April 28, 2013

హైదరాబాద్

చంద్రబాబునాయుడు విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. రాజేంద్రనగర్‌వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించి ఇంటికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న ప్రారంభించిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారుడు నారా లోకేష్‌నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

విశాఖ
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సినీ నటుడు బాలకృష్ణ, నారా లోకేష్ లతోపాటు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టి. దేవేందర్ గౌడ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్లారు.

విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ

హైదరాబాద్ శంసాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రెండున్నర గంటలకు బాబు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని నేతలను పరామర్శించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని, ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం సింహాద్రి అప్పన్నను కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయం అధికారులు బాబుకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. 1-20 గంటలకు బయలుదేరే విమానంలో బాబు హైదరాబాద్‌కు రానున్నారు.

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

విశాఖపట్నం : కిరణ్‌వి అన్నీ ఉత్తుత్తి వాగ్దానాలే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవినీతి మంత్రులను కాపాడటంలో ఆయన బిజీగా ఉన్నారన్నారు. "ఒకప్పుడు ఢిల్లీకి వచ్చిన విదేశీ ప్రముఖులు అభివృద్ధి చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అవినీతి రాజధానిగా మార్చారు. సాక్షాత్తూ హోం మంత్రే ముద్దాయిగా ఉన్నారు. అవినీతి మంత్రులు సచివాలయంలో కూర్చుంటున్నారు.

ఇక చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? వీరికి నైతిక విలువలు లేవా?'' అని చంద్రబాబు నిలదీశారు. వైఎస్ చేసిన తప్పుల్లో మంత్రులూ భాగస్వాములే అని, 26 వివాదాస్పద జీవోలు జారీ చేయడంలో వీరి పాత్ర ఉందని తెలిపారు. బయ్యారం గనులు, బ్రహ్మణీ భూముల లీజులను రద్దు చేసామని పోజులు కొడుతున్న కిరణ్... జగన్ దోచిన సొమ్మును ఎందుకు రికవరీ చేయడం లేదని నిలదీశారు. దోచుకున్న ఆస్తులు ఎందుకు స్వాధీనం చేయడంలేదని ప్రశ్నించారు. రేపోమాపో చేతులు కలపాలన్న కుతంత్రపు ఆలోచనలే దీనికి కారణమన్నారు.

అవినీతి మంత్రులను కాపాడటంలో కిరణ్ బిజీ...

విశాఖపట్నం  : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ముగింపు ప్రస్థానం అభిమానుల నీరాజనాల మధ్య సాగింది. శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు మొదలైన ముగింపుయాత్రలో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత చంద్రబాబు చేపట్టిన ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. ర్యాలీలో ఏ సమయానికి ఏం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి..

3.30 గంటలు: టీడీపీ అధినేత చంద్రబాబు కూర్మన్నపాలెం నుంచి పాదయాత్ర చేపట్టారు.
4.05: శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. «థింసా, కోలాటం, పులివేషాలు, చెంచు నృత్యం, బిందెల నృత్యం, ఎన్‌టీ రామారావు, బాలకృష్ణ డూప్‌లు, సైకిల్ గుర్తు వంటి వాటిని ప్రదర్శించే 12 ట్రాలీలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీ మార్గంలో జనం చంద్రబాబుతో కరచాలనం చేసేందుకుపోటీ పడ్డారు. దీంతో ర్యాలీ చాలా నెమ్మదిగా సాగిం

4.30: ర్యాలీ కూర్మన్నపాలెం జంక్షన్‌కు చేరుకోగానే టీఎన్‌టీయూసీ నాయకులు చంద్రబాబును పూలమాలలతో ముంచెత్తారు.
4.55: ర్యాలీ కణితి బస్టాప్ వద్దకు చేరుకుంది. పోలీసుల వేషధారణలో కొంతమంది కార్యకర్తలు వాహనాలపై వచ్చి ర్యాలీలో చేరారు.
5.05: శ్రీనగర్ వద్ద పలువురు మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు.
5.15: ర్యాలీ చినగంట్యాడ జంక్షన్ చేరుకుంది. ఈ సమయంలో ఎన్‌టీఆర్ వేషధారణతో ఉన్న ఓ వ్యక్తి ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
5.25: గాజువాక జంక్షన్‌లో కూడా భారీ సంఖ్యలోని మహిళలు చంద్రబాబుకు మంగళహారతులతో స్వాగతం పలికారు.
5.37: బీహెచ్‌పీవీ కూడలి వద్ద టీఎన్‌టీయూసీ నేతలు టీడీపీ అధినేతను పూలదండలతో సత్కరించారు.
6.05: ర్యాలీ ఎన్ఏడీ కూడలికి చేరుకుంది. అప్పటికే నాలుగు రోడ్లూ జనసంద్రంగా మారాయి. ఈ దృశ్యాన్ని చూసిన చంద్రబాబు, బాలకృష్ణతో పాటు ఇతర నేతలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. సుమారు పది నిమిషాల తర్వాత ర్యాలీ తిరిగి ప్రారంభమైంది.
6.25: బిర్లా జంక్షన్ వద్దకు చేరుకోగా రోడ్డుకిరువైపులా నిలబడిన జనం చంద్రబాబుకు అభివాదం చేశారు.
6.35: కంచరపాలెం ఇందిరానగర్ వద్ద స్థానికులు చంద్రబాబుకు తలపాగా బహూకరించారు.
7.15: చంద్రబాబు కాన్వాయ్ మద్దిలపాలెం మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంది.
ది.

