December 27, 2012



తెలుగుదేశం పార్టీ అధినేత నారా చం ద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర గురువారం జిల్లాలో వైవిధ్యంగా సాగింది. పెద్దపల్లి అసెంబ్లీ ని యోజకవర్గ పరిధిలోని పొత్కపల్లి నుంచి మొదలైన పాదయాత్ర శానగొండ, బా యమ్మపల్లి, గూడెం, ఇందుర్తి, గుంపుల వరకు సుమారు ఆరుకిలోమీటర్ల మేరకు సాగింది. చంద్రబాబునాయుడు అడుగడుగునా ఆగుతూ దారిలో కలిసిన వారిని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగారు.

తన వద్దకు వ చ్చి సమస్యల గురించి వివరిస్తున్న ప్రజ లు, మహిళలను ఓదార్చుతూ టీడీపీ అధికారంలోకి రాగానే వారి కష్టాలు తీరుతాయని హామి ఇస్తూ పరిష్కారం తన బా ధ్యత అంటూ మెప్పించే ప్రయత్నం చే శారు. ఉదయం 11 గంటలకు మొదలైన పొలిట్‌బ్యూరో సమావేశం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. మూడు ప్రాంతాలకు చెందిన నేతలు తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా మా రింది. జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకు లు, కార్యకర్తలు కూడా పొత్కపల్లికి తరలివచ్చారు. సాయంత్రం పాదయాత్ర మొదలైన తర్వాత శానగొండలో 50 మంది గీత కార్మికులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. వారి వద్దకు వెళ్ళి మోకును ధ రించిన చంద్రబాబు గీతకార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.

అక్కడే పంచాయతీ సిబ్బందిని తమకు క నీస వేతనాలు కావాలని, పదవ తరగతి చదువుకున్న కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని చంద్రబాబునాయుడుకు విన్నవించుకో గా తాము అధికారంలోకి వస్తే తప్పకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్ర హణమొర్రితో ఉన్న గాజుల వర్షిణి అనే అమ్మాయి తనకు ఒకసారి ఆపరేషన్ అ యిందని, మరో ఐదుసార్లు చేయాల్సి ఉం దని తన ఆర్థిక స్థితిని విన్నవించగా ఆ మెకు ఆపరేషన్ చేయించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఫించను కావాల న్న కళావతికి, తాగునీరు ఇవ్వాలన్న ఓ దెమ్మ, లచ్చమ్మలకు పరిష్కారానికి హామి ఇచ్చారు. సైకిల్ కావాలన్న గుంట సాయిలు, గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలన్న జం గపల్లి రజిత, ఫించను మంజూరు చేయాలన్న రామిడి వెంకటరెడ్డికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

80 సంవత్సరాల వయసు ఉన్న బండారు మొండయ్య అనే వృద్ధుడు తాను నైజాం కాలం నుంచి సుంకరిగా పని చేశానని, ఇప్పుడు ఉద్యోగం లేదు .. ఫించను లేదని గోడు వె ళ్ళబోసుకోగా ఫించను ఇప్పిస్తానని హామి ఇచ్చారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్ళి మిర్చిలు చేస్తున్న య జమానురాలు పూసాల రజితతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.తాను కూడా మిర్చి బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా ... తెలంగాణ కారం ఎలా ఉందంటూ ర జిత ప్రశ్నించగా 30 ఏళ్ళుగా ఇక్కడే ఉం టూ ఇదే కారం తింటున్నానని జవాబిచ్చి అందరినీ నవ్వించారు. రజితకు రెండు వేల రూపాయలు అందజేశారు. బాయమ్మపల్లికి చెందిన వృద్ధురాలు బాకారపు కొమురమ్మ ఆర్థిక స్థితిగతులు తెలుసుకొ ని రెండు వేల రూపాయలు అందించారు. గుంపుల మార్గంలో అందరితో కలిసి రో డ్డుపైనే టీ తాగి కలివిడిగా వ్యవహరించా రు. పొలిట్‌బ్యూరో సమావేశం కారణం గా పాదయాత్ర సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల పాటు సాగింది.

