February 9, 2013

* శారదా కాలనీ నుంచి కొరిటపాడు రింగ్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర దారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు.

* నాయుడుపేటలోని సాయిబాబా, ఆంజనేయస్వామి ఆలయాల్లో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

* ఎమ్మార్పీఎస్ యువసేన కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది.

* చంద్రబాబు యాత్ర శారాదా కాలనీకి వచ్చే సమయానికి మద్దిరాల మాల్యాద్రి యువసేన నిర్వహించిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది.

* యాత్ర ఆరంభం నుంచి చివరి వరకు బాలకృష్ణ వేషధారణలో ఉన్న వ్యక్తి దారిపొడవునా ప్రజలకు అభివాదం చేశాడు.

* నాలుగో రోజు యాత్రకు వచ్చిన స్పందన చూసి పలువురు నాయకులు ఆనందంతో చిందులు వేశారు.

* పోలీసులు సైతం యాత్రకు వచ్చిన వారిని చూసి రెండు అదనపు రోప్ పార్టీలను తెప్పించారు.

* పలు చోట్ల చంద్రబాబు పాదయాత్ర ఆపి మహిళలను పలుకరించి సమస్యలు తెలుసుకున్నారు.

* స్థానిక సమస్యలు లేవనెత్తుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

* అవినీతి గురించి ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత మీడియాపైనే ఉందంటూ, కథ, ్రస్కీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ పాత్రికేయులే అంటూ చమత్కరించారు

* తను అధికారంలో ఉన్నా, ఇప్పటికీ ఉన్న ధరల తేడాను వివరించి మహిళలను ఆకట్టుకున్నారు.

* శివనాగరాజు కాలనీలో కార్యకర్త తెచ్చిన డప్పు వాయించి, అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు.

* యాత్రలో యువతను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనేక చోట్ల వారిని పిలిచి మరీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వస్తున్నా... మీకోసం యాత్ర హైలట్స్


చరిత్రలో ఎన్నడూ లేనంతగా సమస్యలు చుట్టుముట్టాయి. కాలువలు లేవు. తాగడానికి నీరు లేదు. దోమలు దాడి చేసి అనారోగ్యం భారిన పడేస్తున్నాయి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దోచేస్తున్నాయి. మీ కష్టాలు చూస్తున్నాను. త్వరలోనే మళ్లీ మంచి రోజులు తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటానని జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

శనివారం జిల్లా కేం ద్రంలోని ఎన్‌టీఆర్ నగర్, శారదాకాలనీ, రిం గురోడ్డు సెంటర్లలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

వంటింట్లో ఉల్లిపాయలు కోస్తే నాడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేవని, నేడు వాటి ధరను తలుచుకొంటేనే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. చక్కెర ధర రూ. 40కి పెరిగి స్వీట్లు తినే పరిస్థితి లేకుండా చేసింది. షు గర్ వ్యాధి లేకున్నా అందరినీ చక్కెరవ్యాధిగ్రస్తులుగా మార్చేసిందని చమత్కరించారు.

ప్రజలు కొనుగోలు చేసే తిండి గింజలు, బట్టలు, కరెంటు, సరుకులపై పన్నులు వసూలు చేస్తున్నారు. ఆ పన్నులను అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా కాంగ్రెస్ దొంగలు దోచేస్తున్నారని చెప్పారు. అవినీతిని అరికడితే ఏ చార్జీలను పెంచాల్సినఅవస రం ఉండదు. ఆర్థిక సంస్కరణలతో ప్రతీ ఇంటికి సంపద వచ్చింది. నేడు ప్రతీ ఇంట్లో రెండు, మూ డు సెల్‌ఫోన్లు వచ్చాయంటే అవి తన వల్లనేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

మహిళలు ఒకపక్క ఇంటిపని, మరోవైపు కూలీ పని చేస్తూ కష్టపడుతుంటే మగవాళ్లు మద్యం తా గుతూ ఇల్లాలిని కొడుతున్నారు. వాళ్ల ఆరోగ్యం పాడు చేసుకొంటున్నారు. నేను పాదయాత్రలో ఒక మద్యం సేవించే తమ్ముడిని అడిగితే తాగకపోతే భార్యను బాగా చూసుకొంటానని, తాగితే కొడుతున్నానని చెప్పాడు. బెల్టుషాపులు ఎత్తివేస్తే తాను కూడా మద్యం మానేస్తానన్నాడు. అందుకే రాష్ట్రంలో ఉన్న బెల్టుషాపులన్నింటిని రద్దు చేస్తాన ని హామి ఇవ్వడం జరిగిందని చంద్రబాబు చెప్పా రు.

ఆడబిడ్డల మంగళసూత్రాలు కాపాడి, మగవాళ్ల ఆరోగ్యం పరిరక్షిస్తానని చెప్పారు.

పిల్లలు తమను చూసుకోవడం లేదని చాలామంది పెద్దవాళ్లు నా వద్దకు వచ్చి వాపోతున్నా రు. వారి కష్టాలు చూసి ప్రతీ నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాలనే హామి ఇస్తున్నా ను. అక్కడ సకల సౌకర్యాలు సమకూర్చి వృద్ధు లు హాయిగా జీవించే వాతావరణం కల్పిస్తాము. దీని వల్ల వృద్ధులకు ధైర్యం వస్తుందని చంద్రబాబు అన్నారు. విద్యార్థులకు సరైన స్కాలర్‌షిప్పులు రాకపోతుండటం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని, తాను పేద పిల్లల ఎంతవరకు చదువుకొంటే అంతవరకు చదివించి ఉద్యోగం, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకొంటానని హామి ఇచ్చారు. చదువు అయిపోగానే వారికి నెలకు కొంత భృతి కల్పించి ఒక అన్నగా ఆదుకొంటానని చెప్పారు.

