April 21, 2013

అమ్మహస్తం పథకం ఓ భస్మాసుర హస్తం

చిత్తూరు టౌన్: అమ్మహస్తం పథకం ఓ భస్మాసుర హస్తమని, ఈ పథకం అమలుకు ప్రభుత్వంవందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం చిత్తూరులో విలేకరులతో వారుమాట్లాడుతూ అమ్మహస్తం పథ కంఅమలులో భాగంగా 9సరుకుల కోసం రూ.660కోట్లు, సంచులకోసం రూ.350 కోట్లు, ప్రకటనల కోసం రూ. 700 కోట్లు వెచ్చించడం దారుణమన్నారు.పేరుకు 9సరుకులు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ చింతపండులో గిం జలు,రాళ్లే అధికంగా వున్నాయన్నారు. రూ.7వేల కోట్ల కండలేరు ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండ
రును సంబం«ధంలేని మౌళిక వసతుల కల్పన శాఖకు అప్పగించి సీఎం సోదరుడు కిషోర్‌కుమార్‌కు భారీగా కమీషన్ అందిస్తున్నారని విమర్శించారు.

రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే వెచ్చించాల్సివుందని, దీనినే కొత్తగా 'ఇందిరమ్మ కలలు-నేటికి నిజం' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కిరణ్ సర్కారు వృధా చేస్తోందని విమర్శించారు.మూడు రోజులుగా జిల్లాలో కరెంటు ఎప్పుడు పోతుందో....ఎప్పుడు వస్తుందో...తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సర్‌చార్జీల వడ్డ్డన నుంచి ప్రజలు బయట పడకమునుపే మళ్ళీ విద్యుత్ చార్జీలను సర్కారు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు.