October 1, 2012




నేడే వస్తున్నా..మీకోసం...ఈనాడు

Naidu’s forthcoming show: Vastunna Meekosam

23rd September 2012 08:56 AM
After a series of discussions with several prominent Tollywood film directors and writers the Telugu Desam leadership has decided to name party chief N Chandrababu Naidu’s Padayatra from Hindupur in Anantapur district from October 2 as ‘Vastunna Meekosam’.
The party, which has received drubbing in a series of elections in the last eight years, is banking heavily on Naidu’s Padayatra to ride on it to power in 2014 and its leaders have started making preparations with high political expectations.
Naidu had met Tollywood successful directors SS Rajamouli and Srinu Vaitla and sought suggestions from them to make his mass-contact programme a superhit. He also met ace director and party sympathiser K.Raghavendra Rao, and Murali Mohan and AVS to discuss his yatra.
He finalised the name, ‘Vastunna Meekosam’, for the Padayatra after  a lengthy discussion with the famous writer duo _ Paruchuri Brothers.  Senior leader Yanamala Ramakrishnudu and some others participated in the discussions. TDP prepared audio CDs with several songs for the yatra, which will be shortly released. On the other hand, film actor Balakrishna, brother-in-law of Naidu, is also providing suggestions and directions to Naidu.
A TDP leader said it was not new for the party chief to involve Tollywood stars in party work and recalled election campaigning by several stars in 2004 and 2009.
Turning to real issues, the TDP chief blamed prime minister Manmohan Singh’s for the country’s present situation and alleged that he had failed to implement the economic reforms in the right direction and with a human face. He described Manmohan Singh as inefficient and demanded a white paper on all the scams that surfaced during his eight-year rule.
Naidu alleged that the Congress government in the state failed to ensure that the Assembly discussed people’s problems. His party MLAs staged a protest at the Mahatma Gandhi statue on the Assembly premises on Saturday against the government’s alleged failure to conduct the Assembly proceedings properly.

Naidu’s forthcoming show వస్తున్నా మీకోసం

Naidu to launch padayatra from Hindupur tomorrow

STAFF WRITER 17:13 HRS ISTHyderabad, Oct 1 (PTI)

 TDP president N Chandrababu Naidu will launch a padayatra (foot march) from Hindupur in Anantapur district tomorrow on the occasion of Gandhi Jayanti.

The Leader of Opposition in Andhra Pradesh Assembly is expected to cover over 2,000 kms in 117 days covering about 13 out of 23 districts of the state in the first round of 'Vastunna...mee kosam' (I am coming....for you) yatra.

PTI న్యూస్ లో పాదయాత్ర

వస్తున్నా..మీకోసం స్లోగన్స్ ని అప్ లోడ్ చేసిన అన్న శ్రీనాద్ మరియు చంద్రశేఖర్కి  ధన్యవాదములు..................


శ్రీనాద్



 

చంద్రశేఖర్ 


వస్తున్నా..మీకోసం స్లోగన్స్

Etv2_Idi Sangathi_ 28th September_Part 1 

Published on Sep 28, 2012
ఈటీవి2 - ఇదీ సంగతీ  ( వస్తున్నా... మీ కోసం ) చంద్రబాబుతో ముఖాముఖి





Etv2_Idi Sangathi_ 28th September_Part 2 

 

ఈ-టి.వీ-2 ఇదీ సంగతి లో బాబు

RK Big Debate with Chandrababu on Vastunna Meekosam  

Published on Sep 28, 2012



 


ABN రాధక్రిష్ణ తో చంద్రబాబు

పాదయాత్ర మార్గం ఖరారు, పార్టీ నేతలతో సమన్వయం బాధ్యత మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన రావుకు అప్పగించారు. యాత్ర మార్గం పొడవునా ముందస్తుగా పార్టీ నేతలను సన్నద్ధం చేయడం, ఇతర అంశాల పర్యవేక్షణను రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జనార్దన రావుకు అప్పగించారు. యాత్రలో చంద్రబాబు వెంట ఉండి సమన్వయం చేసుకొనే పనిని ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహనరావుకు ఇచ్చారు.

Vastunna Meekosam Slogan

పాదయాత్ర బాధ్యతలు

 వస్తున్నా మీకోసం పాదయాత్రలో తొలి రోజు చంద్రబాబు కుటుంబం మొత్తం పాల్గోనబోతుంది. బాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌లు మొదటి రోజు యాత్రలో పాల్గొంటారు. అయితే కోడలు బ్రాహ్మణి మాత్రం యాత్రలో పాల్గొనడం లేదు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దీంతో ఆమె యాత్రకు  దూరంగా ఉంటున్నారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ కూడా బాబు యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో ఓసారి ఆయనను కలవనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు మంగళవారం రోజు చంద్రబాబు తన ఇంటి నుండి నేరుగా సికింద్రాబాదులోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్తారు. ఆక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి, అటు నుండి బెంగుళూర్ వెళ్ళి అక్కడ నుండి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తారు.

యాత్రలో కుటుంబం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Written by Nagarjuna On 9/30/2012 4:17:00 AM

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.

రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు.

చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు.

పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.

బాబుకు కలిసిరాని కాలం!......సాక్షి (ఈ-పేపర్)

 

 

2014 తర్వాత పెనుమార్పులు

Mon, 24 Sep 2012, IST    
  • 2 నుంచి 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర : చంద్రబాబు ప్రకటన
హైదరాబాద్‌(వి.వి) : దేశం, రాష్ట్రంలో 2014 తరువాత పెనుమార్పులు సంభవిస్తాయని టిడిపి అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబునాయుడు అభిప్రాయ పడ్డారు. యుపిఎ స్థితి రోజురోజుకూ దిగజారు తున్నదని, ఎన్‌డిఎ పరిస్థితి కూడా అదేనని ఆయన అన్నారు. సోమవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ప్రారంభో పన్యాసం చేశారు. మూడవ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యునైటెడ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు ఎదురొడ్డిన ప్రాంతీయ పార్టీ ఒక్క టిడిపి మాత్రమేనని ఆయన చెప్పారు. ఇపుడు కూడా అలాంటి పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. పిఆర్‌పి దారిలోనే టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపిలు ప్రయత్ని స్తున్నాయని ఆయన చెప్పారు. విలీనానికి టిఆర్‌ఎస్‌ చర్యలు ప్రారంభించిందని ఆయన అన్నారు. ఇక భవిష్యత్తు టిడిపిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి సహా అన్ని వర్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్చుకుతింటున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సహా అన్ని వ్యవస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. డీజిల్‌ ధరల పెంపువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.800 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ఆర్‌టిసి బస్సు చార్జీలు పెంచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. వంటగ్యాస్‌పై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. పెంచిన బస్సు చార్జీలు వెంటనే తగ్గించవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరువుపై స్పందించని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను స్వాగతించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డిఐల వల్ల దేశంలోని కోటిన్నర కిరణాదుకాణాలు మూతపడతాయని, నాలుగు కోట్ల మంది జీవనోపాధి కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల దేశాన్ని లూటీ చేసేందుకు ఎక్కువ అవకాశం వుందని ఆయన అన్నారు. దేశ వనరులను బహుళ జాతి కంపెనీలకు అప్పగించి కాంగ్రెస్‌ పాలకులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దోపిడీకి
అవకాశం కల్పించి యుపిఎ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుందని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఫలితంగా చిన్న పరిశ్ర మలు మూతపడి 40 లక్షల మంది ఉపాధి కోల్పోయే దారుణమైన దుస్థితి నెలకొన్నదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహవినియోగదారులు నానా ఇబ్బందుల పాలయ్యారన్నారు. ఇప్పటికే అనేకమార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారని, మరోసారి రూ.600 కోట్ల భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురం నుండి యాత్ర : ఈ సమస్యపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అక్టోబర్‌ రెండవ తేదీ నుంచి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్ర చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి 26న యాత్ర ముగుస్తుందని తెలిపారు. యాత్రలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. మూడు దశాబ్దాలుగా ప్రజలు తమకు అండగా నిలిచారన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఇది తమ ప్రయత్నమని ఆయన తెలిపారు. పార్టీ విస్తృత సమావేశం ముగిసిన తరువాత తెలంగాణపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. నందమూరి హరికృష్ణ సహా ముఖ్య నాయ కులంతా హాజరయ్యారు. మంగళవారం సంస్థాగత ఎన్నికల అంశాన్ని చర్చిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
బాబు యాత్రకు 'వస్తున్నా-మీకోసం' పేరు ఖరారు : టిడిపి అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబు ప్రతి పాదితయాత్ర పేరు ఖరారైంది. 'వస్నున్నా-మీకోసం' అని యాత్ర పేరును పార్టీ ఖరారు చేసింది. అక్టోబర్‌ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమై జనవరి 26న ముగుస్తుంది. సోమవారం నాడిక్కడ పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశం పేరును ఖరారు చేసింది. పక్షం రోజులుగా పేరుపై పలు దశల్లో చర్చలు జరిపిన పార్టీ 'వస్తున్నా-మీకోసం'ను పేరును ఖరారు చేసింది.
27న మైనారిటీ డిక్లరేషన్‌ : మైనారిటీల సమస్యలపై ఈ నెల 27వ తేదీన టిడిపి డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించింది. పార్టీ ప్రధానకార్యదర్శి లాల్‌జాన్‌ పాష సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విషయాన్ని ప్రకటించారు. ఈ నెల 26న పార్టీకి సంబంధం లేకుండా ముస్లిం పెద్దలతో సమావేశమై వారి సలహాలు సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులో ఈ అంశాలను చర్చించి డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని ఆయన వివరించారు.
30న సీమాంధ్ర, 4న తెలంగాణాలో టిడిపి ఎన్నికలు : టిడిపి ఎన్నికలు ఈ నెల 30వ తేదీన సీమాంధ్రలో, తెలంగాణాలో అక్టోబర్‌ 4వ తేదీన జరుగుతాయని పోలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రంనాయుడు చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అక్టోబర్‌ 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల స్థాయి కమిటీల ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వరకు పల్లె పల్లెకు తెలుగుదేశం పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

