March 28, 2013

హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరి ఆరోగ్యం గురువారం క్షీణించింది. దీక్షలో ఉన్నవారికి వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యబృందాలు 9 మంది పరిస్థితి బాగోలేదని, వారికి రక్తంలో చక్కెర స్థాయి, బీపీ బాగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు గుర్తించాయి. వారిలో సీతక్క, సత్యవతి రాథోడ్, జైపాల్ యాదవ్, శివిరి సోమ, దేవినేని ఉమా మహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, కొమ్మాలపాటి శ్రీధర్, జివి ఆంజనేయులు, కె. నారాయణరెడ్డి ఉన్నారు.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఉన్నారు. దీనిపై పోలీసులు టీడీపీ నేతలతో మాట్లాడారు. పరిస్థితి అసలు బాగోలేదని వైద్యులు గట్టిగా చెబితే వారిని ఆస్పత్రికి తరలించడానికి అనుమతిస్తామని, లేనిపక్షంలో వారు దీక్షలోనే కొనసాగుతారని టీడీపీ నేతలు చెప్పారు. దాంతో ప్రస్తుతానికి వారిదీక్ష కొనసాగుతోంది. నగరంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో గురువారం దీక్షా శిబిరం కిటకిటలాడింది. గురువారం 28 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కొత్తగా దీక్షలో చేరారు. సాయంత్రానికి ఈ దీక్ష మూడో రోజుకు చేరింది.

గుమ్మడికాయల దొంగ
'విద్యుత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మేం బ్లాక్ పేపర్ విడుదల చేశాం. అధికార కాంగ్రెస్ పార్టీ దానికి కిక్కురుమనలేదు. వైసీపీ మాత్రం ఉలిక్కిపడి తానొక పత్రాన్ని మాపై విడుదల చేసింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉంది' అని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్షా శిబిరం వద్ద ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కేఎస్ రత్నంలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

అబద్ధాలు, అర్ధ సత్యాలతో ఆ పార్టీ తన పత్రాన్ని విడుదల చేసిందని ఆయన విమర్శించారు. 'టీడీపీ అధికారంలో ఉండగా బడ్జెట్‌లో 7.8 శాతం నిధులు విద్యుత్ రంగానికి కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులను 3.9 శాతానికి తగ్గించింది. మొత్తం విద్యుత్‌లో మేం వ్యవసాయానికి 62% ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో అది 45%కు తగ్గిపోయింది. టీడీపీ హయాంలో వ్యవసాయానికి 9గంటలు ఇచ్చాం. వైఎస్ రాగానే దాన్ని 7 గంటలకు తగ్గించారు. దమ్ముంటే రండి.. ఇది నిజమో కాదో రైతుల వద్దకు వెళ్లి తెలుసుకొందాం' అని ఆయన సవాల్ విసిరారు.

దీక్షలో తొమ్మిది మందికి క్షీణించిన ఆరోగ్యం

హైదరాబాద్ : బాబ్లీకి సంబంధించి సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పామని కడియం శ్రీహరి చెప్పారు. గోదావరి జలాల వినియోగంపై ఏర్పాటయ్యే త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పని చేయాలని, దాని

సుప్రీం తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకమంటూ సీఎం కిరణ్‌ను ఒప్పించగలిగామని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిందని, రివ్యూ పిటిషన్‌కు అంగీకరించిందని తెలిపారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సూచించామని వైసీపీ నేత సంకినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. కంతానపల్లి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరామన్నారు. బాబ్లీపై సర్కారుకు నిర్దిష్ట ప్రణాళిక లేదని, మళ్లీ న్యాయ సలహాకు వెళుతోందంటే తెలంగాణపై సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

సుప్రీం తీర్పుపై రివిజన్ పిటిషన్ వేయాలని సూచించామని, అయితే ఇది ఎంతవరకు సాధ్యమో పరిశీలిస్తున్నారని విద్యాసాగర్‌రావు చెప్పారు. రివ్యూపిట్‌షన్ వేసినా.. జడ్జిమెంట్‌ను సుప్రీం మార్చుకోకపోతే ఏం చేయాలనే దానిపైనా ఆలోచన ఉండాలన్నారు. సుప్రీంతీర్పులో స్పష్టత లేదని, క్లారిఫికేషన్ పిటిషన్ వేయాలని సూచించామని వినోద్‌కుమార్ చెప్పారు. మహారాష్ట్ర 60 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడుతోందని ప్రధాని వద్దకు అఖిలపక్షంగా వెళ్లి చెబుదామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

అసలు సుప్రీం తీర్పులో ఏమి వచ్చిందో ప్రభుత్వానికి అవగాహన లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. నిపుణులు, ఇంజనీర్ల సలహాలతో రివ్యూ పిటిషన్ వేయాలని, కేంద్రంపై ఒత్తిడి కూడా తేవాలని సూచించారు. రివ్యూ పిటిషన్ పరిధిని విస్తృతం చేయాలని శేషగిరిరావు సూచించారు. సుప్రీంలో ప్రభుత్వం సరైన వాదన వినిపించలేదని, అందుకే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుండా మల్లేశ్, జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రివ్యూ పిటిషన్ వేయాలని, రాజకీయ పరిష్కారం చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరామన్నారు.
ఖర్చులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు భరించేలా ఉండాలని సూచించామన్నారు. బాబ్లీపై సుప్రీంలో ప్రభుత్వం పేలవమైన వాదనలు వినిపించిందని ధ్వజమెత్తారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అనేక సమస్యలు, కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలోని 18 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడుకునేందుకు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. బాబ్లీ ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే ప్రారంభమైందన్న విమర్శకు స్పందిస్తూ.. 2004 ఆగస్టులో భూమిపూజ నిర్వహించినప్పుడు, 2005లో పనులు ప్రారంభమైనప్పుడు టీడీపీ అధికారంలో లేదన్నారు.

పిటిషన్ వేయాలి: కడియం

" రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగిన శక్తి చంద్రబాబుకు ఉందని ప్రజలు అనుకొంటున్నారు. చంద్రబాబు సమర్థుడైన నేత. అలాంటి వారు రావాల్సిన అవసరం ఉంది. దీక్షా దక్షతలు కలిగినవాడు. ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. విద్యుత్‌తో ప్రజలకు దూరమైన టీడీపీ ఇప్పుడు అదే విద్యుత్ఉద్యమంతో ప్రజలకు చేరువ అవుతోంది. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు అన్నారని ప్రజలు నమ్మడంలేదు. వ్యవసాయాన్ని వదిలి లాభదాయక వృత్తులను చూసుకోవాలని వైఎస్, రోశయ్య కూడా చెప్పారు. మా జెండా నీడలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేం ఉద్యమం చేస్తుంటే పట్టించుకోవడంలేదు. దీని ఫలితం ఆ పార్టీ అనుభవిస్తుంది''
-టీడీపీ ఎమ్మెల్యేల దీక్షాశిబిరం వద్ద సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

బాబుతోనే రాష్ట్రం బాగు: కూనంనేని

ఎమ్మెల్యేలపై వేటు వేయండి

హైదరాబాద్ : శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ విప్‌ను ఉల్లంఘించారంటూ 9 మంది ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. వీరిలో ఏడుగురు సీమాంధ్ర నేతలు, ఇద్దరు తెలంగాణ నేతలు ఉన్నారు. విప్ ఉల్లంఘనపై ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్‌నాథరెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), సముద్రాల వేణుగోపాలాచారి (ముధోల్) ఉన్నారు.

అవిశ్వాసంపై రెండు దఫాల ఓటింగ్‌కు అందరూ హాజరైతటస్థంగా వ్యవహరించాలని టీడీపీ విప్ జారీచేసింది. అయితే... రామకోటయ్య, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ఓటింగ్‌కు రాలేదు. మిగిలిన వారు వచ్చినా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోవచ్చా లేదా అన్నదానిపై ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరికి నోటీసులు జారీచేసి, సమాధానం అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

విప్ ఉల్లంఘనపై స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు

కాకినాడ  తెలుగుదేశం పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా పెదపూడిలో శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జిల్లాలో పాదయాత్రచేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటల నుంచీ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న నేతలను సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు.

తూర్పులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నేడు

కాకినాడలోని సూర్యారావుపేట సాగర తీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఆ పార్టీ నగర శాఖ మాజీ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు గురువారం రూపొందించారు. టీడీపీ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి అండ నినాదంతో పార్టీ చిహ్నాన్ని తీర్చిదిద్దారు.

సాగర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తాం
రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయండి
రజకులకు చంద్రబాబు పిలుపు
కిరణ్ పనికిమాలిన సీఎం అంటూ ధ్వజం

కాకినాడ: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీలుగా గుర్తించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా బిక్కవోలు, గొల్లలమామిడాడ, పెద్దాడ, పెదపూడిలలో చంద్రబాబు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రసంగించారు. నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేసి వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టేందుకు తాను రుణమాఫీ చేస్తానని చెబుతుంటే కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లు అసాధ్యమని చెబుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ పెట్టుబడులు 300 శాతం పెరిగినా పంటల ధరలు 30 శాతం కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు ఉతికినట్లు కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయాలని బిక్కవోలు మండలంలో ఏర్పాటు చేసిన జిల్లా రజకుల సమావేశంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. రజక సంఘాలను బలోపేతం చేస్తామని, దోబీఘాట్‌లు పునరిద్ధరిస్తామని, రజకులను ఎస్సీల్లోకి చేర్చేందుకు కృషి చేస్తామని హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.

అన్నదాతను ఆదుకుంటాం

అనంతపురం రూరల్: వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేసి పంటలు ఎండకుండా చూడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం కళ్యాణదుర్గం రోడ్డు రాజా హోటల్ దగ్గర టీడీపీ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశా రు. టీడీపీ మండల కమిటీ కార్యాల యం నుంచి ఎమ్మెల్యే సునీత, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరిం చి రాజా హోటల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం గంట సేపు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు, ప్రజల సమస్యలపై హైదరాబాద్‌లో 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. వీటిని రాజకీయ లబ్ధికోసం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు, ప్రజల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరం కోసం రూ.30 కోట్లు నిధులు విడుదల చేస్తే కొంతమేర నీటి ఎద్దడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పరిటాల మహీంద్ర, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయడు, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, జిల్లా మైనార్టీ నాయకులు సైపుద్దీన్, టీడీపీ రూరల్ మండల కన్వీనర్ వేంకటేష్, మాజీ ఎంపీటీసీలు వీరాంజినేయులు, వేణుగోపాల్, సూర్యనారాయణ, నాయకులు మారినేని లక్ష్మీనారాయణ, కొం డయ్య, గంగాధర్‌నాయుడు, సొసైటీ డైరెక్టర్ వెంకటప్ప, నూర్‌బాషా, ము ఖేష్‌శీనా, సాంబశివుడు, షపీ, రఘు, మునిరెడ్డి, రుద్రయ్య, నారాయణరెడ్డి, శ్రీరామిరెడ్డి, శ్రీరాములు, బీసీ సెల్ బాబు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఏడు గంటలు విద్యుత్ సరాఫరా చేయాలి : పరిటాల సునీత

కాకినాడ: ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో పదో రోజుకి చేరుకుంది. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు యాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాకు వచ్చిన తొలి ఐదారు రోజులూ రోజూ 14 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిచిన చంద్రబాబు మూడు రోజుల నుంచి దూరం తగ్గించారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ చంద్రబాబు 107.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర చేశారు. 29వ తేదీ నాటికి అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవుతుంది.అక్కడి నుంచి కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజవవర్గాలలో బాబు పాదయాత్ర చేపడతారు.

కాపు సామాజికవర్గంపైనే ప్రధాన గురి... జిల్లాలో బీసీ, మాదిగ ఉప కులాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక జిల్లా రాజకీయాల్లో కీ లక సామాజికవర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో అడుగుపెట్టింది మొదలు... ప్రతి సభలోనూ అగ్రవర్ణాల్లో కాపులలో పేదలు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. కాపుల్లో పేదలకు రిజర్వేషన్లు, కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానని పదేపదే ప్రస్తావిస్తున్నారు. మండపేటలో రాష్ట్ర కాపునేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

పెదపూడిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి చంద్రబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు.

పెదపూడిలో నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం


గుంటూరు : విద్యుత్ సంక్షోభాన్ని ప్రభు త్వం పరిష్కరించేంత వరకు తమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పరిష్కారం కోసం హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకొన్నది. దీక్షలో పుల్లారావుతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీవీఎస్ ఆంజనేయులు నీరసించిపోయారు. వారి శరీర చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయింది. ఎమ్మెల్యే శ్రీధర్ ఇటీవలే పచ్చకామెర్లకు గురయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోకముందే దీక్షలో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ట్లు సహచర ఎమ్మెల్యేలు తెలిపారు.

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని శాసనసభ లోపల, వెలుపల టీడీపీ ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించనందుకే తాము దీక్షకు దిగామని పుల్లారావు స్పష్టం చేశారు. గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు ర్రాష్టానికి ఎంతో పేరు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, రవాణ, ఆరోగ్యం, విద్య తదితర రంగాలన్నింటిని విద్యుత్ ప్రభావితం చేస్తోందన్నారు. ఈ సంక్షోభానికి వైఎస్ నాంది పలికితే రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగించారని చెప్పారు.

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ దూరదృష్టితో రాష్ట్రంలో 2770 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చివరి నాలుగు సంవత్సరాల్లో కరువు వచ్చినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నిరవధిక దీక్ష

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 29న గ్రామాగ్రామన, మండల, పట్ట ణ, జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులంతా ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ, జి ల్లా పార్టీ అధ్యక్షుడు వి.గంగాధర్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన డిచ్‌పల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆవిర్భా వ వేడుకలను ప్రతీ యేటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వ స్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలంటే తెలిసే విధంగా చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పార్టీ ఆవిర్భావించిన ఆరు నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కు ఒక్కరికే దక్కుతుందని, పే దల సంక్షేమం, బడుగు బలహీన వర్గా ల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర స్థాయి లో చెరగని ముద్ర వేశారన్నారు. దీనిలోభాగంగా రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళా సంఘాలకు రుణాలు, పేదలకు పక్కా గృహాలు ఎ న్టీఆర్ చేసిన ఘనతేనని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు నీరడి పద్మరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శ్యాంరావు, ఎర్రన్న, నడిపన్న, తదితరులున్నారు.

రేపు టీడీపీ ఆవిర్భావ వేడుకలు

వేటపాలెం: తెలుగుదేశం పార్టీ అధి కారంలోకి వస్తే వాన్‌పిక్ భూములు రైతులకు తిరిగి పంపిణీ చేస్తామని మాజీ ఎంపీ చిమటా సాంబు తెలి పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ స్థాయిలో పరిస్థితులు తెలుసు కునేందుకు బుధవారం మండలంలో ని అక్కాయపాలెం, చల్లారెడ్డిపాలెం, పుల్లరిపాలెం పంచాయతీలలో సాంబు పర్యటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రామా ల అభివృద్ధి 20 ఏళ్లు వెనుకబడి పో యిందని తెలిపారు. అందువల్ల పం చాయతీ ఎన్నికలలో టీడీపీ మద్దతు దారులను గెలుపించుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు. చంద్ర బాబు పాలనతోనే రైతులు, చేనేతల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితు లలో సైతం, సాగునీరు, విద్యుత్ సక్ర మంగా సరఫరా చేసిన ఘనత చంద్ర బాబుకే దక్కిందన్నారు. అక్కాయపా లెం పంచాయతీలోని లక్ష్మీపురం గుర వయ్య కాలనీలో కొందరు చేనేతలు విద్యుత్ కష్టాలను ఏకరువు పెట్టారు. ఎన్నికల సమయంలో వర్క్ షెడ్డులు నిర్మించుకునేందుకు వీలుగా ఇస్తామ న్న ఇంటి స్థలాల సంగతి ఇంతవరకు పట్టించుకో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చల్లారెడ్డిపాలెం, పుల్లరిపాలెం పంచాయతీలలో వాన్‌పిక్‌కు సంబం ధించి ఎటువంటి కారిడార్ నిర్మాణం జరగలేదు కాబట్టి తమ భూములకు సంబంధించిన పత్రాలు తమకు ఇస్తే బ్యాంక్ రుణాలు తెచ్చుకునేందుకు వీలుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ మం డల అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు, అక్కాయపాలెం గ్రామ అధ్యక్షుడు గొర్ల రాముడు, సూర్యచంద్ర, పింజల వీరవేణి, చల్లారెడ్డిపాలెం గ్రామ అధ్య క్షుడు గవిని వెంకటేశ్వర్లు, పుల్లరిపా లెం గ్రామ అధ్యక్షుడు తలారి రాజు, ప్రధాన కార్యదర్శి బచ్చుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి


అబ్దుల్లాపూర్‌మెట్ : విద్యుత్ కోతలకు నిరసనగా న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు తెలిపేందుకు హయత్‌నగర్ మండలం నుంచి టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తరలివెళ్లారు. హయత్‌నగర్ మండల టీడీపీ అధ్యక్షుడు జక్కా రాంరెడ్డి ఆధ్వర్యంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు తొర్పునూరి జగన్‌గౌడ్, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ పురం యాదగిరిరెడ్డి, జోర్క జగన్ ముదిరాజ్, సిద్దంకి జగన్‌మోహన్‌రెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వెళ్లారు.

నిరాహార దీక్షలకు తరలివెళ్లిన టీడీపీ నాయకులు


విజయనగరం టౌన్: విద్యుత్ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు టీడీపీ హ యాంలో స్వల్పంగా పెంచితే, వామపక్షాలతో కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద దుమారం చేసిందన్నారు. అదే ప్ర భుత్వం ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు వినియోగదారులపై భారం వేసేందుకు సిద్ధపడితే, టీడీపీ శాసన సభలో, బయట ఉద్యమిస్తోందన్నా రు.

వామపక్షనేతలు ప్రజాస్వామ్యయుతంగా నిరవధిక దీక్ష చేస్తే, వారిని అప్రజాస్వామికంగా భగ్నం చేసిందన్నారు. టీడీపీ కూడా వినియోగదారుల తరుపున రాజీలేని పోరాటం చేయాలన్న ఉద్ధేశంతోటే 24 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ హైదరాబాద్‌లోని ఓల్డ్‌క్వార్టర్స్ వద్ద నిరవధిక ధర్నాకు దిగారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షలకు మద్ధతుగా విజయనగరంలోని కోట జంక్షన్‌లో ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఈ నిరాహార దీ క్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పా ల్గొని విజయవంతం చేయాలని వారు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 29న విజయనగరం నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు సైలాడ త్రినా థ్, కనకల మురళీమోహన్ చెప్పారు.

పార్టీ కార్యాలయంలో వారు విలేఖర్ల తో మాట్లాడుతూ, కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద, పార్టీ కా ర్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టీ డీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. సమావేశం లో టీడీపీ నాయకులు ఆల్తి రమణ, మ ద్దాల ముత్యాలరావు, ముద్దాడ చంద్రశేఖర్, ఆదిబాబు పాల్గొన్నారు.

సాలూరు రూరల్: విద్యుత్ సమస్యపై రాష్ట్ర రాజధానిలో దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా సాలూ రు నియోజక వర్గంలో సంఘీభావ దీక్షలను ఈ నెల 28 నుంచి చేయనున్నట్టు ఆ పార్టీ సాలూరు ఇన్‌చార్జ్జి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం తెలిపారు. కరెంట్ తీగలను తాకితే షాక్ కొట్టే రో జులు పోయావన్నారు. కరెంట్ బిల్లులను చూస్తేనే షాక్‌కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ దీక్షలకు నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

శృంగవరపుకోట రూరల్ : విద్యుత్ సర్‌చార్జీలు తగ్గించాలని, అప్రకటిత విద్యుత్‌కోతలను నిలిపేయాలని కోరు తూ టీడీపీ ఆధ్వర్యంలో ఎస్.కోటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి టీడీపీ ముఖ్యనాయకులు శ్రీనాధుల పెదబాబు,జీఎస్.నాయుడు, రెడ్డి వెంకన్న, బుగత వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న నా యకులు మాట్లాడుతూ, ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజలపై రకరకాల భారాలు మో పుతుందన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందుల పడుతు న్నా, వారిపై కరెంట్ సర్‌చార్జీల భారం వేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టీడీపీ తరపున పోరాటం చేస్తామన్నారు.

కరెంటు బిల్లులు దగ్ధం: ఒక బల్బు, పంకా ఉన్న నిరుపేదలకు వేల రూపాయిల బిల్లు వస్తోందని, ఇది చాలా దా రుణమని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు గతం లో వందల్లో వచ్చేవని, నేడు వేలల్లో వస్తున్నాయని నిరసిస్తూ కరెంటు బి ల్లులను దగ్ధం చే«శారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్వరావు, ఆదినారాయ ణ, శోభరాజ్, ప్రభ,రామకృష్ణ, సుబ్బారావు, పిరిడి సింహాచలం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలకు నిరసనగా నేడు టీడీపీ నిరాహార దీక్ష పార్వతీపురం టౌన్ : అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం పార్వతీపురం కోర్టు వద్ద ప్రధాన రహదారిపై నిరాహార దీక్షలు చేపట్టనున ్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షలు ప్రా రంభమవుతాయని ఆయన తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమాను లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి


కాకినాడ :విద్యుత్ సమస్యపై శాసన సభలో సర్కారుపై సమర భేరీ మోగించిన టీడీపీ.. జనక్షేత్రంలో అంతకుమించి పోరాటపటిమ చూపాలని నిర్ణయించుకుంది. రాజధాని వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా... ఏప్రిల్ 1వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. విద్యుత్ సమస్యపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటన్నింటినీ... 19వ తేదీన హైదరాబాద్‌కు తరలించి గవర్నర్‌కు సమర్పిస్తామని తెలిపారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో విలేకరులతో మాట్లాడారు.

సర్‌చార్జీలు, కోతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. 'పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. దీనికి వైఎస్, కాంగ్రెస్సే కారమణం. బడ్జెట్‌లో కరెంటుకు టీడీపీ 7.5 శాతం నిధులు కేటాయిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 శాతమే ఇస్తోంది. టీడీపీ తొమ్మిదేళ్లలో రూ.1600కోట్ల మేర చార్జీలు పెంచగా... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31,200 సర్‌చార్జీలు బాదింది'' అని తెలిపారు. తాను సీఎంగా ఉండగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే విద్యుత్‌పై సమీక్షించి... ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించేవాడినని గుర్తుచేశారు. ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది.

