July 6, 2013

కోదండరాం తెలంగాణ ద్రోహి అని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ నేతలను తరమి కొడతానన్న కోదండారం నేడు తిండి కోసం కాంగ్రెస్ నేతల ఇంటికి వెళ్లారన్నారు. రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లో టీడీపీ పటిష్టంగా ఉంటుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

మరోవైపు కేసీఆర్‌పై మోత్కుపల్లి ధ్వజమెత్తారు. వెయ్యిమంది విద్యార్థులను కేసీఆర్ బలితీసుకున్నారన్నారు. కేసీఆర్ తీరుకు నిరసనగా చేపట్టిన వెయ్యి డబ్బులు...లక్ష చెప్పులు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని మోత్కుపల్లి కోరారు.

కోదండరాం తెలంగాణ ద్రోహి : ఎర్రబెల్లి

రంగారెడ్డి : టీడీపీలో వేధింపులకు చోటు లేదు అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. కొంపల్లిలో జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు ప్రసంగించారు. ప్రతి నేతను, కార్యకర్తను కాపాడుకునే సత్తా తమకు ఉందన్నారు. సమాజ అభివృద్ధి కోసం పాటు పడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కార్యకర్తలను కోరారు.

టీడీపీలో వేధింపులకు చోటు లేదు: బాబు

రంగారెడ్డి : కొంపల్లి ప్రాంతీయ సదస్సులో మాజీ మంత్రి డి. కె. సమరసింహారెడ్డి సైకిలెక్కారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సమరసింహారెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సమరసింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. సమరసింహారెడ్డి మంత్రి డీకే అరుణ బావ.

సైకిలెక్కిన డి.కె. సమరసింహారెడ్డి

రంగారెడ్డి : స్థానిక ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలు కైవసం చేసుకునే జిల్లాలు, నియోజకవర్గాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పంచాయతీలు దక్కించుకునే జిల్లాలు, నియోజకవర్గాలకు ఎంపీ నిధుల నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ ప్రోత్సాహం రూ. 10 లక్షలు, ద్వితీయ ప్రోత్సాహం రూ. 5 లక్షలు, తృతీయ ప్రోత్సాహం రూ. 2.50 లక్షలు ప్రకటించారు. నియోజకవర్గాల స్థాయిలో ప్రథమ ప్రోత్సాహం రూ. 12 లక్షలు, ద్వితీయ ప్రోత్సాహం రూ. 6 లక్షలు, తృతీయ ప్రోత్సాహం రూ. 3 లక్షలు ప్రకటించారు. ప్రోత్సాహకాలను నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించాలని బాబు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం సీట్లు సాధిస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు.

పంచాయతీల్లో గెలిస్తే ప్రోత్సహకాలు : బాబు

హైదరాబాద్ : జగన్ వంటి అవినీతి పరుణ్ని ఇతర దేశాల్లో ఉరి తీసే వారు అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అసమర్థతకు కిరణ్, అవినీతికి జగన్ నాయకులు అని తెలిపారు. టీడీపీ రైతు బజార్లు పెడితే.. కాంగ్రెస్ మందు బజార్లు తెచ్చింది అని విమర్శించారు. బెల్టు షాపులు నియంత్రించలేని కాంగ్రెస్‌ను బెల్టు తీసి కొట్టండి అని ప్రజలకు ఆయన సూచించారు.