ర్యాలీ సాగిందిలా..

విశాఖపట్నం :బహిరంగ సభ జరిగిన ఏయూ గ్రౌండ్స్‌కు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ప్రజల రాక ప్రారంభమైంది.
- చంద్రబాబు 208 రోజులపాటు చేసిన పాదయాత్రను పురస్కరించుకుని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి కేశినేని నాని 208 మీటర్ల పొడవు, 30 అడుగుల వెడల్పు వున్
- కృష్ణాజిల్లా కేసరపల్లి కళాకారులడప్పు వాయిద్యాలు కార్యకర్తలను ఉర్రూతలూగించాయి
-బందోబస్తులో భాగంగా పోలీసులు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధానవేదికపై 20 నిమిషాలపాటు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఏయూ గ్రౌండ్స్‌లోకి 15 ప్రవేశద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రతిద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు.
- చంద్రబాబు కాన్వాయ్ గ్రౌండ్స్‌కు రావడానికి రెండు గంటల ముందే సభా ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. దీంతో వేలాది మంది రోడ్లపైనే ఉండిపోవాల్సివచ్చింది.
-వేదిక నుంచి సుమారు అర కిలోమీటరు దూరం వరకు మైకులు ఏర్పాటు చేశారు. దీంతో సభా ప్రాంగణంలోకి రాలేనివారంతా చంద్రబాబు ప్రసంగాన్ని మైకుల ద్వారా విన్నారు.
- కొందరు మహిళలు చిన్నపిల్లలతో సహా సభకు హాజరయ్యారు. వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేశారు.
-మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వలంటీర్లకు మైకులో సూచనలు చేశారు.
-హైదరాబాద్ నుంచి వచ్చిన రాము అనే కార్యకర్త ఎన్టీఆర్ వేషంతో అలరించాడు.
- అరిసిమిల్లి రాధాకృష్ణ సారథ్యంలో సింగపూర్ నుంచి వచ్చిన టీడీపీ అభిమానులు సభాప్రాంగణంలో సందడి చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
-స్థానిక టీడీపీ నాయకులు వాకీటాకీలు పట్టుకుని నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పలువురు వలంటీర్లు తమ నాయకుల ఫొటోలతో తయారుచేసిన టీ షర్టులను ధరించి సందడి చేశారు.
- చంద్రబాబు సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేకంగా తయారు చేసిన బాణసంచాను కాల్చారు.
- చంద్రబాబు 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినందుకు హైదరాబాద్ లోని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎం.భానుప్రసాద్ 2817 దీపం బెలూన్లను గాలిలోకి విడిచిపెట్టారు.
- టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడి మృతికి సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది.
న టీడీపీ పతాకాన్ని ర్యాలీగా ఏయూ గ్రౌండ్స్‌కు తీసుకువెళ్లారు. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వద్ద ప్రదర్శించారు.

టీడీపీ సభలో సైడ్‌లైట్స్

ముగిసిన బాబు పాదయాత్ర
బాబు వెంట నడిచిన బాలయ్య

విశాఖపట్నం :సుదీర్ఘ పాదయాత్రకు బహుదూరపు బాటసారి చంద్రబాబు తెరదించారు. ఏకబిగిన ఏడు నెలలపాటు నడిచిన పాదాలకు విశ్రాంతి ఇచ్చారు. రాష్ట్రంలోని నైరుతి దిక్కున వర్షాకాలం చివరిలో మొదలు పెట్టిన యాత్రను నడివేసవిలో ఈశాన్య దిక్కున ముగించారు. పదహారు జిల్లాల్లోని 86 నియోజకవర్గాల్లో 208 రోజులపాటు 2817 కిలోమీటర్లు నడిచిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

శుక్రవారం రాత్రి కూర్మన్నపాలెంలో బసచేసిన ఆయన శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి నుంచి శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన 'విజయ స్థూపం'(పైలాన్) వరకు దాదాపు కిలోమీటరుపాటు నడిచారు. దీంతో ఏడు నెలలపాటు సాగిన పాదయాత్రకు తెరపడింది. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌తోపాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రజలకే అంకితం.. 'వస్తున్నా మీకోసం' యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు అంకితం చేశారు. పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఇదే నినాదం చేశారు. 'వస్తున్నా మీకోసం... ప్రజలకే అంకితం' అంటూ... "208 రోజులు... 2817 కిలోమీటర్ల కాలినడక... మూడు ప్రాంతాలు... 1253 గ్రామ సీమల కన్నీటి గాథలు... అడుగడుగునా ఆత్మబంధువులతో బాధలు పంచుకున్న వైనం... దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ ప్రయాణం... తెలుగుజాతి గుండెల్లో పదిలంగా మిగిలిపోయే జ్ఞాపకం... ఆరుపదుల వయసులో అనితర సాధ్యమైన సాహసం.... అందరి కష్టాలు వింటూ... మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తూ ముందుకు సాగిన మరో సత్యాగ్రహం...

