October 29, 2012

పేదలకు ఉచితంగా ఇల్లు, అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు 28వ రోజు పాదయాత్రలో చంద్రబాబు

పేదలకు ఉచితంగా ఇల్లు
అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు
సుజల పథకం ద్వారా తాగునీరు

 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదవారికి లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే పూర్తిగా బెల్టు షాపులు రద్దు చేస్తామని అన్నారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జిల్లాలోని సోమవారం థరూర్ మండలం, చినపాడు నుంచి 27 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి వేరు శెనగ, పత్తి పంటలను పరిశీలించిన బాబు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతరేపుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదరణ పథకం మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.

గ్రామాస్తులు తాగునీటి సమస్య గురించి ప్రస్తావించగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలు మరుగుదొడ్ల గురించి ప్రస్తావించగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు మక్తల్ నియోజక వర్గంలో ప్రవేశంచారు. అక్కడ చంద్రబాబుకు నేతలు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్దన తరలవచ్చి స్వాగతం పలికారు.
No comments :

No comments :