July 28, 2013

'తెలంగాణ ఏర్పడితే... అక్కడ నేనే ప్రధాన నాయకుడిని. రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే' అని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలో ఆయన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ సొత్తు కాదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజలను దోచుకుతింటున్నాయని విమర్శించారు.

తెలంగాణలో నేనే ప్రధాన నేతను...విభజన కాకుంటే బాబే సీఎం: ఎర్రబెల్లి

టీడీపీ పార్టీతోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని టీడీపీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రెండు విడతల్లో వెలువడిన ఫలితాల దృష్ట్యా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబు నాయకత్వం కోరుకుంటున్నారన్నారు.

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం : ఎర్రబెల్లి

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడడాన్ని ప్రశ్నించిన
దేవినేని ఉమాను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండవ దశ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మూలపాడు గ్రామంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఒక్కటై ఒకే డోర్ నెంబర్, ఇంటి పేరుతో 280 మంది ఓట్లు వేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఇది అన్యాయమంటూ రిగ్గింగ్‌ను అడ్డుకున్న ఏజెంట్లపై తల్లిపిల్లా కాంగ్రెస్ నేతలు పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించారని రావి ఆవేదన వ్యక్తం చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోకుండా ఏజెంట్లపై దాడి చేయడం అన్యాయమని ప్రశ్నించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని రావి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. అధికారం కోసం దొడ్డిదారిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు రిగ్గింగ్‌కు పాల్పడడాన్ని ఓటర్లు తిప్పికొట్టాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి నూతక్కి బాలాజీ, అంగడాల సతీష్, లింగం ప్రసాద్, కామినేని శ్రీరామకృష్ణప్రసాద్, పెద్దు వీరభద్రరావు, జి. పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

ఉమా అరెస్టు దారుణం

ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం టీడీపీకి మాత్రమే ఉందని తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దేముల్ మండలంలో టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. బుద్దారం, పెద్దేముల్‌తండా, మంబాపూర్, కొండాపూర్, ఒగులాపూర్, నాగులపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనదని అన్నారు. వారంతా జైలు పాలవుతారని తెలిపారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే పట్టం కట్టారని తెలిపారు. జరగబోయే గ్రామాల్లో కూడా టీడీపీ అధిక సంఖ్యలో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాలను అభివృద్ధి చేయలేక పోయిందని, జరిగిన అభివృద్ధి అంతా ఎమ్మెల్యేగా తాను చేసిందేనన్నారు. అందుకోసమే ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజీపూర్ నారాయణరెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు కొమ్ముగోపాల్‌రెడ్డి, శామ్‌రావు పంతులు, మోహన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, చిన్న రాసన్న, ఎం.రాములు, రాంచందర్, పాండు, అశోక్, నర్సిములు పాల్గొన్నారు.

ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉంది

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బాబు

తమ బలం అంతా చంద్రబాబుపైనే ఆధారపడి ఉంటుందని, ఆయన ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆధారపడి తమ విజయావకాశాలు ఉంటాయని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాల నుంచీ పోటీ చేయడానికి చంద్రబాబుకు అవకాశం ఉండదని, ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవలసి ఉంటుందని, దీనివల్ల ఆయన పోటీ చేయని రెండో ప్రాంతంలో పార్టీ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు.

ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నప్పటికీ చంద్రబాబు అభిప్రాయం మరో రకంగా ఉంది. రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. విభజనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉద్యమించడం వల్ల రాష్ట్ర ప్రజలకు మరింత హాని చేసిన వాళ్లం అవుతాం. తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంటే, సీమాంధ్రకు న్యాయం చేయడానికి ఏమి కావాలో అప్పుడే అడగవచ్చునని ఆయన అభిప్రాయపడుతున్నారు. వై.సి.పి. విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా దెబ్బతిన్నందున సీమాంధ్రకు మాత్రమే పరిమితం కావాలన్న నిర్ణయానికి వచ్చారని, ఆ కారణంగానే రాజీనామాల అంకానికి తెర తీశారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో అంతో ఇంతో బలంగా ఉన్నది తెలుగుదేశం పార్టీనే కనుక తొందరపాటుతో వ్యవహరించి నష్టపోకూడదన్నది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుత పరిణామాలపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు.

విభజన పై చంద్రబాబు అభిప్రాయం!