక్షన్‌కు వస్తుండగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత వర్షం పెద్దదయ్యింది. అయినప్పటికీ ప్రజలెవరూ పాదయాత్ర నుంచి చెదరకుండా చంద్రబాబు వెంట నడక సా

గించారు. కొత్తూరు జంక్షన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్‌పై కూడా విరుచుకుపడ్డారు.

శనివారం అనకాపల్లిలో పాదయాత్రకు పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా దాడి రత్నాకర్ భారీ స్థాయిలో జనసమీకరణ చేశారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా లేకపోయినప్పటికీ జనం చీకట్లో వేచి ఉండి చంద్రబాబును చూశారు. పర్యటనకు ముందు చంద్రబాబును ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగింది.

చంద్రబాబుకు నీరాజనం

అనకాపల్లి ,
: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అతని తనయుడు నారా లోకేష్ శనివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు అనకాపల్లి నియోజకవర్గంలోని కన్నూరుపాలెంలో ఉండడం వల్ల లోకేష్ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన లోకేష్ మధ్యాహ్నం వరకు తండ్రితో గడిపి హైదరాబాద్ పయణమయ్యారు. లోకేష్ వెళుతున్న సమయంలో అభిమానులు ఆయనను చుట్టుముట్టి ఫొటోలు తీసుకున్నారు.

చంద్రబాబుకు తనయుడి శుభాకాంక్షలు

పాయకరావుపేట
: తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆపార్టీ నాయకులు కంకిపాటి వెంకటేశ్వరరావు, మజ్జూరి నారాయణరావు అన్నారు. శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా స్థానిక లక్ష్మీ ఫంక్షన్ హాల్లో పట్టణ, మండల టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణ ులు బర్త్‌డే కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల కోసం టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు గ్రామ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణ ులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, గొర్రెల రాజబాబు, పెదిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, కంచి మాణిక్యం, గుడబంటి శాంతమ్మ, గీసాల పద్మ, మల్లవరపు వీరభద్రరావు, యాళ్ళ వరహాలు, చిట్టూరి గోపీమఠాల్, చిట్టిమూరి రామారావు, భజంత్రీల శివ, సూరా సుబ్రహ్మణ్యం, పిన్నింటి సూరిబాబు పాల్గొన్నారు.

నక్కపల్లిలో..

నక్కపల్లి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు దేవవరపు శివ, టౌన్ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవవరపు సత్యనారాయణ, నానేపల్లి రాఘవులు, కక్కిరాల అప్పారావు, దేవవరపు కొండలరావు, నానాజీ, ముద్దా నానాజీ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పూర్వవైభవానికి కృషి


కశింకోట : ఒకపక్క భోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తమ ప్రియతమ నేతను చూసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూశారు. కశింకోట మండలం పాతకన్నూరుపాలేనికి శుక్రవారం రాత్రి చంద్రబాబు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్రజలు బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతామని ఎదురుచూశారు. ఢిల్లీ ఘటనకు నిరసనగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు ఆసక్తి చూపకపోవడంతో వారంతా కాసంత నిరాశ చెందారు. అయినా బాబును చూద్దామని క్యూ కట్టారు. శనివారం ఉదయం కూడా జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాల నుంచి పెద్దస్థాయిలో ముఖ్యనేతలు, అభిమానులు తరలివచ్చారు.

ఉదయం 11.15 గంటలకు బోరున వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం కురియడంతో బాబు బస చేసిన ప్రాంతమంతా జలమయమైంది. వర్షం పూర్తిగా తగ్గేవరకూ ముఖ్యనేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వేచి ఉన్నారు. ఇంకొందరు వర్షంలో తడుచుకుంటూనే అక్కడకు చేరుకున్నారు. పన్నెండుగంటల సమయంలో చంద్రబాబునాయుడు బస్సులో నుంచి బయటకు వచ్చారు. శుభాకాంక్షలు అందుకొని అభివాదం చేశారు.

కూలిన టెంట్లు..

