June 25, 2013

 ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన వరద బాధితుల సంరక్షణ విషయంలో తెలుగు దేశం పార్టీ చురుకైన పాత్రను పోషిస్తోంది. బాధిత తెలుగు వారిని ఢిల్లిd నుంచి స్వగ్రామంలోని సొంత ఇంటికి చేర్చేదాకా బాధ్యతలను స్వీకరించి కొత్త ఒరవడిని సృష్టించింది. ఆ పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు ఒకవైపు పార్టీ శ్రేణులను, మరోవైపు ఎన్‌టీఆర్‌ ట్రస్టు సిబ్బందిని సమన్వయం చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసా గిస్తున్నారు. దాంతో భక్తుల తరలింపు వేగం పుంజుకుంటోంది. అధి నేత ఆదేశాల మేరకు టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఢిల్లిdలో మకాం వేసి సహాయ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. అదే రీతిలో డెహ్రాడూన్‌లో రమేశ్‌ రాథోడ్‌, రుషికేష్‌లో కె. నారాయణ సహాయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నాలుగు బేస్‌ క్యాంపుల వద్ద టీడీపీ వలంటీర్లను మోహరించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ట్రస్టు బాధ్యులతో బాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

ఫోన్ల వెల్లువ: ఎల్వీఎస్సార్కే

ట్రస్టు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌ చెప్పారు. వరద బాధితులు, వారి బంధువుల నుంచి వచ్చే సమాచారాన్ని ఉత్తరాఖండ్‌ అధికారులకు చేరవేస్తున్నట్లు చెప్పారు.

విరాళాలు: ఎన్టీఆర్‌ ట్రస్టు విరాళాల కోసం కోసం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు నరసింహా రావు లక్ష రూపాయలను ట్రస్టు సీఈఓ వెంకట్‌కు అందించారు. శాసన మండలిలో విపక్ష నేత యనమల 50 వేల విరాళాన్ని ప్రకటించారు.

బాధితులకు అండగా 'దేశం'

చార్‌ధామ్ బాధితుల కన్నీటి గాథలు వింటుంటే.. వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలనిపిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేశినేని ట్రావెల్స్‌లో విజయవాడకు చేరుకున్న 45 మంది యాత్రికులకు మంగళవారం ఉదయం స్వాగతం పలికారు. వారిని పరామర్శించిన రాజేంద్రప్రసాద్.. వారు తాము పడ్డ కష్టాల గురించి చెబుతుంటే కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలనిపిస్తోందన్నారు. ఢిల్లీలో తెలుగు యాత్రికులు చాలా అవమానాలకు గురయ్యారని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో టీడీపీ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని తొలగించడం హేయమైన చర్య అని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. యాత్రికుల విషయంలో ప్రభుత్వం ఇంతవరకూ సరైన రీతిలో స్పందించకపోవడం శోచనీయమని ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్ విమర్శించారు.

కాగా.. "చార్‌ధామ్ బాధితుల కోసం ఏపీ భవన్‌లో మేం నెలకొల్పిన వైద్య శిబిరాన్ని తొలగించాలన్న నిర్ణయం ఎవరిది? అది శశాంక్ గోయల్‌ది అయితే ఆయన్ను సస్పెండ్ చేయాలి. సీఎం కిరణ్ ఆదేశాలతో ఆయన చేస్తే.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి'' అని టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్‌వీఎస్ఆర్‌కే ప్రసాద్ డిమాండ్ చేశారు. "సేవచేయడంలో మాతో పోటీ పడండి. అది వదిలిపెట్టి మాపై ఈర్ష్య పడటం ఎందుకు?'' అని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకుంటున్న బాబును అభినందించాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని సీనియర్ నేత యనమల అన్నారు.
చంద్రబాబూ.. శవరాజకీయాలు మానుకో: సారయ్య
టీడీపీ అధినేత చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఉత్తరాఖండ్ విషాదానికి దేశమంతా శోకసంద్రంలో మునిగిపోతే చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేతల్ని ఉరి తీయాలనిపిస్తోంది : టీడీపీ నేతలు

కాంగ్రెస్ పార్టీలో స్వదేశీ వాసనలు పోయి విదేశీ గబ్బు కొడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, టిడిపి నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. టిడిపి, వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు అని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దీనిపై యనమల స్పందిస్తూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన టిడిపి ముఖ్యమంత్రికి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా కనిపించడం విడ్డూరమని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తి నేతృత్వంలో పని చేసే కాంగ్రెస్ పార్టీ మల్టీ నేషనల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌గా తయారైందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటలీకి చెందిన వారని, ఉపాధ్యక్షుడు రాహుల్ జీన్స్ కూడా అక్కడివేనని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ , ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బొమ్మలతో వారసత్వ రాజకీయాల పార్టీ కాంగ్రెస్‌లో పని చేస్తూ టిడిపిపై రాళ్లు విసిరితే అవి వాళ్ల నెత్తినే పడతాయని అన్నారు. కుర్చీ నిలబెట్టుకోవడానికి ఢిల్లీ చుట్టూ 80 సార్లు ప్రదక్షిణలు చేసిన ముఖ్యమంత్రి వరద బాధితులను పరామర్శించేందుకు ఒక్కసారి ఢిల్లీ వెళ్లే తీరిక లేదా? అని యనమల ప్రశ్నించారు. వరద బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు టిఎన్‌ఎస్‌వి ఉపాధ్యక్షుడు నరసింహారావు లక్ష రూపాయల విరాళం ఇచ్చినట్టు టిడిపి ప్రకటనలో తెలిపింది.