తొలిరోజు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేపట్టగా... బుధవారం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా దీక్షలో చేరారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పరిటాల సునీత, సీతా దయాకరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్థసారధి, ఊకె అబ్బయ్య, వెంకట రమణారావు, ఎల్. రమణ, పి.రాములు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, ప్రకాశ్‌గౌడ్, పర్సా రత్నం, బల్లి దుర్గా ప్రసాదరావు, కె. రామకృష్ణ, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సతీశ్‌రెడ్డి, సలీం తదితరులు రిలేదీక్షలు చేశారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణరావు కొంతసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు.

ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో కూర్చున్నవారికి మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం సీపీఎం, సీపీఐ ప్రజా ప్రతినిధులు గుండా మల్లేష్, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్నవారిని వైద్యులు ఉదయం, సాయంత్రం పరీక్షించారు. ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

కరెంటుకోతలు, చార్జీలభారంతో ప్రజలను తిప్పలు పెడుతున్న ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. దీక్షా వేదికపై నుంచి వారు మాట్లాడారు. ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేస్తోందని, వేల కోట్ల రూపాయల భారం మోపుతోందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, విద్యుత్‌ను తెచ్చుకోవడంలో విఫలం కావడమే ఈ కష్టాలకు కారణమని... 30 మంది కాంగ్రెస్ ఎంపీలు, పదిమంది మంత్రులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని విమర్శించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఈ నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం పిలుపునిచ్చింది. 1982లో ఆవిర్భవించిన టీడీపీ ఈ నెలాఖరులో తన 32వ వ్యవస్థాపక వేడుకలను జరుపుకొంటోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ పవిత్ర ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, మూడు దశాబ్దాలుగా పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, కార్యకర్తల త్యాగాలు, నిస్వార్ధ సేవలు, చంద్రబాబు సారథ్యంతో ఎదిగిన పార్టీ పయనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ వేడుకలను అవకాశంగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్ధనరావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. ఆ జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోని మండల కేంద్రం పెద్దపూడిలో ఆయన ఇందులో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కరెంటుపై జనంలోకి..


సుబేదారి : తెలంగాణ జిల్లాల్లో విద్యుత్ కోతలతో రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ 22 నుంచి జరుగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రస్తావిస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య హామీ ఇచ్చారు. బుధవారం అమరవీరుల స్థూపం వద్ద రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన స్ఫూర్తి దీక్ష రెండో రోజకు చేరుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షడు ఎడబోయిన బస్వారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మాందాడి సత్యనారాయణరెడ్డి మ ద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎ మ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మిల్లర్లు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలను నివారించేందుకు, ప్రభుత్వం ప్ర త్యామ్నయ మార్గాలను చూపాల్సిన అ వసరం ఉందన్నారు. మిల్లర్లకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ యన పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షడు బస్వారెడ్డి మాట్లాడుతూ రైతన్న కు అండగా ఉండే మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్షం వహించడం తగదన్నారు. అతిపెద్ద ఇండస్ట్రీ రైస్ మిల్లులకు చేయూత నివ్వాల్సిన ప్రభుత్వం, అధికారులతో వేధింపులకు గురిచేయ డం సరికాదని ఆయన పేర్కొన్నారు.

విద్యుత్‌ను అందించక పోవడంతో మిల్లులు మూతపడిపోవడంతో, వేలా ది మంది కార్మికులు ఉపాధిని కొల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లేనట్లయితే ప్రతిపక్ష పార్టీగా టీడీపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. విద్యుత్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలను చేపట్టి నిరసన తెలియచేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిం చారు.

రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి అంజయ్య, ప్ర« ధాన కార్యదర్శి ఉప్పల వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైస్‌మిల్లర్స్ ఉపాధ్యక్షుడు మేచినేని సంపత్‌రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట సంపత్‌కుమార్, గుజ్జా ప్ర భాకర్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, ఇరుకుళ్ల రమేష్, మల్లయ్య తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రైస్‌మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, తదితరులు మద్దతు పలికారు. సాయంత్రం దీక్షలను చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు.

సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా..

అన్నదాతను ఆదుకునేందుకు
స్వామినాథన్ సిఫారసులు అమలుచేస్తాం
పేదల కోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకం : చంద్రబాబు

కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో 178వ రోజు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారం బిక్కవోలు, గొల్లలమామిడాడ, పెద్దాడ, పెదపూడిలలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రాన్ని ఆయన కుటుంబం హోల్‌సేల్‌గా దోచుకుందన్నారు.

రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు తాను రుణమాఫీ చేస్తానని చెబుతుంటే కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లు అసాధ్యమని చెబుతున్నాయన్నారు. వారికి రైతులపై ఏమాత్రం దయాదాక్షిణ్యాలులేవన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేసి వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 300 శాతం వ్యవసాయ పెట్టుబడులు పెరిగినా పంటలకు 30 శాతం కూడా ధర పెరగలేదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా అయ్యేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ దొంగలు పేదల్ని దోచుకుని బలిసిపోయారని చంద్రబాబు విమర్శించారు. ధరల పెరుగుదల, విద్యుత్‌కోతలతో రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు, ఎక్కడైనా పంటలు ఎండిపోతే తనకు చెప్పాలని చెప్పిన పొన్నాల ఊళ్లోనే పంటలు ఎండిపోతే ఏంచేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందిరమ్మ పేరు దోచుకునేది వీరు.. అని హౌసింగ్ అమలుపై బాబు ఎద్దేవాచేశారు.

కిరణ్‌కుమార్ రెడ్డి పనికిమాలిన సీఎం అని, అన్నీ తెలుసనుకుని ప్రగల్భాలు పలుకుతారని, అవినీతి తప్ప ఏమీతెలియదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేదల కోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకం తీసుకువస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కొంతమంది కార్పొరేట్ ఆసుపత్రుల బాగుకోసమేనన్నారు.
: వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలని బాబు పిలుపునిచ్చారు. రజకులను ఎస్సీలుగా గుర్తించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని రజక రణభేరిలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

రాష్ట్రాన్ని వైఎస్ కుటుంబం హోల్‌సేల్‌గా దోచుకుంది

హైదరాబాద్: తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలకు వైద్యులు గురువారం సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవెల్స్ పెరిగాయని, వారికి తక్షనం వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఎమ్మెల్యేలను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. శాసనసభ్యులను ఏ క్షణాన్నైనా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. పోలీసులు భారీగా మోహరించారు.

విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో తొమ్మిది మంది ఎమ్మేల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కాగా టీడీపీ నేతలు వైద్య సహాయానికి నిరాకరిస్తూ, తమ ఆరోగ్యం బాగానే ఉందని, దీక్ష కొనసాగించే శక్తి తమకుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.

ఆరోగ్యం క్షీణించిన తొమ్మిది మంది ఎమ్మేల్యేలు : జైపాల్ యాదవ్, అనసూయ, సత్యవతి, రాథోడ్, సీఎం రమేష్, శ్రీరాం రాజగోపాల్, దేవినేతి ఉమ, కె. శ్రీధర్, ఆంజనేయులు తదితరులు.

టీడీపీ ఎమ్మెల్యేలకు మరోసారి వైద్య పరీక్షలు

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది. అనంతరం టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టుపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు న్యాయసలహాలు తీసుకుంటామని చెప్పారన్నారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణలోకి తీసుకొని మరోసారి అఖిల పక్షం నిర్వహిస్తామని చెప్పారన్నారు.

