December 22, 2012

దోచుకునే ప్రభుత్వం వద్దు..

దోచుకునే ప్రభుత్వాలు వ ద్దు.. ఆదుకునే ప్రభుత్వాలు రా వాలని, ఎరువుల ధరలను తగ్గిం చి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, వ్యవసాయానికి సరిపడా విద్యుత్తు అందించి, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం రావాలని రైతులు అ భిప్రాయపడ్డారు. 'ప్రభుత్వం ఎలా ఉండాలి. ఏమి చేస్తే ప్రజల కష్టాలు తీరతాయి' అనే అంశంపై వస్తున్నా పాదయాత్రలో భాగంగా శుక్రవారం చంద్రబాబు చిప్పకుర్తి నుంచి ఆయా గ్రామాల మీదుగా చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పలువురు రైతులను ఆంధ్రజ్యోతి పలకరించగా వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. రైతులను ఆదుకునే ప్రభుత్వం రావాలి - ఒంటెల రాజిరెడ్డి, శ్రీరాములపల్లి కరెంట్ సక్రమంగా రాక పంటలు ఎండి పోయాయి. పత్తి దిగుబడులు తగ్గి పోయాయని, అడ్డగోలు పెట్టుబడులు అయ్యాయ ని వాటికి తగ్గస్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరలు ఇవ్వడం లేదు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయి. కానీ గిట్టుబాటు ధరలు పెరగలేదు. మేం ఎలా బతికేది.

రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిద్దరపోతున్నది. రైతులను ఆదుకునే ప్రభుత్వం వస్తేనే మా కష్టాలు తీరుతాయి. సరిపడా రుణాలు ఇప్పించి, దళారీ వ్య వస్థను దూరం చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలి.కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో!- గోనేపల్లి లక్ష్మా గౌడ్, రామడుగు వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు వ స్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియదు. ఏ రోజు కూడా 7 గంటల కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. మందు బస్తాల ధరలు బాగా పెరిగాయి. వీపట్టుబడులు పెరిగాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. పెరిగిన ధరలకు తగ్గట్లుగా మద్దతు ధరలు లేవు. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పోయాయి. ఈ ప్రభుత్వం పో వాలి. అందరికీ మేలు చేసే ప్రభుత్వం రావాలి. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.. - కడారీ భూదమ్మ, రామడుగు ఈ కాలంలో వ్యవసాయం చేస్తే పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. నిండా మునుగుడే. కరెంట్ లేక పం టలు ఎండిపోతున్నా యి. బావులు, వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. 5 ఎకరాల పత్తి పండిస్తే 30 క్వింటాళ్ల పత్తి కూడా రావడం లేదు. లక్షా 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టాం. మద్దతు ధర రావడం లేదు. 8 క్వింటాళ్ల పత్తి మా ర్కెట్‌కు తీసుకెళితే 3800 రూపాయల ధరే పడింది.