ప్రజలు కష్టాలు మరిచిన ప్రభుత్వ నిర్లక్ష్యంపై జాతి జనుల ఆగ్రహ జ్వాలకు ఇది శిలాక్షర రూపం' అని శిలాఫలకంపై లిఖించారు. పాదయాత్ర చివరి రోజున చంద్రబాబుతోపాటు సినీ నటుడు బాలకృష్ణ, లోకేశ్, భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు పాల్గొన్నారు. పవర్ గ్యారెంటీ 8ఓ వ్యక్తి చంద్రబాబుకి నాగలిని బహుమానంగా ఇస్తూ తాను గతంలో జమ్ముకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకు, యూపీలో ములాయం సింగ్ యాదవ్‌కు ఇలాగే ఇస్తే.. వారు ముఖ్యమంత్రులు అయ్యారని, త్వరలో మీరు కూడా అవుతారంటూ మైకులో ప్రకటించాడు.

వస్తున్నా మీకోసం.. ప్రజలకే అంకితం!విజయ స్థూపం ఆవిష్కరణ

విశాఖపట్నం: వేలాది ద్విచక్ర వాహనాలు..వందలాది కార్లు..బాణసంచా సంబరాలు...సంప్రదాయ నృత్యాల మధ్య సాగిన తెలుగుదేశం ర్యాలీతో విశాఖ నగరం పసుపుమయమైంది. అగనంపూడి వద్ద పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం.. బాలకృష్ణ, పలువురు పార్టీ నాయకులతో కలిసి ఓపెన్‌టాప్ వ్యాన్‌లో సభావేదిక వద్దకు చంద్రబాబు బయలుదేరారు. సుమారు 24 కిలోమీటర్ల మేర మూడు గంటల పాటు ర్యాలీ సాగింది.

ఈ క్రమంలో దారిపొడవునా జనం చంద్రబాబుకు జేజేలతో ఘనస్వాగతం పలికారు. పలు కూడళ్లలో చంద్రబాబు వాహనాన్ని ఆపి బొకేలు, పూలమాలలు అందజేసి అభిమానాన్ని

చంద్రబాబు వెంట మరో వాహనంలో వున్న ఆయన తనయుడు లోకేశ్ పలుచోట్ల కారులో నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు. ర్యాలీ వాహనంలో చంద్రబాబు, బాలయ్యతోపాటు పార్టీ నేతలు సుజనాచౌదరి, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బండారు సత్యనారాయణమూర్తి, వాసుపల్లి గణేష్‌కుమార్, దాడి రత్నాకర్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు ఉన్నారు.
చాటుకున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి, తలపాగాలు అలంకరించారు. కొంతమంది సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ముకుళిత హస్తాలతో ప్రజలకు నమస్కరిస్తూ, కుడిచేతితో అభివాదం చేస్తూ చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు సాగారు.

పోటెత్తిన వీధులు!

హరికృష్ణ గైర్హాజరు
జూనియర్ ఎన్టీఆర్,దాడి,కడియం కూడా


విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు పార్టీకి చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, విశాఖకే చెందిన సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు, తెలంగాణలో సీనియర్ నేత కడియం శ్రీహరి విశాఖ సభకు దూరంగా ఉన్నారు. భారీ బహిరంగ సభకు హాజరు కాకుండా హరికృష్ణ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆ సభకు వెళతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. "చూద్దాం.. ఇంకా నిర్ణయించుకోలేదు'' అని చెప్పిన హరికృష్ణ.. సభ జరుగుతున్న సమయానికి ఢిల్లీలోనే ఉండిపోయారు.

టీడీపీలో హరికృష్ణను అణిచి వేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిట్టూరి ప్రసాద్ చేసిన ప్రకటనను ఆయన స్వయంగా ఆం«ధజ్యోతి విలేకరి దృష్టికి తీసుకువచ్చారు. కానీ, దాని ఆంతర్యమేమిటో వివరించలేదు. ఇక, కడియం శ్రీహరి పార్టీ అధిష్ఠానంపై అలకబూనారు. తన సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కార్యకర్తలను విశాఖకు పంపిన ఆయన.. స్వయంగా వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో, ఆయన పార్టీని వీడనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై కడియంను వివరణ కోరగా, ఇటీవల జరిగిన పరిణామాలపై మనస్తాపంతోనే సభకు వెళ్లలేదని, అంతమాత్రాన పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సభకు వెళ్లడంపై చూద్దామన్న హరికృష్ణ