మీ ఆలోచనలో మార్పు రావాలి

మీ సంపద, కష్టాన్ని దోచుకొన్న వాడు ఎవడైనా నీచుడే. వాడిపై రాజీలేని పోరాటం చేయా లి. జాలి పడితే రేపు మీపై జాలి పడేవాళ్లు ఉం డరు. వెయ్యి లారీల వంద నోట్లు దోచుకొన్న జగ న్ చేసింది పాపామో, కాదో ఒక్కసారి ఆలోచన చే యాలని చంద్రబాబు సూచించారు. తప్పులు చేసిన వాళ్లంతా నేడు జైలుకెళ్లారు. చంచలగూడ జైలు వీఐపీ జైలుగా మారిపోయిందన్నారు. ఎవరైనా శుభకార్యం చేయతలపెడితే ఏ గుడికో, మసీదుకో, చర్చికో వెళతారు. జగన్ పార్టీలో చేరేవాళ్లు మాత్రం ముందు జైలుకెళ్లి అక్కడ కొబ్బరికాయ కొడతారు. డబ్బు సూట్‌కేసులు, ప్యాకేజీలకు ఆశపడి జైలు పార్టీలో చేరుతున్నారని ధ్వజమెత్తారు.

లోక కల్యాణం కోరికతో వచ్చా

నేను ఎలాంటి కోరికలు, ఆశలతో మీ వద్దకు రా లేదు. లోక కల్యాణం కోరికతోనే వచ్చాను. మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను. నేను ఆరోగ్యం విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటాను. మితాహా రం తీసుకొంటాను. 63 ఏళ్లలో పాదయాత్ర చేస్తుండటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చా యి. ఎక్కువగా నడవడంతో కాలునొప్పి వచ్చిం ది. పాదయాత్రలో కిందపడిపోవడం వలన న డుం నొప్పి వచ్చింది. షుగర్ వ్యాధి సోకింది. పాదయాత్ర ఆపేయాలని వైద్యులు సూచించా రు. అయినాసరే పట్టుదలను వదిలి పెట్టకుండా మీ పిల్లల జీవితాలు బాగు చేసేందుకు మీ వద్దకు వస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

తల్లి పాము... పిల్ల పాము

కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లను చంద్రబాబు శనివారం తల్లి పాము, పిల్ల పాముతో పోల్చారు. నిన్న, మొన్నటి వరకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాం గ్రెస్ అన్న చంద్రబాబు నేడు స్వరం మార్చి తల్లి పాము, పిల్ల పాము అని వ్యాఖ్యానించారు. రెండిటికి విషం ఉంటుందన్నారు. అయితే తల్లి పాము కంటే పిల్ల పాములోనే ఎక్కువ విషం ఎక్కువగా ఉంటుందంటూ వైకాపాని తూర్పారబట్టారు.

పాదయాత్రకు హాజరైన జిల్లా నేతలు

శనివారం చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపా టి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనక్కాయల అరుణ, జే ఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీలు ఎస్ఎం లాల్‌జాన్‌బాషా, వైవీ రా వు, మాజీ మేయర్ ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎం జియావుద్దీన్, టీడీపీ జిల్లా నాయకులు యాగంటి దుర్గారావు, మన్నవ సుబ్బారావు, మ్యానీ, ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ఎలుకా వీరాంజనేయులు ఉన్నారు.

మంచి రోజులొస్తాయ్..


అనిల్‌కు భక్తి లేదు, అన్ని దొంగ ప్రార్థనలే
సీఎం కిరణ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు : చంద్రబాబు

గుంటూరు, ఫిబ్రవరి 9 : తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌కు చెందిన నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జలయజ్ఞానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే, రూ.30 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

శనివారం ఉదయం జిల్లాలోని పెదకాకాని మండలం భరత్‌సింగ్ సర్కిల్ నుంచి 131వ రోజు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఆంజనేయకాలనీలో మిర్చి కల్లాలకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా కాల్వలు తవ్వారని ఆరోపించారు. 23 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, 22 వేల ఎకరాలకు కూడా నీరు అందలేదని బాబు ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో సన్న బియ్యం కిలో రూ.15 ఉంటే, ఇప్పుడు కిలో రూ.50 కి పెరిగిందని చంద్రబాబు అన్నారు. మంత్రి అనుచరులు తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేస్తున్నారని, కబ్జాదారులపై తిరగబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు.

