March 19, 2013

  ఏలూరు:అడుగడుగునా హామీల వర్షం.. ఏం చేస్తానో, ఏం చేయబోతానో ఒక నిర్ధిష్ట విధానంతో హామీలు.. సందేహాలకు జవాబులు, నిక్కచ్చిగా ఉంటానంటూ హామీ.. ఉద్యోగులు తనతో కలిసి రావాలని పిలుపు.. అన్ని వర్గాలకు చేరువయ్యే తపన.. ఇవన్నీ కలబోసి జిల్లాలో చంద్రబాబు బుధవారం నాటికి 130 కిలోమీటర్ల మైలురాయిని అలవోకగా అధిగమించనున్నారు. ఒకవైపు కాళ్ల నొప్పులు, శారీరక బాధలు ఆయనను ఈ పదకొండు రోజులు వెన్నాడాయి. అడుగు తీసి అడుగు వేసేందుకు ఒక్కోరోజు పంటి బిగువున బాధ అనుభవిస్తూనే పాదయాత్రను మాత్రం ఎక్కడా ఆపలేదు. చంద్రబాబు ఇప్పడే కొత్తగా తమ ఊరికి వచ్చారనేటట్లుగా ఊళ్లకు ఊళ్లే జనంతో పోటెత్తాయి. తెలుగుదేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నాయి. ఉత్సాహం ఉరకలెత్తింది.

చంద్రబాబులో చలాకీతనం కన్పించింది. మనవి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను అనే పాత మాట ఇప్పుడీ పాదయాత్రలో మచ్చుకైనా బాబు నోట వెంట రాలేదు. స్పష్టమైన వాగ్దానాలు, చేయాల్సింది విస్పష్టంగా చెప్పడం, చెప్పింది అర్థమైందా లేదా అని తిరిగి ప్రజల నుంచే సమాధానాలు రాబట్టే దిశగానే ఆయన పాదయాత్ర ఆసాంతం ఉత్సాహంగా సాగింది. కరెంటు బిల్లులు, కరెంటు కోతలు ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. కరెంటు ఇచ్చే సత్తా ఏదైనా ఉంటే అది మీకే చెల్లు అని ప్రజల నుంచే ఆయన నేరుగా మద్దతు దక్కించుకోవడంలో కొంత సఫలీకృతమయ్యారు.

ప్రజల కష్టాలను ఏకరవు పెట్టడం, వారి నోటే ఎలా తిప్పలుపడుతున్నారో తెలుసుకోవడానికే ఆయ న ప్రాధాన్యత ఇచ్చారు. యువకులు మహిళలే కాదు, ముసలీ ముతకా భుజం తట్టారు. వెన్ను నిమిరి 'మనం అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి కష్టాలు ఉండవ'ని ధైర్యాన్ని నూరిపోయడం ఆయన యాత్ర అడుగడుగునా కొనసాగింది. ఇప్పటికే ఆయన అలసి సొలసి.. కాళ్లు నొప్పులతో ఇబ్బందులు పడుతున్న వైనాన్ని పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ, బహిరంగ సమావేశాల్లోనూ విడమర్చి చెప్పడం ద్వారా తాను ఎంతగా శ్రమిస్తుందీ కార్యకర్తల ఎదుట ఉంచగలిగారు.

ఫలితంగా అన్ని వర్గాల్లోనూ ఆయన పట్ల సానుభూతి కాస్తంత పెరిగినట్టు కన్పించింది. ఈ వయసులోనూ ఆయన కష్టాలను తట్టుకుని ముందుకు సాగుతున్నారన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యాయి. రుణమాఫీ హామీ బాబు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణ కలిగిన వా గ్దానం. దీనినే ఆయన అన్ని చోట్లా ప్రస్తావించారు. ఇంతకుముందు రుణ మాఫీ జరిగినప్పుడు ముందుగానే రుణం కట్టినవారు నష్టపోయారు, కానీ ఈసారి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం ద్వారా మరికొంత అదనపు మద్దతు దక్కించుకునే ప్రయత్నం చేశారు. బీసీలపైనా వంద సీట్ల ప్రభావం కన్పించింది.

