December 23, 2012



ఒగ్గు డోలు కళాకారుల నృత్య విన్యాసాలు.. లంబాడీల సాంప్రదాయ నృ త్యాలు..డప్పుల చప్పుళ్లు.. యువకులు, విద్యార్థుల కేరింతలు.. మహిళల మం గళ హారతులు.. కుల వృత్తుల కోలాహ లం మధ్య చంద్రబాబు పాదయాత్ర జోరుగా..హుషారుగా సాగింది. వస్తు న్నా మీ కోసం పాదయాత్రలో భాగం గా శనివారం చంద్రబాబు నాయుడు కొత్తపల్లి శివారు నుంచి యాత్రను ఆ రంభించి కొత్తపల్లి గ్రామం, బస్టాండ్ మీదుగా అల్ఫోర్స్ స్కూల్, కిమ్స్ ఇం జినీరింగ్ కళాశాల, రేకుర్తి, ఎస్ఆర్ఆర్ కళాశాల, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ క్రాస్, నగునూర్ క్రాస్, ఎలబోతారం వరకు 15 కి లోమీటర్ల దూరం వరకు పాదయాత్ర సాగింది. ఈ యాత్రకు పెద్ద ఎత్తున జ నం తరలివచ్చారు. కరీంనగర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి వ చ్చిన జనం చంద్రబాబుకు ఘన స్వా గతం పలికారు.

మధ్యాహ్నాం 12 గం టలకు యాత్ర ఆరంభించగా అంతకుముందు హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తపల్లిలో ఈద్గా వద్ద పూజలు నిర్వహించారు. మార్గమధ్యంలో మిషన్ కుట్టి, మగ్గం నేశారు. బస్టాండ్ వద్ద నిర్వహించిన స భలో 1300 కిలోమీటర్ల దూరం వరకు పాదయాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో కే క్‌ను కట్ చేశారు. బహిరంగసభలో చే నేత డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు ఇది చారిత్రాత్మక మైనదని, 10 వేల కో ట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న బీసీ సబ్ ప్లాన్‌లో భాగంగా నేత కార్మికులను ఆదుకునేందుకు వెయ్యి కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయిస్తానని, గార్మెంట్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రజకులను ఎస్సీలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు.

అల్ఫోర్స్‌స్కూల్, కిమ్స్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి ని ర్వహించి వారిలో చైతన్యం తెచ్చారు. ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా ఉచితంగా సైకిళ్లను అందజేస్తామన్నా రు. బాగా చదువుకునే వారికి ల్యాప్ టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. ఢిల్లీ లో ఓ యువతిపై జరిగిన సంఘటనపై నిరసన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించడం లేదని విద్యార్థులను ప్రశ్నించిన చంద్రబాబు వారిచే రేకుర్తి వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీయించి నిరసన వ్య క్తం చేశారు. రేకుర్తి సాలెనగర్‌లో ము స్లింలు కన్వెన్షన్ ఏర్పాటుచేయగా అక్క డికి వెళ్లిన చంద్రబాబు మెడలో భారీ దండ వేశారు. ఈ సందర్భంగా వారు సమస్యలను విన్నవించారు.

వాటిని ప రిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద బహిరంగసభను ని ర్వహించి నగర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీతారాంపూర్ లో టీడీపీ మహిళా కార్యకర్తలు జై తె లంగాణ అనే అక్షరాలతో వేసిన చకినాలను బాబుకు అందించగా ఆయన రు చి చూశారు. మధ్యలో నూతన వధూవరులను ఆశీర్వదించారు.పాదయాత్ర సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెద్ద ఎత్తున జనాల్ని తరలించి పాదయాత్రను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎ మ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, ఎల్ రమ ణ, సుద్దాల దేవయ్య, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని న ర్సింగరావు, ఎండీ తాజొద్దీన్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పి రవీందర్ రావు, క ర్రు నాగయ్య, ముద్దసాని కశ్యప్ రెడ్డి, పుట్ట కిశోర్, గోపు అయిలయ్య యాద వ్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, నాయకులు ఒంటెల సత్యనారాయణరె డ్డి, జంగిలి సాగర్, కళ్యాడపు ఆగయ్య, దిండిగాల మహేష్, బీసీ సెల్ జిల్లా అ ధ్యక్షులు లక్ష్మీనారాయణ, తెలుగు యు వత జిల్లా అధ్యక్షులు వెంకట గౌతంకృ ష్ణ, తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరెడ్డి, ప్రధాన కార్యద ర్శి మంద రాజమల్లు, దామెర సత్యం, నగర అధ్యక్షులు గుగ్గిళ్లపు రమేష్, మం డల పార్టీ అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుర్ర సంజ య్, వెంకట్, అజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జోరుగా..హుషారుగా చంద్రబాబు "వస్తు న్నా మీ కోసం" పాదయాత్ర



