December 22, 2012

టీడీపీ హయాంలో జిల్లాలకు వెళ్లిన ప్రతిసారీ డ్వాక్రా మహిళలతో మాట్లాడించేవాడిని! వారి కష్టసుఖాలను వారితోనే చెప్పించేవాడిని! వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేవాడిని! ఆ తర్వాత డ్వాక్రా మహిళలు ఐక్యరాజ్యసమితిలోనూ ప్రసంగించారు! అప్పట్లో మహిళలు భరోసాతో తలెత్తుకుని తిరిగేవారు! మరి ఇప్పుడు!? మహిళల్లో పూర్తి అభద్రత వచ్చేసింది! ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి!

దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన సిగ్గుచేటు. బాధాకరం. ఏం చేసినా తప్పించుకుని తిరగవచ్చనేలా చట్టాలు ఉండడమే నేరస్తులకు ఆ ధీమా ఇస్తోంది. ఇలాంటి తప్పులు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుందనే భయం ఉండాలి. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే పాలకులు సరిగా స్పందించి ఉంటే ఢిల్లీలో ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. మహిళల్లోనూ ఒక నమ్మకం వచ్చి ఉండేది. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ఈ రోజు నా యాత్రలో కిమ్స్ కాలేజీతోపాటు మరో ప్రైవేటు కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాను. ఇదే అంశాన్ని వారిలో చర్చకు పెట్టాను. ఆ ఘటనపై మీరేం చేశారని ప్రశ్నించాను. ప్రభుత్వాలు స్పందించాలి. మేమేం చేయగలమన్నట్లు వారు మాట్లాడారు. ఏమీ చేయలేమనే నిస్సహాయత ఉంది కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ ఘటనకు నిరసనగా కిమ్స్ కాలేజీ విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ చేయించాను. ఇలాంటి కార్యక్రమాలు మిగతా వారికి స్ఫూర్తినిచ్చి వాళ్లు కూడా నిరసనలో పాల్గొనేలా చేస్తాయని ఆశిస్తున్నాను. ప్రజలు స్పందించి రోడ్లపైకి రాకపోతే పాలకుల్లో బాధ్యతారాహిత్యం పెరిగిపోతుంది.

ఢిల్లీలో యువతరం ఉద్యమించడం శుభ పరిణామం. ఏం జరిగినా నాకు సంబంధం లేదు కదా అని అనుకోవద్దు. యువత పిడికిలెత్తాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాంటి ఉద్యమాలు మరిన్ని రావాలి. అప్పుడే ప్రభుత్వాలకు భయం ఉంటుంది. నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తారు.

యువత పిడికిలి బిగించాలి!

నేత బజార్లు పెడతా!
అప్పటివరకు చిల్లిగవ్వ కూడా కట్టొద్దు
చేనేతలకు చంద్రబాబు పిలుపు
వెయ్యి కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
ఫెడరేషన్ ఏర్పాటకు హామీ

రె ౖతాంగం తరువాత ఆర్థిక వ్యవస్థలో ఆ స్థాయి వృ త్తి ప్రాధాన్యంగల రంగం చేనేత. ఇప్పటికే రైతాంగానికి గట్టి భరోసా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు చేనేత సమస్యలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నేత బజార్లు ఏర్పాటు చేస్తామని శనివారం ఆయన ప్రకటించారు. అంతేకాదు.. నేతన్నల అభ్యున్నతికి వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చిస్తామని, కార్పొరేషన్ గానీ ఫెడరేషన్ గానీ ఏర్పాటు చేసి ఆ రంగాన్ని అభివృద్ధి పరుస్తామని అభయమిచ్చారు.

రుణాలన్నీ మాఫీ చేస్తామని, అప్పటిదాకా చిల్లిగవ్వ కూడా కట్టొద్దని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రేకుర్తి, కరీంనగర్, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల వరకు 16.6 కిలోమీటర్లు నడిచారు. చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఈ సందర్భంగా జరిగిన సభల్లో తీవ్రంగా దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు కనీస వేతనాలూ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాలు కూడా 1300నుంచి 970కి పడిపోయాయని చెప్పారు.

పేరుకు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించినా ఇప్పటిదాకా కనీసం కోటి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. "సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో ఐదు వేల కోట్లను వెచ్చించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం. వారి రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. అప్పటిదాకా వాటిని చెల్లించాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. చేనేత వస్త్ర విక్రయాలపై 30 శాతం రిబేట్ ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.

చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని, లక్షా 50 వేల రూపాయలతో ఇల్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. చేనేత యూనిట్లకు సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేస్తామని, వృద్ధులైన చేనేతలకు వేయి పింఛన్‌ను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామంటూ ఊరట కలిగించారు. పట్టు, నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆప్కో సంస్థలను పటిష్టం చేసి మార్కెటింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. కనీస వేతనాలు కల్పిస్తామని, చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

విద్యుత్ సబ్సిడీ, మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక పాలసీని ప్రకటించి ప్రమోట్ చేస్తామని చెప్పారు. చేనేత కార్మికుల పిల్లలను ఉచితంగా చదివిస్తామని, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు చూపెడతామని హామీ ఇచ్చారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్‌లో మరో పది వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతున్నదని చంద్రబాబు ఆరోపించారు. 2007 నుంచి 5600 కోట్ల రూపాయల సర్‌చార్జి భారాన్ని మోపిందని విమర్శించారు.

ఇదిలాఉండగా, మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్‌ను గవర్నర్ చీవాట్లు పెట్టి తిప్పి పంపినందున రోషం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి నీతి, నిజాయితీగా ఉంటామని, పక్షపాతానికి తావివ్వబోమని చెప్పి అవినీతిపరులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పకుండా ఇతరులను చెప్పమంటున్నదని ఆరోపించారు.

అందరూ అభిప్రాయం చెప్పండి..మేం మాత్రం చెప్పం అనడం న్యాయమా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను నమ్మవద్దని కోరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసి పోయిందని, కేసులు మాఫీ చేస్తే నేడో, రేపో వైసీపీ కూడా కలుస్తుందని జోస్యం పలికారు. ఇక ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే రాయబారాలు పంపారని విమర్శించారు.

అప్పులన్నీ రద్దు చేస్తా:చంద్రబాబు


ఏమ్మా అంతా బాగేనా? అని చంద్రబాబు పలకరింపు..మహిళ: ఏం బాగున్నాం. పిల్లకు మొన్ననే లగ్గం చేసిన. 4 లచ్చల కట్నం ఇయ్యాలే. పంటచ్చినంక కట్నం పైసలిత్తనని జెప్పి బువ్వ, బట్టలు పెట్టి లగ్గం చేసిన. కరంటు లేక పంట ఎండిపోయింది. పైసలియ్యందే పిల్లను మా ఇం టి తోలడట. ఎగబెడితే లంగ, దొంగ అంటరు. నా కష్టం.. నా నష్టం ఎవలు సూత్తన్నరూ.. నువ్వయితే అచ్చినవు.. కరంట్ బిల్లులయితే బాగా అత్తన్నయి.. ఒక్క రోజు ఆగితే ఫైన్ ఏస్తండ్రు. క రంటు లేదు, నీళ్లు లేవు.. మాకు అన్నం పెడతవో, మన్నే పెడతవో.. అందరం బతకాలి అని బూర్గుపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఈరవేని వెంకవ్వ తన పొలం వద్దకు వచ్చిన చంద్రబాబు తో వాపోయింది.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గురువారం జిల్లాలోని గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామ శివారు నుంచి లింగంపల్లి, బూర్గుపల్లి, రామడుగు మండలం తిరుమలాపూర్, మర్రి గడ్డ, సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి, గో పాల్‌రావు పేట, గుండి, రాంచంద్రాపూ ర్ గ్రామాల మీదుగా 14.9 కిలోమీట ర్లు పాదయాత్ర సాగింది. 12 గంటలకు బయలు దేరిన ఆయన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో వి కలాంగులు బేలుపు మల్లేశం, జల్ల పోశన్నలకు ట్రైసైకిళ్లు ఇస్తానని ఇచ్చిన హా మీ మేరకు వారిని పిలిపించి ట్రై సైకిళ్ల ను పంపిణీ చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వేస్తుండగా మా నాన్న చనిపోయాడని రెండేళ్లయినా ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదని మ మ్మల్ని పరిహారం ఇప్పించాలని ర్యాలపల్లికి చెందిన వేమల నిర్మల, పత్తికి మ ద్దతు ధర ఇవ్వడం లేదని, వరద కా లువ లోతు చేయడం వల్ల భూగర్భ జ లాలు ఎండి పోతున్నాయని, అక్కడక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టి 5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని రైతు కె శ్రీపతిరావు. లింగంపల్లిలో గ్రామ పంచాయ తీ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని యంగ్ స్టార్ యూత్ క్లబ్ సభ్యులు. భర్త మృతి చెంది నాలుగు సంవత్సరాలయ్యింది. వితంతు పెన్షన్ ఇస్తలేరు. అంత్యోదయ కార్డు ఇస్తలేరని వెంగమనేని శ్రీలత. గోర్లను మేపడానికి గడ్డి లే దు. మేపుకునేందుకు ఐదెకరాల భూమి ఇయ్యాలే. అని గొర్రె కాపరులు పోచ య్య, గంగయ్య. మాకు చెట్లు పెంచుకునేందుకు జాగ లేదు. పెన్షన్లు ఇవ్వాలని, చెట్టు మీద నుం చి పడిపోయి చనిపోతే పరిహారం ఇవ్వడం లేదు.