నేడు నగరానికి చంద్రబాబు

హైదరాబాద్ తర్వాత బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్, ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. కొంత విరామం తర్వాత పంజాగుట్ట, తార్నాక మీదుగా ఉప్పల్‌కు వెళతారు. అక్కడ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఇంటివరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు.
: సుదీర్ఘ పాదయాత్ర అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నగరానికి విచ్చేస్తున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నగర టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న చంద్రబాబు రాజేంద్రనగర్ మీదుగా ఆరామ్‌ఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం మీదుగా ర్యాలీగా వస్తారని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మాసాబ్‌ట్యాంక్ వద్ద భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

భారీ ర్యాలీతో ఘన స్వాగతానికి ఏర్పాట్లు

తెలుగుదేశం అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంతో సభికులను, కార్యకర్తలను ఆకట్టుకున్నారు. వేదికపైకి రాగానే.. ఈ జనసంద్రాన్ని చూసి పక్కనే ఉన్న ఆ సముద్రంలోని అలలు కూడా తలలు వంచాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు అడ్డా అయితే.. అవినీతి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్‌గా మారిందన్నారు. 'జనం కోసం జగన్.. జగన్ కోసం జనం' అంటూ జఫ్ఫాగాళ్లు చెబుతున్నారని, అవన్నీ ఒట్టిమాటలని కొట్టేపారేశారు.

జగన్ ఫాలోవర్స్ అంతా జఫ్ఫాగాళ్లని వ్యాఖ్యానించారు. వారు ఇప్పుడు "జగన్ కోసం జైలు.. జైలు కోసం జగన్'' అని ప్రచారం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్ కేడీ నంబర్‌వన్ అంటూ విమర్శించారు. జగన్ ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడితే ప్ర

రాష్ట్ర ముఖ్యమంత్రి నంబర్‌వన్ మూర్ఖుడు అని, ఆయన 420 బ్యాచ్‌కి నాయకత్వం వహిస్తున్నాడని 'మహారాజశ్రీ 420' అని వ్యాఖ్యానించారు. షర్మిలచేస్తున్న సవాళ్లు వానపాము బుస కొట్టినట్టుందన్నారు. కాగా టీడీపీని అంతం చేయడం ఇందిరమ్మ వల్లే కాలేదని, ఇప్పుడు తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల వల్ల ఏమవుతుందని మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు అన్నారు. వైఎస్, కిరణ్ దయ వల్ల మంత్రులు, అధికారులు జైలుకు పోతున్నారని ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎద్దేవా చేశారు.
భుత్వమే జైల్లో వేసిందన్నారు. జగన్ కోసం చోటాలు జైలుకు వెళుతున్నారని, ఆయనేమైనా కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుడా అని ప్రశ్నించారు.

అది 420 బ్యాచ్ రేవర్ రెడ్డి ధ్వజ

సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్
ఉత్సాహపరిచిన సంగీత విభావరి

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా శనివారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తలను, అభిమానులను ఆద్యంతం ఉత్సాహపరిచాయి. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా సభా ప్రాంగణంలో ఆశీనులైన వారిని ఉత్సాహపరిచేందుకు రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి.సాయిబాబా సార«థ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ కాంగ్రెస్ వైఫల్యాలను చాటిచెప్పింది.


టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను క«థకుడు తెలియజేస్తుంటే సభా ప్రాంగణంలో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వీర్నాల కృష్ణ సారథ్యంలో జానపద కళాకారులు తమ గీతాలతో ఆకట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు హరికిషన్, నాగభూషణ్ ... ఎన్టీఆర్, రావుగోపాలరావుతోపాటు హాస్యనటుడు ఎమ్మెస్‌నారాయణ సభకు విచ్చేసినట్టయితే ఏ విధంగా మాట్లాడతారో చక్క

'కదిలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా...త్యాగాలకు వెనుదిరగని దేశభక్తులారా..'అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన తొలి గీతానికి కార్యకర్తలు ఉప్పొంగిపోయారు. ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి చిత్రం నుంచి మనో ఆలపించిన 'జననీ జన్మభూమిచ్ఛా స్వర్గాదపీ, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి' వంటి గీతాలకు అభిమానులు నృత్యాలు చేశారు. చంద్రబాబు పాదయాత్ర సభా ప్రాంగణానికి చేరే సమయంలో మనో,వందేమాతరం శ్రీనివాస్, సునీత..'చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై వంటి గీతాల పల్లవులను పాడి హుషారెక్కించారు.

