October 31, 2012

... జనం నమ్మితే ఏమి జరుగుతుందనేది రోజూ చూస్తున్నాను. ఇంట్లో ఆలుమగల గొడవ నుంచి ఆముదం పంట గిట్టుబాటు కాకపోవడం దాకా ఎన్ని సమస్యలు ముందుకొస్తాయి! ఆత్మకూరు దారిలో ఆముదం పొలంలో కనిపించిన మహిళా రైతు చెప్పుకున్న పంట కష్టం గానీ, ఊళ్లోకి వచ్చాక ఆ పేద మహిళ వెళ్లబోసుకున్న ఇంటి కష్టం గానీ ప్రభుత్వాన్నే బోనులో నిలబెట్టాయనిపించింది.

పొలానికి నీళ్లు పారించలేని పెద్దమనుషులు పల్లెలపైకి, పచ్చటి కాపురాలపైకి మాయదారి సారాను వరదలా పారిస్తున్నారు. సారాకే కాదు..సర్కారుకూ 'బెల్టు' తీస్తామని చెప్పినప్పుడు మణెమ్మ కళ్లల్లో కాంతిని చూడగలిగాను. మరి ఆ కాంతిని శాశ్వతంగా నిలపడం ఎలా? పల్లె పంచన ఉండే చేతివృత్తులవారిని కలిసినప్పుడు రైతుతో ఎంత అల్లుకుపోయారనిపించింది.

రైతుతో బతుకుతారు. ఆయన కుమిలితే రగులుతారు. నవ్వితే సంబరపడతారు. దున్నుతుంటే నా గళ్లు ఇస్తారు. చెల్లెళ్లు కొంగు నడుంకు చుట్టి కోతలకు దిగితే కొడవళ్లకు కక్కులు కొడతారు. గింజపై పక్షిని వాలనీయరు. ఎలుకనూ విడిచిపెట్టరు. గట్లపై మేకలు మేపుతూ రైతుకు ఆ కబురు ఈ కబురు చెబుతారు. గట్ల మీద గడ్డినో, వాములో కొన్ని పనలనో అడిగి తెచ్చుకుంటారు. కల్లంలో పంట తూర్పారబడుతుంటే చేటలిస్తారు.

పంటనంతా ఎత్తి ఎడ్ల బండ్లపైకి వేసినప్పుడు..మోకు కర్రలు అడ్డంగా నిలేస్తారు. కమ్మీల నుంచి కాడి దాకా సరిచేసి పంపుతారు. రైతు బిడ్డల సరదా కోసం ఆట వస్తువులు, బ్యాటు కర్రలు ఇస్తారు. వారి ఇల్లాళ్ల కోసం చెవి కమ్మలు, ముక్కుపుడకలు తయారుచేస్తారు. పల్లెతోనూ, పల్లె కాపుతోనూ ఇంతలా అల్లుకుపోయిన కులవృత్తుల వారంతా నాకు మద్దతుగా మాట్లాడుతుంటే, అది రైతుకు వారిచ్చే భరోసాలాగే అనిపించింది.

తమ తమ వాడలకు, గల్లీలకు పిలుచుకుపోయారు. కురుమలు గొర్రె పిల్లలను వళ్లోకి అందిస్తే, వేటప్పుడు పెట్టుకొనే బుట్టలను ఎరుకలు తలకు పెట్టారు. రైతుకు ఇచ్చే గౌరవమే నాకూ చూపించారనిపించింది. మగ్గం నేసి, చేటలు అల్లి, ఇస్త్రీ చేసి.. నేనూ వారి వృత్తులమీద నా గౌరవం చాటుకున్నాను. అయితే, ఇది గౌరవాల సంగతి కాదని వాళ్లకూ నాకూ తెలుసు. అందుకే 'బీసీ డిక్లరేషన్'పై వాళ్లదీ నాదీ ఒకే నమ్మకమనిపించింది. ఎస్సీ వర్గీకరణ కోసమూ నాలాగే వాళ్లూ పట్టుదలతో ఉన్నారనిపించింది.

పొలానికి నీళ్లు పారించలేని పెద్దమనుషులు పల్లెలపైకి, పచ్చటి కాపురాలపైకి మాయదారి సారాను వరదలా పారిస్తున్నారు..

October 30, 2012


30వ రోజు పాదయాత్ర రూట్ మ్యాప్ పత్రికా ప్రకటన

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోని ప్రభుత్వం
అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ
9 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదే
తొలి సంతకం రుణమాఫీపైనే

కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తూ, పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

'వస్తున్నా..మీకోసం' యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు మక్తాల్ నియోజకవర్గం, ఆత్మకూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు టీడీపీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే అని అన్నారు. వర్షాకాలంలోనే రోజుకు మూడు గంటలు విద్యుత్ ఇస్తే ఇక వచ్చేది వేసవి కాలం ఇక కరెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే ఊహించాలని ఆయన అన్నారు.
టీడీపీ హాయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తొమ్మిది గంటలపాటు విద్యుత్ ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, మీకు అండగా టీడీపీ ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు.

కాగా టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు 29వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం మల్లాపూర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి ఆంజనేయ స్వామి దేవాలయంలో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేవస్థానానికి గోదానం చేశారు. అక్కడి నుంచి ఆత్మకూర్, కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత, వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేసుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దు, టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ..30.10.2012


28వ రోజు పాదయాత్ర పోటోలు -- (Part-3) 29.10.2012

టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు 28వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం మల్లాపూర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి ఆంజనేయ స్వామి దేవాలయంలో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేవస్థానానికి గోదానం చేశారు. అక్కడి నుంచి ఆత్మకూర్, కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత, వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేసుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

 29వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

October 29, 2012

పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం చిన్నపాడు స్టేజీ నుంచి నడక ప్రారంభించారు. దారిలో రైతులను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు.

ధరూర్ మండలం పెద్దపాడు, ఎమినోనిపల్లి, చింతరేవుల గ్రామాలకు చెందిన రైతులు, కూలీలతో చంద్రబాబు మాట్లాడారు. ఎమినోనిపల్లి వద్ద పొలంలో పని చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. చింతరేవుల గ్రామంలో రైతులు విద్యుత్, తాగునీరు, తదితర సమస్యలను మొరపెట్టుకున్నారు. పెద్దపాడు గ్రామానికి చెందిన ఆశన్నను చంద్రబాబు పలకరించారు.

చంద్రబాబు: ఎద్దులు ఎంతకు కొన్నావు?
ఆశన్న: రూ.50 వేలు సార్

చంద్రబాబు: పొలం పనులు చేయడానికి ట్రాక్టర్ కొనవచ్చుగా ...
ఆశన్న: పెరిగిన డీజీల్ ధరలకు ట్రాక్టర్ కొనాలంటేనే భయం వస్తోంది.

చంద్రబాబు: మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్ ధరలపై తగ్గింపునకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
ఆ సమయంలో అక్కడే ఉన్న కూలీలు, రైతులు ఆయన చుట్టూ చేరారు.

చంద్రబాబు: కూలీ ఎంత ఇస్తున్నారమ్మా?
సరోజమ్మ: రూ.100 ఇస్తున్నారు సారు.

చంద్రబాబు: ఉపాధి పనులకు వెళ్లడం లేదా?
మంజుల: ఆ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో, ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. చంద్రబాబు: అవినీతి ప్రభుత్వానికి స్వస్తి చెప్పి త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుంది. మీ సమస్యలన్నీ తీరుస్తాం.

ఆంజనేయులు: మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువైంది. రాత్రివేళల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు. అప్పుల పాలవుతున్నాం.

చంద్రబాబు: అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. రైతుల కష్టాలు తొలగిస్తామన్న కాంగ్రెస్..తీరని మోసం చేశారు. విద్యుత్ సమస్యపై అధికారుల వద్ద మొరపెట్టుకుంటే, కేసులు బనాయిస్తారా? త్వరలోనే మంచిరోజులొస్తాయి. రైతులకు సాగునీటి కోసం తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం. రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

తిమ్మక్క: మాకు పింఛన్లు అందడం లేదు.
చంద్రబాబు: మేము వచ్చాక వృద్ధుల పింఛన్‌ను రూ.600కు పెంచుతాము.

సాయన్న: తాగడానికి నీరు అందడం లేదు
చంద్రబాబు: పక్కనే జూరాల డ్యాం ఉన్నా కానీ "చూడటానికి మాత్రమే కానీ తాగడానికి పనికి రాదు'' అన్న విధంగా ఉంది. స్థానిక మంత్రి ఉన్నా, జనాలకు తాగునీరు అందించడం లేదు. మా ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ సుజల ద్వారా ప్రతి గ్రామానికి నీరు అందే విధంగా చూస్తాం.