మీరైనా ఇ ప్పించాలని బూర్గుపల్లి గీత కార్మికులు..ఇలా ఆయా వర్గాల ప్రజలు దారి పొ డవునా చంద్రబాబు నాయుడుకు బాధలు విన్నివించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో 8 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్ల బడ్జెట్ ఉందని, కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయడం లేదని విమర్శించారు. స్వర్గీయ ఎన్‌టీ రామారావు సింగిల్ విండో వ్యవస్థను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. మండలాలు ఏర్పాటు చేశారని, ప్రజల వద్దకు పాలని నిర్వహించారని ఆ తర్వాత జన్మభూమి నిర్వహించి అన్ని సమస్యలు ప రిష్కరించామన్నారు. సాగునీటి సం ఘాలను పెట్టి సాగునీటి రంగాన్ని ప టిష్టం చేశామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు చేయించామన్నారు. వ్యవసాయానికి 9 గంటల పా టు విద్యుత్తు ఇచ్చామని గుర్తు చేశారు.

ఈ ప్రభుత్వం 4 గంటలు కూడా కరెం ట్ ఇవ్వకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారని అన్నారు. ఈ సీజన్ కు కరెంట్ ఇవ్వలేమని చేతులెత్తేశారని, ఎస్సారెస్పీ నీటిని కూడా ఇవ్వడం లేద ని మండిపడ్డారు. కరెంట్ బిల్లులు చూ స్తుంటే గుండె గుభేలు మంటున్నాయ ని చార్జీల మీద చార్జీలు పెంచి, సర్‌చార్జీ లు వేసి బాదుతున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమి పరిపాలన అని ప్రశ్నించారు. వ్య వస్థలన్నీ కుప్ప కూలిపోయాయని, వీఇఓలను తొలగించిన వైఎస్ఆర్, 50 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలను, బెల్టు షాపుల నిర్వాహకులను ఆదర్శ రైతులుగా పెట్టారని వారి వల్ల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తానని, రైతుల రుణాలు మా ఫీ చేస్తానన్నారు. బీసీల కోసం 10 వేల కోట్లతో సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసి కులవృత్తులకు ఆదరణ కల్పిస్తామన్నారు.

మైనార్టీలకు విద్య, ఉద్యోగాల పరంగా 8 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అ సెంబ్లీ ఎన్నికల్లో 100 మందికి టిక్కెట్లు ఇస్తానని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హా మీ ఇచ్చారు. గొర్రె కాపరులకు 5 ఎకరా ల భూమిని కేటాయించి, మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. గీత కా ర్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇ స్తామని, చెట్టుపై నుంచి పడి మృతి చెం దే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని హామీ ఇచ్చారు. చేనే త, కుమ్మరి, కమ్మరి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానని, ఎస్సీ వర్గీకరణ చేపడతానని చెప్పారు. బాగా చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇస్తామన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, మీ కష్టాలు తీరతాయని, అందరినీ ఆదుకుంటానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆ యన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్, ఎల్ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు కర్రు నాగ య్య, పి రవీందర్‌రావు, ముద్దసాని కశ్య ప్ రెడ్డి, గండ్ర నళిని, శికారి విశ్వనాథం, రాష్ట్ర కార్యదర్శులు అన్నమనేని నర్సింగరావు, బోనాల రాజేశం, జిల్లా నాయకులు కర్ర విద్యాసాగర్ రెడ్డి, రేండ్ల రాజిరెడ్డి, పుల్కం నర్సయ్య, కర్ర సుమ, ఒం టెల మురళీకృష్ణారెడ్డి, అమిరిశెట్టి భూం రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, సత్యనారాయ ణరెడ్డి, పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి, పొ ల్సాని రామారావు, మాచర్ల ఎల్లగౌడ్, మహిళా నాయకులు అమీనాబేగం, దూలం రాధిక, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు సుద్దాల వెంకట గౌతంకృష్ణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద రా జమల్లు, బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధి బుర్ర సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం చేస్తూ..జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మార్గమధ్యంలో, గ్రామాల్లో త నను కలిసే వృద్ధులకు, వికలాంగులకు రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. ఇలా రో జుకు పది నుంచి 15 మందికి కవర్లలో 2 వేల రూపాయలు పెట్టి ఇస్తున్నారు. కాగా, గురువారం రాత్రి రాంచంద్రా పూర్‌లో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి బస చేశారు.