తెలంగాణ అంశంపై ఢిల్లీలో శు క్రవారం అఖిలపక్ష సమావేశం జరగను న్న నేపథ్యంలో రెండు రోజుల పాటు క రీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశాలు నిర్వహించింది. తొలుత తె లంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు తర్వాత సీ మాంధ్ర నేతలతోనూ భేటీ అయ్యారు. ప లువురు సీనియర్ నేతలు జిల్లాకు తరలివ చ్చి తమ అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. గురువారం పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలకమైన తెలంగాణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రెండున్నర గంటల పాటు సాగిన ఈ స మావేశంలో అఖిలపక్ష సమావేశానికి టీ డీపీ పక్షాన యనమల రామకృష్ణుడు, క డియం శ్రీహరిని పంపించాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కరీంనగర్ జిల్లాలో పాదయాత్రను గురువారం ము గించాల్సి ఉండగా 28న అఖిలపక్ష సమావేశం పూర్తయిన తర్వాతనే పాదయాత్ర వరంగల్ జిల్లాలో అడుగుపెట్టేలా చూడాలని చంద్రబాబు నిర్ణయించడంతో కరీంనగర్ జిల్లాకు ఉన్న ప్రాధాన్యత మరోమారు చాటిచెప్పినట్లయింది.

అవినీతి ... అభివృద్ధి ..తెలంగాణ...: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త పెరిగిన అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలను కొనసాగించారు. అవినీతి పెరిగిపోవడం వల్లే ప్రజల కష్టాలు పెరిగాయని చెబుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఉద్యోగాలను కల్పించే ఏపీపీఎస్‌సీలోనూ అవినీతిపరులు, నేరచరిత్ర ఉన్న వారినిు సభ్యులుగా నియమించారంటూ మండిపడ్డారు. ఈ కారణంగా అర్హత ఉన్న నిరుద్యోగులు అలాగే ఉండిపోగా డబ్బు ఉన్నవారికే ఉద్యోగాలు దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు, కన్నీళ్ళు తుడుస్తానని చంద్రబా బు హామి ఇచ్చారు. తెలంగాణ ప్రాం తంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టారే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని మ రోమారు స్పష్టం చేసిన చంద్రబాబు ప్ర జల మద్దతును కూడగట్టుకునే విధంగా వారితో మమేకమయ్యారు. వారి సమస్య లు తెలుసుకుంటూ ... వాటి పరిష్కారానికి హామీలిస్తూ ముందుకు సాగారు.

పలకరింత.. పులకింత..




ఎస్ఆర్ఎస్‌పీ! తెలంగాణ వరప్రదాయిని! నా హయాంలో చివరి భూములకూ నీరందింది! ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా బోసిపోయిన కాల్వలే! గ్రామాల్లో రైతులు వాటి దగ్గరకు నన్ను తీసుకెళుతున్నారు. కాల్వ ఉంది. కానీ, నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ మొత్తంలో కాల్వల ద్వారా నీరు పారే ఏకైక ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్‌పీనే! అది ఇప్పుడు పూడిక సమస్యను ఎదుర్కొంటోంది. నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఇక, చివరి భూములకు నీళ్లు మాట మరిచిపోయి చాలా ఏళ్లే అయింది. తెలంగాణకే తలమానికమైన ఇంత భారీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాజాగా రబీ పంటకు నీళ్లు ఇస్తారో ఇవ్వరోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

ఎస్ఆర్ఎస్‌పీ పాలిట మరణ శాసనంగా బాబ్లీ ప్రాజెక్టు మారిందన్న వాస్తవం ఇక్కడి రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ పరిస్థితిని రెండేళ్ల కిందటే నేను గుర్తించాను. స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగాను. మా పార్టీ నాయకులు కొందరు లాఠీ దెబ్బలు కూడా రుచి చూశారు.