చంద్రబాబునాయుడు బస చేసిన ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురియడంతో

ఉన్నఫలంగా టెంట్ కూలిపోవడంతో వారంతా పరుగులు తీశారు. సభా ప్రాంగణమంతా తడిసి చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో చంద్రబాబు బస్సు వద్దకు చేరుకోవడానికి ప్రజలు, నాయకులు ఇబ్బంది పడ్డారు. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో అప్పటికప్పుడు చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో ఇసుక వేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు.
ఆ ప్రాంగణంలో వున్న టెంట్లు కుప్పకూలాయి. చంద్రబాబు బస చేసిన బస్సుపై వేసిన టెంట్ కూడా కూలింది. ఆ సమయంలో చాలామంది తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు చంద్రబాబు రాకకోసం ఎదురు చూస్తున్నారు.

వర్షాన్ని లెక్కచేయని అభిమానం

అనకాపల్లి
: చెరకు పంట గిట్టుబాటు కావడంలేదని బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు రైతులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా చంద్రబాబు బంగారమ్మపాలెంలో చెరకు క్రషర్ దగ్గరకు వెళ్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరకు పంటకు పెట్టుబడి పెరిగిపోతున్నదని, ఆశించిన ఫలితం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖర్చులన్నీ పోగా నష్టమే మిగులుతున్నది కానీ పెట్టుబడి కూడా రావడంలేదని వాపోయారు. పరపతి కోసమే సాగుచేస్తున్నాం తప్ప ఫలితం కనిపించడంలేదని చంద్రబాబుకు గోడు వెళ్లబుచ్చారు. తమ పరిస్థితిని ప్రభుత్వం అర్థంచేసుకోవడం లేదని వాపోయారు. మీరొచ్చాకైనా తమ పరిస్థితి బాగుపడుతుందని ఆశిస్తున్నామని అన్నారు.

చంద్రబాబు దృష్టికి చెరకు రైతుల సమస్యలు

కొయ్యూరు/మాకవరపాలెం: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పాదయాత్రలో భాగంగా తామరం బీఈడీ కళాశాల ఆవరణలో బసచేసిన చంద్రబాబు
సాయంత్రం భీమిలి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నేతలు కృషిచేయాలన్నారు.

జిల్లాలో ఇప్పటికే ఐదు నియోజకవర్గాల కార్యకర్తలను కలిశానని, ఇంకా తొమ్మిది నియోజకవర్గాల వారిని కలవాల్సి ఉందన్నారు. కార్యకర్తలే టీడీపీకి పెద్ద ఆస్తిగా ఉన్నారన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకునే రోజు త్వరలోనే వస్తుందని, పార్టీ పూర్వవైభవానికి కార్యకర్తలందరూ ముందుకు సాగాలని బాబు కోరారు. గత 30ఏళ్ల కాలంగా పార్టీ కార్యకర్తల త్యాగాన్ని చేస్తూ రావడం వల్లే నాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు, ప్రస్తుతం తనకు జాతీయస్థాయిలో గౌరవం దక్కిందన్నారు. ఈ సమావేశాల వల్ల కార్యకర్తల నుంచి చాలావిషయాలు తెలుస్తున్నాయని, దీని ఆధారంగానే రానున్న రోజుల్లో నేతల పనితీరును అంచనావేసి కష్టపడి పనిచేసేవారినే అందలం ఎక్కిస్తానని బాబు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

అవినీతిపనులను ప్రజల ఉపేక్షించరు కాంగ్రెస్ పాలనలో మైనింగ్ మాఫియాపై తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం ఫలించిందని బాబు తెలిపారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన పిల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో అవినీతిరంగులను ప్రజలు ఉపేక్షించరన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

భీమిలిలో ఓటమికి కారణం పార్టీ తప్పిదమే 2004, 2009 ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా ఉన్న భీమిలి నియోజకవర్గం ఓటమి పాలవ్వడానికి పార్టీకి సరైన సమాచారం లేకుండా, అభ్యర్థి ఎంపికలో చేసిన పొరపాటే కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది పునరావృతం కాకుండా సరిదిద్దే చర్యలు చేపడతానని కార్యకర్తలకు హామీనిచ్చారు. ఇందులో భాగంగా అభ్యర్థి ఎంపికలో వారి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటి నుంచి ఎన్నికలు ముగిసేవరకు కార్యకర్తలు పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంకండి

విశాఖపట్నం: రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అవినీతికి సంబంధించి మూలాలు వెతుకుంటే వైఎస్ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా మాకరపాలెం మండలం చెట్టుపాలెంలో
రాత్రి ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ, అవినీతి అక్రమాలపై దర్యాప్తుచేస్తున్న సంస్థలు ఏ ఫైలు వెదికినా, ఎవర్ని విచారించినా వైఎస్, అతని కుమారుడితో సంబంధాలు వెలుగుచూస్తున్నాయని ఆరోపించారు.