ఎట్ల బతకాలో..చెప్పు బాబూ..!

దోచుకునే ప్రభుత్వాలు వ ద్దు.. ఆదుకునే ప్రభుత్వాలు రా వాలని, ఎరువుల ధరలను తగ్గిం చి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, వ్యవసాయానికి సరిపడా విద్యుత్తు అందించి, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం రావాలని రైతులు అ భిప్రాయపడ్డారు. 'ప్రభుత్వం ఎలా ఉండాలి. ఏమి చేస్తే ప్రజల కష్టాలు తీరతాయి' అనే అంశంపై వస్తున్నా పాదయాత్రలో భాగంగా శుక్రవారం చంద్రబాబు చిప్పకుర్తి నుంచి ఆయా గ్రామాల మీదుగా చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పలువురు రైతులను ఆంధ్రజ్యోతి పలకరించగా వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. రైతులను ఆదుకునే ప్రభుత్వం రావాలి - ఒంటెల రాజిరెడ్డి, శ్రీరాములపల్లి కరెంట్ సక్రమంగా రాక పంటలు ఎండి పోయాయి. పత్తి దిగుబడులు తగ్గి పోయాయని, అడ్డగోలు పెట్టుబడులు అయ్యాయ ని వాటికి తగ్గస్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరలు ఇవ్వడం లేదు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయి. కానీ గిట్టుబాటు ధరలు పెరగలేదు. మేం ఎలా బతికేది.

రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిద్దరపోతున్నది. రైతులను ఆదుకునే ప్రభుత్వం వస్తేనే మా కష్టాలు తీరుతాయి. సరిపడా రుణాలు ఇప్పించి, దళారీ వ్య వస్థను దూరం చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలి.కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో!- గోనేపల్లి లక్ష్మా గౌడ్, రామడుగు వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు వ స్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియదు. ఏ రోజు కూడా 7 గంటల కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. మందు బస్తాల ధరలు బాగా పెరిగాయి. వీపట్టుబడులు పెరిగాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. పెరిగిన ధరలకు తగ్గట్లుగా మద్దతు ధరలు లేవు. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పోయాయి. ఈ ప్రభుత్వం పో వాలి. అందరికీ మేలు చేసే ప్రభుత్వం రావాలి. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.. - కడారీ భూదమ్మ, రామడుగు ఈ కాలంలో వ్యవసాయం చేస్తే పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. నిండా మునుగుడే. కరెంట్ లేక పం టలు ఎండిపోతున్నా యి. బావులు, వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. 5 ఎకరాల పత్తి పండిస్తే 30 క్వింటాళ్ల పత్తి కూడా రావడం లేదు. లక్షా 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టాం. మద్దతు ధర రావడం లేదు. 8 క్వింటాళ్ల పత్తి మా ర్కెట్‌కు తీసుకెళితే 3800 రూపాయల ధరే పడింది.

దోచుకునే ప్రభుత్వం వద్దు..

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన చంద్రయాన్ లో వలంటీర్స్ చేస్తున్న కృషి అంతా, ఇంతా కాదు. వస్తున్నా మీకోసం యా త్రలో భాగంగా 78 రోజులుగా చంద్రబాబు పాదయాత్ర చేస్తూ వస్తుండగా.. ఆయన వెంటే ఉంటూ వలంటీర్స్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బంది కలుగకుం డా చూస్తున్నారు. అనంతపూర్, గుంటూ ర్, చింత్తూరు, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 100 మంది వలంటీ ర్స్ ఆయన వెంటే అంటిపెట్టుకుని ఉంటూ ఎక్కడా చిన్న సంఘటన జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తె లుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో 100 మం ది వాలంటీర్స్‌ను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందంలో 25 మంది వలంటీర్స్‌ను నియమించారు. వాలంటీర్లు పూర్తిగా బాబు వెంటే ఉంటూ ఆయన యాత్ర సజావుగా సాగే లా చూస్తుంటారు. ఆయనకు ముందు, వెనుక, ఇరువైపులా నడుస్తూ ఎవరు ఆయన వద్దకు చొచ్చుకుని రాకుండా జా గ్రత్తలు తీసుకుంటారు. 2008లో బాబు మీకోసం పాదయాత్ర, పోరుబాటలాంటి కార్యక్రమాలు చేపట్టగా, ఈ తెలుగు యువత కార్యకర్తలే అప్పుడు కూడా స్వచ్ఛందంగా సేవలందించారు. అయితే అదే బృందం ఇప్పుడు కూడా వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగస్వాములవుతుండగా, జనవరి 26 వరకు ఆయన వెంటే ఉంటారు.