కానీ, తెలంగాణ కోసమే పుట్టామన్నవాళ్లు నాడు ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేశారు. మేం డ్రామాలాడుతున్నామని ఎగతాళి చేశారు. దీనిపై మన పాలకులకు కనీస శ్రద్ధ కూడా లేదు. కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రతో సర్దుబాటు చేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. అన్యాయంగా కడుతున్న బాబ్లీపై ఇప్పటికీ పోరాటం చేస్తున్నది టీడీపీయే! ఇంతమంచి ప్రాజెక్టు కనకే ఎస్ఆర్ఎస్‌పీకి నా హయాంలో రూ.1500 కోట్లు కేటాయించి కాల్వలకు సిమెంట్ లైనింగ్ వేయించా. ఆ తర్వాత మరమ్మతుల పేరిట వాటికి రూ.300 కోట్లు కేటాయించి అంతా అవినీతిమయం చేశారు. విజిలెన్స్ నివేదికలను బుట్టదాఖలు చేశారు

ఎస్ఆర్ఎస్‌పీకి మరణ శాసనం



 టీడీపీ అధినేత చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి యాత్రను ముగించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, గురువారం కరీంనగర్‌లో పొలిట్‌బ్యూరో భేటీ సందర్భంగా మరికొంత కాలం యాత్ర కొనసాగిస్తానని, మార్గం ఖరారు చేయాలని నేతలకు సూచించారు. కాగా, మార్చి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నాయి. దీంతో అప్పటివరకూ యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ రూపొందనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కొనసాగనున్న బాబు యాత్ర



వ్యవస్థలను భ్రష్టు పట్టించారుఇల్లులేని రిపుంజయ.. కోట్లకు పడగలెత్తారువైఎస్ పాలనపై చంద్రబాబు ధ్వజంఅవినీతిరహిత పాలన అందిస్తామని హామీ

అవినీతిపరులను, నేర చరితులను అందలమెక్కించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన కొనసాగిస్తున్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర గురువారం కరీంనగర్ జిల్లా శానగొండ, బాయమ్మపల్లి, గూడెం, ఇందుర్తి, గుంపుల గ్రామాల్లో కొనసాగింది. ఏపీపీఎస్సీలో అవినీతిపరులు ఉండటంతో ప్రతిభావంతులకు ఉద్యోగాలు రాలేదని, డబ్బున్న వారికే దక్కాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిపుంజయరెడ్డి అనే సభ్యుడు అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టాడని చంద్రబాబు ఆరోపించారు.

తన పీఏ సూరీడు రికమండేషన్‌తో రిపుంజయరెడ్డిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏపీపీఎస్సీ సభ్యునిగా నియమించగా 2008కి ముందు ఇల్లుకూడా లేని ఆయన.. ఇప్పుడు కోట్లు సంపాదించాడని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి అవినీతి రహిత పాలన అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచడానికి డబ్బు లేదు గానీ, కాంగ్రెస్ దొంగలు దోచుకోవడానికి లక్షల కోట్లు దొరికాయన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటుందని, 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో పాటు కరెంట్ చార్జీలను కూడా తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చూస్తుందని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని అందిస్తుందన్నారు.

బీసీలకు రూ. 10 వేల కోట్ల ప్రణాళికను అమలుచేసి వారి అభ్యున్నతికి పాటుపడతామని, వంద అసెంబ్లీ సీట్లను వారికి కేటాయిస్తామని చెప్పారు. పత్తి క్వింటాలుకు రూ. 5 వేల ధర వచ్చేలా చూస్తామని చెప్పారు. ఆడబిడ్డలను మగవారితో సమానంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టీడీపీయేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడేది లేదని స్పష్టం చేశారు.

