February 17, 2013

నింగినంటుతోన్న నిత్యవసర సరుకుల ధరలపై ప్రజలు ముఖ్యంగా మహిళలు రగిలిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితో బియ్యం ధర రెట్టింపు కావడం, పప్పులు, నూనెలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ తదితర సరుకుల ధరలు పెరిగిపోవడంపై కాగి పోతున్నారు. చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో మహిళలు ఇళ్లల్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని మాటల్లో చూపిస్తున్నారు. ఆదాయం పెరగలేదు. ఖర్చు రెండు రెట్లు పెరిగిందంటూ ఆవేదనభరితమౌతూ మోయలేకుండా ఉన్న నిత్యవసర సరుకుల ధరల భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.

పల్లెల్లో అయితే చంద్రబాబు కంటే ముందే ధరల మధ్య వ్యత్యాసాన్ని మహిళలు చెబుతున్నారు. సన్నబియ్యం ధర రూ. 15 నుంచి నేడు రూ. 45కు పెరిగింది. వంట నూనె రూ. 40 నుంచి రూ.80 దాటింది. ఉల్లిపాయులు కేజీ రూ.4 నుంచి రూ.40కి చేరుకొన్నది. కందిపప్పు రూ. 25 నుంచి రూ. 80కి చేరింది. మా సంపాదన మాత్రం రోజుకు రూ. 100 అలానే ఉందని చెబుతూ తామెలా బతకాలని గోడు వెళ్ళబోసుకొంటున్నారు.

విద్యుత్ ఛార్జీల పైనా మహిళలు స్పందిస్తున్నారు. ప్రతి నెలా ఇంట్లో విద్యుత్ సిబ్బంది నుంచి బిల్లులు తీసుకొనే మహిళలు ఇటీవలకాలంలో సర్‌చార్జ్ మూలంగా పెరిగిన మొత్తాన్ని చూసి ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి రాత్రి వేళ కరెంటు సరఫరా చేస్తుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇచ్చే మూడు గంటల విద్యుత్ అర్ధరాత్రి 2 గంటలకు ఇస్తుంటే గబ్బచీకటిలో పొలానికి వెళ్ళాల్సి వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు పెడుతోన్న నీరు సక్రమంగా చేరుతుందో, లేదో తెలియని పరిస్థితి అని, అలానే ఏ విషసర్పాలు, కీటకాలు భారిన పడాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జీవించాల్సి వస్తోందని చెబుతున్నారు.

పెరిగిన ధరలపై మహిళల ఆగ్రహం

'అగస్టా' మూలాలు వైఎస్ కుటుంబంలోనే
: చంద్రబాబు

అగస్టా హెలికాప్ట్టర్ల కుంభకోణం మూలాలు హైదరాబాద్‌లోనే.. అదీ వైఎస్ కుటుంబంలోనే బయటపడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని స్వీయ స్వార్థానికి పాల్పడుతున్న వారిని ఏమనాలంటూ బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. బ్రదర్ అనిల్.. రాష్ట్రంలో ఆస్తులను కబ్జా చేయడమే పనిగా పెట్టుకొన్నాడని మండిపడ్డారు.

కాగాఅగస్టా కుంభకోణంలో వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ హస్తం ఉందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు సేకరించామని, వాటితో సీబీఐని సంప్రదించబోతున్నట్లు వారు తెలిపారు. చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు ఆదివారం సమావేశమయ్యారు. టీడీపీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు దేవేందర్‌గౌడ్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, సీఎం రమేష్, రమేష్‌రాథోడ్, శివప్రసాద్ తమ అధినేతతో సంభాషించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అగస్టా కుంభకోణంలో ఇటలీ లింకులన్నీ బయటకు రావాల్సి ఉందని, దీనిపై తాము పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పుతామని చెప్పారు.