బాబు సేవలో వలంటీర్స్..

మీ కష్టాలు తీర్చే బాధ్యత నాదే..

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్ సిటీ/రామడుగు) 'ఉద్యోగాలు లేవు..అభివృద్ధి లేదు..అభివృద్ధి జరిగితేనే.. ఉద్యోగాలు వస్తాయని.. ఆదాయం పెరుగుతుందని.. జీ వన ప్రమాణాలు పెరుగుతాయని.. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల మీకు కష్టాలు పెరిగిపోయాయని.. మీ కష్టా లు తీర్చే బాధ్యతను తీసుకుంటాను'.. అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వస్తు న్నా మీ కోసం పాదయాత్రలో భాగం గా శుక్రవారం ఆయన జిల్లాలోని రామడుగు మండలం చిప్పకుర్తి, రామడుగు, షానగర్ క్రాస్‌రోడ్, గోలి రామయ్యప ల్లి, మోతె క్రాస్‌రోడ్, కోరటపల్లి, కొక్కెరకుంట «గ్రామ శివారు వరకు 14.4 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. చిప్పకుర్తి వద్ద బసచేసిన ఆయన 12గంటల 10 నిమిషాల వరకు ఆయన చొప్పదండి నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నియోజకవర్గ నాయకులతో సంభాషించారు. అంనతరం ఎడ్లబండిపై ఎక్కి నా గలి పట్టుకుని అన్నదాత రూపం దా ల్చారు.

12:20 గంటలకు పాదయాత్ర ను ఆరంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలి పనితీరును చూసి అభినందించారు. మార్గమధ్యంలో ఓ పొలం వద్ద మల్లవ్వ, పోశవ్వ, శంకర వ్వ, లక్ష్మి అనే మహిళా కూలీలను బా బు పలకరించగా వారు కష్టాలను ఏకరువు పెట్టారు. మోతె రిజర్వాయర్ ని ర్మాణం చేపడితే తమకు కష్టాలు తప్పవ ని భూములన్నీ ముంపునకు గురైతే కూలీపనులు దొరకవని చెప్పారు. కరెం ట్ బిల్లులు బాగా వస్తున్నాయని వాటి సంగతి చూడాలన్నారు. రామడుగు పో లీస్‌స్టేషన్ ఎదుట గల ఐకేపీ వరి ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కాంటాలో వడ్లు తూకం వేశారు. అక్కడే ఉన్న కొం దరు మహిళలు క రెంట్ బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయని వెయ్యి, రెం డు వేలు వస్తున్నాయని అవి కట్టకుం టే కరెంట్ తీస్తండ్లని..ఫైన్ వేస్తున్నార ని చెప్పారు. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ కూడా వస్త లేదని, పత్తికి మద్దతు ధరలు లేవని వాపోయారు. త్వరలోనే మంచి రోజు లు వస్తాయని అన్నారు.

చౌరస్తాకు చేరుకున్న చంద్రబాబు అక్కడ జరిగిన సభ లో మాట్లాడుతూ తెలుగుదేశం హ యాంలో నిర్ధిష్టమైన ప్రణాళికతో ముం దుకు పోయి నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించామని, నీతికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని అ న్నారు. కాంగ్రెస్ దోపిడీ, రాక్షస పాలన సాగిస్తున్నదన్నారు. ప్రజలందరూ ఇ బ్బందులు పడుతున్నారని గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పత్తికి మద్దతు ధర లే దని, ఎరువుల ధరలను మాత్రం నాలుగింతలు పెంచేసి రైతుల నడ్డీ విరుస్తున్నదన్నారు. అధికారంలోకి వచ్చిన వెం టనే రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన 9 గంటల విద్యుత్తును సరఫరా చేస్తామన్నారు. గుండెలు గు భేల్ మనేలా కరెంట్ బిల్లులు వస్తున్నాయన్నారు. వ్యవసాయానికి రోజుకు 4 గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదన్నారు.