ఎస్సీ వర్గీకరణ ఒక ఎత్తయితే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న బాబు వాగ్దానం మరికొంతమందిని మురిపించింది. అగ్రవర్ణాలు ఈ హామీ పట్ల కొంత మేర దృష్టి పెట్టినట్లు కన్పించింది. కార్యకర్తల సమావేశాల్లో పార్టీ ఏ స్థాయిలో ఉందో అసలు గుట్టు కూడా చంద్రబాబు స్వయంగా తెలుసుకోవడానికి వీలుపడింది. నియోజకవర్గాల వారీగా ఉన్న బలం, బలహీనతలు కూడా ఆయనకు స్పష్టంగా తెలిసేటట్లు చేశాయి. ఆయన పాదయాత్ర సాగిన సుమారు 70 గ్రామాల్లో అన్నిచోట్లా ప్రజాదరణే. మహిళలు, యువకులు, రైతులు ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారో అలాగే చంద్రబాబుకు అనేక చోట్ల చేరువయ్యేందుకు చేసిన ప్రయత్నం సహజంగానే చంద్రబాబుతో పాటు టీడీపీ వర్గాలను కూడా సంతృప్తిపరిచాయి. ఇంకోవైపు ఆచంట వంటి నియోజకవర్గాలను మినహాయిస్తే మిగతా అన్నింటిలోనూ పార్టీ నేతలు పడిన కష్టం పాదయాత్ర విజయానికి దోహదపడింది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే చంద్రబాబు ఈసారి పాదయాత్రలో కొంతమారినట్లు గమనించారన్న వ్యాఖ్యలు కార్యకర్తల నోట వి న్పించాయి. ఆయన తన సహజ ధోరణికి భిన్నంగా అనేక చోట్ల ఛలోక్తులు విసరడమే కాక తనపై పాత ఆరోపణలను ఎవరైనా ప్రస్తావించినప్పుడు ఉగ్రరూపాన్ని కూడా ప్రదర్శించారు. అధికార కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలు, ఆరోపణలు దండిగా సంధించారు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని సాధారణ, మధ్యతరగతి కు టుంబాలకు విడమర్చి చెప్పారు. అలాగే టీడీపీకి డబ్బు లేదని, మీరే ఎకరాను, అర ఎకరాను అమ్మి అయినా పార్టీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు తొలిసారిగా పిలుపు ఇచ్చారు. పనిచేసేవాళ్లను గుర్తిస్తాం, లేదంటే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమని తన పార్టీ వారికి పాదయాత్రలో వార్నింగ్‌లు ఇచ్చారు. డ్వాక్రా మహిళల మద్దతు కూడగట్టుకోవడానికి ఇక మీకు భవిష్యత్‌లో పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇస్తామని భరోసా కల్పించడం ద్వారా వేలాది గ్రూపుల్లో ఓ కొత్త చర్చకు తెరలేపారు.

మీ సేవకుడిని .. ఆశీర్వదించండి


 ఏలూరు:జిల్లాలో పదకొండు రోజుల సుదీర్ఘ పాదయాత్ర.. ఆది నుంచి చివరి దాకా తెలుగుదేశం అధినేతకు అన్నిచోట్లా నీరాజనాలే. వస్తున్నా మీకోసం అం టూ తమ గ్రామాల్లో అడుగిడుతున్న చంద్రబాబుకు రోడ్లపై పూలుపరచి పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలంటూ దీవెనలు ఇస్తున్నారు. పదకొండు రోజుల్లో నిర్విరామంగా ఆయన కాలు నొప్పిపెడుతున్నా ఖాత రు చేయకుండా బుధవారం నాటికి జిల్లాలో 130వ మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఉప్పుటేరు నుంచి కొవ్వూరు దాకా అన్నిచోట్లా జనమే. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా బాబు ప్రయాణించే మార్గంలో పూలు పరిచి మరీ, ఆయనపై తమకున్న అభిమానాన్ని పశ్చిమ జిల్లా వాసులు లోకానికి చాటే ప్రయత్నం చేశారు.

పాదయాత్రలో బాబుకు దీవెనలు అందించేవారు కొందరు, తమ డిమాండ్లను వినిపించేవారు ఇంకొందరు, మిమ్మల్ని సీఎం చేస్తామంటూ భరోసా ఇచ్చేవారు ఇంకొందరు, కరెంటు కష్టాలు తొలగించాలంటూ గోడు వెళ్లబోసుకుంటున్న ఇంకొందరు ఇలా బహుదూరపు బాటసారికి అన్నిచోట్లా ఎదురయ్యారు. ఒక ఇంటి పెద్ద ఎదుట కష్టసుఖాలు ఎలా చెప్పుకుంటారో సరిగ్గా అలాగే చంద్రబాబుతో కూడా గ్రామాల్లో ప్రజలు బాధలు చెప్పుకున్నారు. 'ర్రాష్టానికి ఒక పెద్దన్నయ్య మీ ముందుకు వస్తున్నా'ఆశీర్వదించండి అంటూ చేతులు జోడించి బాబు చేస్తున్న విజ్ఞప్తికి మీదే గెలుపు అంటూ వేల గొంతుకులు నినదించాయి. బడి పిల్లల దగ్గర నుంచి మహిళలు సైతం బాబుకు చేరువగా వెళ్లి దీవెనలు అందించేందుకు పోటీలు పడ్డారు. ఉండి, భీమవరం, పాలకొల్లు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు వంటి అన్ని నియోజకవర్గాల మీదుగా సాగిన ఆయన పాదయాత్ర అట్టహాసంగానే సాగింది. మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా సాగుతున్న ఈ యాత్రలో తనతో నడిచి వస్తున్న వందలాది మందిని గమనించి బాబు కూడా ఉత్సాహపడ్డారు. నలుగురిలో కలిసిపోయారు. భుజం తట్టి ఏమేమి కష్టాలుపడుతున్నారంటూ ఆరా తీశారు. 'చంద్రబాబు నిన్ను చూడాలని వచ్చానయ్యా' అంటూ దగ్గరకు వచ్చి పండుముదుసళ్లను ఆయన అక్కున చేర్చుకున్నారు. 'ఏం పర్వాలేదు, మీకండగా నేనుంటాన'ంటూ శిరస్సు నిమిరి భరోసా ఇచ్చారు. 'ఉద్యోగాలు లేవు సార్' అంటూ యువకులు గొంతెత్తి ఆవేదన వ్యక్తం చేస్తుంటే 'మీకూ మంచి కాలం వస్తుంది, మన పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాను, అది ఎలా చేస్తానో మీరే చూస్తారుగా' అంటూ యువకులను ప్రోత్సహించారు.

