February 21, 2013


తెలుగుదేశం సొసైటీ అధ్యక్షులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడలో ఉన్న సొసై టీ అధ్యక్షులతో బాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. క్యాంప్ నిర్వహణ, ఇతర ఏర్పాట్లను తాళ్లూరు సొసైటీ అధ్యక్షుడు బుజ్జి చంద్రబాబుకు వివరించారు. తా డికొండ, వినుకొండ ప్రాంతాల నుంచి సొసైటీ అధ్యక్షులు రాలేదన్నారు. క్యాం ప్ నిర్వహణపై నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నట్లు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కొనసాగుతున్న క్యాంప్ పై చంద్రబాబు జిల్లా అధ్యక్షుడు పుల్లారావుతో చర్చించారు.

రేపు చంద్రబాబుతో సొసైటీ అధ్యక్షుల ముఖాముఖి

విజయవాడ క్యాంప్‌లో ఉన్న సొసై టీ అధ్యక్షులను శుక్రవారం ఉదయం 11 గంటల లోపు పాదయాత్రలో ఉన్న తన వద్దకు తీసుకురావాలన్నారు. అధ్యక్షులతో చర్చించి క్యాంప్‌ను ఏవిధంగా కొనసాగించాలో నిర్ణయిస్తారు. సొసైటీ అధ్యక్షులందరినీ నేరుగా చంద్రబాబు వద్దకు హాజరయ్యేవిధంగా ఏర్పాటు చేయాలని పుల్లారావుకు సూచించారు. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగిలిన ప్రాంతాల సొసైటీల అధ్యక్షులు బుధవారం రాత్రి విజయవాడ క్యాంప్‌కు వెళ్లారు.

క్యాంప్‌ను పరిశీలించిన కోడెల, ధూళిపాళ్ల, ఆలపాటి

విజయవాడలోని అలంకార్ అతిధి గృహంలో ఉన్న సొసైటీ అధ్యక్షులను, క్యాంప్‌ను మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌లు బుధవారం పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ఆపార్టీ సీనియర్ నాయకుడు ఇక్కుర్తి సాంబశివరావు, మళ్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ సీతారామయ్య తదితరులు క్యాంప్‌లోనే ఉన్నారు.

మంత్రి కాసుతో భేటి అయిన కొమ్మినేని అనుచరులు
సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డితో డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తోన్న కొమ్మినేని రామచంద్రరావు, ఆయన అనుచరులు భేటి అయ్యారు. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం కొమ్మినేని, నరుకుళ్లపాడు సొసైటీ అధ్యక్షుడు హరిబాబు, మాజీ ఎంపీపీ బండ్ల పున్నారావు, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, యార్డు చైర్మన్ యం వేదాద్రి తదితరులు మంత్రి కాసుతో విడివిడిగా భేటి అయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల తేదిని ఇంకా ఖరారు చేయలేదని మంత్రి కాసు తెలిపారు. ఈ దశలో అభ్యర్దుల ఎంపికపై అపుడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆప్‌కాబ్, మార్క్‌ఫెడ్, ఆప్కో ఎన్నికలు పూర్తయ్యే వరకు గుంటూరు డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

అంతుచిక్కని వైఎస్సార్ సీపీ వ్యూహం

డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యూహం అంతుచిక్కడం లేదు. ఏ పార్టీతో పొత్తు లేదని జిల్లా కన్వీనర్ రాజశేఖర్ ప్రకటించారు. ఇప్పటివరకు టీడీపీ, కాంగ్రెస్‌లతో పోరాడి డీసీఎంఎస్ కోసం చేతులు కలపడం మంచిది కాదనే భావన ఉంది. త్వరలో మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.

