March 28, 2013

టీడీపీ ఎమ్మెల్యేలకు మరోసారి వైద్య పరీక్షలు

హైదరాబాద్: తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలకు వైద్యులు గురువారం సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవెల్స్ పెరిగాయని, వారికి తక్షనం వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఎమ్మెల్యేలను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. శాసనసభ్యులను ఏ క్షణాన్నైనా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. పోలీసులు భారీగా మోహరించారు.

విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో తొమ్మిది మంది ఎమ్మేల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కాగా టీడీపీ నేతలు వైద్య సహాయానికి నిరాకరిస్తూ, తమ ఆరోగ్యం బాగానే ఉందని, దీక్ష కొనసాగించే శక్తి తమకుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.

ఆరోగ్యం క్షీణించిన తొమ్మిది మంది ఎమ్మేల్యేలు : జైపాల్ యాదవ్, అనసూయ, సత్యవతి, రాథోడ్, సీఎం రమేష్, శ్రీరాం రాజగోపాల్, దేవినేతి ఉమ, కె. శ్రీధర్, ఆంజనేయులు తదితరులు.