వ స్తున్న మీ కోసం పాదయాత్ర లో భాగంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం 2 అంశాలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు పంపించారు. శనివారం కొత్తపల్లికి చేరకున్న బాబుకు బెజ్జం కి మండల వాసులు తోటపల్లి ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 5.2 లక్షల నష్ట పరిహారం ఇప్పించాలని కోరగా స్పందించిన బాబు లేఖ రాశారు. తోటపల్లి రిజర్వాయర్ కారణంగా వరికోలు, రాంచంద్రాపూర్ రైతులకు ఎకరానికి 2 లక్షల 10 వేలు మాత్రమే నిర్ణయించారని ఈ గ్రామాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లారం చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాలకు అబ్దుల్‌కలాం సు జల స్రవంతి పథకం కింద తీసుకున్న భూములకు ఎకరానికి 5.20 లక్షలు పరిహా రం ఇచ్చారని రైతులు పేర్కొన్నారు. అలాగే రామడుగు మండలంలో మోతె గ్రామస్తులు తమ గ్రామం నుంచి 14 కిలోమీటర్ల ఉన్న కరీంనగర్‌కు 2 ట్రిప్పులు మాత్రమే బస్సు నడుస్తుందని దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నవించగా అదనంగా 4 ట్రిప్పులు బస్సు సౌకర్యాన్ని క ల్పించాలని కోరారు. రెండు వినతి పత్రాలను కలెక్టర్‌కు పంపించారు.

తోటపల్లి,మోతె సమస్యలపై కలెక్టర్‌కు బాబు లేఖలు



ఉచిత కరెంట్ వద్దు.. ఉచితం వల్లే ఈ రాష్ట్రం నాశనం అవుతున్నది.. రాత్రి పూట కరెంట్‌కు రైతులు బలవుతున్నా రు.. చీకట్లో పాము కుడుతుందో, తేలు కుడుతుందో తెలియని పరిస్థితి.. పైస లు తీసుకోనయినా గుజరాత్ తరహాలో నాణ్యమైన కరెంట్ ఇస్తే చాలు.. ఎలాం టి పంటలనైనా సాగు చేస్తాం.. ప్రధాన సమస్యంతా కరెంటే'.. చామనపల్లి రైతు శ్రీనివాస్, 'మా ఇంట్లో మూడే బుగ్గలున్నాయి.. లైన్ కూడా బావులకు ఇచ్చే కరెంట్ లైన్‌తోనే ఉంది.. వ్యవసాయానికి ఎప్పుడు కరెంటిస్తారో.. అప్పు డే కరెంట్ వస్తుంది.. కానీ బిల్లులు మాత్రం 500 రూపాయలు వచ్చాయి.. ఇట్లయితే మేం ఎట్లా బతకాలి.. డీఏపీ బస్తా 1200.. అన్నీ ధరలు పెరిగాయి.. మేమేట్ల బతకాలో చెప్పు బాబూ'.. చా మనపల్లి మహిళ నిమ్మట్ల లక్ష్మి.. చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ యన మాట్లాడుతూ తెలుగుదేశం హ యాంలో వ్యవసాయానికి 9 గంటలు సరిపడా కరెంటిచ్చాం..

సబ్‌స్టేషన్ల వా రీగా విద్యుత్తు సరఫరాలో తేడాలు రా కుండా చర్యలు చేపట్టాం.. ఈ ప్రభు త్వం 6,300 కోట్లు అప్పులు చేసి యూ నిట్‌కు 15 రూపాయల చొప్పున విద్యుత్తును కొనుగోలు చేసింది. 9 గంటలు అని చెప్పి 7 గంటలు అంటున్నారు. అది కూడా ఇవ్వడం లేదు.. ఉచిత కరెం ట్ అని చెప్పి 2 గంటలు తగ్గించి మిమ్మ ల్ని మోసం చేశారు. 2 గంటలు తగ్గిస్తే 1200 కోట్ల రూపాయల లాభం వస్తుం ది. గుజరాత్ కంటే మనమే ముందుగా సంస్కరణలు చేపట్టి విద్యుత్తులో మిగు లు సాధించాం.. ఉద్యోగాలు కల్పిం చాం.. మంచి పాలన ఇచ్చాం.. మనల్ని చూసే గుజరాత్ నేర్చుకున్నది.. కాంగ్రె స్ అసమర్థ పాలన వల్ల 20 ఏళ్లు వెనక్కి పోవాల్సి వచ్చింది. 400 కోట్ల రూపాయలు లెక్క కాదని, ఉచితంగా 9 గంట ల కరెంటిస్తామని చెప్పారు.