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు అనిల్‌కు భక్తి లేద ని, అన్ని దొంగ ప్రార్థనలే అని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి సొమ్ముతో లోటస్‌పాండ్‌లో 70 గదుల ఇళ్లు కట్టారని, కుటుంబ సభ్యులు అంతా రెండు గదుల్లో ఉంటే, మిగిలిన రూముల్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఆయన తమ్ముళ్లు డబ్బులు వసూలు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో మరో 15 మంది మంత్రులు కూడా ఉన్నారని, వారిని సీఎం కాపాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు చంద్రబాబునాయుడితో గుంటూరు జిల్లా పార్టీ నేతలు ఈ ఉదయం కలుసుకున్నారు. డీసీసీబీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా చంద్రబాబునాయుడిని జూనియర్ డాక్టర్లు కలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు

- 2010-2012 మధ్య కాలంలో సర్కారు మూ డు సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై రూ. 6870 కోట్ల భారాన్ని మోపింది. మళ్లీ మరో రూ. 12,723 కోట్లు బాదడానికి సిద్ధమైంది. ఇది ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం.
- టెలిస్కోపిక్ విధానాన్ని తొలిగించి రెండు సార్లు చార్జీలు పెంచడం దారుణం. దాన్ని పునరుద్ధరించాలి.
- ఇప్పటికే రూ. 7771 కోట్లను ఇంధన సర్‌చార్జ్ రూపంలో దొంగతనంగా మోపి, మళ్లీ మరో రూ. 982 కోట్ల సర్‌చార్జి విధించాలని సర్కారు చూస్తోంది. ఇవేకాక రూ. 3171 కోట్ల సర్‌చార్జీల వసూలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 0-100 యూనిట్ల వరకు వాడుకునే వారిపైనా ఈ భారం పడుతోంది.
- ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తోంది. జెన్‌కోకు బదులు ప్రైవేటు సంస్థలకే గ్యాస్, బొగ్గు కేటాయింపులను ప్రోత్సహిస్తోంది.
- అధిక ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటూ 2008-09 నుంచి 2011-12 మధ్య కాలంలో డిస్కంలపై ఒత్తిడి చేయడం వల్ల అవి రూ. 11,111 కోట్ల అప్పుల్లో కూరుకున్నాయి.
టీడీపీ డిమాండ్లు..
- విద్యుత్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యుత్ రంగానికి బడ్జెట్ పెంచాలి. ప్రస్తుత విద్యుత్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. - టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించాలి. వ్యవసాయ ఇంధన సర్‌చార్జీని ప్రభుత్వమే భరించాలి. 0-100 యూనిట్లలోపు వినియోగదారులపై కస్టమర్ చార్జీలను తొలగించాలి.

టీడీపీ పిటీషన్‌లోని ప్రధానాంశాలు

రైతులకు రుణ మాఫీ అసాధ్యమని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యను టీడీపీ తోసిపుచ్చింది. అది సాధ్యమేనని, తాము అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేసి చూపిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఫైలుపైనే తొలిసంతకం చేస్తుందని మోత్కుపల్లి నరసింహులు స్పష్టం చేశారు. ఈలోపు రైతులెవరూ రుణాలను కట్టొద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు తామేదో గొప్ప మేలు చేశామని...అందువల్లే సహకార ఎన్నికల్లో గెలిచామని ముఖ్యమంత్రి జబ్బలు చరుచుకొంటున్నారని, ఆయన చేసిన అంత గొప్ప మేలేమిటని ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు.

రుణమాఫీ సాధ్యమే...చేసి చూపిస్తాం: టీడీపీ

  వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర 131వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం జిల్లాలోని పెదకాకాని మండలం భరత్‌సింగ్ సర్కిల్ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున పార్టీ నేతలు, అభిమానులు నడుస్తున్నారు.

131వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని జూనియర్ డాక్టర్లు శనివారం ఉదయం కలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని బాబుకు జూనియర్ డాక్టర్లు వినతి చేశారు.

చంద్రబాబును కలిసిన జూనియర్ డాక్టర్లు

వస్తున్నా..మీకోసం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో జిల్లా పార్టీ నేతలు శనివారం ఉదయం కలుసుకున్నారు. డీసీసీబీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుతో గుంటూరు జిల్లా నేతల భేటీ

'ఎన్నికలు జరిగే ఒక్క రోజు నాకివ్వండి. ఆ తర్వాత ఐదేళ్ల పాటు సేవకుడిలా మీ బాగోగులు చూసుకొంటా. మీ కష్టాలు తీర్చి మీ ముఖంలో వెలుగు చూడాలన్నదే నా ఆకాంక్ష. మీకు రూపాయి ఇవ్వని వాళ్లు రూ. లక్ష కోట్లు దోచి పెట్టారు. ఆ డబ్బు మీ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడాలన్నదే నా తపనంతా అని' తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పాదయాత్ర మూడో రోజున పొన్నూరు నియోజకవర్గంలో ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు...

ఏ ప్రభుత్వమైనా ఖర్చు తగ్గించుకొని ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని, టీడీపీ హయాంలో అదే చేశామన్నారు. సీసీ రోడ్లు, ఎన్‌హెచ్-5, సెల్‌ఫోన్లు, పాఠశాల భవనాలు, ఆసుపత్రులు అన్ని తన హయాంలో అభివృద్ధి చెందాయని చెప్పారు. పేదలు కూడా గ్యాస్‌పై వంట చేసుకోవాలని 35 లక్షల సిలిండర్లు తలుపు తట్టి ఇప్పించామన్నారు. కాంగ్రెస్, వైసీపీ దొందూదొందేనని ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా పెదకాకానిని అమ్మేస్తారని హెచ్చరించారు.

