February 9, 2013

వస్తున్నా... మీకోసం యాత్ర హైలట్స్

* శారదా కాలనీ నుంచి కొరిటపాడు రింగ్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర దారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు.

* నాయుడుపేటలోని సాయిబాబా, ఆంజనేయస్వామి ఆలయాల్లో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

* ఎమ్మార్పీఎస్ యువసేన కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది.

* చంద్రబాబు యాత్ర శారాదా కాలనీకి వచ్చే సమయానికి మద్దిరాల మాల్యాద్రి యువసేన నిర్వహించిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది.

* యాత్ర ఆరంభం నుంచి చివరి వరకు బాలకృష్ణ వేషధారణలో ఉన్న వ్యక్తి దారిపొడవునా ప్రజలకు అభివాదం చేశాడు.

* నాలుగో రోజు యాత్రకు వచ్చిన స్పందన చూసి పలువురు నాయకులు ఆనందంతో చిందులు వేశారు.

* పోలీసులు సైతం యాత్రకు వచ్చిన వారిని చూసి రెండు అదనపు రోప్ పార్టీలను తెప్పించారు.

* పలు చోట్ల చంద్రబాబు పాదయాత్ర ఆపి మహిళలను పలుకరించి సమస్యలు తెలుసుకున్నారు.

* స్థానిక సమస్యలు లేవనెత్తుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

* అవినీతి గురించి ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత మీడియాపైనే ఉందంటూ, కథ, ్రస్కీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ పాత్రికేయులే అంటూ చమత్కరించారు

* తను అధికారంలో ఉన్నా, ఇప్పటికీ ఉన్న ధరల తేడాను వివరించి మహిళలను ఆకట్టుకున్నారు.

* శివనాగరాజు కాలనీలో కార్యకర్త తెచ్చిన డప్పు వాయించి, అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు.

* యాత్రలో యువతను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనేక చోట్ల వారిని పిలిచి మరీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.