జగన్‌ను ఉరితీసే వారు : రేవంత్‌రెడ్డి

 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కళంకిత మంత్రులను కేబినెట్‌లో పెట్టుకున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దండుకొని ఇంకొకాయన చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారని వైఎస్‌ జగన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం నాడిక్కడ నగర శివారులోని కొంపల్లి సమీపంలో టీడీపీ ప్రాతీయ సదస్సు జరగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయని ఆయన ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో తెలుగువారిని మానవతా దృక్పథంతో ఆదు కుంటే కాంగ్రెస్‌ నేతలు రాజ కీయం చేయా లని చూశారని బాబు వ్యాఖ్యానించారు. మనిషన్నాక మానవత్వం ఉండాలని, అది లేక పోతే మనిషే కాడని చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట ద్వారా కూడ డెహ్రాడూన్‌కు డాక్టర్ల బృందాన్ని పంపించి తెలుగువారికి వైద్య సేవలు అందజేశామన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ధరలు ఆకాశంలో..
నిత్యావస సరుకుల నియంత్రణ బాధ్యతనుండి ప్రభుత్వం వైదొలగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పప్పులు, కూరలు ఏవీ కొనలేని పరిస్థితిని కాంగ్రెస్‌ సర్కారుతీసుకువచ్చిందన్నా రు.కిలో టమాట 60 నుండి 70 రూపాయలకు చేరుకుందని, సామాన్యూడి కష్టాలు సర్కారుకు పట్టడం లేదన్నారు. 9 సంవత్సరాల్లో పెట్రోలు 31 సార్లు, డీజిల్‌ ధరలను 24 సార్లు పెంచిన ఘనత యూపీఏ సర్కారుకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తామని తాము చెబుతుంటే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని, వారేమో గంట కూడా కోత లేకుండా ఇవ్వడం లేదని బాబు నిప్పులు చెరిగారు. జలయజ్ఞం ధనయజ్ఞం అయిందని తాము చెబుతూనే వస్తున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదని, ఆఖరుకు కాగ్‌ కూడా సర్కారును కడిగేసిందని చంద్రబాబు అన్నారు. ఆ రోజు పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలు ఇచ్చి పల్లెలకు ప్రాధాన్యత ఇచ్చామని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేసిందని, కనీసం కుర్చీలు, బల్లలు కూడా లేవని పేర్కొన్నారు. పంచాయతీల్లో పాలన పడకేసిందని, రాష్ట్రంలో సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు రుణాల మాఫీ..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల ఉచిత కరెంట్‌, రైతుల ఋణాలను పూర్తిగా మీఫీ చేస్తాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధలోని కొంపల్లి ఎక్సలెన్సీ గార్డెన్‌లో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యచరణ ప్రణాళిక తెలుగుదేశంపార్టీ కార్యకర్తల ప్రాంతీయ సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. ఈ సభకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌, మోత్కుపల్లి నర్సింలు, పి. రాములు, ఎస్‌. జైపాల్‌యాదవ్‌, ఉమామాధవరెడ్డి, రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు చెందిన అధ్యక్షులు, తెదెపా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దెత్తున పాల్గొన్నారు.

పంచాయతీలో సైకిల్‌దే జోరు

చేతిలో పైసా,అధికారంలో లేకపోయినా
ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకున్నాం
టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
దక్షిణ తెలంగాణ సదస్సులో చంద్రబాబు


"ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు మన చేతిలో పైసా లేదు. మనం ప్రభుత్వంలో లేం. అయినా, ప్రభుత్వానికంటే బాగా చేశాం. అలాగే.. రైతు రుణ మాఫీ కూడా చేసి చూపిస్తాం. ఎలా చేస్తారంటూ ప్రశ్నలు వేస్తున్న పార్టీల నేతలు మనం ఎలా చేశామో చూసి లెంపలు వేసుకొనేలా చేస్తాం. చెప్పిన మాట.. చేసిన హామీ నుంచి వెనుదిరిగే సమస్యే లేదు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులలో భాగంగా దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాల పార్టీ ేతలతో శనివారం నగర శివార్లలోని కొంపల్లిలో ఎక్స్‌లెన్సీ గార్డెన్‌లో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వంద సార్లు.. వినకపోతే వెయ్యి సార్లైనా చెప్పి ప్రజలను మన దారిలోకి తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. "అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా తరపున ప్రచారం చేసిన కార్యకర్తలు ఇదే వ్యూహం అవలంబించారు. ప్రతి ఇంటికీ వెళ్లి నచ్చచెప్పారు. వినకపోతే పదిసార్లయినా కలిసి నచ్చచెప్పారు. మనం అదే పనిచేయాలి.'' అని వివరించారు. కాంగ్రెస్ పాలనలో దుస్థితిని, టీడీపీ ఇచ్చిన హామీలను పునరుద్ఘాటించారు. "మీకు అస్త్రాలు ఇవ్వడానికే ఈ సదస్సు. చెప్పిన మాట వినకపోతే అభిమన్యుడిలా చిక్కుకొనిపోతారు. చెప్పిన వ్యూహంతో వెళ్లండి. గెలిచి రండి'' అని హితబోధ చేశారు.

సహకార ఎన్నికల్లో టీడీపీకి దరిదాపుల్లో నిలవలేకపోయిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. "సహకార ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు, అధికారం అన్నీ విరజిమ్మి 12 వేల సొసైటీలు గెలుచుకొంది. అవేమీ లేకుండా మనం 8 వేలు గెలుచుకొన్నాం. టీఆర్ఎస్‌కు వచ్చింది 125, వైసీపీకి వచ్చింది 399. ప్రభుత్వంలోకి వచ్చేది వాళ్లా.. మనమా? మన గెలుపు పంచాయతీ ఎన్నికలతోనే మొదలవుతుంది. స్థానిక ఎన్నికల్లో దున్నేస్తాం. కాంగ్రెస్‌ను కనుమరుగు చేస్తాం'' అని చంద్రబాబు స్పష్టం చేశారు. నవంబర్‌లో పార్లమెంటు ఎన్నికలు వస్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చక్రం తిప్పేది మనమే
ఈసారి కేంద్రంలో వచ్చేది మూడో కూటమేనని, అక్కడ చక్రం తిప్పేది మనమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. "నాకు కోరికల్లేవు. నేను చూడని అధికారం లేదు. రెండుసార్లు సీఎంగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా చేశా. రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమే టీడీపీ గెలవాలని కోరుకొంటున్నాను'' అని చెప్పారు. కాంగ్రెస్‌లో మాజీ ముఖ్యమంత్రులెవరూ అసెంబ్లీ మొహం చూడలేదని, అధికారంలో లేకపోయినా తాను, ఎన్టీఆర్ మాత్రమే ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీలో కూర్చున్నామని వివరించారు. కాగా, ఉత్తరాఖండ్ మృతులకు, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రాంకు సదస్సు నివాళి అర్పించింది.

ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్ధం తన కిడ్డీ బ్యాంకును అందజేసిన నగర శివార్లలోని గుండ్ల పోచంపల్లికి చెందిన అస్మితారెడ్డి అనే బాలికను చంద్రబాబు అభినందించారు. మల్కాజిగిరికి చెందిన రాధాకృష్ణ యాదవ్ రూ.లక్ష, ఎల్బీ నగర్‌కు చెందిన రవి శంకర్, రవికుమార్, అనిల్ చౌదరి కలిసి రూ.50 వేలు విరాళంగా అందచేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వివేకానంద ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఐదు జిల్లాల పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.

రుణ మాఫీ చేసి చూపిస్తాం...........ఇతర పార్టీలు లెంపలేసుకొనేలా చేస్తాం

 వరంగల్ జిల్లా కాజీపేటలో ఆదివారం జరుగునున్న టీడీపీ ప్రాంతీయసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా ల నుంచి హాజరుకానున్న 20 వేల మందికిపైగా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సభావేదికకు దగ్గర్లోనే బాలవికాస అతిధిగృహంలో బస ఏర్పాటు చేశారు. సభ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. పంచాయతీ ఎన్నికలతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇప్పటివరకు టీడీపీ తన వంతుగా చేసిన కృషి తదితర అంశాలను ప్రజలకు మరింత స్పష్టంగా వివరించేందుకు అనుసరించాల్సిన విధానాలను కూ డా సమీక్షిస్తారు. ప్రత్యేక తెలంగాణపై టీడీపీ చేసిన తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలతో కూడిన కరపత్రాన్ని ప్రత్యేకంగా ముద్రించారు. సభలో ప్రతినిధులకు వాటిని పంపిణీ చేస్తారు. సభానంతరం చంద్రబాబు బాలవికాస సమావేశ మందిరంలో నాలుగు జిల్లాల పరిధిలోని శాసనసభా నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశాలను వరకు నిర్వహిం చనున్నట్లు తెలిసింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎడబోయిన బస్వారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితర నేతల బృందం శనివారం సాయంత్రం సభాప్రాంగణాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశా

నేడే టీడీపీ ప్రాంతీయ సభ

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే టీడీపీ ప్రాంతీయ సదస్సులో పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాంతీయ సదస్సుకు జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు వరంగల్ జిల్లాకు చంద్రబాబు

టీడీపీ ప్రాంతీయ సదస్సు నగరంలోని కొంపల్లి ఎక్స్‌లెన్సి గార్డెన్స్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు

హైదరాబాద్‌లో టీడీపీ ప్రాంతీయ సదస్సు...హాజరైన చంద్రబాబు

 టీడీపీ కార్యకర్తలకు నీతి, నిజాయితీలు ఉన్నాయని, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారంఉదయం నగరంలో జరుగుతున్న టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ అధికారం కోసం కొందరు నేతలు టీడీపీని వీడారని, ఒక్క కార్యకర్త కూడా టీడీపీని వీడలేదని ప్రసంసించారు.

మహానాడును మించి కొంపల్లి ప్రాంతీయ సదస్సు జరిగిందన్నారు. టీడీపీ కుటుంబసభ్యులు తన ప్రాణసమానులన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని మండిపడ్డారు. కార్యక్రమం ప్రారంభం ముందు ఉత్తరాఖండ్ వరదబాధితులను టీడీపీ సంతాపం ప్రకటించింది.

వరద బాధితులకు రూ.10 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదని, ప్రభుత్వం చేయలేని పని టీడీపీ చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ కార్యకర్తలకు నీతి, నిజాయితీలు ఉన్నాయి : చంద్రబాబు



రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కొంపెల్లిలో జరిగిన పార్టీ ప్రాంతీయస్థాయి సదస్సులో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఎన్నోసార్లు చెప్పామని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. కాగా, విధిలేని స్థితిలోనే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పెడుతోందని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మాత్రం కాదని విమర్శించారు.

తెలంగాణకు టీడీపీ వ్యతిరేకంకాదు: చంద్రబాబు

హైదరాబాద్‌ : టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఎన్నోసార్లు స్పష్టం చేశామని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఉన్న కేసులను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మబలిదానాలు చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణకోసం ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను టీడీపీ ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, వైకాపాలు కాంగ్రెస్‌లో చేరే పార్టీలేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారని బాబు చెప్పారు. శనివారం కొంపెల్లిలో జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు మాట్లాడారు.

తెలంగాణకు వ్యతిరేకం కాదు : చంద్రబాబు