దారిలో రైతులను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ 28వ రోజు పాదయాత్ర సాగిందిలా..


  టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బయలు దేరి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని ఆత్మకూర్‌కు చేరుకుంటారు. అనంతరం కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత, వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే చంద్రబాబు బస చేస్తారు.

29వ రోజు చంద్రబాబు యాత్ర షెడ్యూల్

తెలంగాణకు న్యాయం చేసే బాధ్యత నాదే!

ఇప్పుడూ ఎప్పుడూ నేను వ్యతిరేకం కాదు

పేదల కష్టం తొలగేదాకా నిద్రపోనని ప్రతిన
వేగం అందుకున్న పాదయాత్ర
గంటకు రెండు కిలోమీటర్ల నడక
బాబుకు కరుణానిధి పరామర్శ లేఖ
చుక్కా రామయ్య, పొత్తూరి సంఘీభావం
 తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. పేదలు బతకడమే కష్టంగా మారిందని, వారి కష్టాలు తీర్చేదాకా నిద్రపోనని ప్రతీనబూనారు. కాంగ్రెస్ దొంగలను నమ్మితే మిగిలేది కష్టాలేనని హెచ్చరించారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా 27వ రోజు చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్, ఆత్మకూర్ మండలాల్లో పర్యటించారు.

రైతులు, మహిళలు, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఊరి మొత్తానికి సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా కట్టని ఊళ్లు ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు పెత్తందారిగా వ్యవహరిస్తుండగా ప్రజలు బానిసలుగా ఉండాల్సిన దుస్థితి కొనసాగుతోందంటూ మంత్రి డీకే అరుణపై పరోక్షంగా మండిపడ్డారు. గిరిజన నాయకుడు కొమురం భీం, వాల్మీకి స్ఫూర్తితో టీడీపీ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.

వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోయలను కర్ణాటకలో ఎస్టీలుగా, తమిళనాడులో ఎస్సీలుగా గుర్తిస్తుండగా, మన రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో మాత్రం బీసీలుగా గుర్తించడం శోయనీయమన్నారు. వారిని తక్షణం ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. కాగా, సోమవారం గంటకు రెండు కిలోమీటర్ల చొప్పున కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం మెల్లిమెల్లిగా నడిచిన చంద్రబాబు సోమవారం కొంత వేగం పెంచే ప్రయత్నం చేశారు.

ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. ధరూర్ మండలం పెద్దపాడు చేరుకొన్నారు. వేరు శనగచేనులోకి వెళ్లి మహిళా కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కలుపు తీసే పరికరంతో కొద్దిసేపు కలుపు తీశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నచింత రేవులకు చేరుకొని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. సమీపంలోని కిరాణ షాపుకు వెళ్లి కూల్ డ్రింక్ తాగారు. మధ్యాహ్నం రెండున్నరకు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. భోజనం చేసి కొద్దిసేపు విశ్రమించారు. 3.30లకు పాదయాత్ర కొనసాగించి ప్రాజెక్టు మీద నుంచి నందిమల్ల మీదుగా మూలమల్ల చేరుకున్నారు.

కరుణానిధి పరామర్శ: చంద్రబాబుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాశారు. ' బాబూ.. ఆరోగ్యం జాగ్రత్త'' అంటూ పరామర్శించారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని బాబుకు సూచించారు. యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలో వేదిక కూలడంతో చంద్రబాబు వెన్నుకు దెబ్బతగిలిన విషయం తెలిసిందే. కాగా, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం చంద్రబాబు పాదయాత్ర వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించి, ఆయనను పరామర్శించారు.

పాదయాత్ర తెలంగాణ సమస్యకు పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని చుక్కా రామయ్య వ్యక్తం చేశారు. కాగా, అధినేతకు సంఘీభావంగా టీడీపీ మహిళా విభాగం సోమవారం సాయంత్రం పాదయాత్రలో పాల్గొంది. విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శోభాహైమావతి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తదితరులు ఆత్మకూర్ మండలం నందిమల్ల వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు.

పేదల కష్టం తొలగేదాకా నిద్రపోనని ప్రతిన, వేగం అందుకున్న పాదయాత్ర (28వ రోజు )

కాంగ్రెస్‌ పాలకుల నిర్ల క్ష్యం వల్లే జూరాల నిర్మాణంలో జాప్యం జరిగిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఎన్టీఆర్‌ హయాంలో పనులు వేగవంతం కాగా, తాను అధికారంలో ఉన్నప్పుడు రూ.600 కోట్లు వెచ్చించి పూర్తి చేయ డం జరిగిందన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా సోమవారం ఆయన గద్వాల నియోజక వర్గంలో పాదయాత్ర ముగించుకుని జూరాల డ్యామ్‌ మీదుగా ఆత్మకూర్‌ మండలానికి చేరుకు న్నారు. ఈ సందర్బంగా డ్యామ్‌ను ఆయన పరిశీ లించారు. పలు చోట్ల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసా గుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లు ప్రభుత్వ విఐపిలకు నిలయంగా మారాయని, కాంగ్రెస్‌ పాలనలో అవి నీతి ఏ స్థాయిలో జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికార కాంగ్రెస్‌ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు తెరలేపితే, రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నార ని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక జిల్లా విషయానికి వస్తే గద్వాల, ఆత్మకూర్‌ తదితర ప్రాంతాలకు జూరాల ప్రాజెక్టు అత్యంత చేరువలో ఉన్నా, జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజలకు తాగునీటిని కూడా అందించే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. ఎంత సేపు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు సమస్యలపై దృష్టిసారించి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నా, ఇక్కడి ప్రజలకు న్యాయం చేయడం లేదని, వ్యక్తిగత ఆస్తులను పెంచుకునేందుకు తపన పడుతున్నారని విమ ర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో రైతాంగం నష్టాల ఉబిలో కురుకుపోయి ఆత్మహత్యల బాట పట్టారని, చేనేత పరిశ్రమ దెబ్బతినడంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని చంద్రబాబు ఆందోళన చెందారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించ డంతో పాటు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రుణాలను మాఫీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్‌ను అందించి వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు నిరుపేదలకు విద్యనందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. భవిష్యత్‌లో ఈ అవినీతి పాలనను ప్రజలు అంతమొందిస్తారన్న ధీమాను టిడిపి అధినేత వ్యక్తపర్చారు. యాత్రలో ఆయన వెంట పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు.

జూరాలను పూర్తి చేసిన ఘనత టిడిపిదే.......సోమవారం వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబునాయుడు 29.10.2012

'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల్ పట్టణంలో వేదిక కూలడం ద్వారా వెన్నునొప్పితో బాధపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ ్యక్షుడు కరుణానిధి లేఖ ద్వారా పరామర్శించారు.

'సమావేశంలో వేదిక మీద నుంచి పడటం వల్ల మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలిసింది. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి'' అని ఆయన లేఖ రాశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరుణానిధి తమిళనాడు సీఎంగా ఉన్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో ఇద్దరు సీఎంలు, ఆయా అంశాలపై చర్చించేవారు. ఆ సాన్నిహిత్యం వల్ల కరుణానిధి, చంద్రబాబును పరామర్శిస్తూ లేఖ రాసినట్లు తెదేపా పార్టీ వర్గాలు తెలిపాయి.

అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి చంద్రబాబుకు కరుణానిధి లేఖ 29.10.2012

పేదలకు ఉచితంగా ఇల్లు
అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు
సుజల పథకం ద్వారా తాగునీరు

 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదవారికి లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే పూర్తిగా బెల్టు షాపులు రద్దు చేస్తామని అన్నారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జిల్లాలోని సోమవారం థరూర్ మండలం, చినపాడు నుంచి 27 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి వేరు శెనగ, పత్తి పంటలను పరిశీలించిన బాబు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతరేపుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదరణ పథకం మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.

గ్రామాస్తులు తాగునీటి సమస్య గురించి ప్రస్తావించగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలు మరుగుదొడ్ల గురించి ప్రస్తావించగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు మక్తల్ నియోజక వర్గంలో ప్రవేశంచారు. అక్కడ చంద్రబాబుకు నేతలు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్దన తరలవచ్చి స్వాగతం పలికారు.