రైతులు అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నార ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడాది వరకు ఈ జిల్లాలో 817 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రభుత్వం రైతుల కోసం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉందని, ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సర్‌చార్జీ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశా రు. నాడు డ్వాక్రా సంఘాలు పెట్టి రివాల్సింగ్ ఫండ్ ఇచ్చి ఆదుకుంటే ప్రస్తు తం పావలావడ్డీ అని చెప్పి అడ్డగోలు వడ్డీ వసూలు చేశారని, మైక్రో ఫైనాన్స్ ల వల్ల మహిళలు అప్పుల ఊబిలో కూ రుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశా రు. మహిళలకు అండగా ఉండి మైక్రో ఫైనాన్స్‌లను ఊడబీకేలా చేశామన్నా రు. బ్యాంకు అప్పులు తీర్చే బాధ్యత తీ సుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో మహిళలకు 35 లక్షల గ్యా స్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు.

పెరిగిన ధరల వల్ల గ్యాస్ కొనే పరిస్థితి లేదని, నిత్యావసరాలు అన్ని పెరిగి పోయాయని నాడు 12 రూపాయలు న్న చక్కెర 42 రూపాయలకు, 2 రూపాయలున్న ఉప్పు 10 రూపాయలకు, 30 రూపాయలున్న పప్పు 75 రూపాయల కు పెరిగిందన్నారు. ఒక్క నిత్యావసరాలే కాదు అన్నీ పెరిగాయని, మీకు కష్టాలు వచ్చాయన్నారు. దీనికంతటికీ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే కారణమన్నారు. ఈ దేశం లో డబ్బుల్లేక కాద ని, ఆ డబ్బును అం తా దోచుకుని వాళ్ల ఖజానాలు నింపుకుంటున్నారని అ న్నారు. పేదిరిక ని ర్మూలన కోసం పో రాటం చేస్తానన్నా రు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని, తెలంగాణ తె లుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. తెలంగాణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, రోడ్లు వేశామ ని, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించామని, 11సార్లు డీఎస్‌సీ నిర్వహించి లక్షా 65 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని.. భవిష్యత్తులోనూ వ్యతిరేకంగా పని చేయనన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రా యం చెప్పకుండా ఇతరుల అభిప్రా యం తెలుసుకుని తప్పించుకునేందుకు యత్నిస్తున్నదన్నారు. మీ ఇంట్లో పెద్ద బిడ్డగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో తె లంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, సీహెచ్ విజయరమణారావు, మాఐ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, శికారి విశ్వనాథం, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కర్రు నాగయ్య, గోపు అయిలయ్య యాదవ్, గండ్ర నళిని, పుట్ట కిశోర్, పి రవీందర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, పార్టీ నాయకులు ఒం టెల మురళీ కృష్ణారెడ్డి, దామెర సత్యం, కొత్త తిరుపతి రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, మిట్టపల్లి శ్రీనివాస్, గురువా రెడ్డి, రాష్ట్ర పరిశీలకు లు విద్యాసాగర్ రావు, చల్లోజు రాజు, మహిళా నాయకురాళ్లు అంజలిగౌడ్, అ మీనాబేగం, తదితరులు పాల్గొన్నారు.

సభను అడ్డుకునేందుకు యత్నించినటీఆర్ఎస్ కార్యకర్తలురామడుగులో చంద్రబాబు నాయు డు సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు.

జై తెలంగా ణ అంటూ ఒక్కసారిగా సభలోకి దూ సుకురావడంతో వారిని పోలీసులు సభ బయటకు తీసుకెళ్లారు. వారి మీదకు వె ళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించ గా చంద్రబాబు జోక్యం చేసుకుని పార్టీ కార్యకర్తలు ఎవరూ అటు వైపుగా వెళ్లవద్దని తెలుగుదేశం పార్టీని చూస్తే వారికి వణుకు పుడుతున్నదని అన్నారు.బాబును కలిసిన దాడి వీరభద్రరావుచంద్రబాబును శాసనమండలి టీ డీపీ సభా పక్షనేత దాడి వీరభద్రరా వు, వికారాబాద్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, అండమాన్ నికోబార్ దీవులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ మాణిక్యారా వు దీవులు, రాజకీయ విశ్లేషకులు వి మాధవ నాయుడు, ఉపాధ్యక్షులు ఆర్ నర్సింహారావు, సీహెచ్ బాబ్జీ, ప్రధాన కార్యదర్శి సంతోష్ సింగ్, తెలుగు మ హిళ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాకినేని శేషుకుమారి, తదితరులు చంద్రబాబు ను కలుసుకుని కొద్ది దూరం ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు.