ప్రత్తిపాడు, మాచర్ల స్థానాలను భారీ మెజారిటీతో గెలిచిన తన పార్టీ కాంగ్రెస్, టీడీపీలతో చేతులు కలిపేది లేదంటున్నారు. ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని చెబుతున్నారు. అయి తే ఈ నిర్ణయంపై ఎంతమంది కట్టుబడి ఉంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఆ పార్టీ బాయ్‌కాట్ చేసినా, విడిగా పోటీ చేసినా టీడీపీ సునాయాసంగా గెలుస్తుంది. టీడీపీని గెలిపించడం వైఎస్సార్ సీపీకి మింగుడుపడని అంశంగా ఉంది. మొత్తంమీద వైఎస్సార్ సీపీ వ్యవహారం అంతుచిక్కడం లేదు....

'దేశం' సొసైటీ ఆధ్యక్షులతో చంద్రబాబు సెట్ కాన్ఫరెన్స్


చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర జిల్లాలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో భాగంగా జిల్లాలో ఈ నెల 6వ తేదీన తొలి అడుగు పెట్టిన చంద్రబాబు 19వ తేదీ సాయం త్రం 4 గంటలకు 100కె వాక్ పూర్తి చేశారు. ఇప్పటివరకు 7 నియోజకవర్గాలు, 9 మండలాలు, 3 మున్సిపాలిటీలు, గుంటూరు కార్పోరేషన్, 32 డివిజన్‌లు, 95 గ్రామాలలో చంద్రబాబు పాదయాత్ర సాగింది. జిల్లాలో 13 రోజుల పాదయాత్ర పూర్తయింది. ప్రజలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలి 'అన్న' లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది.

పాదయాత్ర పొడవునా బారులు తీరిన ప్రజల ను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి అభయమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకటిన్నర రోజు విరామం మినహా అలుపెరగని బాటసారిలా యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లాలో పాదయాత్రలో ఐదవ రోజు వైద్యుల సలహా మేరకు గుంటూరులో ఒక రోజు విరామం ప్రకటించారు. ఆ సమయంలో నూ తీరిక లేకుండా జిల్లా పార్టీ నాయకులతో, సహకార ఎన్నికలలో గెలిచిన అధ్యక్షులతో సమీక్షలు నిర్వహించారు. పాదయాత్రలో తొమ్మిదవ రోజు కొలకలూరులో కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేదిక కూలడంతో కాలునొప్పి వలన వైద్యుల సలహా మేరకే ఒక పూట విశ్రాంతి తీసుకున్నారు. మహిళల అడుగడుగునా హారతులు, నీరాజనాలతో చంద్రబాబు పర్యటనకు ఊహకందనంత స్పందన లభిస్తోంది. తొలుత జిల్లాలో వారం రోజులు పర్యటన ఉంటుందని ప్రణాళిక తయారు చేశారు. కానీ మూడు వారాలకు కూడా పూర్తి కాకపోవడం ప్రజాస్పందనకు నిదర్శనం. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యా త్రలో పాల్గొనడం వలన యాత్ర నెమ్మదిగా సాగుతోంది. వయ స్సు, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబునాయుడు ఊహించని జన స్పందనతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో వస్తున్న వివిధ సమస్యలపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులకు స్వయం గా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వతేదీ సా యంత్రం 4 గంటల వరకు తాత్కాలిక విరా మం ప్రకటించారు. ప్రతి గ్రామంలో స్థానికులు, మహిళలు, యువకులు, చిన్నారులు, విద్యార్థ్ధినులు, వృద్ధులు చంద్రబాబుకు అధిక సంఖ్య లో ఘన స్వాగతం పలుకుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, రోడ్లు, రవాణా, వైద్యం, గిట్టుబాటు ధరలు, విద్యుత్ కోతలు, సర్‌చార్జీలు, వంటగ్యాస్, రుణాలు, ఉపాధి అవకాశాలు, నిత్యావసర సరుకుల ధరల పెంపు తదితర అసౌకర్యాలపై ప్రజలు చంద్రబాబుకు ఏకరువు పెట్టారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. వేమూరు నియోజక వర్గం పూర్తి చేసుకొని రేపల్లె నియోజకవర్గంలో బాబు పర్యటించాల్సివుంది. రేపల్లె నియోజకవర్గంలోనూ బాబు పాదయాత్రకై నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విధంగా యాత్ర సాగుతుంటే మరో వారం రోజులు చంద్రబాబు జిల్లాలో ఉండే అవకాశం ఉంది.

