June 10, 2013

హైదరాబాద్ : బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని టీడీపీ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గిరిజనుల పొట్ట కొట్టేలా ఆనాడు సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఈ ధర్నాలో తెలంగాణ టీడీపీ నేతలతో పాటు సీమాంధ్ర నేతలు కూడా పాల్గొన్నారు.

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలి : బాబు

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని దీనిపై స్పందించలేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన టీడీఎప్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ అభివృద్ధిని చూసి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కాపీ కొట్టారని తెలిపారు. మన కార్యక్రమాలనే ఆయన చేపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఈరోజు సాయంత్రం రాష్ర్ట గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నట్లు చెప్పారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు.

అద్వానీ రాజీనామా పార్టీ అంతర్గత వ్యవహారం : బాబు


కళంకిత మంత్రులతో మాట్లాడం
అసెంబ్లీలో వారిని బహిష్కరిస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
వివాదాస్పదమైన 26 జీవో లను జారీచేసి ప్రభుత్వానికి రూ. 43 వేల కోట్ల నష్టాన్ని మోపిన కళంకిత మంత్రులను తొలగించేవరకు పోరాడు తామని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆ మంత్రులను శాసనసభలో తాము బిహ ష్కరిస్తామన్నారు. గీతారెడ్డి, పొన్నాల, కన్నా లక్ష్మీనారా యణ ముమ్మాటికీ కళంకితులేనని ఆయన వ్యాఖ్యానిం చారు. బయ్యారం గనులు, బ్రహ్మణీ ఇండస్ట్రీన్‌కు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా అప్పగించిన వైనంపై సీబీఐ కన్నెర్ర జేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం మరొకటి ఉండదని చంద్ర బాబునాయుడు ధ్వజమెత్తారు. అక్రమాస్తుల కేసులో ఇరు క్కున్న మంత్రి పొన్నాల, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

ఫెమా కేసులో ఇరుక్కున్న మంత్రి పార్థసారథినీ సీఎం కా పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కళం కితులైన వీరు మాట్లాడితే తాము వినమని, ప్రశ్నోత్తరాలకు సమాధానం ఇవ్వాలని చూస్తే వారి సమాధానాలను బిహ ష్కరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. వివాదాస్పద జీవోలపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోకపోగా మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాలను తొలగించేదాకా పోరాడుతామన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో పార్టీ నేతలు పూసపాటి అశోకగజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తదితరులతో కలిసి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం మాఫియాతో సీఎం సోదరుడిపై ఆరోపణలు వచ్చినా పట్టిం చుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.బీసీ సబ్‌ప్లాన్‌.. కళంకిత మంత్రుల వ్యవహారంపై శాసనసభలో ప్రభుత్వా న్ని నిలదీస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

ఉపాధి హామీ అవినీతికి ఆలవాలమైందని, అమ్మ హస్తం మొండిహస్తంగా మిగిలిందని చంద్రబాబునాయు డు పేర్కొన్నారు. బంగారుతల్లికి కావాల్సింది చట్టబద్దత కాదని, చిత్తశుద్ధి అని ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని గుర్తుచేశారు. బజారు లో సరుకులు అమ్మినట్లు ఏపీపీ ఎస్సీలో ఉద్యోగాలు అమ్మెస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపీ ఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌ను కూడా కలుస్తామని ఆయ న పేర్కొన్నారు. జలయజ్ఞం వల్ల ఫలితాలు రాలేదని కేవలం కేబినెట్‌ మీటింగుల్లోనే చర్చిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు చాలా ఇబ్బందుల్లో తుఫాన్‌ నీలం తుఫాను బాధి తులను ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో అన్న దాతలు దుక్కులు దున్ని విత్తనాల కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కవేస్తోందని ఆయన విమర్శించారు.