రాష్ట్రంలో భూములు కబ్జా చేయడమే బ్రదర్ అనిల్ పని

రుణమాఫీ చేసి చూపిస్తా!
కేంద్రంలో వచ్చేది మా మద్దతున్న సర్కారే
అప్పుడు డిమాండ్ చేసి పనులు చేయించుకుంటా
సిలెండర్ ధరలూ దించుతా
గుంటూరు పాదయాత్రలో మహిళలకు బాబు వరం

రుణమాఫీపై మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. " ఏ పథకం నిలిపివేసి రుణమాఫీ పథకం అమలు చేస్తా''రన్న కిరణ్ ప్రశ్నపై టీడీపీ అధినేత దీటుగా స్పందించారు. ఈ చేతగానీ సీఎంకు రుణమాఫీ చేసి చూపిస్తానని దీటుగా జవాబు ఇచ్చారు. "ఈసారి మా మద్దతు ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఢిల్లీని డిమాండ్ చేసి.. రుణమాఫీ పథకం సాధిస్తా. అలాగే రాష్ట్రానికి అవసరమైన పనులూ చేయించుకుంటా''నని వెల్లడించారు. రైతుకు ఇచ్చిన మాటను నిలుపుకొని తీరతానని పునరుద్ఘాటించారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చినరావూరు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. జగడిగుంటపాలెం, పెదరావూరు మీదుగా కూచిపూడి చేరుకొని రాత్రి బస చేశారు.

ప్రజలను కలుసుకున్నప్పుడు, పెదరావూరు బహిరంగ సభలోనూ సీఎం కిరణ్‌పై నేరుగా విరుచుకుపడ్డారు "ఈ సీఎంకి పరిపాలనేమి తెలుసు? నా పరిపాలన తీరును అధ్యయనం చేసేందుకు నాడు బిల్ క్లింటన్ వారి దేశ గవర్నర్లను పంపించారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న యావతో కిరణ్ సాగుతున్నారు. ఇద్దరు తమ్ముళ్లతో దుకాణం తెరిచారు. నీలం తుపాను వస్తే ఇప్పటివరకు రైతాంగానికి సాయం అందించలేదు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు కుటుంబాన్ని కూడా వదిలేసి ర్రాష్టాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాను. ఈ రోజున కుక్కల చింపిన విస్తరిలా మారిపోవడంతో మీకంటే ఎక్కువ నాకు భాదేస్తోంది'' అని భావోద్వేగంతో పలికారు. అకాలవర్షంతో మిర్చి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బాధితులు వాపోతుంటే వారిని ఓదార్చుతూ ముందుకు సాగారు. "కాంగ్రెస్ హయాంలో రైతులు రెండు విధాలుగా దెబ్బతింటున్నారు. ఒకవైపు పంటలు సాగు చేసుకొనేందుకు ప్రభుత్వం కాలువలకు నీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తుంది.

మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తూ కోలుకోకుండా చేస్తున్నాయ''ని ఆవేదన వ్యక్తం చేశారు. గజదొంగలు, దోపిడి దొంగలను ప్రజల్లోకి వదిలిన కాంగ్రెస్, వైసీపీలను చిత్తుచిత్తు చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి 42 మంది ఎంపీలను అందిస్తే ఢిల్లీలో చక్రం తిప్పి మహిళల కష్టాలు తీరుస్తానని హామీఇచ్చారు. ఏడు వేలుగా ఉన్న కొత్త కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తానని, సిలెండర్ ధరను కూడా తగ్గిస్తానని వాగ్దానం చేశారు. అలాగే.. ఆధునిక పనిముట్లు, మగ్గాలు ఇప్పించి చేనేత వృత్తిని లాభసాటి చేస్తామని చేనేతలకు భరోసా ఇచ్చారు. బీసీ-బీలో ఉన్న సగర కులాలను ఎస్‌టీల్లోకి చేర్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