సర్‌చార్జీల భారం కరెంట్ బిల్లులు బాగా వస్తున్నాయని, ఈ బిల్లులతో ప్రజలు బతికే పరిస్థితి లేదని.. కరెంట్ బిల్లులను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆం ధ్రప్రదేశ్‌లో తాము చేసిన అభివృద్ధిని చూసి గుజరాత్ ఎదిగిందన్నారు.వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం జూబ్లీనగర్, చామనపల్లి, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, ఐతురాజుపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి మీదుగా చంద్రబాబు పాదయాత్ర నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయా గ్రా మాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేయడం వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని, మానసికంగా కృంగి పోయే పరిస్థితి ఉందని ఈ విధానాన్ని ఎత్తివేసేందుకు పోరాడాలని మానస అనే ఇంటర్ విద్యార్థిని. మీరు పాదయా త్ర చేస్తుండడంతో మా ఊరికి రెండు రో జులు బస్సు వేసి ఇప్పుడు బంద్ చేశారని బి నిహారిక వాపోయింది.

చేనేత, గీత కార్మికులను ఆదుకోవాలని దూడ మల్లేశం, రాజయ్య కోరగా ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేసేందుకు పోరాడుతామ ని, చామనపల్లికి బస్సు వేసే విషయమై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తామని చెప్పా రు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు డిక్లరేషన్ ప్రకటించామని మరమగ్గాల కు సబ్సిడీ కరెంట్ ఇస్తామని, చేనేత బ జార్లు పెట్టి ఆదుకుంటామని దోతి, చీర పథకం పెట్టి నేత కార్మికులకు పని కల్పిస్తామని, పెన్షన్ పెంచుతామని, ఇళ్ల ని ర్మాణానికి లక్షా 50 వేల రూపాయలు ఇ స్తామని ప్రకటించారు. గీత కార్మికులు చెట్టుపై నుంచి పడితే 5 లక్షల ఎక్స్‌గ్రేషి యా చెల్లిస్తాని, పెన్షన్ 600 రూపాయ లు ఇస్తామని, చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని అన్ని విధానాల ఆదుకుంటామని తెలిపారు.

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని ఎన్టీఆర్ సుజల పథకం ద్వా రా అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటి అందిస్తామని హామీ ఇచ్చారు. మధ్యా హ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభం కాగా, ఆయనకు అడుగడుగునా ఆ యా గ్రామాల ప్రజలు నీరాజనాలు ప లికారు. జూబ్లీనగర్‌లో ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చామనపల్లి లో కూడా బాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించగా వారిని బయటి కి పంపించేందుకు పోలీసులు యత్నించగా చంద్రబాబు వారించారు. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఇది టీ ఆర్ఎస్ మీటింగ్ కాదని, మీ మీటింగ్‌లకు మా కార్యకర్తలు వచ్చి గొడవ చే యడం లేదని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్తులోనూ వ్య తిరేకంగా మాట్లాడనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాక ర్, సీహెచ్ విజయరమణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పి రవీందర్ రావు, గండ్ర న ళిని, కర్రు నాగయ్య, పుట్ట కిశోర్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, నాయకు లు ఒంటెల సత్యనారాయణరెడ్డి, జం గిలి సాగర్, కళ్యాడపు ఆగయ్య, దిండిగాల మహేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షు లు లక్ష్మీనారాయణ, తెలుగు రైతు ప్రధా న కార్యదర్శి మంద రాజమల్లు, మండ ల పార్టీ అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కాశెట్టి లావణ్య, నగర అధ్యక్షులు గుగిళ్లపు రమేష్, నాయకులు తోట రాములు, పిట్టల రవీందర్, కమ ల మనోహర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకు లు సంజయ్, వెంకట్, అజయ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలో జనతాదళ్(యూ) నేతలు..చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు మద్దతు పలికిన జనతాదళ్(యూ) పార్టీ నాయకులు ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి పట్టాభిరామయ్య, కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ వాహిద్, జిల్లా అధ్యక్షులు గంగరాజం, కోరుట్ల, సిరిసిల్ల ఇన్‌చార్జీలు వ డ్లకొండ శ్రీనివాస్, అంబళ్ల మల్లేశం, త దితరులు పాల్గొన్నారు.పుట్ట కిషోర్ యువ సేన హల్‌చల్..కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గం లో పాదయాత్ర చేపట్టిన పాదయాత్రకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జీ పుట్ట కిశోర్ నేతృత్వంలో 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చా రు. పుట్ట కిశోర్ యువ సేన పేరిట దాదాపు 80 మంది యువకులు పసుపు రంగు టీ షర్టులు ధరించి పాదయాత్ర లో హల్‌చల్ చేశారు.

వ్యవసాయానికి 9 గంటలు కరెంటిస్తాం..,

This is a poser that tests the popularity of chief ministers across the country. Having ranked chief ministers by their net popularity ratings in their respective states, we felt some of them were emerging as models for the nation.