ప్రజల్లో ఆత్మస్థైర్యం

నింపేందుకే పాదయాత్ర

జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి


ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూ స్తుంటే చంద్రబాబుకు గుండె తరుక్కుపోతుందని జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమస్యల్లో ఉన్న ప్రజల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకే చంద్రబాబు పాదయాత్ర చేస్తోన్నారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న టీడీపీకి ప్రజలు అండదండలు అందిస్తున్నారన్నారు.

100 కి.మీ పూర్తి


 'వస్తున్నా మీ కోసం' పేరుతో చంద్రబా బు చేపట్టిన పాదయాత్రలో పాదచారులకు భోజన వసతులు చూడటంలో ఎ లాంటి ఇబ్బందు లూ లేకుండా చూ స్తుంది 'రంగనాథ్' బృందం. హైదరాబాద్‌కు చెందిన రంగనాథ్ వంటలు తయారు చేయడంలో దిట్ట. చంద్రబాబు పాదయాత్ర చేపట్టడానికి ముందు తెలుగుదేశం నాయకులు రంగనాథ్‌ను కలసి యాత్ర వివరా లు అందించి భోజన వసతి చూ డాల్సిందిగా కోరా రు. దీనికి అంగీకరించిన ఆయన పాదయాత్ర ఆరంభం నుంచి పార్టీ శ్రేణులకు పాదయాత్రలో భోజన వసతి చూస్తున్నారు. ఆరంభం నుండి నేటి వ రకు 138వ రోజు వరకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చే స్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు.

ఉదయం మూడు రకాల అల్పాహారం

చంద్రబాబు పాదయాత్రలో పాల్గొనే కాన్వాయ్ సిబ్బందికి, ద్వితీయ శ్రేణి నాయకులకు, బాబును ఆరంభం నుంచి అనుసరిస్తున్న వారికి, భద్రతా సిబ్బందికి, పాత్రికేయులకు ఉదయం మూడు రకాల అల్పాహారా లు అందిస్తున్నారు. వేడివేడిగా ఇడ్లీ సాంబారు, దోశ, పుల్కా లేదా చపాతి, లేదా ఉప్మాలను అందిస్తున్నారు.

పౌష్టికాహారంతో కూడిన భోజనం

పాదయాత్రలో వీరంతా ఉల్లాసంగా పాల్గొనేందుకు, శరీరంలో పౌష్టికాహార నిల్వలు తగ్గకుండా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయానికి భోజనం ప్యాక్ చేసి వారివారి వాహనాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. భోజనంలో ఒక గుడ్డు, అరటికాయ, పెరు గు, రెండు రకాల కూరలు, పప్పుతో పాటు ఓ పచ్చడి అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర ర్రాష్టాలకు చెందిన భద్రతా సిబ్బందికి, ఇతర కాన్వాయ్ సిబ్బందికి వారివారి ప్రాంతాలను బట్టి ఆహారం సమకూరుస్తున్నారు. సాయంత్రం అల్పాహారంగా బిస్కెట్లు, టీ అందిస్తున్నారు. ఇక రాత్రికి భోజనం మధ్నాహ్నం మాదిరే అందిస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి సమయంలో మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన నాన్‌వెజ్‌ను అందిస్తున్నారు.

నిత్యం 500 మందికి

రంగనాథ్ బృందం బాబు పాదయాత్రలో పాల్గొనే సుమారు 500 మందికి నిత్యం భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. సమన్వయకర్త రషీద్ ఈ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 35 మంది నిత్యం ఈ పనిలో తలమునకలై ఉంటున్నారు. వీరిలోనూ నిరంజన్, ప్రకాశ్, ఆనం ద్, నాగు, శ్రీను, శివ, రెడ్డి, అశోక్, నాగబాబు, నాయుడు, సాయిలు అందరికీ తలలో నాలుకలా మెదులుతూ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు.

పాదయాత్రలో దాహార్తిని తీరుస్తూ...


