October 17, 2012

ఉద్యోగులకు మేం వ్యతిరేకం కాదు
ఇళ్లు లేని రిటైర్డ్ ఉద్యోగులకు స్థలాలు
ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేక విధానం

రైతు రుణమాఫీపై తొలి సంతకం
రెండోది బెల్టుషాపుల రద్దుపైనే
ఆశీర్వదించండి.. అన్నగా అండగా ఉంటా
అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపడతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. రిటైరైన ఉద్యోగులలో.. ఇళ్లు లేనివారికి స్థలాలు మం జూరుచేసి, వారికి రాయితీతో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వాళ్లు ఆనందంగా ఉండటానికి కావల్సిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసలు ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని.. కొందరు వ్యక్తులు అలాంటి భావనను ఉద్యోగుల్లో ప్రేరేపించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

తమ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రతిభావంతులకు పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఉద్యోగ బదిలీలకు ఓ పద్ధతిని ప్రవేశ పెట్టింది కూడా తమ పార్టీయేనని ఆయన చెప్పారు. ఇక.. తమ పాలనలో ఆర్టీసీని పరిరక్షిస్తూ వచ్చామని, కాంగ్రెస్ ఆ సంస్థను దివాలా తీయించిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల కు ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తామన్నారు.

నేతన్నల కోసం జనతా వస్త్రాలు
రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం జనతా వస్త్రాలను ప్రవేశపెడతామని చంద్రబాబు హామీనిచ్చారు. వారికిచ్చిన రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ. 1.2 లక్షలతో చేనేత కార్మికులకు షెడ్డుతో కూడిన ఇళ్లు నిర్మిస్తామన్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకాన్ని రైతు రుణమాఫీ ఫైలుపై పెడతానని, రెండో సంతకం బెల్టుషాపుల రద్దు ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు.

చైతన్యం రావాలి.. మోసగాళ్లను తరమాలి
"మీరు కష్టాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసింది. మీరు బాధల్లో ఉంటే నేను హైదరాబాద్‌లో ఉండలేను. అందుకే మీ వద్దకు వచ్చాను. రైతులు, మహిళలు చేతివృత్తుల వారు.. ఇలా అన్ని వర్గాల ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో మీరు నన్ను అర్థం చేసుకోండి. మీరు నిండుమనసుతో ఆశీర్వదిస్తే మీ అన్నగా మీకు అండగా ఉంటాను'' అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు.

'వస్తున్నా.. మీ కోసం' అంటూ ఆయన చేపట్టిన పాదయాత్ర 16వ రోజు కర్నూలు జిల్లా ఆదోనికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని శ్రీనివాసభవన్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం రావాలని, మోసగాళ్లను అధికారం నుంచి తరమాలని ఆయన పిలుపునిచ్చారు. సభకు పోటెత్తిన జనాన్ని చూసి ఉద్వేగభరితులయ్యారు. పాదయాత్రలో తాను గమనించిన ప్రజల కష్టాలను వివరిస్తూ అడుగడుగునా ప్రజలకు ధైర్యం నూరిపోశారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కేరాఫ్ కుంభకోణం అయిందని ఆయన విమర్శించారు. వైఎస్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరణిస్తే.. ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఏకంగా సీఎం కుర్చీకి పోటీ పడటం విడ్డూరమన్నారు. ఏళ్ల తరబడి మోసం చేస్తూ రాష్ట్ర ఖజానాను గుల్లచేసిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలని.. ప్రశ్నించే తత్వం పెరగాలని చంద్రబాబు కోరారు. అలాంటప్పుడే ఈ రాజకీయ పరిస్థితులను మార్చగలమన్నారు. బుధవారం ఉదయం ఢణాపురం నుంచి ప్రారంభమైన చంద్రబాబు యాత్ర మంగళవారం కంటే మరింత ఉత్సాహంగా సాగింది.