Therefore, we asked all 17,500 voters surveyed who the best chief minister was. About 15 per cent named N. Chandrababu Naidu, 8 per cent Narendra Modi and 7 per cent Mayawati and Sushil Kumar Shinde. While Naidu was more popular among educated young voters in the urban areas, more of Mayawati's support came from across age groups in rural areas, predominantly illiterate Muslims and Dalits.

The myth that Indians vote largely along caste lines was undermined by the fact that while Shinde, a scheduled caste, is more popular among the upper castes, Mayawati, another Dalit leader, draws most of her popularity from the scheduled castes. While Modi from the backward community is more popular among the upper-caste Hindus, Naidu draws his overwhelming support from the OBC voters.

The ONE & The ONLY ONE



 నారుమళ్లు సాంతం పడనే లేదు. కానీ, రైతు సగం చచ్చిపోయాడు. రబీ ప్రారంభంలోనే అప్పుల ఊబీలో కూరుకుపోయాడు. సీజన్ మొదట్లోనే అన్నివిధాల చితికిపోయాడు. పంట పొలంలోనే తెల్లారిపోతున్నాడు. పొలంకు వెళ్లిన మనిషి ఎలా వస్తాడోనన్నట్టు పాపం ఆ ఇంటి ఇల్లాళ్లు బిక్కు బిక్కుమంటూ కనిపించారు. ఉత్తినే వాళ్లేమీ భయపడటం లేదని నడిచే దారిలో కనిపిస్తున్న పల్లెలను చూసినప్పుడు నాకు అనిపించింది.

నా యాత్ర సాగుతుండగానే జిల్లాలోని వీణవంక మండలం కొత్తపల్లెలో ఒక రైతు తెల్లవారుజామున కరెంటు మోటారు వేయడానికి ప్రయత్నించి బావిలో పడి చనిపోయాడు. "ఏమి చేయమంటారు సార్. పగలు కరెంటు రాదు. ఏ అర్ధరాత్రో ఇస్తారు. ఇంత మంచులోనూ పొలంలోనే పడిగాపులు పడాలి. ఆ చీకట్లో ఎక్కడ ఏముందో తెలియదు. పాము కరుస్తుందో, తేలు కుడుతోందో ఆ నిద్రమబ్బులో తెలుసుకోలేం. ఒక్కోసారి మోటారు వేయడానికి ఆ మబ్బులోనే పోయి షాక్‌కు గురవడమో, మోట బావిలో పడిపోవడమో జరుగుతోంది'' అని చామనపల్లిలో కలిసిన రైతు చెప్పిన మాటలు వ్యవస్థ దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ పాపం పాలకులదే!

అంతా గుజరాత్ అంటున్నారు. ఆ రాష్ట్రంలాగే ఆంధ్రాను తీర్చిదిద్దాలంటున్నారు. మంచిదే. కానీ, ఇప్పుడు గుజరాత్ సాధిస్తున్న ప్రగతిని మన రాష్ట్రం తొమ్మిదేళ్ల క్రితమే అందుకుంది. ఈ విషయం చాలామంది పట్టించుకోవడం లేదు. నా హయాంలో పారిశ్రామిక, ఐటీ రంగాలకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చాను. విదేశీ కంపెనీలకు దీటుగా మన పరిశ్రమలను ప్రోత్సహించి.. పోటీలో ముందు నిలిపాను.

"మీరు ముఖ్యమంత్రి కావాలి. గుజరాత్‌లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి'' అన్న ఆ రైతు ఆశాభావం అభినందనీయమే. కాకపోతే నా హయాంలో విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించాను. గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఆంధ్రా నుంచి పాఠాలు నేర్చుకునేవి. సమర్థుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం ఎంత అవసరమనేది దీన్ని బట్టే తెలుస్తోంది. అందుకే..రోజుకు 14 గంటలు నాణ్యమైన కరెంటును ఇచ్చిన నా పాలనను తొమ్మిదేళ్ల తరువాత కూడా రైతులు గుర్తు చేస్తున్నారు.

అప్పుడే గుజరాత్‌ను తలపించాం!



ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఎవరూ భయపడరని, ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరిశిక్ష విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్ళు గడిచినా ఆడబిడ్డలు బయటకు వెళ్తే తిరిగి వచ్చేవరకు నమ్మకం లేకుండా పోతున్నదని, మహిళలకు రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అత్యాచారం చేసిన వారిని వదిలేసి, శిక్షించాలని ఆందోళన చేసిన వారిపై లాఠీచార్జి చేయడం అత్యంత దారుణం, అమానుషమని గర్హించారు.

శిక్షించాలన్న వారిపై లాఠీచార్జా?