సమస్యలు తెలుసుకుంటూ..
చంద్రబాబు తన పాదయాత్రలో అడుగడుగునా ఆగుతూ దారిలో కలిసిన వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. శానగొండలో 50 మంది గీత కార్మికులు చంద్రబాబుకు స్వాగతం పలకగా వారి వద్దకు వెళ్లి మోకు ధరించి గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడే పంచాయతీ సిబ్బందిని తమకు కనీస వేతనాలు కావాలని, పదో తరగతి చదువుకున్న కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరగా.. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గ్రహణంమొర్రితో ఉన్న గాజుల వర్షిణి అనే అమ్మాయి తనకు ఒకసారి శస్త్రచికిత్స అయ్యిందని, మరో ఐదుసార్లు చేయాల్సి ఉందని తన ఆర్థిక స్థితిని విన్నవించగా ఆమెకు ఆపరేషన్ చేయించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్లి మిర్చి బజ్జీలు వేస్తున్న పూసాల రజితతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

తాను కూడా బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా... తెలంగాణ కారం ఎలా ఉందంటూ రజిత ప్రశ్నించింది. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నానని ఆయన జవాబిచ్చి అందరినీ నవ్వించారు. పొలిట్‌బ్యూరో సమావేశం కారణంగా పాదయాత్ర సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు మాత్రమే సాగింది.

అవినీతి పరులకు వైఎస్ అందలం

ఈ నెల 28న(రేపు) జరగనున్న అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే చెప్పవచ్చు. ఇప్పటి వరకు అధికారికంగా ఏం చెప్పాలనే నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ రోజు కరీంనగర్  జిల్లాలో పోలిట్ బ్యూరో సమావేశమై దీనిపై మరింత చర్చించి నిర్ణయాన్ని వెలువర్చనుంది. అయితే టిడిపి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణకు ఓకె చెప్పాలని టిడిపి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇన్నాళ్లూ అందరూ భావిస్తున్నట్లుగా తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని మాత్రమే చెప్పకుండా తెలంగాణకు తాము ఓకే అని... అయితే దానిని ఎలా చెప్పాలనే అంశం పైనే టిడిపి తర్జన భర్జన పడుతోంది. దానిపై చంద్రబాబు, పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. 18 అక్టోబర్ 2008 నాడు తెలంగాణకు ఓకె చెబుతూ టిడిపి నాటి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖను ఇచ్చింది. అయితే అప్పుడు రాసిన లేఖనే యథాతధంగా తిరిగి రాసి ఇవ్వాలా లేక ఆ లేఖ తాము తిరిగి తీసుకోలేదని, దానికే కట్టుబడి ఉన్నామని చెప్పాలా అనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సీమాంధ్ర టిడిపి నేతలతో చంద్రబాబు నిన్న భేటీ అయ్యారు. వారు కూడా తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని అయితే ఆ ప్రాంతంలో ఎదురయ్యే వాటిని పరిగణలోకి తీసుకొని నిర్ణయించాలని బాబుకు సూచించారు. వారు తెలంగాణకు విముఖత చూపలేదు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల తీవ్రతలోని బేధాలను గుర్తించిన సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబుతో చెప్పారని తెలుస్తోంది. తెలంగాణపై టిడిపికి ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు లేఖ విషయంలోనే వారు తర్జన భర్జన పడుతున్నారు. అయితే కొత్తగా లేఖ కాకుండా పాత లేఖకే కట్టుబడి ఉన్నామని, దానిని తాము తిరిగి వెనక్కి తీసుకోలేదని అఖిలపక్షంలో నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపి ఈ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పెద్ద షాక్ తప్పదని అంటున్నారు. అలాగే కాంగ్రెసు పార్టీని కూడా ఇరకాటంలోకి మరింత నెట్టినట్లవుతుందని చెబుతున్నారు. టిడిపి నుండి సీమాంధ్ర ప్రాంతం నేతగా యనమల రామకృష్ణుడు, తెలంగాణ నేతగా రేవూరి ప్రకాశ్ రెడ్డి లేదా రమేష్ రాథోడ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక అఖిల పక్ష భేటీ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తర్జన భర్జన పడుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు విషయంలో జగన్ పార్టీ అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఓ వైపు కాంగ్రెసు, టిడిపిలు అఖిలపక్ష భేటీపై తీవ్రంగా భేటీలు, చర్చలు జరుపుతుంటే... వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆ వేడి అంతగా కనిపించడం లేదనే చెప్పవచ్చు.. తెలంగాణపై జగన్ పార్టీ అనుభవరాహిత్యం అఖిల పక్ష భేటీలో మరోసారి కనిపిస్తుందా అనే ప్రశ్న పలువురిని తొలుస్తోంది.