చంద్రబాబు పాదయాత్రకు సామ రంగారెడ్డి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. యాత్ర ఆరంభం నుంచి బాబు వెన్నంట రంగారెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్లు ఉంటూ పాదయాత్రలో పాల్గొనే వారికి ఉచితంగా మినరల్ వాటర్ బాటిల్స్ అందిస్తూ ముందుకు సాగుతున్నారు. యాత్ర ఆరంభం నుంచి ఇప్పటి వరకు రోజుకు 300 బాటిల్స్ అందిస్తూ వస్తున్నారు. యాత్రలో పాల్గొనే నాయకులకు, భద్రతా సిబ్బందికి, కాన్వాయ్ సిబ్బందికీ మినరల్ వాటర్ అందిస్తున్నారు. అదే విధంగా వంట ఏర్పాట్లకు అవసరమయ్యే మంచి నీరు ఉచితంగా అందిస్తున్నారు. వీటిని అందించేందుకు ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రంగారెడ్డి ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. వీరందరినీ వంశీ కో ఆర్డినేటర్‌గా వ్యవహిరిస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. ఈ బృందంలో శ్రీరాం, నాగరాజు, గిరి, నరేష్ తదితరులు పాల్గొంటున్నారు.

పాదచారుల కోసం పాకశాల

రెండు వారాల క్రితం వరకు అవినీతి గురించి ఎవరైనా నోరు విప్పితే 'ఆ... ఎవరు అవినీతికి పాల్పడలేదు. మా డబ్బులేమి దోచుకోలేదు కదా' వంటి మాటలే వినిపించేవి. అలాంటిది నేడు అవినీతిపై పట్టణాల్లోనే కాకుండా పల్లెలు, దళితవాడల్లోనూ కాస్తంత చర్చ ప్రారంభమయ్యేలా చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. గత 15 రోజులుగా అలుపెరగకుండా అవినీతిపై ఆయన అతిసామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేస్తోన్న ప్రసంగాలు, చెబుతోన్న పొడుపు కథలు ప్రజల్లో కదలిక తీసుకొచ్చే దిశగా కొనసాగుతోన్నాయి.

వైఎస్ రూ. లక్ష కోట్లు జగన్‌కు దోచి పెట్టాడని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సహజంగా లక్ష, కోటి అన్న మాటలు వినడమే తప్పా పల్లెల్లో ఉండే ప్రజలకు వాటిని చూసిన దాఖలాలు ఉండవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విడమరిచి రూ. లక్ష కోట్లు ఎలా ఉంటాయో చెబుతున్నారు. రూ. 100 నోట్ల కట్ట ఒకటి రూ. 10 వేలు. అలాంటి కట్టలు 500 ఒక గోనెసంచిలో పేర్చితే దాని విలువ రూ. 50 లక్షలు. ఒక్కో లారీకి 200 గోనెసంచుల డబ్బులు పేర్చితే దాని విలువ రూ. వెయ్యి కోట్లు. అలాంటి వెయ్యి లారీల నిండా ఉన్న డబ్బును ఒక్క జగన్ దోచేశాడని చెబుతూ డబ్బు విలువను ప్రజలకు తెలియజేస్తున్నారు.

అవినీతి వలన దాని ప్రభావం అంతా ప్రజల పైనే పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఉప్పు మొదలుకొని అన్ని నిత్యవసర సరుకులపై ప్రజలు తెలియకుండానే 13 శాతం పైగా పన్ను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి ప్రజల సంక్షేమానికి వినియోగించాలి. అయితే పాలకు లు తమ జేబులు నింపుకొంటున్నారంటూ చైతన్యం నింపుతున్నారు. అవినీతి కారణంగా ఇప్పటివరకు స్వాహా అయిన సొమ్ము తిరిగి రాబడితే వంట గ్యాస్ ధర పెంచాల్సిన అవసరం ఉండదు, రుణమాఫీ అమలు చేయవచ్చని చెబుతున్నారు.