తరువాత చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోతుందో తదితర గీతాలు వేదికపై నేత లను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల కోరిక మేరకు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలోని జగదానంద తారక, జయజానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం' అంటూ మనో, సునీత ఆలపించగా సభా ప్రాంగణం హర్షాధ్వానాలతో దద్దరిల్లింది.
గా అనుకరించి హర్షధ్వానాలను అందుకున్నారు. తరువాత సినీనటులు మురళీమోహన్, ఏవీఎస్‌ల సార«థ్యంలో వందేమాతరం శ్రీనివాస్, మనోల బృందం ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

విశాఖ సభలో ఆకట్టుకున్న బుర్రకథలు,మిమిక్రీ

దివంగత నేత ఎర్రన్నాయుడి తనయుడు
రామ్మోహన్‌నాయుడు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. సభా వేదికపై అందరూ పోడియం దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. రామ్మోహన్ మాత్రం మైకు పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి పెద్దలందరినీ పేరుపేరున ప్రస్తావించి ప్రసంగం చేశారు. ఆరు పదుల వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేసి చంద్రబాబు తెలుగు ప్రజల గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపారని, దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి ఉప్పెనలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల వరకు పనిచేసి టీడీపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును అధిష్ఠింపజేయాలని, ఢిల్లీలో తెలుగుదేశం చక్రం తిప్పాలని ఆకాంక్షించారు. తన తండ్రి ఆశయం కూడా అదేనని, దాన్ని నెరవేర్చే బాధ్యత శ్రీకాకుళం జిల్లా ప్రజలు తన భుజస్కంధాలపై మోపారన్నారు.

అందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తనకు చంద్రబాబు అండగా నిలిచారని, అలాగే అభిమానంతో శ్రీకాకుళం నుంచి తరలివచ్చిన అశేష అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రామ్మోహన్‌నాయుడు ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా, ఉద్రేకంగా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగడంతో చంద్రబాబు సహా అందరూ ఆసక్తిగా విన్నారు. ప్రసంగం తర్వాత రామ్మోహన్‌ను పిలిచి 'శెభాష్' అంటూ చంద్రబాబు భుజం తట్టారు.

ఎర్రన్నాయుడి తనయుడి ఉద్వేగ ప్రసంగం

ఎంత చెప్పినా ససెమీరా అన్నారు
తెలంగాణలోనూ టీడీపీ పట్టు సడలలేదు..
పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి


విశాఖపట్నం: ఆరు పదులు నిండిన వ్యక్తి అలుపెరగకుండా అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఏడు నెలలు... 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే.. అదంతా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మనోధైర్యమేనంటూ చంద్రబాబు పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి మోహనరావు పేర్కొన్నారు. యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలంటూ బాబు పాదయాత్ర ముగింపు సభా వేదికపై ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆంజనేయస్వామి గుడిలో కొబ్బరికాయ కొట్టి కుడి పాదంతో తొలి అడుగు వేసి ప్రారంభించిన పాదయాత్ర ఏడు నెలలు కొనసాగగా, కొన్నిసార్లు ప్రతికూలతల వల్ల అవాంతరాలు ఎదురయ్యాయన్నారు.

బాబు యోగా చేస్తారు కాబట్టి ఆయనకు ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. కానీ వాటికంటే ప్రజలు చూపిన అభిమానమే ఆయన్ను ఇంతకాలం నడిపించిందన్నారు. గద్వాల్‌లో వేదిక విరిగి కింద పడినపప్పుడు ఆయన వెన్నెముక దెబ్బతిన్నదని తామంతా ఆందోళన చెందామని, మరుసటి రోజు వైద్యులు వచ్చి ఫరవాలేదని చెప్పేంతవరకు నాయకులు, కార్యకర్తలు ఎవరికీ కంటి మీద కునుకు లేదన్నారు. చంద్రబాబు తమ ప్రాంతంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అన్నవారు పాదయాత్ర తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించినప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు. తెలంగాణ ప్రజలు అశేషంగా తరలివచ్చి తెలుగుదేశానికి ఏమాత్రం పట్టుసడల్లేదని నిరూపించారని, అలా ధైర్యం నింపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్‌లోని దట్టమైన అడవుల గుండా పాదయాత్ర చేశామని, ఆయన కాలి చిటికెన వేలు బాగా వాచిపోయిందన్నారు. డాక్టర్లు నడవద్దని చెప్పినా ఆయన వినకుండా మొండిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారన్నారు. గుంటూరు జిల్లాలోనూ వేదిక కూలినప్పుడు ఆయన పరిస్థితి చూసి యాత్ర విరమించుకోమని తాము సూచించామని.. చంద్రబాబు మాత్రం ప్రజల కోసం నడుస్తానంటూ కొనసాగించారన్నారు. తుని దగ్గరకు వచ్చేసరికి మళ్లీ కాలు నొప్పి అధికమైందని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని కొనసాగించారే తప్ప అర్ధంతరంగా ఆపడానికి ఆయన ఒప్పుకోలేదని గరికపాటి వివరించారు.