రైతులకు రుణమాఫీపై హామీనిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడానికి ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో కొందరు రైతులు చంద్రబాబును కలిసి నాగలిని బహూకరించారు. అనంతరం ముందుకు సాగిన బాబు పొలాల్లో పంట కోస్తున్న రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. రజకుల వద్దకు వెళ్లి బట్టలు ఇస్త్రీ చేశారు. టైలర్లను పలకరించారు. కమ్మారెడ్డి బస్టాండ్ వద్ద అంగన్‌వాడీల గోడు విన్నారు. శ్రీనివాసభవన్ సర్కిల్ వద్ద దర్గాకు వెళ్లి ప్రార్థనలు జరిపారు.

కష్టమైనా.. నష్టమైనా పూర్తిచేస్తా
టెలికాన్ఫరెన్స్‌లో నేతలతో చంద్రబాబు

నా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు. చిన్న చిన్న అనారోగ్యా లు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి నాకుంది. అనుకున్న ప్రకారమే పాదయాత్ర పూర్తిచేస్తాను. సందేహం అవసరం లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా సరే... వెనుదిరిగేది లేదు' అని టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలకు స్ప ష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో తన ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చిన నేతలతో ఆయన ఇలా పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, రాష్ట్ర కమిటీ నేతలతో చంద్రబాబు బుధవారం కర్నూలు జిల్లా ఢణాపురం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన పాదయాత్ర జరుగుతున్న తీరును.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన ఈ సందర్భంగా నేతలకు వివరించారు. ఈనెల 20న మొదలుకానున్న 'గడపగడపకూ తెలుగుదేశం పార్టీ' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఉద్యోగులకు మేం వ్యతిరేకం కాదు.. (17వ రోజు)


నేటి దినపత్రికల్లో పాదయాత్ర..18.10.2012

 కర్నూలు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర గురువారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. గురువారం ఉదయం ఆదోని మండలం ఆరెకల్లు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై కొటేకల్ టర్నింగ్, బసాపురం, దేవిబెట్ట, కొటేకల్ స్టేజి మీదుగా కొనసాగుతుంది.

చెన్నాపురం 10వ కి.మీ రాయి వద్ద గొర్రెల కాపరులతో ముచ్చట్లు, బోడబండలో పంటపొలాల్లో రైతులతో సంభాషణ, గ్రామ సమస్యలు, మహిళలతో చర్చలు ఉంటాయి. అనంతరం నక్కలమిట్ట గ్రామంలో ప్రజలతో చర్చలు, బనవాసి ఫారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అనంతరం నలందా బీఈడీ కళాశాల దగ్గర వడ్డెర సంఘంతో కలయిక ఉంటుంది.

వెంకటగిరి, హనుమాపురం గ్రామస్థులతో, మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కళాశాల దగ్గర కళాశాల సమస్యలు, నిరుద్యోగ బీఈడీ అభ్యర్థులతో సమావేశం ఉంటుంది. ఆతర్వాత ఎమ్మిగనూరు పట్టణంలోకి ప్రవేశిస్తారు. శివథియేటర్ వద్ద, బస్టాండ్ వద్ద, సోమప్ప సర్కిల్ వద్ద, ప్రసంగిస్తారు. అనంతరం వివిశ వర్గాల వారు చంద్రబాబును సన్మానం చేస్తారు. రాత్రికి సమీరా రైస్‌మిల్లు చేరుకుని అక్కడ బస చేస్తారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్ 18.10.2012




వ్యవసాయం దండగన్నాడని
బతికినన్నాళ్ళూ ఆడిపోసుకొని
ఆ అబద్దాన్ని
వారసత్వంగా
ఇచ్చి పొతే
పదే పదే అదే అబద్దానికి
ప్రజలు పడతారని
భావిస్తున్న వంచనపరులకు
కనువిప్పుగా
గిట్టుబాటు కాని వ్యవసాయంతో పాటు
పిల్లలను బాగా చదివించండి అంటే
ఆ స్ఫూర్తితో ఎదిగిన రైతు బిడ్డలు
“బాబు స్ఫూర్తితో ఎదిగిన రైతు బిడ్డలం
బాబు తో నడవడమే మేము తీర్చుకోగలిగిన ఋణం”
అని వ్రాసిన బ్యానర్ పట్టుకొని
గుంతకల్ వీధుల్లో
నిన్న బాబు వెనక నడవడం
ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది
ఆగి చూసేలా చేసింది
అది చూసిన బాబు
వ్యక్తం చేసిన ఆనందం
అక్కడే వున్న నేను గమనించాను...

