March 19, 2013

రైతులకు తొలిసారి వడ్డీ రాయితీ ఇచ్చింది టీడీపీనే

మేదరమెట్ల : రైతులకు సహకార సంఘాలలో వడ్డీ రాయితీ మొదట ప్రకటించింది తెలుగుదేశం పార్టీయే నని పార్టీ యువనేత కరణం వెంకటేష్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెంకటేష్ చేపట్టిన పాదయాత్ర ఆదివా రం ఉదయం కుర్రవానిపాలెం, సా యంత్రం పి. గుడిపాడు, కొరిశపాడు గ్రామాల్లో సాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కుర్రవానిపాలెం, పి.గుడిపాడు మధ్య లో అకాల వర్షాలకు తడిచి కల్లాలలో ఉన్న మిరపకాయలను ఆయన పరిశీ లించారు. ప్రస్తుతం మార్కెట్‌లో మిర పకాయల ధరల గురించి రైతులనడిగి తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా సరైన ధరలు లేక కోల్డ్ స్టోరేజిలలో నిల్వ చేసిన విషయాన్ని రైతులు వెంక టేష్ దృష్టికి తీసుకువచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మార్కెట్ కమిటీ లలో శీతల గిడ్డంగులు నిర్మించి రైతు లకు నిల్వ చేసుకునే సౌకర్యంతో పాటు వడ్డీలు లేకుండా రుణాలు ఇప్పించేం దుకు కృషి చేస్తామన్నారు. ఈ ప్రాం తంలో పెద్దఎత్తున పండిస్తున్న కూర గాయలను నిలువ చేసి సరైన ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా రైతులకు సౌకర్యం కల్పించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ద్వారా బోర్లు వేయించి రైతులకు సాగునీటి వసతి కల్పించింది ఎన్టీఆరేనని గుర్తు చేశారు. సాగర్ కాల్వ చివరి భూములకు నీరు అందించడానికి మొదలు పెట్టిన ఆధు నికీకరణ పనులు సరిగా జరగడం లేద ని విమర్శించారు. కుర్రవానిపాలెం సాయిబాబా దేవాలయంలో, పి. గుడి పాడులోని వెంకటేశ్వరస్వామి దేవాల యంలో వెంకటేష్ ప్రత్యేక పూజలు చేశారు. కొరిశపాడు ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు.

పాదయా త్రలో వైవీ సుబ్బారావు, అనంతమ్మ, నాగినేని రామకృష్ణ, జాగర్లమూడి సురేష్‌బాబు, నాదెండ్ల హనుమంతరా వు, కట్టా శివకుమారి, రవి, సుబ్బా రావు, కొట్టె పూర్ణచంద్రరావు, కృష్ణ, మందా నాగేశ్వరరావు, రవీంద్ర, మా దాసు వెంకటేశ్వర్లు, రావూరి అంజ య్య, గోళ్లమూడి సురేంద్రరెడ్డి, నరాల శ్రీనివాసరావు, కొప్పోలు సత్యనారా యణ, మందా అక్కయ్య, గుణతోటి యలమంద, లేళ్ల చిన సుబ్బారెడ్డి, ప్రభాకరరావు, గండే ఎస్కేలు, బేత పూడి వాసు, కరిచేటి రామారావు, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, ఓగూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సోమవారం పాదయాత్ర మేదరమెట్ల లో జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు గోలి హరిబాబు తెలిపారు.