2014 తర్వాత పెనుమార్పులు...విశాలాంధ్ర





వస్తున్నా... మీకోసం

  • బాబు యాత్రకు నామకరణం
  • 30న సీమాంధ్ర, 5న తెలంగాణలో జిల్లా కమిటీల ఎన్నికలు
  • 20 నుంచి పల్లె పల్లెకూ తెలుగుదేశం - ఎర్రన్నాయుడు వెల్లడి
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేపట్టనున్న పాదయాత్రకు నామకరణం ఖరారైంది. 'వస్తున్నా... మీకోసం' అనే పేరు ఖరారు చేసినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలనూ ప్రకటించారు. సోమవారం టిడిపి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చేపట్టనున్న పాదయాత్రకు 'వస్తున్నా... మీకోసం' అనే పేరును ఖరారు చేశామని, బాబు ఈ యాత్రను అక్టోబర్‌ 2న ప్రారంభించి 117 రోజులపాటు పాదయాత్ర చేసి 2013 జనవరి 26న ముగించనున్నారని తెలిపారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను రెండు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీమాంధ్ర జిల్లాల్లో సెప్టెంబర్‌ 30న, తెలంగాణ జిల్లాల్లో అక్టోబర్‌ 5న జిల్లా కార్యవర్గ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వివిధ వర్గాల కోసం చేసిన మంచి పనులను చెబుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఐఎంజి కేసులో చంద్రబాబును ఇరికించాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చాలాసార్లు ప్రయత్నించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎంజి కేసును కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయన్నారు. తద్వారా కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకోవాలనే ఆలోచన చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కలిసిపోవడం రెండు ప్రకటనలూ ఒకేసారి రావచ్చన్నారు. కోర్టుల్లో ఎప్పుడూ వాదించని కొత్త న్యాయవాదులను నియమించి జగన్‌ కేసును నీరుగార్చే కుట్రకు కాంగ్రెస్‌ పూనుకుంటోందన్నారు. ఎన్ని పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా టిడిపి దేనికీ బెదరదని, తొణకదని పేర్కొన్నారు. తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

వస్తున్నా... మీకోసం ...వార్త ప్రజాశక్తిలో



Andhra Pradesh | Updated Sep 25, 2012 at 08:52am IST

 

Naidus forthcoming show: Vastunna Meekosam

After a series of discussions with several prominent Tollywood film directors and writers the Telugu Desam leadership has decided to name party chief N Chandrababu Naidu’s Padayatra from Hindupur in Anantapur district from October 2 as ‘Vastunna Meekosam’.
The party, which has received drubbing in a series of elections in the last eight years, is banking heavily on Naidu’s Padayatra to ride on it to power in 2014 and its leaders have started making preparations with high political expectations.
Naidu had met Tollywood successful directors SS Rajamouli and Srinu Vaitla and sought suggestions from them to make his mass-contact programme a superhit. He also met ace director and party sympathiser K.Raghavendra Rao, and Murali Mohan and AVS to discuss his yatra.
He finalised the name, ‘Vastunna Meekosam’, for the Padayatra after  a lengthy discussion with the famous writer duo _ Paruchuri Brothers.  Senior leader Yanamala Ramakrishnudu and some others participated in the discussions. TDP prepared audio CDs with several songs for the yatra, which will be shortly released. On the other hand, film actor Balakrishna, brother-in-law of Naidu, is also providing suggestions and directions to Naidu.
A TDP leader said it was not new for the party chief to involve Tollywood stars in party work and recalled election campaigning by several stars in 2004 and 2009.
Turning to real issues, the TDP chief blamed prime minister Manmohan Singh’s for the country’s present situation and alleged that he had failed to implement the economic reforms in the right direction and with a human face. He described Manmohan Singh as inefficient and demanded a white paper on all the scams that surfaced during his eight-year rule.
Naidu alleged that the Congress government in the state failed to ensure that the Assembly discussed people’s problems. His party MLAs staged a protest at the Mahatma Gandhi statue on the Assembly premises on Saturday against the government’s alleged failure to conduct the Assembly proceedings properly.

 

 

వస్తున్నా మీకోసం.. వార్త IBNLive

అనంతపురం జిల్లా హిందూపురం నుండి బాబు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేస్తారు.
           హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారు.
          పాదయాత్ర కోసం ప్రత్యేక పాటలని రూపొందించారు. సినిమా రంగానికి చెందిన సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, రామజోగయ్యశాస్త్రి ఈ పాటలని సమకూర్చారు. పాదయాత్రలో ప్రజల్ని ఆకర్షించేందుకు ఆరు పాటలని పాడారు. ప్రధానంగా కాంగ్రెస్‌ అవినితి అసమర్ద పాలన, బాబు హయాంలో జరిగిన అభివృద్దిని  ప్రజలకు వివరించేలా సాంగ్స్ రూపొందించారు. ఆ పాటల వినలనుకుంటే క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

వస్తున్నా..మీకోసం పాటలు : http://www.telugudesam.org/songs/

అక్టోబర్ 2 ప్రారంభ పాదయాత్ర