ఇక్కడ నుండి....(http://chaakirevu.wordpress.com/)

బాబు ఋణం తీర్చుకొంటున్న ఐ టి వాళ్ళు

ఎంఎ పాలిటిక్స్‌ చదివిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన విద్య, వాక్‌పటిమకు పరీక్షపెట్టుకున్నారు. పాదయాత్రల్లో భాగంగా ఆయన ఓసారి టీచర్‌ పాత్ర పోషించారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మహిళా సాధికారతపై విద్యార్థినులకు ఆసక్తికరంగా బోధించారు.  ఓ టీచర్‌ విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఎలా ఎదురు ప్రశ్నలు వేసి చెబుతుంటారో అదే తరహాలో బాబు వ్యవహరించారు. మహిళలు రోజువారీ పడతున్న బాధలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే జరుగుతున్న మార్పులపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు బాబు కృషి చేశారు. ప్రత్యేకించి మహిళలు స్వేచ్ఛగా ఎలా ఎదగాలో కళాశాల విద్యార్థినులే రోల్‌మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆకాంక్ష ఆయన చేసిన ప్రసంగాన్ని రక్తికట్టించింది. ఓ మాజీముఖ్యమంత్రి లెక్చరర్లతో సమానంగా బోధించటం మరిచిపోలేనిదని ఆ కళాశాల ప్రిన్పిపాల్‌ విజయారాణి వ్యాఖ్యానించారు. ఇది చారిత్రకఘట్టంగా విద్యార్థినుల మదిలో నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

రక్తి కడుతున్న బాబు ప్రసంగాలు...


ప్రెస్ నోట్ (Telugudesam party office)17.10.2012

ప్రభుత్వం చేతగాని తనంవల్లే విద్యుత్ సంక్షోభం
నిత్యావసర వస్తులు కొనే పరిస్థితి లేదు
కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆగని యాత్ర

  ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సర్కార్ పనితీరుపై మండిపడ్డారు. అధికారం కోసం పాకులాడే పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పేద, మద్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తులు కొనుక్కునే పరిస్థితిలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రకు కర్నూలు జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం నాటికి యాత్ర 16వ రోజుకు చేరుకుంది. అయితే కర్నూలు జిల్లాలో పాదయాత్ర నాల్గవరోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రం చంద్రబాబు ఆదోనికి చేరుకున్నారు. అక్కడ ప్రజలు చంద్రబాబుకు నీరాజనం పలికారు. నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్రడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలు చూశాక హైదరాబాద్ వెళ్లాలనిపించలేదని అన్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా పట్టుదల విడువదలచుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు వ్యతిరేకం కాదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అలాంటి భావనను కొందరు ఉద్యోగుల్లో ప్రేరేపించడం బాధాకరమన్నారు. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటానన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో ఇళ్లు లేని వారికి స్థలాలు మంజూరు చేసి రాయితీతో నిర్మిస్తామన్నారు. వారు ఆనందంగా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తమ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రతిభావంతులకు పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. ఉద్యోగ బదిలీలకు ఓ పద్ధతిని ప్రవేశ పెట్టింది తమ పార్టీనేనన్నారు.

తమ పాలనలో ఆర్టీసీని పరిరక్షిస్తూ వచ్చామని, కాంగ్రెస్ ఆ సంస్థను దివాలా తీసిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ పరిరక్షించాల్సిందిపోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడే డిపోలను అమ్మకాలకు పెట్టిందన్నారు.