కాంగ్రెస్‌ది విదేశీ గబ్బు: టిడిపి

కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ఎస్పీకి టీడీపీ నేతలు మంగళవారం ఉదయం వినతి పత్రం అందజేశాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ జులై తొలి వారంలో నీటిని విడుదల చేస్తామని నేతలకు హామీ ఇచ్చారు.

విజయవాడ : ఇరిగేషన్ ఎస్పీకి టీడీపీ వినతి పత్రం

ఏపీ భవన్‌లో అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వరదబాధితుల కోసం టీడీపీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తొలగించడం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులకు గదులు కేటాయించాలన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఏపీ భవన్ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

ఉత్తరాఖండ్ వరదలను రాజకీయం చేస్తున్నారన్న కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తాను రాజకీయాలు చేయడం లేదని, ఓ మనిషిగా సహాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వరద బాధితుల ఇబ్బందులను చూసి చలించిపోయానన్నారు. పలువురు యాత్రికులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపినట్లు చెప్పారు. తాను సాయం చేసేందుకే వచ్చానని, రాజకీయం చేసేందుకు రాలేదన్నారు.

ఎపి భవన్ అధికారుల తీరుపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యుల వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడమేమిటని ప్రశ్నించారు. వరద బాధితులకు వైద్యం అందకుండా అధికారులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎపి భవన్ అధికారుల వ్యవహార శైలిపై మంత్రి శ్రీధర్ బాబు విస్మయం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సహాయం నిరాకరించడంపై టిడిపి నేతలు శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు.

తెలుగు వారికి సౌకర్యాలు కల్పించని ఎపి భవన్ అధికారి శశాంక్ గోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు. ఎపి భవన్‌లో ఉన్న 1500మందిలో వంద మందికే రవాణా ఖర్చులు చెల్లించడమేమిటని ప్రశ్నించారు.

రాజకీయంపై బాబు స్పందన!

వరదల్లో చిక్కుకున్న 20 మంది తెలుగువారిని స్వస్థలాలకు పంపించేందుకు టీడీపీ విమాన ప్రయాణ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ-విశాఖ ఎయిరిండియా విమానంలో విశాఖకు తిరిగొచ్చేందుకు 20 మందికి ఉచితంగా టికెట్లు అందజేశారు. విశాఖ నుంచి విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేందుకు స్థాని టీడీపీ నేతలు వారికి వాహనాలు సమకూరుస్తున్నారు.

20మందికి విమాన టికెట్లు ఇప్పించిన టీడీపీ

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు తమ వంతు సాయం చేస్తున్నామని బాబు తెలిపారు. తెలుగు ప్రజాలను రాష్ట్రానికి సురక్షితంగా పంపిస్తామన్నారు.

బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తారాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రికుల కోసం వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ సహకారాలు ముమ్మరం చేస్తుంటే, మన సీఎంకు మాత్రం ఏదీ పట్టడం లేదని ధ్వజమెత్తారు. తనపై ఆరోపణలు చేసే బదులు తెలుగు ప్రజలను రాష్ట్రానికి తరలించేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

వరద బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయా : చంద్రబాబు

తెలుగు బాధితులను ఆదుకోడానికి మాత్రమే వచ్చానని, రాజకీయాలు చేయడం లేదని, వరద రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకులేదని, ఓ మనిషిగా సహాయం చేయడానికి వచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ బాదితులను రాజకీయం చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వరద బాధితుల ఇబ్బందులను చూసి చలించిపోయానన్నారు. పలువురు యాత్రికులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపినట్లు చెప్పారు. తాను సాయం చేసేందుకే వచ్చానని, రాజకీయం చేసేందుకు రాలేదన్నారు.

ఎపి భవన్ అధికారుల తీరుపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యుల వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడమేమిటని ప్రశ్నించారు. వరద బాధితులకు వైద్యం అందకుండా అధికారులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎపి భవన్ అధికారుల వ్యవహార శైలిపై మంత్రి శ్రీధర్ బాబు విస్మయం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సహాయం నిరాకరించడంపై టిడిపి నేతలు శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. తెలుగు వారికి సౌకర్యాలు కల్పించని ఎపి భవన్ అధికారి శశాంక్ గోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు.

తెలుగు బాధితులను ఆదుకోడానికి వచ్చా : చంద్రబాబు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారికి అందించాల్సిన సహాయ చర్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలవనున్నారు.

సహాయ చర్యలపై పీఎం ను కలవనున్న బాబు