June 25, 2013

బాధితులకు అండగా 'దేశం'

 ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన వరద బాధితుల సంరక్షణ విషయంలో తెలుగు దేశం పార్టీ చురుకైన పాత్రను పోషిస్తోంది. బాధిత తెలుగు వారిని ఢిల్లిd నుంచి స్వగ్రామంలోని సొంత ఇంటికి చేర్చేదాకా బాధ్యతలను స్వీకరించి కొత్త ఒరవడిని సృష్టించింది. ఆ పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు ఒకవైపు పార్టీ శ్రేణులను, మరోవైపు ఎన్‌టీఆర్‌ ట్రస్టు సిబ్బందిని సమన్వయం చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసా గిస్తున్నారు. దాంతో భక్తుల తరలింపు వేగం పుంజుకుంటోంది. అధి నేత ఆదేశాల మేరకు టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఢిల్లిdలో మకాం వేసి సహాయ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. అదే రీతిలో డెహ్రాడూన్‌లో రమేశ్‌ రాథోడ్‌, రుషికేష్‌లో కె. నారాయణ సహాయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నాలుగు బేస్‌ క్యాంపుల వద్ద టీడీపీ వలంటీర్లను మోహరించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ట్రస్టు బాధ్యులతో బాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

ఫోన్ల వెల్లువ: ఎల్వీఎస్సార్కే

ట్రస్టు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌ చెప్పారు. వరద బాధితులు, వారి బంధువుల నుంచి వచ్చే సమాచారాన్ని ఉత్తరాఖండ్‌ అధికారులకు చేరవేస్తున్నట్లు చెప్పారు.

విరాళాలు: ఎన్టీఆర్‌ ట్రస్టు విరాళాల కోసం కోసం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు నరసింహా రావు లక్ష రూపాయలను ట్రస్టు సీఈఓ వెంకట్‌కు అందించారు. శాసన మండలిలో విపక్ష నేత యనమల 50 వేల విరాళాన్ని ప్రకటించారు.