బాబ్లీ ప్రాజెక్టుపై వేసిన త్రిసభ్య కమిటీ కేంద్రం పరిధిలో పని చేసేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో త్రిసభ్య కమిటీ ఉండవద్దన్నారు. ఒక్క ప్రాజెక్టు అంతర్భాగంలో మరో ప్రాజెక్టు నిర్మించడం ఎక్కడా జరగలేదన్నారు. బాబ్లీ విషయంలో ప్రభుత్వానికి తాము కనువిప్పు కలిగించామన్నారు. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు ప్రభుత్వం తీసుకు వెళ్లాలన్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించక పోవడం వల్లనే రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. మహారాష్ట్ర ఒప్పందాన్ని ఉల్లంఘించి 60 టిఎంసిలకు బదులు వంద టిఎంసిల నీటిని ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. ఓ వైపు కోర్టులో పోరాడుతూనే మరోవైపు రాజకీయ పరిష్కారానికి కృషి చేయాలని జూలకంటి రంగారెడ్డి సూచించారు.

బాబ్లీపై వేసిన త్రిసభ్య కమిటీ పనిచేసేలా చూడాలి : టీడీపీ

కాకినాడ సిటీ: విద్యుత్ సర్‌చార్జీలు, కోతలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్‌పై సీఎం మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ కోతలకు వైఎస్, కాంగ్రెస్సే కారమణమని ఆరోపించారు.

'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్రలో భాగంగా బుధవారం రాయవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. బడ్జెట్‌లో టీడీపీ 7.5 శాతం నిధులు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 3.5శాతం మాత్రమే కేటాయిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తన హయాంలో విద్యుత్ ప్రైవేటు సంస్థలను ఏర్పాటుచేయడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌కు 32 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.

చీకటి రాష్ట్రం

కాకినాడ సిటీ, : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 177వ రోజు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాయవరం, బిక్కవోలు మండలాల్లో సాగింది. బుధవారం 1.30 గంటలకు విద్యుత్ ఉద్యమంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం రాష్ట్రస్థాయి కాపు నాయకులతో సమావేశం నిర్వహించారు.

సాయంత్రం 4.15గంటల నుంచి పాదయాత్ర ప్రారంభించి రాయవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి కొమరిపాలెం, తొస్సిపూడి మీదుగా బలభద్రపురం చేరుకున్నారు. అక్కడ కేపీఆర్ థర్మల్ ప్లాంట్ బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. రాత్రి బిక్కవోలులో బసచేశారు.

ఎన్టీఆర్ యుగపురుషుడు

కాకినాడ సిటీ: రాష్ట్ర రాజకీయాలలో నూతన ఒరవడిని తీసుకు వచ్చిన ఎన్టీ రామారావు యుగపురుషుడు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొనియాడారు. రాయవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు ఇక్కడ మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చాకాపరిస్తానని చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు.

వస్తున్నా మీకోసం 177వ రోజు పాదయాత్రకు రాయవరం మండలంలో అనూహ్య స్పందన వచ్చింది. బిక్కవోలు మండలం తొస్సిపూడిలో చంద్రబాబు మాట్లాడుతూ..వచ్చే ఎన్నికలలో ప్రలోభాలకు లొంగవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా పనికావాలని వెళ్తే గత ఎన్నికలలో డబ్బు తీసుకుని ఓట్లేశారని, పని ఎలా చేస్తానని మీ అనపర్తి ఎమ్మెల్యే చెప్తున్నాడట అని చంద్రబాబు ప్రజలను అడిగారు.

వచ్చే ఎన్నికలలో మాత్రం ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీ పాలన అందించే టీడీపీకి ఓటేయాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు.

విలువలను కాపాడే రాజకీయ పార్టీ టీడీపీ: చంద్రబాబు

కాకినాడ సిటీ: పేదలకోసం తాను ఈ ధర్మ పోరాటం సా గిస్తున్నానని నారాచంద్రబాబునాయుడు అన్నారు. బుధవా రం రాయవరం మండలంలో 177వ రోజు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసం గించా రు. పాత సంతమార్కెట్ సమీపంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని, పెంచిన సర్‌చార్జీలు ప్రజలకు భారంగా మారాయన్నారు. బుధవారం రా యవరం నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్రకు మంచి స్పందన లభించింది.

మంగళవారం అర్థరాత్రి రాయవరం చేరుకున్న బాబుకు ఎమ్మెల్యే వేగుళ్ల ఆధ్వర్యంలో పార్టీ నా యకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయవరంలో బసచేసిన బాబును బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలు కలుసుకున్నారు. ముందుగా బాబు విద్యుత్ సమస్యపై విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన జిల్లాకు చెందిన కాపు సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు సముచిత స్థానం కల్పించి అన్నివిధాలా అదు కోవాలని కోరారు. దీనికి బాబు తాను అధికారంలోకి వచ్చి న వెంటనే న్యాయం చేస్తానన్నారు. అనంతరం బాబు పా దయాత్ర రాయవరం నుంచి సాయంకాలం 4-30 గం.లకు ప్రారంభమైంది.

పాదయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాయవరం సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. ప్రజలకోసం తాను పాదయాత్ర ద్వారా ధర్మ పోరాటం చేస్తున్నానని ప్రజలు తనకు సహకరించాలని కాంగ్రెస్ అవినీతిపై ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పాలని బా బు కోరారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రజలకు చాటి చెప్పిన మహనీయుడు ఎన్‌టీఆర్ అని అన్నారు. ఆయన పాదయాత్ర మండలంలో బాబు పర్యటన సుమారు రెండున్నర కిలోమీటర్లు సాగింది. బాబుకు పలువురు వ్యాపారులు, కార్మికులు తమ కష్టాలను వెళ్లబుచ్చుకున్నారు.

వ్యవసాయంపై రైతులు, వస్త్రాలపై వ్యాట్ గురించి వ్యాపారులు బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్ మద్దతు ప్రకటించారు. దారి పొడవునా సాగిన బాబు యా త్రకు ప్రజలు ఘనస్వాగతం పలికి మద్దతు తెలిపారు. రాయవరం మునసబు విగ్రహానికి బాబు పూలమాలువేశారు. పలుచోట్ల చిన్నారులు బాబుకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారి పొడువునా ఉన్న వ్యాపారులు, ప్రజలు, మహిళలు, వృద్థులతో ముచ్చటించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాబు పాదయాత్ర రాయవరం
లో ముగిసి రాత్రికి బిక్కవోలు మండలం కొమరిపాలెం ప్రవేశించింది.

ఆయన వెంట పాద యాత్రలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, చినరాజప్ప, మురళీమోహన్, చిక్కాల రామచంద్రరావు, గొల్లపల్లి సూర్యారావు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, స్థానిక నేతలు ఎరగతపు బాబ్జీ, పసలపూడి శ్రీనివాస్, వల్లూరి నారాయణ మూర్తి, కాశీ, చుండ్రు వెంకట్రావు, టి.కోటారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, కొవ్వూరి రాజగోపాలరెడ్డి, దూళి జయరాజు, బెల్లంకొండ దొరబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి, పొలిమాటి ఆనంద బాబు, అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల కోసమే ఈ ధర్మ పోరాటం


కుప్పం: వేసవి ఇంకా తన పూర్తి ప్రభావం చూపకుండానే కుప్పం గ్రామ పంచాయతీలోనేకాదు.. మొత్తం కుప్పం మండలంలోనే తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. దాహం తీర్చడంలో అధికార యంత్రాంగం పూర్తి విఫలమైంది. రోజురోజుకూ ప్రజాందోళనలు అధికమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన కుప్పం పంచాయతీ ప్రజలు కొందరు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడుకు లేఖ రాసి ఆయనకు ఫ్యాక్స్ చేశారు. దాహార్తి తీర్చాలంటూ మొర పెట్టుకున్నారు. ఆ లేఖ సారంశమిదీ..

మహారాజరాజశ్రీ

గౌరవనీయులైన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడుగారి దివ్య సముఖనకు, వ్రాయుచున్న అర్జీ ఏమనగా..

అయ్యా!

