January 11, 2013



వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలపార్టీ అని టీడీపీ అధినేత చ ంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మూడోరోజు పాదయాత్రలో భాగంగా లోక్యాతండా, కోక్యాతండా, నేలపట్ల, అ గ్రహారం, జీళ్లచెరువు గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో చంద్రబాబు మాట్లాడారు. గత సీఎం వైఎస్ఆర్ తన కొడుకు జగన్‌కు లక్షకోట్లు దోచిపెట్టారనరి ఆరోపి ంచారు. గతంలో దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు మరో పార్టీ పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేదోళ్ల రక్తం తాగారని ఆరోపించా రు. 1.45లక్షల ఎకరాల గనులను అల్లుడికి ధారాదత్తంచేశారని, తనపెద్దకొడుకు గాలి జనార్దన్‌రెడ్డి అంటూ ఓబుళాపురా న్ని అప్పనంగా అప్పగించాడని ఆరోపించారు. ఆయనేమో తన ఇళ్లలో కుర్చీలు, కంచాలు, గిన్నెలు అన్నీ బంగారంతో చ యించుకున్నారని ఆరోపించారు. వారిని మరోసారి అధికారంలోకి రానిస్తే ఇళ్లపై కప్పులు కూడా మిగలనీయరన్నారు. ప్ర స్తుతం కాంగ్రెస్ పాలకులు కరెంట్ ఇవ్వకపోయినా బిల్లులు గుండెలు గుబేల్ మ నేలా ఇస్తున్నారని విమర్శించారు. నాడు టీడీపీ పాలనలో కరువు కాలంలో కూ డా నాణ్యమైన విద్యుత్ అందించి రైతుల ను ఆదుకున్నామని దీనిని రైతులందరూ గుర్తించాలని కోరారు.

ప్రత్యేక గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు

గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం ప్ర త్యేక యూనివర్శిటీ ఏర్పాటుచేస్తామని బాబు హామీ ఇచ్చారు. ఐటీడీఎ ద్వారా మైదాన ప్రాంతాలకు కూడా అన్ని సౌకర్యాలు కలిపిస్తామన్నారు. గిరిజన యు వతులకు రూ.50వేలు ఇచ్చి వివాహాలు జరిపిస్తామన్నారు. అర్హులకు 1.50వేలు వెచ్చించి ఇళ్లుకట్టిస్తామని, ఎస్‌స్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ద్వారా నిధులు వెచ్చించి తండా ల అభివృద్ధికి పాటు పడతామన్నారు.

వైసీపీ దొంగల పార్టీ



 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీ కోసం పాద యాత్ర శనివారం ఖమ్మం నగరంలో జరగనుంది. ఖ మ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ మీ దుగా కాల్వొడ్డు నుంచి బాబు పాదయాత్ర జరుగుతుం ది. బాబును పట్టణంలోకి ఘనంగా స్వాగతించేందు ట కు జిల్లా టీడీపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. పలు కూడళ్లలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతోపాటు పట్టణ వ్యాప్తంగా స్వాగత తోరణాలు కట్టారు.

ఏర్పాట్లను పరిశీలించిన తుమ్మల

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర శనివా రం ఖమ్మంలోకి అడుగుపెడుతున్న నేపధ్యంలో ప ట్టణంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శుక్రవారం పరిశీలించారు. పాదయాత్ర సందర్భంగా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఎటువుంటి ఆటంకాలూ లేకుం డా బాబు పాదయాత్ర జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లాఅధ్యక్షుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి అంచా లక్ష్మణ్, నెల్లూరు కోటేశ్వరరావు, పోట్ల వీరేందర్, మోరంపుడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ముఖాముఖిని జయప్రదం చేయండి

స్థానిక షాదీఖానా భవనంలో శనివారం ముస్లిం సోదరులతో చంద్రబాబునాయుడు ముఖాముఖి కార్యక్రమంలో పా ల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అ ధిక సంఖ్యలో పాల్గొనాలని తెలుగుదేశం మైనా ర్టీ విభాగం నాయకులు ఎస్‌కె.మదార్‌సాహెబ్, ఎస్‌కె. బడేసాహెబ్, ఎండి.ఖాదర్‌బాబా, సయ్య ద్ మహబూ బ్ ఆలీ, ఎండి. షరీఫ్, ఎస్‌కె. అబ్దు ల్లా, ఎస్‌కె.షరీఫ్, రియాజ్ తదితరులు ఒక ప్రకటనలో కోరారు.