"కనపడిన ప్రతి రాయికి, ప్రతి దేవతకి మొక్కాం. ఏడుకొండల వాడిపై భారం మోపాం. అనంతపురం ఆంజనేయస్వామిని వేడుకొన్నాం. షిర్డీ సాయిని ప్రార్థించాం. ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్లు మమ్మల్ని తిట్టారు. కాలి సమస్య తీవ్రమవుతుందని, జీవితాంతం ఉండిపోతుందన్నారు. ఇది చెప్పినా చంద్రబాబు పాదయాత్ర విరమణకు ఒప్పుకోలేదు. అలా ఆయన్ని ముందుకు నడిపించింది మీ అభిమానమే. ఆ అభిమానంతోనే ఆయన్ను ఏడాది తిరగకుండా ఈ ర్రాష్టానికి మరోసారి ముఖ్యమంత్రిని చేయండి. మీ సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటారు'' అంటూ గరికపాటి తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రజల వల్లే ధైర్యం అవాంతరాలు ఎదురైనా నడక ఆగలేదు

ఇదేనా వారి విశ్వసనీయత? : బాల కృష్ణ

ఏదైనా ఉన్నత శిఖరం చేరాలంటే సత్సంకల్పం ఉండాలని నాన్న ఎన్‌టీఆర్ చెప్పేవారని, ఆ సద్గుణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయని బాలయ్య అన్నారు. తప్పుచేసిన వారిపట్ల ఎన్‌టీఆర్ చండశాసనుడిలా వ్యవహరించారని, బడుగుబలహీన వర్గాలకు జస్టిస్ చౌదరిలా న్యాయం చేశారని, సంఘ సంస్కరణలకు బొబ్బిలి పులిలా పనిచేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అనేకసార్లు క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంటే చంద్రబాబు రక్షించుకుంటూ వచ్చారన్నారు.

ఆయన పాలనాదక్షుడన్నారు. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టి ర్రాష్టాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విద్యుత్ ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్‌ను అంధకారప్రదేశ్‌గా మార్చేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరినా ప్రజలకు ఏమీ మేలు జరగడం లేదన్నారు.

గంగపుత్రులకు చేపల వేటకు విరామం ఇచ్చారని, తమిళనాడులో ఒక్కో కుటుంబానికి రూ. 4,700 ఆర్థికసాయం చేస్తుండగా, ఇక్కడ నయాపైసా కూడా ఇవ్వడం లేదన్నారు. బాబును అంతా డిక్టేటర్ అంటూ విమర్శిస్తున్నారని, ర్రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డైనమిజమ్ తప్పకుండా ఉండాలని బాలకృష్ణ పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వస్తాడో రాడో తెలియని జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ర్రాష్టానికి పూర్వవైభవం తీసుకురావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత గురించి కొందరు మాట్లాడుతున్నారని, విశ్వసనీయత అంటే నమ్మినవారిని జైలుకు పంపడమేనా? అని సినీనటుడు బాలకృష్ణ వైసీపీని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులు, ఐఏఎస్ అధికారులను ఇప్పుడు జైలుకు పంపారని, అలాంటి విశ్వసనీయత తమకవసరం లేదని బాలకృష్ణ అన్నారు. ర్రాష్టానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఉద్ఘాటించారు. సభకు విచ్చేసిన జనవాహినిని చూస్తూ తనదైన సినీ శైలిలో "నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా.. సప్తసముద్రాలు ఉప్పొంగాయా?'' అని వ్యాఖ్యానించారు.

నిమ్మనవారిని జైలుకు పంపడమా..?వైసీపీపై బాల కృష్ణ ధ్వజం

సింహాచలం: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీ కోసం..'పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఆదివారం వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆయన ఉదయం పది గంటలకు సింహగిరికి రానున్నారు. చంద్రబాబు రాకను పురస్కరించుకుని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాశర్ల ప్రసాద్, పిసిని వరహానరసింహం ఆధ్వర్యంలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక పుష్కరిణి సత్రం ఆవరణలో నిర్మలా నృత్యనికేతన్ కళాకారులతో 'వస్తున్నా.. మీ కోసం' పాటలకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

నేడు అప్పన్న దర్శనానికి చంద్రబాబు రాక

శంషాబాద్: శంషాబాద్‌లో ఆదివారం జరిగే చంద్రబాబునాయుడు బహిరంగ సభ కోసం తెలుగుతమ్ముళ్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై మధ్యాహ్నం 2.45 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగించుకుని విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ తెలుగుదేశం శ్రేణు లు బాబుకు ఘనస్వాగతం పలికి ఊరేగింపుగా శంషాబాద్‌లోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.

2.45 గంటలకు సభ ప్రారంభమవుతుంది. బహిరంగ సభను పూర్తిస్థాయి లో విజయవంతం చేయడం కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కా గోపాల్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.గణేశ్‌గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు కోడిగంటి చంద్రారెడ్డి, టౌన్ ప్రసిడెంట్ దూడల వెంకటేష్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కె.మహేందర్‌రెడ్డి తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. సభను విజయవంతం చేయడంకోసం జిల్లాలోని ఆయా నియోజకవర్గాలతో పాటు జంటనగరాలకు చెందిన దాదాపు ముఫ్పైవేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేశామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ తెలిపారు.