కుప్పం నియోజకవర్గం కుప్పం టౌను జయప్రకాశ్‌రోడ్డు, వినాయకవీధి, కొత్తపేట ప్రాంతాలలో సుమారు 200ల కుటుంబాలు కాపురముంటున్నాము. మేము అందరము కలసి వ్రాసుకొన్న విన్నపము. మేము తీవ్రమైన నీటి సమస్యను సుమారు రెండు నెలలుగా ఎదుర్కొంటున్నాము. ఇందు నిమిత్తము ఈనెల 21న జయప్రకాశ్‌రోడ్డుపై బైఠాయించి సుమారు మూడు గంటలసేపు ధర్నా చేశాము. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి గోపీనాథ్, కుప్పం తెలుగుయువత అధ్యక్షులు సత్యేంద్రశేఖర్, మరియు ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ మురళీనాయక్ అందరూ పాల్గొని వాటర్ మ్యాన్ భాస్కర్ అను అతనిని విచారించారు. అతను పైపులైన్లు రిపేరిగా ఉన్నాయని వాటికి స్పేర్‌పార్ట్స్ వెయ్యాలని, అధికారులతో చెప్పినాడు. అందులకు ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ మురళీనాయక్‌గారు దానికి సరిపడ ఫండ్సును శాంక్షన్ చేసినారు. అయినా కూడా వారు ప్రజలకు ఇబ్బంది పెట్టి నీళ్లను వదులుట లేదు. తమ ఇష్టానుసారంగా తనకు కాఆవల్సినటువంటి వారికి మాత్రమే నీళ్లను వదులుతున్నారు, ఎందుకు మాకు నీళ్లు వదలడంలేదు అని అడిగితే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి అన్నాడు. కనుక దయచేసి మా అందరిమీద దయ ఉంచి ఈ సమస్యను పరిష్కరిస్తూ వాటర్ మ్యాన్ మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము.

ఇట్లు

తమ విధేయులు

జయప్రకాశ్‌రోడ్డు వాసులు

చంద్రబాబు గారూ.. మీరైనా దాహం తీర్చరూ!


అనంతపురం అర్బన్: విద్యుత్ కోతలను నిరసిస్తూ జిల్లాలో విపక్షాలు కన్నెర జేశాయి. రైతులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వామపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలో నిరసనలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా టీడీపీ, వామపక్షాలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేశాయి. హిందూపురం, ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతులను ఆదుకోవాలని ఆందోళన చేస్తుంటే అరెస్ట్ చే యడం దారుణమని ఖండించారు.

అదేవిధంగా సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు రాయదుర్గం, ఉరవకొం డ, వజ్రకరూరు, కదిరి, ఓడీ చెరువు ప్రాంతాల్లో నిరసనలు తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లాకేంద్రంలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ ఆ ధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టవర్‌క్లాక్ సమీపంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో టీడీపీ సీనియర్ నేత బుగ్గయ్య చౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు నెట్టెం వెంకటేష్, నదీం అహ్మద్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి లక్ష్మిరెడ్డి, నగర అధ్యక్షుడు సరిపూటి ర మణ, నజీర్, బోయ రమణ, డిష్ ప్రకాష్, సీవీ సుబ్బారెడ్డి, మణికంఠబాబు, యంజూరప్ప, లాయర్ గోవిందరాజులు, అశోక్‌నగర్ నారాయణస్వామి, రామచంద్ర, రియాజ్, సైఫుద్ధీన్, వెంకటాద్రి, తనకంటి జయప్ప, చెర్లోపల్లి రామకృష్ణ, బాలు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్పతో పాటు పలువురు పాల్గొన్నారు.

అనంతరం నాయకులు మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తా రు. కరెంట్ కోతలతో రైతులు పెట్టిన పంటలు ఎండిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారన్నారు. అసలే వరుస కరువులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలకు కరెంట్ కోతలు మరింత దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నగర కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, నగర కా ర్యదర్శి రాంభూపాల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రైతు ప్రభుత్వమంటూ గొ ప్పలు చెప్పే పాలకులు వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కరెంట్ కోతను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని పాలకులు మా త్రం మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కోతలను ఎత్తివేసి రైతులను ఇతర చేతివృత్తి కార్మికులను ఆదుకోవాలని వామపక్షాల అగ్రనేతలు నా రాయణ, రాఘవులు ఆమరణ నిరాహా ర దీక్షకు దిగితే అక్రమంగా అరెస్ట్ చేసి భగ్నం చేయ డం దారుణమన్నారు. పాలకులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

విద్యుత్ కోతలపై ప్రభుత్వం కన్నెర్ర



ఈ నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం పిలుపునిచ్చింది. 1982లో ఆవిర్భవించిన టీడీపీ ఈ నెలాఖరులో తన 32వ వ్యవస్థాపక వేడుకలను జరుపుకొంటోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ పవిత్ర ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, మూడు దశాబ్దాలుగా పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, కార్యకర్తల త్యాగాలు, నిస్వార్ధ సేవలు, చంద్రబాబు సారథ్యంతో ఎదిగిన పార్టీ పయనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ వేడుకలను అవకాశంగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్ధనరావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. ఆ జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోని మండల కేంద్రం పెద్దపూడిలో ఆయన ఇందులో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పంతంజనంలోకి వెళ్లాలని నిర్ణయం
1 నుంచి భారీ ఉద్యమం
గ్రామస్థాయి నుంచి సంతకాల సేకరణ
గవర్నర్‌కు సమర్పణ.. బాబు ప్రకటన
వామపక్షాలదీ అదే బాట
1న నిరశనలు.. 9న రాష్ట్ర బంద్
లెఫ్ట్ దీక్ష విరమణ.. కొనసాగిస్తున్న టీడీపీ


సభలో సమరం ముగించిన విపక్షాలు... ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. విద్యుత్‌పై రగిలిన వేడిని... సర్కారు దిగి వచ్చేదాకా కొనసాగించాలని తీర్మానించాయి. టీడీపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా దీక్షకు దిగిన ఎమ్మెల్యేలతో... తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. కార్యాచరణ గురించి సమీక్షించారు. విద్యుత్ సమస్యలపై ఏప్రిల్ 1నుంచి దశల వారీగా ఉద్యమం చేపట్టాలనీ... గ్రామ స్థాయి నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు.

ప్రజల సంతకాలతో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. కరెంటు విషయంలో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక... గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లెఫ్ట్ నేతలు బుధవారం తమ దీక్షలు విరమించుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పది వామపక్షాల నేతలు భేటీ అయ్యారు. ఏప్రిల్ 1న జిల్లా, మండల కేంద్రాల్లో నిరశనలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే... 9న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే... బిల్లులు చెల్లించొద్దని ప్రజలను కోరాలని కూడా యోచిస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధుల దీక్షలకు లెఫ్ట్ నేతలు సంఘీభావం ప్రకటించారు.




కాకినాడ, హైదరాబాద్\ : విద్యుత్ సమస్యపై శాసన సభలో సర్కారుపై సమర భేరీ మోగించిన టీడీపీ.. జనక్షేత్రంలో అంతకుమించి పోరాటపటిమ చూపాలని నిర్ణయించుకుంది. రాజధాని వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా... ఏప్రిల్ 1వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. విద్యుత్ సమస్యపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటన్నింటినీ... 19వ తేదీన హైదరాబాద్‌కు తరలించి గవర్నర్‌కు సమర్పిస్తామని తెలిపారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో విలేకరులతో మాట్లాడారు.