ఉద్యోగాలు లేవు..అభివృద్ధి లేదు..

అంగన్‌వాడీ వర్కర్లు..గ్రామీణ ప్రాంతాలకు అక్షయపాత్రలు. పేదలు, కూలీల పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో వీళ్ల పాత్రే కీలకం. అలాంటివాళ్లు ఇవాళ గొల్లుమంటున్నారు. వాళ్ల 'పాత్ర' దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. వాళ్లు ఇన్ని కష్టాలు పడుతున్నారనే విషయం గోలి రామయ్యపల్లెలో అడుగు పెట్టే వరకు నాకూ తెలియదు. వాళ్ల మాటల్లో పరిస్థితిని విన్నప్పుడు బాధనిపించింది. భావి పౌరులందరికీ పౌష్టికాహారం ఇచ్చి శారీరకంగానూ మానసికంగానూ దోహదపడే ఇంత మంచి వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది.

"జీతం,భత్యం లేకుండా పనిచేస్తున్నాం సార్. ఇచ్చే ఆ అరకొర జీతం కూడా ఐదు నెలలుగా రావడం లేదు. రేషన్ ఇవ్వడమూ అంతే. మా దగ్గర లేకుండా పిల్లలకు ఏమి పెట్టాలి? గట్టిగా వాన పడితే మేమూ పిల్లలూ ముద్దముద్దే. సొంత భవనాల గురించి ఎంత కొట్లాడినా సర్కారులో సోయే లేదు'' అని కొందరు మహిళలు వాపోయారు. వాళ్ల ఆవేదనలో నిజం ఉన్నదనిపించింది. బండెడు చాకిరీ చేసినా చిటికెడు గుర్తింపునకు వాళ్లు నోచుకోవడం లేదు.

వీళ్లకేదో కొత్తగా ఒరగబెడతారని కాదు గానీ, ఇచ్చేదైనా సరిగ్గా ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర తాజా బడ్జెట్‌లో అంగన్ వాడీ వర్కర్ల గౌరవ వేతనం దాదాపు నాలుగు వేలకు పెరిగినా వారికి పూర్తిగా అందిందే లేదు. ఆ వేతనంలో ఏడు వందలు రాష్ట్రం వాటా. మిగతాది కేంద్రం విడుదల చేస్తుంది. తన వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్న నిధులనూ మన ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు దారి మళ్లిస్తున్నది. దీనిపై అంగన్‌వాడీ వర్కర్లు రోడ్డెక్కినా పట్టించుకోవడం లేదు. చివరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలూ పాటించడం లేదు. ఎంత ఘోరం?

నీళ్లు వస్తున్నాయంటే ఊళ్లు కళకళలాడాలి. ప్రాజెక్టు కడుతున్నారంటే కొత్త ఆయకట్టు సాగులోకి రావాలి. కానీ, కోరటపల్లిలో రైతులు మాత్రం మోతె ప్రాజెక్టు అంటేనే బెదిరిపోతుండటం కనిపించింది. "సార్ అది మోతె ప్రాజెక్టు కాదు.. మా ప్రాణాలకు ఉరి బిగించే ప్రాజెక్టు. దానివల్ల మా భూములన్నీ ముంపులో పడతాయి. మరే ప్రాజెక్టూ మాకొద్దు. శ్రీరాంసాగర్ నీళ్లు సక్రమంగా విడుదల చేస్తే అదే మాకు పది వేలు'' అని రైతులు చెబుతుంటే, ఇదేమి అభివృద్ధి, ఎందుకీ జలయజ్ఞం అనిపించింది.