విద్యా ప్రమాణాలు పడిపోయాయి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడం వలన విద్యా ప్రమాణాలు పూర్తిగా పతనమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. 'నా హయాంలో చదువుకొన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయి. విదేశాలు, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు సంపాదించారు. నేడు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని' చంద్రబాబు అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి పేద పిల్లలు ఎంతవరకు చదువుకొంటే అంతవరకు ఉచితంగా చదివించే బాధ్యత తాను తీసుకొంటానన్నారు. చదువుకొన్న విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు రాకపోతే వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా నెలకు కొంత మొత్తం ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్, వైసీపీలను బంగాళాఖాతంలో పడేయాలి ర్రాష్టాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్, వైసీపీలను బంగాళాఖాతంలో పడేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అన్నారు. ఎవరైనా తమ పిల్లలు దొంగతనాలు, హత్యలు చేయకూడదని, తిరుగుబోతులు కాకూడదని కోరుకొంటారని, అలాంటిది కొంతమంది దొంగలు సిగ్గు లేకుండా నేరుగా చంచలగూడ జైలుకెళ్లి వైసీపీలో చేరుతున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటేసి ఆదరిస్తారా అని ప్రశ్నించారు.

ప్రధాని, రాష్ట్రపతిని ఎంపిక చేసిన ఘనత మాదే తెలుగుదేశం పార్టీ దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని ఎంపిక చేసిన ఘన చరిత్ర కలిగినదని చంద్రబాబు చెప్పారు. అంబేద్కర్, ఎన్‌టీఆర్‌లు మాత్రమే దళితులకు న్యాయం చేశారన్నారు. నాడు మందకృష్ణ పోరాటం చేస్తే కమీషన్ వేసి మాదిగలకు ఎనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేసి 24,500 ఉద్యోగాలు కల్పించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇదే అమలు జరిగి ఉంటే నేడు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవని, అలాంటిది సుప్రీం కోర్టులో కేసు వాదనకు మంచి న్యాయవాదిని పెట్టకపోవడం వలన వర్గీకరణ రద్దు అయి మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. మాదిగల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇస్తానన్నారు.

అవినీతిని అంతం చేస్తే ఏదైనా సాధ్యమే అవినీతిని అంతం చేయగలిగితే ఏ హామినైనా ఆచరణలోకి పెట్టి చూపవచ్చని చంద్రబాబు అన్నారు. పేదవాళ్లకు దక్కాల్సిన డబ్బులను కాంగ్రెస్ దొంగలు దోచుకొని రాక్షస పాలన కొనసాగించారని చెప్పారు. ఆ దోపిడీ భారం ప్రజలపై పడిందన్నారు. బాగు పడాల్సిన సమయంలో తిరిగి కష్టాలు వచ్చాయన్నారు. ఇంట్లో నీళ్ల రసంతో భోజనం చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏమరుపాటుగా ఉంటే అమ్మేస్తారు: చంద్రబాబు


సహకార ఎన్నికల్లో క్యాంపుల పర్వం ప్రారంభమైంది. పిల్ల కాంగ్రెస్‌పై ఆశలతో తల్లికాంగ్రెస్ నేతలు సొసైటీ అధ్యక్షులను కర్నూలు తీసుకెళ్లారు. జిల్లాకాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ నుంచి శుక్రవారం 30 మంది సొసైటీ అధ్యక్షులతో ప్రత్యేక బస్సు కర్నూలు వెళ్లింది. డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న రావెల సొసైటీ అధ్యక్షుడు కొమ్మినేని రామ చంద్రరావుక్యాంపునకు వెళ్లారు. మరో 30మంది తమ పార్టీ అధ్యక్షులను రెండుమూడు రోజుల్లో మరో బస్సులో కర్నూలు తీసుకెళతామని డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జున రావు చెబుతున్నారు. పిల్ల కాంగ్రెస్ మద్దతుకోసం ముదుర్లు ప్రయత్నిస్తున్నారు.

రాయపాటి సోదరులు వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటరమణ, మర్రి రాజశేఖర్, ఆపార్టీకి చెందిన దుగ్గిరాల సొసైటీ అధ్యక్షుడు పాటిబండ్ల హరిప్రసాద్‌తో చర్చించినట్లు తెలిసింది. అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక వ్యవహారాల్లో అభిప్రాయబేధాలున్న సొసైటీ అధ్యక్షులతో జిల్లా నాయకులు నేరుగా ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నారు. మీకు మేం అండగా ఉన్నాం... అన్ని సమస్యలు సర్దుకుంటాయి... పార్టీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠతో కూడినవి... ఈ ఒక్కసారి పార్టీకి మద్దతివ్వాలంటూ జిల్లా నాయకులు కోరుతున్నారు.

తేలని పొత్తులు... అంతర్మథనంలో కాంగ్రెస్, వైకాపాలు... డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపాల మధ్య పొత్తు ఉంటుందా? లేదా ? అనేది ఇంకా తేలలేదు. తాత్కాలిక భావోద్రేకాలతో వ్యవహరించి డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీడీపీకి అప్పగిస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడాల్సి వస్తుందని ఈ రెండు పార్టీల నేతలు అంతర్మథనం చెందుతున్నారు. స్వతంత్ర సంస్థలుగా ఉంటూ ప్రతిఏడాది రూ. 1,200 కోట్ల లావాదేవీలతో రైతులతో సన్నిహిత సంబంధాలుండే ఈ రెండు చైర్మన్ పదవులను టీడీపీకి అప్పగిస్తే ఆ పార్టీ పునాదులు బలపడతాయని కాంగ్రెస్, వైకాపా నేతలు భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో అనేక సొసైటీలలో స్థానికంగా ఉండే రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని పొత్తులు సాగాయి. అదేవిధానాన్ని జిల్లా స్థాయిలో అమలుపరిచి డీసీసీబీని కాంగ్రెస్‌కు, డీసీఎంఎస్‌ను వైకాపా తీసుకోవటం మంచిదని రెండు పార్టీలకు చెందిన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.