సూట్ కేసులతో రాజకీయం చేయాలని చూసిన జగన్, అవినీతి ఆరోపణలతో జైలుకుపోయారని వ్యాఖ్యానించారు. తనను కావాలనే జైలులో వుంచారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుచేసిన వ్యక్తి జైలులో కాకుండా ఇంకెక్కడ వుంటారని ప్రశ్నించారు. చివరకు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వలేని స్థితికి వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.

దొంగలను దొంగగానే చూడాలి తప్ప దొరల్లా చూడకూదదని చంద్రబాబు స్పష్టంచేశారు.

దేశంలో ఏ రాష్ట్రం సాధించలేనిఐ అభివృద్ధి ఫలితాలను తమ హయాంలో చూపించామని, అమెరికా వంటి పలు దేశాల అధ్యక్షుల మన్ననలు పొందామని, ప్రపంచ పటంలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు. కాంగ్రెస్ నాయకులు గడచిన తొమ్మిదేళ్లలో హద్దుల్లేని అవినీతికి పాల్పడడం ద్వారా హైదరాబాద్‌కు చెడ్డ పేరు తెచ్చారని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులతో యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటూ పెట్టడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆరోపించారు.

వైఎస్ కుటుంబం చుట్టూనే అవినీతి మూలాలు

మాకవరపాలెం/కొయ్యూరు
: అక్రమ అనుమతులతో నిర్మించిన అన్‌రాక్ కంపెనీ యాజమాన్య మెడలు వంచైనా ఈప్రాంత రైతాంగానికి, కూలీలకు న్యాయం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా  సాయంత్రం మాకవరపాలెం మండలం కొత్తపాలెం పునరావాస కాలనీ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అన్‌రాక్ కంపెనీ స్థాపన కోసం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇటు రైతులు, అటు గిరిజన సంపదను దోచుకున్నారన్నారు.

లక్షలు విలువ చేసే భూములను ఎకరానికి మూడు నాలుగు లక్షలు వెచ్చించి పేద రైతాంగాన్ని అన్యాయం చేశారన్నారు. భూములు లీజుకు తీసుకొనే సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఈప్రాంత రైతాంగం నుంచి మూడు వేల ఎకరాలు తీసుకోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అలాగే రామన్నపాలెం సభలో మాట్లాడుతూ రామన్నపాలెం రైతాంగం సాగునీటి అవరాలు కోసం టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తే ఆ నీటిని అన్‌రాక్ కంపెనీ లాక్కొని ఈప్రాంత భూములు బీడువారే పరిస్థితి ప్రభుత్వం తెప్పిస్తుందన్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాంత బి.ఫారం పట్టాలకు శాశ్వత పట్టాదారుపాసుపుస్తకాలు భూయాజమాన్య హక్కు పత్రాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పిల్లల చదువులకు ఉపయోగపడేలా ప్రతీనెలా నగదు అందజేస్తానని ప్రకటించారు.

అన్‌రాక్ మెడ వంచైనా రైతులకు న్యాయం చేస్తా

కొయ్యూరు
: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెచ్చుమీరిందని, దీని నిర్మూలనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటే యువత మీ వెంటే నడుస్తుందని విశాఖపట్నం నుంచి వచ్చిన యువ వైద్యుల బృందం చంద్రబాబుకు విన్నవించింది.  తామరం బీఈడీ కాలేజీ ఆవరణలో బసచేసిన చంద్రబాబును విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువ వైద్యులు కృష్ణకిశోర్, సతీశ్, కాశేశ్వరరావు, రమేశ్, సునీల్, వీరయ్యచౌదరి, రాజేంద్రలతోపాటు మరో పదిమంది వైద్యుల బృందం కలిసింది.

బాబు ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులపై పరీక్షలు జరిపి కొన్ని సలహా,సూచనలు ఇచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు రాష్ట్రంలో పెరిగిన అవినీతిని అంతమొందించేందుకు ప్రజల్లో చైతన్యం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత అవినీతిపై అన్నివర్గాల వారితో చర్చించి పార్టీపరంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రత్యక్ష పోరాటాలకు రంగం సిద్ధంచేసే చర్యలు తీసుకుంటానని యువవైద్య బృందానికి హామీ ఇచ్చారు.