బాబు డైరీ.. గొల్లుమంటున్న అంగన్‌వాడీ వర్కర్లు

ముఖ్యమంత్రి.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నాడు!
ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడు
అవినీతి జీవోలపై మంత్రులకు మద్దతిస్తాడు
కానీ, రైతులు చస్తున్నా పట్టించుకోడు
సీఎం కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు
అవినీతిపరులెవరైనా శిక్షించాల్సిందే
బంగారం రేట్లు పెంచిన గాలి పసిడి దాహం
కరీంనగర్ పాదయాత్రలో టీడీపీ అధినేత

కరీంనగర్, డిసెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): "అవినీతి మంత్రులకు, నేరస్తులకు ఈ ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్నారు. శిక్షించాల్సింది పోయి కాపాడుతున్నారు. అవినీతిపరులు మంత్రులైనా, ఎవరైనా సరే, వారు ఎక్కడున్నా నిర్ధాక్షిణ్యంగా శిక్షించాల్సిందే''నని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి నుంచి శుక్రవారం ఆయన పాదయా త్ర ప్రారంభించారు. రామడుగు, షానగర్ క్రాస్ రోడ్, గోలి రామయ్యపల్లి, మోతె క్రాస్ రోడ్, కోరటపల్లి, కొక్కెరకుంట «గ్రామ శివారు వరకు 14.4 కిలోమీటర్లు నడిచా రు.

రామడుగు, షానగర్ సభల్లో మాట్లాడిన ఆయన.. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'వాన్‌పిక్' మంత్రిని వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. "వాన్‌పిక్ వ్యవహారంలో ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ6, ఏ7ను సీబీ ఐ అరెస్టు చేసింది. ఏ5గా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేసేందుకు వెళితే, ఆయనను అరె స్టు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డు పడింది. 26 అవినీ తి జీవోలను జారీ చేసిన మంత్రులు సుప్రీంకోర్టుకు వెళితే వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామనడం సిగ్గుచేటు''అని మండిపడ్డారు.

రైతులు మద్దతు ధర రాక ఆందోళనలు చేస్తుంటే సఎం పట్టించుకోకపోవడ తగదని విమర్శించారు. "ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నా రు. గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి మద్దతు ధర లేదు. ఎరువుల ధరలను నాలుగింతలు పెంచేసి ప్రభుత్వం.. రైతుల నడ్డీ విరుస్తున్న''దన్నారు.

అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడాది వర కు 817 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సర్‌చార్జి వసూళ్లను నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో 10 లక్షల కోట్ల అవినీతి జరగగా, రాష్ట్రంలో 86 వేల కోట్ల తో జలయజ్ఞం చేపట్టి పేదవాళ్ల సొమ్మును దోపిడీ చేశార ని దుయ్యబట్టారు. ఒకేసారి అన్ని పనులూ ప్రారంభించి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట దోచుకున్నారని ఆరోపించారు. కిరణ్ ప్రభుత్వం దివాలా తీసిందన్నారు.

113 సెజ్‌ల పేరిట 2 లక్షల 75 వేల ఎకరాల భూములను వైఎస్ ఆయా కంపెనీలకు పంచి పెట్టారని చెప్పారు. భూగర్భ గనులు గల 8 వేల ఎకరాల భూములను ఇచ్చి 16 లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో ఉన్న బంగారన్నంతా కొనేసిన గాలి బంగారు మంచం, కంచం, గ్లాసు, కుర్చీ చివరికి బంగారు మరుగుదొడ్డి ని కూడా ఏర్పాటు చే సుకున్నాడని, దానివల్ల ఆడపడుచులకు బం గారు మంగళ సూత్రం, ఆడపిల్లలకు ముక్కు పోగు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

భూగర్భ సం పదనంతా కొల్లగొట్టార ని, అదే ఉంటే వృద్ధుల కు వెయ్యి రూపాయల పింఛను, పేదలకు ఇళ్లు, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. గుండె లు గుబేల్‌మనేలా కరెంట్ బిల్లులు వస్తున్నాయని, వ్యవసాయానికి రోజుకు 4 గంటలైనా విద్యుత్తు ఇవ్వడం లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో మహిళలకు 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పెరిగిన ధరల వల్ల గ్యాస్ కొనే పరిస్థితి లేదన్నా రు. దేశంలో డబ్బుల్లేక కాదని, ఆ డబ్బును దోచుకుని వాళ్ల ఖజానాలు నింపుకుంటున్నారని పరోక్షంగా జగన్‌పై నిప్పులు చెరిగారు.

మార్గమధ్యలో పత్తి రైతులు, వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారితో చంద్రబాబు సంభాషించారు. కాగా, రామడుగు సభలో కొందరు యువకులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో వారిని పోలీసులు పక్కకు వెళ్లగొట్టారు. చంద్రబాబు వెంట శాసన మండలి సభా పక్ష నేత దాడి వీరభద్ర రావు, టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, సీహెచ్ విజయరమణారావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రి.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నాడు!కరీంనగర్ పాదయాత్రలో టీడీపీ అధినేత