పేదలకు ఉచితంగా ఇల్లు, అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు 28వ రోజు పాదయాత్రలో చంద్రబాబు


"వస్తున్నా మీకోసం" 28వ రోజు పాదయాత్ర పోటోలు..(Part-2) 29.10.2012


"వస్తున్నా మీకోసం" 28వ రోజు పాదయాత్ర పోటోలు..29.10.2012

ప్రత్యర్ధులు
ఫ్యాక్షన్
అవినీతి రాజకీయాలు
ప్రభుత్వ ఆస్తులను దోచడంలోని
కళలలో ఆరితేరి
చట్టానికి దొరికినా
బొంకుడు నాటకాలతో
భువన బోంతరాలను
రంజింప జేస్తూ...
మధ్య మధ్యలో
మతప్రచారాలతో హోరెత్తిస్తూ
పల్లకిలో ఊరేగినన్నాల్లూ
ప్రజల ఆస్తులను దోచిన విషయాన్ని
ప్రక్క దోవ పట్టిస్తూ
కారాగారం లో వుంటూ సిగ్గుపడాల్సిన సమయంలో
ప్రజల సమస్యలకోసం అంటూ
ప్రతిపక్షాలను కళ్ళు తెరిపించడం కోసం అంటూ
తిమ్మిని బమ్మి చేసే నాటకాలతో
ఆస్కార్ అవార్డులు కు అర్హతవున్న కళతో
సినిమా కథలు వ్రాసే వాళ్ళకే
ముడిసరుకుగా ఉపయోగపడేంత
సామర్ధ్యాన్ని చాటుకొంటున్న
వీళ్ళ సామర్ధ్యం ముందు
బాబు కు డైరెక్షన్ ఇస్తున్న
సినిమా వాళ్ళ ప్రావీణ్యం ఎంత?

సేకరణ:
www.chaakirevu.wordpress.com

ప్రజల ఆస్తులను దోచిన విషయాన్ని ప్రక్క దోవ పట్టిస్తూ కారాగారం లో వుంటూ సిగ్గుపడాల్సిన సమయంలో


collection from Eenadu 44photos slideshow

27వ రోజు చంద్రబాబునాయుడి పాదయాత్ర పోటోలు...(Part-3) ....28.10.2012


collection from andhrajyothi 8 photos slideshow

27వ రోజు చంద్రబాబునాయుడి పాదయాత్ర పోటోలు...(Part-2) ....28.10.2012

  మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో సభా వేదిక కూలి నడుము, కండరాల నొప్పికి గురైన చంద్రబాబు కొద్ది రోజుల పాటు రోజూ 15 కిలో మీటర్ల దూరంలోపే పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌లో మార్పులు చేశారు. దీంతో ఆదివారం చంద్రబాబు నడకలో వేగం ముందుకంటే తగ్గింది. ప్రత్యేక బస్సు దిగిన ఆయన రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శెట్టి ఆత్మకూర్‌కు చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది.

ఈ దూరం నడవడానికి ఆయనకు 1:15 గంటల సమయం పట్టింది. 8.8 కిలోమీటర్ల మేర నడిచి ధరూర్ మండలం భీంపురం వద్ద రాత్రి బస చేశారు. మట్టి రోడ్డుపైనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లాలో కొన్ని సందర్భాల్లో 20 నుంచి 24 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తరువాత దూరాన్ని పెంచే అవకాశం ఉంటుందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రజ్యోతికి చెప్పారు.

చంద్రబాబు కొద్ది రోజుల పాటు రోజూ 15 కిలో మీటర్ల దూరంలోపే పాదయాత్ర

October 28, 2012

బీసీలకు ఇంత అన్యాయమా?
జనాభాలో సగం ఉన్నా ఒక్కటే పదవా?
కేంద్ర కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నిప్పులు
తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటన

  కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం బీసీ జనాభా ఉండగా, ఒకరికే అవకాశం కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగు మంత్రి పదవులను కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల శివారు ప్రాంతం నుంచి 'వస్తున్నా..మీ కోసం' పాదయాత్రను చంద్రబాబు ఆదివారం పునః ప్రారంభించారు. 8.8 కిలోమీటర్ల మేర నడిచారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్రకు సిద్ధమైన చంద్రబాబుకు ముఖ్యనేతలు స్వాగతం పలికారు. డప్పుల మోతలు, శ్రేణుల కేరింతల మధ్య యాత్రను ఆయన పునఃప్రారంభించారు. గద్వాల మండలం చిట్టిఆత్మకూర్, ఈదుగోనిపల్లి, పెద్దపాడు గ్రామాల్లో స్థానికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

చిట్టి ఆత్మకూర్ వద్ద మహిళలు ఖాళీ బిందెలు చూపిస్తూ చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. తమకు ఏడాది నుంచి తాగునీరు లేదని వాపోయారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ సుజల పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని తండాలకు, పంచాయతీలకు మంచినీటిని సరఫరా చేస్తామని చంద్రబాబు వారికి హామీనిచ్చారు. "అధికారంలోకి వచ్చిన తొలిరోజు తొలి సంతకం రుణ మాఫీ ఫైలుపైనే చేస్తాను. రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై, మూడో సంతకం ఎన్టీఆర్ సుజల పథకం అమలుపై ఉంటుంద''ని పేర్కొన్నారు. "గద్వాలలో వేదిక కూలడంతో నడుము కండరాలు బిగించుకు పోయాయి.

డాక్టర్లు మూడు రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని దయవల్ల మళ్లీ నడవగలుగుతున్నాను'' అని తెలిపారు. అక్కడే ఉన్న లక్ష్మణ్ అనే నిరుద్యోగ యువకుడి మాటలు చంద్రబాబును ఆకట్టుకున్నాయి. "మీరు తెలంగాణకు మద్దతు ఇస్తే అంతకంటే అదృష్టం లేదు సార్'' అని అన్నారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని వందసార్లు చెప్పామని, మళ్లీ అదే చెబుతున్నానని లక్ష్మణ్‌కు ఆయన స్పష్టం చేశారు. తాగునీటి, నిరుద్యోగ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్లను ఎందుకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం లేదని ప్రశ్నించారు.

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది,బీసీలకు ఇంత అన్యాయమా? ...27వ రోజు పాదయాత్రలో చంద్రబాబు

.. ఒక రోజు విరామం తరువాత నడక మొదలుపెట్టాను. అడుగేయడం మొదట్లో కష్టంగానే అనిపించింది. కాలు సాగడానికి చాలాసేపు పట్టింది. మా నేతలను, డాక్టర్లను ఒప్పించి బయట పడేసరికి సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. అప్పటికీ యాత్రలో వేగం పెరగకుండా అడుగడుగునా మావాళ్లు కాళ్లకు అడ్డం పడుతూనే ఉన్నారు. "సార్.. యాత్రను ఎలాగూ మీరు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!. వేగం తగ్గినా ఫరవాలేదు. కిలోమీటర్ తక్కువా ఎక్కువా అనేదీ పట్టింపు కాదు.

చిన్నగానే వెళతాం. ఈ కొద్ది రోజుల పాటైనా మా మాట ఆలకించండి'' అంటున్న మా వాళ్లను కాదని అడుగు పెంచడం ఎప్పటిలా ఈసారి కుదరదనిపించింది. వేదిక కూలి కిందపడినప్పటి నడుం నొప్పి, మధ్య మధ్యలో "నేనున్నా'నని చెబుతోంది. దానికి కండరాల నొప్పులు కలవడం, కాళ్లకు ఒక రోజుపాటు విశ్రాంతి ఇవ్వడం, మధ్యాహ్నం నుంచి యాత్ర మొదలుపెట్టడంతో పెద్ద దూరమేమీ నడవలేకపోయాను. "సార్, కొంతకాలం ఇంతే. మీ నడక దూరం తగ్గించేశాం'' అంటున్న మా వాళ్ల ఆజ్ఞలను నవ్వుతూ పాటించక తప్పుతుందా?

తలాటున జూరాల. కానీ పొలం గానీ, పొలమారిన గొంతు గానీ తడవవు. జూరాలకు ఆరు కిలోమీటర్ల దూరంలోని శెట్టి ఆత్మకూరులో ఆ రైతును కలిసినప్పుడు.. "నేను చెప్పడం ఎందుకు సారు.. ఎదురుగ్గా కనిపిస్తుంటే'' అంటూ నన్ను తన ఆముదం పొలంలోకి తీసుకెళ్లాడు. కష్టాలను ఓర్చుకోవడం, కన్నీరు మింగేయడం అలవాటైనట్టుంది. తనను తాను తమాయించుకోడానికి తాయన్న ప్రయత్నించాడు.