అవినీతిపై పోరాడితే..యువత మీవెంటే..

లక్కవరపుకోట : ఓబుళాపురం గనుల్లో అనేక వే ల కోట్ల అవినీతి జరుగుతోందని టీడీపీ సుమారు 7 సంవత్సరాల క్రితమే చెప్పిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. తన స్వగృహంలో వి లేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును మన స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నా రు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కమిటీ ఓబుళాపురం మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటిం చి, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి జరుగుతున్న లక్షల కోట్ల ఆస్తినష్టం గురించి ప్రపంచానికి వెల్లడించిందని ఆమె గుర్తు చేశారు. ఆనాటి నుంచి అసెంబ్లీలోనూ, బయటా, పార్టీ అధినేత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ఈ అక్రమ మైనింగ్‌పై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తూనే ఉందని ఆమె తెలిపారు. అవినీతిమయ కాంగ్రెస్‌నూ, దాని నుంచే పుట్టిన పిల్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి, నీతి, నిజాయితీ గల తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓబులాపురం అక్రమాలపై టీడీపీ ఆనాడే చెప్పింది

విజయనగరం టౌన్: విశాఖలో ఈ నెల 27న జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ జరిపేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా పార్టీ ముఖ్యనేతలు పలుమార్లు సమావేశమై యాత్ర ముగింపు సభను విజయవంతం చేయడంలో వ్యూహరచన చేస్తున్నారు.పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు డు పూసపాటి అశోక్ గజపతిరాజు నేతృత్వంలో ఈ ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. జిల్లా నుంచి గరిష్టంగా లక్ష మంది వేళ్లేలా ప్రణాళిక రూపొందించిన నాయకులు ఇందులో నియోజకవర్గానికి పది వేల మంతున 90 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను కదలించేందుకు వ్యూహరచన ప్రారంభించారు.

తొమ్మిది నియోజకవర్గాలతో పా టు జిల్లా కేంద్రం విజయనగరం నుంచి అదనంగా పది వేల మందిని తరలించాలని యోచిస్తున్నారు. జన సమీకరణకు అవసరమయ్యే వాహనాలను కూ డా ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు పాదయాత్ర ఈ జిల్లాలో కూడా వుంటుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవం తం అయినందున ఈ జిల్లాలో కూడా జయప్రదం చేయాలని కార్యకర్తలు, నాయకులు ఉత్సాహపడ్డారు. అయితే అనుకోని కారణాల వల్ల విశాఖతోనే పా దయాత్ర ముగిసిన నేపథ్యంలో ఆ సభ కు పెద్ద ఎత్తున తరలివెల్లాలని వారం తా భావిస్తున్నారు.

విశాఖపట్టణం విజయవంతం చేయాలని నాయకులు ధృ డసంకల్పంతో వుండడానికి రెండు కారణాలు వున్నాయి. ఇప్పటికే జిల్లా కేం ద్రం నుంచి నియోజకవర్గ, మండల స్థాయి నేతలకు జన సమీకరణకు సం బంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. అక్కడ నుంచి క్షేత్రస్థాయిలో నేతలు శ్రేణులను కలుస్తున్నారు. ముగింపు సభ విజయవంతం చేయాల్సిన అవసరాన్ని కార్యకర్తలకు వివరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబు సభను విజయవంతం చేయడం ద్వారా స్థానికంగా పార్టీ పట్టును కూడా నిరూపించుకోవడానికి దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కు వ సంఖ్యలో తరలివెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తగిన సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేయాలని నేతలపై ఒత్తిడి ప్రారంభించారు. ఇప్పటి వరకూ అందించిన సమాచారం ప్రకారం ని యోజకవర్గానికి పది బస్సులు ఏర్పా టు చేయడానికి జిల్లా పార్టీ పెద్దలు నిర్ణయించారు. అలాగే జిల్లా మొత్తం 1100 నాలుగు చక్రాల వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

వీటితో పాటు నాయకుల సొంత వాహనాలు, ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం ఈ జిల్లా నుంచి సుమారు 1500 వాహనాలతో తరలివెళ్లేందుకు సంసిద్ధమౌతున్నారు. 27న సభ జరగనున్నందున సమయం కూడా ఎక్కువగా లేకపోవడం వలన పార్టీ నేతలు జనసమీకరణ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.