గీతారెడ్డి, కన్నా, పొన్నాల కళంకితులే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే థర్డ్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావడం తథ్యం


ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేసేంత వరకు టీడీపీ రాజీలేని పోరా టం చేస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కమిషన్‌ ప్రక్షాళన కోరకు వెంటనే సభ్యులందరీ చేత రాజీనామా చేయించాలని, లేనిపక్షంలో డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమర్ధులు, నీతివంతులైన అధికారుల చేత కమిషన్‌ తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్‌ నర్సింహన్‌కు చంద్రబాబు సూచించారు. ఎపీపీఎస్సీ సభ్యుల అవినీతి, అక్రమాలపై సోమవారం సాయంత్రం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభ్యులు, మండలి సభ్యుల బృందం గవర్నర్‌ నర్సింహన్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించింది. అనంతరం ఎన్టీఆర్‌భవన్‌ వద్ద చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్ఠు పట్టించారని మండిపడ్డారు. గతంలో వైఎస్‌, ఆతరువాత రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిలు ఎపీపీఎస్సీని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల పునరావాసకేంద్రంగా మార్చా రంటూ ధ్వజమెత్తారు. ఉద్యోగాలను బజారులో కూరగాయల మాదిరిగా రేటు కట్టి విక్ర యిస్తూ ఎపీపీఎస్సీ సభ్యులుగా వ్యవహరిస్తున్నవారంతా యువత జీవితంతో ఆడుకుంటున్నారని శివాలెత్తారు.

గతంలో రిపుంజయరెడ్డి అనే సభ్యుడు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉంటే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో సీతారామారాజు అనే మరో సభ్యుడు ఒక మహిళా దళారీ ఇంట్లో పేకాట ఆడుతూ లంచం తీసుకునేలా ఆమెను ప్రోత్సాహించి అడ్డంగా దొరికిపో యారన్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎపీపీఎస్సీ సభ్యులుగా నియామకానికి ఐదు మంది సభ్యులు చేసుకున్న దరఖాస్తు వివరాలను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. ఐదు మంది కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు కాగా, ఒకరు కేంద్ర మంత్రి ఆశీస్సులతో సభ్యునిగా నియమితులయ్యారన్నారు. ఆయన తక్కువేమి కాదని పరీక్ష ప్రారంభమైన గంట సేపటి తరువాత తొమ్మిది మంది అభ్యర్థులను అనుమతించిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. ఎపీపీఎస్సీ సభ్యుల ప్రక్షాళన కోరకు, కమిషన్‌ సభ్యుల అవినీతిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి : చంద్రబాబు

దేశ రాజకీయాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభావం ఉండబోదని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. సోమవారం టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మోడీకి బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు, అద్వానీ రాజీనామా అంశాలపై స్పందించారు. మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తికి గురైన అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేయడం గురించి ప్రశ్నించగా, అది బిజెపి అంతర్గత వ్యవహారమన్నారు. రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన విధానాలనే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ అమలు చేస్తున్నారన్నారు. మోడీ మీరు జత కడితే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తోందని ఒక విలేఖరి ప్రశ్నించగా, టిడిపి మత సామరస్యానికి కట్టుబడి ఉందని, లౌకిక విధానం నుంచి పక్కకు జరిగేది లేదని, ఈ పరిస్థితుల్లో బిజెపితో కలవలేమన్నారు. ప్రాంతీయ పార్టీల హవా సాగుతుందని కాంగ్రెస్, బిజెపిల ప్రభావం తగ్గిపోయిందన్నారు. కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీగా మారింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ బాగా క్షీణించింది. బిజెపి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందని, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో తృతీయ కూటమి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో తన ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలనే గుజరాత్‌లో మోడీ అనుసరించారని చెప్పుకున్నారు.
తెలంగాణ తీర్మానం సాధ్యం కాదని సిఎం చెప్పారు
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయడం సాధ్యం కాదని, అది కేంద్రం తీసుకోవలసిన నిర్ణయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బిఎసి సమావేశంలో చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, సభలో ఈ సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తీర్మానం సాధ్యం కాదని సిఎం చెబుతున్నందున దీనిపై మీ పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమం చేపడతారని ఒక విలేఖరి ప్రశ్నించగా, తరువాత మాట్లాడదాం అంటూ చంద్రబాబు దాట వేశారు. (చిత్రం) టిడిఎల్‌పిలో సోమవారం విలేఖర్లతో మాట్లాడుతున్న దేశం అధినేత చంద్రబాబు

