December 23, 2012

వ్యవసాయానికి 9 గంటలు కరెంటిస్తాం..,



ఉచిత కరెంట్ వద్దు.. ఉచితం వల్లే ఈ రాష్ట్రం నాశనం అవుతున్నది.. రాత్రి పూట కరెంట్‌కు రైతులు బలవుతున్నా రు.. చీకట్లో పాము కుడుతుందో, తేలు కుడుతుందో తెలియని పరిస్థితి.. పైస లు తీసుకోనయినా గుజరాత్ తరహాలో నాణ్యమైన కరెంట్ ఇస్తే చాలు.. ఎలాం టి పంటలనైనా సాగు చేస్తాం.. ప్రధాన సమస్యంతా కరెంటే'.. చామనపల్లి రైతు శ్రీనివాస్, 'మా ఇంట్లో మూడే బుగ్గలున్నాయి.. లైన్ కూడా బావులకు ఇచ్చే కరెంట్ లైన్‌తోనే ఉంది.. వ్యవసాయానికి ఎప్పుడు కరెంటిస్తారో.. అప్పు డే కరెంట్ వస్తుంది.. కానీ బిల్లులు మాత్రం 500 రూపాయలు వచ్చాయి.. ఇట్లయితే మేం ఎట్లా బతకాలి.. డీఏపీ బస్తా 1200.. అన్నీ ధరలు పెరిగాయి.. మేమేట్ల బతకాలో చెప్పు బాబూ'.. చా మనపల్లి మహిళ నిమ్మట్ల లక్ష్మి.. చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ యన మాట్లాడుతూ తెలుగుదేశం హ యాంలో వ్యవసాయానికి 9 గంటలు సరిపడా కరెంటిచ్చాం..

సబ్‌స్టేషన్ల వా రీగా విద్యుత్తు సరఫరాలో తేడాలు రా కుండా చర్యలు చేపట్టాం.. ఈ ప్రభు త్వం 6,300 కోట్లు అప్పులు చేసి యూ నిట్‌కు 15 రూపాయల చొప్పున విద్యుత్తును కొనుగోలు చేసింది. 9 గంటలు అని చెప్పి 7 గంటలు అంటున్నారు. అది కూడా ఇవ్వడం లేదు.. ఉచిత కరెం ట్ అని చెప్పి 2 గంటలు తగ్గించి మిమ్మ ల్ని మోసం చేశారు. 2 గంటలు తగ్గిస్తే 1200 కోట్ల రూపాయల లాభం వస్తుం ది. గుజరాత్ కంటే మనమే ముందుగా సంస్కరణలు చేపట్టి విద్యుత్తులో మిగు లు సాధించాం.. ఉద్యోగాలు కల్పిం చాం.. మంచి పాలన ఇచ్చాం.. మనల్ని చూసే గుజరాత్ నేర్చుకున్నది.. కాంగ్రె స్ అసమర్థ పాలన వల్ల 20 ఏళ్లు వెనక్కి పోవాల్సి వచ్చింది. 400 కోట్ల రూపాయలు లెక్క కాదని, ఉచితంగా 9 గంట ల కరెంటిస్తామని చెప్పారు.

సర్‌చార్జీల భారం కరెంట్ బిల్లులు బాగా వస్తున్నాయని, ఈ బిల్లులతో ప్రజలు బతికే పరిస్థితి లేదని.. కరెంట్ బిల్లులను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆం ధ్రప్రదేశ్‌లో తాము చేసిన అభివృద్ధిని చూసి గుజరాత్ ఎదిగిందన్నారు.వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం జూబ్లీనగర్, చామనపల్లి, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, ఐతురాజుపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి మీదుగా చంద్రబాబు పాదయాత్ర నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయా గ్రా మాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేయడం వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని, మానసికంగా కృంగి పోయే పరిస్థితి ఉందని ఈ విధానాన్ని ఎత్తివేసేందుకు పోరాడాలని మానస అనే ఇంటర్ విద్యార్థిని. మీరు పాదయా త్ర చేస్తుండడంతో మా ఊరికి రెండు రో జులు బస్సు వేసి ఇప్పుడు బంద్ చేశారని బి నిహారిక వాపోయింది.

