December 27, 2012

ఎస్ఆర్ఎస్‌పీకి మరణ శాసనం




ఎస్ఆర్ఎస్‌పీ! తెలంగాణ వరప్రదాయిని! నా హయాంలో చివరి భూములకూ నీరందింది! ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా బోసిపోయిన కాల్వలే! గ్రామాల్లో రైతులు వాటి దగ్గరకు నన్ను తీసుకెళుతున్నారు. కాల్వ ఉంది. కానీ, నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ మొత్తంలో కాల్వల ద్వారా నీరు పారే ఏకైక ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్‌పీనే! అది ఇప్పుడు పూడిక సమస్యను ఎదుర్కొంటోంది. నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఇక, చివరి భూములకు నీళ్లు మాట మరిచిపోయి చాలా ఏళ్లే అయింది. తెలంగాణకే తలమానికమైన ఇంత భారీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాజాగా రబీ పంటకు నీళ్లు ఇస్తారో ఇవ్వరోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

ఎస్ఆర్ఎస్‌పీ పాలిట మరణ శాసనంగా బాబ్లీ ప్రాజెక్టు మారిందన్న వాస్తవం ఇక్కడి రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ పరిస్థితిని రెండేళ్ల కిందటే నేను గుర్తించాను. స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగాను. మా పార్టీ నాయకులు కొందరు లాఠీ దెబ్బలు కూడా రుచి చూశారు.

కానీ, తెలంగాణ కోసమే పుట్టామన్నవాళ్లు నాడు ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేశారు. మేం డ్రామాలాడుతున్నామని ఎగతాళి చేశారు. దీనిపై మన పాలకులకు కనీస శ్రద్ధ కూడా లేదు. కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రతో సర్దుబాటు చేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. అన్యాయంగా కడుతున్న బాబ్లీపై ఇప్పటికీ పోరాటం చేస్తున్నది టీడీపీయే! ఇంతమంచి ప్రాజెక్టు కనకే ఎస్ఆర్ఎస్‌పీకి నా హయాంలో రూ.1500 కోట్లు కేటాయించి కాల్వలకు సిమెంట్ లైనింగ్ వేయించా. ఆ తర్వాత మరమ్మతుల పేరిట వాటికి రూ.300 కోట్లు కేటాయించి అంతా అవినీతిమయం చేశారు. విజిలెన్స్ నివేదికలను బుట్టదాఖలు చేశారు