"ఎంత సార్..రెండు తడులు..బంగారం పండేది'' అని చెబుతూనే నాతోపాటు మట్టిరోడ్డుపై కొద్దిదూరం నడిచాడు. ఆ తరువాత కొద్ది దూరంలోనే ఆడపడుచులు ఖాళీ బిందెలతో ఎదురుపడినప్పుడు అడక్కుండానే వాళ్ల సమస్య తెలిసిపోయింది. ఈ జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ప్రకటించిన 'ఎన్టీఆర్ సుజల' సాకారం కోసం నీళ్లింకిన ఇలాంటి ఎన్నో కళ్లు ఎదురు చూస్తున్నాయనిపించింది.

ఒక రోజు విరామం తరువాత నడక మొదలుపెట్టాను. అడుగేయడం మొదట్లో కష్టంగానే అనిపించింది.

చంద్రబాబు 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర సోమవారం ధరూర్ మండలం భీంపురంలో ప్రారంభమవుతుంది. ఎంలోనిపల్లి క్రాస్‌రోడ్, రేవులపల్లి క్రాస్‌రోడ్, మనాపురం క్రాస్‌రోడ్, చిన్నచింతరేవుల ద్వారా నందిమల్ల చేరుకుంటుంది. సుమారు 13 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.

బాబు పాదయాత్ర - నేటి షెడ్యూల్

ఈద్గాలో అపచారం!
బూట్లు ధరించి షర్మిల ప్రార్థనలు

 
అనంతపురం, అక్టోబర్ 28 : మరో ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్ షర్మిల ముందు నడుస్తున్నారు. ఆ సమయంలో పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బడన్నపల్లి ప్రాంతం చేరుకుంది. అక్కడికి సమీపంలోనే 'ఈద్గా' ప్రార్థనా ప్రదేశం కనిపించింది. ఆ రోజు బక్రీద్ అన్న విషయం గుర్తుకు వచ్చింది. అంతే.. షర్మిల అడుగులు అటువైపు సాగాయి.

పాదయాత్ర కోసం ధరించిన బూట్లతోనే దువా (ప్రార్థన) ముగించారు. ఆ సమయంలో ఆమె వెంట వైసీపీ పార్టీకి చెందిన పలువురు మైనారిటీ నాయకులు ఉన్నా ఆమెను వారించడానికి ప్రయత్నించలేదు. వివాదం ముదరకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు గానీ, షర్మిలతో ప్రకటన చేసేందుకు గానీ వైసీపీ పార్టీ నేతలు ప్రయత్నించలేదు. తిరుమల పవిత్రతకు ఆమె అన్న, వైఎస్ జగన్ అపచారం తలపెట్టారన్న వివాదం సమసిపోకముందే,

ఆయన సోదరి దాదాపు అలాంటి వివాదంలోనే చిక్కుకోవడం గమనార్హం. నిజానికి, ఏ మతం వారైనా ఏ దేవుడిని ప్రార్థించేటప్పుడు.. చెప్పులు కానీ, బూట్లు కానీ వేసుకోరు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా షర్మిల కొందరు ముస్లింలతో కలిసి ప్రార్థన చేయడాన్ని ముస్లిం మైనారిటీ వర్గాలు తప్పుబట్టాయి. మరోసారి ముస్లిం మనోభావాలను దెబ్బతీయొద్దని టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు లాల్ జాన్ బాషా హెచ్చరించారు.

రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టొద్దన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత ఖలీకుల్లాఖాన్ డిమాండ్ చేశారు. కాగా అసలు వివాదమేమీ లేదన్నట్టు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మత అపచారానికి పాల్పడ్డారని వాదించే ప్రయత్నమూ చేశారు. "హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ ఘని సమక్షంలోనే గతంలో చంద్రబాబు బూట్లతోనే ఖురాన్‌ను అందుకున్నారు'' అని జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాలార్‌బాషా చెప్పుకొచ్చారు.

ఈద్గాలో అపచారం! బూట్లు ధరించి షర్మిల ప్రార్థనలు




Chandrababu Naidu Padayatra 28 - 10 - 12


After one day rest, Chandrababu Naidu to resume his Padayatra from today


TV9 - Chandrababu Naidu speaks at 26th day padayatra

27వ రోజు చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర టి.వి కవరేజ్..

View 10 Photos Slideshow

chandrababunaidu_vastunnameekosam_photos_28.10.2012

27వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు..(చిన ఆత్మకూరు,మహబుబ్ నగర్ జిల్లా)


28వ రోజు పాదయాత్ర రూట్ మ్యాప్...పత్రికా ప్రకటన..(telugudesam party office)

పాలమూరు నుంచి వలసలు అరికడతాం
ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదో చెప్పండి
అవినీతి ప్రభుత్వంవల్ల పనులు జరగడంలేదు 

  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు నుంచి వలసలను అరికడతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పనులు లేక చాలామంది వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి, ప్రజల కష్టాలు స్వయంగా చూసి, మీకు అండగా ఉండేందుకు పాదయాత్ర ప్రారంభించానని ఆయన పేర్కొన్నారు.

ఒక్క రోజు విరామం తర్వాత జిల్లాలోని శెట్టి ఆత్మకూరు నుంచి ఆదివారం మ«ధ్యాహ్నం చంద్రబాబు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఆ ప్రాంతంలో బాబు అడుగుపెట్టగానే మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గద్వాల ప్రమాదంలో నడుము కండరాలు స్పల్పంగా కదిలాయని, డాక్టర్లు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, అయినా ఒక్కరోజే విశ్రాంతి తీసుకుని మీకోసం వచ్చానని అన్నారు.

జురాల ప్రాజెక్టు పక్కనే ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే పేదలు ఎక్కువగా ఉండే జిల్లా అని వ్యాఖ్యానించారు. జురాల ప్రాజెక్టుకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య పౌండేషన్ వేశారని, ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత దీనిని ప్రారంభించారని, నేను (చంద్రబాబునాయుడు) ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుకు రూ. 600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అవినీతి ప్రభుత్వం కారణంగా పనులు జరగడంలేదని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలులేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పావలా వడ్డీ పేరు చెప్పి రూ. 2 వడ్డీ వసూలు చేసి మహిళలను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. భవిష్యత్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదో మీరు చెప్పాలని చంద్రబాబు ప్రజలనుద్దేశించి అడిగారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు కొనియాడారు.

( ఆదివారం మధ్యాహ్నం 27వ రోజు పాదయాత్ర ప్రారంభం) పాలమూరు నుంచి వలసలు అరికడతాం- చంద్రబాబు 28.10.2012

అనంతపురంజిల్లా పాదయాత్రలో బూట్లు వేసుకోని నమాజ్..ముస్లింల వేదన..షర్మిలకి ఇతర మతలపై ఏ మాత్రం గౌరవం ఉందో ఈ విడీయెలో తెలుస్తుంది చూడండి.
..

షర్మిల అపచారం...అనంతపురంజిల్లా పాదయాత్రలో బూట్లు వేసుకోని నమాజ్..


టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత గద్వాల పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న చైతన్య రథం పట్టణంలోని ప్రధాన రహదారిలో వెళ్తుండగా, వాహనంపైనే ఉన్న ఎన్టీఆర్ గొంతుకు టెలిఫోన్ తీగ అడ్డుపడింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. తీగలు తెగిపోయాయి. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానికులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కుప్పకూలిన ఘటనను గతంలో ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాద ఘటనతో పోల్చి చూస్తున్నారు.
టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత గద్వాల పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న చైతన్య రథం పట్టణంలోని ప్రధాన రహదారిలో వెళ్తుండగా, వాహనంపైనే ఉన్న ఎన్టీఆర్ గొంతుకు టెలిఫోన్ తీగ అడ్డుపడింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. తీగలు తెగిపోయాయి. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానికులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కుప్పకూలిన ఘటనను గతంలో ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాద ఘటనతో పోల్చి చూస్తున్నారు.

అప్పట్లో ఎన్టీఆర్ గద్వాల పర్యటనలో ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

chandrababunaidu_vastunnameekosam_padayatra

చంద్రబాబు నాయుడు కోలుకోవాలని సర్వమత ప్ర్రార్ధనలు...పోటోలు( 27.10.2012)


పరిమితికి మించి జనం వేదికపైకి రావడం, తోపులాట జరగడమే శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కూలడానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి, 16్ఠ30 సైజులో వేదికను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ సైజు వేదికపై 30 నుంచి 40 మంది వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ, శుక్రవా రం రాత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత కొంతమంది స్థానిక నా యకులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు.