బాబు యాత్రకు ముస్తాబైన ఖమ్మం







రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్ర స్తావిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నదాతలందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వస్తున్నా మీ కో సం కార్యక్రమంలో భాగంగా కూ సు మంచి గ్రామంలో చంద్రబాబు నాయు డు బసచేసిన ప్రాంగణంలో టీడీ పీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిపోయి న వ రి, మిర్చి, పత్తి, అరటి పంటల తో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈసందర్భం గా ఉదయం 11:45 నిమషాలకు ఆ య న పాదయాత్ర ప్రారంభించారు. అయితే యాత్ర ప్రారంభానికి ముందు రైతు సం ఘం నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈసందర్భం గా రైతు సంఘం నేతలు నీలం తుఫాన్ వల్ల, ఎడాపెడా కరెంట్ కోతలతో రై తు లు నష్టపోతున్నార ని బాబుకు వివరించారు. అకాల వర్షాలకు పంటలు పూ ర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పండిన పం టలకు మార్కెట్లో గిట్టుబాటు ధర క ల్పించడం లేదన్నారు. వ్యవసాయానికి సరఫరా చేసే కరెంట్లో ఇష్టారీతిలో కోతలు విధిస్తున్నారన్నారు. వెంటనే సీసీ ఐ ద్వారా పత్తికి రూ. 5వేల మద్దతు ధర చెల్లించాలన్నారు. అదే వి ధంగా నీలం తుఫాన్ బాధితులకు పంట రుణాలనుపూర్తి మాఫీ చేయాలన్నారు. రంగు మారిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధ ర చెల్లించాలన్నారు. వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ను అందించాలన్నారు. రైతుల రుణాలు మాఫీచేయాలన్నారు. రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని కోరా రు. ఆదుకోవాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచాలని రైతు సంఘంనేతలు చం ద్రబాబును కో రారు.

అన్నదాతల సమస్యలను

అసెంబ్లీలో ప్రస్తావిస్తా

దీనికి స్పందించిన బాబు రైతు సమస్యలపై శాసనసభలో చర్చించి అన్నదాతలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానని హామీ ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరా వు, నేతలు గుత్తా వెంకటేశ్వరరావు, మ ందడపు సు ధాకర్, పంతంగి వెంకటేశ్వ ర్లు, తన్నీరు వెంకటేశ్వర్లు, ఇంటూరి పుల్లయ్య, బోజె డ్ల వెంకటయ్య, వడ్డే రా మయ్య, ఏలూరి హనుమంతరావు పా ల్గొన్నారు.

ఎడా పెడా కోతలు..అన్నదాతల వెతలు



 


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం కూసుమంచి మండలంలో శుక్రవారం పాదయాత్ర నిర్వహి ంచారు. మహిళలు, రైతులు, కూలీలు ఆయనకు స్వాగతం పలికారు. తమ గో డును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఏ సదుపాయాలు అందడంలేద ని, నానా కష్టా లు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని బా బు హామీ ఇచ్చారు.

నాసిరకమైన మందులు అంటగడుతున్నారు

'పత్తి, మిరప పంటలను సాగు చేస్తు న్నాం. వాతావరణంలో మార్పుల వల్ల పంట చేలకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. స లహాలు సూచనలు అందిచాల్సిన వ్య వసాయశాఖాధికారులు పత్తా ఉండటం లేదు. వారు ఎప్పడొస్తారో కూడా తె లియడం లేదు. ఎరువుల దుకాణాల వ ద్దకు వెళ్తే వ్యాపారులు నాసిరకమైన మందులు అంటగడతున్నారని'' రైతు వడ్తియా ర మేష్ బాబు ఎదుట వాపోయారు. ఎ రువుల ధరలు పెంచారని, గిట్టుబాటు ఉత్తమాటవుతోందని ఆవేదన వ్యక్తం చే శారు. చంద్రబాబు మట్లాడుతూ ఇది ద రిద్రపుగొట్టు ప్రభుత్వమని, భవిష్యత్తు లో మంచిరోజులొస్తాయని రైతు భుజం తట్టారు.

కూలీపనులు కరువయ్యాయి

గ్రామాల్లో పనులు లేకపోవడంతో ఇ బ్బంది పడుతున్నామని గిరిజన కూ లీలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఉ పాధి కూలీ కెళితే రోజుకు రూ. 30 కూ డా పడడం లేదని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి బతుకు దుర్భరంగా మా రిందన్నారు. చంద్రబాబు మట్లాడుతు వ్యవసాయానికి ఉపాధి ప«థకాన్ని అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చారు.

గోడు చెప్పుకున్న ఎస్సారెస్పీ భూ నిర్వాసితులు

ఎస్సారెస్పీ కాల్వ భూనిర్వాసితులు బా బుకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. విలువైన భూముల్లో కాలువలు తీసి వదిలేశారన్నారు. నేటికీ నీరు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పలికే భూ ములకు నామామత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు వైఎస్ఆర్ కుటుంబానికి కాసులు కురిపిస్తే రైతులకు కన్నీళ్లు తెప్పించాయ న్నారు. రానున్న కాలంలో అందరికి మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు.