డివిజన్ల వారీగా పదవుల పందేరం డీసీసీబీ,డీసీఎంఎస్ పదవులను రెవెన్యూ డివిజన్ల వారీగా ఆయా పార్టీలు పంచుతున్నాయి. టీడీపీ డీసీసీబీ చైర్మన్‌గా తెనాలి డివిజన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్యను, పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ఇక్కుర్తి సాంబశివరావును వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. డీసీఎంఎస్్ చైర్మన్‌గా గుంటూరు డివిజన్‌కు చెందిన మల్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు కుర్రి సుబ్బారెడ్డిని, వైస్ చైర్మన్‌గా బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

* కాంగ్రెస్‌లో డీసీసీబీ చైర్మన్‌గా గుంటూరు డివిజన్‌కు చెందిన రావెల సొసైటీ అధ్యక్షుడు కొమ్మినేని రామచంద్రరావును, డీసీఎంఎస్‌చైర్మన్‌గా వినుకొండ సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ కోటిరెడ్డిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.

నరసరావపేట డివిజన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, జొన్నల గడ్డ సొసైటీ అధ్యక్షుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము), డీసీఎంఎస్ చైర్మన్‌గా తెనాలి డివిజన్‌కు చెందిన పెరవలి సొసైటీ అధ్యక్షుడు విష్ణుమొలకల వెంకట రెడ్డయ్యల పేర్లు వినిపిస్తున్నాయి.

* వైకాపా నుంచి డీసీసీబీకి తెనాలి డివిజన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి, డీసీఎంఎస్‌కు నరసరావుపేట డివిజన్‌లోని మురికిపూడి సొసైటీ అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్యల పేర్లు వినిపిస్తున్నాయి.

నేడు టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులకు సత్కారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నుంచి సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని శనివారం గుంటూరు అరండల్ పేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్కరిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటికి క్యాంపు బాధ్యతలను అప్పగించారు. సహకార శాఖ అధికారిగా పనిచేసిన పాటిబండ్ల నాగేశ్వరరావు అధ్యక్షులను క్యాంపునకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్యే ఆనంద్‌బాబు, డీసీసీబీ అభ్యర్థి ముమ్మనేని తదితరులు సొసైటీ అధ్యక్షులతో పార్టీ కార్యాలయంలో చర్చించారు.

దేశం సొసైటీ అధ్యక్షులను శుక్రవారమే క్యాంపునకు తరలించాలని భావించి ప్రత్యేక బస్సులను తెప్పించారు. పార్టీ అధినేత జిల్లాలో పాదయాత్రలో ఉండటంతో క్యాంపు రెండు రోజులు వాయిదా పడింది. సొసైటీ అధ్యక్షులను ఆదివారం గుంటూరులో చంద్రబాబుకు పరిచయం చేసి క్యాంపునకు తరలించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మ్యాజిక్ ఫిగర్ కోసం బేరసారాలు... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ సాధించలేకపోయింది. దీంతో ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులను తమ వైపు తిప్పుకుంటే మంచిదనే భావన క్యాంపు నిర్వాహకులకు ఉంది. దీనికోసం మూడు పార్టీలు రూ. లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. మేం పెట్టిన డబ్బు ఇస్తే చాలు మీకే చేతులెత్తుతాం.. అంటూ కొంత మంది అధ్యక్షులు లోపాయికారిగా వివిధ పార్టీలతో బేరసారాలు సాగిస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన అధ్యక్షులు కూడా డబ్బు తీసుకుని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని.... మమ్మల్ని పరిగణనలోకి తీసుకోండని క్యాంపు నిర్వాహకులకు సంకేతాలిస్తున్నారు.

కీలకమైన సామాజిక వర్గం... డీసీసీబీ,డీసీఎంఎస్ ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం కీలకమైంది. డీసీసీబీని ఒక ప్రధాన సామాజిక వర్గానికి ఇస్తే డీసీఎంఎస్‌ను మరో సామాజిక వర్గానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు... వివిధ పార్టీల నుంచి ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారు 90 మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ అంశం కూడా డీసీసీబీ ఎన్నికల్లో కీలకపాత్ర వహించబోతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

గుంటూరు టు కర్నూలు


చైతన్యానికి మారు పేరు మీ జిల్లా. నేను కాంగ్రెస్, వైసీపీల దోపిడీ గురించి చెబుతున్న విషయాలను ఒక్కసారి ఆలోచించుకోండి. వాటిపై మీ కుటుంబ సభ్యుల్లో చర్చించుకొని ఒక నిర్ణయానికి రండి. నేను చెప్పిన విషయాలు వాస్తవమని నమ్మితే నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించండి. లేదం టే మీ ఇష్టం. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న నేను బాధ్యత కాబట్టి చెబుతున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చం ద్రబాబునాయుడు అవినీతి, దోపిడీపై ప్రజలను చైతన్యవంతం చేసేలా ప్రసంగిం చారు. శుక్రవారం చంద్రబాబు మూడో రో జు పాదయాత్రకు పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలంలో అపూ ర్వ స్పందన లభించింది.