మహిళలు అన్నిచోట్లా మంగళహారతులు పడుతూనే మీరు మళ్లీ అధికారంలోకి రావాలంటూ దీవెనలు అందించారు. ఇక ముందు మా వంతు కూడా పార్టీని గెలిపించుకోవడానికి, మిమ్మల్ని సీఎం చేసేందుకు అన్ని విధాలా మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని, తోటి ఆడపడుచులుగా బాబుకు సంఘీభావం ప్రకటించారు. కొవ్వూరు నియోజకవర్గంలో రెండ వ రోజైన మంగళవారం కూడా యాత్ర కొనసాగుతున్నప్పుడు చంద్రవరం నుంచి కొవ్వూరు వరకు దారి పొడవునా చంద్రబాబుపై అభిమానం ఉప్పొంగింది. వేలాది మంది ఆయనను చూసేందుకు అన్నిచోట్లా ఎగబడ్డారు. బాబు కూడా ఉత్సాహంగా, చొరవగా అన్ని వర్గాలకు చేరువయ్యా రు. కరెంటు సమస్యలను ప్రస్తావిస్తూనే చేతకాని ప్రభుత్వం వల్ల ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. మీకు ఈ కష్టాలు పోవాలంటే తెలుగుదేశంను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను గుచ్చిగుచ్చి చెప్పారు. చంద్రవరం, గౌరిపల్లి, నందమూరు, పసివేదల వంటి గ్రామాల్లో స్థానికులు వీధుల్లోకి ఓ జనప్రవాహంలా వచ్చా రు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాం తం ఆలకిస్తూనే తమ కష్టాలను కూడా వెళ్లబోసుకున్నారు. 'ఎస్సీల వర్గీకరణను సమర్ధిస్తూ మీరు అన్ని వర్గాలకు ఏదో సాయం చేస్తున్నారు, దీనిని మేము సమర్ధిస్తాం. మీరు ధైర్యంగా ముందుకు సాగండి' అంటూ గ్రామ పొలిమేరల వరకు వెన్నంటే నడుస్తూ వచ్చారు. దళిత వర్గాలను కూడా చంద్రబాబు కలుసుకుని వారి కష్టసుఖాలను ఆలకించారు. ఎమ్మెల్యే టీవీ రామారావు, మురళీమోహన్, సీతారామలక్ష్మి, గరికిపాటి మోహనరావు వంటి వారు వెంట ఉండగా ఆయన దాదాపు అన్నిచోట్లా కూడా తాను ప్రసంగిస్తూనే ఎదుటి వారికి కూడా కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించారు. పశ్చిమలో పదకొండో రోజు జరిగిన పాదయాత్రకు అపూర్వ స్పందన, విశేష ఆదరణ తోడయ్యాయి. చంద్రబాబు సైతం ఈ మేర కు ఉత్సాహంగా కన్పించారు. ఆయన కొన్ని సభల్లో ఛలోక్తులు విసిరి ప్రజలను నవ్వులతో ముంచెత్తేలా వ్యవహరించారు. కాంగ్రెస్ దొంగలను ఓడిస్తేనే ర్రాష్టానికి మోక్షం లభిస్తుందం టూ జన సమూహాలకు హితవు పలికారు. దారిపొడవునా ఆయన తన కోసం వేచి ఉన్న వృద్ధుల దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు. 'ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా బతుకుతున్నార'ంటూ యోగక్షేమాలను అడుగుతూ, ఆ వర్గాలకు కూడా మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటిన ఆయన అలసటను కూడా ఖాతరుచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తూ వచ్చారు.

కొవ్వూరులో కదం తొక్కారు

ఏలూరు :ఇప్పటి వరకూ పార్టీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయని పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం జరిగిన పోలవరం నియోజకవర్గ సమీక్షలో మన లోక్ సభ అభ్యర్థి మాగంటి బాబు అంటూ రెండు, మూడుసార్లు ప్రస్తావించారు. పార్టీలో సమన్వయ లోపాన్ని ఎత్తి చూపిన తర్వాత మాగంటి బాబు లోక్‌సభకు పోటీ చేస్తాడు...అప్పుడు కూడా మీరిలాగే ఉంటే ఓట్లు ఎలా వస్తాయంటూ నిలదీశారు. రాష్ట్రంలో మనం అధికారంలోకి రావడమే కాకుండా ఎంపీలను కూడా గెలిపించుకోవాలి... ఇక్కడ బాబు గెలుపుకోసం ఐకమత్యం అవసరం... మీరంతా ఇలా గ్రూపులు ముఠాలంటే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన మాటల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాగంటి బాబు పార్టీ అభ్యర్థి అన్నట్టుగానే ప్రస్తావించారు.

ఒక పనైపోయింది బాబూ!

అమ్మ గుర్తుకొచ్చింది. సాగు నుంచి కుటుంబ సాగరం దాకా ఓపిగ్గా ఈదిన కష్టజీవి ఆమె. పనిచేయడం తప్ప పడుకొని ఉండటం నేను చూడలేదు. ఆమె జీవితమే నాకు ఆదర్శం. ఆమె కష్టాన్ని చూసిన తరువాతే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. శరీరం సహకరించకపోయినా, కదలబోమని కాళ్లు మొరాయించినా ఇప్పుడిలా ప్రజల మధ్య నిలబడి ఉన్నానంటే.. ఆ శక్తి నాకు అమ్మ పంచినదే. నాలోనే దాచేసుకున్న 'అమ్మ' జ్ఞాపకాల తేనెపుట్టెను చంద్రవరం పార్టీ సమావేశంలో ఆ మిత్రుడు కదిలించాడు.

