June 10, 2013

ఉద్యోగాలను అమ్మేస్తున్నారు...


హైదరాబాద్‌ : బజారులో సరుకులు అమ్మినట్లుగా ఉద్యోగాలు అమ్మేస్తున్నారని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జలయజ్ఞం వల్ల ఫలితాలు రాలేదని మంత్రివర్గంలోనే చర్చిస్తున్నారని ఆయన విమర్శించారు. 26 వివాదాస్పద జీవోలపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఎర్రచందనం మాఫియాలో సీఎం సోదరుడిపై ఆరోపణలు వచ్చినా, పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. బీసీలకు ఉప ప్రణాళిక, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం అవినీతికి స్థావరంగా మారిపోయిందని, అమ్మహస్తం మొండి హస్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బంగారు తల్లికి కావాల్సింది చట్ట బద్ధత కాదని, చిత్తశుద్ధి అంటూ ప్రభుత్వ పథకాలపై ఆయన విరుచుకపడ్డారు.