పెదకాకాని మండల కేంద్రంతో పాటు వెనిగళ్ల, అగతవరప్పాడులో పాదయాత్ర కొనసాగించారు. చంద్రబాబుకు దారి పొ డవునా మహిళలు ఎదురెళ్లి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు. యువకులు కేరింతలు కొడు తూ ఆనందా న్ని వ్యక్తం చేశారు. తమ కష్టం బెల్టుషాపు ల పాలౌతుందంటూ మహిళలు తమ గో డు చెప్పుకొన్నారు. అం దరి కష్టాలు తెలుసుకొన్న చంద్రబాబు తా ను అధికారంలో కి రాగానే కరెంటు, వంట గ్యాస్ భారాన్ని తగ్గిస్తానని హా మి ఇచ్చారు. నెలకు రూ. 600 పెన్షన్ ఇస్తానని హా మి ఇ చ్చారు.

ఐటీ హబ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఆటోమొబైల్ కేంద్రంగా మార్చి ఇక్కడ చదువుకొన్న పిల్లలకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కాదని గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత తీసుకొంటానని చెప్పారు. పొదు పు సంఘాలను ప్రారంభించిన తనను 2004లో డ్వాక్రా మహిళలు మరిచిపోయి కష్టాలు కొని తెచ్చుకొన్నారని, కచ్ఛితంగా వారు చెల్లించిన వడ్డీని తిరిగి ఇప్పించి బాధలు తీరుస్తానన్నారు.

చంద్రబాబు మూడో రోజు పాదయాత్రను పెదకాకాని మండల కేంద్రానికి సమీపంలోని శంకర్‌నేత్రాలయ పక్కన బస చేసిన శిబిరం నుంచి ప్రారంభించా రు. ఐదో నెంబరు జాతీయ రహదారి మీద పెదకాకాని జంక్షన్ వరకు పాదయాత్రగా వచ్చి అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధానంగా పెదకాకాని ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఒకవైపు మల్లేశ్వరస్వామి దేవాలయం, మరోవైపు స్వస్తిశాల, ఇంకోవైపు కాకాని దర్గా ఉన్న ఈ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మతాన్ని ఉపయోగించుకొంటూ రాజకీయ లబ్ధి పొందేవారికి వ్యతిరేకమని మీరు నిరూపించారని చెప్పారు.

నాడు... నేడు బేరీజు వేసుకోండి చంద్రబాబు పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ప్రధానం గా నాటి పరిస్థితులను నేటితో బేరీజు వేసుకోమని సూ చిస్తున్నారు. రైతులు తన ను కలిసినప్పుడు తన పాలనలో ఎరువుల ధరలను ఇప్పటి రేట్లతో పోల్చి చూసుకోవాలని చెబుతున్నారు. ఆ రోజు డీఏపీ బస్తా ధర రూ. 400 ఉంటే నేడు రూ. 1300 అయిం ది. పత్తి ధర రూ. 5 వేల నుంచి రూ. మూడు వేలకు పతనమైంది. పొటాష్ రూ. 200 నుంచి రూ. 900లకు పెరిగిం ది. ధాన్యం మీకు కేజీకి రూ. 16 మాత్రమే ఇస్తూ బియ్యం రూ. 50 చేశారంటూ వివరిస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజున కరువు వచ్చి ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోయినా పంటలకు నీరు ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. విద్యుత్ తొమ్మిది గంటల పాటు ఇచ్చామని, నేడు కనీసం రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. కష్టాల కడలిలో వ్యవసాయం చేస్తోన్న రైతులను ఆదుకొనేందుకే తాను రుణమాఫీని ప్రకటించి తొలి సంతకం దాని పైనే చేస్తానని చెబుతున్నానన్నారు.

మహిళలతో సంభాషించే సమయంలో వంటగ్యాస్, కరెంటు ఛార్జీలను ప్రస్తావిస్తున్నా రు. వంట గ్యాస్ నాడు రూ. 235 ఉంటే నేడు రూ. 475కు చేరుకొందని, అది కూ డా సంవత్సరానికి ఆరు సిలిండర్లే ఇస్తామంటున్నారని చెప్పారు. ఒక ఫ్యాను, బల్బు ఉంటే నెలకు రూ. వెయ్యి కరెంటు బిల్లు వేస్తున్నారని, మీరే ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులతో సంభాషించేటప్పుడు కేంద్రం రూ. 400 పెన్షన్ ఇస్తుంటే రూ. 200 కాంగ్రెస్ వాళ్లు కొట్టేస్తున్నారని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ. 600లకు పెంచుతానని చెబుతూ ఆకట్టుకొంటున్నారు.

