February 17, 2013

కాంగ్రెస్ ప్రభుత్వం..రైతులకు శాపం

  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదని..ఆయనకు ఏ రిజర్వాయర్ ఎక్కడ ఉందో కనీసం అవగాహన లేదన్నారు. వస్తున్నా మీ కోసం పాదయా త్రలో భాగంగా శనివారం అంగలకుదురు నుండి బయలుదేరినఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం రా త్రి మార్కెట్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చం ద్రబాబు మాట్లాడుతూ ఇన్ని రోజులు వ్యవసాయానికి నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

స్థానిక శాసన సభ్యుడు స్పీకర్ హోదాలో ఉండి కూడా ఉపయోగం లేదని ఆయన రైతులను ఆదుకోలేక పోయారని విమర్శించారు. రైతులు కష్టాలలో ఉంటే ఆదుకోలేని వ్యక్తులు స్పీకర్లు, ముఖ్యమం త్రులుగా ఉండటం ప్రజల దురదృష్టమని చెప్పారు.

చూడముచ్చటగా ఉంటే ఆం ధ్రాప్యారిస్ తెనాలిలోని కాల్వలను కాం గ్రెస్ నాయకులు మురికి కూపాలుగా తయారు చేశారని, ప్రజలను చైతన్యపరుస్తూ వారి కష్టాలు తెలుసుకునేందుకు కఠినతరమైనప్పటికీ పాదయా త్ర నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రా ష్ట్రంలో రాజకీయ దొంగలు ఎక్కువయ్యారని, దోచుకున్నది దాచుకోవటానికి దొంగలందరూ ఏకమౌతున్నారని విమర్శించారు.

రైతు రుణమాఫీపై తెలుగుదేశం తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమం త్రి ఉలిక్కి పడ్డాడని, ఢిల్లీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని పిల్ల కాం గ్రెస్ చెబుతుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులను ఏ విధంగా ఆదుకుంటానో చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికలలో ఓటమి భయంతోనే తాజాగా తాము కూడా రైతుల రుణా లు మాఫీ చేస్తామంటూ కాం గ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారని, వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. అగస్త హెలికాప్టర్లకు సంబంధించి దేశ రక్షణ శాఖలో రూ.360 కోట్ల అవినీతి జరిగిందని, ఈ కాం గ్రెస్ దొంగలను ఏమనాల్లో అర్థం కావటం లేదన్నారు.

దేశంలో ఆడపిల్లలు రక్షణ లేకుండా పోతోందన్నారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఉరి తీసేవారమని అన్నారు. కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మెరుగైన ఆరోగ్య బీమా పథకం ప్రవేశ పెట్టి ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే వ స్త్రాలపై వ్యాట్ టాక్స్ పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

సుమారు రెండు గంటల పాటు జరిగిన బహిరంగ సభలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరై చం ద్రబాబు ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. మాజీమంత్రి ఆలపాటి రాజేం ద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్, అన్నాబత్తుని శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.