చేనేత, గీత కార్మికులను ఆదుకోవాలని దూడ మల్లేశం, రాజయ్య కోరగా ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేసేందుకు పోరాడుతామ ని, చామనపల్లికి బస్సు వేసే విషయమై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తామని చెప్పా రు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు డిక్లరేషన్ ప్రకటించామని మరమగ్గాల కు సబ్సిడీ కరెంట్ ఇస్తామని, చేనేత బ జార్లు పెట్టి ఆదుకుంటామని దోతి, చీర పథకం పెట్టి నేత కార్మికులకు పని కల్పిస్తామని, పెన్షన్ పెంచుతామని, ఇళ్ల ని ర్మాణానికి లక్షా 50 వేల రూపాయలు ఇ స్తామని ప్రకటించారు. గీత కార్మికులు చెట్టుపై నుంచి పడితే 5 లక్షల ఎక్స్‌గ్రేషి యా చెల్లిస్తాని, పెన్షన్ 600 రూపాయ లు ఇస్తామని, చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని అన్ని విధానాల ఆదుకుంటామని తెలిపారు.

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని ఎన్టీఆర్ సుజల పథకం ద్వా రా అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటి అందిస్తామని హామీ ఇచ్చారు. మధ్యా హ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభం కాగా, ఆయనకు అడుగడుగునా ఆ యా గ్రామాల ప్రజలు నీరాజనాలు ప లికారు. జూబ్లీనగర్‌లో ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చామనపల్లి లో కూడా బాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించగా వారిని బయటి కి పంపించేందుకు పోలీసులు యత్నించగా చంద్రబాబు వారించారు. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఇది టీ ఆర్ఎస్ మీటింగ్ కాదని, మీ మీటింగ్‌లకు మా కార్యకర్తలు వచ్చి గొడవ చే యడం లేదని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్తులోనూ వ్య తిరేకంగా మాట్లాడనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాక ర్, సీహెచ్ విజయరమణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పి రవీందర్ రావు, గండ్ర న ళిని, కర్రు నాగయ్య, పుట్ట కిశోర్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, నాయకు లు ఒంటెల సత్యనారాయణరెడ్డి, జం గిలి సాగర్, కళ్యాడపు ఆగయ్య, దిండిగాల మహేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షు లు లక్ష్మీనారాయణ, తెలుగు రైతు ప్రధా న కార్యదర్శి మంద రాజమల్లు, మండ ల పార్టీ అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కాశెట్టి లావణ్య, నగర అధ్యక్షులు గుగిళ్లపు రమేష్, నాయకులు తోట రాములు, పిట్టల రవీందర్, కమ ల మనోహర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకు లు సంజయ్, వెంకట్, అజయ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలో జనతాదళ్(యూ) నేతలు..చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు మద్దతు పలికిన జనతాదళ్(యూ) పార్టీ నాయకులు ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి పట్టాభిరామయ్య, కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ వాహిద్, జిల్లా అధ్యక్షులు గంగరాజం, కోరుట్ల, సిరిసిల్ల ఇన్‌చార్జీలు వ డ్లకొండ శ్రీనివాస్, అంబళ్ల మల్లేశం, త దితరులు పాల్గొన్నారు.పుట్ట కిషోర్ యువ సేన హల్‌చల్..కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గం లో పాదయాత్ర చేపట్టిన పాదయాత్రకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జీ పుట్ట కిశోర్ నేతృత్వంలో 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చా రు. పుట్ట కిశోర్ యువ సేన పేరిట దాదాపు 80 మంది యువకులు పసుపు రంగు టీ షర్టులు ధరించి పాదయాత్ర లో హల్‌చల్ చేశారు.
No comments :

No comments :