కాంగ్రెస్, వైసీపీలపై పదునైన ఆరోపణలు చంద్రబాబు తన ప్రసంగా ల్లో కాం గ్రెస్, వైకాపాలను ఏకిపారేస్తున్నారు. వైసీపీని జైలు పార్టీగా అభివర్ణిస్తూ ఆ పార్టీలో చేరాలంటే ముందు చంచల్‌గూడ జైలుకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి నమస్కరించి చేరాలన్నారు. జైలు పార్టీలో చేరిన వాళ్లు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తొమ్మిదేళ్లలో పందికొక్కులా మేశారని ఘాటుగా విమర్శిస్తున్నారు. పందికొక్కులు పంటల మీద పడి మొత్తం తిని ఎలాగైతే నాశనం చేస్తాయో అదే రీతిన రాష్ట్రంలో గజదొంగల్లా కాంగ్రెస్ నాయకులు పడి దోచేసి కుక్కల చింపిన విస్తరిలా మార్చారని ఆగ్రహావేవాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగా సిటీ హామీ గుంటూరు, విజయవాడలను మహానగరంగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చం ద్రబాబు హామి ఇస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ను తలదన్నే రీతిలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొంటానని చెబుతున్నారు. ఐటీ హబ్‌తో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలు, రింగురోడ్లు, ఆటోమొబైల్ కేంద్రంగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని పేర్కొంటున్నారు.

మందు ఫుల్... మంచినీళ్లు నిల్ కృష్ణా నది చెంతనే ఉన్నా గుంటూరు లో అనేక గ్రామాలకు తాగునీరు అంద డం లేదని, మందు మాత్రం ప్రభుత్వం ఫుల్‌గా సరఫరా చేస్తోందన్నారు. రూ. 20 ఉండే క్వార్టర్ బాటిల్‌ను నేడు రూ. 100 చేసిందన్నారు. ప్రతీ ఇంట్లో బెల్టుషాపు లు తెరిచి మద్యంతో పేద ప్రజల బ తుకులు చితికిపోయేలా చేస్తోందని చెప్పారు. తాను బెల్టుషాపులను తొలగిస్తానన్నారు.

మీ కష్టాలకు కారకులెవరో ఆలోచించండి: బాబు

నియోజకవర్గంలో చంద్రబాబు వస్తున్నా...మీకోసం పాదయాత్ర విజయవంతానికి సహకరించిన పార్టీ కార్యకర్తలు, ప్రజలందరికీ స్థాని క దేశం నేతలు కృతజ్ఞతలను తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక దేశం కార్యాలయం డాక్టర్ ఎమ్మెస్సెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మండల దేశం అధ్యక్షులు ఆరుద్ర అంకవరప్రసాద్, పట్టణ దేశం అధ్యక్షులు నందం అ బద్దయ్య, తెలుగు రైతు జిల్లా నాయకులు వల్లూరు సూరిబాబు మాట్లాడారు. ఆరుద్ర మాట్లాడుతూ బాబు పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గంలో దేశం కార్యకర్తలు తమ సత్తా చాటారన్నారు.

నియోజకవర్గంలో తన యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూచి అధినేత చంద్రబాబు ముగ్థుడయ్యారని చెప్పారు. చేనేతల అభివృద్ధి కోసమై ఐదు వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికను తీసు కువస్తామని చంద్రబాబు మంగళగిరిలో ప్రకటిం చడం పట్ల పట్టణ దేశం అధ్యక్షులు నందం అబద ్దయ్య హర్షం వెలిబుచ్చారు. వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను ఎత్తివేస్తామని, నేత కార్మికుల గృహ ని ర్మాణాలకు అదనంగా మరో రూ 50వేలను ఉచి తంగా ఇప్పిస్తామని బాబు ఇచ్చిన హమీలు తమ వర్గం వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగించాయ న్నారు.

చేనేత రంగం సంక్షేమం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తారన్న విశ్వాసం తమకు వుం దన్నారు. తెలుగురైతు జిల్లా నాయకులు వల్లూరు సూరిబాబు మాట్లాడుతూ కిరికిరి సీఎం కిరణ్‌కు మార్‌రెడ్డి రుణమాఫీ అసాధ్యమని ప్రకటిం చడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫి చేయిస్తా మని ప్రకటించి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారన్నా రు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడ ఆయన తన నిశ్చితాభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి సామాజిక న్యాయానికి ఎలా కట్టుబడి వున్నారో చా టుకున్నారని వల్లూరు ప్రశంసించారు. ఈ సమావే శంలో దేశం నేతలు సంకా బాలాజీగుప్తా, కోనంకి శ్రీనివాసరావు, మునగాల సత్యనారాయణ, మాది నేని శివరామకృష్ణయ్య, వాకా మంగారావు, డోగి పర్తి శ్రీనివాసరావు, గోవాడ రవి, పల్లపు పిచ్చియ్య తదితరులు పాల్గొన్నారు.

బాబు యాత్ర అదుర్స్


వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గుంటూరు నగరానికి శనివారం చంద్రబాబు వస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ యాగంటి దుర్గారావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శారదా కాలనీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారన్నారు. అక్కడి నుంచి 4 గంటలకు అమరావతి రోడ్డు, కొరిటెపాడు మీదుగా సాయిబాబా రోడ్డు నందుగల ఎన్టీ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి రింగ్ రోడ్డు నందు రాత్రికి బస చేస్తారని తెలిపారు. 10వ తేదీ పాదయాత్రకు విశ్రాంతి ప్రకటించారు. 11వ తేదీ ఉదయం బృందావన్ గార్డెన్స్ మీదుగా అశోక్‌నగర్, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట, 4/14 నుంచి ఏటి అగ్రహారం మీదుగా చుట్టుగుంట, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, రామనామ క్షేత్రం, నల్లచెరువు మీదుగా తూర్పు నియోజకవర్గంలోని డి ఎస్ నగర్‌లోకి ప్రవేశిస్తారని తెలిపారు. ఈ పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొని విజయవతం చేయాలని కోరారు.