అప్పటికే వేదిక కిక్కిరిసి ఉండటంతో ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రత సిబ్బంది ఇద్దరు, ముగ్గురు కిందపడిపోయారు. మిగతా సిబ్బంది అప్రమత్తమై వేదికపైకి వస్తున్న వారిని అడ్డుకున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. అదే సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వేదిక మెట్లపై నుంచి కాకుండా, వెనక నుంచి, పక్కల నుంచి పైకి ఎక్కారు.

దాంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయానికి వేదికపై సుమారు 70 నుంచి 80 మంది ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నారాయణరెడ్డిని కలెక్టర్ గిరిజా శంకర్ ఆదేశించారు.

వేదిక కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నారాయణరెడ్డికి కలెక్టర్ గిరిజా శంకర్ ఆదేశం

October 27, 2012

మీ కోసమే వస్తున్నా
నేటి మధ్యాహ్నం నుంచి పునఃప్రారంభం
ఆదివారం 8-10 కిలోమీటర్లు పాదయాత్ర
2,3 రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైధ్యులు
కొనసాగింపునకే చంద్రబాబు నిర్ణయం
బాబుకు టీడీపీ నేతల పరామర్శల వెల్లువ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఆదివారం ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. డాక్టర్లు చంద్రబాబును పరామర్శించిన తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

చంద్రబాబు ప్రస్తుతం కండరాల నొప్పితో బాధ పడుతున్నారని, బీటీ రోడ్డుపై నడవడం వల్ల ఈ నొప్పి వచ్చిందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. దీంతో, చంద్రబాబు పాదయాత్ర చేసే మార్గంలో రోడ్డు పక్కన మట్టి రోడ్లు వేయించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే, తమ కార్యకర్తలే మట్టి వేస్తారని చెప్పారు. కాగా, మరో రెండు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, పార్టీ సీనియర్లు పదే పదే కోరినా యా త్ర కొనసాగింపునకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వివరించాయి.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో శుక్రవారం రాత్రి వేదిక కూలడంతో చంద్రబాబుకు గాయాలైన సంగతి తెలిసిందే. నడుం దగ్గర హిప్ జాయింట్ భాగం ఒత్తిడికి గురైంది. అక్కడ కొంత వాపు వచ్చింది. రాయచూర్ నవోదయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్లు శుక్రవారం అర్ధరాత్రి వచ్చి చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎలాంటి ఫ్రాక్చర్లు లేవని ప్రకటించారు. నరాలు ఒత్తిడికి గురి కావడంతో నడుము భాగంలో కొంత వాపు వచ్చిందని చెప్పారు. నడిస్తే మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కనీసం మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో, శనివారం ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక, చంద్రబాబు కుటుంబ వైద్యులు నరేంద్రనాథ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి శనివారం పరీక్షలు నిర్వహించారు. అలాగే, శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. నడుముకు లుంబో సాక్రల్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

గద్వాలకు భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి..
చంద్రబాబు గాయపడిన విషయం తెలిసిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ హుటాహుటిన గద్వాలకు చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన రైస్‌మిల్ వద్దకు చేరుకున్నారు. శనివారమంతా ఇక్కడే ఉండిపోయారు. లోకేష్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో మాట్లాడుతూ కనిపించారు. చంద్రబాబు కోడలు బ్రహ్మ ణి సాయంత్రం గద్వాలకు చేరుకుని మామయ్యను పరామర్శించారు. బాబును సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు.

సినీ నిర్మాతలు దిల్‌రాజు, బండ్ల గణేశ్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు చంద్రబాబు బస చేసిన ప్రత్యేక వాహనంలో ఉన్నారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ, మామయ్య త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. పాలన గాడి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయక త్వం కావాలన్నారు. మీరు పాదయాత్రలో పాల్గొంటారా? అన్న ప్రశ్న కు షూటింగ్ తేదీలను బట్టి భాగస్వామిని అవుతానని చెప్పారు.

టీడీపీ నేతల పరామర్శలు
చంద్రబాబును పరామర్శించేందుకు శనివారం పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు గద్వాలకు చేరుకున్నారు. పార్టీ నేతలు కోడెల శివప్రసాదరావు, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తీగల కృష్ణారెడ్డి, దాడి వీరభద్రరావు, టీడీ జనార్దన్‌రావు, వీవీఎస్ చౌదరి బాబును పరామర్శించారు. రాత్రి 7 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలు పరామర్శించారు. టీడీపీ హయాంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ పాదయాత్రకు తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, కానీ.. బాబు యాత్రకు రక్షణ ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని కోడెల శివప్రసాదరావు విమర్శించారు. అస్వస్థతకు గురైన వైఎస్‌కు అప్పట్లో 24 గంటలూ వైద్య సహాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.

మంత్రి అరుణకు చుక్కెదురు
టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించేందుకు మంత్రి డీకే అరుణ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే భరత్‌సింహారెడ్డి విఫలయత్నం చేశారు. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నాయకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిపక్ష నా యకుడు తన నియోజకవర్గంలో గాయపడిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు తాము ప్రయత్నం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి శోచనీయంగా ఉందని అరుణ, భరత్‌సింహారెడ్డి విమర్శించారు.

'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునఃప్రారంభం


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర శుక్రవారం నాటితో 25 రోజులు పూర్తిచేసుకుంది. మరో పక్క సమాంతరంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర కూడా కోనసాగుతూనే వుంది.
ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు యాత్రకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. ఊరూరా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. బాబు కూడా తన గత ధోరణికి భిన్నంగా  సామాన్య జనంతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు వింటున్నారు…. వాళ్లకు ధైర్యం చెబుతున్నారు…. తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. గతం కంటే ఆయన ప్రసంగాలు కూడా జనాకర్శకంగా సాగుతున్నాయి. పైగా ఇళ్ళల్లోకి, పొలాల్లోకి ఆయన నేరుగా వెళ్ళిపోతున్నారు…. రోడ్లపక్కనే టీ స్టాల్స్ లో టీ తాగుతున్నారు…. తెలంగాణలో బాబు యాత్రను కొనసాగనివ్వం అంటూ తెలంగాణా రాజకీయ జే ఎ సి పిలుపు ఇచ్చి, ఆ మేరకు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికి బాబు బెదరకుండా తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టారు. ఎవరూ ఊహించని విధంగా ఎం.ఆర్.పి .ఎస్ . బాబుకు అండగా నిలిచింది. గత అయిదు రోజులుగా తెలంగాణలో బాబు యాత్ర నిరాటంకంగా సాగిపోతోంది.
ఇదిలావుంటే మరోపక్క ఇడుపులపాయ లో మొదలయిన షర్మిల యాత్ర కడప జిల్లా దాటి అనంతపూర్ జిల్లాలో కొనసాగుతోంది ఈమె యాత్రకు కూడా జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఆమె ప్రసంగాలను వింటున్నారు. షర్మిల కూడా పొలాల్లోకి, ఇళ్ళల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే చంద్రబాబుతో పోలిస్తే షర్మిల లో పెద్ద మైనస్ పాయింట్ ఏవిటంటే రాజకీయ అనుభవం లేకపోవటమే… ఆమె ప్రసంగాలన్నీ కేవలం కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోయటం, తెలుగుదేశాన్ని నిందించటం తప్ప పధకాల ప్రసక్తి లేకుండా పోతోంది. ఒక పక్క చంద్రబాబు తన యాత్ర అందరికోసం అని చెబుతుంటే షర్మిల తన యాత్ర అన్న కోసం అని చెబుతున్నారు. బాబు యాత్ర పార్టీ వ్యవహారంగా వుంటే , షర్మిల యాత్ర కుటుంబ వ్యవహారంగా కనపడుతోందని రాజకీయ
విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల కు మరో పెద్ద మైనస్ పాయింట్ ఆమె గొంతు.. జనాకర్షక గొంతుక లేకపోవటం తో ఆమె ప్రసంగాలను జనం పెద్ద ఆసక్తిగా వినటం లేదని యాత్రలో పాల్గొన్న వైఎస్సార్ పార్టి నాయకుడొకరు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే
కొత్తగా ఏయే సంక్షేమ పధకాలు ప్రవేశ పెడతామో చంద్రబాబు చెబుతుంటే , తాము రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని షర్మిల చెబుతున్నారు. పాదయాత్రకు ముందే బిసి డిక్లరేషన్, ఎస్ సి వర్గీకరణ, మైనారిటి డిక్లరేషన్ లాంటివాటిని ప్రకటించటం చంద్రబాబు రాజకీయ పరిణతికి నిదర్శనం ….. అయితే కేవలం జగన్ బైటికి రావటం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న రీతిలో షర్మిల ప్రసంగాలు కొనసాగుతున్నాయి…
మరో ప్రధాన అంశం… చంద్రబాబు వయస్సు….63 ఏళ్ల వయసులో చంద్రబాబు తన యాత్రను కొనసాగిస్తూ ఉండటంతో ప్రజల్లో ఆయన పట్ల తెలియని సానుభూతి వర్కవుట్ అవుతోంది. ఏ విధంగా చూసుకున్నా షర్మిల యాత్ర చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతో పోలిస్తే వెలా తెలా పోతోంది అనటంలో సందేహించాల్సిన అవసరంలేదు…..

షర్మిల యాత్ర చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతో పోలిస్తే వెలా తెలా పోతోంది అనటంలో సందేహించాల్సిన అవసరంలేదు…..


 

చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్
చెన్నై నుంచి వస్తున్న నారా రోహిత్, నారా గిరీష్
గద్వాలకు వచ్చిన కోడెల, బొజ్జల ప్రభృతులు

గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు.

మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

కాగా చంద్రబాబుకు ప్రమాదం జరిగిన వార్త తెలుసుకుని చెన్నైలో షూటింగ్‌లో ఉన్న నారా రోహిత్, నారా గిరీష్ కూడా షూటింగ్ రద్దు చేసుకుని గద్వాలకు బయలుదేరారు. ఇప్పటికే దేశం సీనియర్ నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాద్, బొజ్జల తదితరులు గద్వాల చేరుకుని బాబుని పరామర్శించారు.

చంద్రబాబును పరామర్శించిన నేతలు & పోటోలు (27.10.2012)

 file photo
అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు. ఆయన షూటింగ్‌ను వాయిదా వేసుకుని చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న గద్వాల సమీపంలోని శెట్టి ఆత్మకూరుకు వచ్చారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంట ఉన్నారు.
నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందేనని, అది తెలిసి మామయ్యను పలకరించడానికి వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మామయ్య త్వరగా కోలుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోలుకుని పాదయాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు పార్టీకి, రాష్ట్రానికి పునర్వైభవం తేవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తన షూటింగులను బట్టి, తేదీలను బట్టి చంద్రబాబుతో పాదయాత్రలో పాల్గొనే విషయాన్ని నిర్ణయించుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడిగా భావించే కొడాలి నాని పార్టీ వీడిపోయిన తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారు. చంద్రబాబుతో ఆయన చాలా కాలంగా విభేదిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
సభా వేదిక కూలిపోయి చంద్రబాబు గాయపడ్డారనే తెలిసిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వెంట వారిద్దరు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఉన్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ కూడా రావచ్చునని చెబుతున్నారు.

మామయ్య త్వరగా కోలుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు....జూనియర్ ఎన్టీఆర్ 27.10.2012

October 26, 2012

జైల్లో మీ ఆయన భోగాల మీద
రేగిన దుమారానికి
విరుగుడుగా బిడ్డల
మీద ప్రమాణానికి
సవాల్ చేస్తూ
సతిగా పరిణితి లేని పసతో
ఓ లేఖ రాసారు
ప్రతిపక్షం వాళ్ళు
జైళ్ల శాఖ దగ్గర ఆరా తీస్తే
అంతెందుకు ఉలిక్కి పడ్డారు
ఆ పడేదేందో
అవినీతి మీద
ప్రాధమిక దర్యాప్తులో
వెల్లడైన వాస్తవాలతో
అరెస్ట్ అయ్యి అక్కడికి
వెళ్ళిన రోజే
ఇంటిల్ల పాది
నడి రోడ్డు మీద రక్తి కట్టించిన నాటకం లో
ఈ ప్రమాణపు సన్ని’వేషం’ పెట్టి వుంటే
ఉప ఎన్నికలలోమరింత సానుభూతి వచ్చేది కదా
అసలు సిసలు అవినీతి ఆస్తి పాస్తుల కొండంత భోగాల మీద
ఆ ఇంటి కోడలుగా కొద్దిగా దృష్టి సారించి
మడమ తిప్పకుండా ప్రమాణం చేసి వుంటే
ఊరూ వాడా అయ్యో పాపం అనేది
జైల్లో పెళ్లి రోజు జరుపుకోడానికి
ఏకాంత సేవ ఏర్పాట్లు చేయలేదనే
ఏడుపు గొట్టు రాజకీయ లేఖలు ఎందుకో?
అయినా మైనారిటీ తీరని బిడ్డల మీద ప్రమాణం అంటే
మీ మావయ్య అరిగిపోయిన రికార్డు లా చెప్పే
చట్టం తన పని తాను చేసుకు పోదూ
మీకా హక్కు ఎక్కడ వుందని.
మావయ్య బతికి ఉన్నప్పుడే
చట్టం తన పని తాను చేసుకు పోలేందు
కుట్రలతో శాసించ వచ్చు అని
ఎదురు చెప్పి ఉండాల్సింది
రామ కోటి రాసుకోడానికి
భంగం కల్పించే నాటకంలో
బావ కళ్ళలో ఆనందం చూసినోడి పిల్లలు
తండ్రి లేని అనాధలు అయ్యే వారు కాదు
అలాంటి మామ ఇలాకాలోని సన్నివేశాలు
మాటి మాటి కి కుట్ర ల ను గుర్తుకు తెస్తున్నాయా?
చట్టం తన పని చేస్తుంటే
ప్రతి మలుపుకూ కుట్ర కుట్ర అని
ఇంటిల్ల పాదీ పాడుతుంటే
పార్టీ కూడా వంత పాడుతుంటే
బతికి లేని మావయ్య గారి
ఆత్మ భరించగలదా?
కోడలుగా మావయ్య ఆత్మను
అంతగా ఇబ్బంది పెడితే
ఆయన అభిమానుల గుండెలు ఆగితే
ఓదార్పుల నాటకాలు ఎవరు చేస్తారు?
అసలే ఓట్లకోసం ఇంటిల్ల పాదీ
పడరాని పాట్లు పడుతున్నారే!

www.chaakirevu.blogspot.com

జైల్లో పెళ్లి రోజు జరుపుకోడానికి ఏకాంత సేవ ఏర్పాట్లు చేయలేదనే ఏడుపు గొట్టు రాజకీయ లేఖలు ఎందుకో?

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణం! శుక్రవారం రాత్రి 9 గంటలు! చేనేత పరిరక్షణ సమితి నాయకులు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు సన్మానం చేశారు! చంద్రబాబు ప్రసంగించారు! పరిరక్షణ సమితి నాయకులు కిందకి దిగి వెళుతున్నారు! అదే సమయంలో, టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులు వేదికపైకి ఎక్కారు! అంతే.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అసలే అది చిన్న వేదిక. ఎక్కువమంది దానిపై ఎక్కడంతో నిట్టనిలువుగా పడిపోయింది.

దాంతో, చంద్రబాబు ఒక్కసారిగా కుడి వైపునకు కూలబడిపోయారు. వేదికపై ఉన్నవారు ఒకరిపై మరొకరు పడిపోగా.. చంద్రబాబుపైనా కొంతమంది పడిపోయారు. వేదిక కూలగానే, 'సార్‌ను చూసుకోండి.. సార్‌ను చూసుకోండి' అంటూ నాయకులు గన్‌మెన్‌లు ఒక్కసారిగా వేదిక వద్దకు పరుగెత్తారు. ఘటన జరిగిన వెంటనే తేరుకున్న బ్లాక్ క్యాట్ కమెండోలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబును పైకి లేపారు. సురక్షితంగా కిందకు తీసుకు వచ్చారు.

అనూహ్యంగా ఘటన జరగడంతో చంద్రబాబు సహా నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వేదికపై నుంచి కిందకు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. "దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' అని అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. దీంతో, పార్టీ కార్యకర్తలు బాణసంచా తీసుకువచ్చి కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బాబు యథావిధిగా పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.

ఒక కిలోమీటరు మేర పాదయాత్ర కొనసాగించారు. అయితే, వేదికతోపాటు చంద్రబాబు కూడా కుప్పకూలడం, ఆయనపై కొంతమంది పడిపోవడంతో ఆయన వెన్నెముకపై ఒత్తిడి పెరిగింది. కిలోమీటరు నడక కొనసాగించిన తర్వాత ఆ నొప్పి మరికాస్త ఎక్కువైంది. దీంతో, చంద్రబాబు పాదయాత్రను కొనసాగించలేకపోయారు. రాత్రి బసకు రెండు కిలోమీటర్లకు ముందే చంద్రబాబు పాదయాత్రను నిలిపి వేశారు. అక్కడే బస చేశారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యులను గద్వాలకు రప్పిస్తున్నారు. వారు వచ్చి చంద్రబాబును పరిశీలించనున్నారు.