మీ కోసం వస్తున్నా పాదయాత్రలో చంద్రబాబు కాలినడకకు జనం పోటెత్తారు. ఆదోని చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో శ్రీనివాసభవన్ సర్కిల్ వద్దకు జన ం పోగయ్యారు. చెట్లు, భవనాలు, బస్సులు, గోడలు ఇలా జనం తప్ప మరేమీ కనిపించలేదు. ఇసుకవేస్తే రాలనంత జనాన్ని చూసి కాలినొప్పితో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ఉత్సాహం రెట్టింపు అయింది. కాంగ్రెస్ పాలనలో నలుదిక్కుల ప్రజలు మార్పుకోసం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు అర్థం చేసుకొని తన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

ఆదోనిలో చంద్రబాబుకు నీరాజనం (16వ రోజు)17.10.2012


16వ రోజు ''వస్తున్నా మీకోసం'' పాదయాత్ర పోటోలు

Chandrababu assurance to people in Padayatra -tv9



Sri N.Chandrababu Naidu Padayatra at Adoni

 

Sri N.Chandrababu Naidu Padayatra at Kurnool district

 

16వ రోజు ''వస్తున్నా మీకోసం'' విడీయెలు

ఆయనకేం తక్కువ..
జనం కోసమే తిరుగుతున్నాడు పాపం
చంద్రబాబు యాత్రపై జనాభిప్రాయం

  "ఆయనకు ఏం తక్కువ? ఇంత తిరుగుతున్నాడు. జనానికి ఏదో చేద్దామని తిరుగుతున్నాడు పాపం'' ..ఇప్పటికి పదిహేను రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్రపై హుళేబీడు గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యాఖ్య ఇది. పాదయాత్ర ద్వారా చంద్రబాబు ప్రజల హృదయాల్లో తన ముద్రను ఎంతవరకు వేయగలుగుతున్నారు? ఆయన పర్యటన ప్రభావం ప్రజలపై ఏ మేరకు ఉంది? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశాలుగా మారిన ఈ ప్రశ్నలకు సమాధానమీ వ్యాఖ్య. రాజకీయంగా చూపే ప్రభావం సంగతి పక్కన పెడితే 63 సంవత్సరాల వయస్సులో శ్రమకోర్చి చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర చాలామంది సానుభూతిని పొందుతోంది.

గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు అనేక విషయాల గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ విద్యుత్తు, ధరల అంశాలపై మాట్లాడినప్పుడు ప్రజల నుంచి ఎక్కువగా స్పందన కనిపిస్తోంది. అంగెన్‌సాక గ్రామంలో చంద్రబాబుతో ఒక రైతు మాట్లాడుతూ.. "ఎరువులు కొనేందుకు పెళ్లాం చెవికమ్మలు తాకట్టుపెట్టాల్సి వస్తోంది. టీడీపీ ఉన్నప్పుడు ధరలు ఇంత లేవు'' అన్నప్పుడు ఆ గ్రామస్తులు పెద్దఎత్తున చప్పట్లు చరిచారు. మొత్తం మీద బాబు యాత్ర ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది. ---( ఆంధ్రజ్యోతి )

చంద్రబాబు యాత్రపై జనాభిప్రాయం

చంద్రబాబు చేస్తున్న "వస్తున్నా మీకోసం" పాదయాత్రకు సంఘీభావంగా న్యూజెర్సీ మరియు న్యూయర్క్ నగరలలోని తెలుగుదేశం అభిమానులు మెగా కార్ ర్యాలీతో  హైలాండ్ పార్క్ లో సంఘీబావ సధస్సు నిర్వహించారు..




A car rally was a part of the 'Sangheebhaava Sadhassu' in support of Telugu Desam President Nara Chandra Babu Naidu's on going marathon paadayathra--''Vasthunna MeeKosam''. Mohan Krishna Mannava organized the meeting in which 70 cars were rallied and around 400 people participated in New Jersey.

న్యూజెర్సీలో పాదయాత్రకు సంఘీభావం

ధర్మ యుద్ధం
మాఫీపై తొలి సంతకం
బెల్టుషాపుల రద్దుపై మలి సంతకం
అధికారంపై ఆశ లేదు
మీ కష్టాలు చూడలేకే పాదయాత్ర
పంట నష్టపరిహారం రూ.10 వేలకు పెంచుతా
ఉపాధి కూలీలకు రోజుకు రూ.200

