March 28, 2013

1న కాకినాడకు లోకేష్

కాకినాడ సిటీ: ఏప్రిల్ 1వ తేదీన నారా లోకేష్ కాకినాడకు వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో టీఎన్ఎస్ఎఫ్, యువత, టీఎన్ఎస్‌వీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతి«థిగా కీలకోపన్యాసం చేయనున్నారు. ఆనందభారతి గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో లోకేష్ వివిధ ప్రాంతాల్లో పార్టీ పరంగా పర్యటిస్తున్న నేప«థ్యంలో యువత, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్ఎస్‌వీ అనుబంధ సంఘాలతో పాటు ఆయా జిల్లాల నాయకత్వాల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

ఈనేప«థ్యంలో కాకినాడలో తొలిసారిగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొనడం పార్టీ జిల్లా నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వనమాడితో పాటు రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆనంద భారతి గ్రౌండ్‌ను ముస్తాబు చేస్తున్నారు. 31వతేదీన చంద్రబాబు ఈ గ్రౌండ్‌లో రాత్రికిబస చేస్తారు.

పెదపూడిలో 29న ఆవిర్భావ దినోత్సవం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 29న పెదపూడిలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పడి 31 సంవత్సరాలు పూర్తవడంతో కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి టీ డీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమ ల రామకృష్ణుడుతో పాటు రాష్ట్రస్థాయి నేతలు పెదపూడికి తరలిరానున్నా రు. 31 సంవత్సరాల వేడుకకు సంబంధిం చి కేక్‌ను చంద్రబాబు కట్ చేస్తారు.

ఈమేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు యనమల ప లు సూచనలు చేశారు. కేక్‌ను ఏర్పాటు చేయాలని కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించాలని పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఆయనను ఆదేశించారు. పెదపూడిలో కార్యక్రమం నిర్వహించడం జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంగా ఉంది.

29న జిల్లావిస్త్రృతస్థాయి సమావేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెదపూడిలో చంద్రబాబు చేస్తున్న బస వద్ద జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా కమిటి నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగ సూర్యనారాయణ సంయుక్తగా విడుదల చేసిన ప్రకటనలో కోరారు.