వైద్యుల సలహా మేరకే పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పోకల మనోహర్, గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ రమాదేవి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు స్వల్పంగా గాయపడ్డారు.

"దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' -చంద్రబాబు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డికి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి సవాల్ విసిరారు. ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నట్లు మీ బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తారా అని భారతి అడుగుతున్నారని, తన భర్త జగన్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని తన బిడ్డలపై ఆమె ప్రమాణం చేసి చెప్పగలరా అని ఎదురు దాడి చేశారు.
జగన్‌కు చెందిన పలు కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో భారతి చెప్పాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ సోదరి షర్మిల ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచారని మండిపడ్డారు.

లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా ..


TV9 - Chandrababu naidu falls from stage during 25th day of Padayatra




TV9 - Chandrababu Naidu struggling with Back Pain



చంద్రబాబుకి తప్పిన ప్రమాదం...గద్వాలలో కుప్పకూలిన సభవేధిక...26.10.2012

Balakrishna Images in Pdayatra

25వ రోజు చంద్రబాబు పాదయాత్రలో నందమూరి బాలక్రిష్ణ పోటోలు...26.10.2012

64 Photos...Slideshow

25 వ రోజు చంద్రబాబు పాదయాత్ర పోటోలు..26.10.2012

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ వైఖరిని ఎప్పుడో తెలియజేశామని, తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బూడిదపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలను కలుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

ఎన్టీఆర్ కూడా త్వరలో చంద్రబాబు పాదయాత్రలో




టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొననున్నారని సమాచారం. కలిసి వెళ్లడం కాకుండా కాసేపు ఆయన చంద్రబాబుతో పాదయాత్ర చేసే అవకాశముంది. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు 12 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు. 

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో"వస్తున్నా మీకోసం" పాదయాత్రలో పాల్గొననున్నారని సమాచారం

రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం
వైఎస్ హయంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు
జగన్‌కు అధికారం కోసమే షర్మిల యాత్ర 

హైదరాబాద్, అక్టోబర్ 26 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని చెబుతున్నారని, అసలు రాజన్న రాజ్యం అంటే ఏమిటో తెలుసా? అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, గుండాల రాజ్యమని విమర్శించారు. రాజన్న రాజ్యం వస్తే రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని ఆగాథం చేసిందని ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. తన సోదరుడు జగన్ కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రజా సమస్యలు తెలుసుకుందామని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీద్దామనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. జగన్ గురించి చెబుతూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనే విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. వైయస్ జలయజ్ఞం పేరుతో కోట్లు దండుకొని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.

షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆమె అధికార పార్టీని వదిలి చంద్రబాబు నాయుడును విమర్శించడమేమిటని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారని కృష్ణమనాయుడు పేర్కొన్నారు.

చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ ములాఖత్ విషయంలో అధికారులు నిబంధనలను పాటించడం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జైల్లో జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నారన్నారు. అందుకే ఆర్డీఐ కింద సమాచారం కావాలని కోరామని, జైలు అధికారులు సమాచారం ఇవ్వకపోతే కోర్టును ఆశ్ర యిస్తామని యనమల హెచ్చరించారు. జగన్ జైలుకెళ్లినప్పటి నుండి అతనిని ఎంతమందిని కలిశారో సమాచారం ఇవ్వాలన్నారు.

షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు,అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారు. 26.10.2012

సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని బావమరిది బాలకృష్ణ కలుసుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయిలో బాబును కలిసి ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పేరుపై అక్కడి లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. బాబుకు సంఘీబావం తెలియచేసేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో పాదయాత్ర విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాలయ్య తెలిపారు. 

25వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు 12 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు.

చంద్రబాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ, 25వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును శుక్రవారం ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ కలవనున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన చంద్రబాబు బస చేసిన మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చేరుకోనున్నట్లు సమాచారం. అయితే, పాదయాత్రలో ఆయన పాల్గొంటారా..? లేదా అన్నది నిర్థారణ కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

నేటి పాదయాత్ర ఇలా: చంద్రబాబు గురువారం రాత్రి వరకు 452 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. శుక్రవారం బూడిదపాడు, పెద్దపల్లి ద్వారా గద్వాల చేరుకుంటారు. గద్వాలలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

నేడు బాబు వద్దకు బాలకృష్ణ

తాగునీటి కోసం ఎన్టీఆర్ సుజల
చంద్రబాబు ప్రకటన..
తిరుపతికి వెళ్లకుండానే గుండు
మధ్యతరగతి ఏం పాపం చేసింది?..
వాళ్లకెందుకు అదనపు సిలిండర్లు ఇవ్వరు?..
అధికారంలోకి వస్తే పది సిలిండర్లు ఇస్తాం..


టీడీపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 'ఎన్టీఆర్ సుజల' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

"నిత్యావసర ధరల పెరుగుదలతో జనం ఇప్పటికే సమస్యల సుడిలో చిక్కుకున్నారు. కేవలం దీపం లబ్ధిదారులకే అదనంగా మూడు సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. ఆ నిర్ణయంతో 25 శాతం మందికే లబ్ధి చేకూరుతుంది. మిగిలిన మధ్యతరగతి ప్రజలు ఏం పాపం చేశారు? వారికి ఎందుకు అదనపు సిలిండర్లు ఇవ్వరు? వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ కొనే స్థోమత మధ్యతరగతి ప్రజలకు ఉంటుందా? పార్టీ అధ్యక్షురాలు చెప్పినా.. సీఎం కిరణ్ పట్టించుకోవడం లేదు'' అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే, ఇప్పటి రేటుకే ఏడాదికి 10 సిలిండర్లు ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు.

బుధ, గురువారాల్లో అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలాల్లో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర కొనసాగింది. రెండురోజుల్లో 26.1 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వివిధ సభల్లో ఆయన మాట్లాడారు. "ఇప్పటికే నిత్యావసరాలను విపరీతంగా పెంచేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచేశారు. ఒకదాని తర్వాత మరొకటిగా పన్నులతో బాదేస్తున్నారు. గుండు కోసం తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేదు'' అని ఎద్దేవాచేశారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని, టీడీపీ అధికారంలోకి వస్తే, అన్ని వ్యాధులు కవరయ్యేలా కొత్త ఆరోగ్య శ్రీ పథకాన్ని చేపడతామని ప్రకటించారు.

ఇప్పుడు మీ వద్దకు వస్తున్నామని అంటున్న నాయకులు వైఎస్ ఉన్నప్పుడు ఎక్కడికెళ్లారంటూ జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. "ఇప్పటిదాకా మీరు పల్లకీలు మోశారు. ఇక పల్లకీ ఎక్కడం నేర్చుకోండి. మీలో ఐకమత్యం రావాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి'' అని చంద్రబాబు, సగర, బోయ కులస్తులకు పిలుపునిచ్చారు. తమను ఎస్టీల్లో చేర్చాలని వారు కోరగా తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయిజ - బింగిదొడ్డి మధ్య బాబును చూసేందుకు జయమ్మ అనే యువతి చేనులోంచి పరుగెత్తుకు రాగా, ఆమెవెంట ఆమె పెంచుకుంటున్న పొట్టేలు కూడా పరుగెత్తుతూ వచ్చింది.

ఇది చూసిన బాబు.. తన యజమానురాలు వెళ్తుంటే ఆమె వెన్నంటే వెళ్లిన పొట్టేలుకు ఉన్న విశ్వాసం కూడా కొంతమంది నాయకులకు లేకుండా పోయిందని, ఆయారాం.. గయారాంలు ఎక్కువయ్యారని పార్టీ నుంచి బయటకు వెళ్లినవారిని ఉద్దేశించి మండిపడ్డారు. ఇప్పుడు కనీసం ఇళ్లు అయినా కనిపిస్తున్నాయని, వైసీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పైకప్పులు కూడా ఉండబోవని అన్నారు. బింగిదొడ్డి వద్ద గురువారం మధ్యాహ్నం చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆర్టీసీ బస్సు అక్కడ నిలిచి ఉంది. దీంతో, "ఆర్టీసీ డ్రైవర్ గారూ.. నమస్కారం! అందరికీ చెప్పండి త్వరలోనే మంచి రోజులు వస్తాయని. ఆర్టీసీని మనమందరం కాపాడుకుందాం. ఉద్యోగులకు ప్రత్యేక విధానం కల్పిస్తాం. డ్రైవర్లు, కండక్టర్లకు న్యాయం చేస్తాం'' అని చెప్పారు.