కాలి నొప్పో, మరో బాధో అయితే తట్టుకోవచ్చు.. కానీ, అమ్మ గుర్తొస్తే.. నిభాయించుకోవడం ఎలా? 'చేతనైతే పదిమందిని ఆదుకోవాలి. మన కష్టం మాత్రం ఎప్పుడూ చెప్పుకోకూడదు నాయనా.. కడుపులోది కడుపులోనే దాచుకోవాలి' అనే ఆమె మాటలు ఎప్పుడు గుర్తొచ్చినా ఇప్పుడే వింటున్నట్టుంటుంది. ఇంటికి పెద్ద కొడుకుగా నా బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజలను అంటిపెట్టుకొని ఉంటున్నాను. ఈ బాటలో మా అమ్మ మాటే బాసట!

"నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనీయను'.. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ నిద్రకు పడినప్పుడు నేనిచ్చిన నినాదమిది. అది అప్పటి అవసరం. కానీ, అవే మాటలు చంద్రవరంలో వినిపించి ముచ్చటేసింది. "మీ హయాంలో మా గ్రామం నుంచి 30 మంది విదేశాలకు వెళ్లారు. ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ అలాంటి రోజు ఒకటి రావాలి. దానికోసం మీరు తిరిగి సీఎం కావాలి. అంతవరకూ మేం నిద్రపోం. మిమ్మల్నీ నిద్రపోనీయం'' అని ఆ వ్యక్తి అంటుంటే ముఖంలో పట్టుదల తొణికిసలాడింది. ఇలాంటి వ్యక్తులను మనం తయారుచేస్తే..వారే ఈ వ్యవస్థను మారుస్తారు!

అమ్మ మాటే నాకు బాట!

చంద్రబాబు ఏడ్చారు. ముఖం కందిపోయంతగా కన్నీరు పెట్టారు. ఏ విషయాన్నీ ఒక పట్టాన బయటపెట్టని ఆయన వదనం ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగంతో కంపించింది. మరుక్షణంలోనే జలజలా కన్నీరు కారిపోయాయి. పాదయాత్ర చేస్తున్న ఆయన ఎంత కష్టాన్నయినా పంటి బిగువున భరిస్తూ వస్తున్నారు. కానీ, 'అమ్మ' జ్ఞాపకాన్ని మటుకు తట్టుకోలేకపోయారు. కన్నీరు పెట్టేసుకున్నారు. ఎప్పుడూ గంభీర ముద్రతో కనిపించే తమ అధినేత, అలా కన్నీటిపర్యంతమవుతుంటే ఆ కార్యకర్తలూ అప్రయత్నంగా కన్నీళ్లు పెట్టేశారు.

చాగల్లు మండలం చంద్రవరంలో పోలవరం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వయసులో పార్టీ కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని గురించి సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు భావోద్వేగంతో మాట్లాడారు. "ఏదో మన కోసం బాబు పాదయాత్ర చేస్తున్నారు అనుకుంటున్నాం.

మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు నడిచి నడిచి బస్సులోకి వెళ్లిన తర్వాత..ఆయన బాధ ఏమిటనేది దగ్గరగా ఉండే మాకు తెలుసు. అది చూసి మేం రోజూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాం. ఆయన ఎడమకాలి చిటికెన వేలు, బొటనవేలు వాచిపోయాయి. బస్సులో కూర్చున్నచోట నుంచి లేవాలంటే 'అమ్మా..' అంటూ అల్లాడిపోతున్నారు.

ఆయన తల్లి ఎక్కడున్నారో గానీ.. ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తే ఎంత బాధపడి ఉండేదో..' అని అంటుండగానే.. చంద్రబాబు కళ్లల్లో కన్నీటిచెమ్మ కదలాడింది. ముఖం గంభీరంగా మారింది. ముఖం దాచుకోవడానికి పైకి చూసే ప్రయత్నం చేసినా చెంపల మీదుగా కన్నీళ్లు కారిపోయాయి. కార్యకర్తల విషాదవదనాలు చూసిన వెంటనే.. తనను తాను కంట్రోల్ చేసుకున్నారు. 'గరికపాటి..! మీరు కొంచెం ఎక్కువ చెబుతున్నారేమో.. ముందు సమావేశం సంగతి చూడండి'' అంటూ గంభీర వాతావరణాన్ని ఆయనే చల్లబరిచారు.

బాబు కంటతడి అమ్మ ప్రస్తావనతో భావోద్వేగం


అవిశ్వాస తీర్మానం సందర్భంగా శాసనసభలో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రసంగాన్ని సీడీల రూపంలో తయారు చేసి పార్టీ శ్రేణులకు పంపాలని చంద్రబాబు సూచించారు. మంగళవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర కార్యలయ నేతలకు ఆయన ఈ ఆదేశాలిచ్చారు.

