December 23, 2012

జోరుగా..హుషారుగా చంద్రబాబు "వస్తు న్నా మీ కోసం" పాదయాత్ర



ఒగ్గు డోలు కళాకారుల నృత్య విన్యాసాలు.. లంబాడీల సాంప్రదాయ నృ త్యాలు..డప్పుల చప్పుళ్లు.. యువకులు, విద్యార్థుల కేరింతలు.. మహిళల మం గళ హారతులు.. కుల వృత్తుల కోలాహ లం మధ్య చంద్రబాబు పాదయాత్ర జోరుగా..హుషారుగా సాగింది. వస్తు న్నా మీ కోసం పాదయాత్రలో భాగం గా శనివారం చంద్రబాబు నాయుడు కొత్తపల్లి శివారు నుంచి యాత్రను ఆ రంభించి కొత్తపల్లి గ్రామం, బస్టాండ్ మీదుగా అల్ఫోర్స్ స్కూల్, కిమ్స్ ఇం జినీరింగ్ కళాశాల, రేకుర్తి, ఎస్ఆర్ఆర్ కళాశాల, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ క్రాస్, నగునూర్ క్రాస్, ఎలబోతారం వరకు 15 కి లోమీటర్ల దూరం వరకు పాదయాత్ర సాగింది. ఈ యాత్రకు పెద్ద ఎత్తున జ నం తరలివచ్చారు. కరీంనగర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి వ చ్చిన జనం చంద్రబాబుకు ఘన స్వా గతం పలికారు.

మధ్యాహ్నాం 12 గం టలకు యాత్ర ఆరంభించగా అంతకుముందు హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తపల్లిలో ఈద్గా వద్ద పూజలు నిర్వహించారు. మార్గమధ్యంలో మిషన్ కుట్టి, మగ్గం నేశారు. బస్టాండ్ వద్ద నిర్వహించిన స భలో 1300 కిలోమీటర్ల దూరం వరకు పాదయాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో కే క్‌ను కట్ చేశారు. బహిరంగసభలో చే నేత డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు ఇది చారిత్రాత్మక మైనదని, 10 వేల కో ట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న బీసీ సబ్ ప్లాన్‌లో భాగంగా నేత కార్మికులను ఆదుకునేందుకు వెయ్యి కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయిస్తానని, గార్మెంట్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రజకులను ఎస్సీలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు.

అల్ఫోర్స్‌స్కూల్, కిమ్స్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి ని ర్వహించి వారిలో చైతన్యం తెచ్చారు. ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా ఉచితంగా సైకిళ్లను అందజేస్తామన్నా రు. బాగా చదువుకునే వారికి ల్యాప్ టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. ఢిల్లీ లో ఓ యువతిపై జరిగిన సంఘటనపై నిరసన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించడం లేదని విద్యార్థులను ప్రశ్నించిన చంద్రబాబు వారిచే రేకుర్తి వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీయించి నిరసన వ్య క్తం చేశారు. రేకుర్తి సాలెనగర్‌లో ము స్లింలు కన్వెన్షన్ ఏర్పాటుచేయగా అక్క డికి వెళ్లిన చంద్రబాబు మెడలో భారీ దండ వేశారు. ఈ సందర్భంగా వారు సమస్యలను విన్నవించారు.

వాటిని ప రిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద బహిరంగసభను ని ర్వహించి నగర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీతారాంపూర్ లో టీడీపీ మహిళా కార్యకర్తలు జై తె లంగాణ అనే అక్షరాలతో వేసిన చకినాలను బాబుకు అందించగా ఆయన రు చి చూశారు. మధ్యలో నూతన వధూవరులను ఆశీర్వదించారు.పాదయాత్ర సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెద్ద ఎత్తున జనాల్ని తరలించి పాదయాత్రను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎ మ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, ఎల్ రమ ణ, సుద్దాల దేవయ్య, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని న ర్సింగరావు, ఎండీ తాజొద్దీన్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పి రవీందర్ రావు, క ర్రు నాగయ్య, ముద్దసాని కశ్యప్ రెడ్డి, పుట్ట కిశోర్, గోపు అయిలయ్య యాద వ్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, నాయకులు ఒంటెల సత్యనారాయణరె డ్డి, జంగిలి సాగర్, కళ్యాడపు ఆగయ్య, దిండిగాల మహేష్, బీసీ సెల్ జిల్లా అ ధ్యక్షులు లక్ష్మీనారాయణ, తెలుగు యు వత జిల్లా అధ్యక్షులు వెంకట గౌతంకృ ష్ణ, తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరెడ్డి, ప్రధాన కార్యద ర్శి మంద రాజమల్లు, దామెర సత్యం, నగర అధ్యక్షులు గుగ్గిళ్లపు రమేష్, మం డల పార్టీ అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుర్ర సంజ య్, వెంకట్, అజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments :

No comments :