July 18, 2013


స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి.. గ్రామాభివృద్ధికి సహకరించాలని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలను కోరారు. బుధవా రం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నుంచి భారీగా చేరుతున్నారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెబుతున్నారని విమర్శించారు.

గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని, టీడీపీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. అందుకే ప్రజలు మళ్లీ టీడీపీ పాలన కోరుకుంటున్నారన్నారు. కొందరు తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట్లు అడుగుతున్నా వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చిత్తశుద్ధిలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులతోపాటు, పెన్షన్ల స్వాహాకు పాల్పడ్డారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 101 గ్రామ పంచాయతీలకు 60 పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ను ఓడించాలి: ఎర్రబెల్లి

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే చర్లపల్లి జైలులో ఉండేవారని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు మురళీమోహన్న విమర్శించారు. రాష్ట్రాన్ని అవినీతి పాలు చేసిన చరిత్ర ఆయనదని మురళీమోహన్ అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని మురళీమోహన్ వ్యాఖ్యానించారు.

YSR జీవించి ఉంటే చర్లపల్లి జైలులో..

  మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలు అనధికారికంగా వెల్లడయ్యాయి. మాకు అందిన అసంపూర్తి సమాచారం ప్రకారం కాంగ్రెస్‌కు 720, టిడిపికి 608, వైఎస్‌ఆర్‌సిపికి 440, టిఆర్‌ఎస్‌కు 97 పంచాయతీలు లభించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరిగినప్పటికీ గ్రామాల్లో పార్టీ జెండాలతోనే నామినేషన్లు వేయడం, ప్రచారం చేయడం సర్వసాధారణం. సర్పంచ్‌ అభ్యర్ధులు గెలిచిన తర్వాత వారు తమ పార్టీ అభ్యర్ధులేనని ఆయా పార్టీలు కూడా చెప్పుకుంటాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్‌ బాగా డీలాపడింది. ఇక్కడ టిడిపి మొదటి స్థానంలో నిలవగా జగన్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌కు మూడోస్థానం దక్కింది. చిత్తూరు జిల్లాలో 300 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 103 టిడిపి మద్దతు దారులు గెలవగా 75 పంచాయతీలను వైఎస్‌ఆర్‌ సిపి మద్దతుదారులు గెలుచుకున్నారు.

ఏకగ్రీవ 'పంచాయతీ'లు.....కాంగ్రెస్‌ - 720, టిడిపి- 608, వైఎస్‌ఆర్‌ సిపి- 440, టిఆర్‌ఎస్‌ - 97..