మోత్కుపల్లి ప్రసంగాన్ని సీడీలు చేయండి

ఇది భ్రమల బడ్జెట్!
భరోసా ఇవ్వడం పోయి..భయపెడుతున్నారు
'పశ్చిమ'యాత్రలో చంద్రబాబు నిప్పులు

ఏలూరు : "రైతులను ఆదుకోలేరుగానీ వ్యవసాయానికి ముసాయిదా పేపరు విడుదల చేస్తారట. ఎవరిక్కావాలి వాళ్ల పేపరు? చేస్తే రైతులకు మేలు చేయండి.. జిమ్మిక్కులు కాదు'' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుపై కాంగ్రెస్‌కు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో, వారిని ఎలా మోసం చేస్తున్నాదో సోమవారం అసెంబ్లీలో పెట్టిన వ్యవసాయ విధాన పత్రం చూస్తే అర్థమవుతోందని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చంద్రవరం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మల్లవరం, గౌరిపల్లె, పసివెదల, నందమూరు, కొవ్వూరు పొలిమేర వరకు నడిచారు. దారిపొడవునా జనసమూహాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

యాత్రలో భాగంగా ఆయన చంద్రవరంలో దళిత కుటుంబాలను కలుసుకున్నారు. అనంతరం పాల్గొన్న పలు సభల్లో బడ్జెట్‌పై భగ్గుమన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. భ్రమలో పెడుతున్నదని చంద్రబాబు దుయ్యబట్టారు. " వ్యవసాయం ఇప్పటికే దెబ్బతింది. రైతులు అప్పులపాలయ్యారు. వీటి నుంచి ఎలా గట్టెక్కిస్తారో చెప్పలేదు గానీ ముసాయిదా పేపర్లతో హంగామా చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఏ పనీరాదు. ఎలా చేయాలో అంతకంటే తెలియదు. ఫోజులు మాత్రం కొడతారు'' అని తీవ్రంగా మండిపడ్డారు. కావాలని కష్టాలను కొనితెచ్చుకోవద్దని ప్రజలకు హితవు పలికారు.

" పాలిచ్చే గేదెకు కాక, దున్నపోతుకు గడ్డిపెట్టి మీరు ఇప్పటికే నష్టపోయారు. ఇక ముందు ఇలాంటి కష్టాలు రాకుండా చూసుకోండి. నాకు సహకరించండి''అని విజ్ఞప్తి చేశారు. తల్లి కాంగ్రెస్ (కాంగ్రెస్), పిల్ల కాంగ్రెస్ (వైసీపీ)లు ర్రాష్టాన్ని నిండా ముంచాయని ఆరోపించారు. బ్రదర్ అనిల్ మత ప్రచారకుడు కాదు.. అవినీతి నాయకుడని అభివర్ణించారు. ఇప్పుడు ర్రాష్టంలో ఎవరైనా పులివెందుల వెళ్లి తిరిగి రాగలరా.. ఇలాంటి పరిస్థితి మరే నియోజకవర్గంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. అంతకుముందు పోలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్న ఎన్నికల కోసం పూర్తిగా అంకితం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 'మీకు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాను. ఇంట్లో కాపురం లేదు. అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పార్టీ గెలుపు కోసం పోరాటానికి సంసిద్ధమవ్వాలి' అని ఆదేశించారు. కాగా, జిల్లాలో బుధవారంతో పాదయాత్ర ముగుస్తోంది. బుధవారం సాయంత్రం కొవ్వూరు రైల్వే కం రోడ్డు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరిలోని రాజమండ్రిలో అడుగిడనున్నారు. జిల్లాలో 13 రోజులపాటు యాత్ర సాగుతుంది.

అనిల్ ప్రచారకుడు కాదు..అవినీతిపరుడు

వస్తున్నా..మీకోసం' పాదయాత్రను
ఏప్రిల్ 19న ముగించనున్న చంద్రబాబు
కదిలించిన గరికపాటి ప్రసంగం
ఉద్వేగానికి లోనైన చంద్రబాబు నాయుడు

ప.గో : 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రను ఏప్రిల్ 19 న ముగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు. మిగిలిన ఆరు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదిన ప్రారంభమైంది. ఆయన పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. చంద్రబాబు పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కాగా మంగళవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు పోలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీకి చెందిన సీనియర్ నేత గరికపాటి రామ్మోహన రావు కార్యకర్తలకు బాబు పాదయాత్ర కష్టాలు ఏకరువు పెట్టారు. ఎంత కష్టంగా ఉన్నప్పటికి బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆయన కష్టాలను తాము కళ్లారా చూస్తున్నామని, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు తల్లి బతికి ఉండి ఉంటే ఆయన పాదయాత్రను చూసి కన్నీళ్లు పెట్టేదని అన్నారు.

అరవై నాలుగేళ్ల వయస్సులో చంద్రబాబు సాహసం చేస్తున్నారని, ఆయన ఎవరి కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారో ప్రజలు, కార్యకర్తలు గుర్తించాలని గరికపాటి రామ్మోహన రావు అన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. అయినా, ఆయన ప్రజల కోసం ఇదంతా చేస్తున్నారన్నారు. గరికపాటి మాటలు కార్యకర్తలను, నేతలను ఉద్వేగానికి గురి చేశాయి. వేదిక పైనున్న చంద్రబాబు కూడా గరికపాటి మాటలకు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరగడం చూసిన కార్యకర్తలు మరింత ఉద్వేగానికి గురయ్యారు.

ఏప్రిల్ 20న విశాఖలో బాబు జన్మదిన వేడుకలు

అనకాపల్లి: సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 23న పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుగుదేశం పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అంకంపేట చేరుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కుమారపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తారని తెలిపారు.