అవినీతిపై తాను చెబుతోన్న మాటలను కుటుంబ సభ్యుల మధ్యన చర్చించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా స్నేహితుల మధ్యన చర్చ జరిపి తాను చెప్పేది వాస్తవమైతే సంఘీభావం తెలపాలని, లేకుంటే మీ ఇష్టమని చెబుతున్నారు. అంతేకాకుండా తన పాదయాత్ర ప్రస్థానంలో అవినీతికి వ్యతిరేకంగా నిలిచి స్ఫూర్తి కలిగించిన వ్యక్తుల అనుభవాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో ఒక ఆట్రోడైవర్‌ను జగన్‌కు అనుకూలంగా సంతకం పెట్టమని వైసీపీ నాయకులు బెదిరించినా ఆ వ్యక్తి బెదిరిపోకుండా... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి... రూ. లక్ష కోట్లు జగన్ దోచాడని అవినీతికి వ్యతిరేకంగా నిలబడిన సంఘటనను ప్రజలకు విశ్లేషిస్తున్నారు.

అవినీతికి, నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలకు సంబంధం ఉందంటూ చంద్రబాబు చేస్తోన్న ప్రసంగాలు క్రమక్రమంగా ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. బియ్యం ధర రూ. 50కి చేరుకోవడం, వంట గ్యాస్‌పై ఆంక్షలు రావడం, విద్యుత్ చార్జీలు రెట్టింపు కావడం వంటివి అవినీతి వలనే పెరిగాయన్న విషయాన్ని గ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలు, నేడు అమలౌతోన్న ధరలు, అప్పటి వేతనాలు, ఇప్పటి వేతనాల మధ్యన ప్రజలు బేరీజు వేసుకోవడం ప్రారంభించారు. అప్పటికి, ఇప్పటికి సంపాదన 10 శాతం పెరిగితే సరుకుల ధరలు 200 నుంచి 300 శాతం పెరిగాయన్న విషయాన్ని చంద్రబాబు ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తున్నారు.

అవినీతి అందరికీ తెలిసేలా..

'తల్లి ఏనుగు రోజూ మేసేస్తోంది. మరోపక్క పిల్ల ఏనుగు రూ. లక్ష కోట్లు తిని బాగా బలిసిపోయింది. మదమెక్కిన ఈ రెండు ఏనుగులపై నేను పోరాడుతున్నానని' కాంగ్రెస్‌ను తల్లి ఏనుగుతో, వైసీపీని పిల్ల ఏనుగుతో పోల్చుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీ, ధర్మం వైపున నిలబడుతూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గాడి తప్పిన ర్రాష్టాన్ని నిలబెడతానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

వేమూరు నియోజకవర్గంలోని జంపని శివారు నుంచి మంగళవారం జిల్లాలో 13వ రోజు పాదయాత్రను చంద్రబాబు కొనసాగించారు. చంపాడ సెంటర్‌లో చంద్రబాబు రాకకోసం గంటల తరబడి వేచి చూసిన ప్రజలు తమ గ్రామానికి రావాలంటూ పట్టుబట్టారు. చంద్రబాబు వారిని సున్నితంగా వారిస్తూ 'తమ్ముళ్ళూ... నేను బస్సు యాత్ర చేయడం లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాదయాత్రతో వస్తున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. చంపాడకు మరోసారి వస్తానని హామీ ఇచ్చి ప్రసంగించారు. చంపాడులో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది ఏమి లేదన్నారు. ప్రజలంతా రోడ్డు మీదకు వచ్చి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

పిల్ల కాంగ్రెస్ వాళ్లు తొలుత మంచివాళ్లను తమ వెంట తీసుకెళ్లి వారు నేరాలు చేసి అందులో ఇరికిస్తారు. ఆ తర్వాత మంచివాళ్లను కూడా నేరాలు చేయాల్సిందిగా ఉసిగొల్పుతారని చెప్పారు. ఆ పార్టీపై దయ తలిస్తే రేపటి రోజున మిమ్మల్ని దయ తలిచే వారుండరని స్పష్టం చేవారు.