నేడు గుంటూరులో బాబు పాదయాత్ర

దేశం ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే కొండవీటివాగు ముంపు సమస్యను శాశ్వత ప్రాతి పదికన పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హమీనిచ్చారు. వస్తున్నా...మీకోసం పాద యాత్రలో భాగంగా పెదకా కానిలో వున్న చంద్రబాబు ను శుక్రవారం ఉదయం మంగళగిరి దేశం నాయకుల బృందం కలిసి నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. చంద్రబాబు మాట్లాడుతూ కొండవీటి వాగు సమస్యపై తనకు అవగాహన ఉందని దేశం ప్రభుత్వ హాయాంలో వాగులో రెండేళ్లపాటు పూతికతీత తీయించి వరద తీవ్రత తగ్గించ గలిగామని మండల దేశం పార్టీ అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ బాబుకు గుర్తు చేశారు.

ఆ తరు వాత అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొండవీటి వాగు ముంపు నివారణకు హమీలు గుప్పించడం మినహా ఏమీ చేయలేకపో యిందని వివరించారు. తన యాత్ర విజయవంతానికి కృషి చేసిన మంగళగిరి దేశం నాయకులందరిని ఆయన పేరుపేరున అభినందించారు. చంద్ర బాబును కలిసిన బృందంలో మండల దేశం అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్, పట్టణ దేశం అధ్యక్షుడు నందం అబద్దయ్య, దేశం నేతలు వల్లూరు సూరిబాబు, కొల్లి లక్ష్మ య్య చౌదరి, సంకా బాలాజీగుప్తా, వాకా మంగారావు, చిల్లపల్లి మోహనరావు, గోవాడ రవి, పల్లపు పిచ్చియ్య తదితరులు వున్నారు.

కొండవీటి వాగు సమస్యను పరిష్కరిస్తాం...

నరసరావుపేట నియోజక వర్గంలో ఇటీవల టీడీపీలో నెలకొన్న వివిధ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకులు వస్తున్నా మీకోసం పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడుడిని శుక్రవారం సాయంత్రం కలిశారు. శుక్రవారం కోడెలను వెంట బెట్టుకొని సింహాద్రి, సుబ్బారావు తదితర నాయకులు పెదకాకానిలో మధ్యాహ్న భోజన విరామానికి ఆగిన చంద్రబాబును కలిసి తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. నరసరావుపేటలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్‌కు గురైన కొల్లి బ్రహ్మయ్య తీసుకొచ్చిన పాటల సీడీని చంద్రబాబు ఆవిష్కరించడంపై మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్గం నేతలు తీవ్రంగా ఆక్షేపించారు.

కొల్లి బ్రహ్మయ్య తాను పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు వర్గం అని చెప్పుకొంటూ నరసరావుపేటలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అతన్ని పార్టీ జిల్లా కమిటీ సస్పెన్షన్ చేసిందన్నారు. అయినాసరే తాను ప్రత్తిపాటి వర్గం అని చెప్పుకొంటున్నా జిల్లా కమిటీ ఎందుకు ఖండించదని ప్రశ్నించారు. కోడెల వర్గీయుల ఆవేదనను ఆలకించిన చంద్రబాబు వాళ్లని పార్టీ సస్పెన్షన్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీతో వాళ్లకు సంబంధం లేదన్నారు. వాళ్లు మన పార్టీ కాదని భావించాలని చెప్పారు. మిమ్మల్ని కాదని వాళ్లను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. నరసరావుపేట అంటే కోడెల, కోడెల అంటే నరసరావుపేట అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నియోజక వర్గంలో ఇంకొకరిని ప్రోత్సహించే ప్రశక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

తాను పాదయాత్రలో ఉన్నప్పుడు ఎవరు ఎదురొచ్చినా మాట్లాడటం జరుగుతుందని, అలానే సీడీలు, క్యాలెండర్లు ఆవిష్కరించడం సహజంగా జరిగిపోతుందన్నారు. అసలు ఆ కొల్లి బ్రహ్మయ్య ఎవరో కూడా తనకు తెలియదని వచ్చిన వారెవరో తనకు తెలియదని, వారు పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులని తనకు సమాచారం లేదన్నారు. పార్టీతో వారికి సంబంధం లేదని, తాను చెప్పినట్టు ప్రకటించాలని నేతలకు సూచించారు.

చంద్రబాబును కలిసిన వారిలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రి యాదవ్, పార్టీ నేతలు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకట నరసయ్య, కొట్టా కిరణ్ కుమార్, రావెళ్ళ లక్ష్మీనారాయణ, మక్కెన ఆంజనేయులు, కొక్కిరాల శ్రీనివాసరావు, కడియాల రమేష్ తదితరులు వున్నారు. చంద్రబాబుతో జరిగిన చర్చల సారాంశాన్ని మీడియాకు వేల్పుల సింహాద్రి వివరించారు.

చంద్రబాబు వద్ద నరసరావుపేట పంచాయతీ