రుణ మాఫీపై పట్టుబడదాం: టీడీపీ ఎంపీల వ్యూహాం
హైదరాబాద్ : రైతుల రుణాలను మాఫీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ నిర్ణయించింది. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో ఒకరోజుపాటు సభని స్థంభింపచేసి, ఆ వైపుగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలని ఆదివారం గుంటూరులో జరిగిన టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేసేలా కేంద్రంపై పోరాడాలని, ఈ విషయంలో కలిసి వచ్చే భావసారుప్యంగల పార్టీలతో సమన్వయం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. కరువు, ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన రైతులు గత్యంతరంలేక రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని పార్లమెంటుల్లో ప్రస్తావించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలాఉండగా, ఆరోగ్యాన్ని దృష్టిలో పాదయాత్రని కుదించు కోవాలని చంద్రబాబుకు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అయితే, శ్రీకాకుళం జిల్లా వరకు తన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సీఎంకు ఏమీ చేతకాదు

  టీడీపీ హయాంలో నిజాం సుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారం పారదర్శకంగా జరిగింది. దీనిని నిరూపించేందుకు నార్కో పరీక్షకైనా నేను సిద్ధం. నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్ని పాలించింది మీరే. మీరు చేసిన పాపాలు మాపై ఎందుకు రుద్దుతారు? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? ' అంటూ జగన్ పార్టీ నేతలను టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం సుగర్స్ అమ్మకం వ్యవహారంలో టీడీపీ హయాంలో ఏం జరిగిందో...వైఎస్ హయాంలో ఏం జరిగిందో బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చేతనైతే జగన్ పార్టీ నేతలు ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

ఈ సంస్ధలో వాటాలు కొనుక్కొన్న గోకరాజు రంగరాజు ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో ఎవరికైనా ముడుపులు ఇచ్చారేమో తెలుసుకోవడానికి ఆయనకు నార్కో పరీక్ష చేయించాలని, నాడు మంత్రిగా పనిచేసిన తనకూ ఆ పరీక్ష చేస్తానన్నా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. దీని సేల్ డీడ్ లావాదేవీలను ఆ తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని, ఇందులో ఏదైనా తప్పు జరిగింద నుకొంటే ఎందుకు సేల్ డీడ్ చేశారని ప్రశ్నించారు. 'ఆ పాలేరు సుగర్స్‌ను కూడా బహిరంగ వేలంలోనే అధిక ధర కోట్ చేసిన మధుకాన్ కంపెనీకి ఇచ్చామని, అప్పటికి ఆ కంపెనీ యజమాని నామా నాగేశ్వరరావు టీడీపీలో లేరని ఆయన చెప్పారు.

నిజాం సుగర్స్ వ్యవహారంలో 'నార్కో'కు సిద్ధం: టీడీపీ

జోరు వానలో చంద్రబాబు పాదయాత్ర హోరెత్తుతూ కొనసాగింది. కుండపోత వర్షం కురుస్తున్నా తెనాలి పుర వీధులు జనసంద్రమయ్యాయి. వర్షంలోనే తడుస్తూ అలుపెరగని పాదచారి రాక కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఎదురు చూశారు. తమ అభిమాన నేతకు అభివాదాలు చేస్తూ, సమస్యలు విన్నవిస్తూ, దీవెనలు అందజేస్తూ ముందుకు సాగనంపారు. శనివారం తెనాలి నియోజకవర్గంలోని అంగలకుదురు, తెనాలి పట్టణాల్లో కొనసాగిన చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.జిల్లాలో పదో రోజు పాదయాత్రను శనివారం ఉదయం అంగలకుదురు గ్రామం శివారు నుంచి చంద్రబాబు ప్రారంభించారు.

తన రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర అధిగమించిన గుర్తుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్మాణం తలపెట్టిన ఎన్‌టీఆర్ కిసాన్ భవన్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర, కిసాన్‌భవన్‌ల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. సాగునీరు లేక కృష్ణా డెల్టా సర్వనాశనం అయిందన్న ఈదర పూర్ణచంద్రరావు అనే రైతు చేసిన వ్యాఖ్యపై చంద్రబాబు స్పందిస్తూ కాలువల్లో రైతుల కన్నీళ్లు పారుతున్నాయన్నారు.