బాబు సభకు భారీ జన సమీకరణ

హన్మకొండ టౌన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 64వ జన్మదిన వేడుకలను శనివారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా టీడీజీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ దేశాలలో గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనదైన ముద్ర వేశారని అన్ని రంగాలను అభివృద్ధి పథంలోకి తీసుకెల్లారని కొనియాడారు.

ఎంపీ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని అవినీతి, అసమర్ధపాలనను అంతం చేయడానికి ప్రజా సమస్యల పరిష్కా రం కోసం 64 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపట్టార
న్నా రు. 2014లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించి అభివృద్ధి చేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు.సమావేశంలో నేతలు ఈగ మల్లేశం, జాటోతు నెహ్రూ, అనిశెట్టి మురళి, గుండు ప్రభాకర్, హరినారాయణ, హుస్సేన్, ఖాదర్అలీ, పుల్లూరి అశోక్, దశరథరామారావు పాల్గొన్నారు.

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఏలూరు

మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం.. ఎన్నో ఒడిదుడుకులు.. జయాలు, అపజయాలు.. దాడులు, ఎదురుదాడులు, అక్రమ కేసుల బనాయింపులు.. మరెన్నో చోట్ల పసుపు పచ్చని అభివృద్ధి గీటురాళ్లు.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తల మొక్కవోని దీక్ష.. మరెన్నో త్యాగాలు వెరసి పార్టీ అధినేత చంద్రబాబు ఈ మధ్యన చేసిన పాదయాత్ర తెలుగుదేశంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార పగ్గాలు చేజిక్కించుకునే దిశగా కార్యకర్తలను, నాయకులను కార్యోన్ముఖులను చేసింది.

ఆర్థికపరమైన వెలితి ఉన్నా.. అనేక కష్టాలు ఎదురవుతున్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స మరోత్సాహం ఈ పార్టీలో స్పష్టంగా కన్పిస్తోంది.పార్టీలో సుదీర్ఘకాలం పా టు మరువలేని సేవలు అందించిన దిగ్గజాలు అమరులైన వారి స్థానంలో నవయువత నాయకత్వ పగ్గాలను చేపట్టారు.సై అంటే సై అనే ధైర్యాన్ని కూ డదీసుకుని అవినీతిపై సమరం చేస్తున్నారు. ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. ఫలితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ల క్రితం ఉన్న స్తబ్దత, నిస్తేజం, అసంతృప్తి, వ్యక్తిగత వైరాలు దూదిపందెల్లా ఎగిరిపోయా యి.

ఇప్పుడు అందరి సమిష్టి శప«థం ఒకటే.. అదీ తమ అధినేత చంద్రబాబును సీఎంను చేయాలని. పార్టీని అధికారంలోకి తేవాలని. చంద్రబాబు పదమూడు రోజుల పాటు జిల్లాలో చేసిన సుదీర్ఘ పాదయాత్ర సహజంగానే పార్టీకి కొంత కలిసొచ్చింది. దూరమైన కొన్ని వర్గాలు ఈ యాత్ర ద్వారా పార్టీకి చేరువయ్యాయి. ఈ విషయం స్పష్టంగా బయటపడింది. పార్టీలో ఎ న్ని సమస్యలున్నా అందరినీ ఏకతాటి మీదకు తేవడంలో ఓవైపు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఇంకోవైపు సీనియర్ నేత మాగంటిబాబు, మరోవైపు ఎమ్మెల్యేలు ప్రభాకర్, శివరామరాజు,శేషారావు,టి.వి.రామారా వు, కన్వీనర్లు అంబికా కృష్ణ, బడేటి బు జ్జి, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు,జగ్గారెడ్డి, డాక్టర్ బాబ్జి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, కర్రి రాధాకృష్ణారెడ్డి,వై.టి.రాజా, గాదిరాజు బాబు,మొడియం శ్రీనివాస్ వంటి ప్రముఖ నేతలు పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో మడమ తిప్పకుండా ముం దుకు సాగుతున్నారు. సీతారామలక్ష్మి నరసాపురం పార్లమెంటు నుంచి, మా గంటి బాబు ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దాదాపు సిద్ధమయ్యారు.ఇంకోవైపు మురళీమోహన్ రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీకి దిగబోతున్నారు.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా కూడా పార్టీ భారీగానే పుంజుకుంది. కాంగ్రెస్,వైకాపాలకు కంట్లో నలుసు గా మారింది.

దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభాకర్ ఊరూవా డా పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఆయనే సర్వం కార్యకర్తలకు అండగా నిలుస్తూ బాద్‌షాలా దూసుకుపోతున్నారు. తిరుగులేని ఆధిక్యతతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.నిడదవోలులో శేషారా వు దూకుడు కొనసాగుతూనే ఉంది. రైతులు,మిగతా అన్నివర్గాలకు ఆయన మరింత చేరువయ్యే ప్రయత్నంలో ఇప్పటికే కొంత సక్సెస్ సాధించారు.

ప్రజా సమస్యలపై నిరసనలు చేయ డం,సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించడం లో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు గడిచిన కొన్నాళ్లుగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఏమి చేసినా శివ య జ్ఞం పేరిట కార్యకర్తల్లో కొత్త ఊపుకు దారితీస్తోంది. కొవ్వూరులో ఎమ్మెల్యే రామారావుదీ అదే తీరు. అక్కడ కొం దరు నేతలు పార్టీని వీడినప్పటికీ చం ద్రబాబు సాక్షిగా ఆయన అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై 'రామ' బాణాలు వదులుతున్నా రు. ఫలితంగా అక్కడ రామారావు దూకుడుతనం పార్టీ కార్యకర్తలను ఎ న్నికలకు సమాయత్తపరిచేలా ఉంది.

ఇక మాగంటి బాబు, సీతారామలక్ష్మిలు పార్టీకి రెండు కళ్లుగా మారారు. వీరిద్దరూ పార్టీని కొంత సమన్వయపరిచే విషయంలో పూర్తి విజయం సా ధించినట్లే కన్పిస్తోంది. చంద్రబాబు పాదయాత్ర నిర్వహణలో ఈ ఇద్దరు నేతలు చూపించిన చొరవ చంద్రబాబు ను సైతం సంతృప్తిపరిచింది. అలాగే భీమవరంలో గాదిరాజు బాబు, పాలకొల్లులో డాక్టర్ బాబ్జీ, నరసాపురంలో డాక్టర్ చినమిల్లి లాంటి నేతలు కూడా పార్టీ పరిరక్షణలో తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. గోపాలపురం, పోలవరం,చింతలపూడిలో డజన్లు కొద్దీ నేతలు ఆర్ధిక భారాన్ని కూడా భుజాన వేసుకుని పార్టీకి జవసత్వాలు అందిస్తున్నారు.

గోపాలపురంలో పారిశ్రామికవేత్త విక్రమాదిత్య పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.తణుకులో పార్టీని ఏదో రకంగా నిలబెట్టేందుకు వై.టి.రాజా నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చిం తలపూడిలో జగ్గారెడ్డితో పాటు లింగపాలెం మండలానికి చెందిన పార్టీ ము ఖ్యులు ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు ఇప్పటికే లోతట్టు కార్యాచరణకు దిగారు.ఇంకోవైపు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఈ మధ్యన జరిగిన విద్యుత్ ఆందోళనలో నిర్విరామంగా ఊరూవాడా తిరిగారు. తద్వారా కార్యకర్తలకు కొత్త ధైర్యాన్ని ఇచ్చారు.రాబోయేది మన ప్రభుత్వమేనంటూ వారిలో ధీమాను రగిలించా రు.ఏలూరులో అంబికా కృష్ణ, బడేటి బుజ్జిల సమన్వయం పార్టీకి తిరుగులేని ధైర్యాన్నిచ్చింది. అలాగే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో లోపాలు ఉన్నప్పటికీ కూడా అందరిదీ ఇప్పుడు ఒకటే మాటైంది. ఒకటే బాటైంది.

అదే తెలుగుదేశంలో కొత్త ఉత్తేజానికి దారితీస్తోంది. ఏలూరు జూట్‌మిల్లులో టిఎన్‌టియుసి గెలుపు అంబికా కృష్ణ శిబిరంలో అత్యధిక నూతనోత్సాహాన్ని సృ ష్టించింది. తాడేపల్లిగూడెం కన్వీనర్ ముళ్లపూడి బాపిరాజు, ఆయన అనుచరులు, మద్దతుదారులు పార్టీ కోసం నిర్విరామంగా కష్టాలను ఎదురొ
డ్డి, ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లటం ఆ నియోజకవర్గంలో పసుప పతాక ఎగురవేయాలన్న కాంక్ష కార్యకర్తల్లో రగిలించేలా చేసింది. సుదీర్ఘపాదయాత్ర ను ఈ నెల 27న చంద్రబాబు విశాఖపట్నం జిల్లాలో ముగించబోతున్నారు. దీనికి భారీగా తరలివెళ్లేందుకు శనివా రం పార్టీ జిల్లా కార్యాలయంలో విస్తృ త స్థాయి సమావేశం జరగబోతోంది. పార్టీ ముఖ్యులంతా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పార్టీ సమన్వయ కార్యకర్త పాలి ప్రసాద్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావుతో పాటు ఒకరిద్దరు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.