"తెలుగుదేశం అధికారంలోకి వస్తే, మొదటి సంతకం రైతులు రుణ మాఫీపైనే. రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై చేస్తాం'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. "ఒకే కుటుంబం నుంచి ఎన్టీ రామారావు, నేను అనేక ఏళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగాం. ఏనాడైనా మేం పేపర్ కానీ, టీవీ చానల్ కానీ పెట్టామా? ప్రజల డబ్బును కాపాడాలనే మేం చూశాం. కానీ, వైఎస్ ముఖ్యమంత్రి కాగానే ఆయన కుమారుడు ప్రజల డబ్బుతో పేపర్, చానల్ పెట్టారు. అందుకే ఇది నీతికీ-అవినీతికీ.. ధర్మానికీ-అధర్మానికీ మధ్య జరుగుతున్న పోరాటం'' అని పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మంగళవారం ఆయన తన 15వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడి వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్రంలో మాదిగలు, ఉప కులాలకు పూర్వ వైభవాన్ని తెస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా పొలాల్లోకి వెళ్లి రైతులు, రైతు కూలీలతో ముచ్చటించారు. దుక్కి దున్నారు. పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. టైలరింగ్ షాపులోకి వెళ్లి దుస్తులు కుట్టారు. కాసేపు ఎడ్లబండి తోలారు.

మంగళవారం 17.5 కిలోమీటర్లు నడిచారు. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, "ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో చక్రం తిప్పినవాడిని. ఆనాడు ప్రధానమంత్రి పదవికి, రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపికలోనూ చక్రం తిప్పినవాడిని. అసలు నన్నే ప్రధానిగా ఉండమని పలువురు కోరారు. అయినా సీఎం పదవి చాలన్నాను. మళ్లీ నాకు అధికారం మీద ఆశ లేదు. కానీ, ప్రస్తుతం మీరు పడుతున్న కష్టాలను చూడలేక మీకు ఏదైనా చేయాలన్న తపనతో.. మీ ముందుకు వచ్చానే తప్ప మరొకటి కాదు'' అని స్పష్టంచేశారు.

కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తోందన్నారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.2500 పరిహారాన్ని రూ.10 వేలకు పెంచుతా. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఉపాధి కూలీగా రూ.200 అందేలా చేస్తాం. అటు కూలీలు ఇటు రైతులు బాగుపడేలా చేస్తాం'' అని హామీలు గుప్పించారు.

తాము అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత కరెంట్‌ను నిరంతరాయంగా ఇస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అగ్రవర్ణ పేదలకు ఉచిత విద్య అందించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. పంటలు లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగి రైతులు కష్టాల్లో కూరుకు పోయారని, వారి కళ్లల్లో వెలుగు చూసే దాకా విశ్రమించనని చెప్పారు.

తాజాగా మైనారిటీ కార్పొరేషన్‌లో రూ.150 కోట్ల అవినీతి బయట పడటం ప్రభుత్వ దుస్థితికి అద్దం పడుతోందన్నారు. కర్నూలు జిల్లాలో ఎవరిని పలకరించినా కన్నీళ్లు రాలాయే తప్ప వారి ముఖాల్లో సంతోషం కనిపించడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు చూస్తుంటే రాత్రుళ్లు నిద్ర రావడం లేదన్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్
ఆదోని, అక్టోబర్ 16: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ధనాపురం నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడినుంచి పాదయాత్రగా.. కల్లుబావి ప్రాంతం చేరుకొని చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఫ్లై ఓవర్ మీదుగా శ్రీనివాసభవన్ కూడలికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.

అక్కణ్నుంచి ఎం.ఎం. రోడ్డు మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఎమ్మిగనూరు సర్కిల్, బండిమెట్ట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. బైచిగేరి గ్రామం క్రాస్ చేరుకొని ఆరేకల్లు సభలో ప్రసంగిస్తారు. గురుకుల పాఠశాలలో రాత్రి బస చేస్తారు.

300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
హైదరాబాద్: చంద్రబాబు పాదయాత్ర మంగళవారం నాటికి 300 కిలోమీటర్లు పూర్తయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనపురంలో ఆయన పాదయాత్రను 301.2 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు.

" రైతులు రుణ మాఫీ" పాదయాత్రలో చంద్రబాబు 15వ రోజు