బస్టాండ్‌లో బహిరంగ సభ శంషాబాద్ బస్‌స్టాండ్‌లో హనుమాన్ దేవాలయం ఎదుట సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ గుంతలను పూడ్చివేసి స్టేజీని ఏర్పాట్లను పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో నగరానికి బయలుదేరాడానికి ఏర్పాట్లు చేశారు.

టీడీపీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు

చరిత్ర తిరగరాస్తాం
టీడీపీకే మళ్లీ అధికారం..
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్
పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయ్
జైలు పార్టీగా మారిన వైసీపీ
కేసీఆర్‌కు బాబును విమర్శించే అర్హత లేదు..
విశాఖ సభలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

కాంగ్రెస్, వైసీపీలపై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, ఆ రెండు పార్టీల నేతలంతా జైలులోనే గడపాల్సి ఉంటుందన్నారు. కాగా చంద్రబాబు మట్టికొట్టుకుపోతాడని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని, ఆ మాటలు అన్న మూడు రోజుల్లో వైఎస్సే మట్టికొట్టుకుపోయాడని పొలిట్ బ్యూరో సభ్యుడు కె.ఇ.కృష్ణమూర్తి విమర్శించారు. 12 గంటలపాటు కరెంటు లేని పల్లెలు మన రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేవని, రాష్ట్రంలో పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయని విమర్శించారు. ఏ-5 ముద్దాయి ఐఏఎస్ శ్రీలక్ష్మి జైల్లో ఉంటే ఏ-4 ముద్దాయి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బయట ఉండి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. శ్రీలక్ష్మికి ఒక రూలు, సబితకు మరో రూలా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ అవినీతి విశ్వవ్యాప్తంగా తెలుసు: నర్సిరెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం జగన్ పాకులాడితే.. కాంగ్రెస్ అధిష్ఠానం అతన్ని సీబీఐకి అప్పగించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ తన హయాంలో ప్రజల బాగోగులు చూడకుండా బంధుప్రీతితో వ్యవహరించారని విమర్శించారు. జగన్ ర్రాష్టాన్ని ఏ విధంగా దోచుకున్నారో విశ్వవ్యాప్తంగా అందరికీ తెలుసునన్నారు. కాంగెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలకన్నీ కష్టాలేనని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు పెరిగాయని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల చరిత్రలో చంద్రబాబు అమలు చేసిన అనేక పథకాలను ఆయన గణాంకాలతో సహా వివరించారు.

కేసీఆర్ వసూల్ రాజా: రమేష్ రాథోడ్ఈ ర్రాష్టాన్ని తల్లి, పిల్ల కాంగ్రెస్ పూర్తిగా దోచుకుంటున్నాయని ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి పథకం వంటి వాటితో కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జైల్లో ఉన్న జగన్ బృందంతో పాటు అవినీతి మంత్రుల కోసం కొత్తగా జైలు కట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను వసూల్ రాజాగా అభివర్ణించారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని కలెక్షన్లు లెక్కబెట్టుకునే వ్యక్తికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మండి పడ్డారు.

ఆత్మహత్యల్లో రాష్ట్రం తొలి స్థానం: సోమిరెడ్డి తెలుగుదేశం హయాంలో అభివృద్ధి విషయంలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే మడమ తిప్పకుండా కోట్లాది రూపాయలు దోచుకున్నాడని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా వ్యహరిస్తున్నాయి కాబట్టి ప్రజలకు అంతోఇంతో న్యాయం జరుగుతున్నదని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కూడా అమ్మేస్తుందని ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం: రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చరిత్రను తిరగరాస్తుందని ఆ పార్టీ నేతలు జోస్యం చెప్పారు. టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు పార్టీ నేతలు ప్రసంగించారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటుచేస్తే టీడీపీ సత్తా ఏమిటో దేశానికి తెలిసేదని పార్టీ సీనియర్ నేత లాల్‌జాన్ పాషా వ్యాఖ్యానించారు.

జగన్ కోసం జైలు..జైలు కోసం జగన్.........వానపాము బుసకొట్టినట్లు షర్మిల సవాల్

ప్రతి హామీ నెరవేరుస్తా..
పెద్ద కొడుకునై అండగా ఉంటా
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం
అసమర్థ ప్రభుత్వంతో అందరికీ కష్టాలే
అన్ని వర్గాలను ఆదుకుంటాం
ఆడబిడ్డలకు ఆత్మగౌరవం,భద్రత మభ్యపెట్టి వైఎస్ మోసం
ఆయన అవినీతి సోనియాకు తెలియదా?
కిరికిరి కిరణ్‌వి ఉత్తి మాటలే..
జగన్ దోచిన సొమ్ము రికవరీ చేయరేం?
పిల్ల కాంగ్రెస్‌కు వ్యక్తిత్వం లేదు..
టీఆర్ఎస్‌ది ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడి నిద్ర
పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నిప్పులు