సర్‌చార్జీలు, కోతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. "పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. దీనికి వైఎస్, కాంగ్రెస్సే కారణం. బడ్జెట్‌లో కరెంటుకు టీడీపీ 7.5 శాతం నిధులు కేటాయిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 శాతమే ఇస్తోంది. టీడీపీ తొమ్మిదేళ్లలో రూ.1600కోట్ల మేర చార్జీలు పెంచగా... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31,200 సర్‌చార్జీలు బాదింది'' అని తెలిపారు. తాను సీఎంగా ఉండగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే విద్యుత్‌పై సమీక్షించి... ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించేవాడినని గుర్తుచేశారు.

ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. తొలిరోజు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేపట్టగా... బుధవారం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా దీక్షలో చేరారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పరిటాల సునీత, సీతా దయాకరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్థసారధి, ఊకె అబ్బయ్య, వెంకట రమణారావు, ఎల్. రమణ, పి.రాములు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, ప్రకాశ్‌గౌడ్, పర్సా రత్నం, బల్లి దుర్గా ప్రసాదరావు, కె. రామకృష్ణ, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సతీశ్‌రెడ్డి, సలీం తదితరులు రిలేదీక్షలు చేశారు.

పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణరావు కొంతసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో కూర్చున్నవారికి మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం సీపీఎం, సీపీఐ ప్రజా ప్రతినిధులు గుండా మల్లేష్, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్నవారిని వైద్యులు ఉదయం, సాయంత్రం పరీక్షించారు. ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

కరెంటుకోతలు, చార్జీలభారంతో ప్రజలను తిప్పలు పెడుతున్న ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. దీక్షా వేదికపై నుంచి వారు మాట్లాడారు. ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేస్తోందని, వేల కోట్ల రూపాయల భారం మోపుతోందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, విద్యుత్‌ను తెచ్చుకోవడంలో విఫలం కావడమే ఈ కష్టాలకు కారణమని... 30 మంది కాంగ్రెస్ ఎంపీలు, పదిమంది మంత్రులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని విమర్శించారు.

సమరమే! ప్రభుత్వం దిగిరావాల్సిందే

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పొన్నాల, శ్రీధర్‌బాబు, టీడీపీ నుంచి ఎర్రబెల్లి, మండవ, కడియం, విజయరమణారావు, టీఆర్ఎస్ నుంచి వినోద్, విద్యాసాగర్, వైసీపీ నుంచి కేకే మహేందర్‌రెడ్డి, సంకినేని, బీజేపీ నుంచి శేషగిరిరావు, ఎంఐఎం నుంచి జాఫ్రీ, సీపీఎం నుంచి జూలకంటి, మల్లారెడ్డి హజరయ్యారు.

బాబ్లీపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే విద్యుత్ సమస్యలకు కారణమని వారు ఆరోపించారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, సకాలంలో కరెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

మూడో రోజుకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష

హైదరాబాద్ ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో విద్యుత్ సమస్య చర్చకు రావద్దని వైఎస్సార్ సీపీ భావించిందని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యపై తాము వామపక్షాలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఏప్రిల్ 9వ తేదిన తాము బందుకు పిలుపునిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సమస్య పైన తాము చేపట్టిన దీక్షను అవహేళన చేయడం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న అధినేత నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్సు ద్వారా నిరాహార దీక్ష చేస్తున్న నేతలతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బాబ్లీ పైన అఖిల పక్షం సమావేశమైంది. అఖిల పక్షానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావు, విజయ రమణరావు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి వినోద్ కుమార్, విద్యాసాగర రావు, వైయస్సార్ కాంగ్రెసు నుండి కెకె మహేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు, బాజిరెడ్డి గోవర్ధన్, సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి, మల్లారెడ్డి, మజ్లిస్ నుండి జాఫ్రి, భారతీయ జనతా పార్టీ నుండి శేషగిరి రావు, అధికార పార్టీ నుండి పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబులు హాజరయ్యారు.
: రాష్ట్రంలో ఇంతటి విద్యుత్ సమస్యకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజవేఖర్‌రెడ్డే కారణమని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. కాబట్టి విద్యుత్ సమస్యపై «వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలనుకుంటే యమలోకంలో చేయాలని ఆయన ఎద్దేవా చేశారు.

విద్యుత్ సమస్యకు వైఎస్సే కారణం : గాలి ముద్దుకృష్ణమ

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కోతలు, సర్‌చార్జీల భారానికి నిరసనగా ఏప్రిల్ 9వ తేదీన వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.

విద్యుత్ సమస్యలపై టీడీపీ చేపట్టిన దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. కాగా టీడీపీ నేతల దీక్షలకు వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. ఏప్రిల్ 1న సీపీఐ, సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండల స్థాయిలో నిరసన దీక్షలు చేపట్టనుంది.

విద్యుత్ సమస్యపై వామపక్షాల రాష్ట్ర బంద్‌కు టీడీపీ మద్దతు

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో తొమ్మిది మంది ఎమ్మేల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

గురువారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పేర్కొన్నారు. వారికి తక్షణం వైద్య సహాయం అందించాలని డాక్టర్లు పోలీసులకు సూచించారు. కాగాటీడీపీ నేతలు వైద్య సహాయానికి నిరాకరిస్తూ, తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.

ఆరోగ్యం క్షీణించిన తొమ్మిది మంది ఎమ్మేల్యేలు : జైపాల్ యాదవ్, అనసూయ, సత్యవతి, రాథోడ్, సీఎం రమేష్, శ్రీరాం రాజగోపాల్, దేవినేతి ఉమ, కె. శ్రీధర్, ఆంజనేయులు తదితరులు.

9 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు క్షీణించిన ఆరోగ్య పరిస్థితి

కాకినాడ సిటీ: ఏప్రిల్ 1వ తేదీన నారా లోకేష్ కాకినాడకు వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో టీఎన్ఎస్ఎఫ్, యువత, టీఎన్ఎస్‌వీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతి«థిగా కీలకోపన్యాసం చేయనున్నారు. ఆనందభారతి గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో లోకేష్ వివిధ ప్రాంతాల్లో పార్టీ పరంగా పర్యటిస్తున్న నేప«థ్యంలో యువత, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్ఎస్‌వీ అనుబంధ సంఘాలతో పాటు ఆయా జిల్లాల నాయకత్వాల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

ఈనేప«థ్యంలో కాకినాడలో తొలిసారిగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొనడం పార్టీ జిల్లా నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వనమాడితో పాటు రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆనంద భారతి గ్రౌండ్‌ను ముస్తాబు చేస్తున్నారు. 31వతేదీన చంద్రబాబు ఈ గ్రౌండ్‌లో రాత్రికిబస చేస్తారు.

పెదపూడిలో 29న ఆవిర్భావ దినోత్సవం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 29న పెదపూడిలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పడి 31 సంవత్సరాలు పూర్తవడంతో కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి టీ డీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమ ల రామకృష్ణుడుతో పాటు రాష్ట్రస్థాయి నేతలు పెదపూడికి తరలిరానున్నా రు. 31 సంవత్సరాల వేడుకకు సంబంధిం చి కేక్‌ను చంద్రబాబు కట్ చేస్తారు.

ఈమేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు యనమల ప లు సూచనలు చేశారు. కేక్‌ను ఏర్పాటు చేయాలని కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించాలని పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఆయనను ఆదేశించారు. పెదపూడిలో కార్యక్రమం నిర్వహించడం జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంగా ఉంది.