చంద్రోత్సాహం

ఏలూరు

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని శనివారం జిల్లా అంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనేక చోట్ల కార్యకర్తలు, పండుగ వాతావరణంలా జన్మదినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఏలూరు నగరంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద 64 కిలోల కేక్‌ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో పార్టీ పరిశీలకులు కాగిత వెంకట్రావు అధ్యక్షతన అత్యంత ఉత్సాహభరితంగా కట్ చేసి నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభాకర్, ఆయన అనుచరులు పెద్దఎత్తున చంద్రబాబుకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ అంబికా కృష్ణ,బడేటి బుజ్జి,పాలి ప్రసాద్‌తో అనేకమంది నాయకులు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి కూడా పూలమాలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఇతర నేతలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు. పాలకొల్లు పట్టణంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి, నిమ్మల రామానాయుడు చంద్రబాబు జన్మదినోత్సవం నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేశారు.

బాబూ..హ్యాపీ బర్త్ డే


 ఏలూరు: 'ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. మనం మరింత చేరువ కావాలి. ఇది అంతిమ పోరాటం. వచ్చే ఎన్నికల్లో అధికారమే ప్రధానంగా అటో ఇటో తేల్చుకుందాం. మనమే ప్రజల దగ్గరకు వెళ్లాలి. సమస్యలపై దండెత్తాలి. కరెంటు సమస్య, తాగునీటి సమస్యను ఎక్కడా వదిలివేయొద్దు. పోరాటాలకు దిగండి. అలాగే ఈ నెల 27న చంద్రబాబు పాదయాత్ర ముగింపునాడు జరిగే సభే వచ్చే ఎన్నికలకు నాందిగా అందరూ కదిలిరండి' ఇదీ తెలుగుదేశం ముఖ్యనేతలు తమ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.

మనం మాత్రం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర కారణంగా మన పార్టీ ఎంతో పుంజుకుంది. అయినా మనం దీంతో సంతృప్తి చెందకూడదు. మరింతగా జనం మధ్య దూసుకుపోవాలి. కాంగ్రెస్‌ను ఎండగట్టాలి. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల ఓటమికి, తెలుగుదేశం గెలుపునకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని కూడా నాయకులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోపాలను సరిదిద్దుకుందాం. ప్రజలతో వెళ్తేనే మనం గట్టెక్కుతాం. వై ఎస్సార్ కాంగ్రెస్ ఎప్పుడో దిగజారిపోయింది. జనం మన వైపు చూస్తున్నారు. ఈసారి గెలుపు మనదే కావాలి. అందుకే ప్రతీ కార్యకర్త, నాయకుడు ఈ సమరోత్సాహంతో ముందుకురకాలని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చియ్యచౌదరి పిలుపునిచ్చారు.

నియోజకవర్గాల వారీగా వచ్చే జూన్‌లో పార్టీ అధినేత మరోసారి సమీక్ష చేయబోతున్నారు. దీనికి కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న విశాఖపట్నంలో జరిగే చంద్రబాబు పాదయాత్ర ముగింపుసభకు భారీగా తరలివెళ్లాలని కూడా విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికలు మనకు కొత్త భవిష్యత్‌ను అందించబోతున్నాయి. ఇప్పటి నుంచే మనం ప్రజా సమస్యలపై పోరాడుతూనే వారి అండదండలను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో అందరూ సమాన బాధ్యత వహించాలని పార్టీ పరిశీలకులు కాగిత వెంకట్రావు కోరా రు. జిల్లా నుంచి కనీసం లక్ష మంది విశాఖకు తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా ఖర్చుపెట్టుకున్నాం. ఇబ్బందులు ఉన్నాయి. అయినా వీటిని అధిగమించి అయినాసరే పార్టీ కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కాగిత అన్నారు. పార్టీ కోసం ఏదైనా చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పాదయాత్ర విజయవంతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో జరిగే సభను కూడా విజయవంతం చేద్దాం. దీనికి అందరూ కలిసి రావాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల విషయంలో మనం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నాం. ప్రజలు కూడా తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఎదురుచూస్తున్నారు. ఇలాం టి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ అట్టర్ ప్లాప్ అయ్యారు. అవినీతి రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని మనం గెలిపించుకునేందుకు మంచి అవకాశాలు చెంతనే ఉన్నాయని ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు పేర్కొన్నారు. పార్టీలో కష్టించి పనిచేసేవారిని గుర్తించాలి. ఆ మేరకే అభ్యర్థులను నిర్ణయిస్తే గెలుపు సులభమవుతుందని వీరయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. మోటారు ఫీల్డ్‌లో పనిచేసేవారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాము కోరారు. జిల్లా కమిటీ ఏర్పాటు
లో జాప్యం ఏ మాత్రం సరికాదని బాబ్జీ అభిప్రాయపడ్డారు. పార్టీ విజయం కోసం నిర్విరామంగా పనిచేసేందుకు అందరం సిద్ధంగానే ఉన్నామని సీనియర్ నేత దాలయ్య పేర్కొన్నారు. అంతకుముందు చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు, కన్వీనర్లు అంబికా కృష్ణ, గన్ని వీరాంజనేయులు, డాక్టర్ బాబ్జి, ముళ్లపూడి బాపిరాజు, కారుపాటి వివేకానంద్, కొక్కిరిగడ్డ జయరాజు, ముడియం శ్రీను, జగ్గారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, బి.కరుణకుమార్, పెనుమర్తి రామ్‌కుమార్, రాధ, నందిన హరిశ్చంద్రప్రసాద్, సరళాదేవి పాల్గొన్నారు.

గెలుపు మనదే

నల్గొండ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అవినీతి, కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టేందుకు పాదయాత్రతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు.

ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. అప్పుడు దివంగత వైఎస్ కూడా ప్రజలను మభ్యపెట్టి దౌర్జన్యంగానే అధికారంలోకి వచ్చారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ పార్టీ పెట్టారని, వైస్సార్‌సీపీని భూ స్థాపితం చేస్తామని భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉందని, ఆయన సీఎం కావాలని, 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చే దిశగా కృషి చేస్తామని, అందుకు నల్గొండనుంచే సత్తా చాటుతామని భూపాల్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు వస్తే పేదలకు, రైతులకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ అవినీతిపై టీడీపీ శంఖారావం

విశాఖ : టీడీపీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బ్రాహ్మణయ్య మృతదేహాన్ని హైదరాబాదు నుండి కృష్ణా జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఆదివారం బ్రాహ్మణయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన విశాఖ నుండి విజయవాడకు బయలుదేరారు.

ఎమ్మెల్యే మృతి పట్ల స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎంపీలు హరికృష్ణ, సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు, నటుడు బాలకృష్ణ సంతాపం తెలిపారు. బ్రాహ్మణయ్య మృతి పార్టీకి, జిల్లాకు తీరని లోటు అని కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు అన్నారు. గ్రామస్థాయి నుండి ఎమ్మెల్యే, ఎంపీగా ఆయన ఎదిగారన్నారు.

బ్రాహ్మణయ్య మృతి పట్ల చంద్రబాబు సంతాపం

కొయ్యూరు/మాకవరపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా వున్న ముస్లిం మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్‌షరీఫ్ తెలిపారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును  మాకవరపాలెం మండలం తామరంలో షరీఫ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోగల ముస్లిం మేధావి వర్గంతోపాటు ఉద్యోగులు, వ్యాపారాలు చంద్రబాబు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలుపుతూ బాబు ఆశయ సాధనకు కృషి చేయాలని నిశ్చయించుకున్నామన్నారు. మైనారిటీల అభిప్రాయాన్ని చంద్రబా
బుకు తెలపడానికి ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలకు ఆయనకు పరిచయం చేశానని చెప్పారు.

షరీఫ్‌తోపాటు విజయవాడ నగర టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు చోటా కిల్లాతోపాటు వివిధ ముస్లిం సంఘాలకు చెందిన మరో పది మంది చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీకే ముసింల మద్దతు