బాబు పాదయాత్ర 13 రోజులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' నినాదంతో చేపట్టిన పాదయాత్ర జిల్లాలో 13 రోజులపాటు సాగుతుందని రత్నాకర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నాతవరం మండలంలో విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి నందివొంపు, గండి జంక్షన్, అగ్రహారం, దొండవాక, మల్లవరం, కొత్తపల్లి, పాములవాక, జల్లూరు, ఎండపల్లి, పీపీ అగ్రహారం, మాకవరపాలెం, పాతకన్నూరుపాలెం, కన్నూరుపాలెం, జి.భీమవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, సోమవరం, గణపర్తి, చూచుకొండ, జగన్నాథపురం, మల్లవరం, ఉప్పవరం, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక, నాగులాపల్లి మీదుగా అనకాపల్లి చేరుకుంటారని చెప్పారు.

పట్టణంలో మెయిన్‌రోడ్డు మీదుగా బైపాస్‌రోడ్డుకు చేరుకొని మునగపాక మండలంలోని గవర్ల అనకాపల్లి, తోటాడ, సిరసపల్లి, పరవాడ, దేశపాత్రునిపాలెం నుంచి విశాఖ నగర పరిధిలోకి ప్రవేశిస్తారని చెప్పారు. కూర్మనపాలెం, గాజువాక, షీలానగర్, ఎన్ఏడీ కొత్తరోడ్డు, కంచరపాలెం, పూర్ణామార్కెట్, ఆరిలోవ, శొంఠ్యాం నుంచి అలమండ మీదుగా విజయనగరం జిల్లాకు వెళతారని చెప్పారు. చంద్రబాబు గతంలో రైతుపోరుబాట కార్యక్రమం నిర్వహించినప్పుడు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పర్యటించినందున ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పాదయాత్ర జరపడం లేదని రత్నాకర్ చెప్పారు.

పాయకరావుపేటలో స్వాగతం

చంద్రబాబుకు పాయకరావుపేటలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలుకుతారని ఆయన తెలిపారు. తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుతోపాటు జిల్లాలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, బొడ్డపాటి చినరాజారావు, పాకలపాటి పెదబాబు, మళ్ల రాజా, బొడ్డేడ శంకరరావు, మళ్ల సురేంద్ర, బొలిశెట్టి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, మద్దాల వెంకటరమణ, నిమ్మదల సత్యనారాయణ, దొడ్డి బుద్ద సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

23న బాలయ్య రాక

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 'మీకోసం పాదయాత్ర'లో మళ్లీ మార్పులు, చేర్పులు జరిగాయి. సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి, ఆయన అనుచరులు, నగర, రూరల్ అధ్యక్షులు సోమవారం అధినేత రూట్‌మ్యాప్‌పై సమావేశమయ్యారు. ఆదివారం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు హాజరైన సమన్వయ సమావేశానికి బండారు, ఆయన అనుచరులు హాజరుకాని విషయం తెలిసిందే.

ఒక వర్గం సమావేశానికి తానెందుకు హాజరవుతానంటూ ఆయన పార్టీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అర్బన్, రూరల్ పార్టీల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. తాజాగా ప్రతిపాదించిన రూట్‌లో పెందుర్తిని మినహాయించి గాజువాకను చేర్చారు. ఇంకా మరికొన్ని మార్పులు చేశారు.

నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జి భరణికాన రామారావు, గాజువాకకు చెందిన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, హర్షవర్దన్‌ప్రసాద్, గుడివాడ అమర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రతిపాదించిన షెడ్యూల్‌లో పాయకరావుపేట నియోజకవర్గం లేదు.

చంద్రబాబు తుని నియోజకవర్గం కోటనందూరు నుంచి విశాఖ జిల్లాలోకి నాతవరం మండలం గన్నవరం గ్రామం వద్ద అడుగుపెడతారు. నాతవరం మండలం నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్ర పాములపాక, బాపిరాజు కొత్తపల్లి, గిడుతూరు, మాకవరపాలెం, తాళ్లపాలెం, చూచుకొండ, మునగపాక, అనకాపల్లి, సబ్బవరం వరకూ సాగుతుంది. అక్కడి నుంచి వెదుళ్లనరవ మీదుగా దువ్వాడ, గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, పూర్ణామార్కెట్, జగదాంబ, మద్దిలపాలెం మీదుగా హనుమంతువాక చేరుతుంది.

భీమునిపట్నం నియోజకవర్గంలో ఇంకా రూట్ ఖరారు చేయలేదు. చంద్రబాబు జిల్లాలో మొత్తం 13 రోజుల పాటు పాదయాత్ర చేస్తారని తాజా షెడ్యూల్‌లో పొందుపరిచారు. అయితే రూట్‌లో ఇంకా మార్పులు చేర్పులు వుంటాయని నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో కీలక ప్రాంతంలో బహిరంగ సభలు ఏర్పాటుచేస్తారు.