29న జిల్లావిస్త్రృతస్థాయి సమావేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెదపూడిలో చంద్రబాబు చేస్తున్న బస వద్ద జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా కమిటి నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగ సూర్యనారాయణ సంయుక్తగా విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

1న కాకినాడకు లోకేష్

బిక్కవోలు: అవినీతి, కల్తీ ప్రభుత్వా న్ని గద్దెదింపాలని వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి తొస్సిపూ డి సెంటర్‌లో ప్రజలకు పిలుపు ని చ్చా రు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించి పాదయాత్ర ప్రారంభించి చంద్రబాబు ప్ర సంగించారు. అనంతరం రాయవరం మునసబు విగ్రహం వద్ద నివాళులు అర్పించి కొమరిపాలెం బయలు దేరా రు. కొమరిపాలెంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, నియోజకవర్గపు ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు స్వాగతం పలికారు.

దారి పొడవునా ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. తొస్సిపూడి సెంటర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. నిత్యావసరధరలు, వంటగ్యాస్, పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిపోయినా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. మందులు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కల్తీ మయం అయ్యాయని ఆయన ఎద్దేవా చేసారు.

తాము అధికారంలో వున్న తొమ్మిదే ళ్ల పాలనలో రూ.1600 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచామని అయితే నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.32వేల కోట్లు విద్యు త్ చార్జీలు పేరిట అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. తాము కరువు వచ్చినపుడు కూడ రైతులకు 9గంటలు కరెంటు సరఫరా చేసావారమని ప్రస్తుతం మూడు గంటలు కూడ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం వుంద ని దుయ్యబట్టారు.

అసెంబ్లీలో కరెంటు కోసం ఎమ్మేల్యేలు నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వానికి సిగ్గులేదని విమర్శించారు. త్వరలో ప్రభుత్వ అవినీతిపై ప్రతి గ్రామంలోను సంతకాల ఉద్య మం చేపట్టి ఈప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆపై గ్రామస్తులను సమస్యలపై మాట్లాడ వల్సిందిగా ఆయన కోరారు.

బాబుకు బ్రహ్మరధం కొమరిపాలెం వచ్చిన చంద్రబాబుకు మహిళలు, ప్రజలు అడుగడుగునా బ్ర హ్మరథం పట్టారు. పాదయాత్రలో తనను చూడడానికి వచ్చిన మహిళలు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెల్సుకున్నారు. పాదయాత్రలో దేశం నేతలు మురళీమోహన్, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, రాష్ట్రటీడీపీ వాణిజ్యవిభాగపు కార్యదర్శి చింతా శ్రీనివాసరెడ్డి, తాడి అరవిందం, కొవ్వూరి వేణు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

పేరుకే అగ్రకులం..పేదరికం వెక్కిరిస్తూ ఉంటుంది. బయటకు గంభీరంగా కనిపించినా ఇంట గంజికి లేని కుటుంబాలు ఎన్నో. ఒకప్పుడు గొప్పగా బతికిన మనుషులే. రాజకీయ ఆసక్తులతో ప్రత్యేకంగా కనిపించే వీళ్లు.. ఇప్పుడెక్కడ? రాయవరంలో ఆ కాపు నాయకులు చెప్పిన విషయాలు విన్నప్పుడు ఇదే ప్రశ్న పదేపదే వెంటాడింది. గోదావరి జిల్లాల్లో మాకు కాపు కాసిన కులమిది. బీసీ గుర్తింపు కోసం ఇక్కడ హైదరాబాద్‌లో, అక్కడ ఢిల్లీలో తెలుగుదేశంతో కలిసి పోరాడారు. మధ్యలో కొన్ని భ్రమలకు లోనయ్యారు.

కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని ఊదరగొట్టిన ఆ పెద్దమనిషి.. వీళ్లను రోడ్డుమీద వదిలేసి ఢిల్లీకి ఉడాయించాడు. వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాపులు సొంత ఇళ్లకు మళ్లుతున్నారు. రాయవరంలో కలిసిన కాపులు ఇదే ఆకాంక్ష వ్యక్తం చేశారు. పసుపు జెండాకు వారిచ్చిన సత్తువ ఎలా మరిచిపోగలం? అదే చెప్పాను. వారి కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భుజం తట్టాను. అక్కడ నుంచి కదులుతూ చూస్తే, వారి కళ్లలో చిన్నపాటి ఆశ కదలాడింది.

చిన్న చిన్న పల్లెల నుంచి ఒక మోస్తరు పట్టణాల దాకా కరెంటు కోసమే ఎదురుచూపులు! పంట పండాలన్నా, బతుకు నిండాలన్నా కరెంటు బుడ్డే ఆధారం.

తుసుకూడిలో పదిమందితో మాట్లాడితే ఎనిమిది మందిలో ఇదే ఆవేదన. లాకౌట్‌కు సిద్ధమవుతున్న మిల్లులను దారిలో చూశాను. బేరాల సమయంలో బయట దిగాలుగా కూర్చున్న వెల్డింగ్ షాపు ఓనర్లను చూస్తే బాధనిపించింది. చార్జీల నుంచి సర్‌చార్జీల దాకా.. పాపాలు పెరిగి పెరిగి ఏదో ఒక రోజున ఈ సర్కారుకీ షాక్ తగలకపోదు!

మాకు 'కాపు' కాసింది వీళ్లే!

బ్రిటిషోడే నయం!
డబ్బు, బంగారం తీసుకెళ్లినా
ఆనకట్టలైనా కట్టాడు
'తూర్పు' యాత్రలో చంద్రబాబు



ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు సాగించిన అవినీతి అక్రమాలను ఎండగట్టారు. కిరణ్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని ఆక్షేపించారు. వైఎస్, కాంగ్రెస్ చేసిన తప్పులకు జనం శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ దొంగల్ని ప్రజాకోర్టులో నిలదీయాలని పిలుపునిచ్చారు. అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్‌ను గద్దె దించాలని కొమరిపాలెం సభలో ఒక కార్యకర్త కోరగా..ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి టీడీపీకి లేదని వివరించారు. విద్యుత్ సమస్య నుంచి ఉపాధి సమస్య దాకా.. దేన్నీ పరిష్కరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని మండిపడ్డారు.

"మేం అధికారంలో ఉన్నపుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ రాష్ట్రానికి వచ్చారు. ఐటీలో హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవాలని కితాబు ఇచ్చారు. ఇపుడసలు హైదరాబాద్ వెళ్లొద్దని ఆ దేశ ప్రభుత్వం తన ప్రజలను హెచ్చరిస్తోంది'' అని పేర్కొన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తానన్న వైఎస్..వారిని భిక్షాధికారులను చేశారని చెప్పారు.

అలాంటి మోసపు మాటలతోనే ఆయన కుమారుడు గద్దెనెక్కాలని చూస్తున్నాడన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీస్తున్న 'కేపీఆర్ థర్మల్ ప్లాంట్' నిర్మాణంపై తమ పార్టీ అసెంబ్లీలో చర్చిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే ప్రాజెక్టులను గ్రామాల మధ్య పెట్టడాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్లాంట్ ప్రాంతంలోని గ్రామాల ప్రజలను ఆయన కలుసుకున్నారు.
కాకినాడ : "బ్రిటిష్ పాలకుల కంటే కాంగ్రెస్ దొంగలే ప్రమాదకరం. తెల్లదొరలు మన దేశం నుంచి డబ్బు, బంగారం దోచుకుపోయారు. వీళ్లు వాటితోపాటు గనులు, రైతుల భూములూ దోచేస్తున్నారు. వాళ్లు ఆనకట్టలైనా కట్టారు. వీళ్లు జలయజ్ఞం పేరుతో తొమ్మిదేళ్లలో రూ.80 వేల కోట్లు తిన్నారు. ఐనా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రయోగాలకు పోయి జైలు పార్టీని అధికారంలోకి తీసుకురావద్దని ప్రజలకు హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం, బిక్కవోలు మండలాల్లో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

జలయజ్ఞం పేరుతో కోట్లు తిన్నా ఒక్క ప్రాజెక్టూ కట్టని కాంగ్రెస్ నేతలు