మోడీ ప్రభావం ఉండదు

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే పోరాడుతామని టీడీపీ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అయితే ఈ ధర్నాలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

గన్‌పార్క్ వద్ద టీడీపీ ధర్నా


హైదరాబాద్‌ : బజారులో సరుకులు అమ్మినట్లుగా ఉద్యోగాలు అమ్మేస్తున్నారని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జలయజ్ఞం వల్ల ఫలితాలు రాలేదని మంత్రివర్గంలోనే చర్చిస్తున్నారని ఆయన విమర్శించారు. 26 వివాదాస్పద జీవోలపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఎర్రచందనం మాఫియాలో సీఎం సోదరుడిపై ఆరోపణలు వచ్చినా, పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. బీసీలకు ఉప ప్రణాళిక, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం అవినీతికి స్థావరంగా మారిపోయిందని, అమ్మహస్తం మొండి హస్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బంగారు తల్లికి కావాల్సింది చట్ట బద్ధత కాదని, చిత్తశుద్ధి అంటూ ప్రభుత్వ పథకాలపై ఆయన విరుచుకపడ్డారు.

ఉద్యోగాలను అమ్మేస్తున్నారు...


హైదరాబాద్: ఏపీపీఎస్సీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో ఉన్న ఐదుగురు సభ్యులు రాజీనామా చేయాలన్నారు. అర్హత లేని వ్యక్తులంతా ఇప్పుడు బోర్డు సభ్యులుగా ఉన్నారని, వీరి వల్ల నిరుద్యోగులు, యువతకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు సహా టీడీపీ నేతలు కలిశారు. తమ అభ్యర్థనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు చెప్పారు.

గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం

(కె.ఎన్‌.ఎన్‌)నేటి అధికార కిరణ్‌ సర్కార్‌ సిగ్గులేని ప్రభుత్వమని, ప్రజాధనాన్ని దోచుకొని తినడమే పనిగా ప్రభుత్వం నడుస్తోందని, మరోపక్క మంత్రులను భర్తరఫ్‌ చేస్తూ, ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌ ఆరోపించారు. ఆదివారం ఎస్‌.ఆర్‌.పురం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపి మాట్లాడుతూ నేటి అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజాధనాన్ని దోచుకుతింటూ అమలుకు సాధ్యంకాని ఉచిత హామీలను గుప్పిస్తున్నారని ఎంపి ఆరోపించారు. ప్రజలు నేడు తెలివివంతులుగా వున్నారని, కాంగ్రెస్‌ ఆర్భాటాలకు లొంగరన్నారు. రానున్న 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని, ప్రజలు కూడా టిడిపివైపే వున్నారని ఎంపి జోస్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.గాంధీ, జిల్లా నాయకులు దొరబాబు, బాలాజీనాయుడు, శ్రీధర్‌వర్మ, ఇందిర, మండల నాయకులు భాస్కర్‌నాయుడు, దేవసుందరం, గోవర్ధన్‌రెడ్డి, జయశంకర్‌నాయుడులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తద్యం : డాక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌

హైదరాబాద్‌ : తన ఉన్నతికి అభిమానులే కారణమని హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. అభిమానం అనేది హృదయం లోతుల్లోంచి రావాలని ఆయన చెప్పారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణ స్టూడియోలో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికతో నూతన చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. డబ్బుతో, ప్రలోభాతో అభిమానులను సంపాదించుకోలేరని ఆయన అన్నారు. తనకు జన్మనిచ్చింది తారకరామారావు దంపతులు అయితే, ఇంతటివాడిని చేసింది అభిమానులేనని ఆయన అన్నారు. కొందరు ఆశించడానికి పుడతారని, మరికొందరు శాసించడానికే పుడుతారని ఆయన తెలిపారు.

నా ఉన్నతికి అభిమానులే కారణం : బాలయ్య