ఉపాధి కరువు.. బతుకు బరువు –

విజయ స్తూప ఆవిష్కరణ తన రాజకీయ జీవితంలో మరపురాని జ్ఙాపకంగా నిలిచిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మాదిరి పురం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. పాదయాత్ర వందోరోజును పురస్కరించుకొని స్థానిక నేతలు స్తూపం ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. వంద గంటల్లో వంద అడుగుల నిర్మాణం పూర్తి చేయటం నిజంగా అభినందనీయమన్నారు. ఇందుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర వందోరోజు ఖమ్మం జిల్లాలో అడుగిడడం, అదీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జనవరి 9నే కావడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. గతంతో పోలిస్తే తనకు పాదయాత్ర సందర్బంగా జిల్లాతో మరింత అనుబంధం పెరిగిందన్నారు. ఈ దఫా సంక్రాంతి పండుగ కూడా ఖమ్మంలోనే జరుపుకోబోతున్నట్లు చెప్పారు. ఇన్ని రోజులే నడవాలి అన్న నియమం తనకేమీ లేదని, జనం సమస్యలు పరిష్కారమయ్యే వరకు నడక సాగుతుందన్నారు. ఎన్ని అవాంతరాలొచ్చినా నడక ఆపేది లేదన్నారు. ప్రజల అభిమానం ఆదరణ తనకు కొత్త శక్తినిస్తున్నాయన్నారు.

మహాస్తూపం.. మరిచిపోలేని జ్ఞాపకం: చంద్రబాబు

నిరుపేదలపై అన్ని రకాల భారాలు మోపి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను రాబందులా పీక్కుతింటోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 'ఒక్కసారి అధికారం ఇవ్వండి.. అభివృద్ధి ఏమిటో చూపిస్తా'అని భరోసా ఇచ్చారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో సాగింది. గురువారం బచ్చోడు బస నుంచి ఉదయం 11.25లకు ప్రారంభమైన పాదయాత్ర బంధంపల్లి, బీరోలు మీదుగా కూసుమంచి మండలంలోకి ప్రవేశించింది. కూసుమంచి మండలం పెద్దపోచారం, చిన్నపోచారం, కిష్టాపురం, తురకగూడెం క్రాస్‌రోడ్డుమీదుగా రాత్రి 11 గంటల సమయంలో చంద్రబాబు కూసుమంచికి చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభ, రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

పోచారం, కిష్టాపురం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ రైతాంగం ప్రస్తుతం రుణాలు తిరిగి చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే.. రైతుల రుణమాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిరుపేదలపై ప్రభుత్వం ఇప్పటికే రూ.31వేల కోట్ల విద్యుత్ భారాలను మోపిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదని విమర్శించారు. బెల్టుషాపుల వల్ల యువత తాగుడుకు బానిసవుతోందని, బెల్టుషాపుల నిషేధంపై రెండో సంతకం పెడతానని ప్రకటించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఉద్యోగాలన్నీ ఇతర ర్రాష్టాలకు తరలి వెళ్తున్నాయని విమర్శించారు. దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి రూ.లక్షా నలభై వేల కోట్లను జగన్‌కు దోచిపెట్టాడని ఆరోపించారు. గత పాలకుల దోపిడీ మూలంగా ప్రజలపై భారం పడుతోందని చెప్పారు.

బీసీలకు వంద సీట్లు

టీడీపీ అధికారంలోకి రాగానే చేతివృత్తుల వారిని, బడుగు, బలహీనవర్గాల వారిని ఆదుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పాలేరు జలాలను అన్ని గ్రామాలకు సరఫరా చేసి మంచినీటిని అందిస్తామని తెలిపారు. హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేసి తిరిగి చెల్లిస్తామని చెప్పారు. బచ్చోడు-బంధంపల్లి గ్రామాల మధ్య రైతులు, వ్యవసాయ కూలీలు, పైలేరియా బాధితులు, వృద్ధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పైలేరియా బాధితులను వికలాంగులుగా గుర్తించి న్యాయం చేయాలని కోరగా అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ పెంచడంతోపటు అన్ని వి«ధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు సాగు చేసిన మిర్చి పంటను పరిశీలించి, సాగువెతలపై రైతులతో ముచ్చటించారు.

సమస్యలు ఏకరువు..

కరెంట్ కోతవల్ల పంటలు కోల్పోతున్నామని, వరి అసలు సాగు చేయలేకపోయామని రైతులు చంద్రబాబుకు గోడు వెళ్లబోసుకున్నారు. వంద రూపాయల కూలీ ఎటూ సరిపోవడం లేదని రైతు కూలీలు వాపోయారు. వృద్ధులు తమకు పింఛన్లు అందడంలేదని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక.. పింఛన్లు అందరికీ సక్రమంగా అందేలా చూస్తామని, పింఛను మొత్తాన్ని రూ.1500 కు పెంచుతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి, నిరాదరణకు గురైన వృద్ధులను ఆదుకుంటామన్నారు. అటు కిరణ్ ప్రభుత్వాన్ని, జగన్ అవినీతిని ఎండగడుతూ.. ఇటు విద్యుత్, నిరుద్యోగ , రైతాంగసమస్యలను ప్రస్తావిస్తూ వాటికి పరిష్కారం చెప్తూ చంద్రబాబు యాత్ర సాగింది. చంద్రబాబు యాత్ర సాగిన ప్రతి గ్రామంలోనూ ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు రాక కోసం మహిళలు, యువకుల, చిన్నారులు కూడా పనులు మానుకుని ఎదురుచూడడం విశేషం. రెండోరోజు 18కి.మీ.పాదయాత్రసాగింది.

భూషమ్మకు రెండువేల సహాయం:

చంద్రబాబు పాదయాత్రలో బీరోలు గ్రామం వద్ద భూషమ్మ అనే 70 యేళ్ల వృద్దురాలు చంద్రబాబుకు తనకు మూడేళ్లుగా పింఛన్ రావడం లేదని చెప్పుకుంది. వెంటనే బాబు స్పందించి రూ.2వేల నగదును ఆమెకు అందించారు.

నేడు బాబు యాత్ర ఇలా..

గురువారం రాత్రి కూసుమంచిలో బసచేసిన చంద్రబాబు శుక్రవారం లోక్యాతండా, కోక్యాతండా, నేలపట్ల, అగ్రహారం, జీళ్లచెరువులో మద్యాహ్నం భోజనం, గోపాలరావుపేట ఖమ్మంరూరల్ మండలంలోని తల్లంపాడు, పొన్నెకల్‌క్రాస్‌రోడ్డు, మద్దులపల్లి, తెల్దారుపల్లిక్రాస్‌రోడ్డు, కోదాడ క్రాస్‌రోడ్డుకు చేరుకుంటారు. మొత్తం 18కి.మీ పాదయాత్ర జరగనుంది. రాత్రికి ఆయన కోదాడ క్రాస్‌రోడ్డులో బస చేస్తారు.

మాలాంటి వాళ్లకు న్యాయం జరగాలంటే మీరు మళ్లీ సీఎం అవ్వాలి సార్...

(బాబుతో ఓ దళిత యువతి)

తిరుమలాయ పాలెం మండలం బచ్చోడు గ్రామ శివార్లలో పాదయాత్రకు ఎదురొచ్చిన మహిళా కూలీల్లో ఓ యువతి వెళ్లబోసుకున్న దళిత కుటుంబాల బాధలను విన్న చంద్రబాబు చలించారు.

చంద్రబాబు: ఏమ్మా నీ పేరు ఏంటి.. నీసమస్య ఏంటి?

సరిత: సార్ నాపేరు సరిత..(చెమర్చిన కళ్లతో..)

చంద్రబాబు: నీబాధ ఏంటో చెప్పమ్మా..

సరిత: ఎస్సీ రిజర్వేషన్లు జరగక పోవటం వల్ల ద ళితులకు అన్యాయం జరగుతోంది సార్. మా కు లంలో చదువుకున్నా కూలీగానే బతకాల్సివస్తోంది. చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకక పొలం ప నులకెళుతున్నాం. మా ముత్తాత, తాతలతో పాటూ మా బతుకులు కూడా రెక్కాడితేనే కానీ డొక్కాడని దుస్థితిలో ఉన్నాయి. మీరు సీఎంగా ఉన్నప్పుడు రి జర్వేషన్లు అమలయ్కాయి. తర్వాత లేవు. మా లాంటి నిరుపేదలకు న్యాయం జరగాలంటే మళ్లీ మీరు సీఎం కావాలి సార్. మీకు మేం అండగా ఉం టాం.. మిమ్మల్ని గెలిపించుకుంటాం.

చంద్రబాబు: మేం అధికారంలో ఉండగా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేశాం. కేవలం నాలుగేళ్లలో దళితులకు తొమ్మిదివేల ఉద్యోగాలిప్పించాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిని విస్మరించటంతో దళితుల కష్టాలకు కారణమయ్యింది. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ జరిపి తీరతాం.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను రాబందులా పీక్కుతింటోంది.....