అదే బస్సులోని ప్రయాణికులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తల్లీ నమస్కారం! తమ్ముళ్లు బాగుతున్నారా! అంటూ పలకరించారు. పాదయాత్రలో భాగంగా జిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న బాలికలతో ఆయన మాట్లాడారు. తనకు చదువుకోవాలని ఉందని, కానీ, ఆర్థిక ఇబ్బందులు సహకరించడం లేదని, తమకు తండ్రి లేడని, ముగ్గురమూ ఆడపిల్లలమేనని ఝాన్సీ అనే బాలిక చంద్రబాబుకు వివరించింది. చదివించేవారు లేక ఉన్నత చదువులు చదవలేకపోతున్నానని ఏడో తరగతి చదువుతున్న మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఆ ఇద్దరినీ తాను చదివిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

"ఇప్పటిదాకా మీరు పల్లకీలు మోశారు. ఇక పల్లకీ ఎక్కడం నేర్చుకోండి. మీలో ఐకమత్యం రావాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి''

October 25, 2012

24వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు (Part 2) 25.10.2012

  అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వేదపండితులు, పురోహితులకు గౌరవ వేతనం ఇస్తామని పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ ప్రయోజనం పొందని వర్గాలు, నిర్లక్ష్యానికి గురయిన వర్గాలు తెలుగుదేశం స్వర్ణ యుగం తేనుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పురోహింతులు, వేద పండితులకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
మరోసారి అగ్రవర్ణాల ప్రజల గురించి బాబు ప్రస్తావిస్తూ అగ్రవర్ణాల్లో అనేకమంది పేదలున్నారని, వారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు నోచుకోక మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆవేదన చెందారు. అందుకే అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రత్యేక చర్యలు తీసుకోనుందన్నారు. వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కేలా చూస్తానని అన్నారు.
చంద్రబాబు ‘ఎ ఉమెన్ ఇన్ బ్రహ్మణిజం’ సినిమాపై వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు ఉండరాదని, అది వారిపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపైన కూడా దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.

పురోహింతులు, వేద పండితులకు గౌరవ వేతనం,అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రత్యేక చర్యలు (24వ రోజు) 25.10.2012


 http://kommineni.info/articles/dailyarticles/content_20121025_11.php



తెలంగాణలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది.చంద్రబాబు కు రక్షణగా మాదిగ దండోరాకు చెందిన కార్యకర్తలు ఆయన పర్యటనలో ఉంటున్నారు.దీంతో ఎవరైనా నిరసన తెలియచేయాలన్నా వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని బావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు ఎలాంటి ఆటంకాలు లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి మాత్రం నాయకులలో ఐక్యత లేకపోవడం వల్లనే చంద్రబాబు పాదయాత్ర చేయగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే జెఎసి నేతలు చంద్రబాబుకు నిరసన చెప్పడానికి ప్రయత్నించి శాంతి నగర్ వద్ద అరెస్టు అయ్యారు.కాని నాగం జనార్దనరెడ్డి మాత్రం ఆ దరిదాపులకు వెళ్లలేదు. కాని ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు టిడిపి కార్యకర్తలతో పాటు తెలంగాణకు చెందిన మాదిగ దండోరా అండగా నిలబడింది. మాదిగల డిమాండుకు అనుకూలంగా వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయడంతో చంద్రబాబుకు వారు గట్టి మద్దతుదారులుగా మారారు.చంద్రబాబుకు నిరసన చెప్పడానికి వెళ్లిన కోదండరామ్ ప్రభృతులకు మాదిగ దండోరా కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడం విశేషం.   

చంద్రబాబుకు అండగా మాదిగ దండోరా కార్యకర్తలు! -కొమ్మినేని శ్రీనివాసరావు (చీఫ్ ఎడిటర్,ఎన్‌టివి)

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరోక్షంగా షర్మిళ పాదయాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్‌లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారే రోడ్డెక్కి మనకంటే పెద్దగా అరుస్తున్నారు తమ్ముళ్లూ అంటూ పరోక్షంగా షర్మిళ పాదయాత్రపై బాణాలు విసిరారు. అవినీతి,అక్రమాలను అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీని దీవించాలంటూ కోరారు.

 మహబూబ్ నగర్ జిల్లా వాసులను చూస్తుంటే చాలా బాధ వేస్తోందనీ, గుక్కెడు నీళ్లు లేక బిందె నీళ్లను రూ. 20 కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో డెంగ్యూ జ్వరం వచ్చి పసిపిల్లలు మంచానపడుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పనులు చేయకపోవడానికి కారణం ఒకటి ఉందనీ, అదే అవినీతి అన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు అంతా అవినీతిమంతులయిపోయారనీ, సొమ్మును కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే ప్రజలకు ఏమీ మిగల్చరని అన్నారు.

ఇక అవినీతి నాయకులను ఆదరించకూడదని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. మీ పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలన్నా, అభివృద్ధి బాటలో పయనించాలన్నా అవినీతిపరులకు ఎంతమాత్రం మద్దతు ఇవ్వకూడదని కోరారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడినవారే రోడ్డెక్కి మనకంటే పెద్దగా అరుస్తున్నారు--షర్మిళ పాదయాత్రపై బాణాలు




 ఎవరైనా జనాలపై ప్రభావం చూపగలిగే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నారనగానే.. వారి లోపాలు వెతకడం, వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పటడుగులు వేసుంటే వాటిని బయటికి తీయడం మామూలే. ఇప్పుడు షర్మిళ వంతు వచ్చింది. అన్న జగన్ జైల్లో ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు పాదయాత్ర చేస్తున్న షర్మిళకు సంబంధించిన కొన్ని లోగుట్టులు బయటపెట్టే పనిలో పడింది తెలుగుదేశం మహిళా నాయకురాలు శోభా హైమవతి.

 ఆమె షర్మిళ వ్యక్తిగత జీవితంలోని కొన్ని గుట్టుమట్టుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. షర్మిల మొదటి భర్త చంద్రప్రతాప్ రెడ్డి (విజయమ్మ చినతమ్ముడు, షర్మిళ మేనమామ) యాక్సిడెంట్ లో మరణించాడా, లేక ఎవరైనా హత్య చేశారా? అంటూ శోభా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పి ఆమె పాదయాత్ర చేపట్టాలని డిమాండ్ చేశఆరు. ఐతే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎందుకంటే చంద్రప్రతాప్ కు షర్మిళ విడాకులిచ్చాకే అనిల్ ను వివాహం చేసుకుంది. శోభ అనుమానాల సంగతి పక్కనబెడితే షర్మిళ వ్యక్తిగత జీవితం.. ముఖ్యంగా వైవాహిక జీవితం వివాదాస్పదం అన్నది వాస్తవం. చంద్రప్రతాప్ తో వివాహం షర్మిళ ఇష్టం లేకుండా జరిగిందని.. దీంతో ఆమె గొడవ చేసి విడాకులు తీసుకుందని పులివెందుల వాసులు చెబుతారు. తర్వాత షర్మిళ.. అనిల్ కుమార్ ను ప్రేమించడంతో అతని కుటుంబాన్ని భయపెట్టి, దారికి తెచ్చుకుని బలవంతంగా పెళ్లి చేశారని అంటారు. కడప జిల్లా వరకు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వైఎస్ కు కూతురంటే మొదటి నుంచి చాలా ఇష్టం. దీంతో తన హవా నడిచిన రోజుల్లో ఆమె ఇష్టాన్ని ఏరోజూ కాదనలేదంటారు. అనిల్ తో పెళ్లి చేయడంతో పాటు తర్వాత క్రైస్తవ మత ప్రభోదకుడిగా అతని ఎదుగుదల కోసం కేఏ పాల్ ను అణగదొక్కడం, అనిల్ కు విస్తృత ప్రచారం కల్పించడం.. బయ్యారం గనులతో పాటు మరికొన్ని కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి చర్యలు చేపట్టారు వైఎస్.

షర్మిల మొదటి భర్త చంద్రప్రతాప్ రెడ్డి (విజయమ్మ చినతమ్ముడు, షర్మిళ మేనమామ) యాక్సిడెంట్ లో మరణించాడా, లేక ఎవరైనా హత్య చేశారా? -శోభా హైమవతి