June 10, 2013

గీతారెడ్డి, కన్నా, పొన్నాల కళంకితులే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే థర్డ్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావడం తథ్యం


కళంకిత మంత్రులతో మాట్లాడం
అసెంబ్లీలో వారిని బహిష్కరిస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
వివాదాస్పదమైన 26 జీవో లను జారీచేసి ప్రభుత్వానికి రూ. 43 వేల కోట్ల నష్టాన్ని మోపిన కళంకిత మంత్రులను తొలగించేవరకు పోరాడు తామని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆ మంత్రులను శాసనసభలో తాము బిహ ష్కరిస్తామన్నారు. గీతారెడ్డి, పొన్నాల, కన్నా లక్ష్మీనారా యణ ముమ్మాటికీ కళంకితులేనని ఆయన వ్యాఖ్యానిం చారు. బయ్యారం గనులు, బ్రహ్మణీ ఇండస్ట్రీన్‌కు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా అప్పగించిన వైనంపై సీబీఐ కన్నెర్ర జేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం మరొకటి ఉండదని చంద్ర బాబునాయుడు ధ్వజమెత్తారు. అక్రమాస్తుల కేసులో ఇరు క్కున్న మంత్రి పొన్నాల, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

ఫెమా కేసులో ఇరుక్కున్న మంత్రి పార్థసారథినీ సీఎం కా పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కళం కితులైన వీరు మాట్లాడితే తాము వినమని, ప్రశ్నోత్తరాలకు సమాధానం ఇవ్వాలని చూస్తే వారి సమాధానాలను బిహ ష్కరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. వివాదాస్పద జీవోలపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోకపోగా మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాలను తొలగించేదాకా పోరాడుతామన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో పార్టీ నేతలు పూసపాటి అశోకగజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తదితరులతో కలిసి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం మాఫియాతో సీఎం సోదరుడిపై ఆరోపణలు వచ్చినా పట్టిం చుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.బీసీ సబ్‌ప్లాన్‌.. కళంకిత మంత్రుల వ్యవహారంపై శాసనసభలో ప్రభుత్వా న్ని నిలదీస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

ఉపాధి హామీ అవినీతికి ఆలవాలమైందని, అమ్మ హస్తం మొండిహస్తంగా మిగిలిందని చంద్రబాబునాయు డు పేర్కొన్నారు. బంగారుతల్లికి కావాల్సింది చట్టబద్దత కాదని, చిత్తశుద్ధి అని ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని గుర్తుచేశారు. బజారు లో సరుకులు అమ్మినట్లు ఏపీపీ ఎస్సీలో ఉద్యోగాలు అమ్మెస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపీ ఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌ను కూడా కలుస్తామని ఆయ న పేర్కొన్నారు. జలయజ్ఞం వల్ల ఫలితాలు రాలేదని కేవలం కేబినెట్‌ మీటింగుల్లోనే చర్చిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు చాలా ఇబ్బందుల్లో తుఫాన్‌ నీలం తుఫాను బాధి తులను ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో అన్న దాతలు దుక్కులు దున్ని విత్తనాల కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కవేస్తోందని ఆయన విమర్శించారు.