దారిపొడవునా ప్రతికూడలి వద్ద చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి మంగళహారతులతో ఘనస్వాగతం లభించింది. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సూర్యాస్తమయానికి ముందే ప్రజలతో కిటకిటలాడింది. చాలా దూరం వరకు మైకులు ఏర్పాటు చేయడంతో ప్రజలు రోడ్లపైనే నిలబడి కూడా ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పలువురు నేతలు చేసిన ఆసక్తికరమై ప్రసంగాలకు సభికుల నుంచి కరతాళధ్వనులతో ప్రశంసలు లభించాయి. సినీహీరో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గంభీర స్వరంతో చేసిన యాంకరింగ్ సభికులను ఆకట్టుకుంది.

చంద్రబాబు సభా వేదికపైకి వస్తున్నప్పుడు అనేకమంది కార్యకర్తలు ఆయనకు పాదాభివందనాలు చేశారు. మహిళా నేతలు మంగళహారతులు ఇచ్చారు. సభావేదికపై ఉన్న నాయకులంతా లేచి నిలబడి ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి వేదికపైకి తోడ్కొనివచ్చారు. సభా ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. విశాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సభ విజయవంతమైంది. ఈ సభకు మూడులక్షలకుపైగా జనం హాజరైనట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్‌టీ రామారావు 1982లో టీడీపీని స్థాపించిన అనంతరం ఏప్రిల్‌లో విశాఖలోని మున్సిపల్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఇప్పటి వరకు విశాఖ చరిత్రలో అదే అతిపెద్ద సభగా పేర్కొంటారు. దానిని తలదన్నేలా శనివారం చంద్రబాబు సభ జరిగింది. సభను విజయవంతం చేయడంలో ఉత్తరాంధ్ర టీడీపీ శ్రేణులు తమ శక్తిని ప్రదర్శించాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలు తమ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చారు. లక్షల సంఖ్యలో ప్రజల హాజరు చంద్రబాబు పాదయాత్ర ముగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖకు పొరుగున్న తూర్పుగోదావరి జిల్లానుంచి కూడా గణనీయుంగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. అధినేత పాదయాత్ర ముగింపు సభను 'నభూతో నభవిష్యత్' అన్నచందంగా నిర్వహించామని నాయకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు సభ విశాఖ చరిత్రలోనే కాకుండా ర్రాష్ట చరిత్రలోనే చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని వారు పేర్కొంటున్నారు.

ఒకరిద్దరు మినహా నేతలంతా హాజరు రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు తరలిరావడంతో సభాప్రాంగణం టీడీపీ రాష్ట్ర కార్యాలయం మాదిరిగా కనిపించింది. ఇదే సమయంలో కొందరు ప్రముఖుల గైర్హాజరు కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగించింది. పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న నందమూరి హరికృష్ణ, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి, సుద్దాల దేవయ్య, జైపాల్ యాదవ్ ఈ సభకు రాలేదు. చంద్రబాబుతో కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న హరికృష్ణ తనకు ఆరోగ్యం బాగోలేనందువల్ల రాలేకపోతున్నానని పార్టీ నాయకులతో చెప్పారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలో ఏర్పడిన వివాదంతో బాబు పాదయాత్రకు దూరంగా ఉన్న దాడి వీరభద్రరావు కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన కుమారుడు దాడి రత్నాకర్ మాత్రం చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కొంత అసంతృప్తిగా ఉన్న కడియం శ్రీహరి కూడా ఇటువంటి కారణాలతోనే గైర్హాజరై ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, నందమూరి కుటుంబానికి చెందిన సినీహీరో తారకరత్న కూడా పాల్గొన్నారు. సినీరంగానికి చెందిన వందేమాతరం శ్రీనివాస్, మనో, సునీత, తదితరుల బృందం ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. సినీ నటుడు ఏవీఎస్ కూడా వారితోపాటు పాల్గొన్నారు.
విశాఖపట్నం: విశాఖ తీరం జనసంద్రమైంది. సాగర కెరటాలకు పోటీగా జనవాహిని కెరటాలు నగరాన్ని ముంచెత్తాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో శనివారం నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభ భారీ జనసందోహంతో కళకళలాడాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా నగర శివారులోని అగనంపూడిలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను చంద్రబాబు శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. అక్కడనుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణం వరకు జరిగిన ర్యాలీ కనీవినీ ఎరగని స్థాయిలో జరిగింది. వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, వందల సంఖ్యలో ఇతర వాహనాలు, వాటిని అనుసరిస్తూ వేలాదిమంది కార్యకర్తలతో విశాఖ పసుపురంగు పులుముకుంది.

నేనొస్తా..దారికి తెస్తా...............జన చైతన్యం కోసమే నా యాత్ర..