May 26, 2013


హైదరాబాద్‌ : గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ చీఫ్‌ నారా చంద్రబాబునాయుడు జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అంతకుముందు ప్రాంగణంలోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో చంద్రబాబు సంతకం చేశారు. ఈమహానాడుకు పలు జిల్లాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

మహానాడు ప్రారంభం


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ఆరంభించారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో సోమ, మంగళవారాలు కొనసాగనున్న మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సీనియర్ నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సోమవారం నాటి మహానాడులో రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యే అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు తెలుగు విజయం ప్రాంగణమంతా పసుపుమయంగా మారిపోయింది. పసుపురంగు జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. సభా వేదికపై ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఫొటోలను ఉంచారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు నాయడుల చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. పత్రికలు, టీవీల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్, భోజనశాల ఏర్పాటు చేశారు.

మహానాడు ప్రారంభించిన చంద్రబాబు


తెలుగుదేశం మహానాడు హాజరు అయిన హరి కృష్ణ .....

వేడుకలకు సర్వసిద్దం
10 అంశాలపై తీర్మానం
తెలంగాణపై కూడా!
రాజధాని పసుపుమయం
ఆకర్షిస్తున్న ఎన్టీఆర్‌ చాయచిత్ర ప్రదర్శన

  తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండు రోజుల మహానాడు వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేందుకు గండిపేట ‘ తెలుగువిజయం’ సర్వం సిద్ధమయింది. మహానాడు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 కమిటీల ప్రతినిధులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 10 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే మహానాడు వేడుకల్లో 10 రాజకీయ అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి మహానాడు వేడుకల్లో తెలంగాణ అంశంపై కూడా చర్చించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన నేతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు ఇతర ప్రధాన అంశాలపై చర్చించి తీర్మానాలు అమోదించనున్నట్లు పేర్కొన్నారు.

మహానాడు వేడుకల్లో భాగంగా వస్తున్నా మీకోసంపై సమీక్ష, పార్టీ సంస్థాగత అంశాలతో పాటు, కాంగ్రెస్‌ తొమ్మిదేళ్ల పాలనలో విద్యుత్‌రంగం ఛిన్నాభిన్నం, సంక్షోభంలో వ్యవసాయం, నత్తనడకన నీటిపారుదల రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కుంభకోణాలు, రోజుకో పథకం, ప్రచార ఆర్భాటం, క్షీణించిన శాంతిభద్రలు, రాజకీయ విలువల పతనం, దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీడీపీ ప్రకటించిన ముసాయిదా తీర్మానాలు, విధాన ప్రకటనలపై చర్చ, ఆర్ధిక సంస్కరణలు-పేదరిక నిర్మూలన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వివరించారు.

శ్రేణుల్లో ఉత్సాహం
తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలను గత ఏడాది ఉపఎన్నికల కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది గడవున్న ప్రస్తుత తరుణంలో రాజధాని శివారులోని గండిపేటలో మహానాడు వేడుకలు నిర్వహించడం పట్ల శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ప్రాంతంలో మహానాడు వేడుకలు నిర్వహించిన ప్రతిసారి పార్టీ అధికారంలోకి వచ్చిందని తమ్ముళ్లు చెబుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల, పేదప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర గత నెల 27వ తేదీన విశాఖలో ముగిసిన విషయం తెలిసిందే. వస్తున్నా..మీకోసం పాదయాత్ర తరువాత పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారు. గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న శ్రేణుల్లో నూతన చేరికలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నుండి టీడీపీలోకి వలసలు పెరగడంతో, తమ్ముళ్లలో నూతనోత్తేజం కనిపిస్తోంది.

ఏర్పాట్లు...భేష్‌
మహానాడు వేడుకల్లో పాల్గొనే పార్టీ ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భోజన, వసతి సౌకర్యాన్ని కల్పించారు. ముఖ్యంగా రెండు రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభలో పాల్గొనే పార్టీ నేతల కోసం వేదిక ప్రాంగణంలో విరివిగా మంచినీటి వసతి కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా వీస్తున్న వడగాల్పులు, ఎండవేడిమి నేపథ్యంలో ఆతిథులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేయాలని నిర్ణయించారు.

ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రత్యేకార్షణ
ఎన్టీఆర్‌ ఛాయచిత్ర ప్రదర్శన మహానాడు వేదిక ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. ఆలిండియా ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్‌రావు తనయుడి నేతృత్వంలో ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఫ్లెక్సీలతో పోటీపడుతున్న నేతలు
గండిపేట తెలుగు విజయం ప్రాంగణాన్ని నేతలు ఫ్లెక్సీలతో నింపేశారు. ఒకరిని మించి ఒకరు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆహుతులను, ముఖ్యనేతలను ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నారు. మహానాడు వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహేందర్‌రెడ్డి నేతృత్వంలో రాజధాని, శివారు ప్రాంతాలను పసుపుమయం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లను పసుపుమయం చేశారు. ఎక్కడ చూసిన పచ్చ జెండాలే కనిపిస్తున్నాయి. రోడ్లకిరువైపుల ఫ్లెక్సీలు, ప్రధాన మార్గాల్లో రోడ్డు మధ్యలో పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు.

నేటి నుంచి తెదేపా మహానాడు


నెల్లూరు : కేసీఆర్‌ మాట్లాడే తీరును మార్చుకోవాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. కేసీఆర్‌ అధికారంలోకి వస్తే ఆయన మాట్లాడే ప్రస్తుత భాషే అధికార భాష అవుతుందేమోనని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఉద్యమాలు చేసే వారు ఎవరూ కేసీఆర్‌లా దిగజారి మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ మాట్లాడే తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ భాష మారాలి



హైదరాబాద్: తెదేపా నేత దేవేందర్ గౌడ్ ను ఆ పార్టి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం పరామర్శించారు. దేవేందర్ గౌడ్ ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకొని వచ్చిన నేపద్యములో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు!

దేవేందర్ గౌడ్ కి చంద్రబాబు పరామర్శ!