డెల్టాలో మొక్కజొన్న, పసుపు రెండో పంటగా పండిస్తేనే రైతులు నిలదొక్కుకోగలుగుతారని, అయితే ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాను సోమవారం పాదయాత్ర ఎక్కడికి చేరుకొంటే అక్కడే మహాధర్నాకు దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించానని చెప్పారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను నివేదించారని, అలానే హైదరాబాద్‌లో మరో ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసి డెల్టా, సాగర్ కాల్వలకు నీరు విడుదల చేసి పంటలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నారు.

నాగార్జునసాగర్‌లో 490 అడుగులు నీటిమట్టం ఉంటనే మేము సమర్థవంతగా సాగు నీరు ఇచ్చాం. కలెక్టర్, ఎస్‌పీలను కాలువల మీద పెట్టి చివరి భూముల వరకు సాగునీరు వెళ్లేలా చేశాం. ఈ రోజున సాగర్‌లో 515 అడుగులున్నా నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు చూసి సోమవారం ఉదయం జిల్లా రైతులతో మహాధర్నాకు దిగుతానని స్పష్టం చేశారు. అంగలకుదురు నుంచి పాదయాత్రగా తెనాలికి వెళుతుండగా అనుకోని అతిథి రూపంలో వర్షం ఎదురైంది. దాంతో చంద్రబాబు రోడ్డు పక్కన ఉన్న ఒక పూరిగుడిసెలోకి వెళ్లారు.

వర్షం వెలిసిన తర్వాత తిరిగి నడక ప్రారంభించి మార్గమధ్యలోని జేఎంజే కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులతో చంద్రబాబు సంభాషించారు. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడపిల్లలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే బాధ్యతను తాను తీసుకొంటానని హామీ ఇచ్చారు. విద్యార్థినులు టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, విద్యే కాకుండా విలువలూ అవసరమని స్పష్టం చేశారు.

స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా చేస్తానన్నారు. టీడీపీ హయాంలో విద్యార్థినులను ఎవరైనా ఈవ్‌టీజింగ్ చేయాలంటే భయపడేవారు. రౌడీలు రాష్ట్రం విడిచిపోయేలా చేశాం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు చెయ్యాల్సింది చేసేవాళ్లం. నేడు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని గమనించాలని చంద్రబాబు సూచించారు.

జేఎంజే కళాశాల విద్యార్థినులతో సంభాషణ అనంతరం మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొన్న చంద్రబాబు తిరిగి పాదయాత్రను ప్రారంభించగా వర్షం మరోసారి ఎదురైంది. ఉదయం 10 నిమిషాల పాటు కురిసిన వాన సాయంత్రం జోరున గంటకు పైగా కురిసింది. అయినాసరే చంద్రబాబు పాదయాత్రను నిలిపేయకుండా గొడుగు సాయంతో ముందుకు కదిలారు. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి అడుగు లోతులో వరదనీరు చేరినా చంద్రబాబు లెక్క చేయకుండా చెంచుపేట, రెండు రైల్వేగేట్ల రోడ్డు మీదుగా తెనాలి మునిసిపల్ కార్యాలయ సెంటర్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబుకు దారి పొడవునా మహిళలు నీరాజనాలు పలికారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్, కందుకూరి వీరయ్య, నిమ్మకాయల రాజనారాయణ, చీరాల గోవర్థన్‌రెడ్డి, పార్టీ నాయకులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, పెదకూరపాడు బుజ్జీ, ముమ్మనేని వెంకట సుబ్బయ్య తదితరులు నడిచారు.