కెసిఆర్‌కు బాబు షాక్ .................

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఖరారైంది. జనవరి 8వ తేదీన తిరుమలాయపాలెం మండలంలో ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 7వ తేదీన వరంగల్ జిల్లా మర్రిపెడలో బహిరంగ సభ ముగిసిన అనంతరం జిల్లా సరిహద్దు గ్రామమైన మాదిరిపురం వరకు చేరుకొని అక్కడ బస చేస్తారు. 8వ తేదీన ఉదయం అక్కడ నుంచి పాదయాత్ర పాలేరు, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల గుండా సాగి కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావుతో పాటు ఎంపి, ఎమ్మెల్యేలంతా త్వరలోనే సమావేశం కానున్నారు. 8 నియోజకవర్గాల గుండా సుమారు 200 కిలోమీటర్ల మేర జిల్లాలో చంద్రబాబు పర్యటన జరగనున్నది. ఇదిలా ఉండగా సంక్రాంతి పర్వదినం సమయంలో ఆయన జిల్లాలో పర్యటిస్తూ జిల్లా ప్రజలతో కలిసి పండుగ సంబరాలు చేసుకోనున్నారు. అదే సమయంలో ఆయన కుమారుడు లోకేష్ కూడా జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జనవరి 8వ తేది న ఖమ్మం జిల్లాలో ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్ర...


 
బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మంత్రి శ్రీధర్‌బాబు జనాదరణ చూసి ఓర్వలేక అవాకులుచెవాకులు మాట్లాడుతున్నాడని టీ డీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. మం డలంలోని గంగారం గ్రామంలో ఆయ న విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబుకు జిల్లాలో మహిళలు,రైతులు, యు వకులు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ధ ర్నాలు, నిరసన కార్యక్రమాలు, పార్టీ కా ర్యక్రమాలు చేసుకునే అధికారం ఎవరికైనా ఉందన్నారు. టీడీపీ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే కొందరు కర్రు నాగ య్య ఇంటిపై దాడి చేస్తే పోలీసులు ఇం తవరకు కేసు పెట్టలేదన్నారు. దీనిపై త మ పార్టీ అధినేత చంద్రబాబు పోలీసులను ప్రశ్నించడం తప్పా అన్నారు. మం త్రి శ్రీధర్‌బాబు కేవలం మంథనికే పరిమితమయ్యారన్నారు. ఎస్సారెస్పీ ద్వా రా 6లక్షల ఆయకట్టు ఉంటే జిల్లాలో పంటలకు ఎన్ని మడులకు నీళ్లిస్తారో చె ప్పాలన్నారు.

బాబు పాదయాత్రలో కాంగ్రెస్ తప్పులు తోడుతుంటే ఈ త ప్పులను కప్పి పుచ్చుకోవడానికే లేనిపో ని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరెప ల్లి మోహన్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఒక దళితు డై ఉండి దళితులకు ప్రభుత్వం కరెంటు కట్ చేస్తే ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గం లో ఏ అధికారి రావాలన్నా డబ్బులు ఇ వ్వాల్సిందేనన్నారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ సీజన్‌లోనే 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపగాని సా రయ్యగౌడ్, వంగళ తిరుపతిరెడ్డి, లంక సదయ్య, గొడుగు రాజకొమురయ్య, గాజరవేన సదయ్య, సుముఖం మల్లారెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు..