October 22, 2012

21వ రోజు తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు 22.10.2012

'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం తెలంగాణలో అడుగుపెట్టారు. కర్నూలు జిల్లాలో యాత్రముగించుకుని మహబూబ్‌నగర్ జిల్లా సుంకేశుల డ్యామ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అయనకు టీడీపీ నేతలు పోతుల సురేష్ (పరిటాల రవి వర్గం నేత), తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు.

జిల్లాలోని రాజోలు నుండి బాబు యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. జిల్లాలో మొత్తం 12 రోజుల పాటు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు అలంపూర్, గద్వాల్, ముక్తాల్, నారాయణపేట, పండగల్, దేవరకద్రలలో యాత్ర నిర్వహిస్తారు. రాత్రికి శాంతినగర్ చేరుకుని అక్కడ బస చేస్తారు.

కాగా చంద్రబాబు నాయుడు యాత్రను అడ్డుకుంటామని తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రకటించిన నేపథ్యంలో బాబు యాత్రకు మద్దతుగా టీడీపీ శ్రేణలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొననున్నారు. అలాగే మాదిగ విద్యార్థి ఫెడరేషన్ కూడా పాదయాత్రలో పాల్గొంటున్నది. పోలీసులు కూడా భారీగా మోహరించారు.
1 comment :

1 comment :

Anonymous said...

I am proud to be Madiga.

Cbn is the good leader in present era of politics.