జోరువానలో జనయాత్ర

  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదని..ఆయనకు ఏ రిజర్వాయర్ ఎక్కడ ఉందో కనీసం అవగాహన లేదన్నారు. వస్తున్నా మీ కోసం పాదయా త్రలో భాగంగా శనివారం అంగలకుదురు నుండి బయలుదేరినఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం రా త్రి మార్కెట్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చం ద్రబాబు మాట్లాడుతూ ఇన్ని రోజులు వ్యవసాయానికి నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

స్థానిక శాసన సభ్యుడు స్పీకర్ హోదాలో ఉండి కూడా ఉపయోగం లేదని ఆయన రైతులను ఆదుకోలేక పోయారని విమర్శించారు. రైతులు కష్టాలలో ఉంటే ఆదుకోలేని వ్యక్తులు స్పీకర్లు, ముఖ్యమం త్రులుగా ఉండటం ప్రజల దురదృష్టమని చెప్పారు.

చూడముచ్చటగా ఉంటే ఆం ధ్రాప్యారిస్ తెనాలిలోని కాల్వలను కాం గ్రెస్ నాయకులు మురికి కూపాలుగా తయారు చేశారని, ప్రజలను చైతన్యపరుస్తూ వారి కష్టాలు తెలుసుకునేందుకు కఠినతరమైనప్పటికీ పాదయా త్ర నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రా ష్ట్రంలో రాజకీయ దొంగలు ఎక్కువయ్యారని, దోచుకున్నది దాచుకోవటానికి దొంగలందరూ ఏకమౌతున్నారని విమర్శించారు.

రైతు రుణమాఫీపై తెలుగుదేశం తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమం త్రి ఉలిక్కి పడ్డాడని, ఢిల్లీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని పిల్ల కాం గ్రెస్ చెబుతుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులను ఏ విధంగా ఆదుకుంటానో చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికలలో ఓటమి భయంతోనే తాజాగా తాము కూడా రైతుల రుణా లు మాఫీ చేస్తామంటూ కాం గ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారని, వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. అగస్త హెలికాప్టర్లకు సంబంధించి దేశ రక్షణ శాఖలో రూ.360 కోట్ల అవినీతి జరిగిందని, ఈ కాం గ్రెస్ దొంగలను ఏమనాల్లో అర్థం కావటం లేదన్నారు.

దేశంలో ఆడపిల్లలు రక్షణ లేకుండా పోతోందన్నారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఉరి తీసేవారమని అన్నారు. కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మెరుగైన ఆరోగ్య బీమా పథకం ప్రవేశ పెట్టి ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే వ స్త్రాలపై వ్యాట్ టాక్స్ పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

సుమారు రెండు గంటల పాటు జరిగిన బహిరంగ సభలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరై చం ద్రబాబు ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. మాజీమంత్రి ఆలపాటి రాజేం ద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్, అన్నాబత్తుని శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం..రైతులకు శాపం

ఎన్నికల కో డ్‌ను కారణంగా చూపిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును జిల్లా విడిచి వెళ్ళాలని ఆ దేశాలు ఇవ్వడం సమంజసం కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 2040 కిలోమీటర్ల దూరం నడిచారని చెప్పారు. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల నిబంధనలకు లోబడి పాదయాత్రను నిర్వహిస్తున్నాం. అలానే ఈ నెల 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం నాలుగు వరకు పాదయాత్ర నిలిపేయాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను కూడా పాటిస్తామని చెప్పామన్నారు.

ఇప్పటివరకు పాదయాత్రలో ఎక్కడా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయమని చంద్రబాబు అభ్యర్థించలేదని, అలానే ఓటర్లను ప్రభావితం చేయలేదని చెప్పారు. అయినప్పటికీ జిల్లాను విడిచి వెళ్ళాలనడం సబబు కాదన్నారు. ఇంకా శ్రీకాకుళం జిల్లా వరకు సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను చంద్రబాబు చేయాల్సిఉందని చెప్పారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వారిని చైతన్యపరచడమే తప్పా ఎన్నికల ప్రచార నిమిత్తం కాదని, ఈ నేపథ్యంలో జిల్లాను విడిచి వెళ్ళాలన్న ఆదేశాల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు.

చంద్రబాబు జిల్లాను వీడాలనడం సమంజనం కాదు