బాబు రూటు మారింది

మేదరమెట్ల : రైతులకు సహకార సంఘాలలో వడ్డీ రాయితీ మొదట ప్రకటించింది తెలుగుదేశం పార్టీయే నని పార్టీ యువనేత కరణం వెంకటేష్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెంకటేష్ చేపట్టిన పాదయాత్ర ఆదివా రం ఉదయం కుర్రవానిపాలెం, సా యంత్రం పి. గుడిపాడు, కొరిశపాడు గ్రామాల్లో సాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కుర్రవానిపాలెం, పి.గుడిపాడు మధ్య లో అకాల వర్షాలకు తడిచి కల్లాలలో ఉన్న మిరపకాయలను ఆయన పరిశీ లించారు. ప్రస్తుతం మార్కెట్‌లో మిర పకాయల ధరల గురించి రైతులనడిగి తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా సరైన ధరలు లేక కోల్డ్ స్టోరేజిలలో నిల్వ చేసిన విషయాన్ని రైతులు వెంక టేష్ దృష్టికి తీసుకువచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మార్కెట్ కమిటీ లలో శీతల గిడ్డంగులు నిర్మించి రైతు లకు నిల్వ చేసుకునే సౌకర్యంతో పాటు వడ్డీలు లేకుండా రుణాలు ఇప్పించేం దుకు కృషి చేస్తామన్నారు. ఈ ప్రాం తంలో పెద్దఎత్తున పండిస్తున్న కూర గాయలను నిలువ చేసి సరైన ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా రైతులకు సౌకర్యం కల్పించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ద్వారా బోర్లు వేయించి రైతులకు సాగునీటి వసతి కల్పించింది ఎన్టీఆరేనని గుర్తు చేశారు. సాగర్ కాల్వ చివరి భూములకు నీరు అందించడానికి మొదలు పెట్టిన ఆధు నికీకరణ పనులు సరిగా జరగడం లేద ని విమర్శించారు. కుర్రవానిపాలెం సాయిబాబా దేవాలయంలో, పి. గుడి పాడులోని వెంకటేశ్వరస్వామి దేవాల యంలో వెంకటేష్ ప్రత్యేక పూజలు చేశారు. కొరిశపాడు ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు.

పాదయా త్రలో వైవీ సుబ్బారావు, అనంతమ్మ, నాగినేని రామకృష్ణ, జాగర్లమూడి సురేష్‌బాబు, నాదెండ్ల హనుమంతరా వు, కట్టా శివకుమారి, రవి, సుబ్బా రావు, కొట్టె పూర్ణచంద్రరావు, కృష్ణ, మందా నాగేశ్వరరావు, రవీంద్ర, మా దాసు వెంకటేశ్వర్లు, రావూరి అంజ య్య, గోళ్లమూడి సురేంద్రరెడ్డి, నరాల శ్రీనివాసరావు, కొప్పోలు సత్యనారా యణ, మందా అక్కయ్య, గుణతోటి యలమంద, లేళ్ల చిన సుబ్బారెడ్డి, ప్రభాకరరావు, గండే ఎస్కేలు, బేత పూడి వాసు, కరిచేటి రామారావు, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, ఓగూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సోమవారం పాదయాత్ర మేదరమెట్ల లో జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు గోలి హరిబాబు తెలిపారు.

రైతులకు తొలిసారి వడ్డీ రాయితీ ఇచ్చింది టీడీపీనే

మేదరమెట్ల:పాదయాత్ర ప్రా రంభం అప్పుడు మొదటి అడుగు నేనే వేసినా తరువాత 730 కి.మీ. మీరే వే యించారు. నా శక్తికన్నా మీ ప్రో త్సాహం, మీ మమకారం, ప్రేమ, ఆప్యాయతలతో 7 వేల కి.మీ అయి నా పాదయాత్ర సాగిస్తానని టీడీపీ యువనేత కరణం వెంకటేష్‌బాబు అ న్నారు. సోమవారం కొరిశపాడు మం డలంలోని మేదరమెట్లలో కరణం వెంకటేష్ పాదయాత్ర సాగింది. మేద రమెట్లలోని ప్రతి వీధిలోని ప్రతి ఇం టికి వెళ్లి కుటుంబ సమస్య లను అడిగి తెలుసుకున్నారు. మహిళలు హార తులిచ్చి స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా కొన్ని చోట్ల పార్టీ జెండాలు ఆవిష్కరించారు. 700 కి.మీ పూర్తి అయిన సందర్భంగా అభిమానులు ఆయన చేత కేక్ కట్ చేయించారు. రా త్రి మేదరమెట్ల సెంటర్‌లో కరణం వెంకటేష్ మాట్లాడుతూ అద్దంకి ని యోజకవర్గానికి మేదరమెట్ల టీడీపీకి ఒక అడ్డాగా ఉండేదన్నారు.

తిరిగి అటువంటి పూర్వ వైభవం తీసుకు రావాలన్నారు. ప్రజల సమస్యలు విం టుంటే కళ్లవెంట నీరు వస్తున్నాయని ప్రతి కుటుంబం తమ బాధలను వ్యక్త పరుస్తోంది. గతంలో వృద్ధులకే పింఛన్ వచ్చేదని ప్రస్తుతం యువ కులకు కూడా పింఛన్ ఇస్తున్నారంటే ఎంత «ధౌర్భాగ్యమో ప్రజలు ఆలో చించాలన్నారు. కరెంటు వైరు పట్టు కుంటే షాకు కొడుతోంది కాని ప్రస్తు తం కరెంటు బిల్లులు చూస్తూనే షాక్ కొడుతుందన్నారు.