చంపాడ సెంటర్‌లో ప్రసంగం ముగించిన అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొన్న చంద్రబాబు అక్కడి నుంచి వేమూరుకు నడక సాగించారు. మార్గమధ్యలో పొలం పనులు చేస్తున్న కూలీలతో సంభాషించారు. ఆర్‌టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో 'ఏవమ్మా... బాగున్నారా...' అంటూ పలకరించి వారి కష్టాలను తెలుసుకొన్నారు. చంద్రబాబుకు అడుగడుగునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు. వేమూరుకు సమీపంలో మధ్యాహ్న భోజనానికి కాసేపు ఆగిన చంద్రబాబు తిరిగి పాదయాత్రను కొనసాగించారు.

వేమూరు మండల కేంద్రానికి చంద్రబాబు చేరుకోగానే వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు పైకి వచ్చి స్వాగతం పలికి ఆయన వెంట అడుగులు వేశారు. ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద జరిగిన సభలో చంద్రబాబుకు స్వర సమస్య తలెత్తింది. అతికష్టం మీద గొంతును సవరించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొసలి, కోతి పొడుపు కథతో చైతన్యం నింపిన బాబు సముద్రం వద్ద ఒక మొసలి ఉంటుంది. అది ఏమి తింటుందోనని రోజూ ఒక కోతి పండ్లు తెచ్చి ఇస్తుంది. ఆ మొసలికి ఒక భార్య ఉంటుంది. ఆ భార్య కోతి ఇచ్చిన పండే ఇంత తియ్యగా ఉంటే దాని గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో అని చెప్పి కోతి గుండె కావాలని కోరుతుంది. కోతికి సముద్రంలో విహరించాలన్న కోరిక ఉంటుంది.

దాంతో మగ మొసలి తన మీదకు ఎక్కితే సముద్రం అంతా తిప్పుతానని చెప్పి కోతిని ఎక్కించుకొని మధ్యలోకి తీసుకెళుతుంది. అప్పుడు నీ గుండె కావాలని చెబుతుంది. తెలివిగల వానరం తాను గుండెను చెట్టు మీద పెట్టి వచ్చానని ఒడ్డుకు తీసుకెళితే తెచ్చి ఇస్తానని చెబుతుంది. అది నమ్మిన మొసలి ఒడ్డుకు తీసుకెళ్ళగానే కోతి ఒక్క ఉదుటున దూకి చెట్టు ఎక్కి దుష్టుడా నీపై నేను దయతలిచి తినడానికి పండ్లు ఇస్తే నన్నే భోంచేయాలని చూస్తావా అంటూ దుష్టులతో ఎప్పుడూ సావాసం చేయకూడదని నిర్ణయించుకొంటుంది. పిల్ల కాంగ్రెస్ కూడా మొసలి లాంటిదేనని, దానిపై దయ తలిస్తే అది మిమ్మల్ని మింగేస్తుందని వైసీపీ నుద్దేశించి చంద్రబాబు పొడుపు కథ రూపంలో అందరికి అర్థమయ్యేలా వివరించారు.

వేమూరులో ప్రసంగించిన అనంతరం ఆయన రైల్వేగేటు వద్దకు చేరుకొని అక్కడ రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో టీ తాగారు. సోడా బండి వద్దకు వెళ్లి గోలి సోడాలు కొట్టారు. పక్కనే ఉన్న సైకిల్ షాపునకు వెళ్లి అప్పుడే తీగెలు అల్లిన సైకిల్ చక్రం గుండ్రంగా ఉందో, లేదో చూశారు. అనంతరం రైల్వేగేటును దాటుకొని ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగా వేమూరుకు కిలోమీటర్ దూరంలో పంట పొలాల మధ్యన ఏర్పాటు చేసిన విశ్రాంతి శిబిరంలో ఆగిపోయారు. చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదు, జే ఆర్ పుష్పరాజ్, మాజీ ఎంపీ ఎస్ ఎం లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జీ వీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, వై వీ ఆంజనేయులు, చీరాల గోవర్ధన్‌రెడ్డి, ఎస్ ఎం జియావుద్దీన్, నిమ్మకాయల రాజనారాయణ, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండు పార్టీలు మదమెక్కిన ఏనుగులు