నిత్యావసర ధర లు, పెట్రోలు, డీజిల్ వంటి ధరలను పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దయ నీయంగా ఉందని, నీరు లేక విద్యుత్ సక్రమంగా లేక కనీసం తిండి గింజలు కూడా నోచుకోని పరి స్థితి నెలకొం దన్నారు. దీంతో పండగ లకు కు టుంబ సభ్యులను ఇంటికి పిలుచు కోవాలన్నా భయపడే పరిస్థితి నెల కొందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ తథ్యమన్నారు. ఎవ రిని గెలిపిస్తే మనం, మన నియోజ కవర్గం అభివృద్ది చెందుతుంతో ప్రజలు ఆలోచించారు.

ఇప్పటి వరకు 96 గ్రామాలను 33 రోజుల్లో పర్యటించి 730 కి.మీ దూరాన్ని వెంకటేష్ పాద యాత్ర చేశారని ఆయన ఆనునా యులు తెలిపారు. ఈ పాదయా త్రలో వడ్లమూడి ప్రకాష్‌రావు, కర్నాటి పూ ర్ణచంద్రరావు, పోకూరి బుల్లిబ్బాయి, నాగినేని రామకృష్ణ, మన్నం వెంకటే శ్వర్లు, మువ్వా నారాయణరావు, బేత పూడి వాసు, బత్తిన శ్రీనివాసరావు, చావా రవి, రేగుల వెంకటరావు, పూ నూరి నహేమియా, ఓగూరి రమా దేవి, కొండమ్మ, పాలేటి రమణ, నాగేంద్రమ్మ, ఓగూరి కృష్ణ చైతన్య, కరి చేటి రాంబాబు, తిమ్మన్నపాలెం సొ సైటి అధ్యక్షులు ముసులూరి వెంకట రావు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికువ, పంగులూరు, కొరిశపాడు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. మంగ ళవారం తిమ్మన్నపాలెం, ఎ ర్రబాలెం, తమ్మవరం, అనమనమూరులో పాద యాత్ర జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షులు గోలిహరిబాబు తెలిపారు.

ప్రోత్సహిస్తే 7వేల కిలోమీటర్లయినా పాదయాత్ర చేస్తా

చిట్టమూరు: వైఎస్ పాలన లో రాష్ట్రం అధోగతి పాలయింద ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యు డు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం చిట్టమూరులోని గణపర్తి మా ర్కెండేయనాయుడు ప్రాంగణం లో జరిగిన పార్టీ కార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. ఇంత చేసినా నేడు షర్మిల పాదయాత్ర చేస్తూ టీడీపీ ని విమర్శించడం ఘోరమన్నారు.

పేదల కడుపుకొట్టి.. పనబాక కృష్ణయ్య గూడూరు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ పేదల కడుపుకొట్టి పెద్దలకు పంచిపెడుతున్నాడని ఆయన దుయ్యపట్టారు. గూడూరు సబ్ కలెక్టర్‌కు ఫ్రొటోకాల్ తెలియదని, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా, ఓడిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ జిల్లా అ««ధ్యక్షుడు బీద రవిచం ద్ర, గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌రావు, గూడూరు పరిశీలకులు గూడూరు రఘునాథరెడ్డి, నాయకులు మస్తాన్‌రెడ్డి, ఉక్కుజనార్దన్, సుబ్బరామయ్య, కిషోర్‌నాయుడు, వీరాస్వామినాయుడు, గోపాల్‌రెడ్డి, రత్నమ్మ, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు.

వైఎస్ పాలనలో రాష్ట్రం అథోగతి

కాకినాడ: క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారు. నగరంలో పర్యటించి ఆ రోజు అక్కడే బస చేస్తారు. 21న రాజమండ్రి నుంచి బయలుదేరి కడియం వరకు నడవనున్నారు. 21వ తేదీ రాత్రి కడియంలో విశ్రాంతి తీసుకుంటారు.

కడియం నుంచి మండపేట, అక్కడి నుంచి అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ నగరం పిఠాపురం, కత్తిపూడి మీదుగా తుని వరకు జిల్లాలో మొత్తం 13 రోజులపాటు చంద్రబాబు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టారు. ఆ రోజు చంద్రబాబు యాత్ర పిఠాపురం చేరుకుంటుంది. పార్టీ ఆవిర్భవించి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో 31 అడుగుల పైలాన్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 29న చంద్రబాబు ఈ పైలాన్‌ని ఆవిష్కరిస్తారు.

రైతులు, చేతివృత్తులు, కార్మికుల సమస్యలపై దృష్టి చంద్రబాబు పాదయాత్రలో ముఖ్యంగా రైతుల సమస్యలతో పాటు... చేనేత, గీత కార్మికులు, ఇతర చేతివృత్తుల వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్యుత్ కోతలతో వందలాది పరిశ్రమలు మూలనపడి... వేలాది మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. వీటిపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు.

సంక్షేమ పథకాల అక్రమాలపైనా.. జిల్లాలో వృద్ధాప్య, వికలాంగుల, వితంతువుల పింఛన్ల పంపిణీ నుంచి డ్వాక్రా రుణాల మంజూరు, ఉపాధి హామీ అక్రమాలపైనా చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు. ఆయా వర్గాల ప్రజలతో మమేకమై.. వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించీ ఆరా తీయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు జిల్లాలోనే బాబు పాదయాత్ర కొనసాగనుంది. రోజూ 15 కిలోమీటర్ల మేర నడిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రేపటి నుంచి జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర

ప.గో: ఏప్రిల్ 19 న పాదయాత్రను ముగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.

ఏప్రిల్ 19న పాదయాత్రను ముగించనున్న చంద్రబాబు